sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకోనవింశోzధ్యాయః - కాళికా శంఖచూడుల యుద్ధము నారాయణ ఉవాచ - నారాయణుడిట్లు నారదునితో పలికెను - శివం ప్రణమ్య శిరసా దానవేంద్రః ప్రతాపవాన్ - సమారురోహ యానం చ స్వామాత్యైః సహ సత్వరః ||
1 బభూవుస్తే చ సంక్షుబ్ధాః స్కంద శక్త్యాzర్దితాస్తదా | నేదుర్దుందుభయః స్వర్గే పుష్పవృష్టిర్బభూవ హ || 2 స్కందస్యోపరి తత్రైవ సమరే చ భయంకరే | స్కందస్య సమరం దృష్ట్వా మహాదద్భుతముల్బణం || 3 దానవానాం క్షయకరం యథాప్రాకృతికం లయం | రాజా విమానమారుహ్య శరవర్షం చకార హ || 4 నృపస్య శరవృష్టిశ్చ ఘనవృష్టిర్యథా తథా | మహాన్ ఘోరాంధకారశ్చ వహ్న్యుత్థానం బభూవ హ || 5 దేవాః ప్రదుద్రువుశ్చాన్యే సర్వే నందీశ్వరాదయః | ఏకాకీ కార్తికేయస్తుతస్థౌ సమరమూర్ధని || 6 పర్వతానాం చ సర్వాణాం శిలానాం శాఖినాం తథా | శశ్వచ్చకార వృష్టించ దుర్వాహ్యాం చ భయంకరీం || 7 నృపస్య శరవృష్ట్యా చ ప్రచ్ఛన్నః శివనందనః | నీరదేన చ సాంద్రేణ సంఛన్నో భాస్కరోయథా || 8 ధనుః స్కందస్య చిచ్ఛేద దుర్వహం చ భయంకరం | బభంజ చ రథం దివ్యం చిచ్ఛేద రథఘోటకాన్ || 9 మయూరం జర్జరీభూతం దివ్యాస్త్రేణ చకార సః | శక్తిం చిక్షేప సూర్యాభాం తస్య వక్షోవిభేదినీం || 10 క్షణం మూర్చాం చ సంప్రాప్య చేతనాముపలభ్య సః | గృహీత్వాన్యత్ ధనుర్దివ్యం యద్దత్తం విష్ణునా పురా || 11 రత్నేంద్ర సారఖచితం యానమారుహ్య చాగ్నిభూః | శస్త్రమస్త్రం గృహీత్వా చ చకార రణముల్బణం || 12 సర్వాంశ్చ పర్వతాంశ్చైవ వృక్షాంశ్చ ప్రస్తరాంస్తథా | సర్వాంశ్చిచ్ఛేద కోపేన దివ్యాస్త్రేణ శివాత్మజః || 13 ఆగ్నేయం వారునాస్త్రేణ వారయామాసవై గుహః | రథం ధనుశ్చ చిచ్ఛేద శంఖచూడస్య వక్షసి || 14 సవాహం సరథిం చైవ కిరీటం ముకుటోజ్వలం | చిక్షేప శక్తిముల్కాభాం మానవేంద్రస్య వక్షసి || 15 మూర్ఛాం సంప్రాప్య రాజోపలభ్య వై చేతనాం పునః | ఆరుహ్య వై యానమన్యం ధనుర్జగ్రాహ సత్వరః || 16 శంఖచూడుడు శివునకు నమస్కరించి తన అమాత్యులతో విమానమునెక్కెను. కాని వారందరు కుమారుస్వామి వేసిన శక్తివలన చాలా బాధపడిరి. దేవతలప్పుడు సంతోషముతో పుష్పవృష్టిని గురిపించుచు దుందుభి ధ్వానమును చేసిరి. అప్పుడు స్కందుడు చేసిన యుద్ధము చాలా అద్భుతముగా నుండెను. దానవులకు అది ప్రాకృతికలయము వలె తోచినది. అప్పుడు శంఖచూడుడు విమానమునెక్కి శరవర్షమును కురిపించెను. ఆ సమయమున మిక్కిలి చీకటి అలముకొనెను. నిప్పులు కూడ కురిసినవి. ఆ తని బాణయుద్ధమునకు భయపడి నందీశ్వరుడు మొదలగు దేవతలందరు పరుగెత్తుకొని పోయిరి. కేవలము కుమారస్వామి మాత్రము ఒంటరిగా యుద్ధమున నిలబడెను. శంఖచూచుడు పర్వతములు, సర్పములు, శిలలు, వృక్షములు వర్షముగా కురిపించెను. ఆ వర్షమున షణ్ముఖుడు కనిపించలేదు. అతని ధనుస్సు విరిగినది. రథము విరిగినది. రథాశ్వములు చనిపోయినవి. శంఖచూడుడు వేసిన సూర్య సన్నిభ##మైన శక్తివలన స్కందుడు కొంతకాలము మూర్ఛపోయెను. షణ్ముఖుడు క్షణకాలములో తేరుకొని విష్ణుమూర్తి ఇచ్చిన దివ్యధనుస్సును ధరించి రత్న విమానమునెక్కి శస్త్రాస్త్రముల ధరించి యుద్ధము చేయసాగెను. శంఖచూడుని రథమును సారథిని అశ్వములను భంగమొనర్చెను. అట్లే దివ్యమైన శక్తిని రాక్షసేంద్రుని వక్షస్థలముపై వేయగా అతడు మూర్ఛచెందెను. కొద్దిక్షణములలో మరల శంఖచూడుడు చైతన్యమును పొంది ఇంకొక రథమును వేరొక ధనుస్సును స్వీకరించెను. చకార శరజాలం చ మాయయా మాయినాం వరః | గుహం చచ్ఛాద్య సమరే శరజాలేన నారద || 17 జగ్రాహ శక్తిమవ్యర్థాం శతసూర్యసమప్రభాం | ప్రళయాగ్ని శిఖారూపాం విష్ణోర్వై తేజసాzవృతాం || 18 చిక్షేప తాం చ కోపేన మహావేగేన కార్తికే | పపాత శక్తిస్తద్గాత్రే వహ్నిరాశిరివోజ్వలా || 19 మూర్ఛాం సంప్రాప శక్త్యా చ కార్తికేయో మహాబలః | కాళీ గృహీత్వా తం క్రోడే నినాయ శివసన్నిధౌ || 20 మాయలు చేయువారిలో మేటియగు శంఖచూడుడు యుద్ధమున తన బాణవర్షముచే కుమారస్వామిని కప్పివేసెను. ఆ తరువాత మిక్కిలి శక్తి గలిగిన శక్తిని చాలా వేగముగా కుమారస్వామిపై వేసెను. కార్తికేయుడు మహబలసంపన్నుడైనను ఆ శక్తి తగులుటచే మూర్ఛనొందెను. మూర్ఛపడి యున్న కార్తికేయుని కాళికాదేవి తీసికొని మహాదేవుని సన్నిధికి చేరెను. శివస్తం దర్శనాదేవ జీవయామాస లీలయా | దదౌ బలమనంతం చ స చోత్తస్థౌ ప్రతాపవాన్ || 21 శివః స్వసైన్యం దేవాంశ్చ ప్రేరయామాస సత్వరః | దానవేంద్రైః ససైన్యైశ్చ యుద్ధారంభో బభూవహ || 22 స్వయం మహేంద్రో యుయుధే సార్థం చ వృషపర్వణా | భాస్కరో యుయుధే విప్రచిత్తినా సహ సత్వరః || 23 దంభేన సహ చంద్రశ్చ చకార సమరం పరం | కాలేశ్వరేణ కాలశ్చ గోకర్ణేన హుతాశనః || 24 కుబేరః కాలకేయేన విశ్వకర్మా మయేన చ | భయంకరేణ మృత్యుశ్చ సంహారేణ యమస్తథా || 25 కలవింకేన వరుణశ్చంచలేన సమీరణః | బుధశ్చ ధృతపుష్టేన రక్తాక్షేణ శ##నైశ్చరః || 26 జయంతో రత్నసారేణ వసవో వర్చసాం గణౖః | అశ్వినౌ వై దీప్తిమతా ధూమ్రేణ నలకూబరః || 27 ధనుర్ధరేణ ధర్మశ్చ మండూకాక్షేణ మంగళః | శోభాకరేణౖవేశానః పిఠరేణ చ మన్మథః || 28 ఉల్కాముఖేన ధూమ్రేణ ఖడ్గేనాzపి ధ్వజేన చ | కాంచీముఖేన పిండేన ధూమ్రేణ సహ నందినా || 29 విశ్వేన చ పలాశేన చాదిత్యా యుయుధుః పరం | ఏకాదశ మహారుద్రాశ్చైకాదశ భయంకరైః || 30 మహామారీ చ యుయుధే చోగ్రదండాదిభిస్సహ | నందీశ్వరాదయః సర్వే దానవానాం గణౖః సహ || 31 యుయుధుశ్చ మహద్యుద్ధే ప్రళ##యే చ భయంకరే | వటమూలే చ శంభుశ్చ తస్థౌ కాళ్యా సుతేన చ || 32 సర్వే చ యుయుధుః సైన్యసమూహాః సతతం మునే | రత్నసింహాసనే రమ్యే కోటిభిర్దానవైస్సహ || 33 ఉవాస శంఖచూడశ్చ రత్నభూషణ భూషితః | శంకరస్య చ యోధాశ్చ సర్వే యుద్ధే పరాజితాః || 34 దేవాశ్చ దుద్రువుః సర్వేభీతాశ్చ క్షతవిక్షతాః | చకార కోపం స్కందశ్చ దేవేభ్యశ్చాభయం దదౌ || 35 మూర్ఛపడియున్న కుమారస్వామిని శివుడు తన చూపుతోడనే బ్రతికించెను. పరమ శివుడాతనికి అనంతమైన బలమునిచ్చెను. తరువాత తన సైన్యమును యుద్ధము చేయుటకు పంపెను. అంత దేవతలకు శంఖచూడుని సైన్యములతో గొప్ప యుద్ధము జరిగినది. దేవేంద్రుడు వృషపర్వునితోను, భాస్కరుడు విప్రచిత్తితోను, చంద్రుడు దంభునితోను, కాలుడు కాళేశ్వరునితోను, అగ్ని గోకర్ణుని తోడను, కుబేరుడు కాలకేయుని తోడను, విశ్వకర్మ మయునితోను, మృత్యువు భయంకరునితోడను, యముడు సంహారునితోను, వరుణుడు కలవింకునితో, వాయువు చంచలునితో, బుధుడు ధృతపుష్టునితో, శని రక్తాక్షునితో, జయంతుడు రత్నసారునితో, అష్టవసువులు వర్చోగణముతో, అశ్వినీకుమారులు దీప్తిమంతునితో, నలకూబరుడు ధూమ్రునితో, ధర్ముడు ధనుర్ధరునితో, కుజుడు మండూకాక్షునితో, ఈశ్వరుడు శోభాకరునితో, మన్మథుడు పిఠరునితో, ద్వాదశాదిత్యులు ఉల్కాముఖాది రాక్షసులతో, ఏకాదశ రుద్రులు భయంకరులైన పదకొండుగురు రాక్షసులతో, నందీశ్వరాదులు ఇతర రాక్షస గణముతో యుద్ధముచేసిరి. యుద్ధానంతరము వటవృక్షము క్రింద శంకరుడు మహాకాళితో, షణ్ముఖునితో కలిసి కూర్చుండెను. శంకరుని సైనికులందరు యుద్ధమున ఓడిపోయినందువలన శంఖ చూడుడు తన దానవసమూహముతో రత్నసింహాసనమున కూర్చొనియుండెను. శంఖచూడునితో జరిగిన యుద్ధమున దేవతలందరు ఓడిపోయి భయముతో పరుగెత్తిరి. దానిని చూచి కుమారస్వామి రాక్షసులపై కోపించి దేవతలకు అభయమునిచ్చెను. బలం చ స్వగణానాం వై వర్ధయామాస తేజసా | స్వయమేకశ్చ యయుధే దానవానం గణౖస్సహ || 36 అక్షౌహిణీనాం శతకం సమరే స జఘాన హ | ఖర్పరం పాతయామాస కాళీ కమలలోచనా || 37 పపౌ రక్తం దానవానాం కృద్ధా సా శతఖర్పరం | దశలక్షం గజేంద్రాణాం శతలక్షం చ వాజినాం || 38 సమాదాయైకహస్తేన ముఖేచిక్షేప లీలయా | కబంధానాం సహస్రం చ ననర్త సమరే మునే || 39 స్కందస్య శరజాలేన దానవాః క్షతవిక్షతాః | భీతాశ్చ దుద్రువుస్సర్వే మహాబలపరాక్రమాః || 40 వృషపర్వా విప్రచిత్తిర్దంభశ్చాసి వికంకణః | స్కందేన సార్థం యుయుధుస్తే చ సర్వే క్రమేణ చ || 41 కాళీ జగామ సమరమరక్షత్కార్తికం శివః | వీరాస్తామనుజగ్ముశ్చ తే చ నందీశ్వరాదయః || 42 సర్వేదేవాశ్చ గంధర్వా దక్షరాక్షస కిన్నరాః | రాజ్యభాండాశ్చ బహుశః శతకోటిర్బలాహకాః || 43 సా చ గత్వా చ సంగ్రామం సింహనాదం చకారహ | దేవ్యావై సింహనాదేన ప్రాపుర్మూర్ఛాంచదానవాః |7 44 అట్టాట్టహాసమశివం చకార చ పునః పునః | హృష్టా పపౌచ మాధ్వీకం ననర్త రణమూర్ధని || 45 ఉగ్రదంష్ట్రా చోగ్రచండా కౌట్టరీ చ పపౌ మధు | యోగినీనాం డాకినీనాం గణాః సురగణాదయః || 46 దృష్ట్వా కాళీం శంఖచూడః శీగ్రమాజిం సమాయ¸° | దానవాశ్చ భయం ప్రాపూరాజా తేభ్యోzభయం దదౌ || 47 కాళీ చిక్షేప చాగ్నేయం ప్రళయాగ్ని శిఖోపమం | రాజా నిర్వాపయామాస వారుణన స లీలయా || 48 చిక్షేప వరుణం సాచ తత్తీవ్రం మహదద్భుతం | గాంధర్వేణ చ చిచ్ఛేద దానవేంద్రశ్చ లీలయా || 49 మామేశ్వరం ప్రచిక్షేప కాళీ వహ్ని శిఖోపమం | రాజా జఘాన తచ్ఛీఘ్రం వైష్ణవేన చ లీలయా || 50 నారాయణాస్త్రం సా దేవీ చిక్షిపే మంత్రపూర్వకం | రాజా ననామ తం దృష్ట్వా చావరుహ్య రథాదహో || 51 ఊర్ధ్వం జగామ తచ్ఛస్త్రం ప్రళయాగ్ని శిఖోపమం | పపాత శంఖచూడశ్చ భక్త్యా వై దండవద్భువి || 52 బ్రహ్మాస్త్రేణ మహారాజః నిర్వాణం చ చకారహ | చిక్షేపాతీవ దివ్యాస్త్రం సా దేవీ మంత్రపూర్వకం || 53 రాజా దివ్యాస్త్ర జాలేన నిర్వాణం చ చకారహ | దేవీ చిక్షేప శక్తించ యత్నతో యోజనాయతం || 54 రాజా తీక్షాస్త్రజాలేన శతఖండం చకారహ | కార్తివేయుడు తన సైన్యమునకు ఉత్సాహమును పెంచసాగెను. అట్లే తానొక్కడే దానవులతో యుద్ధము చేయసాగెను. అతనివలన రాక్షససైన్యమున నూరు అక్షౌహిణీల సైన్యము మృతిచెందెను. అప్పుడు కాళికాదేవి కోపముతో నూరుపుఱ్ఱలతో రాక్షసుల రక్తము తాగెను. అట్లే పదిలక్షల ఏనుగులను నూరులక్షల గుఱ్రములను ఒకే చేత బట్టుకొని మ్రింగెను. వేలకొలది మొండెములు యుద్ధమున నేల రాలినవి. స్కందుని యొక్క బాణములవలన దానవులు క్షతగాత్రులై భయపడి పరుగెత్తిరి. వృషపర్వాది దానవులు కార్తికేయునితో క్రమముగా యుద్ధమొనరించిరి. రణరంగమున నున్న స్కందుని శివుడు రక్షించుచుండెను. కాళికాదేవి రణరంగమునకు బయలు దేరగా నందీశ్వరాది వీరులు ఆమె వెంట నడిచిరి. రణరంగమును ప్రవేశింపగనే కాళిక సింహనాదమొనర్చినది. ఆ సింహనాదమునకు రాక్షసులందరు మూర్ఛిల్లిరి. సంతోషముతోనామె సురను సేవించి అట్టహాసమొనర్చినది. అట్లే రణరంగమున సంతోషమును పట్టలేక నాట్యమాడినది. రణరంగమున వీరవిహారము చేయుచున్న కాళికను చూచి శంఖచూడుడు రణరంగమునకు వచ్చి భయపడి పరుగిడు తన సైన్యమునకు ధైర్యము చెప్పెను. కాళికాదేవి ఆగ్నేయాస్త్రము వేయగా శంఖచూడుడు వారుణాస్త్రముతో దానిని చల్లార్చెను. కాళికాదేవి వారుణాస్త్రమును సంధింపగా అతడు గాంధర్వాస్త్రముతో దానినుపశమింపజేసెను. కాళికాదేవి మాహేశ్వరాస్త్రమును ప్రయోగింపగా నారాయణాస్త్రముతో నతడు దానిని ఖండించెను. కాళికాదేవి నారాయణాస్త్రమును వేయగా శంఖచూడుడు వెంటనే రథమునుండి కిందికి దిగి సాష్టాంగ నమస్కారము చేయగా ఆ అస్త్రము ఆకాశములోనికి వెళ్ళిపోయినది. కాళికాదేవి ప్రయోగించుచున్న దివ్యాస్త్రములను శంఖచూడుడు దివ్యాస్త్రముల చేతనే ఉపసంహరించెను. చివరక కాళిక శక్తిని ప్రయోగింపగా తన దివ్యస్త్రములచే దానిని ముక్కలు ముక్కలు చేసెను. జగ్రాహ మంత్రపూర్వం చ దేవీ పాశుపతం రుషా || 55 నిక్షేప్తుంసా నిషిద్ధా చ వాగ్బభూవాశరీరిణీ | మృత్యుః పాశుపతే నాస్తి నృపస్య చ మహాత్మనః || 56 యావదస్త్యేవ కంఠేస్య కవచం హి హరేరితి | యావత్సతీత్వమస్తీహ సత్యాశ్చ నృపయోషితః || 57 తావదస్య జరామృత్యుర్నాస్తీతి బ్రహ్మణో వరః | ఇత్యాకర్ణ్య మహాకాళీ న తచ్చిక్షేప సాసతీ || 58 శతలక్షం దానవానాం అగ్రహీల్లీలయా కృధా | అత్తుం జగామ వేగేన శంఖచూడం భయంకరీ || 59 దివ్యాస్త్రేణ సుతీక్షేణన వారయామాస దానవః | ఖడ్గం చిక్షేప సా దేవీ గ్రీష్మసూర్యోపమం పరం || 60 దివ్యాసై#్త్రర్దానవేంద్రోzయం శతఖండం చకార సః | పునరత్తుం మహాదేవీ వేగేన చ జగామ తం || 61 సర్వసిద్ధేశ్వరః శ్రీమాన్ వవృధే దానవేశ్వరః | నా వారయామాస చ తాం సర్వసిద్ధేశ్వరో వరః || 62 వేగేన ముష్టినా కాళీ కోపయుక్తా భయంకరీ | బభంజాzథ రథం తస్య చాహనత్సారథిం సతీ || 63 వామహస్తేన జగ్రాహ శంఖచూడశ్చ లీలయా || ముష్ట్యా జఘూన తం దేవీ మహాకోపేన వేగతః || 64 బభ్రామ వ్యథయా దైత్యః క్షణం మూర్ఛామవాప హ | క్షణన చేతనాం ప్రాప్య సముత్తస్థౌ ప్రతాపవాన్ || 65 న చక్రే బాహుయుద్దం స దేవ్యాసహ ననామ తాం | దేవ్యాశ్చాస్త్రంద చిచ్ఛేద చాగ్రహీత్స్యేన తేజసా || 66 నాzస్త్రం చిక్షేప తాం భక్త్యా మాతృబుధ్యా చ వైష్ణవః || గృహీత్వా దానవం దేవీ భ్రామయిత్వా పునః పునః | ఊర్ధ్వంచ ప్రేరయామాస మహావేగేన కోపతః || 68 ఊర్ద్వాత్పపాత వేగేన శంఖచూడః ప్రతాపవాన్ | నిపత్య చ సముత్తస్థౌ స సత్వా భద్రకాళికాం || 69 శంఖచూడునితో జరుగుతున్న యుద్దమున తన శస్త్రాస్త్రములు విఫలమగుటవలన కాళికాదేవి కోపముతో పాశుపతాస్త్రమును సంధింపనెంచెను. కాని అశరీరవాణి శంఖచూడుని మరణము పాశుపతాస్త్రమున లేదనియు, అతని కంఠములోని శ్రీహరి కవచము, అతని భార్యయొక్క సతీత్వముండునంతవరకు అతనికి జర, మృత్యువులు లేవని చెప్పుటచే ఆమె పాశుపతాస్త్రమును సంధింపలేదు. ఆమె కోటి దానవులను ఒక్కసారిగా చంపి శంఖచూడుని తినుటకై వెళ్ళెను. కాని శంఖచూడుడు వాడియగు దివ్యాస్త్రముచే ఆమె ప్రయత్నమును వ్యర్థము గావించెను. ఆమె ప్రయోగొంచిన ఖడ్గమును సైతము తన దివ్యస్త్రముచే తుత్తునియలు గావించెను. అదేవిధముగ రెండవసారి అతనిని తినవలెనని కాళిక చేసిన ప్రయత్నము సర్వసిద్దేశ్వరుని వలన విఫలమయ్యెను. అందువలన కోపముతో ఆమె తన పిడికిటితో అతని రథమును, అతని సారథిని పడగొట్టి అతనిపై ప్రళయాగ్నిజ్వాల వంటి శూలమును వేసెను. కాళికాదేవి కోపముతో తన పిడికిటితో అతనిని గుద్దగా క్షణకాలమతడు మూర్ఛిల్లెను. తరువాత వెంటనే తేరుకొని లేచి నిలబడెను. ఆమె బాహు యుద్దము చేయుట కిష్టపడగా అతడు దానికి ఒప్పుకొనక నమస్కరించెను. ఆమె వేసిన శస్త్రాస్త్రములన్నిటిని ఆ దానవుడు వ్యర్థము చేయసాగెను. అట్లే ఆమెపైగల మాతృబుద్దితో కాళికాదేవిపై అస్త్రములు వేయలేదు. ఐనను కాళికాదేవి కోపముతో అతనిని పట్టుకొని ఎత్తి గిరగిర చుట్టు తిప్పి పడవేసెను. అయినను అతడు వెంటనే లేచి నిలబడి భద్రకాళికి సమస్కరించెను. రత్నేంద్రసారఖచితం విమానాగ్ర్యం మనోహరం | ఆరురోహ రథం హృష్టో న విశ్రాంతో మహారణ || 70 క్షతజం దానవానాం చ మాంసం చవిపులం క్షుదా | పీత్వా భుక్త్యా భద్రకాళీ య¸° సా శంకరాంతికం || 71 ఉవాచ రణవృత్తాంతం పౌర్వాపర్యం యథాక్రమం | శ్రుత్వా జహాస శంభుశ్చ దానవానం వినాశనం || 72 లక్షం చ దానవేంద్రాణామవశిష్టం రణ zధునా | ఉద్వృత్తం భూభృతా సార్థం తదన్యం భుక్తమీశ్వర || 73 సంగ్రామే దానవేంద్రం చ హంతుం పాశుపతేన వై | అవధ్యస్తవ రాజేతి వాగ్బభూవావరీరిణీ || 74 రాజేంద్రశ్చ మహాజ్ఞానీ మహాబలపరాక్రమః | స చ చిక్షేప మయ్యస్త్రం చిచ్ఛేద మమసాయకం || 75 శంఖచూడుడు వెంటనే రత్ననిర్మితమైన విమానము నధిరోహించెను. ఇంతసేపు యుద్దము చేసినను అతడు అలసిపోలేదు. పైగా సంతోషముతో అతడుండెను. భద్రకాళి రాక్షసుల మాంసమును తిని రక్తమును త్రాగి చివరకు శంకరునివద్దకేగి యుద్దవృత్తాంతమునంతయు పూసగుచ్చినట్లు వివరించినది. ఇప్పుడు దానవేంద్రుని దగ్గర లక్షసైనికులు మాత్రమున్నారు. మిగిలినవారందరిని నేను తింటిని. ఇంకను రణరంగమున అతని చంపుటకై పాశుపతాస్త్రమును సంధింపబోగా ఆ శరీరవాణి అతడు నీతో చావడని నాకు చెప్పెను. ఎట్లైనను రాజేంద్రుడు మంచి బలపరాక్రమములు కలవాడు పైగా జ్ఞానవంతుడు. ఇంత యుద్దము జరిగినను అతడు నా శస్త్రాస్త్రములను ఖండించెనే కాని తనకు తానుగా నాపై ఒక అస్త్రమును వేయలేదని భద్రకాళి శంకరునితో ననగా శంకరుడు నవ్వి ఊరుకుండెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారయణ సంవాదే తులస్యుపాఖ్యానే కాళీ శంఖచూడయుద్దోనామ ఏకోనవింశోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండములో నారద నారయణ సంవాద సమయమున తెల్పబడిన తులస్యుపాఖ్యానములో కాళీ శంఖచూడుల యుద్దమను పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.