sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

షడ్వింశోZధ్యాయః- కర్మవిపాకే కర్మాను రూపస్థాన గమనం

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు నారదునితో పలికెను-

సావిత్రీ వచనం శ్రుత్వా జగామ విస్మయం యమః | ప్రహస్య వక్తుమారేభే కర్మపాకం చ జీవినాం || 1

సావిత్రి అడిగిన ప్రశ్నల విని యమధర్మరాజు ఆశ్చర్యపడి జీవులయొక్క కర్మపాకమెట్లుండునో తెలుపుటకు మొదలిడెను.

యమ ఉవాచ- యముడు సావిత్రితో ఇట్లనెను-

కన్యా ద్వాదశవర్షీయా వత్సే త్వం వయసాZధునా | జ్ఞానం తే పూర్వవిదుషాం యోగినాం జ్ఞానినాం పరం || 2

సావిత్రీ వరదానేన త్వం సావిత్రీ కళా సతి | ప్రాప్తా పురా భూభృతా చ తపసా తత్సమా శుభే || 3

యథా శ్రీః శ్రీపతేః క్రోడే భవానీచ భవోరసి | యథా రాధా చ శ్రీకృష్ణే సావిత్రీ బ్రహ్మవక్షసి || 4

ధర్మోరసి యథా మూర్తిః శతరూపా మనౌ యథా | కర్ణమే దేవహుతిశ్చ వసిష్ఠేZరుంధతీ యథా || 5

అదితిః కశ్యపేచాZపియథాZహల్యా చ గౌతమే | యథా శచీ మహేంద్రే యథా చంద్రే చ రోహిణీ || 6

యథారతిః కామదేవే యథా స్వాహా హుతాశ##నే | యథా స్వధా చ పితృషు యథా సంజ్ఞా దివాకరే || 7

వరుణానీ చ వరుణ యజ్ఞే చ దక్షిణా యథా |యథా ధరా వరాహో చ దేవసేనా చ కార్తికే ||8

సౌభాగ్యా సుప్రియా త్వం చ భవ సత్యవతి ప్రియే | ఇతి తుభ్యం వరం దత్తమపరం చ యదీప్సితం ||

వృణు దేవి మహాభాగే సర్వం దాస్యామి నిశ్చితం || 9

ఓ సావిత్రి ! నీ వయస్సిప్పుడు పన్నెండు సంవత్సరములు మాత్రమే. కాని నీ జ్ఞానము ప్రాచీన విద్వాంసుల కన్నను, యోగినుల కన్నను, జ్ఞానవంతులకన్నను మిన్నయైనది. మీ తండ్రియగు అశ్వపతి చేసిన తపస్సు వలన సావిత్రీ దేవితో సమానురాలవుగా, ఆమె అంశతో, ఆమె వరమువలన నీవు పుట్టినావు.

లక్ష్మీపతి వక్షఃస్థలమును లక్ష్మీదేవి ఎట్లుండునో శంకరుని ఎదపై పార్వతీదేవి ఎట్లుండునో శ్రీకృష్ణదేవునికి రాధ ఎట్లున్నదో బ్రహ్మ దేవునకు సావిత్రి, ధర్మునకు మూర్తీదేవి, మనువునకు శతరూప, కర్దమ ప్రజాపతికి దేవహూతి, వసిష్ఠునకు అరుంధతీదేవి, కశ్యపప్రజాపతికి అదితి, గౌతమ మహర్షికి అహల్య, దేవేంద్రునకు శచీదేవి, చంద్రునకు రోహిణి, మన్మథునకు రతీదేవి. అగ్నిదేవునకు స్వాహాదేవి, పితృదేవతలకు స్వధాదేవి, సూర్యునకు సంజ్ఞాదేవి, వరుణునకు వరుణాని, యజ్ఞునకు దక్షిణ, ఆదివరాహమూర్తికి భూదేవి, కుమారస్వామికి దేవసేనల వలె నీవు నీభర్తయగు సత్యవంతునకు ప్రియురాలవు కమ్ము అట్లే సౌభాగ్యవతివి కూడ కమ్ము.

ఓ సావిత్రి నీకిట్టి వరమునిచ్చితిని. ఇంకను నీకిష్టమైన కోరిక ఏదైన ఉన్నచో చెప్పుము నీకోరికను సంపూర్ణముగా తీర్తునని యమధర్మరాజు సావిత్రితో పలికెను.

సావిత్య్రువాచ- సావిత్రి ఈ విధముగా అనెను-

సత్యవదౌరసేనైన పుత్రాణాం శతకం మమ | భవిష్యతి మహాభాగ వరమేతన్మదిప్సితం || 10

మత్పితుః పుత్రశతకం శ్వశురస్యచ చక్షుషీ | రాజ్యలాభో భవత్వేవ వరమేతన్మదీప్సితం || 11

అంతే సత్యవతా సార్థం యాస్యామి హరిమందిరం | సమతీతే లక్షవర్షే దేహీమం మే జగత్పతే || 12

జీవకర్మవిపాకం చ శ్రోతుం కౌతూహలం చ మే | విశ్వవిస్తర జీజంచ తన్మే వ్యాఖ్యాతు మర్హసి ||13

ఓ యమధర్మరాజా! నాకు సత్యవంతునకు నూరుగురు పుత్రులు కలుగునట్లు, నాతండ్రికి పుత్రసంతానము కలుగునట్లు, నా మామగారికి కళ్ళు, రాజ్యము లభించునట్లు, నేను సత్యవంతునితో కలిసి శ్రీహరి మందిరమైన వైకుంఠమునకు పోవునట్లు వరమిమ్ము.

ఇక నాకు జీవుల కర్మవిపాకమెట్లు జరుగులో ప్రపంచము విస్తరించుటకు గల కారణమును వివరించి తెల్పుడు.

భవిష్యతి మహాసాధ్వి సర్వం మానసికం తవ | జీవ కర్మవిపాకం చ కథాయామి నిశామయ || 14

శుభనామ శుభానాం చ కర్మణా జన్మభారతే | పుణ్యక్షేత్రేZత్ర సర్వత నాZన్యత్ర భుంజతే జనాః || 15

సురాదైత్యా దానవాశ్చ గంధర్వా రాక్షసాదయః | నరాశ్చ కర్మజనకాః న సర్వే సమజీవినః || 16

విశిష్టజీవినః కర్మ భుంజతే సర్వ యోనిషు | విశేషతో మానవాశ్చ భ్రమంతి సర్వయోనిషు ||17

శుభాశుభం భుంజతే చ కర్మ పూర్వార్జితం పరం | శుభేన కర్మణా యాంతి తే స్వర్గాదిక మేవచ || 18

కర్మణా చాశుభేనైవ భ్రమంతి నరకేషుచ | కర్మ నిర్మూలనే ముక్తిః సా చోక్తా ద్వివిధా మతా || 19

నిర్వాణరూపా సేవా చ కృష్ణస్య పరమాత్మనః రోగే కుకర్మణా జీవశ్చారోగీ శుభకర్మణా||20

దీర్ఘజీవీ చ క్షీణాయుః సుఖీదుఃఖీ చ నిశ్చితం | అంధాదయాశ్చాంగహీనాః కుత్సితేన చ కర్మణా ||21

సిద్ధ్యాదికమవాప్నోతి సర్వోత్కృష్టేన కర్మణా | సామాన్యం కథితం సర్వం విశేషం శ్రుణు సుందరి ||22

మహాసాధ్వియగు సావిత్రీ నీవు కోరిన కోరికలన్నియు తీరును. ఇక నీవడిగిన జీవ కర్మ విపాకమును వివరించుచున్నాను.

పుణ్యకర్మలు, పాపకర్మలు చేసికొన్నవారు తత్ఫలమనుభవించుటకై ఈ భారతఖండమున పుట్టుచున్నారు. ఈ పుణ్యఖండమున తప్ప ఇతరత్ర జనులు శుభాశుభాకర్మ ఫలములను అనభవించలేరు. దేవతలు, దైత్యులు, దానవులు, గంధర్వులు, రాక్షసాదులు, మానవులు వీరందరు తమతమ కర్మలననుసరించి పుట్టుచున్నారు. వీరందరు సమానమైన జీవనమును గడుపుటలేదు.

విశిష్టమైన జీవనము కలవారు. సమస్తయోనులందు జన్మించి తాము చేసిన కర్మఫలమనుభవించుచున్నారు. ముఖ్యముగా మానవులు ఈ విధముగా వివిధయోనులయందు జన్మనెత్తుచున్నారు. పూర్వ కర్మార్జితమైన ఫలము శుభ##మైనా అశుభ##మైనా అనుభవించుచున్నారు. పుణ్యకర్మవలన స్వర్గాది ఫలితమును పొందగా అశుభకర్మవలన నరకమును చెందుచున్నారు.

కర్మనిర్మూలనము వలన కలుగు ముక్తి రెండు విధములు. ఒకటి నిర్వాణరూపమైనది రెండవది శ్రీకృష్ణపరమాత్మ సేవా రూపమైనది.

పాప కర్మచేయువాడు రోగియగును, క్షీణాయుష్కుడగును. దుఃఖమును పొందును గుడ్డి, చెవిటి, మూగవంటి అవయహీనుడగును. అట్లే సుకృతమును చేసినచే ఆరోగ్యవంతుడుగా, దీర్ఘజీవిగా, సుఖవంతుడుగా, సర్వసిద్ధి సంపన్నుడుగా నగును.

ఇప్పుడు చెప్పిన దంతయు సామాన్యమైనది. ఇక విశేష విషయమును వినుము.

సుదుర్లభం సుభోగ్యం చ పురాణషు శ్రుతిష్వపి || 23

దుర్లభా మానవీ జాతిః సర్వజాతిషు భారతే | సర్వేభ్యో బ్రాహ్మణః శ్రేష్ఠః ప్రశస్తః సర్వ కర్మసు || 24

విష్ణుభక్తో ద్విజశ్చైవ గరీయాన్‌ భారతే తతః | నిష్కామశ్చ సకామశ్చ వైష్ణవో ద్వివిధః సతి || 25

సకామశ్చ ప్రధానశ్చ నిష్కామో భక్త ఏవచ | కర్మభోగీ సకామశ్చ నిష్కామో నిరుపద్రవః ||26

స యాతీ దేహం త్యక్త్వా చ పదం విష్ణోర్నిరామయం | పునరాగమనం నాస్తి తేషాం నిష్కామినాం సతి || 27

యే సేవంతే చ ద్విభుజం కృష్ణమాత్మానమీశ్వరం | గోలోకం యాంతి తే భక్తా దివ్యరూపవిధారిణః ||28

యే చ నారాయణం భక్తా సేవంతే చ చతుర్భుజం | వైకుంఠం యాంతి తే సర్వే దివ్య రూప విధారిణః ||29

సకామినో వైష్ణవాశ్చ గత్వా వైకుంఠమేవచ | భారతం పునరాయాంతి తేషాం జన్మ ద్విజాదిషు || 30

కాలేన తే చ నిష్కామా భవిష్యంతి క్రమేణ చ | భక్తిం చ నిర్మలాం బుద్ధిం తేభ్యో దాస్యతి నిశ్చితం || 31

బ్రాహ్మణాద్వైష్ణవా దన్యే సకామాః సర్వజన్మసు | నతేషాం నిర్మలా బూద్ధిః విష్ణుభక్తి వివర్జితా ||32

సమస్త జీవులలో భారతదేశమున పుట్టిన మానవజాతి చాలా శ్రేష్ఠమైనది. ఆ మానవులలో కూడ బ్రాహ్మణజాతి చాలా గొప్పది. వారిలో కూడ విష్ణుభక్తుడైన బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు.

ఆ విష్ణుభక్తులు రెండు విధములుగా నుందురు. ఒకరు నిష్కాములు. ఇంకొకరు సకాములు. కోరికలు గల విష్ణుభక్తులు ప్రధానమైన వారైనప్పటికీ నిష్కాములైన వారు అసలైన విష్ణుభక్తులు. సకాముడైన విష్ణుభక్తుడు కర్మఫలములననుభవించుచు సుఖముగా నుండును. నిష్కామియైన విష్ణుభక్తుడు దేహత్యాగము చేసిన తరువాత విష్ణులోకమునకు వెళ్ళును. నిష్కామియగు విష్ణుభక్తుడు వైకుంఠమున ఎల్లప్పుడు ఉండును. ద్విభుజుడైన శ్రీకృష్ణపరమాత్మను సేవించి నిష్కామియగు భక్తుడు దివ్యరూపమును ధరించి గోలోకముననుండును. చతుర్భజుడైన నారాయణుని సేవించు నిష్కామి భక్తుడు దివ్యరూపమును ధరించి వైకుంఠమునకు వెళ్ళును. వారు సదా ఆ లోకములందే ఉండి పరమాత్మను సేవించుచుందురు.

సకాములైన వైష్ణవులు వైకుంఠమునకు పోయినను తిరిగి భారతదేశమునకు వచ్చి ద్విజాతులలో పుట్టుదురు. వారు కాలము గడిచిన కొలది నిష్కాములగుదురు. శ్రీహరి వారికి నిర్మలమైన భక్తిని ఇచ్చును.

బ్రాహ్మణులు వైష్ణవులు కాని వారందరు అన్ని జన్మలలో సకాముకులై ఉందురు. వారికి నిర్మలమైన భక్తి యుండదు. విష్ణుభక్తి కూడ ఉండదు.

తీర్థాశ్రితా ద్విజా యే తపస్యానిరతాః సతి | తే యాంతి బ్రహ్మలోకం చ పునరాయాంతి భారతం || 33

స్వధర్మ నిరతా విప్రాః సూర్యభక్తాశ్చ భారతే | వ్రజంతి సూర్యలోకం తే పునరాయాంతి భారతం ||34

స్వధర్మ నిరతా విప్రాః శైవాః శాక్తాశ్చ గాణపాః | తే యాంతి శివలోకం చ పునరాయాంతి భారతం ||35

యే విప్రా అన్య దేవేష్టాః స్వధర్మనిరతాః సతి | తే గత్వా శక్రలోకం చ పునరాయాంతి భారతం || 36

హరిభక్తాశ్చ నిష్కామాః స్వధర్మ రహితాః ద్విజాః | తేZపి యాంతి హరేర్లోకం క్రమాద్భక్తి బలాదహో || 37

స్వధర్మ రహితా విప్రాః దేవాన్యసేవినః సదా | భ్రష్టాచారాశ్చ బాలాశ్చ తేయాంతి నరకం ధ్రువం || 38

స్వధర్మనిరతాశ్చైవం వర్ణాశ్చత్వార ఏవచ | భవం త్యేవ శుభ##సై#్యవ కర్మణః ఫలభాగినః || 39

స్వధర్మ రహితాస్తే చ నరకం యాంతి హి ధ్రువం | భారతే చ భవంత్యేవ కర్మణః ఫలభాగినః || 40

పుణ్య తీర్థములలో నుండి తపస్సు చేసికొను ద్విజులు బ్రహ్మలోకమునకు వెళ్ళి ఆ పుణ్యఫలము తీరగానే భారతదేశమునకు తిరిగి వత్తురు. తమ ధర్మము సదా ఆచారించు సూర్యభక్తులైన బ్రాహ్మణులు సూర్యలోకమునకు పోయిరి వారి వుణ్యఫలము పూర్తియైన వెంటనే భారతదేశమునకు తిరిగివత్తురు. తమ ధర్మమును ఎల్లప్పుడు వదలక ఆచరించు శైవులు, శక్తినుసాసించువారు. శివలోకమగు కైలాసమును చేరుకొని వారి పుణ్యఫలము తీరిన వెంటనే భారత దేశమునకు తిరిగి వత్తురు. తమ ధర్మమును తప్పక, అనుష్టించు అన్య దేవతా భక్తులగు బ్రాహ్మణులు స్వర్గలోకమును చేరి పుణ్యము క్షీణింపగా భారత దేశమునకు తిరిగి చేరుకొందురు.

శ్రీహరి భక్తులు, నిష్కాములైన బ్రాహ్మణులు తమ ధర్మము ఆచరింపక నిర్లక్ష్యము చేసినను శ్రీహరి భక్తి బలమును వైకుంఠమునకు తప్పక చేరుదురు. స్వధర్మమును వదలి ఇతర దేవతలను పూజించు బ్రాహ్మణులు భ్రష్టాచారులై నరకమును తప్పక పోదురు.

స్వధర్మము సదా అనుష్టించు చతుర్వర్ణములవారు వారు చేసి కొన్ని పుణ్యఫలముననుభవింతురు. స్వధర్మమును వదలి పెట్టిన అన్ని వర్ణములవారు నరకమునకు తప్పక పోదురు. అచ్చట వారి కర్మఫలము తీరినవెంటనే భారత భూమికి తిరిగి వత్తురు.

స్వధర్మనిరతా విప్రా స్వధర్మనిరతాయ చ | కన్యాం దదతి విప్రాయ చంద్రలోకం వ్ర జంతి తే || 41

వసంతి తత్రతే సాధ్వి యావదింద్రాశ్చతుర్ధశ | సాలంకృతా యా దానేన ద్విగుణం ఫలముచ్యతే || 42

సకామా యాంతి తల్లోకం న నిష్కామాశ్చ వైష్ణవాః | తే ప్రయాంతి విష్ణులోకం ఫలసంధాన వర్జితాః || 43

గవ్యం చ రజతం భార్యాం వస్త్రం సస్యం ఫలం జలం | యే దదత్యేవ విప్రేభ్యః తల్లోకం హి వ్రజంతి చ || 44

వసంతి తే చ తల్లోకం యావన్మన్వంతరం సతి | కాలం చ సుచిరం వాసం కుర్వంతి తత్రతే జనాః | 45

యే దదతి సువర్ణం చ గాం చ తామ్రాదికం సతి | తే యాంతి సూర్యలోకం చ శుచయే బ్రాహ్మణాయ చ || 46

వసంతి తత్ర తే లోకే వర్షాణామయుతం సతి | విపులే చ చిరం వాసం కుర్వంతి చ నిరామయాః || 47

దదాతి భూమి విప్రేభ్యో ధాన్యాని విపులాని చ | స యాతి విష్ణులోకం చ శ్వేత ద్వీపం మనోహరం || 48

తత్రైవ నివసత్యేవ యావచ్చంద్ర దివకారౌ | విపులం విపులే వాసం కరోతి పుణ్యవాన్‌ సతి || 49

తమ ధర్మములను ఎల్లప్పుడు అనుష్ఠించు బ్రాహ్మణుడు స్వధర్మ నిరతుడైన బ్రాహ్మణునకు తన కన్యకనిచ్చి పెండ్లిచేయునో అతడు పదునల్గురు దేవేంద్రుల కాలము వరకు చంద్రలోకమున ఉండును. అట్లే ఆభరణసహితయైన (సాలంకృత) కన్యాదానము చేసినచో పై దానికి రెట్టింపు ఫలితముననుభవించును. సకాములైన బ్రాహ్మణులు పై విధముగా చంద్రలోకమునకు పోవుదురు. కాని నిష్కాములైన వైష్ణవులు ఫలమేమి కోరక కన్యాదానము చేసినచో వైకుంఠమునకు పోవుదురు. గవ్యమును (ఆవుపాలు, పెరుగు, నేయ్యి మొదలగు వాటిని) వెండిని, వస్త్రమును, సస్యమును, పండ్లను, మంచినీటిని కన్యకను బ్రాహ్మణులకు దానము చేసిన వారు మన్వంతర కాలము వరకు చంద్రలోకమున నివసింతురు.

బంగారమును, ఆవులను, రాగి మొదలగు వస్త్రములను ఎవరు పరిశుద్ధుడైన బ్రాహ్మణునకు దానము చేయుదురో వారు పదివేల సంవత్సరముల వరకు సూర్యలోకమున చక్కని ఆరోగ్యముతోనుందురు. భూమిని, ధాన్యమును బ్రాహ్మణులకు దానము చేసినవాడు సూర్యచంద్రులున్నంతవరకు విష్ణులోకమైన శ్వేత ద్వీపమున నుండును.

గృహం దదతి విప్రాయ యే జనా భక్తి పూర్వకం | తే యాంతి సురలోకం చ చిరం తత్ర భవంతి తే || 50

గృహరేణు ప్రమాణాబ్దం దానం పుణ్యదినే యది | విపులం విపులేవాసం కుర్వంతి మానవాః సతి || 51

యసై#్మ యసై#్మ చ దేవాయ యో దదాతి గృహం నరః | స యాతి తస్యలోకం చ రేణుమానాబ్దమేవచ || 52

సౌధే చతుర్గుణం పుణ్యం పూర్తే శతగుణం ఫలం | ప్రకృష్టేzష్టగుణం తస్మాదిత్యాహ కమలోద్భవః || 53

యో దదాతి తడాగం చ సర్వభూతాయ భారతే | తథా సేతుప్రదానేన తడాగస్య ఫలం లభేత్‌ || 54

వాప్యాం ఫలం శతగుణం ప్రాప్నోతి మానవస్తతః | తథా సేతు ప్రదానేన తడాగస్య ఫలం లభేత్‌ || 55

ధనుశ్చతుసహస్రేణ దైర్ఘ్యమానేన నిశ్చితం | న్యూనా వా తావతీ ప్రస్థే సా వాపీ పరికీర్తితా || 56

దశవాపీసమా కన్యా యది పాత్రే ప్రదీయతే | ఫలం దదాతి ద్విగుణం యది సాలంకృతా భ##వేత్‌ || 57

స్వధర్మనిరతుడైన బ్రాహ్మణునకు భక్తితో ఇల్లును కట్టిదానము చేసినచో వారు చాలాకాలము స్వర్గలోకమున సుఖింతురు. దీనినే పుణ్యదినమున దానము చేసినచో ఆ ఇల్లు ఎన్నిరేణువులతో నిర్మితమైనదో అన్ని సంవత్సరములు స్వర్గలోకమున సుఖముగా నుందురు.

దేవాలయములు కట్టించినవారు ఆ దేవాలయము యొక్క రేణువులెన్ని యున్నచో అన్ని సంవత్సరములు ఆయా దేవతలలోకమున నివసింతురు. చక్కని దేవాలయమును కట్టి దానము చేసినచో సామాన్య దేవాలయ దానము కంటే నాలుగు రెట్లు అధికమైన పుణ్యము పొందును. పూర్తమును (వాపీ, కూప తటాకము, దేవాలయాది నిర్మాణము, అన్నదానము, తోటలు పెట్టుట) చేసినచో పై దానికంటే వందరెట్లు ఎక్కువ ఫలితము లభించును. పుణ్య తీర్థమున చేసిన దానము పై దాని కంటే ఎనిమిది రెట్లెక్కువ పుణ్యమును కలిగించునని బ్రహ్మదేవుడు పేర్కొనెను.

చెరువును తవ్వి ప్రజలందరకు దానము చేసిన మానవుడు పదివేల సంవత్సరాలు జనలోకమున నివసించును. నాల్గువేల ధనువుల పొడవు వెడల్పు ( నాలుగు హస్తములు పొడవు ఒక ధనువు) కల దానిని వాపి (బావి) యందురు. అట్టి వాపిని నిర్మించి ప్రజలకు దానము చేసినచో అది తటాక పుణ్యము కంటే వందరెట్లెక్కువ పుణ్యమును పొందును. ఆనకట్టను కట్టినచో తటాకపుణ్యమునే పొందును. తగిన వరునకు కన్యాదానము చేసినచో పది బావుల పుణ్యము లభించును. అదే సాలంకృత కన్యాదానము చేసినచో దానికంటే రెట్టింపు పుణ్యమును పొందును.

తత్పలం చ తడాగే పంకోద్దారేణ తత్పలం | వాప్యాశ్చ పంకోద్ధారేణ వాపీ తుల్యఫలం లభేత్‌ || 58

అశ్వత్థ వృక్షమారోప్య ప్రతిష్టాం క చరోతి యః | స యాతి తపసో లోకం వర్షాణామయుతం పరం || 59

పుష్పోద్యానం యోదదాతి సావిత్రి సర్వభూతయే | స వసేత్‌ ధ్రువే లోకే వర్షాణామయుతం ధ్రువం || 60

యో దదాతి విమానంచ విష్ణవే భారతే సతి | విష్ణులోకే వసేత్సోzపి యావన్మన్వంతరం పరం || 61

చిత్రయుక్తే చ విపులే ఫలం తస్య చతుర్గుణం | రథార్ధం శిబికా దానే ఫలమేవ లభేద్ధ్రు వం || 62

యో దదాతి భక్తియుక్తో హరయే దోలమందిరం | విష్ణలోకే వసేత్సోzపి యావన్మన్వంతరం పరం || 63

రాజమార్గం సౌధయుక్తం యః కరోతి పతివ్రతే | వర్షాణామయుతం సోzపి శక్రలోకే మహీయతే || 64

బ్రాహ్మణభ్యోzపి దేవేభ్యో దానే సమఫలం భ##వేత్‌ || యచ్చదత్తం హి తద్భోక్తుర్న దత్తం నోపతిష్ఠతే || 65

భుక్త్వా స్వర్గాదికం సౌఖ్యం పునారయాంతి భారతే | లభేద్విప్రకులేష్వేవ క్రమేణౖవోత్తమాదిషు || 66

భారతే పుణ్యనాన్‌ విప్రో భుక్త్వా స్వర్గాదికం పరం | పునః సోzపి భ##వేద్విప్రో న పునః క్షత్రియాదయః || 67

చెరువును తవ్వించినచో సాలంకృత కన్యాదానము చేసిన ఫలమును పొందును. చెరువులోని బురదనంతా తీసివేసినచో చెరువు తవ్విన ఫలము లభించును. బావిలోని బురదనంతయు తీసివేసినచో బావి తవ్విన ఫలితమును పొందును. రావిచెట్టును పాతి, ప్రతిష్ట చేసినచో తపోలోకమున పదివేల సంవత్సరములు సుఖముగా నుండును. ఉద్యానమును నిర్మించిన వాడు ధ్రువలోకమున పదివేల సంవత్సరములు సుఖముగానుండును.

ఈ భారత దేశమున నిష్ట్యాలయముపై విమానమును (శిఖరమును)నిర్మించినచో విష్ణులోకమున మన్వంతర కాలముండును. ఆ వివాహమును చిత్రములతో (ప్రతిమలతో) అలంకరించి నిర్మించినచో నాలుగు మన్వంతరములు విష్ణులోకమున నుండును. విష్ణుమూర్తికై పల్లకిని నిర్మించి దానము చేసినవాడు విమానమును నిర్మించినంత ఫలితమును పొందును. శ్రీహరికై ఊయల మండపమును నిర్మించినవాడు వైకుంఠమున మన్వంతర కాలముండును.

సౌధములున్న (ధర్మశాలలు) రాజమార్గమును నిర్మించినవాడు పదివేల సంవత్సరములు స్వర్గలోకమున సుఖముగా నుండును. దేవతలకు దానము చేసినను, బ్రాహ్మణులకు దానము చేసినను సమానమైన ఫలితమే కలుగును. తాను ఈ జన్మముననో పూర్వ జన్మముననో చేసిన దాన ఫలముననుభవించును. దానమే చేయని వానికి దానఫలము ఏ విధముగా కలుగును? అందువలన దానము చేసినచో తత్ఫలమైన స్వర్గాది సుఖములననుభవించి తిరిగి భారతదేశమున జన్మించును. అతడు చేసిన పుణ్యకర్మలననుసరించి బ్రాహ్మణుల ఇంటిలోనో ఉత్తములైన వారి ఇంటిలోనో జన్మించును. ఈ భారతదేశమందలి బ్రాహ్మణుడు పుణ్యకర్మలు చేసి తత్ఫలితమైన స్వర్గాదిలోక సౌఖ్యములననుభవించి తిరిగి బ్రాహ్మణుడుగానే పుట్టును.

క్షత్రియో వాపి వైశ్యోవా కల్పకోటి శ##తేన చ | తపసా బ్రాహ్మణత్వం చ నప్రాప్నోతి శ్రుతౌ శ్రుతం || 68

స్వధర్మ రహితా విప్రా నానా యోని వ్రజంతి చ | భుక్త్వా చ కర్మభోగం చ విప్రయోని లభేత్పునః || 69

నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శ##తైరపి | అవశ్యమే భోక్తవ్యం కల్పకోటి శ##తైరపి || 70

అవశ్యమేవ భోక్తవం కృతం కర్మ శూభాశుభం | దేవ తీర్థే సహాయేన కాయవ్యూహేన శుద్ధ్యతి || 71

ఏతత్తే కథితం సర్వం కింద భూయః శ్రోతుమిచ్ఛసి || 72

తమతమ విధ్యుక్త ధర్మములను వదిలి పెట్టిన బ్రాహ్మణులు అనేక జన్మలెత్తి తాము చేసికొన్ని కర్మభోగములననుభించి తిరిగి బ్రాహ్మణ వంశముననే పుట్టుదురు.

తాము చేసిన కర్మశుభ##మైనా అశుభ##మైనా ఎన్నికోట్ల సంవత్సరములు వరకైనా అనుభవించి తీరవలెను. అప్పడే కర్మక్షయము కలుగును., దేవసందర్శనము, పుణ్యతీర్థసేవనము, కాయవ్యూహముల వలన మానవుడు పరిశుద్ధుడగును.

సావిత్రి ! ఇంకను నీవు వినదల్చినదేదైనా ఉన్నచో చెప్పుము. తప్పక చెప్పెదను అని యమధర్మరాజు పలికెను.

ఇతిశ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే సావిత్ర్యుపాఖ్యానే కర్మవిపాకే

కర్మానురూపస్థానగనమనం నామ షిడ్వింశోzధ్యాయ ః ||

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైవ ప్రకృతి ఖండమున సావిత్రీ ఉపాఖ్యానములో చెప్పబడిన కర్మవిపాకమున తమ తమ కర్మల ననుసరించి పొందు స్థానముల వివరణ గల

ఇరువది యారవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters