sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ద్వత్రింశత్తమోధ్యాZయః- వైష్ణవుల ప్రాశస్త్యము

సావిత్ర్యువాచ- సావిత్రి ఇట్లనెను-

ధర్మరాజా మహాభాగ వేదవేదాంగ పారగ | నానాపురాణతిహాస పాంచ రాత్ర ప్రదర్శక || 1

సర్వేషు సారభూతం యత్‌ సర్వేష్టం సర్వసమ్మతం | కర్మచ్ఛేదే బీజరూపం ప్రశంస్యం సుఖదం నృణాం || 2

యశః ప్రదం ధర్మదం చ సర్వమంగళ మంగళం | యేన యామీం న తే యాంతి యాతనాం భవదుఃఖదాం || 3

కుండాని చ న పశ్యంతి తత్ర నైవ పతంతి చ | న భ##వేద్యేన జన్మాది తత్కర్మ వద సువ్రత || 4

వేద వేదాంగములు, అనేక పురాణములు, ఇతిహాసములు శాస్త్రములు తెలిసిన యమధర్మరాజా ! అన్ని కర్మలకు సారమైనది అందరకు ఇష్టమైనది, కీర్తిని ఇచ్చునది, ధర్మమును కలిగించునది, సమస్త పుణ్యకర్మలకు కూడా పుణ్యమైనది అగు కర్మను గూర్చి నాకు వివరింపుము. దేనిని ఆచరించుటవలన ప్రాణులు భయంకరమైన నీ దిక్కునకు రావో, సంసార దుఃఖమును కలిగించు యాతనలను పొందరో, నరకకుండములను చూడరో, వాటిలో పడరో, జన్మ మరణములను పొందరో అట్టి కర్మ విశేషమును నాకు తెలుపుము.

కిమాకారాణి కుండాని కాని తేషాం మతాని చ | కేన రూపేణ తత్రైవ సదా తిష్ఠతి పాపినః || 5

స్వదేహే భస్మసాద్భూతే యాంతి లోకాంతరం నారాః | కేన దేహేన వా భోగం భుంజతే వా శుభాZశుభం || 6

సుచిరం క్లేశభోగేన కథం దేహో న నశ్యతి | దేహోవా కిం విధో బ్రహ్మన్‌ తన్మే వ్యాఖ్యాతు మర్హసి || 7

నరక కుండలములెట్లుండును? పాపము చేయువారు ఏరూపమున నరకమున ఉందురు ? తాము మరణించిన తరువాత తమ పాంచ భౌతికదేహము భస్మము కాగా జీవులు ఎటువంటి దేహమును ధరించి తాము పూర్వజన్మమున చేసికొన్న పాపపుణ్యములననుభవింతురు? ఎంత కష్టముననుభవించినను నరకలోకమున ఆ దేహమెందువలన నశింపదు ? ఆ దేహము ఎటువంటిది అను విషయములనన్నిటిని నాకు వివరింపుడు.

నారాయమ ఉవాచ- నారాయణమూర్తి నారదునితో ఇట్లనెను-

సావిత్రీ వచనం శ్రుత్వా ధర్మరాజో హరిం స్మరన్‌ | కథాం కథితుమారేభే గురుం నత్వా చ నారద || 8

సావిత్రి యొక్క ప్రశ్నలు విని యమధర్మరాజు శ్రీహరిని స్మరించి గురువునకు నమస్కారము చేసి ఇట్లు సమాధానము చెప్పసాగెను.

యమ ఉవాచ -యమధర్మరాజు ఇట్లు పలికెను-

వత్సే చతుర్షు వేదేషు ధర్మో వై సంహితాసు చ | పూరాణష్వితిహాసేషు పాంచ రాత్రాదికేషుచ || 9

అన్యేషు సర్వ శాస్త్రేషు వేదాంగేషు చ సువ్రతే | సర్వేష్టం సారభూతం చ మంగళం కృష్ణసేవనం || 10

జన్మ మృత్యు జరా రోగ శోక సంతాప తారణం | సర్వమంగళ రూపం చ పరమానంద కారణం || 11

కారణం సర్వసిద్ధీనాం నరకార్ణవ తారణం | భక్తి వృక్షాంకురకరం కర్మ వృక్షనికృంతనం || 12

గోలోక మార్గసోపానమవినాశి పద ప్రదం | సాలోక్య సార్‌ష్టి సారూప్య సామీప్యాది ప్రదం శుభే || 13

అమ్మా ! శ్రీకృష్ణపరమాత్మసేవ సమస్త వేదములందు. సమస్త సంహితలందు సమస్త పురాణతిహాస, పాంచరాత్రాది శాస్త్రములందు, వేదాంగములందు చెప్పబడినది. ఇది సమస్త వేద వేదాంగాదులకు సమ్మతమైనది. మంగళకరమైనది.

శ్రీకష్ణుని సేవించుటవలన జన్మ, మృత్యువు, ముసలితనము, రోగములు, శోకము, బాధలు, కలుగవు. ఇది పరమానందమునకు కారణమైనది. ఇది సమస్త సిద్ధులను కలిగించును. నరకమనే సముద్రమును దాటించును. భక్తి యను వృక్షము యొక్క అంకురమును కలిగించును. అట్లే కర్మయను వృక్షమును ఛేదించును. గోలోకమార్గమునకు సోపానము వంటిది. నాశనము లేని మోక్షపదమును కలిగించును. సాలోక్య సార్‌ష్టి సారూప్య, సామీప్యము లను ముక్తులను కలిగించును.

కుండాని యమదూతం చ యమం చ యమ కింకరాన్‌ | స్వప్నేZపి న హి పశ్యంతి సతి శ్రీకృష్ణకింకరాః || 14

శ్రీకృష్ణ పరమాత్మను సేవించు భక్తులు నరకకుండములను, యమదూతలను, యమకింకరులను, యముని కలలోనైన చూడరు.

హరివ్రతం యే కుర్వంతి గృహిణః కర్మభోగినః | యే స్నాంతి హరితీర్థే చ నాశ్నంతి హరివాసరే || 15

ప్రణమంతి హరిం నిత్యం హర్యార్చాం పూజయంతిచ |న యాంతి తే చ ఘోరాం చ మమ సంయమినీం పురీం ||16

త్రిసంధ్య పూతా విప్రాశ్చ శుద్ధాచార సమన్వితాః | స్వధర్మనిరతాః శాంతాః న యాంతి యమ మందిరం || 17

కర్మఫలముననుభవించు గృహస్థులు శ్రీహరి వ్రతమును అనుష్ఠించినచో , శ్రీహరి తీర్థములైన పుణ్యతీర్థములలో స్నానము చేసినచో, శ్రీహరి వాసరమైన ఏకాదశినాడు నిరాహారులై యున్నచో, ప్రతిదినము శ్రీహరిని నమస్కరించుచున్నచో, శ్రీహరి అర్చావిగ్రమును పూజించినచో మిక్కిలి భయంకరమైన నా పట్టణమునకు రారు.

అట్లే పరిశుద్ధమైన ఆచారములు కలవారు. త్రిసంధ్యలందు సంధ్యావందన మాచరించి పరమ పవిత్రులైనవారు, తమ ధర్మమును లేశ##మైన తప్పనివారు. పరమ శాంతులు అగు బ్రాహ్మణులు యముని వాసమున కెన్నడును వెళ్ళరు.

తే స్వర్గ భోగిన్శోన్యేచ శుద్ధా దేవాన్య కింకరాః | యాంత్యాయాంతి చ మర్త్యంచ స్వర్గం చ నహి నిర్వృతాః || 18

స్వధర్మ నిరతాశ్చ్శాపి స్వధర్మ విరతాస్తథా | గచ్ఛంతో మర్త్యలోకం చ దుర్ధర్షాయమకింకరాః ||. 19

భీతాః కృష్ణోపాసకాచ్చ వైనతేయాదివోరగాః | స్వదూతే పాశహస్తంచ గచ్ఛంతం తం వదామ్యహం || 20

యాస్యసీతి చ సర్వత్ర హరిభక్తాశ్రమం వినా |కృష్ణమంత్రోపాసకానాం నామాని చ నికృంతనం || 21

కరోతి నఖరాంజల్యా చిత్రగుప్తశ్చ భీతవత్‌ |

ఇతర దేవతల భక్తులు, పరిశుద్ధులైన ఇతరులు కూడా స్వర్గలోక ఫలముననుభవింతురు. వారు తమ తమ పుణ్యకర్మలవలన స్వర్గలోకమునకు పోయెదరు. తిరిగి వారు భూలోకమునకు వత్తురు. ఈ విధముగా వారు భూలోక స్వర్గలోకములకు పోవుచుందురు. తిరిగివత్తురు. మోక్షమును మాత్రము పొందజాలరు.

స్వధర్మనిరతులు స్వధర్మవిరతులన మానవులందరు శ్రీకృష్ణుని సేవను తప్ప మోక్షమును కాంక్షింపరు.

భయంకరులగు నా కింకరులు శ్రీకృష్ణ మంత్రోపాసకుని చూచి గరుత్మతుని చూచిన సర్పములవలె భయపడిపోవుదురు. పాశమును ధరించి భూలోకమునకువెళ్ళుచున్న నా దూతలతో మీరు శ్రీహరి భక్తుల ఆశ్రమములవైపు వెళ్ళవలదని హెచ్చరింతును. శ్రీకృష్ణమంత్రోపాసన చేయు భక్తులపేర్లు సహితము మిమ్ము బాధలు పెట్టునని చెప్పుదును. చిత్రగుప్తుడు కూడ వారికి భయపడి వారిపేర్లను కొట్టివేయును.

మధుపర్కాదికం బ్రహ్మా తేషాం చ కురుతే పునః || 22

వలంఘ్య బ్రహ్మలోకం చ గోలోకం గచ్ఛతాం సతాం | దురితాని చ నశ్యంతి తేషాం సంస్పర్శ మాత్రతః || 23

యథా సుప్రజ్వలద్వహ్నౌ కాష్ఠాని చ తృణాని చ | ప్రాప్నోతి మోహః సమోహం తాంశ్చ దృష్ట్వాతిభీతవత్‌ || 24

కామశ్చ కామినం యాతి లోభక్రోధౌ తతః సతి | మృత్యుః పలాయతే రోగో జరా శోకో భయం తథా ||

కాలః శుభాzశుభ కర్మ హర్షో భోగస్తథైవచ | యే యే న యాంతి యామీం చ కథితాస్తే మయా సతి || 26

బ్రహ్మలోకమును దాటి గోలోకమునకు పోవుచున్న శ్రీకృష్ణభక్తులకు బ్రహ్మదేవుడు మధుపర్కాదికములనిచ్చి గౌరవించును. వారియొక్క స్పర్శవలననే పాపములన్ని బాగుగా ప్రజ్వలించుచున్న అగ్నిలో చిన్న చిన్న కట్టెలు, గడ్డిపోచలు పడి భస్మమైపోయినట్లు నశించుచున్నవి.

శ్రీకృష్ణభక్తులను చూచి మోహము ఎక్కువ భయపడి మూర్ఛపడిపోవును, మన్మథుడు, కోపము తొలగిపోవును. మృత్యువు, రోగము, ముసలితనము, శోకము, భయము, కాలుడు శుభాశుభకర్మలు, సంతోషము, అనుభవములన్నియు పరిగెత్తి పోవును.

ఓ సావిత్రీ! నీకు యమపురికి ఎవరెవరు వెళ్ళరో వారిని గూర్చి విపులముగా తెల్పితిని.

శ్రుణు దేహస్య వివృతిం కథయామి యథాగమం | పృథివీ వాయురాకాశం తేజస్తోయమితి స్ఫుటం || 27

దేహినాం దేహబీజం చ స్రష్టుః సృష్టివిధౌ పరం |పృథివ్యాది పంచభూతైశ్చ యో దేహో నిర్మితో భ##వేత్‌ || 28

స కృత్రిమో నశ్వరశ్చ భస్మసాచ్చ భ##వేదిహ |

ఇక శరీరమును గురించి విపులముగా నీకు వవరింతును. భూమి, వాయువు, ఆకాశము, అగ్ని, నీరు అను పంచభూతములు బ్రహ్మదేవుడు జీవులను సృష్టించునపుడు, వారి శరీరమునకు కారణములగుచున్నవి. ఈ దేహము పృథివ్యాది పంచభూతముల వలన నిర్మించబడినది. అందువలననే ఇది కృత్రిమమైనది అశాశ్వతమైనది. బూడిదయగునది.

వృద్ధాంగుష్ఠ ప్రమాణన యో జీవః పురుషాకృతిః || 29

భిభర్తి సూక్ష్మదేహం చ తద్రూపం భోగహేతవే | స దేహో న భ##వేద్భస్మ జ్వలదగ్నౌ మమాలయే || 30

జలే న నష్టో దేహో వా ప్రహారే సుచిరం కృతే | న శ##స్త్రే చ న చాస్త్రేచ సుతీక్ష్‌ణ కంటకే తథా || 31

తప్తద్రవే తప్తలౌహే తప్త పాషాణ ఏవచ | ప్రతప్త ప్రతిమాశ్లేషేzప్యత్యూర్ధ్వ పతనేzపి చ || 32

న చ దగ్ధో న భగ్నశ్చ భుంక్తే సంతాప మేవచ |

పురుషాకారమున నున్న జీవుడు బొటనవ్రేలు ప్రమాణమున (అగుష్ఠమాత్రుడై) నుండి సుఖదుఃఖముల ననుభవించుటకై సూక్ష్మదేహమును కలిగియుండును.

జీవుని సూక్ష్మదేహము నా పట్టణమున (నరకములో) బాగుగా మండుచున్న అగ్నిలో వేసినను భస్మము కాదు. నీటిలో ముంచినను, చాలాకాలము దెబ్బలు కొట్టుచున్నను, శస్త్రాస్త్రములచే కొట్టినను నశింపదు. అట్లే వాడియైన ముండ్లతో కొట్టినను,

మండుచున్న ద్రవములో ముంచినను మండుచున్న లోహమున మండుచున్న రాతిపై వేసినను, బాగుగా మండుచున్న ప్రతిమను కౌగిలించుకొన్నను, చాలా ఎత్తుపైనుండి కిందికి తోసినను దగ్ధము కాదు. భగ్నము కాదు. కాని బాధలను మాత్రమనుభవించును. కథితం దేవి వృత్తాంతం కారణం చ యథాగమం | కుండానాం లక్షణం సర్వం నిబోధ కథయామి తే || 33

ఓ సావిత్రి! దేహ వృత్తాంతమును, పార్థివ దేహము, నశించిన తరువాత శుభాzశుభఫలములననుభవించుటకు గల కారణమును వివరించితిని.

ఇక నరకములోని కుండముల లక్షణమును చెప్పెదను. జాగ్రత్తగా వినుమని యమధర్మరాజు పలికెను.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే ద్వాత్రింశత్తమోzధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల పంవాద సమయమున తెలుపబడిన సావిత్ర్యుపాఖ్యానములో

ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters