sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
త్రయస్త్రింశోzధ్యాయః - నరక కుడముల వర్ణన యమ ఉవాచ- యముడు సావిత్రితో ఇట్లనెను- పూర్ణేందు మడలాకారం సర్వకుండం చ వర్తులం | అతీవ నిమ్నం పాషాణ భేదైశ్చ ఖచితం సతి || 1 న నశ్వరం చాప్రళయం నిర్మితం చేశ్వరేచ్ఛయా | క్లేశదం వై పాతకినాం నానారూపం తదాలయం || 2 జ్వలదంగారరూపం చ శతహస్త శిఖాన్వితం | పరితః క్రోశమానం చ వహ్నికుండం ప్రకీర్తితం || 3 నరకములో నున్న అన్ని కుండములు పున్నమి నాటి చంద్రుని వలె గుండ్రముగా నుండును. మిక్కిలిలోతైనవి. అనేక విధములైన రాళ్ళచే కట్టబడినవి. ఈ నరకకుండములన్ని నశింపవు. ఇవి ప్రళయమున సైతము ధ్వంసము కావు. భగవంతుని ఇచ్ఛవలననే అవి నిర్మించబడినవి. పాపములు చేసి కొన్నవారికి మిక్కిలి కష్టమును కలిగించు ఆ కుండములు అనేక రూపములలో నున్నవి. వాటిలో మండుచున్న నిప్పులవలెనుండునది, నూరు హస్తముల ఎత్తులేచుచున్న జ్వాలలు కలది, క్రోశపరిమాణము (మూడు కిలోమీటర్లు?) కలది వహ్ని కుండము. మహచ్ఛబ్దం ప్రకుర్వద్భిః పాపిభిః పరిపూరితం | రక్షితం మమదూతైశ్చ తాడితైశ్చాపి సంతతం || 4 ప్రతప్తోదక పూర్ణం చ హింస్ర జంతు సమన్వితం | మహాఘోరాంధకారం చ పాపిసంఘేన సంకులం || 5 నాదూతలు పెట్టువాధలు సహింపలేక బిగ్గరగా ఏడ్చుచున్న పాపులు కలది, నానా భయంకరమైన జంతువులతో నిండినది, అతి భయంకరమైన చీకటి గలది, నాదూతలచే ఎల్లప్పుడు రక్షింపబడునది ప్రతప్త కుండము. ప్రకుర్వతా మహచ్ఛబ్దం ప్రహరైర్వర్ణితేన చ | క్రోశార్ధమానం మద్దూతైః తాడితేన చ రక్షితం || 6 తప్తక్షారోదకైః పూర్ణం నక్రైశ్చ పరివేష్టితం | సంకులం పాపిభిశ్చైవ క్రోశమానం భయానకం || 7 సలసలమఱుగు ఉప్పునీళ్లతో నిండినది, మొసళ్ళచే నిండినది, ఒక క్రోశపరిమితమైనది క్షారకుండము. త్రాహీతి శబ్ధం కుర్వద్భిః మమదూతైశ్చ తాడితైః | ప్రచలద్భిరనాహారైః శుష్కకంఠౌష్ఠతాలుకైః || 8 విణ్మూత్రైరేవ పూర్ణం చ క్రోశమానం చ కుత్సితం | అతి దుర్గంధి సంయుక్తం వ్యాప్తం పాపిభిరేవచ || 9 నా యొక్క దూతలు బాధపెట్టుచుండగా, ఆహారము లేక నోరు ఎండుకొని పోవుచుండగా రక్షింపుమని ఎలుగెత్తి అరచుచున్న పాపులతో నిండినది, మలమూత్రములచే నిండినది, మిక్కిలి దుర్వాసన కలది, క్రోశపరిమితమైనది మలకుండము. తాడితైర్మమ దూతైశ్చాప్యనాహారైరుపద్రవైః | రక్షేతి శబ్దం కుర్వద్భిఃతత్కీటైరేవ భక్షితం ||10 తప్త మూత్రద్రవైః పూర్ణం మూత్ర కీటైశ్చ సంకులం | యుక్తం మహాపాపిభిశ్చ తత్కీటైర్దంశితం సదా || 11 గవ్యూతిమానం ధ్యాంతాక్తం శబ్దకృద్భిశ్చ సంతతం | నాభటులు దండించుచుండగా ఆహారములేక రక్షించమని ఎలుగెత్తి అరుచుచున్న మహాపాపులతో నిండినది, సలసలకాగు మాత్రముచే, మూత్రమునందుండు క్రిములతో నిండియున్నది, రెండుకోసుల వైశాల్యము కలది, చిమ్మచీకటితో యుండునది మూత్రకుండము. మద్దూతైస్తాడితైర్ఘోరైః శుష్కకంఠోష్ఠతాలుకైః || 12 శ్లేష్మపూర్ణం క్రోశమితం వేష్టితం చేష్టితైః సదా | తద్భోజిభిః పాపిభిశ్చ తత్కీటైర్భక్షితః సదా || 13 నా యొక్క దూతలు బాధింపుచుండగా నోళ్ళు ఎండుకొనిపోగా, శ్లేషమునే భుజించు పాపులతో నిండి క్రోశపరిమితమైనది శ్లేష్మకుండము. ఆ కుండమున ఉండు పాపులను అందలి క్రిములే భక్షించుచుండును. క్రోశార్థం గరపూర్ణం చ గరభోజిభిరన్వితం | గరకీటైర్భక్షితైశ్చ పాపిభిః పూర్ణమేవచ || 14 తాడితైర్మమ దూతైశ్చ శబ్దకృద్భిశ్చ కంపితైః | సర్పాకారైర్వజ్ర దంష్ట్రైః శుష్కకంఠైః సుదారుణౖః || 15 గరళకుండము అర్ధక్రోశ వైశాల్యముతో నుండును. అచ్చట వజ్రములవంటి పండ్లు గల పాములుండును. అచ్చట ఉండు పాపులను విషమునందుండు క్రిములు భక్షించుచుండును. నా భటులు వారిని బాధించుచుండగా వణుకుచు ఎండిపోయిన గొంతులతో బిగ్గరగా వారు అరచుచుందురు. నేత్రయోర్మలపూర్ణం చ క్రోశార్ధం కీట సంయుతం | పాపిభిః సంకులం శశ్వత్ ద్రవద్భిః కీటభక్షితైః || 16 దూషికా (కండ్లలోని ఊసు) కుండము కంటిలోని మలముతో నిండియుండును. అచ్చట నేత్రమలములోని కీటకములుండును. దూషికాకుండమున నుండు పురుగులు అచ్చటి పాపులను విపరీతముగా బాధిచుచుండును. వసారసేన పూర్ణంచ క్రోశతుర్యం సుదుస్సహం | తద్భోజిభిః పాతకిభిః వ్యాప్తం దూతైశ్చ తాడితైః || 17 వసాకుండము వసారసముతో నిండియుండును. అచ్చటనుండు పాపులు యమభటులచే బాధలు పడుచు ఆ వసనే తినుచుందురు. శుక్రపూర్ణం క్రోశతుర్యం శుక్రకీటైశ్చ భక్షితైః | క్రందిద్భిః పాపిభిః శశ్వత్సంకులం వ్యాకులైర్భియా || 18 శుక్ర కుండము శుక్రముచే నిండియుండును. అది నాలుగు క్రోశముల వైశాల్యము కలది. అచ్చటనున్న పాపులను శుక్రకీటకములు భక్షించుచుండును. దుర్గంధి రక్తపూర్ణం చ వాపీమానం గభీరకం | తద్భోజిభిః పాపిభిశ్చ సంకులం కీటభక్షితైః || 19 రక్తకుండమున దుర్గంధము కల రక్తముండును. అది దిగుడు బావివలె చాలా లోతైయుండును. ఆ కుండమున నున్న పాపులు దుర్గంధము కల రక్తమును తినుచు పురుగులచే తమ శరీరములు భక్షింపబడుచుండగా బాధలు పడుచుందురు. పూర్ణం నేత్రాశ్రుభిః నౄణాం వాప్యర్థం పాపిభిర్యుతం | తాడితం మమ దూతైశ్చ తద్భక్ష్యైః కీటభక్షితైః || 20 అశ్రుకుండము మానవుల కన్నీళ్ళతో నిండియుండును. దాని వైశాల్యము రక్తకుండమున సగముండును. అశ్రు కుండమున నున్న పాపులు నా భటులచే దండన పొందుచు కన్నీళ్ళనే ఆహారముగ స్వీకరించి కీటకములు తమ శరీరమును భక్షించుచుండగా బాధపడుచుందురు. నౄణాం గాత్రమలైః పూర్ణం తద్భక్ష్యైః పాపిభిర్యుతం | తాడితైర్మమ దూతైశ్చ వ్యగ్రైశ్చ కీట భక్షితైః || 21 గాత్ర మలకుండము మానవుల శరీరమందలి మలముచే నిండియుండును. అచ్చట నున్న పాపులను నాభటులు దండించుచుండగా అందలి కీటకములు వారి శరీరములను భక్షించుచుండగా ఆ శరీరమలమునే అచ్చటి పాపులు భక్షించుచుందురు. కర్ణవిట్ పరిపూర్ణంచ తద్భక్షైః పాపిభిర్యుతం | వాపీతుర్య ప్రమాణం చ రుదద్భిః కీట భక్షితైః || 22 కర్ణమల కుండమున చెవులలోని మలమంతా ఉండును. అది వాపి కంటె నాల్గురెట్లెక్కువగా నుండును. అందలి పాపులు యమదూతలచే దండింపబడుచు, కీటకములు వారి శరీరమును భక్షించుచుండగా ఆకలివలన చెవిలోని మలమునే తినుచుందురు. మజ్జాపూర్ణం నరాణాం చ మహాదుర్గంధి సంయుతం | మహా పాతకిభిర్యుక్తం వాపీ తుర్య ప్రమాణకం || 23 మానవుల యొక్క ఎముకలలోనుండు ''మూల్గు'' తో నిండినది మాజ్జాకుండము. అది మిక్కిలి దుర్వాసనతో నుండును. దాని వైశాల్యము వాపీతుర్యము (నాల్గు బావులు ). అచ్చట నున్న మహాపాపాత్ములు ఆమూల్గునే తినుచు యమభటుల దండనకు గురి¸°దురు. పరిపూర్ణం స్నిగ్ధమాంసైర్మమ దూతైశ్చ తాడితైః | పాపిభిః సంకులం చైవ వాపీమానం భయానకం || 24 మాంసపు ముద్దలతో నిండియున్నది మాంసకుండము. అది వాపీ ప్రమాణమున నుండును. అచ్చట నున్న పాపులను నా భటులెల్లప్పుడు దండించుచునే యుందురు. కన్యా విక్రయిభిశ్చైవ తద్భక్ష్యేః కీటభక్షితైః | త్రాహీతి శబ్దం కుర్వద్భిః త్రాసితైశ్చ భయానకం || 25 మాంసకుండమున నున్న పాపులు డబ్బుకు కక్కుర్తిపడి తమ కన్యలను ముసలివారికిచ్చి పెండ్లి చేసిరి, వారి నా భటులు కఠినముగా దండించుచుండగా వారు భయపడి రక్షింపమని ఎలుగెత్తి అరచుచుందురు. వారి శరీరమును కీటకములు తినుచుండును. ఇంకను వారికి ఆహారము లేనందువలన దుర్గంధపూరితమైన అచ్చటి మాంసమును తినుచుందురు. వాపీతుర్యప్రమాణం చ నఖాదిక చతుష్టయం | పాపిభిః సంకులం శశ్వత్ మమ దూతైశ్చ తాడితైః || 26 నఖ కేశాది కుండములు నాలుగు బావుల వైశాల్యమున నుండును. అచ్చటి పాపులను నాభటులెల్లప్పుడు దండించుచునే యుందురు. ప్రతప్త తామ్రకుండం చ తామ్ర పర్యున్ముఖాన్వితం | తామ్రాణాం ప్రతిమా లక్షైః ప్రతపై#్తరావృతం సదా || 27 ప్రత్యేకం ప్రతిమాశ్లిష్టైః రుదద్భిః పాపిభిర్యుతం | గవ్యూతిమానం విస్తీర్ణం మమ దూతైశ్చ తాడితైః || 28 ప్రతప్త తామ్ర కుండమును బాగుగా కాలిన రాగి బొమ్మలు లక్షల సంఖ్యలోనుండును, ఆ కుండము గవ్యూతి (రెండు కోసులు) విశాలమైనది, అచ్చటనున్న పాపులను నా భటులు దండించుచుండగా వారు బాగుగా కాలిన రాగి బొమ్మలను కౌగిలించుకొని బొబ్బలు పెట్టుచుందురు. ప్రతప్తలోహ ధారం చ జ్వలదంగారసంయుతం | లోహానాం ప్రతిమా లక్షైః ప్రతపై#్తరావృతం సదా || 29 ప్రత్యేకం సర్వ సంశ్లిష్టైః శశ్వద్విచలితైర్భియా | రక్ష రక్షేతి శబ్దంచ కుర్వద్భిర్దూతతాడితైః || 30 మహాపాతకిభిర్యుక్తం ద్విగవ్యూతి ప్రమాణకం | భయానకం ధ్వాంతయుక్తం లౌహకుండం ప్రకీర్తితం || 31 లోహకుండము బాగుగా కాలుచున్న లోహ ప్రతిమలచే నిండి ఉండును. ఆలోహప్రతిమలు మండుచున్న నిప్పుల మధ్యనుండును. యమ భటులు పాపులను ఆ ప్రతిమలను కౌగలించుకొమ్మని అధికముగా దండించుచుందురు. అప్పుడాపాపులు చేయుశబ్ధము మహాభయంకరమైనది. ఘర్మకుండం తప్తసురాకుండం వాప్యర్ధమేవ చ | తధ్భోజిభిః పాపిభిశ్చ వ్యాప్తం మద్దూత తాడితైః 32 అధః శాల్మలి వృక్షస్య తీక్ష్‌ణకంటక కుండకం | లక్షపౌరుషమానం చ క్రోశమానం చ దుఃఖదం || 33 ధనుర్మానే కంటకైశ్చ సుతీక్ష్‌ణౖః పరివేష్టితం || 34 ప్రత్యేకం కంటకైర్విద్ధం మహాపాతకిభిర్యుతం | వృక్షాగ్రాన్నిపతద్భిశ్చ మమ దూతైశ్చ తాడితైః || 35 జలం దేహీతి శబ్దం చ కుర్వద్భిః శుష్కతాలుకైః | మహాభయాతి వ్యగ్రైశ్చ దండ సంభిన్నమస్తకైః || 36 ƒ«sLRiNRPª«sVVƒ«s ƒ¯NRP „saSÌÁ\®ªsVƒ«s ‡ÁWLRiVgRiV¿ÁÈíÁV NRPÌÁµR…V. A ¿ÁÈíÁVNTPLiµR… ¼d½ORPQßáNRPLiÈÁNRP NRPVLi²R…ª«sVV NRPÌÁµR…V. A NRPVLi²R…ª«sVVÍÜ[¬s ª«sVVLi²ýR…V ¿yÍØ ªy²T…gRiÌÁ\®ªs µ³R…ƒ«sxqs=Li»R½ F~²R…ª«sogRiÌÁ\®ªs DLi²R…Vƒ«sV. @¿RÁèÉÓÁ FyxmsoÌÁV ƒy µR…W»R½ÌÁ¿Á[ Ëص³j…Lixms‡Á²R…V¿RÁV A ‡ÁWLRiVgRiV ¿ÁÈíÁV \|ms ˳ØgRiª«sVVƒ«sVLi²T… C¼d½ORPQßá NRPLiÈÁNRP NRPVLi²R…ª«sVVƒ«s xms²R…V¿RÁVLiµR…VLRiV. ƒy µR…W»R½ÌÁV ªyLji¬s N]ÈíÁV¿RÁVLi²R…gS ªyLji »R½ÌÁÌÁV ÀÁÉýÓÁF¡ª«so¿RÁVLi²R…Vƒ«sV. @xmsöV²R…V ªyLRiV FsLi²T…F¡ª«so¿RÁVƒ«sõ g]Li»R½V»][ ¬dsLRiV NSª«sÛÍÁƒ«s¬s G²R…Vè¿RÁVLiµR…VLRiV.
విషౌఘైస్తక్షకాదీనాం పూర్ణం చ క్రోశమానకం | తద్భక్ష్యైః పాపిభిర్యుక్తం మమ దూతైశ్చ తాడితైః || 37
విషకుండమున తక్షకుడు మొదలగు మహాసర్పముల విషముండును. దాని వైశాల్యము క్రోశ పరిమితము. అచ్చటి పాపులు నా భటులచే దండింపబడుచు అచ్చటి విషమునే ఆహారముగా స్వీకరించుచుందురు.
ప్రతప్త తైలపూర్ణం చ కీటాది పరివర్జితం | తద్భక్ష్యైః పాపిభిర్యుక్తం స్నిగ్ధగాత్రైశ్చ వేష్టితైః || 38
కాకు శబ్దం ప్రకుర్వద్భిశ్చలద్భిర్దూత తాడితైః | మహాపాతకిభిర్యుక్తం ద్విగవ్యూతి ప్రమాణకం || 39
ప్రతప్త తైలకుండమున కీటకములేవి యుండవు. అది రెండు గవ్యూతుల విశాలమైనది. అచ్చటి పాపులు నా భటులచే దండింపబడుచు మరుగుచున్న నూనెలో పడి హాహాకారములు చేయుచుందురు.
శస్త్రకుండం ధ్వాంతయుక్తం క్రోశమానం భయానకం | శూలాకారైః సుతీక్షాగ్రైః లోహశ##సై#్త్రశ్చ వేష్టితం || 40
శస్త్ర తల్పస్వరూపం చ క్రోశతుర్య ప్రమాణకం | పాతకిభిర్వేష్టితం చ కుంతవిద్దైశ్చ వేష్టితం || 41
తాడితైర్మమ దూతైశ్చ శుష్కకంఠోష్ఠతాలుకైః |
శస్త్రకుండము చిమ్మచీకటివలన మహాభయంకరమై ఉండును. అచ్చట మిక్కిలి వాడియైన శూలములవంటి అనేక లోహశస్త్రములుండును. ఆ కుండము నాలుగు కోసుల వైశాల్యముతో నుండును. అక్కడనుండు పాపులను నా భటులు కుంతము మొదలగు ఆయుధములతో పొడుచుచు బాధలకు గురిచేయుదురు.
కీటైః సంపీడ్యమానైశ్చ సర్పయానైర్భయం కరైః || 42
తీక్ష్‌ణదంతైశ్చ వికృతైర్వ్యాప్తం ధ్యాంతయుతం సతి | మహాపాతకిభిర్యుక్తం భీతైర్వా కీట భక్షితైః |
రుదద్భిః క్రోశమానం చ మమ దూతైశ్చ తాడితైః || 43
క్రిమి కుండము, భయంకరమైనవి, వికృతమైనవి వాడియైన పండ్లుగలవి, సర్పములవలె ఇటునటు తిరుగునవి యగు కీటకములచే నిండి యుండును. అది కోసు వైశాల్యము గలది. అచ్చటి పాపులను నా భటులు దండించుచుండగా అచ్చటి పురుగులు భక్షించుచుండగా వారు దుఃఖమున హాహాకారములు సేయుదురు.
అతి దుర్గంధిసంయుక్తం క్రోశార్థం పూయసంయుతం | తద్భక్ష్యైః పాపిభిర్యుక్తం మమ దూతైశ్చ తాడితైః || 44
పూయకుండము మిక్కిలి దుర్గంధముతోనుండును. అది క్రోశార్ధ పరిమితము. అచ్చట నున్న పాపులు నా భటులచే దండింపబడుచు ఆ రసినే తినుచుందురు.
ద్విగవ్యూతి ప్రమాణం చ హిమతోయ ప్రవూరితం | తాళ వృక్ష ప్రమాణౖశ్చ సర్పకోటిభిరావృతం || 45
సర్పవేష్టిత గాత్రైశ్చ పాపిభిః సర్పభక్షితైః | సంకులం శబ్దకృద్భిశ్చ మమ దూతైశ్చ తాడితైః || 46
సర్పకుండము రెండు గవ్యూతుల వైశాల్యమున నుండును. అచ్చట మిక్కిలి చల్లనైన నీరుండును. అచ్చటనున్న సర్పములు తాటిచెట్టంత పొడవుగ ఉండును. అచ్చట నుండు పాపుల శరీరముల చుట్టు పాములు చుట్టుకొని ఉండును. వారిని నా దూతలు దండించుచుండగా సర్పములు కరచుచుండును. అందువలన వారాబాధలకు తాళ##లేక హాహాకారములు చేయుదురు.
కుండత్రయం మశాదీనం పూర్ణం చ మశకాదిభిః | సర్వం క్రోశార్ధమానం చ మహాపాతకిభిర్యుతం || 47
హస్తపాదాదిభిర్బద్దైః క్షత్రైః క్షతజలోహితైః | హాహేతి శబ్దం కుర్వద్భి ప్రచలద్భిశ్చ సంతతం || 48
మశకాది మూడు కుండములు దోమలు మొదలైన వాటితో నిండియుండును. అవి అరకోసు వైశాల్యమున నుండును. అచ్చటనుండు పాపుల చేతులకు దోమలు విపరీతముగా కుట్టుట వలన అవి రక్తమువలె ఎఱ్ఱగా నుండును. వాటివలన నాభటుల దండనమువలన అచ్చటి పాపులు ఎల్లప్పుడు హాహాకారము చేయుచుందురు.
వజ్రవృశ్చికయోః కుండం తాభ్యాం చ పరిపూరితం | వాప్యర్థం పాపిభిర్యుక్తం వజ్రవృశ్చిక దంశితైః || 49
వజ్రవృశ్చిక కుండములు వజ్రములు, తేళ్ళతో ఎల్లప్పుడు నిండియుండును. వాటి వైశాల్యాము దిగుడుబావిలో సగముండును. ఆయా కుండములలో ఉండు పాపులను ఎల్లప్పుడు వజ్రములు, వృశ్చికములు కాటువేయుచునే యుండును.
కుండత్రయం శరాదీనాం తైరేవ పరిపూరితం | తైర్విద్దైః పాపిభిర్యుక్తం వాప్యర్ధం రక్తలోహితైః || 50
శరాది మూడు కుండుముల శరాదుల చేతనే నిండియుండును. వాటి వైశాల్యము వాపిలో సగముండును. అచ్చటనుండు పాపులు బాణములు మొదలగువాని దెబ్బలవలన రక్తమువలె ఎఱ్ఱనైయుందురు.
తప్తపంకోదకైః పూర్ణం సధ్వాంతం గోళకుండకం | కీటైః సంపీడ్యమానైశ్చ భక్షితైః పాపిభిర్యుతం || 51
వాప్యర్థం పరిపూర్ణం చ జలస్థైః నక్ర కోటిభిః | దారుణౖర్వికృతాకారైః భక్షితైః పాపిభిర్యుతం || 52
విణ్మూత్రశ్లేష్మభ##క్ష్యైశ్చ సంయుక్తం శతకోటిభిః | కాకైశ్చ వికృతాకారైః ధనుర్లక్షం చ పాపిభిః || 53
గోళకుండమున మరిగిపోవుచున్న బురదనీరుండును. అచ్చటి పాపులను అచ్చట నున్న కీటకములు ఎల్లప్పుడు బాధించుచుండును.
నక్రకుండమున అనేక మొసళ్ళుండును. భయంకరము, వికారమైన రూపుగల మొసళ్ళు అచ్చటనుండు పాపులనెల్లప్పుడు బాధించుచుండును.
కాకకుండమున నున్న పాపులను శతకోటి సంఖ్యలో నున్న బయంకరమైన కాకులు పొడుచుచుండును. వారు మలమూత్రములను, శ్లేష్మమును భక్షించుచు బాధలు పడుచుందురు.
సంచాలవాజయోః కుండం తాభ్యాం చ పరిపూరితం | భక్షితైః పాపిభిర్యుక్తం శబ్ద కృద్భిశ్చ సంతతం || 54
సంచాలవాజి కుండములందున్న పాపులు యమభటుల దండనలచే హాహాకారము చేయుచుందురు. ధనుః శతం వజ్రయుక్తం పాపిభిః సంకులం సదా | శబ్దకృద్భిర్వజ్రదగ్దైః అంతర్ద్వాంతమయం సదా || 55
వాపీ ద్విగుణ మానం చ తప్త ప్రస్తర నిర్మితం | జ్వలదంగార సదృశం చలద్భిః పాపిభిర్యుత || 56
క్షురధారోపమైస్తీక్ష్‌ణౖః పాషాణౖర్నిర్మితం పరం | మహాపాతకిభిర్యుక్తం క్షతం క్షతజలోహితైః || 57
దుర్గంధిలాలాపూర్ణం చ తద్భక్ష్యైః పాపిభిర్యుతం క్రోశమానం గభీరం చ మమ దూతైశ్చ తాడితైః || 58
తప్తతోయేzంజనాకారైః పరిపూర్ణం ధనుః శతం | లచద్భిః పాపిభిర్యుక్తం మమ దూతైశ్చ తాడితైః || 59
పూర్ణం చూర్ణద్రవైః క్రోశమానం పాపిభిరన్వితం తద్భోజిభిః ప్రదగ్దైశ్చ మమ దూతైశ్చ తాడితైః || 60
''వజ్రకుండము''న వజ్రములుండును. అది చిమ్మచీకటిగానుండును. దాని వైశాల్యము నూరు ధనువులైయుండును అట్లే ''తప్త పాషాణకుండము మండుచున్న రాళ్ళచే నిర్మింపబడినది. దాని వైశాల్యము రెండు బావులంత యుండును. దానిలో నున్న రాళ్ళు మండుచున్న నిప్పు కణికలవలె నుండును ''తీక్షణపాషాణకుండము'' కత్తి యంచువలె వడియైన రాళ్ళచే నిర్మించబడినది. అందలి పాపులు ఆరాళ్ళ దెబ్బలవలన రక్తము వలె ఎఱ్ఱగానుందురు. ''లాలాకుండము'' దుర్వాసనగల లాలజలముతో నిండియుండును. ఆ కుండము మిక్కిలి లోతు కలదై ఒక కోసు వైశాల్యమున నుండును. ''తప్తమషీకుండము'' న సలసలమరుగుచున్న నీటిలో కాటుకవలె నల్లనైన ఆకారముగల పాపులు ఇటునటు తిరుగుచుందురు. అది నూరు ధనువుల విశాలమై యుండును. ''చూర్ణకుండము'' చూర్ణద్రవములచే నిండి యుండును. అచ్చటి పాపులు నా దూతలచే దండింపబడుచు ఆ చూర్ణద్రవమునే తినుచు బాధపడుచుందురు.
కుండం కులాల చక్రాభం ఘూర్ణ్యమానం చ సంతతం | సుతీక్ష్‌ణషోడశారం చ ఘూర్ణితైః పాపిభిర్యుతం || 61
అతీవ వక్రం నిమ్నం చ ద్విగవ్యూతి ప్రమాణకం | కందరాకార నిర్మాణం తప్తోదక సమన్వితం || 62
చక్రకుండము కుమ్మరివాని సారె (చక్రము) వలె ఎల్లప్పుడు తిరుగుచుండును. ఆ చక్రమున కుండు ఆరెలు చాలా వాడిగానుండును. ఆ చక్రకుండము గుహవలె చాలా లోతుకలదై రెండు గవ్యూతుల వైశాల్యముతో బాగుగా మఱుగుచున్న నీటితో ఉండును.
మహాపాతకిభిర్యుక్తం భక్షితైః జల జంతుభిః | ప్రచలద్భిః ధ్వంతయుక్తం భయానకం || 63
కోటిభిర్వికృతాకారైః కుచ్ఛపైశ్చ సుదారుణౖః జలస్థైః సంయుతం తైశ్చ భక్షితైః పాపిభిర్యుతం || 64
కూర్మకుండమున మిక్కిలి భయంకరమైన అనేక కూర్మములుండును. అచ్చటి పాపులనా జలజంతువులు ఎల్లప్పుడు భక్షించుచుండును. అది మిక్కిలి చీకటిమయమై భయంకరమై యుండును.
జ్వాలా కలాపైస్తేజోభిర్నిర్మితం క్రోశమానకం | శబ్దకృద్భిః పాపిభిశ్చ చలద్భిః సంయుతం సదా || 65
క్రోశమానం గభీరం చ తప్తభస్మభిరన్వితం | శశ్వచ్చలద్భిః సంయుక్తం పాపిభిర్భస్మ భక్షితైః ||66
చాల గొప్పనైన అగ్నిజ్వాలలతో క్రోశ వైశాల్యము కలది, '' జ్వాలాకుండము'' మిక్కిలి లోతుకలది, మండుచున్న భస్మముతో నిండినది భస్మకుండము. అచ్చటి పాపుల శరీరమంతయు కాలుచున్న భస్మముతో నిండి యుండును. వారు ఆకలికి తాళ##లేక మండుచున్న భస్మమునే తినుచుందురు.
తప్తపాషాణ లోష్ఠానాం సమూహైః పరిపూరితం | ప్రాణిభిర్దగ్ధగాత్రైశ్చ యుక్తం వై శుష్కతాలుకైః || 67
క్రోశమానం ధ్వాంతమయం గభీరమతిదారుణౖః | తాడి తైర్మమ దూతైశ్చ దగ్ధకుండం ప్రకీర్తితం || 68
దగ్ధ కుండమున మిక్కిలి మండుచున్న రాళ్లు, కట్టెలతో నిండియుండును. అది క్రోశ వైశాల్యముతో నుండును. చిమ్మచీకటితో చాలా లోతైయుండును. ఆ కుండమున నున్న పాపులు తమ శరీరములు కాలిపోవుచుండగా గొంతు నాలుక ఎండుకొని పోవునట్లు, నాభటులచే దండింపబడుచుందురు.
అత్యూర్మియుక్త తోయం చ ప్రతప్తక్షారసంయుతం | నానా ప్రకార వికృతం జలజంతు సమన్వితం || 69
ద్విగవ్యూతి ప్రమాణం చ గభీరం ధ్వాంతసంయుతం | తద్భక్ష్యైః పాపిభిర్యుక్తం దంశితైర్జల జంతుభిః || 7 0
చలద్భిః క్రందమానైశ్చ న పశ్యద్భిః పరస్పరం | ఉత్తప్తసూర్మికుండం చ కీర్తితం చ భయానకం || 71
''తప్తసూర్మికుండము గొప్పనైన అలలతో, మిక్కిలి వేడియైన ఉప్పునీటితో నిండియుండును. అచ్చట చాలా భయంకరమైన జలజంతువులుండును. దాని వైశాల్యము రెండు గవ్యూతులు (నాలుగు కోసులు). అది చాలా లోతై చిమ్మచీకటిగా నుండును. అచ్చటి పాపులను జలజంతువులెప్పుడు భక్షించుచుండును. వారు అచ్చటనే తిరుగుచున్నను చీకటివలన ఒకరికొకరు కనపబడరు.
ఆసిపత్రవనసై#్యవాప్యుచ్చైస్తాలతరోరధః క్రోశార్ధమానకుండం చ పతత్పత్ర సమన్వితం || 72
పాపినాం రక్తపూర్ణం చ వృక్షాగ్రాత్పతతాం పరం | పరిత్రాహీతి శబ్దం చ కుర్వతామసతామపి || 73
గభీరం ధ్వాంతసంయుక్తం రక్తకీట సమన్వితం | తదసీ పత్ర కుండం చ కీర్తితం చ భయానకం || 74
ఆసీపత్రకుండము మిక్కిలి భయంకరమైనది. అది అర్ధక్రోశ పరిమితమై యుండును. ఆసిపత్రములతో (కత్తులతో) నిండియుండును. దాని ప్రక్కనే ఎత్తైన తాటి చెట్టుకలదు. అచ్చట రక్తకీటకములు ఉండును. అచ్చట నున్న పాపులు ఆతాటి చెట్టుపై నుండి ఆసిపత్రకుండములో పడుచు రక్తకీటకములు భక్షించుచుండగా శరీరమంతయు రక్తమయము కాగా రక్షించుమని ప్రార్థించుచుందురు.
ధనుః శతప్రమాణం చ క్షురాకారాస్త్ర సంకులం | పాపినాం రక్తపూర్ణం చ క్షురధారం భయానకం || 75
సూచీవాస్యాస్త్రసంయుక్తం పాపి రక్తౌఘ పూరితం | పంచాశద్ధనురాయామం క్లేశదం సూచికాముఖం || 76
''క్షురధారకుందము''ను కత్తులవంటి అస్త్రములుండును. అది నూరుధనువుల విశాలమైనది, భయంకరమైన ఆకుండమున పాపులయొక్క రక్తము చిందుచుండును. సూచికా ముఖమను కుండమున సూది ముఖముల వంటి అస్త్రములుండును. దాని వైశాల్యము ఏబది ధనువులుండును. భయంకరమైన ఆకుండమందలి పాపులను యమభటులు శిక్షించుచుండగా అది వారి రక్తముతో నిండియుండును.
గోధాహ్వజంతుభేదస్య ముఖాకృతి భయానకం | కూపరూపం గభీరం చ ధునర్వింశతిమానకం || 77
మహాపాతకినాం చైవ మహాక్లేశకరం పరం | తత్కీట భక్షితానాం చ నమ్రాస్యానాం చ సంతతం || 78
గోధాముఖకుండము గోధ (ఉడుము) అను జంతువు యొక్క ముఖాకారమున నుండును. అది చాలా భయంకరముగానుండును. అది బావివలె చాలా లోతుగానుండును. ఇరువది ధనువుల విశాలమై యుండును.
గోధాముఖ కుండము మహాపాపులకు సైతం అతి దుఃఖమును కలిగించును. వారచ్చటి కీటకములచే భక్షింపబడుచు అధిక బాదలననుభవింతురు.
కుండం నరముఖాకారం ధనుష్షోడశమానకం | గభీరం కూపరూపం చ పాపిష్ఠైః సంకులం సదా || 79
'' నరముఖకుండము '' మానవముఖాకారమున నుండును. అది బావివలె మిక్కిలి లోతుకలదై పాపులచే ఎప్పుడు నిండియుండును. దాని వైశాల్యము పదునారు. ధనువులు.
గజేంద్రాణాం సమూహేన వ్యాప్తం కుండాకృతి స్థలం | గజదంతహతానాం చ పాపినాం రక్తపూరితం || 80
తత్కీట భక్షితానాం చ దీన శబ్దకృతాం సదా | ధనుః శతప్రమాణం చ కీర్తితం గజదంశనం || 81
గజదంశకుండము పెద్దపెద్ద ఏనుగుల సమూహముతో కుండాకారమున నుండును. అది నూరు దనువుల వైశాల్యము కలది. ఆ కుండమున నున్న పాపులను తమ దంతములచే పొడుచుచున్నందువలన, అచ్చటి కీటకములు తినుటవలన వారు హాహా కారములు చేయుచుందురు. వారి రక్తమచ్చట ప్రవహించుచుండును.
ధనుస్త్రింశత్ప్రమాణ చ కుండం వై గోముఖాకృతి | పాపినాం దుఃఖదం చైవ గోముఖం పరికీర్తితం || 82
ముప్పది ధనుస్సులవైశాల్యముతో గోముఖము యొక్క ఆకారమున ఉండునది గోముఖకుండము. అది పాపులను చాలా కష్టపెట్టును.
భ్రమితం కాలచక్రేణ సంతతం చ భయానకం - కుంభాకరాం ధ్వాంతయుక్తం ద్విగవ్యూతి ప్రమాణకం || 83
లక్షమానవమానం చ గభీరమతివిస్తృతం | కుత్ర చిత్తప్తతైలం చ కుండాభ్యతరమంతికే || 84
కుత్రచిత్తప్తలోహది కుండం తామ్రాదికం తథా | కుత్ర చిత్తప్త పాషాణ కుడాభ్యతరమంతికే || 85
పాపినాం చ ప్రధానైశ్చ మహాపాతకిభిర్యుతం | పరస్పరం న పశ్యద్భిః శబ్దకృద్భిశ్చ సంతతం || 86
తాడితైర్మమ దూతైశ్చ దండైశ్చ ముసలైస్తథా || 87
ఘూర్ణమానం పతద్భిశ్చ మూర్చితైశ్చ ముహుర్మహుః | పాతితైర్మమ దూతైశ్చాప్యత్యూర్ద్వాత్పతితైః క్షణం || 88
యావంత ః పాపినం సంతి సర్వకుండేషు సుందరి | చతుర్గుణా ః సంతి తత్ర కుంభీపాకే చ దుస్తరే || 89
సుచిరం పతితాశ్చైవ భోగదేహ వివర్జితాః సర్వకుండప్రధానం చ కుంభీపాకం ప్రకీర్తితం || 90
మిక్కిలి భయంకరమైనది, కుండవలెనుండునది, రెండు గవ్యూతుల వైశాల్యము కలది, లక్షమానవులు పట్టునది, అతివిశాలమైనది కుంభీపాక నరకము. నరకములోనుండు సమస్త కుండములలో పాపులెందరుందురో దానికి నాలుగురెట్లు ఎక్కుగా పాపులు కుంభీపాకనరకమున ఉందురు. ఆ కుంభీపాకనరకమున ఒకచోట తప్తతైలకుండము, ఇంకొకచోట తప్తలోహాది కుండము, మరియొక చోట తప్తపాషాణకుండము కలవు, అచ్చట మహాపాపులుందురు. ఆ కుంభీ పాకనరకమున వెలుతురే మాత్రము లేనందువలన అచటనుండు పాపులు ఒకరినొకరు చూచుకొనలేరు. వారిని నా భటులు దండములతోగాని, రోకళ్ళతోగాని దండించుచుందురు. అందువలన వారు బాధతో హాహాకారములు చేయుచుందురు.
కుంభీపాకనరకముననుండు పాపులు ఎక్కువపాతకమును చేసుకొన్నవారు. ఈ నరకము అన్ని విధములైన నరకములకంటె చాలా భయకరమైనదని అందురు.
కాల నిర్మితూత్రేణ నిబద్ధా యత్ర పాపినః | ఉత్థాపితాశ్చ మద్దూతైః క్షణమేవ నిమజ్జితా ః || 91
నిశ్వాసబంధాః సుచిరం కుండానామంతరే తథా | అతీవ క్లేశకుక్తాశ్చ భోగదేహా ఆనశ్వరాః || 92
దండేన ముసలేనైన మ దూతైశ్చ తాడితాః | ప్రతప్త తోయ యుక్తం చ కాలసూత్రం ప్రకీర్తితం || 93
NSÌÁxqsWú»R½ƒ«sLRiNRPª«sVVƒ«s FyxmsoÌÁVNSÌÁ¬sLjiø»R½ xqsWú»R½ª«sVVª«sÌÁƒ«s ‡ÁµôðR…V\ÛÍÁ ƒy˳ÏÁÈÁVÌÁ¿Á[ ª«sVLRiVgRiV¿RÁVƒ«sõ ¬dsÉÓÁÍÜ[ ª«sVVLi¿RÁ‡Á²R…VµR…VLRiV. \|msNTP Fs»R½ò‡Á²R…VµR…VLRiV. ªyLji ˳Ü[gRi®µ…[x¤¦¦¦ª«sVVÌÁNRPV ƒyaRPƒ«sª«sVV ÛÍÁ[µR…V. @LiµR…Vª«sÌÁƒ«s ƒy µR…W»R½ÌÁ¿Á[ µR…Li²R…ª«sVV¿Á[ L][NRPÎÏÁþ ¿Á[ N]ÈíÁ‡Á²R…V¿RÁV @¼½µR…VMÅÁª«sVVƒ«sƒ«sV˳ÏÁ„sLi»R½VLRiV.
అవట కపభేదశ్చ యత్రోదం చ తదాకృతి | ప్రతప్త తోయ పూర్ణం చ ధనుర్వింశత్ప్రమాణకం 94
వ్యాప్తం మహాపాపిభిశ్చ దగ్ధగాత్రైశ్చ సంతతం | మద్దూతైస్తాడితైః శశ్వత్ అవటోదం ప్రకీర్తితం || 95
అవటోదమను నరకమున నీరు అవటము వలె (రంధ్రము)వలె గుండ్రముగానుండును. ఆ నీరు మిక్కిలి వేడిగానుండును. ఈ నరకము ఇరువది ధనువుల వైశాల్యముతోనుండును. అచ్చట మహాపాపులుందురు. వారు మరుగుచున్న నీటివలన దగ్ధగాత్రులై నా భటులచే బాధలు పడుదురు.
యత్తోయస్పర్శమాత్రేణ సర్వవ్యాధిశ్చ పాపినాం | భ##వేదకస్మాత్ పతతాం యత్రకుండే ధనుఃశ##తే || 96
సర్వే రుద్ధాపాపినశ్చ వ్యథంతే యత్ర సంతతం | హహేతి శబ్ధం కుర్వంతస్తదేవారుంతుదం విదుః || 97
''అరుంతుద'' కుండములోని నీటిని ముట్టగానే అచ్చటి పాపులకు అకస్మాత్తుగా సర్వవ్యాధులు కలుగును. అచ్చటనున్న పాపులందరు దానివల్ల బాధలకు గురియగుచు హాహాకారములు చేయుచుందురు.
తప్తపాంసుభిరాకీర్ణం జ్వలద్భిస్తు సుదగ్ధకైః | తద్భక్ష్యైః పాపిభిర్యుక్తం పాంసుభోజం ధనుఃశతం || 98
''పాంసుభోజనమను నరకమున ఎక్కువగా మండుచున్న దుమ్ము కనిపించును. దానివైశల్యము నూరు ధనువులు, అచ్చటి పాపులు ఆకలికి తాళ##లేక ఆ మండుచున్న దుమ్మునే తినుచుందురు.
పతతాం పాపినాం యత్ర భ##వేదేవ ప్రకంపనం | పాతమాత్రేణ పాపీవై భ##వేత్పాన వేష్టితః || 99
క్రోశమానే చ కుండేవై విదుస్తత్పాశ##వేష్టనం | ధనుర్వింశతి మానం చ శూల ప్రోతం ప్రకీర్తితం || 100
పాతమాత్రేణ పాపీచ శూలేన గ్రథితో భ##వేత్ | పతతాం పాపినాం యత్ర భ##వేదేవ ప్రకంనం || 101
పాశ##వేష్టనమను నరకమున పాపులు పడగానే అచ్చటి పాశములచే వారు కట్టివేయబడుదురు. అక్కడికి రాగానే వారికి కంపనము జరుగుచుండును. అట్లే శూలప్రోతమను నరకమున పాపులు పడగానే అచ్చటి శూలములకు వారి శరీరములు గుచ్చుకొని పోవును. ఆ నరకము చాలా భయంకరమైనది కావున అచ్చటికి రాగానే పాపులకు వణకుపుట్టును.
అతీవ హిమతోయే చ క్రోశార్ధం చ ప్రకంపనం | దదత్యేవ హి మద్దూతా యత్రోల్కాః పాపినాం ముఖే || 102
ధనుర్వింశతిమానం చ తదుల్కాభిశ్చ సంతతం | లక్షమానవ మానం చ గభీరం చ ధనుశ్శతం || 103
నానా ప్రకారకృమిభిః సంయుక్తం చ భయానకైః | అత్యంధకార వ్యాప్తం యత్కూపాకారం చ వర్తులం || 104
తద్భ క్ష్యైః పాపిభిర్యుక్తం న పశ్చద్భిః పరస్పరం | తప్తతోయ ప్రదగ్దైశ్చ చలద్భిః కీటభక్షితైః |
ధ్వాంతేన చక్షుషా చాంధైరంధకూపం ప్రకీర్తితం || 105
''ఉల్కా కుండము''న చల్లని మంచువంటి నీరుండును. అట్లే పిడుగులు కూడా ఉండును. అచ్చటి పాపుల ముఖములపై నా భటులు పిడుగులతో కొట్టుచుందురు. ఉల్కాకుండము క్రోశార్ధపరిమితముకాగా అందు ఇరువది ధనుస్సుల మేర పిడుగులుండును.
''అంధకూప'' నరకము బావివలె గుండ్రముగా నుండును. దానిలోతు నూరు ధనుస్సులుండును. అందు నానావిధములైన భయంకరమైన క్రిములుండును. ఆ నరకమంతయు చిమ్మచీకటితో నిండియుండును. అచ్చటనున్న పాపులు చీకటివలన ఒకరినొకరు చూచుకొనలేరు. వారి శరీరములు అచ్చట మండుచున్న నీటితో బొబ్బలెక్కును. అట్లే ఆ నరకమున నుండు క్రిములు వారి శరీరములను విపరీతముగా కుట్టుచుండును. వారు అంధకారమయమైన ఆనరకమున నున్నందువలన గుడ్డివారివలె బాధలు పడుచుందురు.
నానా ప్రకారశస్త్రౌఘైర్యత్ర విద్ధాశ్చ పాపినః | ధనుర్వింశతిమానం చ వేధనం తత్ర్పకీర్తితం || 106
'' వేధన కుండము'' అనేక విధములైన శస్త్రములతో నిండియుండును. దానిలోతు ఇరువది ధనుస్సులుండును. అచ్చటి నున్న పాపులు ఆ శస్త్రములచే ఎల్లప్పుడు కొట్టబడు చుందురు.
దండేన తాడితాయత్రమమ దూతైశ్చ పాపినః | ధనుః షోడశమానం చ తత్కుండం దండతాడనం || 107
''దండతాడన'' మను నరకము పదునారు ధనువుల లోతుతో నుండును. అచ్చటి పాపులను నా భటులు దండములచే కొట్టుచుందురు కావున దానికి దండతాడనమను పేరు కలిగినది.
నిబద్ధాశ్చ మహాజాలైర్యథా మీనాశ్చ పాపినః | ధనుస్త్రింశత్ర్పమాణం చ జాల బద్ధం ప్రకీర్తితం || 108
'' జాల బద్ధ కుండము'' ముప్పది ధనువుల లోతు కలదై యుండును. అచ్చటి పాపులు వలలో పడ్డ చేపలవలె వలలచే కట్టివేయబడుదురు.
పతతాం పాపినాం కుండే దేహాశ్చూర్ణీభవంతి చ | లోహవేది నిబద్ధాంతః కోటి మానవమానకం || 109
గభీరం ధ్వాంతయుక్తంతం చ ధనుర్వింశతి మానకం | మూర్ఛితానాం జడానాం తద్దేహచూర్ణం ప్రకీర్తితం || 110
''దేహచూర్ణ''మను నరకమున కోటి మానవుల లోతుతో ఇరువై ధనుస్సుల వైశాల్యముతో మిక్కిలి లోతైయుండును. దాని అడుగుభాగము లోహముతో వేదికవలె నిర్మించబడినది. ఆ దేహచూర్ణకుండములోపడు పాపులయొక్క శరీరములు వెంటనే చూర్ణమగును. కావులన ఆ నరకమును దేహచూర్ణమని పిలుతురు.
దళితాః పాపినో యత్ర మద్దూతైర్ముసలైస్సదా | దనుష్షోడశమానంచ తత్కుండం దళనం స్మృతం || 112
శతమానవమానం చ గభీరం ధ్వాంత సంయుతం | జలాహారైర్విరహితం శోషణం తత్ర్పకీర్తితం || 113
''శోషణకుండము'' ముపై#్ప ధనుస్సుల వైశాల్యముతో నూరుమానవుల లోతుతో ఉడును. అది చాలా లోతై ఉన్నందువలన మిక్కిలి చీకటిగా ఉండును. ఆ నరకమున బాగుగా మండుచున్న ఇసుక మేటలుండును. అందువలన ఆ నరకమున పడుపాపులు నీరు, ఆహారములేక మండుచున్న ఇసుకలపై ఉన్నందువలన వారి నోళ్ళు, పెదవులు, నాలుకలుఎండుకొని పోవును.
నానా చర్మకషాయోదైః పరిపూర్ణం ధనుఃశతం | దుర్గంధియుక్తం తద్భక్ష్యైః పాపిభిః సంకులం మహత్ || 114
''కషకుండము''న అనేక విధములైన తోళ్ళ కషాయోదకముడును. ఆ నీరు మిక్కిలి దుర్వాసనగా నుండును. దాని వైఖాల్యము నూరు ధనువులుండును. అచ్చటనుండు పాపులు నీరు, ఆహారములేక దుర్వాసనగల చర్మకషాయమనే తాగుచుందురు.
శూర్పాకారం ముఖం కుండం ధనుర్ద్వాదశమానకం | తప్తలోహీ వాలుకాభిః పూర్ణం పాతకిభిర్యుతం || 115
అంతరగ్ని శిఖానాం చ జ్వాలా వ్యాప్తముఖం సదా | ధనుర్వింశతి మానం చ యస్య కుండస్య సుందరి || 116
జ్వాలాభిర్దగ్ధగాత్రైశ్చ పాపిభిర్వ్యాప్తమేవ తత్ | తన్మహత్ క్లేశదం శశ్వత్కుండం జ్వాలాముఖం స్మృతం || 117
''శూర్పముఖకుండము'' యొక్క ముఖాగ్రభాగము చేటవలె వెడల్పుగా ఉండును. పన్నెడు ధనస్సుల వైశాల్యముతోనుండును. దానిలో బాగుగా మండుచున్న లోహపు వాలుకలుడును. అది ఎల్లప్పుడు పాపులతో నిండియుడును. లోపలనున్న అగ్ని జ్వాలలు పైకి ఎగసిపడుచుండగా ఆ నరకమునకు పోవు పాపుల శరీరములు అగ్ని జ్వాలలచే దగ్ధమగుచుండును. అందువలన అది పాపులకు అమితమైన దుఃఖమును కల్గించును. ఆ కుండమును ''జ్వాలాముఖకుండ''మని అందురు.
పాతమాత్రాద్యత్ర పాపీ మూర్ఛితో వ్యథితో భ##వేత్ | తప్తేష్టకాభ్యంతరితం వాప్యర్థం జిహ్మకుండకం || 118
ధూమాంధకారయుక్తం చ ధూమాధైః పాపిభిర్యుతం | ధనుః శతం శ్వాసరుద్దైర్ధూమాంధం పరికీర్తితం || 119
సాతమాత్రాద్యత్రపాపీ నాగైస్సంవేష్టితో భ##వేత్ | ధనుశ్శతం నాగపూర్ణం నాగవేష్టన కుండకం || 120
''జిహ్మకుండము''న నుండు ఇటుకలన్నీ బాగుగా కాలుచుండును. ఆ కుండమున పాపులు పడగానే బాధపడి మూర్ఛపోదురు.
''ధూమాంధకుండము'' పొగవలన చీకటిగానుండును. అచ్చటనుండు పాపులు పొగవలన ఉక్కిరిబిక్కిరగుచుందురు.
''నాగేష్టనకుండము''న నూరు ధనుస్సుల వరకు సర్పములుండును. ఆకుండమున పాపులు పడగానే సర్పములు వారిని చుట్టుకొనును.
షడశీతిశ్చకుండాని మయోక్తాని నిశామయ | లక్షణం చాపి తేషాం చ కిం భూయః శ్రోతు మిచ్ఛసి || 121
ఓ సావిత్రి నీకు నరకమున నుండు ఎనబైయారు కుండములను వాటి స్వరూప స్వభావములను వివరించి చెప్పితిని. ఇంకను నీవు తెలుసుకొన వలసినదేదైన ఉన్నచో అడుగుమని యమధర్మరాజు సావిత్రితో అనెను.
ఇతి శ్రీ బ్రహ్మనైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారదనారాయణ సంవాదే సాతిత్రుపాఖ్యానే యమలోకస్థ నరకకుండలక్షణం నామ త్రయస్త్రింశోzధ్యాయః ||
శ్రీ బ్రహ్మ నైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదమున చెప్పబడిన సావిత్ర్యుపాఖ్యానమున యమలోకములోని నరకకుండ లక్షణమను
ముపై#్ప మూడవ అధ్యాయము సమాప్తము.