sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకత్రింశత్తమోZధ్యాయః - పాపులు పొందు నరక కుండములు యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను- హరిసేవాం వినా సాద్వి నలభేత్కర్మ ఖండనం | శుభకర్మ స్వర్గబీజం నరకం చ కుకర్మతః ||
1 పుంశ్చల్యన్నం చ యో భుంక్తే వేశ్యాన్నం చ పతివ్రతే | తాం వ్రజేత్తు ద్విజో యోహి కాలసూత్రం ప్రయాతి సః ||
2 శతవర్షం కాలసూత్రే స్థిత్వా శూద్రో భ##వేత్ ధ్రువం | తత్ర జన్మని రోగీ చ తతః శుద్ధో భ##వేత్ ద్విజః || 3 ఓ పతివ్రతా! శ్రీహరి సేవలేక కర్మబంధమోచనము జరుగదు. పుణ్యమైన పనులు చేసినచో స్వర్గము లభించును. చెడు పనులు చేసినచో నరకము కలుగును. వ్యభిచారి పెట్టిన అన్నమును, వేశ్యపెట్టిన అన్నము తినువాడు వారి దగ్గరకు వెళ్ళువాడు కాలసూత్రమను నరకమునకు పోవును. అచ్చట నూరు సంవత్సరములుండి మానవజన్మనెత్తినప్పుడు మొదటి జన్మలో బహురోగములతో బాధపడి నిర్మలుడగును. పతివ్రతా చైకపత్నీ ద్వితీయే కులటా స్మృతా | తృతీయే ధర్షణీ జ్ఞేయా చతుర్థే పుంశ్చలీ స్మృతా || 4 వేశ్యా చ పంచమే షష్ఠే యుగ్మీ చ పరికీర్తితా | అత ఊర్ధ్వం మహావేశ్యా సాZస్పృశ్యా సర్వ జాతిషు ||5 ఒకే భర్తతో నుండునది "పతివ్రత ". రెండవవానితో తిరుగునది "కులట". ముగ్గురితో ఉండునది "ధర్షణి", నలుగురితో తిరుగునది పుంశ్చలి . ఐదుగురితో నుండునది వేశ్య ఆరుగురితో కలిసియుండునది యుగ్మీ. అంతకంటే ఎక్కువ పురుషులతో తిరుగునది మహావేశ్య. మహావేశ అన్ని కులములలోను అస్పృశ్య. యో ద్విజః కులటాం గచ్ఛేత్ ధర్షిణీం పుంశ్చలీమపి | వేశ్య యుగ్మీం మహావేశ్యాం అవటోదం ప్రయాతి సః || 6 బ్రాహ్మణుడు కులట మొదలగువారితో కలిసి తిరిగినచో అవటోదమను నరకమునకు పోవును . శతాబ్ధం కులటాగామీ ధృష్టగామీ చతుర్గుణం | షడ్గుణం పుంశ్చలీగామీ వేశ్యాగామీ గుణాష్టకం || 7 యుగ్మీగామీ దసగుణం వసేత్తత్ర న సంశయః | మహావేశ్యాకాముకశ్చ తతః శతగుణం వసేత్ || 8 తదాహి సర్వగామీ చేత్యేవమాహ పితామహః | తత్రైవ యాతనాం భుంక్తే యమ దూతేన తాడితః || 9 కులటతో తిరుగువాడు నూరు సంవత్సరములు నరకమున ఉండును. ధృష్టతో తిరుగువాడు నాలుగు వందల సంవత్సరములు నరకమున నుండును. పుంశ్చలితో కలియువాడు ఆరువందలసంవస్తరములు, వేశ్యాగామి ఎనిమిదివందలసంవత్సరములు , యుగ్మీ దగ్గరకు పోవువాడు వేయి సంవత్సరముల అవటోదమను నరకమున నుందురు. మహావేశ్య వెంట తిరుగువాడు లక్షసంవత్సరములు నరకబాధను అనుభవించును. అందరితోను తిరుగువాడు నరకముననే యమదూతలచే బాధలననుభవించుచుండునని బ్రహ్మ తెలిపెను. తిత్తిరిః కులటాగామీ ధృష్టాగామీ చవాయసః | కోకిలః పుంశ్చలీగామీ వేశ్యాగామీ వృకస్తథా || 10 యుగ్మీగామీ సూకరశ్చ సప్త జన్మసు భారతే | మహావేశ్యా కాముకశ్చ శ్మశానే శాల్మలిస్తరుః || 11 కులట వెంట పోవువాడు ఏడు జన్మలు తిత్తిరి పక్షిగను, ధృష్టాస్త్రీ వెంట తిరుగువాడు ఏడుజన్మలు కాకిగాను, పుంశ్చలీగామి ఏడు జన్మలు కోకిలగాను, వేశ్య వెంటపోవువాడు, తోడేలుగాను, యుగ్మీగామి ఏడుజన్మలు పందిగను, నరకబాధలనుభవించిన తరువాత పుట్టుదురు. మహావేశ్య వెంట తిరుగువాడు శ్మశానములో బూరుగు వృక్షముగా పుట్టును. యో భుంక్తే జ్ఞాన హీనశ్చ గ్రహణ చంద్ర సూర్యయోః | అరుంతుదం స యాత్యేవ చంద్రమానాబ్దమేవ చ || 12 తతో భ##వేన్మానవః స్యాత్ ఉదర వ్యాధి సంయుతః | గుల్మ యుక్తశ్చ కాణశ్చ దంత హీనస్తతః శుచిః || 13 చంద్ర సూర్య గ్రహణముల సమయమున బోజనము చేయు మూర్ఖుడు అరుంతుదమను నరకమునకే పోవును. అచ్చట బాధలనుభవించి మానవ జన్మనెత్తినను ఉదరవ్యాధి, మొదలగు వ్యాధులతో చిన్నతనముననే దంతములు గోల్పోవును. వాక్ప్రదత్తాం చ కన్యాం చ యశ్చాన్యసై#్మ దదాతి చ | స వసేత్పాంశుభోగే చ తద్భోజి చ శతాబ్ధికం || 14 మాట నిచ్చిన తరువాత ఇంకొకరికి తన కూతురునిచ్చి వివాహము చేయువాడు పాంశు బోగమును నరకమున నూరు సంవత్సరములుండును. దత్తాపహారీ యః సాధ్వి పాశ##వేష్టం శతాబ్దకం | నివసేచ్ఛరశయ్యాయాం యమ దూతేన తాడితః || 15 దానము చేసినదానిని తిరిగి తీసికొనువాడు పాశ##వేష్టమను నరకమున బాణముల అంచులపై నూరు సంవత్సరములు పడుకొని యమలోక యాతనలననుభవించును. న పూజయే ద్యోహి భక్త్యా శివలింగం చ పార్థివం | స యాతి శూలినః కోపాత్ శూలప్రోతం సుదారుణం || 16 స్థిత్వా శతాబ్దం తత్రైవ శ్వాపదః సప్తజన్మసు | తతో భ##వేద్దేవలశ్చ సప్త జన్మస్వతః శుచిః || 17 శివలింగమును పూజించని వాడు పరమ శివుని యొక్క కోపము వలన భయంకరమైన శూలప్రోతమను నరకమున నూరు సంవత్సరములుండును. అచట నరకయాతనలనుభవించిన తరువాత ఏడు జన్మలు పెద్దవులిగా ఏడు జన్మలు దేవాలయమున అర్చకుడుగా జన్మించును. కరోతి దండం యో విప్రే యద్భయాత్కంపతే ద్విజః | ప్రకంపనే వసేత్సోZపి విప్రలోమాబ్దమేవ హ || 18 బ్రాహ్మణుని ఎవరు దండింతురో , ఎవరిని చూచి బ్రాహ్మణుడు వణకిపోవునో అతడు అనేక వేల సంవత్సరములు ప్రకంపనమను నరకమున నుండి యమ యాతనలనుభవించును. ప్రకోపవదనా కోపాత్ స్వామినం యా చ పశ్యతి | కటూక్తిం తం చ వదతి యాతి చోల్కాముఖం చ సా || 19 ఉల్కాం దదాతి వక్త్రే చ సతతం యమ కింకరః | దండేన తాడయేన్మూర్ద్ని తల్లోమాబ్ద ప్రమాణకం || 20 తతో భ##వేన్మానవీ చ విధవా సప్త జన్మసు | భుక్త్యా దుఃఖం చ వైధవ్యం వ్యాధిం భుక్త్యా తతః శుచిః || 21 తన భర్తను కోపముగా చూచు స్త్రీ అతనితో కటువుగా మాట్లాడు స్త్రీ ఉల్కా ముఖమును నరకమున అనేక వేల సంవత్సరములుండును. అచ్చట ఆమె ముఖమునకు పిడుగులు తగులునట్లు యమకింకరులుచేయుదురు. ఆ తరువాత మానవ జన్మనెత్తినప్పుడు ఏడు జన్మలవరకు ఆ స్త్రీ చిన్నతనముననే తన భర్తను కోలుపోయి రోగములపాలై అనేక విధములుగా బాధలు చెందును. యా బ్రాహ్మణీ శూద్ర భోగ్య సాంధకూపం ప్రయాతి చ | తప్త శౌచోదకే ధ్వాంతే తదాహారే దివానిశం || 22 నివసేదతిసంతప్తా యమదూతేన తాడితా | శౌచోదకే నిమగ్నా చ యావదిద్రాశ్చతుర్దశ || 23 కాకీ జన్మసహస్రాణీ శతజన్మాని సూకరీ | కుక్కటీ శతజన్మాని శృగాలీ సప్తజన్మసు || 24 పారావతీ సప్తజనౌ వానరీ సప్తజన్మసు | తనో భ##వేత్సా చండాలీ సర్వభోగ్యా చ భారతే || 25 తతో భ##వేచ్చ రజకీ యక్ష్మగ్రస్తా చ పుంశ్చలీ | తతః కుష్ఠయుతా తైలకారీ శుద్ధా భ##వేత్తతః || 26 బ్రాహ్మణ స్త్రీ శూద్రునితో సంగమించినచో ఆమే సాంధకూపమను నరకమునకు పోవును. అచ్చట చిమ్మచీకటిలో దుర్వాసన గల నీళ్ళలో నుండి ఆ నీళ్ళే రాత్రింబగళ్ళు ఆహారముగా తీసికొనుచు యమ దూతలు బాధించుచుండగా పదునలుగురు ఇంద్రుల కాలము వరకుండును. అచ్చట యమ యాతనలనన్నిటిని అనుభవించి భూమిపై జన్మించినపుడు వేయిజన్మలు కాకిగాను, నూరు జన్మలు పందిగాను, నూరు జన్మలు కోడిగాను, ఏడుజన్మలు నక్కగాను, ఏడు జన్మలు పావురముగాను, ఏడు జన్మలు కోతిగాను, జన్మించును. అటు పిమ్మట చండాలిగాను, క్షయరోగగ్రస్తయైన రజకి గాను, కుష్ఠురోగ గ్రస్తయైన తైలకారిగాను జన్మలనెత్తును. వేశ్యా వసేద్వేధనే చ యుగ్మీ వై దండతాడనే | జాలబంధే మహావేశ్యా కలటా దేహ చూర్ణకే || 27 సై#్వరిణీ దళ##నే చైవ ధృష్టా వై శోషణ తథా | నివసేద్యాతనా యుక్తా యమ దూతేన తాడితా || 28 విణ్మూత్ర భక్షణం తత్ర యావన్మన్వంతరం సతి | తతో భ##వేద్విట్ క్రిమిశ్చ వర్షలక్షం తతః శుచిః || 29 వేశ్య వేధనమను నరకమునకు పోవును. యుగ్మి దండతాడన నరకమునకు పోవును . మహావేశ్య జావబంధ నరకమునకు కులట దేహచూర్ణక నరకమునకు, సై#్వరిణి దళన నరకమునకు, ధృష్ట శోషణ నరకమునకు పోవును. అచ్చట యమ భటులచే బాధలు పడుచు మన్వంతరకాలము మలమూత్రములను భక్షించుచుండును. అటుపిమ్మట లక్ష సంవత్సరముల వరకు పేడ పురుగుగా జన్మనెత్తును. బ్రాహ్మణో బ్రాహ్మణీం గచ్ఛేత్ క్షత్రయామపి క్షత్రియః | వైశ్యో వైశ్యాం చ శూద్రాం శూద్రో వా Zపి వ్రజేద్యది || 30 స్వవర్ణ పరదారీ చ కషం యాతి తయా సహ | భుక్త్వా కషాయతప్తోదం నివసేద్ధ్వాదశాబ్దకం || 31 తతో విప్రోభ##వేచ్ఛుద్ధశ్చైవం చ క్షత్రియాదయః | యోషితశ్చాపి శుధ్యంతీత్యేవమాహ పితామహః || 32 బ్రాహ్మణో , క్షత్రియ, వైశ్య, శూద్రులు తమ తమ వర్ణములకు చెందిన ఇతరుల స్త్రీలతో పోయినచో అతడు కషమనే నరకమునకు తన ప్రియురాలితో వెళ్ళును. అచ్చట పన్నెండు సంవత్సరములు కషాయతప్తమైన నీటిని తాగుచుండును. అటు పిమ్మట పరిశుద్ధులై తమ తమ జన్మనెత్తుదురు. స్త్రీలు కూడ ఇదే విధముగా కషమనే నరకమున యమయాతనలననుభవించి పరిశుద్ధులగుదురు. క్షత్రియో బ్రాహ్మణీం గచ్ఛేత్ వైశ్యోవాZపి పతివ్రతే | మాతృగామీ భ##వేత్సోZపి శూర్పం చ నరకం వ్రజేత్ || 33 శూర్పాకారైశ్చ క్రిమిభిః బ్రాహ్మణ్యా సహ భక్షితః | ప్రతప్త మూత్ర భోజీ చ యమదూతేన తాడితః || 34 తత్రైవ యాతనాం భుంక్తే యావదింద్రాశ్చతుర్దశ | సప్తజన్మసు వారాహః ఛాగలశ్ఛ తతః శుచిః || 35 క్షత్రియుడుగాని, వైశ్యుడు గాని బ్రాహ్మణ స్త్రీని అనుభవించినచో తల్లితో వ్యభిచారము చేసిన పాపము పొందును. అతడు శూర్పమను నరకమునకు పోయి, అచ్చట చేటలంత ఆకారమున్న క్రిములచే తాను, తను పోయిన బ్రాహ్మణస్త్రీ భక్షింపబడుదురు. ఆ నరకముననిట్లు యమ దూతలు పెట్టు యాతనలను పదునలుగురు ఇంద్రుల కాలము వరకు అనుభవించి ఏడు జన్మలు పందిగను, ఏడు జన్మలు గొఱ్ఱగను జన్మించును. ఆ తరువాత పరిశుద్ధుడగును. కరే ధృత్వా చ తులసీం ప్రతిజ్ఞాం యో న పాలయేత్ | మిథ్యా వా శపథం కుర్యాత్ స చ జ్వాలాముఖం వ్రజేత్ || 36 గంగా తోయం కరే ధృత్వా ప్రతిజ్ఞాం యో న పాలయేత్ | శిలాం చ దేవ ప్రతిమాం స చ జ్వాలాముఖం వ్రజేత్ || 37 దత్వాచ దక్షిణం హస్తం ప్రతిజ్ఞాం యో న పాలయేత్ | స్థిత్వా దేవగృహే వాZపి స చ జ్వాలాముఖం వ్రజేత్ || 38 స్పృష్ట్యా చ బ్రాహ్మణం గాం చ వహ్నిం విష్ణుసమం సతి | న పాలయేత్ప్రతిజ్ఞాం చ స జ్వాలాముఖం వ్రజేత్ || 39 మిత్రద్రోహీ కృతఘ్నశ్చ యో హి విశ్వాసఘాతకః |మిథ్యా సాక్ష్యప్రదశ్చైవ స చ జ్వాలాముఖం వ్రజేత్ || 40 చేతితో తులసిని పట్టుకొని ప్రమాణము చేసి దానిని ఆచారింపనివారు, గంగా జలమును, సాలగ్రామశిలను, దేవప్రతిమను పట్టుకొని ప్రమాణము చేసి ఆచరింపనివారు, దేవుని సమీపమున చేతిలో చేయివేసి ఒట్టుపెట్టుకొని దానికి విరుద్ధమైన పనులు చేసినవారు, అట్లే బ్రాహ్మణుని, ఆవును, అగ్నిని, విష్ణుమూర్తితో సమానుడైన వానిని ముట్టుకొని ప్రమాణము చేసి దానిని ఆచరింపనివారు, స్నేహితునకు ద్రోహము చేసినవారు, కృతఘ్నలు, విశ్వాకఘాతకులు, తప్పుడు సాక్ష్యము చెప్పువారందరు జ్వాలాముఖమను నరకమునకు పోదురు. ఏతే తత్ర వసంత్యేవ యావదిద్రాశ్చతుర్దశ | యథాంగార ప్రదగ్ధాశ్చ యమదూతైస్తు తాడితాః || 41 పై వారందరు జ్వాలాముఖ నరకముల పదునలుగురు ఇంద్రుల కాలమువరకు యమదుతలు బాధలు పెట్టుచుండగా నిప్పులో పడి మాడినట్లగుదురు. చండాలస్తులసీస్పర్శీ సప్త జన్మస్వతః శుచిః | వ్లుెచ్ఛో గంగా జల స్పర్శీ పంచజన్మస్వతః శుచిః || 42 శిలాస్పర్శీ విట్ క్రిమిశ్చ సద్వితీయ ఖండము - 31వ అధ్యాయముప్తజన్మసు సుందరి | అర్చాస్పర్శీ వ్రణకృమిః సప్తజన్మస్వతః శుచిః || 43 దక్షహస్త ప్రదాతా చ సర్పః స్యాత్సప్త జన్మసు | తతో భ##వేద్ధస్తహీనో మానవశ్చ తతః శుచిః || 44 తులసిని పట్టుకొని ఒట్టుపెట్టుకొని తప్పినవాడు ఏడుజన్మల వరకు చండాలుడై పుట్టును. గంగా జలమును చేతబట్టుకొని ఒట్టుపెట్టుకొని తప్పిన వాడు ఐదు జన్మలవరకు వ్లుెచ్ఛుడై పుట్టును. సాలగ్రామమును పట్టుకొని ఒట్టుపెట్టుకొని తప్పినవాడు ఏడు జన్మలవరకు వ్రణములు చేయు పురుగుగా పుట్టును. చేతిలో చేయివేసి ప్రమాణము చేసి తప్పిన వాడు ఏడు జన్మల వరకు సర్పముగా పుట్టును. ఇటువంటి జన్మలనెత్తిన తరువాత మానవుడై పుట్టినను చేతులు లేక అవిటివాడుగా పుట్టును. మిథ్యావాదీ దేవగృహే దేవలః సప్త జన్మసు | మిత్రాది స్పర్శకారీ చ సోZ గ్రదానీ భావేత్ ధ్రువం || 45 తతో భవంతి మూకాస్తే బధిరాశ్చా త్రిజన్మసు | భార్యాహీనా వంశహీనా బుద్ధిహీనాస్తతః శుచిః || 46 మిత్రద్రోహీ చ నకులః కృతఘ్నశ్చాZపి గండకః | విశ్వాస ఘాతి వ్యాఘ్రశ్చ సప్త జన్మసు బారతే || 47 మిథ్యా సాక్షప్రదశ్చైవ భల్లూకః సప్తజన్మసు | పూర్వాన్ సప్త పరాన్సప్త పురుషాన్ హంతి చాత్మనః || 48 అబద్ధములు చెప్పువాడు దేవాలయార్చకుడుగా ఏడుజన్మలవరకుండును. మిత్రుడు మొదలగువారిపై (బ్రాహ్మణుడు , ఆవు మొ||) ఒట్టుపెట్టుకొని తప్పువాడు అగ్రదాని బ్రాహ్మణుడగును. అగ్రదాని యనగా మృతుడగు వానికి సంబంధించిన దానములను స్వీకరించు బ్రాహ్మణుడు అతనిని సాటి బ్రాహ్మణులే చిన్న చూపుతో చూతురు. వీరందరు మూడు జన్మలవరకు మూగవారుగాను, చెవిటివారుగాను, భార్య గతించిన వారుగాను, సంతానహీనులుగాను, బుద్ధిహీనులుగాను ఉందురు. మిత్రద్రోహము చేసిన వాడు ఏడు జన్మలవరకు ముంగిసగా పుట్టును. చేసిన మేలును మరిచిపోవువాడు. ఖడ్గమృగముగాను, తప్పుడు సాక్ష్యములిచ్చువాడు ఏడు జన్మల వరకు ఎలుగుబంటిగాను పుట్టును. వీరందరు తమకు ముందున్న ఏడు తరములవారిని, తరువాత రాబోవు ఏడు తరముల వారిని నరకమునకు పంపుదురు. నిత్యక్రియా విహీనశ్చ జడత్వేన యుతో ద్విజః | యస్యాZనస్థా వేదవాక్యే మందం హసతి సంతతం || 49 వ్రతోపవాస హీనశ్చ సద్వాక్య పరనిందకః | జిహ్మే జిహ్మో వసేత్సోZపి శతాబ్దం చ హిమోదకే || 50 జలజంతుర్భవేత్సోZపి శతజన్మక్రమేణ చ | తతో నానాప్రకారా చ మత్స్య జాతిస్తతః శుచిః || 51 ప్రతిదినము చేయవలసిన నిత్యకర్మలనన్నిటిని వదలి జడుడుగా నుండి వేదములందు విశ్వాసములేని బ్రాహ్మణుడు వ్రతములను ఉపవాసములను వదలి పెట్టి మంచి మాటలను, ఇతరులను నిందించు బ్రాహ్మణుడు నూరు సంవత్సరములు చల్లని నీటిలో నుండును. తరువాత నూరు సంవత్సరములు జల జంతువులుగా పుట్టును. అట్లే అనేక విధములైన చేపల జాతులలో పుట్టిన తరువాతనే పరిశుద్ధుడగును. యోవా ధనస్యాపహారం దేవ బ్రాహ్మణయోశ్చరేత్ | పాతయిత్వా స్వపురుషాన్ దశపూర్వాన్ దశాపరాన్ || 52 స్వయం యాతి చ ధూమాంధం ధూమధ్వాంత సమన్వితం | ధూమక్లిష్టో ధూమబోజీ వసేత్తత్ర చతుర్యుగం || 53 తతో మూషిక జాతిశ్చ శతజన్మని భారతే | తతో నానావిధాః పక్షిజాతియః కృమిజాతయః || 54 తతో నానావిధా వృక్షజాతశ్చ తతో నరః భార్యాహీనో వంశహీనః శబరో వ్యాధి సంయుతః || 55 తతో భ##వేత్ స్వర్ణకారః సువర్ణస్య వణిక్తథా | తతో యవన సేవీ చ బ్రాహ్మణో గణకస్తథా || 56 దేవ బ్రాహ్మణుల ధనమునపహరించువాడు తనకు ముందున్న పది తరములను తన తరువాత రాబోవు పదితరములను మొత్తము ఇరువది యొక్క తరములను నరకమునకు పంపును. తాను పొగ , చీకటి కల ధూమధ్వాంతమను నరకమునకు పోయి అచ్చట నాలుగు యుగముల వరకు బాధపడుచుండును. ఆ తరువాత భూమిపై పుట్టినను నూరు జన్మములవరకు ఎలుక జాతిలోను, తరువాత అనేక విధములైన పక్షిజాతులలోను, పురుగుల జాతులలోను, వృక్షజాతులలోను జన్మించును. ఆ తరువాత మానవుడై పుట్టినప్పుడు భార్యను కోల్పోయి, సంతాన రహితుడై రోగములచే బాధపడుచు శబరజాతిలో పుట్టును. అటుపిమ్మట అగసాలిగా, ఆ తరువాత బంగారు నమ్మువాడుగా ఆ తరువాత యవనులను సేవించువాడుగా , అటుపిమ్మట జ్యోతిష్కుడుగా పుట్టును. వప్రో దైపజ్ఞోపజీవి వైద్య జీవి చికిత్సకః . వ్యాపారీ లోహలాక్షాదే రసాదేః విక్రయీ చ యః || 57 స యాతి నాగవేష్టం చ నాగైర్వేష్టిత ఏవచ | వసేత్ స్వలోమమానాబ్దం తత్రవై నాగ దంశితః || 58 తతో భ##వేత్సగణకో వైద్యోవై సప్తజన్మసు | గోపశ్చ కర్మకారశ్చ శంఖకారస్తతః శుచిః || 59 జ్యోతిష్యమును చెప్పి, వైద్యము చేసి బ్రతుకు బ్రాహ్మణుడు లోహము, లత్తుక, పాదరసము మొదలగు వాటి క్రయ విక్రయములు చేయు బ్రాహ్మణుడు, నాగవేష్టమను నరకమున అనేక వేల సంవత్సరములు సర్పములు కాటువేయుచుండగా బాధలు పడుచుండును. తరువాత భూమిపై జన్మనెత్తినప్పుడు జ్యోతిష్కుడుగను. తరువాత ఏడు జన్మల వరకు వైద్యుడై పుట్టును. ఆ తరువాత గొల్లవాడుగను, కమ్మరిగను, శంఖకారుడుగను పుట్టి పాపములను వదిలించుకొనును. ప్రసిద్ధాని చ కుండాని కథితాని పతివ్రతే | అన్యాని చాప్రసిద్ధాని తత్ర క్షుద్రాణి సంతివై || 60 సంతి పాతకినస్తేషు స్వకర్మ పల భోగినః | భ్రమంతి తావత్సంసారే కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 61 ఓ సావిత్రి ! ప్రసిద్ధమైన నరకకుండముల గురించి నీకు చెప్పితిని, ఇంకను అప్రసిద్ధమైనవి చిన్న చిన్నవగుకుండములెన్నో అచ్చట కలవు. పాపాత్ములు తాము జీవించి యుండగా చేసికొన్న దుష్కర్మల ఫలితములను ఈ కుండములందు అనుభవించుచుందురు. నరకమునకు వచ్చు వరకు వారు సంసారమున మునిగియుందురు. ఓ సావిత్రి ! ఇంకను నీవు వినవలెనని అనుకొనుచున్న విషయములను స్వేచ్ఛగా అడుగుము. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే సావిత్య్రుపాఖ్యానే కర్మవిపాకే పాపినాం కుండనిర్ణయో నామ ఏకత్రింసత్తమోzధ్యాయః | శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన సావిత్రి ఉపాఖ్యానమున కర్మ విపాకముల వివరణ చేయు సందర్భమున తెల్పబడిన పాపుల కుండ నిర్ణయమను ముప్పది యొకటవ అధ్యాయము సమాప్తము.