sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
6. షష్ఠోzధ్యాయః - బ్రహ్మదేవుని సృష్టికార్యమున నియోగించుట సౌతి రువాచ- సౌతి మహర్షి ఇట్లు పలికెను- అథకృష్ణో మహాలక్ష్మీం సాదరంచ సరస్వతీం | నారాయణాయ ప్రదదౌ రత్నేంద్రం మాలయా సహ ||
1 సావిత్రీం బ్రహ్మణ ప్రాదాన్మూర్తిం ధర్మాయ సాదరం | రతిం కామాయ రూపాఢ్యాం కుబేరాయ మనోరమాం ||
2 అన్యాశ్చ యాయా అన్యేభ్యో యాశ్చ యేభ్యః సముద్భవాః | తసై#్మ తసై#్మ దదౌ కృష్ణః తాం తాం రూపవతీం సతీం ||
3 తతః శంకరమాహూయ సర్వేశో యోగినాం గురుం | ఉవాచ ప్రియమిత్యేవం గృహ్ణీయాః సింహవాహినీం ||
4 శ్రీకృష్ణ భగవానుడు సాదరముగా నారాయణునకు వనమాలా, కౌస్తుభ రత్నములతో పాటు మహాలక్ష్మిని, సరస్వతిని ఇచ్చెను. అట్లేబ్రహ్మ దేవునికి సావిత్రిని, యమధర్మరాజుకు మూర్తి అనునామెను, మన్మథునికి మిక్కిలి సౌందర్యవతియైన రతీదేవిని, కుబేరునకు మనోరమ అను స్త్రీని భార్యగా నిచ్చెను. అట్లే ఇతర దేవతా గణమునుండి పుట్టిన స్త్రీలను వారి వారికి భార్యలుగా నొసగెను. అదే విధముగ సర్వేశ్వరుడైన కృష్ణుడు సమస్త యోగులకు గురువైన శంకరుని పిలిచి సింహవాహిని యగు దుర్గను భార్యగా నొసగెను. శ్రీకృష్ణస్యవచః శ్రుత్వా ప్రవాసన్నీలలోహితః | ఉవాచ భీతః ప్రణతః ప్రాణశం ప్రభుమచ్చుతం || 5 శ్రీకృష్ణదేవుని మాటలు విని శంకరుడు భీతితో ప్రాణశుడు, ప్రభువగు అచ్యుతునకు నమస్కరించి ఇట్లు పలికెను. శ్రీమహేశ్వర ఉవాచ- శ్రీమహేశ్వరుడు ఇట్లనెను - అధునాzహం న గృహ్ణామి ప్రకృతిం ప్రాకృతో యథా | త్వద్భక్త్యైకవ్యవహితాం దాస్యమార్గవిరోధినీం ||
6 తత్వజ్ఞాన సమాచ్ఛన్నాం యోగద్వార కపాటికాం | ముక్తీచ్ఛధ్వంసరూపాం చ సకామాం కామ వర్ధినీం ||
7 శశ్వద్విబుద్ధి జననీం సద్బుద్ధిచ్ఛేదకారిణీం | శశ్వద్విభోగసారాం చ విషయేచ్ఛావివర్ధినీం || 8 తపస్యాచ్ఛన్నరూపాం చ మహామోహకరండికాం | భవకారగృహే ఘోరే దృఢాం నిగడరూపిణీం || 9 నేచ్ఛామి గృహిణీం నాథ వరం దేహి మమేప్సితం | యస్య యద్వాంఛితం తసై#్మ తద్ధదాతి సదీశ్వరః || 10 త్వద్భక్తి విషయే దాస్యే లాలసావర్ధతేzనిశం | తృప్తిర్నజాయతే నామ జపనే పాదపూజనే || 11 త్వన్నామ పంచవక్త్రేణ గుణం సన్మంగళాలయం | స్వప్నే జాగరణ శశ్వత్ గాయన్ గాయన్ భ్రమామ్యహం || 12 ఆకల్పకోటి కోటించ తద్రూప ధ్యాన తత్పరం | భోగేచ్ఛా విషయేనైవ యోగే తపసి మన్మనః || 13 త్వత్సేవనే పూజనేచ వందనే నామ కీర్తనే | సదోల్లసితమేషాంచ విరతౌ విరతిం లభేత్ || 14 స్మరణ కీర్తనం నామగుణయోః శ్రవణం జపః | త్వచ్చారు రూపధ్యానం త్వత్పాదసేవాభివందనం || 15 సమర్పణం చాత్మనశ్చ నిత్యం నైవేద్య భోజనం | వరం వరేశ దేహీదం నవధా భక్తి లక్షణం || 16 సార్ట్పి సాలోక్య సారూప్య సామీప్యం సామ్యలీనతాం | వదంతి షడ్విధాం ముక్తిం ముక్తాః ముక్తివిదో ప్రభో || 17 అణిమా లఘిమా ప్రాప్తిః ప్రాకామ్యం మహిమా తథా | ఈశిత్వం చ వశిత్వం చ సర్వ కామావసాయితా|| 18 సర్వజ్ఞ దూర శ్రవణం పరకాయ ప్రవేశనం | వాక్సిద్ధిః కల్పవృక్షత్వం స్రష్టుం సంహర్తుమీశతా || 19 అమరత్వంచ సర్వాగ్ర్యం సిద్ధయోzష్టా దశ స్మృతాః | యోగాస్తపాంసి సర్వాణి దానాని చ వ్రతాని చ || 20 పరమాత్మా! ఇప్పుడు నేను ఈ ప్రకృతిని భార్యగా స్వీకరించలేను. ఎందువలన అంటే గృహిణి నీ భక్తికి అడ్డంకుగా ఉంటుంది. నేనుంచుకున్న దాస్యమార్గాన్ని ఒప్పుకొనకపోవచ్చు. నీ జ్ఞానానికి ఆటంకమౌతుంది. యోగద్వారమునకు ద్వారము వంటిది. ముక్తిపై కోరికను కలిగించదు. తాను కామము కలది. ఇతరులకు కామమును ప్రేరేపించును. సద్బుద్ధిని కాక విపరీత బుద్ధిని కలిగించును. విపరీత భోగములకు నిలయమైనది. విషయముల యందు కోరికను పెంపొందించును. అధికమైన మోహమునకు కరండిక వంటిది. సంసారమను కారాగృహమున నున్న దృఢమైన గొలుసువంటిది. అట్టి భార్యను స్వీకరించి సంసారమున ఉండుటకు ఇష్టమగుటలేదు. భక్తులు ఏయే కోరికలు గోరుదురో పరమేశ్వరుడు వారికి ఆయా కోరికలను పూర్తి చేయును. కావున నాకు ఇష్టమైన వరమును ఇమ్ము. నాకు నీ భక్తి విషయమున, దాస్యమున కోరిక దిన దిన వ్రవర్ధమానమగుచున్నది. నీ నామ జపమున, పాదపూజయందు నాకు తృప్తిలేదు. కల్యాణ గుణములకు నిలయమైన నీ నామములను, నీ కల్యాణ గుణములను మేలుకొన్న సమయమున, స్వప్నావస్థయందును నా ఐదు శిరస్సులచే గానము చేయుచుందును. నీ సేవలో పూజలో నమస్కృతి యందు నా మనస్సు ఎల్లప్పుడు మునిగియుండును. వీటిని విరమించుకొన్న నాకు విరతి ఏర్పడును. స్మరణము, కీర్తనము, నామములను, గుణములను వినుట, జపించుట, అందమైన నీ రూపును మనస్సులో ధ్యానించుట, నీ పాదములను సేవించుట, ఆత్మసమర్పణ, నిత్యము నీకు నివేదించిన పదార్థములను భుజించుట అనునవి నవవిధ భక్తులు. ఇట్టి భక్తిని వరముగా నాకిమ్ము. సాయుజ్యము, సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సామ్యము, లీనమగుట అను షడ్విధముక్తులను ముక్తులైన ముక్తి వేత్తలు తెలుపుచున్నారు. అట్లే సూక్ష్మముగా మారుట (అణిమ), తేలికగానగుట (లఘిమ), తన శరీరమును విపరీతముగా పెంచుట (మహిమ), గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వశిత్వము, సమస్త కామ్యములను తీర్చుట, సర్వజ్ఞత్వము, దూరశ్రవణము, పరకాయ ప్రవేశము, వాక్సిద్ధి, కల్పవృక్షత్వము, సృష్టించుసామర్థ్యము, సంహరించు శక్తి, అమరత్వము, అంతటా అగ్రాసనాధిపత్యం(సర్వాగ్ర్యం) సర్వజ్ఞత్యము అనునవి అష్టాదశ సిద్ధులు. యశః కీర్తిర్వచః సత్యం ధర్మాణ్యనశనానిచ | భ్రమణం సర్వ తీర్థేషు స్నానమన్యసురార్చనం || 21 సురార్చాదర్శనం సప్తద్వీప సప్త ప్రదక్షిణం | స్నానం సర్వ సముద్రేషు సర్వ స్వర్గ ప్రదర్శనం || 22 బ్రహ్మత్వం చ రుద్రత్వం విష్ణుత్వం చ పరం పదం | అతోzనిర్వచనీయాని వాంచనీయాని సంతి వా || 23 సర్వాణ్యతాని సర్వేశ కథితానిచ యాని చ | తవ భక్తి కలాంశస్య కలాం నార్హంతి షోడశీం || 24 ఓ పరమాత్మా! యోగములు, తపస్సులు, సమస్తదానములు, సమస్తవ్రతములు, యశస్సు, సత్యవాక్కు, ధర్మములు, ఉపవాసములు, సమస్త పుణ్యక్షేత్రములు సందర్శించుట, సమస్త పుణ్య తీర్థములలో స్నానము చేయుట, అన్యదేవతారాధన, దేవతారాధనను సందర్శించుట, సప్త ద్వీపములను ఏడుసార్లు చుట్టి తిరిగి వచ్చుట, సర్వ సముద్రములలో చేసిన స్నానము, సమస్త స్వర్గమును దర్శించుట, బ్రహ్మపదము, రుద్రపదవి, విష్ణుపదవి, ఇంకను చెప్పుటకు వీలులేని కోరికలు, ఇవన్నియు నీ భక్తి కళాంశము యొక్క పదునారవ భాగముగా కూడ కానేరవు. శర్వస్య వచనం శ్రుత్వా కృష్ణస్తం యోగినాం గురుం | ప్రహస్యోవాచ వచనం సత్యం సర్వసుఖప్రదం || 25 యోగులకందరకు గురువైన శంకరుని మాటలు విని శ్రీకృష్ణ భగవానుడు నవ్వుచు అందరికి మేలు కలిగించు సత్యమైన వాక్కును ఇట్లు పలికెను. శ్రీభగవానువాచ- శ్రీకృష్ణ భగవంతుడు ఇట్లు పలికెను- మత్సేవాం కురు సర్వేశ శర్వ సర్వ విదాం వర | కల్పకోటి శతం యావత్పూర్ణం శశ్వదహర్నిశం || 26 వరస్తపస్వినాం త్వంచ సిద్ధానాం యోగినాం తథా | జ్ఞానినాం వైష్ణవానాం చ సురాణాంచ సురేశ్వర || 27 అమరత్వం లభ భవ భవ మృత్యుంజయోమహాన్ | సర్వసిద్దించ వేదాంశ్చ సర్వజ్ఞత్వంచ మద్వరాత్ || 28 అసంఖ్య బ్రహ్మణాంపాతం లీలయా వత్స పశ్యసి | అద్యప్రభృతి జ్ఞానేన తేజసా వయసా శివ || 29 పరాక్రమేణ యశసా మహసా మత్సమో భవ | ప్రాణానామధికస్త్వంచ న భక్తస్త్వత్పరోమమ || 30 త్వత్పరో నాస్తి మే ప్రేయాన్త్వం మదీయాత్మనః పరః | యే త్వాం నిందంతి పాపిష్ఠా జ్ఞానహీనా విచేతనాః || 31 పచ్యంతే కాలసూత్రేణ యావచ్చంద్ర దివాకరౌ | కల్పకోటి శతాంతే చ గ్రహిష్యసి శివాం శివ || 32 మమావ్యర్థం చ వచనం పాలనం కర్తుమర్హసి | త్వన్ముఖాన్నిర్గతం వాక్యం న కరోమ్యధునేతి చ || 33 మద్వాక్యంచ స్వవాక్యం చ పాలనం తత్కరిష్యసి | గృహీత్వా ప్రకృతిం శంభో దివ్యం వర్షసహస్రకం || 34 సుఖం మహచ్చ శృంగారం కరిష్యసి న సంశయః | న కేవలం తపస్వీ త్వం ఈశ్వరో మత్సమో మహాన్ || 35 శంకరా! నూరు కోట్ల కల్పములు పూర్తియగునంతవరకు రాత్రింబవళ్ళు నాసేవ చేయుము. నీవు తపస్వులలో, సిద్ధులలో యోగులలో అట్లే జ్ఞానవంతులైన వైష్ణవులలో అందరికన్నా శ్రేష్ఠుడవు. నావరమువల్ల అమరత్వమును, సర్వసిద్ధిని, సర్వజ్ఞత్వాన్ని కూడ పొందుము. అట్లే వేదముల నన్నిటిని పొందుము. మృత్యుంజయుడవు కూడా కమ్ము. నీవు అసంఖ్యాకులైన బ్రహ్మదేవతల నిర్యాణాన్ని చూడగలవు. నేటినుండి జ్ఞానములోను, తేజస్సులోను, వయస్సులోను, పరాక్రమములోను, కీర్తిలో, గొప్పతనములో అన్నిటిలో నాతో సమానుడవు కాగలవు. నీవు నేటినుండి నాభక్తుడవు కాదు. నాప్రాణములకన్న అధికమైనంత దగ్గరివాడవు. నీకంటె గొప్ప భక్తుడు నాకు లేడు. నాకు నీకంటె ఇష్టమైనవాడు లేడు. నీవు నా ఆత్మకంటె గొప్పవాడివి. తెలివితక్కువతనముతో జ్ఞానములేని పాపాత్ములు నిన్ను నిందించి సూర్యచంద్రులున్నంతవరకు యమలోకమున ఉందురు. నీవు నూరు కోట్ల కల్పముల తరువాత ప్రకృతి రూపిణియైన దుర్గాదేవిని గ్రహింతువు. వ్యర్థము కాని నావాక్యమును నీవు తప్పక పరిపాలించవలెను. నేను కూడ నీ మాటను ఇప్పుడు వ్యర్థము చేయను. అందువల్ల నామాటను, నీ మాటను నీవు తప్పక పరిపాలించవలెను. నీవు ప్రకృతిని స్వీకరించి వేయి దివ్యసంవత్సరములు ఆమెతో సుఖముగా ఉందువు. నీవు తపస్వివి మాత్రమే కాదు. నాతోసమానుడవు. కాలే గృహీ తపస్వీచ యోగీ స్వేచ్ఛామయో హి యః | దుఃఖం చ దారసంయోగే యత్త్వయా కథితం శివ || 36 కుస్త్రీ దదాతి దుఃఖం చ స్వామినే న పతివ్రతా ! కులే మహతి యా జాతా కులజా కులపాలికా || 37 కరోతి పాలనం స్నేహాత్ సత్పుత్రస్య సమం పతిం | పతిర్బంధుః పతిర్భర్తా దైవతం కులయోషితాం || 38 పతితోzపతితో వాzపి కృపణశ్చేశ్వరోzథవా | అసత్కులప్రసూతా యాః పిత్రోః దుశ్శీల మిశ్రితాః || 39 ధ్రువం తా పరభోగ్యాశ్చ పతిం నిందంతి సంతతం | ఆవయోరతిరిక్తం చ యా పశ్యతి పతిం సతీ || 40 గోలోకే స్వామినా సార్థం కోటికల్పం ప్రమోదతే | భవితా సా శివా శైవీ ప్రకృతిః వైష్ణవీ శివ || 41 మదాజ్ఞయా చ తాం సాధ్వీం గ్రహిష్యసి భవాయ చ | ప్రకృత్యాః యోనిసంయుక్తం త్వల్లింగం తీర్థమృత్కృతం || 42 తీర్థే సహస్రం సంపూజ్య భక్త్యా పంచోపచారతః | సదక్షిణం సంయతో యః పవిత్రశ్చ జితేంద్రియః || 43 కోటికల్పం చ గోలోకే మోదతే చ మయా సహ | లక్షం తీర్థే పూజయేద్యో విధివత్సాధుదక్షిణం || 44 న చ్యుతిస్తస్య గోలోకాత్ సభ##వేదావయోః సమః | మృద్భస్మగోశకృత్పిండైః తీర్థే వాలుకయాzపి వా || 45 కృత్వా లింగం సకృత్పూజ్య వసేత్కల్పాయుతం దివి | ప్రజావాన్ భూమిమాన్ విద్వాన్ పుత్రవాన్ ధనవాన్ తథా || 46 జ్ఞానవాన్ ముక్తిమాన్ సాధుః శివలింగార్చనాద్భవేత్ | శివలింగార్చనం స్థానం మత్తీర్థం తీర్థమేవ తత్ | భ##వేత్తత్ర మృతః పాపీ శివలోకం స గచ్ఛతి || 47 మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదినః | పశ్చాద్యామి మహత్రస్తః నామశ్రవణలోభతః || 48 శివేతి శబ్దముచ్చార్య ప్రాణాంస్త్యజతి యో నరః | కోటి జన్మార్జితాత్పాపాత్ ముక్తో ముక్తిం ప్రయాతిసః || 49 శివకల్యాణవచనం కల్యాణం ముక్తివాచకం | యతస్తత్ర్పభ##వేత్తేన స శివః పరికీర్తితః || 50 విచ్ఛేదే ధనబంధూనాం విమగ్నః శోకసాగరే | శివేతి శబ్దముచ్చార్య లభేత్సర్వ శివం నరః || 51 పాపఘ్నే వర్తతే శిశ్చ వశ్చ ముక్తిప్రదే తథా | పాపఘ్నో మోక్షదో నౄణాం శివస్తేన ప్రకీర్తితః || 52 శివేతి చ శివం నామ యస్య వాచి ప్రవర్తతే | కోటిజన్మార్జితం పాపం తస్య నశ్యతి నిశ్చితం || 53 ఇత్యుక్త్వా శూలినే కృష్ణో దత్వా కల్పతరుం మనుం | తత్వజ్ఞానం మృత్యుజయం అవోచత్ సింహవాహినీం || 54 తపస్వి, యోగి, స్వేచ్చగా ఉండువాడైనా యుక్తకాలమున తప్పక వివాహము చేసికొనవలెను. వివాహము దుఃఖము కలిగించునని నీవేదైతే అన్నావో అది దుష్టస్త్రీలకు సంబంధించినది. దుష్టురాలైన స్త్రీ భర్తకు దుఃఖాన్ని కలగించును కాని పతివ్రత ఆ విధముగా చేయదు. మంచి వంశములో పుట్టిన స్త్రీని కులజ, కులపాలిక అందురు. ఆమె సత్పుత్రుల కని, వారిని తన భర్తను ప్రేమతో లాలించి రక్షించగలదు. ఆ కులపాలికకు భర్తయే బంధువు, దైవము. భర్త చెడ్డవాడైనను, మంచివాడైనను, పిసినారియైనా, ధనవంతుడైనా అతనిని చక్కగా చూచుకొనును. కాని తలిదండ్రుల చెడునడవడికవల్ల చెడుకులములో పుట్టిన స్త్రీలు భర్తను ఎల్లప్పుడు నిందించుచు పరపురుషుల వెంటపడుదురు. ఏ స్త్రీ తన భర్తను మనలో ఒకరిగా భావించి గౌరవించునో ఆమె తన భర్తతో కలసి గోలోకమున కోటి కల్పములు సుఖముగా ఉండును. శంకరా! ప్రకృతి స్వరూపిణియగు దుర్గ తప్పక భక్తితో నిన్ను ధ్నానించుచు నీకు భార్య కాగలదు. నా ఆజ్ఞననుసరించి సాధ్వియగు ఆ దుర్గను నీవు తప్పక వివాహము చేసికొనవలెను. ప్రకృతియొక్క యోనితో కూడుకున్న పుణ్యతీర్థములందలి మట్టితో చేయబడిన నీ లింగమును పుణ్యతీర్థములయందు భక్తిశ్రద్ధలతో జితేంద్రియుడై పంచోపచారపూజలతో వేయిమార్లు అర్చించువాడు గోలోకమున కోటి కల్పములు నాతో కలిసి ఉండును. లక్షసార్లు దక్షిణ పూర్వకముగా నిన్ను పూజించిన వ్యక్తి సదా గోలోకముననే ఉండును. ఆతడు మన ఇద్దరితో సమానుడు కాగలడు. మన్ను, భస్మము, ఆవుపేడ, తీర్థమందలి ఇసుక వీటిలో దేనితో నైనను లింగమును చేసి ఒక్కసారి నిన్ను పూజించినను పదిలక్షల సంవత్సరములు దేవతలోకమున ఉండును. శివలింగమును పూజించినవానికి పుత్రులు, భూమి, విద్య, జ్ఞానము చివరకు ముక్తికూడ కలుగును. శివలింగార్చన జరిగిన స్థలము పుణ్యక్షేత్రము. అది నాకుకూడ పుణ్యక్షేత్రమే. అచ్చట చనిపోయినవాడు పాపము చేసినవాడైనను శివలోకమును పొందును. మహాదేవ మహాదేవ మహాదేవ అని ఎవరు జపించుచుందురో వారివెంట, నీ నామ శ్రవణమున కల ప్రీతి చేత వెళ్ళుదును. శివ అని ఉచ్చరించి ఎవరైతే ప్రాణము విడుతురో అతడు కోటిజన్మలలో చేసికొన్న పాపమును వదిలి ముక్తిని పొందును. శివ అను శబ్దమే కల్యాణమైనది. ఆ శబ్దోచ్చారణవల్ల మంగళములన్ని లభించును. కావుననే అతడు శివుడైనాడు. 'శివ' అనుశబ్దము నుచ్చరించినవానికి ధనము, బంధువులు నశించిన శోకము కలుగదు. కల్యాణపరంపరనతడు పొందును. 'శి' అనగా పాపములు పోగొట్టువాడు. 'వ' అనగా ముక్తిదాత. పాపములు పోగొట్టి ముక్తినిచ్చువాడు కావుననే శివుడైనాడు. 'శివ' అనే శబ్దమును ఎల్లప్పుడు ఉచ్చరించువానికి కోటి జన్మలలో చేసిన పాపమైనా నశించిపోగలదు. ఈ విధముగా శివునితో శ్రీకృష్ణుడు పలికి అతనికి కల్పవృక్షమును, మంత్రమును, తత్వజ్ఞానమును ఇచ్చి సింహవాహనయగు దుర్గతో ఇట్లనెను. శ్రీభగవానువాచ- భగవంతుడు ఇట్లు పలికెను- అధునా తిష్ఠ వత్సే త్వం గోలోకే మమసన్నిధౌ | కాలే భజిష్యసి శివం శివదం చ శివాయనం || 55 తేజస్సుసర్వదేవానాం ఆవిర్భూయ వరాననే | సంహృత్య దైత్యాన్ సర్వాంశ్చ భవితా సర్వపూజితా || 56 తతః కల్పవిశేషే చ సత్యం సత్యయుగే సతి | భవితా దక్షకన్యా త్వం సుశీలా శంభుగేహినీ || 57 తతః శరీరం సంత్యజ్య యజ్ఞే భర్తుశ్చ నిందయా | మేనాయాం శైలభార్యాయాం భవితా పార్వతీతి చ || 58 దివ్యం వర్షసహస్రం చ విహరిష్యసి శంభునా | పూర్ణం తతః సర్వకాల మభేదం త్వం లభిష్యసి || 59 కాలే సర్వేషు విశ్వేషు మహాపూజాసు పూజితే | భవితా ప్రతివర్షేచ శారదీ యా సురేశ్వరీ || 60 గ్రామేషు నగరేష్వేవ పూజితా గ్రామదేవతా | భవతీ భవితేత్యేవం నామభేదేన చారుణా || 61 మదాజ్ఞయా శివకృతైః తంత్రైర్నానావిధైరపి | పూజావిధిం విధాస్యామి కవచం స్తోత్రసంయుతం || 62 భవిష్యంతి మహాంతశ్చ తవైవ పరిచారకాః |ధర్మార్థకామమోక్షాణాం సిద్ధాశ్చ ఫలభాగినః || 63 యే త్వాం మాతర్భజిష్యంతి పుణ్యక్షేత్రే చ భారతే | తేషాం యశశ్చ కీర్తిశ్చ ధర్మైశ్వర్యం చ వర్ధతే || 64 అమ్మా! ప్రస్తుతము నీవు నాలోకముననే నివసించుము. సరియైన సమయమున మంగళప్రదాత, మంగళములకు నిలయభూతుడైన శివుని భర్తగా పొందగలవు. సమస్త దేవతల తేజస్సుతో రాక్షసులనందరిని చీల్చి చెండాడి దేవతిర్యఙ్మనుష్యులందరి చేతను పూజలందుకొనగలవు. తరువాత కల్పవిశేషమైన సత్యయుగములో దక్షునికి కుమారైగా పుట్టి పరమేశ్వరుని భార్యవు కాగలవు. అటు పిమ్మట యజ్ఞమున జరిగిన భర్తనిందను భరించలేక ఆయజ్ఞముననే శరీరత్యాగముచేసి హిమవత్పర్వతముయొక్క భార్యయైన ''మేన''యందు పార్వతిగా జన్మించి పార్వతి అనుపేరుతో శంకరునికి భార్యవై దివ్యవర్ష సహస్రములు అతనితో కలిసి విహరింతువు. తరువాత నీవతనిలో అభేదమును పొందగలవు. అన్నిచోట్ల, అన్ని పూజలలోను నీవు పూజింపబడగలవు. ప్రతి సంవత్సరము శరత్కాలములో పూజలందుకొని 'శారది' అనియు సురులకు ఈశ్వరివి కాన సురేశ్వరివని, గ్రామములలో, పట్టణములలో పూజలందుకుంటున్నందువల్ల గ్రామదేవత అని అనేకమైన పేర్లతో నీవు ప్రకాశింతువు. శివకృతములైన నానావిధమంత్రములతో, తంత్రములతో కవచము, స్తోత్రములతో కూడిన పూజాపద్ధతిని నేను కల్పింతును. అట్లే నీకు ధర్మార్థకామమోక్షములనే చతుర్వర్గ ఫలమును అనుభవించు, సిద్ధులైన పరిచారకులు ఉండగలరు. అమ్మా! నిన్ను ఈ పుణ్యక్షేత్రమైన భారతఖండములో ఎవరు సేవింతురో వారికి కీర్తి, ధర్మబుద్ధి, ఐశ్వర్యము మొదలగునవి కలుగును. ఇత్యుక్త్వా ప్రకృతిం తసై#్య మంత్ర మేకాదశాక్షరం | దత్వా సకామబీజం చ మంత్రరాజ మనుత్తమం || 65 చకార విధినా ధ్యానం భక్తం భక్తానుకంపయా | శ్రీమాయాకామబీజాఢ్యం దదౌ మంత్రం దశాక్షరం || 66 సృష్ట్యౌపయోగికీం శక్తిం సర్వసిద్ధిం చ కామదాం | తద్విశిష్టోత్కృష్టతత్వం జ్ఞానం తసై#్య దదౌ విభుః || 67 ఈవిధముగా శ్రీకృష్ణదేవుడు ప్రకృతి స్వరూపిణియైన దుర్గతో పలికి, ''క్లీం|| అను కామబీజ సహితమైన ఏకాదశాక్షర మంత్రరాజమును, ''శ్రీం హ్రీం క్లీం'' అను శ్రీమాయా కామబీజ సహితమైన దశాక్షర మంత్రమును కూడ ఆమెకు ఇచ్చెను. అట్లే దుర్గాదేవికి సమస్త సృష్టికి ఉపయోగించు శక్తిని, అన్నివిధములైన కోరికలు దీర్చే సర్వసిద్ధిని, ఉత్కృష్టమైన తత్వజ్ఞానమును ఆమెకు ఇచ్చెను. త్రయోదశాక్షరం మంత్రం దత్వాతసై#్మ జగత్పతిః | కవచం స్తోత్రసహితం శంకరాయతథా ద్విజ || 68 దత్వా ధర్మాయ తం మంత్రం సిద్ధిజ్ఞానం తథైవ చ | కామాయ వహ్నయే చైవ కుబేరాయ చ వాయవే || 69 ఏవం కుబేరాదిభ్యస్తు దత్వామంత్రాదికం పరం | విధిం ప్రోవాచ సృష్ట్యర్థం విధాతుర్విధిరేవ సః || 70 శంకరునకు కవచము స్తోత్రసహితమైన త్రయోదశాక్షర మంత్రమును, ధర్మునికి కూడ అదే మంత్రమును, సిద్ధిని, జ్ఞానమును, మన్మథునకు, అగ్నికి, కుబేరునికి, వాయువునకు ఆయా మంత్రములను ఉపదేశించి విధాతకే సృష్టికర్తయైన భగవంతుడు సృష్టికార్యక్రమమునకై బ్రహ్మదేవుని ప్రేరేపించెను. శ్రీ భగవానువాచ- భగవంతుడు ఇట్లు నుడివెను. మదీయం చ తపః కృత్వా దివ్యం వర్ష సహస్రకం | సృష్టిం కురు మహాభాగ విధే నానావిధాం పరాం || 71 ఇత్యుక్త్వా బ్రహ్మణ కృష్ణో దదౌ మాలాం మనోరమాం | జగామ సార్థం గోపీభిః గోపైః వృందావనం వనం || 72 దివ్యవర్షసహస్రములు నాకైతపమాచరించి వివిధ సృష్టికార్యక్రమమును ప్రారంభింపుము అని బ్రహ్మదేవునితో శ్రీకృష్ణదేవుడు పలికి తన దగ్గరనున్న మిక్కిలి అందమైన మాలను ఆ బ్రహ్మ దేవునకిచ్చి గోపికలు, గోపాల బాలురతో కలిసి బృందావనమనే వనమునకు వెళ్ళిపోయెను. ఇతి బ్రహ్మ వైవర్తే మహాపురాణ సౌతి శౌనక సంవాదే బ్రహ్మఖండే సృష్టినిరూపణం నామ షష్ఠోzధ్యాయః || బ్రహ్మవైవర్తమను మహాపురాణమున సౌతి శౌనక సంవాదరూపమైన బ్రహ్మఖండములో సృష్టినిరూపణమను ఆరవఅధ్యాయము సమాప్తమైనది.