sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అష్టవింశోzధ్యాయః - సావిత్రి చేసిన యమధర్మరాజు స్త్రోత్రము శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడు నారదునితో నిట్లనెను. హరేరుత్కీర్తనం శ్రుత్వా సావిత్రీ యమ వక్త్రతః | సాశ్రునేత్రా సపులకా యమం పునరువాచ సా || 1 యమధర్మరాజు చెప్పిన శ్రీహరి గుణ కీర్తనమును సావిత్రిని ఆనందబాష్పములు రాలగా పులకాంకురిత శరీరయై యమునితో ఇట్లు పలికెను. సావిత్ర్యువాచ- సావిత్రి ఈవిధముగా అనెను- హరేరుత్కీర్తనం ధర్మస్వకులోద్దార కారణం | శ్రోతృణాం చైవ వక్తృణాం జన్మ మృత్యు జరాహరం || 2 దానానాం చ వ్రతానాం చ సిద్దీనాం తపసాం పరం | యోగానాం చైవ వేదానాం సేవనం కీర్తనం హరేః || 3 ముక్తత్వమమరత్వం వా సర్వసిద్దత్వమేనా | శ్రీకృష్ణసేవనసై#్యవ కళాం నార్హంతి షోడశీం || 4 భజామి కేన విధినా శ్రీకృష్ణం ప్రకృతేః పరం | మూఢాం మామబలాం తాత వదనే దవిదాం వర || 5 శుభకర్మ విసాకం చ శ్రుతం వౄణాం మనోహరం | కర్మాzశుభ విపాకం చ తన్మే వ్యాఖ్యాతు మర్హసి || 6 శ్రీమన్నారాయణుని నామ గుణ కీర్తనము చేయువారికి వినువారికి అది జన్మమును, మృత్యువును, ముసలితనమును హరించును. అట్లే ధర్మమును తన కులమును ఉద్ధరించును. శ్రీహరి నామగుణకీర్తనము అన్ని దానములకంటె, వ్రతములకంటె సిద్ధులకంటె, తపస్సుల కంటె, యోగములకంటె, వేదములకంటె చాలా గొప్పది. ముక్తి, అమరత్వము, సమస్తసిద్ధులు శ్రీకృష్ణసేవనమునకు పదహారవ వంతైన కాజాలవు. ప్రకృతికి అతీతుడైన శ్రీకృష్ణుని ఏవిధముగా సేవించవలెనో తెల్పుడు. మీరింతవరకు మానవులు చేయు పుణ్య కర్మల ఫలితమును తెలిపితిరి. అట్లే నాకు అశుభ కర్మల ఫలితమెట్లుండునో తెలుపుడు. ఇత్యుక్తా సా సతీ బ్రహ్మన్ భక్తి నమ్రాత్మకంధరా | తుష్టావ ధర్మరాజం చ వేదోక్తేన స్తవేన చ || 7 ఈవిధముగా సావిత్రి ధర్మరాజుతో అని భక్తితో నమస్కరించి వేదమునందు చెప్పబడిన స్త్రోత్రముచే ఇట్లు స్తుతించెను. సావిత్ర్యువాచ- సావుత్రి ఇట్లనెను- తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా | ధర్మాంశం యం సుతం ప్రాప ధర్మరాజం నమామ్యహం || 8 సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః | అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహం || 9 యేనాంతశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరం | క్రమానురూపకాలేన తం కృతాంతం నమామ్యహం || 10 బిభర్తి దండం దండ్యాయ పాపినాం శుద్ధిహేతవే | నమామి తం దండధరం యః శాస్తా సర్వ కర్మణాం || 11 విశ్వే యః కలయత్యేవ సర్వాయుశ్చాzపి సంతతం | అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహం || 12 తపస్వీ వైష్ణవో ధర్మీ సంయమీ విజితేంద్రియః | జీవినాం కర్మఫలదం తం యమం ప్రణమామ్యహం || 13 స్వాత్మారామం చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భ##వేత్ | పాపినాం క్లేశదో యశ్చ పుణ్యం మిత్రం నమామ్యహం || 14 యజ్ఞన్మ బ్రహ్మణో వంశే జ్వలంతం బ్రహ్మతేజసా | యో ధ్యాయతి పరం బ్రహ్మ బ్రహ్మవంశం నమామ్యహం || 15 పూర్వము సూర్యుడు పుష్కర క్షేత్రమున ధర్మదేవతను ఆరాధించి ధర్మదేవతాంశుడైన కుమారుని కనెను. అతని పేరు ధర్మరాజు. ఆ యమధర్మరాజుకు నమస్కరింతును. సమస్త ప్రాణులయందు పక్షపాత రహితుడై సమానముగా ఉండి ప్రాణులు చేయు సమస్తకర్మలకు సాక్షీభూతుడైన శమనుని నమస్కరింతును. ప్రపంచములోని సమస్త జీవులకు వారివారి కర్మాను రూపమైన సమయమున వారిని అంతమును చేయుచున్నందువలన కృతాంతుడవగు నిన్ను నమస్కరింతును. పాపము చేసిన ప్రాణులను పాపవిముక్తులను చేయుటకు దండన విధించుటకై చేతిలో దండము ధరించున్నందువలన దండధరుడవు అగు నిన్ను నమస్కరించుచున్నాను. ఈ ప్రపంచమున నున్న జంతువుల ఆయుస్సును ఏర్పరచుచున్నందువలన నీవు కాలుడవైతివి. తపమాచరించుచు విష్ణుభక్తుడవై, జితేంద్రియముడవై జీవులు చేసిన కర్మలకు ఫలమును సంయమనముతో ఇచ్చుచున్నందువలన యముడవైతివి. సర్వజ్ఞడు, పుణ్య కర్మలు చేయువారికి స్నేహితుడు, పాపకర్మలు చేయువారికి కష్టములను కల్గించువాడు ఆత్మారాముడవైయుందువు. బ్రహ్మవంశములో పుట్టి బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచు పరబ్రహ్మను ధ్యానించు నిన్ను నమస్కరింతునని సావిత్రి యముని స్తుతించెను. ఇత్యుక్త్యా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే | యమస్తాం విష్ణుభజనం కర్మపాకమువాచ హ || 16 ఈవిధముగా సావిత్రి యమధర్మరాజును భక్తిపూర్వకముగా స్తోత్రము చేయగా యముడు సంతోషించి ఆమెకు విష్ణుమూర్తిని సేవించు విధానమును అశుభకర్మవిపాకమును ఇట్లు చెప్పెను. ఇదం యమాష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ | యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్ప్రముచ్యతే || 17 మహాపాపీ యది పఠేన్నిత్యం భక్త్యా చ నారద | యమః కరోతి తం శుద్ధం కాయవ్యాహేన నిశ్చితం || 18 సావిత్రి యముని స్తుతించిన ఈ యమాష్టకమును ఉదయముననే లేచి చదివినవారికి యముని భయముండదు. అట్లే అతని సమస్త పాపములు నశించిపోవును. ఓనారదా ! దీనిని మిక్కిలి పాపములు చేసినవాడైనా భక్తి శ్రద్ధలతో చదివినచో యముడతనిని పరిశుద్ధుని చేయును అని నారాయణుడు నారదునితో అనెను. ఇతి శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే సావిత్రీ కృతయమస్తోత్రం నామాష్టవింశోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమున తెలుపబడిన సావిత్రి చేసిన యమస్తోత్రమను ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాస్తము.