sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకోzనత్రింశోzధ్యాయః - నరకకుండముల పేర్లు శ్రీనారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను- యమస్తసై#్య విష్ణుమంత్రం దత్వా చ విధిపూర్వకం | కర్మాzశుభ విపాకం చ తామువాచ రవేః సుతః || 1 యమధర్మరాజు సావిత్రికి శ్రీమన్నారాయణుని మంత్రమును విధిపూర్వకముగా ఉపదేశించి ఆ తరువాత అశుభకర్మల విపాకమెట్లుండునో తెల్పసాగెను. యమ ఉవాచ- యమధర్మరాజు ఇట్లు అనెను- శుభకర్మవిపాకం చ శ్రుతం నానావిధం సతి | కర్మాzశుభవిపాకం చ కథయామి నిశామయ || 2 నానా ప్రకారం స్వర్గం చ యాతిజీవః సుకర్మణా | కుకర్మణా చ నరకం యాతి నానావిధం నరః || 3 ఓ సావిత్రి ! నీవు అనేక పుణ్యకర్మల ఫలితమెట్లుండునో తెలిసికొంటివి కదా ! ఇప్పుడు నీవు కోరినట్లు అశుభకర్మల విపాకమెట్లుండునో తెలిపెదను. జీవుడు పుణ్యకర్మలు చేసి అనేక విధములైన స్వర్గములను పొందుచున్నాడు. అట్లే అశుభ కర్మలవలన అనేకవిధములైన నరకములను పొందుచున్నాడు. నరకాణాం చ కుంజాని సంతి నానావిధాని చ | నానాపురాణ భేదేన నామభేదాని తాని చ || 4 విస్తృతాని గభీరాణి క్లేశదాని చ జీవినాం | భయంకరాణి ఘోరాణి హే వత్సే కుత్సితాని చ || 5 షరడశీతిశ్చ కుండాని సంయమన్యాం చ సంతి చ | నిబోధ తేషాం నామాని ప్రసిద్దాని శ్రుతౌ సతి || 6 పురాణములలో నరకముల పేర్లు అనేక విధములుగా కన్పించుచున్నవి. అవి జీవులకు చాల క్లేశమును కలిగించును. చాలా భయంకరమైనవి. చాలా ఘోరమైనవి కూడ. అట్టి నరకకుండములు ఎనుబది యారు, వేదములలో ప్రసిద్ధముగా కన్పించుచున్నవి. వహ్నికుండం తప్త కుండం క్షమ కుండం భయానకం | విట్కుండం మూత్రకుండం చ శ్లేష్మకుండం చ దుఃసహం || 7 గరకుండం దూషికాకుండం వసాకుండం తథైవ చ | శుక్ర కుండమసృక్కుండం అశ్రుకుండం చ కుత్సితం ||
8 కుండం గాత్రమలానాం చ కర్ణవిట్కుండవమేవచ | మజ్జాకుండం మాంసకుండం నఖ కుండం చ దుస్తరం || 9 లోమ్నాం కుండం కేశకుండం అస్ధికుండం చ దుఃఖదం | తామ్రకుండం లౌహకుండం ప్రతప్తం క్లేశదం మహత్ || 10 తీక్ష కంటక కుండం చ విషకుండం చ విఘ్నదం | ధర్మకుండం తప్తసురాకుండం చాzపి ప్రకీర్తితం || 11 అవి వహ్నికుండము, తప్తకుండము, భయంకరమైన క్షమ కుండము, మలకుండము, మూత్రకుండము, సహించరాని శ్లేషకుండము, గరళకుండము, దూషికాకుండము, వసాకుండము, శుక్రకుండము, రక్తకుండము, అశ్రుకుండము, శరీరమలమున్నకుండము, చెవిలోని మలమున్న కుండము, మజ్జాకుండము, మాంసకుండము, నఖకుండము, రోమకుండము, కేశకుండము, అస్ధికుండము, చాలావేడిగానుండి భయంకరమైన తామ్రకుండము, లోహకుండము, వాడియైన ముళ్ళుకులకుండము, విషకుండము, ధర్మకుండము, మిక్కిలి మరుగుతున్న సురాకుండము అనునవి. ప్రతప్త తైలకుండం చ దంతకుండం చ దుర్వహం | కృమికుండం పూయకుండం సర్పకుండం దురంతకం || 12 మశకుండం దంశకుండం భీమం గరళ కుండకం | కుండం చ వజ్రదంష్ట్రాణాం వృశ్చికానాం చ సువ్రతే || 13 శరకుండం శూలకుండం ఖడ్గకుండం చ భీషణం | గోళకుండం నక్రకుండం కాకకుండం శుచాస్పదం || 14 సంచాలకుండం వాజకుండం బంధకుండం సుదుస్తరం | తప్తపాషాణకుండం చ తీక్షపాషాణ కుండకం || 15 లాలాకుండమసి కుండం చూర్ణకుండం సుదారుణం | చక్రకుండం వజ్రకుండం కూర్మకుండం మహోల్బణం || 16 జ్వలకుండం భస్మకుండం పూతికుండం చ సుందరి | తప్తసూర్యమసీపత్రం క్షురధారం సుచీముఖం || 17 గోధోముఖం నక్రముఖం గజదంశం చ గోముఖం | కుంభీపాకం కాలసూత్రమవటోదమరుంతుదం || 18 పాంశుభోజం పాశ##వేష్టం శూలప్రోతం ప్రకంపనం | ఉల్కాముఖమంధముఖం వేధనం దండతాడనం || 19 జాలబంధం దేహచూర్ణం దళనం శోషణం కరం | సర్వజ్వాలాముఖం జిహ్మధూమాంధం నాగవేష్టనం || 20 కుండాన్యేతాని సావిత్రి పాపినాం క్లేశదాని చ | ఇంకను ప్రతప్త తైలకుండము, దంతకుండము, కృమి కుండము, పూయకుండము, సర్పకుండము, మశకకుండము, దంశకుండము, గరళకుండము, వజ్రదంష్ట్రకుండము, వృశ్చిక కుండము, శరకుండము, శూలకుండము, ఖడ్గకుండము, గోళకుండము, నక్రకుండము, కాకకుండము, సంచాలకుండము, వాజకుండము, బంధకుండము, తప్తపాషాణకుండము, తీక్షపాషాణకుండము, లాలాకుండము, అసికుండము, చూర్ణకుండము, చక్రకుండము, వజ్రకుండము, కూర్మకుండము, జ్వాలాకుండము, భస్మకుండము, తప్తసూర్యకుండము, అసిపత్రకుండము, క్షురధారకుండము, సూచీముఖ కుండము, గోధోముఖకుండము, నక్రముఖకుండము, గజదంశకుండము, గోముఖకుండము, కుంభీపాకకుండము, కాలసూత్రకుండము, అవటోదకుండము, అరుంతుదకుండము, పాంశుభోజకుండము, పాశ##వేష్టకుండము, శూలప్రోతకుండము, ప్రకంపన కుండము, ఉల్కాముఖ కుండము, అంధముఖకుండము, వేధనకుండము, దండతాడనకుండము, జాలాబంధకుండము, దేహచూర్ణకుండము, దళనశోషణకుండము, సర్పజాలాముఖ కుండము, జిహ్మకుండము, ధూమాంధకుండము, నాగవేష్టన కుండము, అనునవి నరకములో వివిధములైనవి. ఓ సావిత్రి ! ఈ నరకములన్ని పాపాత్ములకు అధికమైన దుఃఖమును కలిగించును. నియుక్తైః కింకరగణౖః రక్షితాని చ సంతతం || 21 దండ హసై#్తః శూల హసై#్తః పాశహసై#్తః భయకరైః | శక్తిహసై#్తఃగదా హసై#్తర్మద మత్తైశ్చ దారుణౖః || 22 తమోయుక్తైః దయాహీనైః దుర్నివార్యం చ సర్వతః | తైజస్విభిశ్చ నిఃశంకైః తామ్ర పింగళలోచనైః || 23 యోగయుక్తైః సిద్ధయోగైః నానారూపధరైర్వరైః | ఆసన్న మృత్యుభిర్ధృస్టైః పాపిభిః సర్వజీవిభిః || 24 స్వ కర్మ నిరతైః శైనైః శాక్తైః సౌరైశ్చ గాణపైః | అదృష్టైః పుణ్యకృద్భిశ్చ సిద్దయోగిభిరేవచ || 25 స్వధర్మ నిరతైర్వాzపి విరతైర్వా స్వతంత్రకైః | బలవద్భిశ్ఛ నిఃశంకైః స్వప్న దృష్టైశ్చ వైష్ణవైః || 26 పై నరకములన్నిటిని దండము, శూలము, పాశము, శక్తి, గల కలిగినవారు, మదము కలవారు, భయంకరులు, తమోగుణము కలవారు, దయలేని వారగు కింకరులు కాపాడుచున్నారు. వారు తేజస్సమాయుక్తులు. వారి కండ్లు రాగివలె పింగళవర్ణమున నుండును. పాపము చేసికొన్న సమస్త జీవులకు మృత్యువాసన్నమైనప్పుడు వారు కన్పింతురు. తమతమ ధర్మములను ఆచారించుకొనుచున్న శైవులు, శాక్తేయులు, సూర్యభక్తులు, గణపతి భక్తులకు పుణ్యము చేసికొన్న వారికి, సిద్ధయోగులకు వారెన్నడు కన్పించరు. అ%్‌టలే తమ తమ ధర్మములను చక్కగా ఆచరించుచు తమ ఇష్టదేవతను స్వప్నమందైనను సందర్శించిన వైష్ణవులకు యమకింకరులెన్నడు కన్పించరు. ఏతత్తే కథితం సాధ్వి కుండ సంఖ్యా నిరూపణం | యేషాం నివాసో యత్కుండే నిబోధ కథయామి తే || 27 ఓ సావిత్రి! నీకు నరక కుండములెన్ని కలవో వాటి పేర్లేమిటో కూడా తెలిపితిని. ఇప్పుడు ఆయా నరక కుండములందు నివసించువా%ిని గూర్చి వినరింతును. జాగ్రత్తగా వినుమని యమధర్మరాజు సావిత్రితో పలికెను. ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ నారద నారాయణ సంవాదే ద్వితీయే ప్రకృతిఖండే సావిత్ర్యుపాఖ్యానే యమసావిత్రీ సంవాదే సరకకుండ సంఖ్యానం నామ ఏకోzనత్రింశోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున సావిత్రి ఉపాఖ్యానము కనిపించు యమధర్మరాజు సావిత్రీ సంవాదమున నరకములోని కుండ సంఖ్యను వివరించు ఇరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.