sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్వావింశతితమోzధ్యాయః - తులసీ మాహాత్మ్యము నారద ఉవాచ - నారదుడు నారాయణునితో ఇట్లనెను- తులసీ చ జగత్పూజ్యా పూతా నారాయణ ప్రియా | తస్యాః పూజావిధానం చ స్తోత్రం కిం న శ్రుతం మయా || 1 కేన పూజ్యా స్తుతా కేన పూరా ప్రథమతో మునే | తవ పూజ్యా సా బభూవ కేన వా వద మామహో || 2 తులసీదేవి నారాయణనకు ప్రియురాలు, పవిత్రమైనది .అందరిచే పూజింపదగినది. ఐతే ఆమె యొక్క పూజావిధానము, స్తోత్రము నాకు తెలియవు. అట్లే ఆమెను తొలుత ఎవరు పూజించిరి. ఎవరామెను తొలుత స్తుతించిరి. ఓ శ్రీహరీ ! ఆమె నీకెందులకు పూజనీయురాలైనది. ఈవిషయములన్నిటిని నాకు వివరించి చెప్పుము. సూత ఉవాచ- సూతుడీవిధముగా శౌనకునితో అనెను- నారదస్య వచః శ్రుత్వా ప్రహస్య గరుడధ్వజః | కదిం కథితుమారేభే పుణ్యరూపాం పురాతనీం || 3 నారదుని మాటలు విని శ్రీహరి సనాతనము, పుణ్యరూపమైన తులసి విషయమునిట్లు చెప్పదొడగెను. హరిః సంప్రాప్య తులసీం రేమే చ రమయా సహ | రమాసమాం తాం సౌభాగ్యాం చకార గౌరవేణ చ|| 4 సేహే లక్ష్మీశ్చ గంగా చ తస్యాశ్చ నవసంగమం | సౌభాగ్యం గౌరవం కోపాన్న సేహే చ సరస్వతీ || 5 సా తాం జఘాన కలహే మానినీ హరి సన్నిధౌ | వ్రీడయా స్వాపమానాచ్ఛ సాంతర్ధానం చకార హ || 6 సర్వసిద్దేశ్వరీ దేవీ జ్ఞానినీ సిద్దయోగినీ | బభూవాదర్శనం కోపాత్సర్వత్ర చ హరేరహో || 7 హరిర్న దృష్ట్యా తులసీం బోధయిత్వా సరస్వతీం | తదనుజ్ఞాం గృహీత్వా చ జగాను తులసీ వనం || 8 శ్రీహరి తులసీదేవిని పొంది లక్ష్మీదేవితో సమానముగా ఆమెతో రమింపసాగెను. ఆమెకు లక్ష్మీదేవితో సమానమైన గౌరవమును మర్యాదను ఇచ్చెను. శ్రీహరి భార్యలగు లక్ష్మీ, గంగలు తులసీ శ్రీహరుల నూతన సమాగమమును సహించుకొనిరి. కాని సరస్వతీ దేవి మాత్రము కోపముతో దానిని సహింపలేదు.పైగా శ్రీహరి సన్నిధిలోనే సరస్వతీదేవి తులసితో వాదులాడి తులసిని కొట్టెను.అందువలన తులసీదేవి సిగ్గుపడి తనకు జరిగిన అవమానమును సహించలేక అందర్థానమైనది. అందువలన శ్రీహరి సరస్వతిని ఓదార్చి ఆమె అనుజ్ఞను తీసికొని తులసీవనమునకు వెళ్ళెను. తత్ర గత్వా చ స్నాత్వా చ తులస్యా తులసీం సతీం | పూజయామాస ధ్యాత్వా తాం స్తోత్రం భక్త్యా చకారహ || 9 శ్రీహరి తులసీవనమునకు వెళ్ళి అచ్చట స్నానము చేసి తులసిని ధ్యానించి పూజించెను. అట్లే అతడు తులసీ స్తోత్రమునిట్లు చేసెను. లక్ష్మీమాయా కామవాణీ బీజపూర్వం దశాక్షరం | బృందావనీతి జేంతం చ వహ్ని జాయాం తమేవచ || 10 శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా | అనేన కల్పతరుణా మంత్ర రాజేన నారద | పూజయేచ్చ విధానేన సర్వసిద్ధిం లభేన్నరః || 11 ఘృతదీపేన ధూపేన సిందూర చందనేన చ | నైవేద్యేన చ పుష్పేణ చోపహారేణ నారద || 12 హరిస్తోత్రేణ తుష్టాసా చా విర్భూయ మహీరుహాత్ | ప్రసన్నా చరణాంభోజే జగామ శరణం శుభం || 13 వరం తసై#్య దదౌ విష్ణుః జగత్పూజ్యా భ##వేతి చ | అహం త్వాం చధరిష్యామి స్వమూర్థ్ని వక్షసీతి చ || 14 సర్వే త్వాం ధారయిష్యంతి స్వయం మూర్థ్ని సురాదయః| ఇత్యుక్త్యా తాం గృహీత్వా చ ప్రయ¸° స్వాలయం విభుః || 15 లక్ష్మీ, మాయ, కాముడు, సరస్వతి వీరి బీజాక్షరములు పూర్వమున నుండగా చతుర్థీ విభక్త్యంతమైన బృందావనీ శబ్దమునకు అగ్ని భార్యయగు స్వాహా శబ్దాంశ##మైనది తులసీ దేవి మంత్రము. అది పది యక్షరములు గలది. శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహా యనునది . కల్ప వృక్షమువంటి ఈ మంత్రముచే శాస్త్రోక్త విధానమున సరస్వతీ దేవిని పూజించినచో సమస్త సిద్దులు లభించును. తులసీ దేవిని నేతి దీపముతో, ధూపముతో, సిందూర చందనానులేపనములతో పూజించి నైవేద్యమును పెట్టి పుష్పములచే అర్చన చేసి ఉపహారమును నైవేద్యముగా పెట్టెవలెను. ఇట్లు శ్రీహరి చేసిన తులసీ స్త్రోత్రమున కా తులసీదేవి తులసీ వృక్షము నుండి మరల ఆవిర్భవించినది. వెంటనే ఆ తులసీ దేవి విష్ణుమూర్తి పాదములపై బడి శరణువేడుకొన్నది. అందువలన నారాయణుడు తులసీ దేవితో నిన్నందరు పూజింతురని వరమిచ్చెను. అట్లే తులసీదళమును తన శిరస్సుపైన ధరింతునని, తన వక్షస్థలముపై ధరింతునని అట్లే దేవతలందరు ఆ దేవిని తమ శిరస్సులపై ధరింతురని చెప్పి తనలోకమునకు వెళ్ళిపోయెను. నారద ఉవాచ- నారదుడిట్లడిగెను- కిం ధ్యానం స్తవనం కిం వా కిం వా పూజావిధిక్రమం | తులస్యాశ్చ మహభాగ వ్యాఖ్యాతు మర్హసి || 16 సరస్వతీ దేవి ధ్యానమెట్లుండును? ఆమె స్తోత్రము పూజా పద్దతి ఎట్లుండునో వివరించమని నారాయణుని అడిగెను. నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో అనెను- అంతర్హితాయాం తస్యాం చ గత్వా చ తులసీవనం | హరిః సంపూజ్య తుష్టావ తులసీం విరహాతురః || 17 సరస్వతీ దేవి చేష్టలవలన తులసీదేవి కోపించి అంతర్దానము చెందినప్పుడు శ్రీహరి తులసీవనమునకు వెళ్ళి ఆమెను పూజించి స్తోత్రము చేసెను. శ్రీభగవానువాచ- శ్రీమన్నారాయణుడిట్లు ప్రార్ధించెను- బృందారూపాశ్చ వృక్షాశ్చ యదైకత్ర భవంతి హి | విదుర్భధాస్తేన బృందాం మత్ప్రియాం తాం భజమ్యహం || 18 పురా బభూవ యా దేవీ హ్యాదౌ బృందావనే వనే | తేన బృందావనీ ఖ్యాతా తాం సౌభాగ్యాం భజామ్యహం || 19 అసంఖ్యేషు చ విశ్వేషు పూజితా యా నిరంతరం | తేన విశ్వపూజితాఖ్యాం జగత్పూజ్యాం భజామ్యహం || 20 అసంఖ్యాని చ విశ్వాని పవిత్రాణి యయా సదా | తాం విశ్వపావనీం దేవీం విరహేణ స్మరామ్యహం || 21 దేవా నతుష్టాః పుష్పాణాం సమూహేన యయా వినా | తాం పుష్పసారాం శుద్దాం చ ద్రుష్టుమిచ్ఛామి శోకతః || 22 విశ్వే యత్ప్రాప్తి మాత్రేణ భక్త్యzనందో భ##వేత్ ధ్రువం | నందినీ తేన విఖ్యాతా సా ప్రీతా భవితా హి మే || 23 యస్యా దేవ్యాస్తులా నాస్తి విశ్వేషు నిఖిలేషు చ | తులసీ తేన విఖ్యాతా తాం యామి శరణం ప్రియే || 24 కృష్ణజీవన రూపా యా శశ్వత్ప్రియతమా సతీ | తేన కృష్ణజీవనీతి మమ రక్షతు జీవనం || 25 బృందా (తులసి) వృక్షములు ఎచ్చటనుండునో ఆ ప్రదేశమును బృందావనమందురు. వృక్షరూపమున నున్న నా ప్రేయసిని తులసిని సేవింతును. బృందావనమున మొదలున్నందువలన ఆమెను బృందావని యని పిలుతురు. సకల సౌభాగ్యవతి యగు తులసిని సేవింతును. సమస్త లోకములలో పూజలనందుకొనుటవలన తులసి విశ్వపూజిత అనుపేర ప్రసిద్ది చెందినది. సమస్త ప్రపంచములను పవిత్రము చేసినందువలన ఆమె విశ్వపావనియైనది. అట్టి తులసిని సేవింతును. దేవతలకు ఎన్ని విధములైన పుష్పములు సమర్పించినను తులసి లేనిచో వారు సంతోషపడరు. ఆ విధముగ పుష్పములలో సారభూతమైనది, పరిశుద్దమైనది యగు తులసిని చూడవలెనని యున్నది. ప్రపంచమున భగవత్సేవ చేయు సమయములో తులసి లభించినంత మాత్రమున ప్రజలు సంతోషింతురు. కావున ఆమె నందిని యైనది. అట్టి తులసిని చూచినచో నాకు చాల సంతోషము కలుగును. ఈ ప్రపంచములందన్నిటిలోను తులసితో తుల తూగేవారెవరు లేనందువలన ఆమెను తులసి యందురు. అట్టి తులసిని నేను శరణువేడెదను. ఆమె కృష్ణుడనగు నాకు జీవనము (ప్రాణము) వంటిది. అందువలన కృష్ణజీవనయైనది. నాకు ఎల్లప్పుడు ప్రేయసియగు తులసి నా ప్రాణములను రక్షించుగాక. ఇత్యేవం స్తవనం కృత్వా తత్రతస్థా రమాపతిః | దదర్శ తులసీం సాక్షాత్ పాదపద్మే నతాం సతీం || 26 రుదతీమభిమానేన మానినీం మానపూజితాం | ప్రియాం దృష్ట్యా ప్రియః శీఘ్రం వాసయామాస వక్షసి || 27 భారత్యాజ్ఞానం గృహీత్వా చ స్వాలయం చ య¸° హరిః | భారత్యా సహ తత్ప్రీతిం కారయామాస సత్వరం || 28 శ్రీమన్నారాయణుడు ఈ విధముగా స్తోత్రము చేయగా తులసీ దేవి దర్శనమొసగి అతని పాదపద్మములపై పడెను. అభిమానవతి కావుననే ఏడ్చుచున్న ఆ ప్రియురాలైన తులసిని చూచి శ్రీహరి ఆమెను తన రొమ్మున చేర్చుకొనెను. సరస్వతీ దేవి ఆజ్ఞను తీసికొని శ్రీహరి తులసీదేవితో కలిసి వైకుంఠమును చేరెను. తరువాత అతడు సరస్వతితో కలిసి తులసికి సంతోషమును కలిగించుచుండెను. వరం విష్ణుర్దదౌ తస్త్యె విశ్వపూజ్యా భ##వేతి చ | శిరోధార్యాచ సర్వేషాం వంద్యా మమేతి చ || 29 విష్ణోర్వరేణ సా దేవీ పరితుష్టా బభూవ హ | సరస్వతీ తామాశ్లిష్య వాసయామాస సన్నిధౌ || 30 లక్ష్మీర్గంగా సస్మితాం తాం సమాశ్లిష్య చ నారద | గృహం ప్రవేశయమాస వినయేన సతీం తదా || 31 శ్రీమహావిష్ణువు తులసికి నీవు ప్రపంచమందు అందరిచే పూజింపబడుదువని, శిరోధార్యగా కాగలవని, నాకు కూడ పూజనీయురాలవగుదువని వరమొసగెను. తులసి విష్ణుమూర్తి ఇచ్చిన వరమునకు సంతోషపడెను. సరస్వతీదేవి తులసిని కౌగిలించుకొని శ్రీహరి సన్నిధిలో ఉంచెను. అట్లే లక్ష్మీ, గంగలు ఆమెను అక్కున చేర్చుకొని ఇంటికి తీసికొని వెళ్ళిరి. బృందాం బృందావనీం విశ్వపావనీం విశ్వపూజితాం | పుష్పసారాం నందినీం చ తులసీం కృష్ణజీవనీం || 32 ఏతన్నామాష్టకం చైతత్ స్తోత్ర నామార్ధసంయుతం | యః పఠేత్తాం చ సంపూజ్య సోzశ్వ మేధఫలం లభేత్ || 33 బృంద, బృందావని, విశ్వపావని, విశ్వపూజిత, పుష్పసార, నందిని, తులసి, కృష్ణజీవని అనే తులసి యొక్క ఎనిమిదిపేర్లను అర్ధసహితముగా చదువును ఆమెను పూజించినవారికి అశ్వమేధయాగముచేసిన ఫలితము లభించును. కార్తికీ పౌర్ణిమాయాంచ తులస్యా జన్మ మంగళం | తత్ర తస్యశ్చ పూజా చ విహితా హరిణా పురా || 34 తస్యాం యః పూజయేత్తాం చ భక్త్యా చ విశ్వపావనీం | సర్వపాపాద్వినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి || 35 కార్తికే తులసీపత్రం విష్ణవే యో దదాతి చ | గవామయుత దానస్య ఫలమాప్నోతి నిశ్చితం || 36 అపుత్రో లభ##తే పుత్రం ప్రియాహీనో లభేత్ప్రియాం | బంధుహీనో లభేద్బంధుం స్త్రోత్రస్మరణ మాత్రతః || 37 రోగాత్ప్రాముచ్యతే రోగాత్ బద్దోముచ్యేత బంధనాత్ | భయాన్ముచ్యేత భీతస్తు పాపాన్మచ్యేత పాతకీ || 38 కార్తీక పౌర్ణమినాడు తులసి జన్మించినది. అందువలన ఆ నాడు శ్రీహరి తులసీపూజను తొలుత చేసినాడు. అట్లే ఆదినమున తులసీదేవి పూజను భక్తితో చేసిన మానవుడు సమస్త పాపములనుండి వినిర్ముక్తుడై విష్ణులోకమునకు చేరుకొనును. కార్తీకమాసమున విష్ణువును తులసితో పూజచేసిన వాడు పదివేల ఆవులను దానము చేసిన ఫలమును పొందును. తులసీదేవి యొక్క అష్టనామ స్తోత్రమును స్మరించినంతనే పుత్రులు లేనివానికి పుత్రులు కలుగుదురు. భార్యలేనివానికి భార్య, బంధువులు లేనివానికి బంధువులు లభింతురు. అట్లే రోగి రోగమునుండి ముక్తుడగును. కారాగారబద్దుడు కారాగారబంధనమునుండి దూరమగును. భయపడినవాని భయములు, పాపాత్ముని పాపములు అన్నియు తొలగి పోవును. ఇత్యేవం కథితం స్తోత్రం ధ్యానం పూజావిధిం శ్రుణు | త్వమేవ వేద జానాసి కాణ్వశాఖోక్తమేవ చ || 39 యద్వక్ష్యే పూజయేత్తాం చ భక్త్యా చావాహనం వినా | ఉపచారైః షోడశభిః ధ్యానం పాతకనాశనం || 40 తులసీం పుష్పసారాం చ సతీం పూజ్యాం మనోహరాం | కృత్న్ప పాపేధ్మ దాహాయ జ్వలదగ్ని శిఖోపమాం || 41 పుష్పేషు తులనాzప్యస్యా నాసీద్దేవీషు వా మునే | పవిత్రరూపా సర్వాసు తులసీ సా చ కీర్తితా || 42 శిరోధార్యాం చ సర్వేషాం ఈప్సితాం విశ్వపావనీం | జీవన్ముక్తాం ముక్తిదాం చ భజతాం హరిభక్తిదాం || 43 ఇతిధ్యాత్వా చ సంపూజ్య స్తుత్వా చ ప్రణమేద్బుధః | ఉక్తం తులస్యుపాఖ్యానం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 44 తులసీదేవి స్తోత్రము పై విధముగా నున్నది. ధ్యానము పూజావిధిని నీకు తెల్పెదను. కాణ్వాశాఖయందు పేర్కొనబడిన తులసీదేవి పూజావిధి నీకు కూడా తెలియును. ఐనను నీకు దానిని పేర్కొందును. తులసీదేవిని ఆవాహనము చేయకుండనే భక్తితో షోడశోపచారములతో ఆమెను పూజించవలెను. ఆమె తులసి, పుష్పసార, సతి, పూజ్యురాలు, మానవులు చేసిన పాపములన్నిటిని నశింపచేయునది. పుష్పములలో, దేవతలలో తులసికి (తులన) సమానము ఎవ్వరు లేనందువలన ఆమె తులసియైనది. ఆమె అందరికి శిరోధార్య అందరికోరికలు తీర్చునది, విశ్వపావని, జీవన్ముక్త, ఆమెను సేవించువారికి హరిభక్తిని ముక్తిని ఇచ్చు స్వభావము కలది. కావున తులసిని ధ్యానించి తరువాత షోడశోపచారములతో పూజించి స్తోత్రము చేసి ఆమెకు నమస్కారము చేయవలెను. నారదా ! నీకింతవరకు తులస్యుపాఖ్యానమును తెలిపితిని. ఐనను విననలసినదేమైన ఉన్నచో అడుగుము. నీకు నేను చెప్పెదను అని నారాయణుడనెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే తులస్యుపాఖ్యానం నామ ద్వావింశతితమోzధ్యాయః || శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములోని రెండవదగ ప్రకృతి ఖండమున, నారద నారాయణ సంవాదములోని తులస్యుపాఖ్యానమను ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.