sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుర్వింశతితమోZధ్యాయః - కర్మప్రాధాన్య నిరూపణ నారయణ ఉవాచ- నారాయణుడు నారదునితో నిట్లనెను- స్తుత్వా సోZశ్వపతిస్తేన సంపూజ్య విధిపూర్వకం | దదర్శ తత్ర తాం దేవీం సహస్రార్కసమ ప్రభాం ||
1 ఉవాచ సాతం రాజానం ప్రసన్నా సస్మితా సతీ | యథా మాతా స్వపుత్రం చ ద్యోతయంతీ దిశస్త్విషా ||
2 అశ్వపతి మహారాజు సావిత్రీదేవిని స్తుతించి శాస్త్రోక్త విధానమును ఆమెను పూజించి వేయి సూర్యుల కాంతిగల దేవిని దర్శించుకొనెను. వేదమాతయగు ఆ సావిత్రీదేవి ప్రసన్నవదనము కలదై తల్లి తన పుత్రుని ప్రేమతో చూచికొనునట్లు ప్రేమతో చిరునవ్వు కల ముఖముతో చూచి ఇట్లు అనినది- జానామి తే మహారాజ యత్తే మనసి వర్తతే | వాంఛితం తవ పత్న్యాశ్చ సర్వం దాస్యామి నిశ్చితం ||
3 సాధ్వీ కన్యాభిలాషం చ కరోతి తవ కామినీ | త్వం ప్రార్థయసి పుత్రంచ భవిష్యతి చతే క్రమాత్ ||4 ఇత్యుక్త్వా సా మహాదేవి బ్రహ్మలోకం జగామహ | రాజా జగామా స్వగృహం తత్కన్యాZదౌ బభూవ హ || 5 ఓ మహారాజా నీకోరిక నీభార్యకోరిక నాకు తెలియును. మహాసాధ్వియగు మీ భార్య కన్య కావలెనని కోరుచున్నది. నీవు మాత్రము పుత్ర సంతానము కావలెనని కోరుకొనుచున్నావు. అందువలన నీకు తొలుత కుమారై పుట్టును. అటుపిమ్మట పుత్ర సంతానము కలుగునని సావిత్రీ దేవి వరమునిచ్చి బ్రహ్మలోకమునకు పోయెను. అశ్వపతి కూడ సంతోషముతో ఇల్లు చేరుకొనెను. కొంతకాలమునకు ఆ మహరాజునకు కూతురు పుట్టెను. రాజ్ఞో ధనాచ్చ సావిత్య్రాః బభూవ కమలా కళా | సావిత్రీతి చ తన్నామ చకారాశ్వపతిః నృపః || 6 కాలేన సా వర్ధమానా బభూవ చ దినే దినే | రూప¸°వన సంపన్నా శుక్లే చంద్రకళా యథా || 7 సా వరం వరయామాన ద్యుమత్సేనాత్మజం తదా | సావిత్రీ సత్యవంతం చ నానాగుణ సమన్వితం || 8 రాజా తసై#్మ దదౌ తాం చ రత్న భూషణ భూషితాం | సచ సార్థం కౌతుకేన తాం గృహీత్వా గృహం య¸° ||9 సచ సంవత్సరేZతీతే సత్యవాన్ సత్యవిక్రమః | జగామ ఫలకాష్ఠార్థం ప్రహర్షం పితురాజ్ఞయా || 10 జగామ తత్ర సావిత్రీ తత్పశ్చాద్ధైవయోగతః | నిపత్య వృక్షాద్ధైవేన ప్రాణాన్ తత్యాజ సత్యవాన్ || 11 సావిత్రీ అనుగ్రహమువలన లక్ష్మీదేవి అంశగల కన్యక ఆ మహారాజునకు కలిగెను. ఆ మహారాజు ఆ కన్యకు తన ఇష్టదైవమగు సావిత్రీదేవి పేరునే పెట్టుకొనెను. ఆ సావిత్రి శుక్లపక్షమునందలి చంద్రకళవలె దిన దిన ప్రవర్ధమానమగుచు పెరిగెను. రూప ¸°వన సంపదగల ఆ సావిత్రి ద్యుమత్సేన మహారాజు పుత్రుడైన సత్యవంతుడు తనకు భర్తగా కావలెనని కోరుకొనెను. అందువలన అశ్వపతి మహారాజు సుగుణ సంపదకల సత్యవంతునకు రత్నాలంకార శోభితయగు తన కుమార్తెనిచ్చి వివాహము చేసెను. అప్పుడు సత్యవంతుడు సంతోషముగా ఆమెను తీసికొని తన ఇంటికి వెళ్ళెను. సావిత్రీ సత్యవంతుల వివాహము జరిగి సంవత్సరము గడిచినది. ఒకనాడు సత్యవంతుడు తండ్రి యాజ్ఞననుసరించి పండ్లు సమిధలు తెత్తునని అడవికి పోయెను. సావిత్రి కూడా భర్తవెంట అడవికి వెళ్ళినది. ఆ అడవిలో సత్యవంతుడు చెట్టెక్కి కట్టెలుకొట్టుచుండగా దురదృష్టవశమును చెట్టుపై నుండి క్రిందబడి ప్రాణములు వదలిపెట్టెను. యమస్తజ్జీవపురుషం బధ్వాంగుష్ఠ సమం మునే | గృహీత్వా గమనం చక్రే తత్పశ్చాత్ప్రయ¸° సతీ || 12 పశ్చాత్తాం సుందరీం దృష్ఠ్వా యమః సంయమినీపతిః | ఉవాచ మధురం సాధ్వీం సాధూనాం ప్రవరో మహాన్ || 13 యమధర్మరాజా, బొటనవ్రేలంత యున్న సత్యవంతుని జీవపురుషుని తీసికొని వెళ్ళుచుండగా సావిత్రి యమధర్మరాజు వెంటనే పోసాగినది. సత్పురుషులలో శ్రేష్ఠుడైన యమధర్మరాజు తన వెంట వచ్చుచున్న సావిత్రిని చూచి మధురముగా ఇట్లు మాట్లాడెను. యమ ఉవాచ- యమధర్మరాజు ఇట్లనెను- అహో క్వ యాసి సావిత్రి గృహీత్వామానుషీం తనుం | యది యాస్యసి కాంతేన సార్థం దేహం తదా త్యజ || 14 గంతుం మర్త్యో నశక్నోతి గృహీత్వాం పాంచ భౌతికం | దేహం చ యమలోకం చానశ్వరం నశ్వరః సదా || 15 పూర్ణశ్చ భర్తుస్తే కాలః హ్యభవద్భారతే సతి | స కర్మఫలభోగార్థం సత్యవాన్యాతి మద్గృహం || 16 కర్మణా జాయతే జంతుః కర్మణౖవ ప్రలీయతే | సుఖం దుఃఖం భయం శోకం కర్మణౖవ ప్రపద్యతే || 17 కర్మణంద్రో భ##వేజ్జీవో బ్రహ్మపుత్రః స్వకర్మణా | స్వకర్మణా హరేర్దాసో జన్మాది రహితో భ##వేత్ || 18 స్వకర్మణా సర్వ సిద్ధిమమరత్వం లభేత్ ధ్రువం | లభేత్ స్వకర్మణావిష్ణోః సాలోక్యాది చతుష్టయం || 19 కర్మణా బ్రాహ్మణత్వం చ ముక్తత్వం చ స్వకర్మణా | సురత్వం చ మనుత్వం చ రాజేంద్రత్వం లభేన్నరః || 20 కర్మణా చ మునీంద్రత్వం తపస్విత్వం చ కర్మణా | కర్మణా క్షత్రియత్వం చ వైశ్యత్వం చ స్వకర్మణా || 21 కర్మణా చైవ శూద్రత్వమంత్యజత్వం స్వకర్మణా || 22 స్వకర్మణా చ మేచ్ఛత్వం లభ##తే నాత్ర సంశయంః | స్వకర్మణా జంగమత్వం స్థావరత్వం స్వకర్మణా || 23 స్వకర్మణా చ శైలత్వం వృక్షత్వం స్వకర్మణా | స్వకర్మణా చ పశుత్వం చ స్వకర్మణా ||24 స్వకర్మణా క్షుద్రజంతుః క్రిమిత్వం చ స్వకర్మణా | స్వకర్మణా చ సర్పత్వం గంధర్వత్వం స్వకర్మణా || 25 స్వకర్మణా రాక్షసత్వం కిన్నరత్వం స్వకర్మణా | స్వకర్మణా చ యక్షత్వం కూష్మాండత్వం స్వకర్మణా || 26 స్వకర్మణా చ ప్రేతత్వం భేతాళత్వం స్వకర్మణా | భూతత్వం చ పిశాచత్వం డాకినీత్వం స్వకర్మణా || 27 దైత్యత్వం దానవత్వం చాప్యసురత్వం స్వకర్మణా | కర్మణా పుణ్యవాన్ జీవో మహాపాపీ స్వకర్మణా ||28 కర్మణా సుందరోZరోగీ మహారోగి చ కర్మణా | కర్మణా చాంధః కాణశ్చ కుత్సితశ్చ స్వకర్మణా || 29 కర్మణా నరకం యాంతి జీవాః స్వర్గం స్వకర్మణా | కర్మణా శక్రలోకం చ సూర్యలోకం స్వకర్మణా ||30 కర్మణా చంద్రలోకం చ వహ్నిలోకం స్వకర్మణా | కర్మణా వాయులోకం చ కర్మణా వరుణాలయం || 31 తథా కుబేరలోకం చ నరోయాతి స్వకర్మణా | కర్మణా ధ్రువలోకం చ శివలోకం స్వకర్మణా || 32 యాతి నక్షత్రలోకం చ సత్యలోకం స్వకర్మణా | జనోలోకం తపోలోకం మహర్లోకం స్వకర్మణా || 33 స్వకర్మణా చ పాతాళం బ్రహ్మలోకం స్వకర్మణా | కర్మణా భారతం పుణ్యం సర్వేప్సిత వరప్రదం || 34 కర్మణా యాతి వైకుంఠం గోలోకం చ నిరామయం | కర్మణా చిరంజీవి చ క్షణాయుశ్చ స్వకర్మణా || 35 కర్మణా కోటి కల్పాయుః క్షీణాయుశ్చ స్వకర్మణా | జీవసంచార మాత్రాయుః గర్భే మృత్యుః స్వకర్మణా || 36 ఇత్యేవం కథితం సర్వం మయా తత్వం చ సుందరి | కర్మణా తే మృతో భర్తా గచ్ఛ వత్సే యథా సుఖం || 37 ఓ సావిత్రి!మానవదేహమును ధరించి ఎక్కడకు వచ్చుచున్నావు. నీవు నీ భర్త వెంట రాదలచినచో ఈ పార్థివ దేహమును వదలిపెట్టుము ఈ పాంచభౌతిక శరీరమును ధరించి అశాశ్వతుడైన మానవుడు శాశ్వతమైన యమలోకములకు పోలేడు. నీ భర్త ఈ భారతభూమిలో ఉండదగు కాలము సంపూర్ణమైనందువలన అతడు చేసికొన్న కర్మఫలముననుభవించుట కొరకు నా లోకమునకు వచ్చుచున్నాడు. ఈ జీవులన్నియు తాము చేసికొన్న కర్మవలననే పుట్టుచున్నవి. గిట్టుచున్నవి. సుఖము, దుఖఃము, భయము, శోకము అనునవి అన్నియు కూడ జీవులు చేసికొనుచున్న కర్మలవలననే ఏర్పడుచున్నవి. కర్మవలననే జీవుడు ఇంద్రుడగుచున్నాడు బ్రహ్మపుత్రుడగుచున్నాడు. శ్రీహరికి దాసుడగుచున్నాడు. అనేక జన్మరహితుడగుచున్నాడు. ఈ కర్మవలననే సర్వసిద్ధులు, అమరత్వము, ముక్తి బ్రాహ్మణత్వము లభించుచున్నవి. ఈ కర్మవలననే జీవుడు దేవతగా, మనువుగా, రాజేంద్రుడుగా మునీంద్రుడుగా, తపస్విగా, క్షత్రియుడుగా, వైశ్యుడుగా, శూద్రుడుగా అంత్యజుడుగా, వ్లుెచ్ఛుడుగా పుట్టుచున్నాడు. ఈ కర్మ వల్లనే జీవుడు స్థావరముగా, జంగమముగా, గుట్టగా, చెట్టుగా పశువుగా పక్షిగా, క్షుద్రజంతువుగా, క్రిమి కీటకముగా, సర్పముగా, గంధర్వుడుగా, రాక్షసుడుగా , కిన్నరుడుగా, యక్షుడుగా, ప్రేతగా, భేతాళుడుగా, భూత, పిశాచ, ఢాకినీలుగా, దైత్యుడుగా, దానవుడుగా అసురుడుగా జన్మించుచున్నాడు. అట్లే పుణ్యవంతుడగుచున్నాడు. మహాపాపాత్ముడగుచున్నాడు. సుందరుడుగా మహారోగిగా గుడ్డివాడుగా, ఒకే కన్ను కలవాడుగా దుష్టుడుగా ఏర్పడుచున్నాడు. అట్లే కర్మవలననే జీవులు స్వర్గమును నరకమును పొందుచున్నారు. ఇంద్రలోకము, శివలోకము, సత్యలోకము మొదలగు లోకములకు పోవుచున్నారు. ఆ కర్మవలననే చిరంజీవిగా అల్పాయుష్కుడుగా అగుచున్నారు. ఓసుందరి కర్మ ఫలితములీ విధముగా నుండును. అందువలన నీ భర్తకూడ తాను చేసికొన్న కర్మ ననుసరించి మృతిచెందినాడు. కావున నీవు విచారించక వెనుదిరిగి పొమ్ము. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే కర్మవిపాకే కర్మణః సర్వహేతుత్వ ప్రదర్శనం నామ చతుర్వింశతితమోZధ్యాయః || శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణుల సంవాదమున తెలుపబడిన కర్మ విపాకములో కర్మయే అన్నిటికి కారణమను విషయమును తెలుపు ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము.