sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1 Chapters
వింశతితమోzధ్యాయః - శంఖచూడ వధ
నారాయణ ఉవాచ - నారాయణు డిట్లు నారదునితో ననెను. -
శివస్తత్వం సమాకర్ణ్య తత్వజ్ఞాన విశారదః | య¸° స్వయం చ సమరం స్వగణౖస్సహనారద || 1
శంఖచూడః శివం దృష్ట్వా విమానాదవరుహ్య చ | సనామ పరయా భక్త్యా దండవత్పతితో భువి || 2
తం ప్రణమ్య చ వేగేన విమానం హ్యారురోహ సః | తూర్ణం చకార సన్నాహం ధనుర్జగ్రాహ దుర్వహం || 3
శివ దానవయోర్యుద్దం పూర్ణమబ్దం బభూవ హ | నవై బభూవతుః బ్రహ్మన్ తయోర్జయపరాజ¸° || 4
న్యస్తశస్త్రశ్చ భగవాన్ న్యస్తశస్త్రశ్చ దానవః | రథస్థః శంఖచూడశ్చ వృషస్థో వృషభధ్వజః || 5
దానవానాం చ శతకం ఉద్వృత్తం చ బభూవ హ | రణ యే మృతాః శంభోః జీవయామాస తాన్ విభుః || 6
తతో విష్ణుర్మహామాయో వృద్దబ్రహ్మణ రూపధృక్ | ఆగత్య చరణస్థానమవోచద్దానవేశ్వరం || 7
శివుడు యుద్దవృత్తాంతమును తెలిసికొని స్వయముగా తన గణములతో రణరంగమునకేగెను. శివుడు రణ రంగమునకు రాగానే శంఖచూడుడు విమానమునుండి కిందికి దిగి శివునకు మిక్కిలి భక్తితో దండప్రణామము చేసెను. ఆ తరువాత వెంటనే విమానము నెక్కి యుద్ద సన్నాహము చేయమొదలిడెను.
శివదానవుల యుద్దము ఒక సంవత్సరము గడిచినను వారిలో ఎవరు కూడ గెలవలేదు. అందువలన పరమశివుడు తన శస్త్రములను వదలి కూర్చుండెను. అట్లే శంఖచూడుడు తన ఆయుధములను పక్కకు పెట్టి రథముపై కూర్చుండెను. శంకరుడు తనతోటి జరిగిన యుద్దములో చనిపోయిన వారినందరిని తిరిగి బ్రతికించెను.
ఈ సమయమున మహామాయావియగు శ్రీ మహావిష్ణువు వృద్దబ్రహ్మణ వేషముతో ఆ రణరంగమునకు వచ్చెను.
వృద్ద బ్రహ్మణ ఉవాచ - వృద్ద బ్రాహ్మణుడిట్లు పలికెను.
దేహి భిక్షాం చ రాజేంద్ర మహ్యం విప్రాయ సాంప్రతం | త్వం సర్వసంపదాం దాతా యన్మే మనసి వాంఛితం || 8
నిరాహారాయ వృద్దాయ తృషితాయాతురాయచ | పశ్చాత్త్యాం కథయిష్యామి పురః సత్యం చ కుర్వితి || 9
ఓమిత్యువాచ రాజేంద్రః ప్రసన్నవద నేక్షణః | కవచార్థీ జనశ్చాహమిత్యువాచ సమాయయా || 10
తచ్ఛృత్యా దానవశ్రేష్ఠో దదౌకవచముత్తమం | గృహీత్వా కవచం దివ్యం జగామ హరిరేవచ || 11
శంఖచూడస్య రూపేణ జగామ తులసీం ప్రతి | గత్వా తస్యాం మాయయా చ వీర్యధానం చకారహ || 12
అథ శంభుర్హరేః శూలం దానవార్థం సమగ్రహీత్ | గ్రీష్మ మధ్యాహ్న మార్తండ శతక ప్రభముజ్వలం || 13
నారాయణాధిష్ఠితాగ్రం బ్రహ్మాధిష్ఠిత మధ్యమం | శివాధిష్ఠిత మూలం చ కాలాధిష్ఠత ధారకం || 14
కిరణావళి సంయుక్తం ప్రళయాగ్ని శిఖోపమం | దుర్నివార్యంచ దుర్దర్షం అవ్యర్థం వైరి ఘాతకం || 15
తేజసా చక్రతుల్యంచ సర్వశస్త్ర విఘూతకం | శివకేశవయోరన్యద్దుర్వహం చ భయంకరం || 16
ధనుస్సహాస్రం దైర్ఘ్యేణ విస్తృత్యా శతహస్తకం | సజీవం బ్రహ్మరూపం చ నిత్యరూపమనిర్మితం || 17
సంహర్తుం సర్వవిధ్యండం ఏకదా దైవలీలయా | చిక్షేప ఘూర్ణనం కృత్వా శంఖచూడే చ నారద || 18
రాజాచాపం పరిత్యజ్య శ్రీకృష్ణచరణాంబుజం | ధ్యానం చకార భక్త్యా చ కృత్వా యోగాసనం ధియా || 19
శూలం చ భ్రమణం కృత్వా న్యపతద్దానవోపరి | చకార భస్మసాత్తంచ సరథంచైవ లీలయా || 20
రాజా ధృత్వా దివ్యరూపం బాలకం గోపవేషకం | ద్విభుజం మురళీహస్తం రత్నభూషణ భూషితం || 21
నానా రత్నసుభూషాఢ్య గోప కోటిభిరావృతం | గోలోకాదాగతం యానం ఆరుహ్య తత్పురం య¸° || 22
రాజేంద్ర! విప్రుడనైన నాకు భిక్షపెట్టుము. నీవు సమస్త సంపదలను దానము చేయువాడవు. నిరాహారుడైన వానికి. వృద్దునకు, దప్పిగొన్న వానికి, ఆతురునకు దానము తప్పక చేయదగినది. నామనస్సులోనున్న కోరికను నీవు ఒప్పుకొనిన తరువాత వివరించి చెప్పెదను అని వృద్ద బ్రహ్మణుడు అడుగగా శంఖచూడుడు ప్రసన్నభావముతో సరేనని ఒప్పుకొనెను. అప్పుడు వృద్దబ్రహ్మణుడు నేను నీమెడలో నున్న కవచమును కోరి వచ్చితిననగా ఆ రాక్షసుడు తనమెడలో నున్న కవచమును బ్రాహ్మణునకు తీసియిచ్చెను. వృద్ద బ్రాహ్మణ రూపధారి యగు శ్రీహరి శంఖచూడుని కవచమును తీసికొని తులసి దగ్గరకు శంఖచూడుని వేషములో వెళ్ళి ఆమెను చెరచెను. తులసీదేవి పాతివ్రత్యము భంగము కాగానే శంకరుడు శ్రీహరి యిచ్చిన శూలమును శంఖచూడునిపై ప్రయోగించెను. దాని అగ్రభాగమున విష్ణువు. మధ్యభాగమున బ్రహ్మదేవుడు మూలభాగమున పరమ శివుడు శూలమును పట్టుకొను స్థలమున కాలుడు అధిష్ఠించియుండిరి. ఆది నూరుగురు సూర్యులు మధ్యాహ్న ప్రభవలె వెలుగుచుండెను. సమస్త బ్రహ్మాండభాండమునంతయు సంహరింపగల శక్తి గలది. అటువంటి శూలమును శంఖచూడునిపై పరమశివుడు ప్రయోగించెను. ఆ సమయమున శంఖచూడుడు తన విల్లును వదిలిపెట్టి యోగాసనమున కూర్చుండి శ్రీకృష్ణ చరణాంబుజములను స్మరించుకొనుచుండెను. శివుడు ప్రయోగించిన శూలము తగులగనే శంఖచూడుని శరీరము భస్మమైపోయినది. అతని సారథి భస్మమైనాడు. అప్పుడు శంఖచూడుడు దివ్యరూపమును ధరించి గోపాలకుని వేషముతో రత్న భూషణ భూషితుడై మురళి చేతబట్టి అనేకాలంకార శోభితులైన గోపాలకులు వెంటరాగా గోలోకమునకు పోయెను.
గత్వా ననామ శిరసా రాధా మాధవయోర్మునే | భక్త్యా తచ్చరణాంభోజం రాసే బృందావనే మునే || 23
సుదామానం చ తౌ దృష్ట్వా ప్రసన్నవదనే క్షణౌ | తదా చ చక్రతుః క్రోడే స్నేహేన పరిసంప్లుతౌ | 24
అథశూలశ్చ వేగేన ప్రయ¸° శూలినః కరం | శంకరస్తేన శూలేన దానవస్యాస్థి జాలకం || 25
ప్రేవ్ణూ చ ప్రేరయామాస లవణోదే చ సాగరే | అస్థిభిః శంఖచూడస్య శంఖజాతి ర్బభూవ హ || 26
నానా ప్రకార రూపాచ శ్రేష్ఠా పూతా సురార్చనే | ప్రశస్తం శంఖతోయంచ దేవానాం ప్రీతిదం పరం || 27
తీర్థతోయ స్వరూపం చ పవిత్రం శంకరం వినా | శంఖశబ్దో భ##వేద్యత్ర తత్రలక్ష్మీశ్చ సుస్థిరా || 28
సస్నాతః సర్వతీర్థేషు యః స్నాతః శంఖవారిణా | శంఖం హరేరధిష్ఠానం యత్ర శంఖస్తతో హరిః || 29
తత్రైన సతతం లక్ష్మీః దూరీభూతమమంగళం | స్త్రీణాంచ శంఖద్వనిభిః శూద్రాణాం చ విశేషతః ||
భీతా రూష్టాయాతి లక్ష్మీః స్థలమన్యం స్థలాత్తతః || 30
శివశ్చ దానవం హత్వా శివలోకం జగామ సః | ప్రహృష్టో వృషనూరుహ్య స్వగణౖశ్చ సమావృతః || 31
సురాః స్వవిషయం ప్రాపుః పరమానందసంయుతాః | నేదుర్దుందుభయః స్వర్గే జగుః గంధర్వకిన్నరాః || 32
బభూవ పుష్పనృష్ఠిశ్చ శివస్యోపరి సంతతం | ప్రశశంసుః సురాస్తంచ మునీంద్ర ప్రవరాదయః || 33
శంఖచూడుడు దివ్యశరీరమును ధరించి గోలోకమునకు పోయి అచ్చటనున్న రాధామాధవుల పాదపద్మములకు నమస్కరించెను. వారు తిరిగి తమ లోకమునకు వచ్చిన సుదాముని అత్యంత వాత్యల్యముతో చూచిరి.
భూలోకమున శంఖచూడుని సంహరించిన శ్రీహరి శూలము తిరిగి పరమేశ్వరుని చేరినది. శంకరు డా శూలముతో దానవుని అస్థికలను లవణ సముద్రమున కలిపెను. శంఖచూడుని అస్థికలనుండి అనేకవిధములైన శంఖజాతులు పుట్టినవి. ఆ శంఖములు దేవతార్చనలో ప్రశస్తమైనవి. శంఖతోయము దేవలకు చాలా ఇష్టమైనది. శంఖ శబ్దము వినబడుచోట లక్ష్మీదేవి యుండును. శంఖతీర్థమున స్నానము చేసినచో సమస్త తీర్థములందు స్నానము చేసిన ఫలము కల్గును.
శివుడు శంఖచూడుని చంపి కైలాసము చేరెను. దేవతలకు తమ రాజ్యము తిరిగి లభించుటచే చాలా సంతోపడిరి. వారు శివునిపై పుష్పవర్షమును కురిపించిరి. వారు శివుని అనేకరీతుల కొనియాడిరి.
ఇతి శ్రీబ్రహ్మనైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే తులస్యుపాఖ్యానే శంఖ చూడవధే శంఖప్రస్తానోనామ వింశోzధ్యాయః ||
శ్రీ బ్రహ్మనైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదములోని తులస్యుసాఖ్యానమునందలి శంఖచూడవధలో శంఖ ప్రస్తావమను
ఇరువదవ అధ్యాయము సమాప్తము.