sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
సప్తవింశోzధ్యాయః - శుభకర్మల ఫలితము సావిత్ర్యువాచ - సావిత్రి యమునితో నిట్లనెను - ప్రయాంతి స్వర్గమన్యంచ యేన యేనైవ కర్మణా | మానవాః పుణ్యవంతశ్చ తన్మే వ్యాఖ్యాతు మర్హసి ||
1 పుణ్యము చేసికొనిన మానవులు ఏయే కర్మలవలన స్వర్గలోకమును లేక ఇతరలోకములను చేరుచున్నారో ఆయా కర్మల గురించి విపులముగా తెలుపుడు. యమ ఉవాచ - యమధర్మరాజిట్లనెను - అన్నదానం చ విప్రాయ యః కరోతి చ భారతే | అన్న ప్రమాణ వర్షం చ శక్రలోకే మహీయతే || 2 అన్నదానాత్పరం దానం న భూతం న భవిష్యతి | నాత్ర పాత్ర పరీక్ష్యాస్యాత్ న కాలనియమః క్వచత్ || 3 దేవేభ్యో బ్రాహ్మణభ్యో వా దదాతి చాసనం యది | మహీయతే వహ్నిలోకే వర్షాణామయుతం ధ్రువం || 4 యో దదాతి చ విప్రాయ దివ్యాం ధేనుం పయస్వినీం | తల్లోమమాన వర్షంచ వైకుంఠే చ మహీయతే || 5 చతుర్గుణం పుణ్యదినే తీర్థేశతగుణం ఫలం | దానం నారాయణక్షేత్రే ఫలం కోటి గుణం భ##వేత్ || 6 ఈ భారతదేశమున బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో ఆ అన్నమున మెతుకులెన్ని యున్నవో అన్ని సంవత్సరములు స్వర్గలోకమున సుఖపడును. అన్నదానమును మించిన దానము లేనే లేదు. అన్నదానము చేయు సందర్భమున మంచివాడు చెడ్డవాడు అను పాత్ర పరీక్షగాని, కాల నియమముగాని తగదు. దేవతలకు, బ్రాహ్మణులకు ఆసనమిచ్చి గౌరవించినచో అగ్నిలోకమున పదివేల సంవత్సరములుండును. బ్రాహ్మణులకు పాలిచ్చు ఆవును దానమయు చేసినచో ఆధేనువు శరీరమును ఎన్ని వెండ్రుకలున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున నుండచ్చును. ఆ ధేనువును పుణ్యదినమున దానము చేసినచో నాల్గురెట్లెక్కువ ఫలితము పొందును. శ్రీమన్నారాయణుడుండు పుణ్యక్షేత్రమున దానము చేసినచో కోటి రెట్లెక్కువ ఫలితమున పొందును. గాం యో దదాతి విప్రాయ భారతే భక్తి పూర్వకం | వర్షాణామయుతం చైవ చంద్రలోకే మహీయతే || 7 యశ్చోభయముఖీదానం కరోతి బ్రాహ్మణాయచ | తల్లోమ మానవర్షం చ వైకుంఠే చ మహీయతే || 8 యో దదాతి బ్రాహ్మణాయ శాలిగ్రామం సవస్త్రకం | మహీయతే స వైకుంఠే యావచ్చంద్ర దివాకరౌ || 9 యో దదాతి బ్రాహ్మణాయ ఛత్రం చ సుమనోహరం | వర్షాణామయుతం సోzపి మోదతే వరుణాలయే || 10 విప్రాయ పాదుకాయుగ్మం యో దదాతి చ భారతే | మహీయతే చంద్రలోకే యావచ్చం ద్ర దివాకరౌ || 11 యో దదాతి బ్రాహ్మాణాయ శయ్యాం దివ్యాం మనోహరాం | మహీయతే చంద్రలోకే యావచ్చంద్ర దివాకరౌ || 12 యో దదాతి ప్రదీపం చ దేవాయ బ్రాహ్మణాయ చ| యాన్మన్వంతరం సోzపి బ్రాహ్మలోకే మహీయతే || 13 సంప్రాప్య మానవీం యోనిం చక్షుష్మాంచ భ##వేద్ధ్వం | వయాతి యమలోకంచ తేన పుణ్యన సుందరి || 14 కరోతి గజదానం చ యోహి విప్రాయ భారతే | యావదింద్రాది దేవస్య లోకే చార్ధాసనే వసేత్ || 15 భారతే యోzశ్వదానం చ కరోతి బ్రాహ్మణాయ చ | మోదతే వారుణ లోకే యావదింద్రాశ్చతుర్దశ || 16 బ్రాహ్మణునకావును భక్తితో దానము చేసినచో పదివేల సంవత్సరములు చంద్రలోకమున నుండి గౌరవము పొందుచుండును. అట్లే అప్పుడే ప్రసవించుచున్న ఆవును (ఉభయముఖి) దానము చేసినచో ఆ యావు శరీరము వెండ్రుకలెన్ని యున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున గౌరవమును పొందును. బ్రాహ్మణునకు వస్త్రముతో పాటు సాలగ్రామమున దానము చేసినచోసూర్య చంద్రులున్నంతవరకు వైకుంఠమున నుండును. అందమైన ఛత్రిని దానము చేసినచో పదివేల సంవత్సరమలు వరుణలోకమున నుండును. పాదుకలను దానము చేసిన వాయువలోకమున నుండును. చక్కని శయ్యను దానము చేసినచో సూర్యచంద్రులున్నంత వరకు చంద్రలోకమున నుండును. దీపమును దేవునకు లేక బ్రాహ్మణునకు దానము చేసినచో బ్రాహ్మలోకమున మన్వంతర కాలమునుండి తిరిగి భారత దేశమున జన్మించినను ఆ పుణ్యప్రభావము వలన తరువాత నరకలోకమునకు వెళ్ళడు. గజదానమును చేసినచో ఇంద్రుని అర్ధాసనమున స్థానమును సంపాదించుకొనును. అట్లే అశ్వమును దానమును చేసినచో పదునలుగురు ఇంద్రులు గడచువరకు వరుణ లోకమునుండును. ప్రకృష్టాం శిబికాం యో హి దదాతి బ్రాహ్మణాయ చ | మహీయతే విష్ణులోకే యావన్మన్వంతరం సతి || 17 యో దదాతి విప్రాయ వ్యజనం శ్వేత చామరం | మహీయతే వాయులోకే వర్షాణామయుతం ధ్రువం || 18 ధాన్యాచలం యో దదాతి బ్రాహ్మణాయ చ భారతే | స చ ధాన్య ప్రమాణాబ్దం విష్ణులోకే మహీయతే || 19 తతః స్వయోనిం సంప్రాప్య చిరజీవీ భ##వేత్సుఖీ | దాతా గ్రహీతా ద్వౌచ ధ్రువం వైకుంఠగామినౌ || 20 మంచి పల్లకిని దానము చేసినచో వైకుంఠమున మన్వంతరకాలము ఉండును. విసన కఱ్ఱనుగాని, తెల్లని చామరమును గాని దానము చేసినచో పదివేల సంవత్సరములు వాయులోకమున నుండును. అధికమైన ధాన్యమును దానము చేసినచో ఆ ధాన్యపుగింజలెన్ని యున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున నుండును. ఆ తరువాత తిరిగి మానవుడై పుట్టినను సుఖముగా ఉండగలడు. దాత తాను చేసిన దాన పుణ్యమున, ప్రతి గ్రహీత తాను ప్రతి దినమాచరించు స్వకర్మానుష్ఠానమువలన, వైకుంఠమునకు పోవుదురు. సతతం శ్రీహరేర్నామ భారతే యోజపేన్నరః | స ఏవ చిరజీవ చ తతో మృత్యుః ఫలాయతే || 21 యోనరో భారతే వర్షే దోలనం కారయేద్ధరేః | పూర్ణిమా రజనీ శేషే జీవన్ముక్తో భ##వేన్నరః || 22 ఇహ లోకే సుఖ భుంక్త్వా యాత్వంతే విష్ణుమందిరం | నిశ్చితం నివసేత్తత్ర శతమన్వంతరావధి || 23 ఫలముత్తర ఫల్గుణ్యాంతతోzపి ద్విగుణం భ##వేత్ | కల్పాంతజీవ సభ##వేదిత్యాహ కమలోద్భవః || 24 తిలదానం బ్రాహ్మణాయ యః కరోతి చ భారతే | తిలప్రమాణ వర్షం చ మోదతే విష్ణుమందిరే || 25 తతః స్వయోనిం సంప్రాప్య చిరజీవి భ##వేత్సఖీ | తాన్రు పాత్రస్థ దానేన ద్విగుణం చ ఫలం లభేత్ || 26 ఎల్లప్పడు శ్రీహరినామ జపము చేయువాడు చిరంజీవిగా ఉండును. మృత్యువాతననిని చూచి పరుగెత్తును. శ్రీహరినకి ఊయలను చేయించినచో పూర్ణిమనాడు బ్రాహ్మీముహూర్తమున మృతుడై ముక్తినొందును. ఈ లోకమున సుఖముగా నుండి చనిపోయి వైకుంఠమున కేగి అచ్చట శతమన్వంతర కాలము సుఖముగా నుండును. ఉత్తర ఫల్గుణీ నక్షత్రమున చేసిన దానము చాలా విశేషమైనది. దాని వలన రెండింతలు ఫలము లభించును. అతడు కల్పాంతము వరకు బ్రతుకునని బ్రహ్మదేవుడు తెలిపెను. నూవులను దానము చేసినచో నూవుగింజల సంఖ్యగల సంవత్సరమలు వైకుంఠమున నుండను. తరువాత మానవుడై పుట్టినను సుఖముగా నుండను ఈ నూవులను రాగి పాత్రలో పోసి దానము చేసినచో సాధారణదానము కంటే రెట్టింపు ఫలితమును పొందును. సాలంకృతాం చ భోగ్యాం చ సవస్త్రాం సుందరీం ప్రీయం | యో దదాతి బ్రాహ్మణాయ భారతే చ పతివ్రతాం || 27 మహీయతే చంద్రలోకే యావదింద్రాశ్చతుర్దశ | తత్ర స్వర్వేశ్యయా సార్ధం మోదతే చ దివానిశం || 28 తతో గంధర్వలోకే చవర్షాణామయుతం సతి | దివానిశం కౌతుకేన చోర్వశ్యా సహా మోదతే || 29 తతో జన్మసహస్రం చ ప్రాప్నోతి సుందరీం ప్రీయాం | సతీం సౌభాగ్యముక్తాం చ కోమలాం ప్రియవాదినీం || 30 అందమైనది, సద్గుణముల రాశియైన కన్యను సాలంకృతముగా సవస్త్రముగా దానము చేసినచో పదునలుగురు ఇంద్రులు గతించువరకు చంద్రలోకమున సుఖముగా నుండును. ఆ తర్వాత గంధర్వలోకమున సుఖముగా నుండును. తరువాత వేలకొద్ది జన్మలలో సౌందర్యవతి సౌభాగ్యవతి, మృదుభాషిణీ యగు కాంతను భార్యగా పొందును. దదాతి సఫలం వృక్షం బ్రాహ్మణాయ చ యోనరః | ఫల ప్రమాణ వర్షం చ శక్రలోకే మహీయతే || 31 పునః స్వయోనిం సంప్రాస్య లభ##తే సుత్తముత్తమం | సఫలానాం చ వృక్షాణాం సహస్రం చ ప్రశంసితం || 32 కేవలం ఫలదానం చ బ్రాహ్మణాయ దదాతి యః | సుచిరం స్వర్గవాసం చ కృత్వా యాతి చ భారతం || 33 నానా ద్రవ్యసమాయుక్తం నానా సస్య సమన్వితం | దదతే యశ్చ విప్రాయ భారతే విపులం గృహం || 34 కుబేర లోకే వసతి స చ మన్వంతరావధి | తతః స్వయోనిం సంప్రాప్య మహాంశ్చ ధనవాన్ భ##వేత్ || 35 పండ్లతో నున్న వృక్షమును బ్రాహ్మణునకు దానము చేసినచో దానము చేసినవాడు ఆ చెట్టున ఎన్ని ఫలములున్నవో అన్ని సంవత్సరములు స్వర్గలోకమున సుఖముగానుండును. తరువాత మానవ జన్మనెత్తి మంచి పుత్రుని కనును. అందువలన పండ్లతో నున్న చెట్లను అనేకము దానము చేయవలెనని అనుచున్నారు. పండ్లను మాత్రము దానము చేసినచో చాలా కాలము స్వర్గమున నుండును. అనేక ద్రవ్యములు, అనేక ధాన్యములు కల ఇంటిని దానము చేసినచో ఆ దాత కుబేరలోకమున మన్వంతర కాలముండును. తిరిగి మానవ జన్మనెత్తి నప్పుడు గొప్ప ధనవంతుడగును. యో జనః సస్యసంయుక్తాం భూమిం చ రుచిరాం సతి | దదాతి భక్త్వా విప్రాయ పుణ్యక్షేత్ర చ వా సతి || 36 మహీయతే స వైకుంఠే మన్వంతరశతం ధ్రువం | పునః స్వయోనిం సంప్రాస్య మహాంశ్చ భూమివాన్ భ##వేత్ || 37 తం న త్యజతి భూమిశ్చ జన్మనాం శతకం పరం | శ్రీ మాంశ్చ ధనవాంశ్చైన పుత్రవాంశ్చ ప్రజేశ్వరః || 38 ఎవరు సస్యశ్యామలమైన భూమిని భక్తితో బ్రాహ్మణునకు పుణ్యక్షేత్రమునకు వెళ్ళినపుడు దానము చేయుదురో వారు వైకుంఠమున మన్వంతర కాలముందురు. తిరిగి భూమిపై మానవుడై పుట్టినపుడు అధిక భూమి కలవాడగును. అతడు నూరు జన్మలవరకు చక్కని భూమిని, ధనమును, పుత్రులను, అధికారము కలిగియుండును. సప్రజం చ ప్రకృష్ణం చ గ్రామం దద్యాత్ ద్విజాతయే | లక్ష మన్వంతరం కాలం వైకుంఠే సమహీయతే || 39 పునః స్వయోనిం సంప్రాప్య గ్రామలక్షం లభేత్ ధ్రువం | న జహాతి చ తం పృథ్వీ జన్మనాం లక్షమేవచ || 40 ప్రజలున్న గొప్ప గ్రామమును బ్రాహ్మణునకు దానము చేసినచో అతడు లక్ష మన్వంతరముల వరకు వైకుంఠమున నుండును. తిరిగి మానవ జన్మనెత్తినచో లక్షగ్రామములకు అధిపతి కాగలడు. ఆ విధముగా లక్షజన్మల వరకు అనేక గ్రామముల కధిపతియగును. సప్రజం సుప్రకృష్టం చ పంచ సస్య సమన్వితం | నానా పుష్కరిణీ వృక్షఫలభోగ సమన్వితం || 41 నగరం యశ్చ విప్రాయ దదాతి భారతే భువి | మహీయతే సవైకుంఠే దశలక్షేంద్ర కాలకం || 42 పునః స్వయోనిం సంపాప్య రాజేంద్రో భారతే భ##వేత్ | నగరాణాం చ నియుతం లభ##తే నాత్ర సంశయః || 43 ధరా తం న జహాత్యేవ జన్మనాం నియుతం ధ్రువం | పరమైశ్వర్య సంయుక్తో భ##వేదేవ మహీతలే || 44 ప్రజలు, చక్కని సస్యములు, అనేక పుష్కరిణులు, ఫలవృక్షములు గల గొప్పని నగరమును బ్రాహ్మణునకు దానము చేసినచో అతడు పదిలక్షల ఇంద్రుల వరకు వైకుంఠముననుండును. తరువాత తిరిగి భూమిపై మానవుడుగా జన్మించినప్పుడు నియుత (నూరుకోట్ల)నగరములకు రాజేంద్రుడగును. ఆ విధముగా నూరుకోట్ల జన్మల వరకు గొప్పని ఐశ్యర్యమును, అధికారమును పొందును. నగరాణాం చ శతకం దేశం యో హి ద్విజాతయే | సుప్రకృష్ణ ప్రజాయుక్తం దదాతి భక్తి పూర్వకం || 45 వాపీ తడాగ సంయుక్త నానావృక్ష సమన్వితం | మహీయతే స వైకుంఠే కోటి మన్వంతరావధి || 46 పునః స్వయోనిం సంప్రాస్య జంభూద్విప పతిర్భవేత్ | పరమేశ్వర్య సంయుక్తో యథా శక్రస్తథా భువి || 47 మహీ తం న జహాతేవ జన్మనాం కోటిమేవచ | కల్పాంతజీవి స భ##వేత్ రాజరాజేశ్వరో మహాన్ || 48 బావులు, చెరువుల, అనేక వృక్షములు,మంచి స్వభాముగల నూరు నగరములున్న దేశమును బ్రాహ్మణునకు దానము చేసినచో అతడు కోటి మన్వంతరముల వరకు వైకుంఠమున గౌరవమునందుకొనును. తిరిగి మానవ జన్మనెత్తినప్పుడు ఈ జంభూద్వీపమున కధిపతియై, దేవేంద్రుని వలె పరమైశ్వర్య సంపన్నుడగును. అతడు కోటిజన్మలవరకు గొప్ప చక్రవర్తియై యుండును. స్వాధికారం సమగ్రం చ యో దదాతి ద్విజాతయే | చతుర్గుణ ఫలం చాతో భ##వేత్తస్య న సంశయః || 49 జంబూద్వీపం యో దదాతి బ్రాహ్మణాయ పతివ్రతే | ఫలం శతగుణం చాతో భ##వేత్తస్య న సంశయః || 50 సప్తద్వీప మహీదాతు ః సర్వ తీర్థానుసేవినః | సర్వేషాం తపసాం కర్తుః సర్వోపవాస కారిణః || 51 సర్వదాన ప్రదాతుశ్చ సిద్దేశ్వరస్య చ | అస్త్యేవ పునరావృత్తిః న భక్తస్య హరే రహో || 52 అసంఖ్య బ్రాహ్మణాం పాతం పశ్యంతి వైష్ణవాః సతి | నివసంతి హి గోలోకే వైకుంఠేవా హరేః పదే || 53 విష్ణు మంత్రోపాసకాశ్చ విహాయ మానవీం తనుం | బిభర్తి దివ్యరూపం చ జన్మమృత్యు జరాపహం || 54 లబ్ద్వా విష్ణోశ్చ సారూప్యం విష్ణుసేవాం కరోతి చ | స చ పశ్యతి గోలోకే హ్యసంఖ్యం ప్రాకృతం లయం || 55 నశ్యంతి దేవాః సిద్ధాశ్చ విశ్వాసి నిఖిలాని చ | కృష్ణభక్తా న నశ్యంతి జన్మమృత్యు జరాహరాః || తన యధికారమునంతయు బ్రాహ్మణునకు దానము చేసినచో, నూరునగరములున్న దేశమును దానము చేసిన వ్యక్తి తనయధికారమునంతయు దానము చేసిన వ్యక్తి కంటే నూరు రెట్లు ఎక్కువ ఫలితమును పొందును. సప్తదీపములన్నిటిని దానము చేసిన వానికైనా సమస్త పుణ్యతీర్థములను సేవించినా వానికైనా, అన్నవిధములైన తపస్సు చేసిన వానికైనా, అన్ని విధములైన దానములను చేసిన వానికైనా, సమస్త సిద్ధులు పొందిన వానికైనా పునర్జన్మ ఉన్నది కాని శ్రీహరి భక్తునకు పునర్జన్మలేదు. ఆ వైష్ణవులు అసంఖ్యాకమైన బ్రాహ్మదేవుల మరణమును చూచెదరు. వారు శ్రీహరి లోకమగు వైకుంఠమున గాని, గోలోకమున గాని నివసింతురు, విష్ణుమంత్రోపాసకులగు వైష్ణవులు చనిపోయిన తరువాత జన్మ, మృత్యు, జరలు లేని దివ్యరూపమును ధరించి శ్రీహరి సారూప్యమును పొంది విష్ణుసేవను చేయుచుందురు. వారు గోలోకమున చాల కాలమునుండి అనేక ప్రాకృతులయములను చూచెదరు. దేవతలు, సిద్ధులు, సమస్త ప్రపంచములు నశించునుగాని శ్రీకృష్ణభక్తులకు మాత్రము చావులేదు. వారికి ముసలితనము, చావు పుట్టుకలుండవు. కార్తికే తులసి దానం కరోతి హరయే చ యః | యుగం పత్రప్రమాణం చ మోదతే హరిమందిరే || 57 పునః స్వయోనిం సంప్రాప్య హరిభక్తిం లభేత్ ధ్రువం | సుఖీ చ చిరజీవీచ సభ##వేద్భారతే భువి || 58 కార్తిక మాసమున శ్రీహరిని తులసితో పూజచేసిన వారు వారు పూజించిన తులసి పత్ర సంఖ్యగల యుగములు శ్రీహరి సన్నిధిలో నుందురు. తిరిగి మానవులై పుట్టినను శ్రీహరి భక్తి కలిగి చిరంజీవులై సుఖముగా నుందురు. ఘృత ప్రదీపం హరయే కార్తికే యో దదాతి చ | పల ప్రమాణం వర్షంచ మోదతే హరిమందిరే || 59 పునః స్వయోని సంప్రాప్య విష్ణుభక్తి లభేత్ ధ్రువం | మహాధనాఢ్యః సభ##వేత్ చక్షుష్మాంశ్చైవ దీప్తిమాన్ || 60 కార్తిక మాసమున శ్రీహరికి నేతి దీపమును పెట్టినచో ఆ నేయి ఎన్ని ఫలములు గలదో (పలము ద్రవ వస్తువులను కొలచు ఒక చిన్న కొలత) అన్ని సంవత్సరములు శ్రీవారి సమీపమున నుండి పునర్జన్మ నెత్తినప్పుడు విష్ణుభక్తి కలిగిన ధనవంతుడగును. మాఘే యః స్నాతి గంగాయామరుణోదయ కాలతః | యుగ షష్టి సహస్రాణి మోదతే హరిమందిరే || 61 పునః స్వయోనిం సంప్రాప్య విష్ణుభక్తి లభేత్ ధ్రువం | జితేంద్రియాణాం ప్రవరః సభ##వేద్భారతే భువి || 62 మాఘే యః స్నాతి గంగాయాం ప్రయాగే చారుణోదయే | వైకుంఠే మోదతే సోZపి లక్షమన్వంత రావధి || 63 పునః స్వయోనిం సంప్రాప్య విష్ణుమంత్రం లభేత్ ధ్రువం | త్వక్త్వాచ మానుషం దేహం పున ర్యాతి హరేః పదం || 64 నాస్తి తత్పున రావృత్తిః వైకుంఠాచ్చ మహీతలే | కరోతి హరి దాస్యం చ లబ్ధ్వా సారూప్యమేవ చ || 65 నిత్యస్నాయీ చ గంగాయాం స పూతః సూర్యవద్భువి | పదే పదేZశ్వమేధస్య లభ##తే నిశ్చితం ఫలం || 66 తసై#్యవ పాదరజసా సద్యః పూతా వసుంధరా | మోదతే స చ వైకుంఠే యావచ్చంద్ర దివాకరౌ || 67 పునః స్వియోనిం స్రపాస్య తపస్వి ప్రవరోభ##వేత్ | స్వధర్మ నిరతః శుద్దో విద్వాంశ్చ సుజితేంద్రియః || 68 మాఘమాసమున గంగానదిలో అరుణోదయకాలమందు స్నానము చేసినవాడు అరువది వేల యుగములు వైకుంఠమున నుండును. అతడు తిరిగి మానవ జన్మనెత్తి నను జితేంద్రియుడై శ్రీహరి భక్తిని పొందును. మాఘమాసమున ప్రయాగయందు అరుణోదయ కాలమున గంగాస్నానము చేసినవాడు లక్షమన్వంతరముల వరకు వైకుంఠముననుండును. తిరిగి మానవజన్మ నెత్తినప్పుడు విష్ణుమంత్రమును పొంది చనిపోయిన తరువాత వారి దాస్యమును పొంది సారూప్య ముక్తిని పొందును. గంగానదిలో ప్రతి దినము స్నానము చేసినచో సూర్యుని వలె పవిత్రుడై మాటిమాటికి అశ్వమేధయాగ ఫలితమును పొందును. అతడు వైకుంఠమున సూర్యచంద్రులున్నంత వరకుండి తిరిగి మానవజన్మనెత్తినచో స్వధర్మనిరతుడై, విద్వాంసుడై, జితేంద్రియుడై మహాతపస్వి కాగలడు. మీనకర్కట యోర్మధ్యే తపతి భాస్కరే | భారతే యే దదాత్యేవ జలమేవ సువాసితం || 69 మోదతే స చ వైకుంఠే యావదింద్రాశ్చతుర్దశ | పునః స్వయోనిం సంప్రాప్య రూపంవాంశ్చ సుఖీ భ##వేత్ || 70 మీన కర్కట సంక్రమణముల మధ్య (ఫాల్గుణ మాసము, ఆషాడ మాసముల మధ్య) ఎండలు బాగా ఉన్నప్పుడు చల్లని సువాసనాభరితమైన నీటిని పోయువాడు ఇంద్రులు పదునలుగురు గతించు వరకు వైకుంఠములో నుండును. తిరిగి మానవ జన్మనెత్తినప్పడు చక్కని రూపు కలవాడై సుఖముగా నుండును. వైశాఖే హరయే భక్త్యా యే దదాతి చ చందనం | యుగషష్టి సహస్రాణి మోదతే విస్ణుమందిరే || 71 వైశాఖే సక్తుదానం చ యః కరోతి ద్విజాతయే | సక్తురేణు ప్రమాణాబ్దం మోదతే విష్ణుమందిరే || 72 కరోతి భారతే యోహి కృష్ణజన్మాష్టమీ వ్రతం | శత జన్మ కృతాత్పాపాత్ ముచ్యతే నాత్రం సంశయః || 73 వైకుంఠే మోదతే సోZపి యావదింద్రిశ్చతుర్దశ | పునః స్వయోనిం సంప్రాప్య కృష్ణభక్తిం లభేత్ ధ్రువం || 74 ఇహైవ భారతే వర్షే శివరాత్రిం కరోతి యః | మోదతే శివలోకే చ సప్తమన్వంతరావధి || 75 శివాయ శివరాత్రౌ చ బిల్వపత్రం దదాతి యః | పత్ర ప్రమాణం చ యుగం మోదతే శివమందిరే || 76 పునః స్వయోనిం సంప్రాప్య శివభక్తిం లభేత్ ధ్రువం | విద్యావాన్ పుత్రవాన్ శ్రీమాన్ ప్రజావాన్ భూమివాన్ భ##వేత్ || 77 చైత్రమాసేZ థవా మాఘే శంకరం యోZర్చయే ద్ర్వతీ | కరోతి నర్తనం భక్త్వా వేత్రపాణిర్దివానిశం || 78 మాసం వాప్యర్థ మాసం వాZప్యర్ధమాసం వా దశ స్తదినాని వా | దినమానం యుగం సోZపి శివలోకే మహీయతే || 79 వైశాఖమాసమును శ్రీహరికి చందనపసేవ చేసినచో అరువై వేల యుగములు వైకుంఠమున విష్ణుమందిరమున నుండును. తరువాత మానవ జన్మ నెత్తినప్పుడతను సుఖముగా నుండును. అట్లే వైశాఖమాసమున బ్రాహ్మణులకు సత్తుపిండిని దానము చేసినచో ఆ సత్తుపిండిలో ఎన్ని రేణువులున్నవో అన్ని సంవత్సరములు వైకుంఠమున శ్రీహరి మందిరమున నుండును. శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతముచేసినచో నూరు జన్మలలో చేసిన పాపములు నశించును. అతడు పదునాలుగురు ఇంద్రుల కాలము వరకు వైకుంఠమున నుండి తిరిగి మానవుడై పుట్టినపుడు తప్పక శ్రీకృష్ణభక్తిని పొందును. ఈ భారత వర్షమున శివరాత్రి వ్రతము చేయువాడు ఏడు మన్వంతరముల వరకు శివలోకమైన కైలాసమున నుండును. శివరాత్రి దినమున శివుని బిల్వపత్రములతో పూజించినచో ఎన్ని పత్రములతో అతడు శివపూజ చేసెనో అన్ని యుగములు కైలాసమున శివుని మందిరమున నుండను. తరువాత తిరిగి మానవుడుగా జన్మనెత్తినపుడు శివభక్తిని, విద్యను, పుత్రపౌత్ర సంపదను, ధన ధాన్య సంపదను, భూసంపదను పొందును. అదే విధముగ చైత్రమాసమున లేక మాఘమాసమున వ్ర తదీక్షపూని శివుని పూజించినచో అతడు శివలోకమున శివమందిరము ముందు వేత్రపాణియై శివభటుడగుచున్నాడు. లేక పై రెండు నెలలలో నెలయుంతయు లేక పక్షము దినములైనా, పది దినములైనా చిరవకు వారము దినములైనా శివార్చన చేసినచో ఎన్నిదినములు శివపూజ చేసెనో అన్ని యుగములు కైలాసమున గౌరవింపబడును. శ్రీరామనవమీ యోహీ కరోతి భారతే నరః | సప్తమన్వంతరం యావత్‌మోదతే విష్ణుమందిరే || 80 పునః స్వయోనిం సంప్రాప్య రామభక్తిం లభేత్ ధ్రువం | జితేంద్రియాణాం ప్రవరో మహాంశ్చ ధార్మికో భ##వేత్ || 81 శ్రీరామనవమీ వ్రతమును దీక్షపూని ఎవరు చేయుదురో వారు ఏడు మన్వంతరముల కాలము వైకుంఠమున విష్ణుమందిరమున నుందురు. ఆ తరువాత మానవ జన్మనెత్తినప్పుడు రామభక్తుడై జితేంద్రియుడై, మహాధార్మికుడగును. శారదీయం మహాపూజాం ప్రకృతేర్యః కరోతి చ | మహిషైః ఛాగలైర్మేషైః ఇక్షుకూష్మాండకైస్తథా || 82 నైవేద్యైరూపహారైశ్చ ధూప దీపాదిభిస్తథా | నృత్యగీతాదిభిర్వాద్యైః నానా కౌతుకమంగళైః || 83 శివలోకే వసేత్సోZపి సప్తమన్వంతరావధి | పునః స్వయోని సంప్రాప్య బుద్ధిచ నిర్మలాం లభేత్ || 84 అచలాం శ్రియమాప్నోతి పుత్ర పౌత్రాదివర్ధనీం | మహాప్రభావయుక్తశ్చ గజవాజి సమన్వితః || 85 రాజరాజేశ్వరః సోZపి భ##వేదేవ న సంశయః | శరత్కాలమున అశ్వయుజమాసమున ప్రకృతియగు దుర్గాపూజను దున్నపోతులు, గొఱ్ఱలు, మేకలు, చెరకుగడలు, గుమ్మడికాయలు, నైవేద్యములు, ఉపహారములు, ధూపధీపాదులు, వాద్యములు, నృత్య గీతాదులతో చేసినచో అతడు కూడా ఏడు మన్వంతరముల వరకు శివలోకమైన కైలాసమున ఉండును. ఆ తరువాత తిరిగి, మానవ జన్మనెత్తినప్పుడు నిర్మలమైన బుద్ధిని, పుత్రపౌత్రులను, అంతులేని సంపదను, చతురంగబలమును కలిగి మహాప్రభావ సంపన్నుడైన చక్రవర్తి కాగలడు. భాద్రశుక్లాష్టమీ ప్రాప్య మహాలక్ష్మీంచ యోZ ర్చయేత్ || 86 నిత్యం భక్త్వా పక్షమేకం పుణ్యక్షేత్రే చ భారతే | దత్వా తసై#్య ప్రకృష్టాని చోపచారాణి షోడశ || 87 వైకుంఠే మోదతే సోZపి యావచ్చంద్ర దివాకరౌ | పునః స్వయోనిం సంప్రాప్య రాజరాజేశ్వరో భ##వేత్ || 88 కార్తికీ పూర్ణిమాయాం చ కృత్వాతు రాసమండలం | గోపానాం శతకం కృత్వా గోపీనాం శతకం తథా || 89 శిలాయాం ప్రతిమాయాం వా శ్రీ కృష్ణం రాధయా సహ | భారతే పూజయేద్దత్వా చోపచారాణి షోడశ || 90 గోలోకే చ వసేత్సోZపి యావద్వై బ్రాహ్మణో వయః | భారతం పునరాగత్య హరిభక్తిం లభేత్ ధ్రువం || 91 క్రమేణ సుదృఢాం భక్తిం లబ్ద్వా మంత్రం హరేరపి | దేహం త్వక్త్వా చ గోలోకం పునరేవ ప్రయాతి సః || 92 తత్ర కృష్ణస్య సారూప్యం సంప్రాప్య పార్షదో భ##వేత్ | పునస్తత్పతనం నాస్తి జరామృత్యుహరో మహాన్ || 93 శుక్లాం వాప్యథవా కృష్ణాం కరోత్యేకాదశీం చ యః | వైకుంఠే మోదతే సోZపి యావద్వై బ్రాహ్మణో వయః || 94 భారతం పునరాగత్య హరిభక్తిం లభేత్ ధ్రువం | పునర్యాతి చ వైకుంఠం న తస్య పతనం భ##వేత్ || 95 భాద్రమాసమున శుద్ధాష్టమినాడు మహాలక్ష్మిని ఒక పుణ్యక్షేత్రమున పక్షము వరకు షోడశోపచారములతో అర్చన చేసినచో అతడు సూర్యచంద్రులున్నంత వరకు వైకుంఠమున నివసించును తరువాత తిరిగి మానవ జన్మనెత్తినపుడు చక్రవర్తి కాగలడు. కార్తీక మాసమున పూర్ణిమనాడు కొందరు పురుషులకు గోపకుల వేషమును, కొందరు స్త్రీలకు గోపికల వేషమును వేసి రాసమండలము నిర్మించి రాధా సహితుడైన శ్రీకృష్ణుని ప్రతిమను అర్ఘ్య పాద్య ధూపదీపాది షోడశోపచారములతో అర్చించినచో బ్రహ్మదేవుడు బ్రతికియుండువరకు గోలోకమున నివసించును. తరువాత తిరిగి మానవుడై పుట్టినప్పుడు శ్రీహరి భక్తి కలవాడై శ్రీహరి మంత్రోపదేశమును పొంది శరీర త్యాగమును చేసినప్పుడు గోలోకమునకు వెళ్ళి అచ్చట శ్రీకృష్ణసారూప్యమును పొంది శ్రీకృష్ణునకు అనుచరుడు కాగలడు. అతనికి పునర్జన్మకాని, ముసలితనముకాని, చావుగాని యుండవు. ఏకాదశి వ్రతమును ఎవరు చేయుదురో అతడు బ్రహ్మదేవుని జీవిత కాలపర్యంతము వైకుంఠమున సుఖముగా నుండును. అటుపిమ్మట తిరిగి మానవుడై పుట్టినప్పడు శ్రీహరిభక్తిని పొంది చనిపోయిన తరువాత శాశ్వతముగా వైకుంఠముననుండును. అతనికి పునర్జన్మ అనునదసలే యుండదు. భాద్రేశుక్లే చ ద్వాదశ్యాం యః శుక్రం పూజయేన్నరః | షష్టి వర్ష సహస్రాణి శక్రలోకే మహీయతే || 96 రవివారేZర్క సంక్రాంత్యాం సప్తమ్యాం శుక్లపక్షతః | సంపూజ్యార్కం హనవిష్యాన్నం యః కరోతి చ భారతే || 97 మహీయతే సోZర్కలోకే యావచ్చంద్ర దివాకరౌ | భారతం పునరాగత్య చారోగీ శ్రీయుతో భ##వేత్ || 98 భాద్రపద శుద్ధ ద్వాదశినాడు ఇంద్రుని పూజించినచో అరవై వేల సంవత్సరములు స్వర్గలోకమున పూజ్యుడై వెలుగును. ఆదివారమున, సూర్య సంక్రమణమునాడు, శుద్ధసప్తమి నాడు సూర్యుని పూజించి అతనకి నైవేద్యమునిచ్చినచో సూర్యలోకమున సూర్యచంద్రులున్నంతవరకుండును. తిరిగి మానవజన్మనెత్తినను ఆరోగ్యవంతుడై ధనధాన్యములతో తులదూగును. జ్యేష్ఠ శుక్ల చతుర్దశ్యాం సావిత్రీం యోZహీ పూజయేత్ | మహీయతే బ్రహ్మలోకే సప్తమన్వంతరావధి || 99 పునర్మహీం సమాగత్య శ్రీమానతుల విక్రమః | చిరజీవి భ##వేత్సోZపి జ్ఞానవాన్ సంపదాయుత ః || 100 మాఘస్య శుక్ల పంచమ్యాం పూజయేద్యః సరస్వతీం | సంయతో భక్తితో దత్వా చోపచారాణి షోడశ || 101 మహీయతే స వై కుంఠే యావద్ర్భహ్మ దివానిశం | సంప్రాప్య చ పునర్జన్మ స భ##వేత్కవి పండితః || 102 గాం సువర్ణాదికం యేZహి బ్రాహ్మణాయ దదాతిచ | నిత్యం జీవన పర్యంతం భక్తి యుక్తశ్చ భారతే || 103 గవాం లోను ప్రమాణాబ్దం ద్విగుణం విష్ణుమందిరే | మోదతే హరిణా సార్థం క్రీడా కౌతుక మంగళైః || 104 తతః పునరిహాగత్య విష్ణుభక్తిం లభేత్ ధ్రువం | తతః పునరిహాగత్యా రాజ రాజేశ్వరో భ##వేత్ || 105 గోమాంశ్చ పుత్రవాన్ విద్యాన్ జ్ఞానవాన్ సర్వతుః సుఖీ || 105 జ్యేష్ఠమాసమునందలి శుద్ధ చతుర్దశినాడు సావిత్రీదేవిని పూజించినచో బ్రహ్మలోకమున ఏడు మన్వంతరముల వరకు గౌరవము నందుకొనును. అతడు మరల జన్మనెత్తిన ధనవంతుడు, అమితవిక్రమ సంపన్నుడు, చిరంజీవి, మిక్కిలి జ్ఞానవంతుడు అగును. మాఘమాసమునందలి శుద్ధ పంచమినాడు (శ్రీపంచమి) సరస్వతీ దేవిని భక్తితో షోడశోపచారములతో పూజించినచో బ్రహ్మ యుండునంతవరకు వైకుంఠమును నుండను. ఆ తరువాత మానవజన్మ నెత్తిననను కవిగానో పండితుడిగానో అగును. ఆవును, బంగారు మొదలగు వస్తువులను బ్రాహ్మణులకు దానము చేసినచో నిత్యము భక్తిగల ఆ వ్యక్తి ఆవు శరీరమున నున్న వెంట్రుకల సంఖ్యకు రెట్టింపు సంవత్సరములు వైకుంఠమున విష్ణుదేవుని మందిరమున శ్రీహరితో కలిసి యుండును. తరువాత తిరిగి భూమిపై జన్మించినను విష్ణుభక్తుడై గొప్ప చక్రవర్తి కాగలడు. గొప్పజ్ఞానము కలిగి విద్వాంసుడుగా కూడా ప్రసిద్ధి చెందును. భోజయోధ్యోహీ ఘృష్టాన్నం బ్రాహ్మణభ్యశ్న భారతే | విప్రలోను ప్రమాణాబ్దం మొదతే విష్ణమందిరే || 106 తతః పునరిహాగత్య పసుఖీ ధనవాన్భవేత్ | విద్యవాన్ సుచిరజీవీ చ శ్రీ మానతుల విక్రమః || 107 యో వక్తి నా దదాత్యేవ హరేర్నామాని భారతే | యుగనామ ప్రమాణం చ విష్ణులోకే మహీయతే || 108 తతః పునరిహాగత్య విష్ణుభక్తిం లభేత్ ధ్రువం | యది నారాయణ క్షేత్రే ఫలం కోటి గుణం లభేత్ || 109 నామ్నాం కోటిం హరే ర్యోహి క్షేత్రే నారాయణ జపేత్ | సర్వపాప వినిర్ముక్తో జీవన్ముక్తో భవత్ ధ్రువం || 110 లభ##తే న పునర్జన్మ వైకుంఠే స మహీయతే | లభేద్విష్టోశ్చ సారూప్యం న తస్య పతనం భ##వేత్ || 111 బ్రాహ్మణులకు మృష్టాన్నమును పెట్టినచో ఆ బ్రాహ్మణుల శరీరములందెన్ని వెంట్రుకలున్నచో అన్ని సంవత్సరములు వైకుంఠమున సుఖపడును. ఆ తరువాత తిరిగి భూమిపై మానవ జన్మనెత్తినప్పుడు ధనవంతుడై మిక్కిలి సుఖపడును. ఇంకను విద్వాసుడు, మంచి పరాక్రమవంతుడు చిరంజీవి కూడ అగును. ఎవరు శ్రీహరి నామములను సదా ఉచ్చరింతురో, వారు ఉచ్చరించిన నామముల సంఖ్య ఎంతుండునో అన్ని యుగములు వైకుంఠమున సుఖముగానుందురు. తరువాత తిరిగి మానవ జన్మనెత్తి నప్పుడు తప్పక విష్ణుభక్తిని పొందుదురు. ఇదే శ్రీహరి నివసించు పుణ్యక్షేత్రమున చేసినచో ఫలితము కోటి రెట్లెక్కువ ఉండును. అట్లే శ్రీహరి ఉండు పుణ్యక్షేత్రమున శ్రీహరి నామములను కోటి మార్లు జపించినచో అతడు సమస్య పాపరహితడై జీవన్ముక్తడుగను. అతడి పునర్జన్మ వుండదు. వైకుంఠమున శ్రీహరి సారూప్యమును పొందును. యః శిం పూజయేన్నిత్యం కృత్వా లింగం చ పార్దివం | యవజ్జీవన పర్యంతం స యాతి శివ మందిరం || 112 మృదాం రేణు ప్రమాణాబ్దం శిలోకే మహీయతే | తతః పునరిహగత్య రాజేంద్రో భారతే భ##వేత్ || 113 మట్టితో శివలింగమును చేసి ప్రతిదినము శివుని ఆర్చించినచో మట్టి రేణువులెన్ని కలవో అన్ని సంవత్సరములు శిలోకమున గౌరవమునందును. అతడు తిరిగి భూలోకమున మానవజన్మనెత్తినప్పుడు మహారాజపదవిని పొందును. శిలాం చ యోర్చయేన్నిత్యం శిలాతోయం చ భక్షతీ | మహీయతే స వైకుంఠే యావద్వై బ్రాహ్మణ ః శతం || 114 తతో లబ్ద్వా పునర్జన్మ హరిభక్తిం సుదుర్లభాం | మహీయతే విష్ణులోకే న తస్య పతనం భ##వేత్ || 115 తపాంసి చైవ సర్వాణి ప్రతాని నిఖిలాని చ | కృత్వా తిష్టతి వైకుంఠే యావదింద్రాశ్చతుర్దశ || 116 తతో లబ్ద్వా పునర్జన్మ రాజేంద్రో భారతే భ##వేత్ | తతో ముక్తో భ##వేత్పశ్చాత్ పునర్జన్మ న విద్యతే || 117 ప్రతిదినము సాలగ్రమ పూజ చేసి సాలగ్రాభిషేక తీర్థమును తీసికొన్నచో నూరుగురు బ్రహ్మల కాలము వైకుంఠమును సుఖముగా నుండును. తరువాత పునర్జన్మ పొందిననప్పుడు మిక్కిలి దుర్లభ##మైన హరి భక్తి తరువాత వైకుంఠమున శాశ్వత సుఖములభించును. అన్ని విధములైన తపస్సులు అన్ని విధములైన వ్రతములాచారించినచో వైకుంఠమున పదునలుగురు ఇంద్రుల కాలము వరకు ఉండును. తరువాత భారతదేశమున తిరిగి జన్మించి మహారాజగును. ఆ తర్వాత అతడు ముక్తిని చెందును. అప్పుడతనికి పునర్జన్మ కలుగదు. యః స్నాతి సర్వ తీర్థేషు భువికృత్వా ప్రదక్షిణం | స చ నిర్వణాతాం యాతి న తజ్జన్మ భువేద్భుని || 118 పుణ్యక్షేత్రే భారతే చ యోశ్వమేధం కరోతి చ | అశ్వలోను ప్రమాణాబ్దం శక్రస్వార్దాసనే వసేత్ || 119 చతుర్గుణం రాజసూయే ఫలమాప్నోతి మనావః | నరమేధ్యేశ్వధ్ధార్థం గోమేటిచ తదేవ చ || 120 పుత్రేష్టా చ తదర్థంచ సుపుత్రం చ లభేత్ ధ్రువం | లభ##తే లాంగలేష్టా చ గోమేధ సదృశం ఫలం || 121 తత్సమానం చ విప్రేష్టౌ వృద్దియాగే చ తత్పలం | పద్మయజ్జే తదర్ధంత ఫలమాప్నోతి మానవః || 122 విశోకి చ విశోకం చ పద్మార్థం స్వర్గమశ్నుతే | విజయే విజయీ రాజా స్వర్గం పద్మసమం భ##వేత్ || 123 ప్రాజాపత్యే ప్రజాలాభో భూభృతాం భ##వేత్ | ఇహ రాజశ్రీ లబ్ద్వా పద్మార్దం స్వర్గమశ్నుతే || బుదియాగే మహైశ్వర్యం స్వర్గం పద్మసమం భ##వేత్ || 124 ఎవరు సమస్త తీర్థములలో స్నానము చేయుదురో వారు ముక్తిని పొందురు. వారికి పునర్జన్మ అనునది లేనేలేదు. పుణ్యక్షేత్రమైన భారత దేశమున అశ్వమేధయాగము చేసినవారు ఆ అశ్వమునకు ఎన్ని రోమమలున్నవో అన్ని సంవత్సరములు దేవేంద్రుని అర్ధాసనమున కూర్చొని ఇంద్రునితో సమానులగుదురు. రాజసూయయాగము చేసినచో అశ్వమేధయాగము కంటే నాల్గురెట్లు ఎక్కువ ఫలములభించును. నరమేధము చేసినను, గోమేధము చేసిననను అశ్వమేధయాగ ఫలములోసగము ఫలితమును మాత్రమును పొందుదురు. పుత్రకామేష్టి యాగము చేసినచో సుపుత్రుడు కలుగును కాని నరమేధమునకు లభించు ఫలములో సగము మాత్రము లభించును. లాంగలేష్టియందు గోమేధముతో సమానఫలము లభించును. అట్లే విప్రేష్టియందు, వృద్ధియాగమున కూడా గోమేధ పలితములభించును. పద్మయజ్ఞమున వృద్ధియాగఫలములో అర్ధ ఫలితమే లభించును. విశోక యజ్ఞమువలన దుఃఖనాశనము జరుగును. కాని స్వర్గఫలము మాత్రము పద్మయాగ ఫలములో సగభాగమే లభించును. విజయ యాగములో రాజువిజయమును పొందును. పద్మయాగఫలముతో సమానమైన స్వర్గఫలము లభించును. ప్రొజాపత్యయాగము వలన సంతానము, రాజులకు అధిక రాజ్యము లభించును. స్వర్గఫలము మాత్రము పద్యయాగఫలములో అర్ధభాగము మాత్రము లభించును. సమృద్ధి యాగమువలన అంతులేని ఐశ్వర్యము, పద్యయాగ ఫలితముతో సమానమైన స్వర్గఫలము లభించును. విష్ణు యజ్ఞః ప్రధానం చ సర్వయజ్ఞేషు సుందరి | బ్రాహ్మణా చ కృతః పూర్వం మహాసంభార సంయుతః || 126 యతో హేతోర్దక్షయజ్ఞం బభంజ చంద్రశేఖరః | చకార విష్ణుయజ్ఞం చ పురా దక్షప్రజాపతిః || 127 ధర్మశ్చ కశ్చపశ్చైవ శేషశ్చాపి చ కర్దమః | స్వాయంభునో మనుశ్చైవ తత్పుత్రశ్చ ప్రియవ్రతః || 128 శివః సవత్కుమారశ్చ కపిలశ్చ ధ్రువస్తథా | రాజసూయ సహస్రాణాం సమృద్ద్యా చ క్రతుర్బవేత్ || 129 రాజసూయ సహస్రాణాం ఫలమాప్నోతి నిశ్చితం | విష్ణుయజ్ఞాత్సరో యజ్ఞో నాస్తి వేదే ఫల ప్రదః || 130 బహు కల్పాంత జీవి చ జీవన్ముక్తో భ##వేత్ ద్రువం | జ్ఞానేన తేజసా చైవ విష్ణుతుల్యో భ##వేదిహ || 131 అన్ని యజ్ఞములలో నారాయణ యజ్ఞము చాలా గొప్పది. దీనిని పూర్వము బ్రహ్మదేవుడు అనేక సంభారములతో చేసెను. అక్కడనే దక్షునకు శకంరునకు కలహమేర్పడినది. అప్పుడు అల్లరి చేసిన నందీశ్వరుని బ్రాహ్మణులు శపించిరి. నందీశ్వరుడు కూడాకోపముతో బ్రాహ్మణులనందరిని శపించెను. అందువలనే శంకరుడు డా యజ్ఞమును నాశనము చేసెను. పూర్వము దక్షప్రజాపతి కూడా ఈ విష్ణుయజ్ఞమునాచరించెను. ఆ యజ్ఞమునకు ధర్మదేవత, కశ్యపుడు, ఆదిశేషుడు, కర్దమ మహర్షి, స్వాయంభువ మనువు, అతని పుత్రుడగు ప్రియవ్రతుడు, శివుడు, సనత్కుమారుడు, పిలుడు, ధ్రువుడు మొదలగువారు వచ్చిరి. నారాయణ క్రతువు చేయవలెననిన వేయి అశ్వమేధయాగములుచేయుటకు కావలసిన వస్తువులు కావలెను. అట్లే ఆ యజ్ఞమువలన వేయ్యి అశ్వమేధయాగములుచేసినంత ఫలము లభించగలదు. ఇట్టి విష్ణుయజ్ఞమును మించిన యజ్ఞము వేదములలోనే కన్పించదు. ఆ యజ్ఞఃము చేసిన వాడు అనేక కల్పాంతరముల వరకు జీవించి యుండును. జీవన్ముక్తుడు కూడా అగుచున్నాడు. అతడు జ్ఞానమున, తేజస్సుతో విష్ణుమూర్తితో సమానుడగుచున్నాడు. దేవానాం చ యథా విష్ణుః వైష్ణనానాం యథా శివః | శాస్త్రాణాం చ యథా వేదా ః ఆశ్రమానాం చ బ్రాహ్మణాః || 132 తీర్థానాం చ యథా గంగా పవిత్రాణా చ వైష్ణవా ః | ఏకాదశీ వ్రతానాం చ పుష్పాణాం తులసీ యథా || 133 నక్షత్రాణాం యథా చంద్ర ః పక్షిణాం గరుడో యథా | యథా స్త్రీణాం చ ప్రకృతిరాధారాణాం వసుంధరా || 134 శీఘ్రగానాం చేంద్రియాణాం చంచలానాం యథా మనః | ప్రజాపతీనాం బ్రహ్యాచ ప్రజేశానం ప్రజాపతిః || 135 బృందావనం వనానాం చ వర్షాణాం భారతం యథా | శ్రీమతాం చ యథా శ్రీశ్చ విదుషాం చ సరస్వతీ || 136 పతివ్రతానాం దుర్గా చ సౌ భాగ్యానాం చ రాధికా | విష్ణుయజ్ఞస్తథా వత్సే యజ్ఞేషు చ మహానితి || 137 దేవతలందరిలో శ్రీ మహావిష్ణువు, వైష్ణవులలో శంకరుడు, శాస్త్రములన్నిటిలో వేదములు, చతుర్వర్ణములలో బ్రాహ్మణులు, నదులలో గంగానది, పవిత్రమైన వారిలో వైష్ణవులు, వ్రతములన్నిటిలో ఏకాదశీవ్రతము, పుష్పములలో తులసి, నక్షత్రములలో చంద్రుడు, పక్షులలో గరుత్మంతుడు, స్త్రీలలో ప్రకృతి(దుర్గ), ఆధారమగు వస్తువులలో భూమి, శీఘ్రముగా వెళ్ళునని, చంచలములు అగు ఇంద్రియములలో మనస్సు, ప్రజాపతులలో బ్రహ్మదేవుడు, తోటలలో బృందావనము, వర్షములలో భరతవర్షము, శోభకలవారిలో లక్ష్మీదేవి, విద్వాంసులలో సరస్వతి, పతివ్రతలలో దుర్గాదేవి, సౌభాగ్యవతులగు స్త్రీలలో రాధాదేవి, అట్లే యజ్ఞములన్నిటిలో విష్ణుయజ్ఞము చాలా శ్రేష్టమైనది. అశ్వమేధ శ##తేనైవ శక్రత్వం లభ##తే ధ్రువం | సహస్రేణ విష్ణుపదం సంప్రాప పృథురేవచ || 138 స్నానం చ సర్వతీర్థేషు సర్వ యజ్ఞేషు దీక్షణం | సర్వేషాం వ్రతానాం చ తపసాం ఫలమేవ చ || 139 పాఠశ్చతుర్ణాం వేదానాం ప్రాదక్షిణ్యం భువస్తథా | ఫలం భీజమిదం సర్వం ముక్తిదం కృష్ణసేవనం || 140 పురాణషు చ వేదేషు చేతిహాసేషు సర్వతః | నిరూపితం సారభూతం కృష్ణపాదాంబుజార్చనం || 141 తద్వర్ణనం చ తద్ధ్వనం తన్నామ గుణ కీర్తనం | తత్‌స్తోత్రం స్మరణం చైవ వందనం జప ఏవచ || 142 తత్పాదోదక నైవేద్య భక్షణం నిత్యమేవ చ | సర్వ సమ్మతమిత్యేవం సర్వేప్సిత మిదం సతి || 143 భజ కృష్ణం పరం బ్రహ్మ నిర్గుణం ప్రకృతేః పరం | గృహాణ స్వమినం వత్సే సుఖం గచ్ఛ స్వమందిరం || 144 అశ్వమేధయాగములు వంద చేసినచో తప్పక ఇంద్రపని లభించును. వేయి అశ్వమేధయాగములు చేసి పృథుమహారాజు వైకుంఠమునకు పోయెను. అన్ని పుణ్యతీర్థముల యందు చేసిన స్నానమునకు, సమస్త యజ్ఞదీక్ష స్వీకరించుటకు, సమస్తవ్రతములకు, సమస్త తపస్సులకు, నాలుగు వేదములను పఠించుటకు, భూప్రదక్షిణమునకు, అన్నిటికిని ముక్తిని కలిగించును. శ్రీకృష్ణపాదసేవనమే ఫలము. ఈ విషయము పురాణములన్నిటిలోను, అన్ని వేదములందును, అన్ని ఇతిహాసములందును కనిపించును. శ్రీకృష్ణుని వర్ణనము, అతనిని ధ్యానించుట, అని నామములను గుణములను కీర్తించుట, ఆ శ్రీకృష్ణుని స్తుతించుట, స్మరించుట, నమస్కరించుట, జపము చేయుట, శ్రీకృష్ణదోదకము, అతని నైవేద్యమును అనుభవించుట అందరకు ఇష్టమైనవి. అందరును సమ్మతమైనవి. అందువలన సావిత్రి ! నిర్గుణుడు, ప్రకృతి కంటే అతీతుడు, పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని సేవింపుము, నీవు నీ భర్త ప్రాణములను తీసికొని సుఖముగా నీ ఇంటికి వెళ్ళుము అని యముడు సావిత్రితో అనెను. ఏతత్తే కథితం సర్వం విపాకం కర్మణాం నృణాం | సర్వేప్సితం సర్వమతం పరం తత్వప్రదం నృణాం || 145 ఓ సావిత్రి ! నీవు కోరుకొన్న కర్మవిపాకమునంతయు నీకు తెల్పితిని. ఇది అందరకు ఇష్టమైనది. అందరు ఒప్పుకొన్నది. మానవులకందరకు పరతత్వమును ఇచ్చునది అని చెప్పెను. ఇతి శ్రీ బ్రహ్మనైవర్తే మహాపురాణ ద్వితీయ ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే సావిత్రీయమ సంవాదే సావిత్ర్యుపాఖ్యానే శుభకర్మ విపాక ప్రకథనం నామ సప్తవింశో೭ధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతిఖండములో నారద, నారాయణుల సంవాదమున తెలుపబడిన సావిత్ర్యుపాఖ్యానమున శుభ కర్మ విపాకములను తెలుపు ఇరువది ఏడవ అధ్యాయము సమాప్తము.