sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుస్త్రింశత్తమోzధ్యాయః -సావిత్రికి యమోపదేశ పరిసమాప్తి సావిత్ర్యువాచ- సావిత్రి యమధర్మరాజుతో ఇట్లనెను- హరిభక్తిం దేహి మహ్యం సారభూతాం సుదుర్గభాం | త్వత్తః సర్వం శ్రుతం దేవ నాzవశిష్టోzధునా మమ || 1 కంచిత్కథయ మే ధర్మం శ్రీకృష్ణగుణ కీర్తనం | పుంసాం లక్షోద్ధారబీజం నరకార్ణవతారకం || 2 కారణం ముక్తి కార్యాణాం సర్వాzశుభనివారణం | దారణం కర్మ వృక్షాణాం కృతపాపౌఘ హారకం || 3 ముక్తయః కతిధాః సంతి కిం వా తాసాం చ లక్షణం | హరిభ##క్తేర్మూర్తి భేదం నిషేకస్యాపి లక్షణం || 4 తత్వజ్ఞాన విహీనా చ స్త్రీ జాతిర్విధి నిర్మితా | కిం తత్ జ్ఞానం సారభూతం వద వేదవిదాం వర || 5 సర్వదాంన హ్యనశనం తీర్థస్నానం వ్రతం తప్పః | అజ్ఞానే జ్ఞానదానస్య కలాం నార్హంతి షోడశీం || 6 పితుః శతగుణా మాతా గౌరవేణాతిరిచ్యతే | మాతుః శతగుణౖః పూజ్యో జ్ఞానదాతా గురుః ప్రభో || ఓ ధర్మరాజా నీవలన నేను చాలా విషయములను తెలిసికొంటిని. ఇకనీవు అన్ని విషయములకు సారమువంటిది. మిక్కిలి దుర్లభ##మైనది అగు శ్రీహరి భక్తిని నాకు ప్రసాదించుము, శ్రీకృష్ణుని గుణకీర్తనము చేయించునది, అందరిని ఉద్ధరించునది, నరకమునుండి దాటించునది, ముక్తికార్యములకు హేతువైనది, సమస్తాశుభములను తొలగించునది, కర్మలనే వృక్షములను చీల్చునది, సమస్త పాపములను హరించునది, అగు ధర్మమును నాకు తెల్పుము. ముక్తిభేదములను, వాటి స్వరూప స్వభావములు, శ్రీహరి భక్తిభేదములను, నిషేకము యొక్క స్వరూప స్వభావములను నాకు వివరించి చెప్పుము. సమస్త దానములు, నిరాహారదీక్షలు, పుణ్యతీర్థస్నానములు, సమస్త వ్రతములు, సమస్త తపస్సులు, అజ్ఞానికి జ్ఞానమునొసగు రీతికి పదునారవవంతైన కాజాలవు. తండ్రికంటే తల్లి నూరురెట్ల ఎక్కువగా గౌరవించతగినది. జ్ఞనమునొసగు గురువు తల్లి కంటె నూరురెట్లుఎక్కువగా గౌరవించ తగినవాడు. యమ ఉవాచ -యమ ధర్మరాజిట్లనెను - పూర్వం సర్వో వరోదత్తో యస్తే మనసి వాంఛితః | అధునా హరిభక్తిస్తే వత్సే భవతు మద్వరాత్ || 8 శ్రోతు మిచ్ఛసి కల్యాణి శ్రీకృష్ణగుణకీర్తనం | వక్తౄణాంప్రశ్న కర్తౄణాం శ్రోతౄణాం కుల తారకం || 9 శేషో వక్త్రసహస్రేణ నహి యద్వక్తుమీశ్వరః | మృత్యుంజయో నక్షమశ్చ వక్తుం పంచముఖేన చ || 10 ధాతా చతుర్ణాం వేదానాం విధాతా జగతామపి | బ్రహ్మా చుతర్ముఖేనైవ నాలం విష్ణుశ్చ సర్వవిత్ || 11 కార్తికేయః షణ్ముఖేన నాzపి వక్తుమలం ధ్రువం | న గణశః సమర్థశ్చ యోగీంద్రాణాం గురోర్గురుః || 12 సారభూతాశ్చ శాస్త్రాణాం వేదాశ్చత్వార ఏవ చ | కళమాత్రం యద్గుణానాం నవిదంతి బుధాశ్చ యే || 13 సరస్వతీ చ యత్నేవ నాలం యద్గుణ వర్ధనే | సనత్కుమారో ధర్మశ్చ సనకశ్చ సనాతనః || 14 సనందః కపిలః సూర్యో యే చాన్యే బ్రహ్మణః సుతాః | విచక్షణా న యద్వక్తుం కేవాzన్యే జడబుద్ధయః || 15 న యద్వక్తుం క్షమాః సిద్ధా మునీంద్రా యోగివనస్తథా | కే వాzన్యే చ వయం కేవా భగవద్గుణ వర్ణనే || 16 ఓ సావిత్రి! నీవు కోరుకున్న వరములన్నిటిని నీకిచ్చితిని. ఇప్పుడు నీవు కోరుకున్నట్లు హరిభక్తి నావరమువలన నీకు కలుగును. నీవు శ్రీకృష్ణదేవుని గుణములను వినదల్చితివి. ఇది చెప్పువారిని, ప్రశ్నవేయువారిని, వినువారిని అందరిని తరింపజేయును. వేయి తలలుగల ఆదిశేషుడు, ఐదుతలలు గల మృత్యుంజయుడు నాలుగువేదములు తెలిసినవాడు, చరాచరసృష్టికంతయు సృష్టికర్తయైన చతుర్ముఖబ్రహ్మ, సమస్తము తెలిసిన శ్రీ మహావిష్ణువు, ఆరుముఖములు గల కుమారస్వామి, యోగీంద్రులయొక్క గురువులకు గురువైన గణశుడు. సమస్త శాస్త్రములకు సారమైన నాలుగువేదములు, పండితులు శ్రీకృష్ణపరమాత్మ యొక్క గుణలేశమును సైతము తెలియజాలరు. అట్లే సరస్వతీ దేవి, సనత్కుమారుడు, ధర్ముడు, సనక సనంద సనాతులు కపిలుడు, సూర్యుడు ఇంకను తక్కిన బ్రహ్మపుత్రులు శ్రీ కృష్ణపరమాత్మ గుణవర్ణనము చేయజాలరు. అట్లే సిద్ధులు, మునీంద్రులు, యోగులు సహితము ఆ పరమేశ్వరుని గుణకీర్తనము చేయలేరు. అట్టి స్థితిలో మా వంటివారు అతని గుణకీర్తనమును చక్కగా ఎట్లు చేయుదురు. ధ్యాయంతి యత్పదాంభోజం బ్రహ్మవిష్ణు శివాదయః | అతిసాధ్యం స్వభక్తానం తదన్యేషాం సుదుర్లభం || 17 కశ్చిత్కించి ద్విజానాతి తద్గుణోత్కీర్తనం మహత్ | అతిరిక్తం విజానాతి బ్రహ్మా బ్రహ్మసుతాదయః || 18 తతోzతిరిక్తం జానాతి గణశో జ్ఞానినాం గురుః | సర్వాతిరిక్తం జానాతి సర్వజ్ఞః శంభురేవ చ || 19 తసై#్మ ద్తతం పురాజ్ఞానం కృష్ణేన పరమాత్మనా | అతీవ నిర్జనే రమ్యే గోలోకే రాజమండలే || 20 తత్రైవ కథితం కించిద్యద్గుణోత్కీర్తనం పునః | ధర్మాయ కథయామాస శివలోకే శివః స్వయం || 21 ధర్మస్తత్కథయామాస పుష్కరే భాస్కరాయ చ | పితా మమ యమారాధ్య గాం ప్రాప తపసా సతి || 22 పూర్వం స్వవిషయం చాzహం న గృహ్ణామి ప్రయత్నతః | వైరాగ్యయుక్తస్తపసే గంతుమిచ్ఛామి సువ్రతే || 23 తదా మాం కథయామాస పితా తద్గుణకీర్తనం | యథాగమం యథాగమం తద్వదామి నిబోధాతీవ దుర్గమం || 24 తద్గుణం స న జానాతి తదన్యస్య చ కా కథా | యథాzకాశం న జానాతి స్వాంతమేవ వరాననే || 25 బ్రహ్మ, విష్ణు, శివాది దేవతలు ఆ పరమాత్మ పాదాంభోజములను ఎల్లప్పుడు ధ్యానించుచుందురు. ఆ పరమాత్మధ్యానము అతని భక్తులకే కాని ఇతరులకు చాలా దుర్లభ##మైనది. శ్రీకృష్ణపరమాత్మ గుణ సంకీర్తనము చాలా శ్రేష్ఠమైనది. అది శ్రేష్ఠులైన కొందరికి కొంతయే తెలియును. వారికంటెను. బ్రహ్మదేవునకు అతని పుత్రులు మొదలగువారికి శ్రీకృష్ణపరమాత్మ గుణములు ఎక్కువగా తెలియును. వారికంటె జ్ఞానవంతులకే గురువైన గణపతికి కొంత ఎక్కువ తెలియును. పైవారందరికన్నను సర్వజ్ఞుడైన శంకరునకు ఎక్కువగా తెలియును. శ్రీకృష్ణ పరమాత్మయే చాలా సుందరమైన గోలోకమున రాసమండలమందు రహస్యముగా శంకరునకు దీనిని తెల్పెను. ఆ పరమాత్మ గుణములలలో కొంత భాగమును శంకరుడు కైలాసమున దర్మునకు వివరించెను. ఆధర్మదేవత పుష్కరక్షేత్రమున నా తండ్రికీ విషయమును తెల్పెను. నాతండ్రి ధర్మదేవతకై తపమాచరించి అతని అనుగ్రహమువలననే వాగ్దేవతను పొందగలిగెను. పూర్వం నేను కూడా ఐహికమైన విషయములను వేటిని పట్టించుకొనక వైరాగ్యముతో తపస్సు చేసికొనుటకై బయలు దేరుచుండగా నాతండ్రి ఆ పరమాత్మ గుణ కీర్తనమును తెల్పెను. శాస్త్రప్రకారముగా ఆ విషయమును నీకు తెలుపుదును. ఆ పరమాత్మగుణములు బ్రహ్మదేవునకు తెలియవన్నచో ఇతరుల సంగతి ఏమని చెప్పవచ్చును. సర్వాంతరాత్మా భగవాన్ సర్వకారణ కారణం | సర్వేశ్వరశ్చ సర్వాద్యః సర్వవిత్సర్వ రూపధృక్ || 26 నిత్యరూపీ నిత్యదేహీ నిత్యానందో నిరాకృతిః | నిరంకుశశ్చ నిస్సంగో నిర్గుణశ్చ నిరాశ్రయః || 27 నిర్లిప్తః సర్వసాక్షీ చ సర్వాధారః పరాత్పరః | ప్రకృతి స్తద్వికారా చ ప్రాకృతాస్తద్వికారజాః || 28 భగవంతుడు సర్వాంతరాత్మ, సమస్త మూలములకు మూలభూతుడు, సర్వేశ్వరుడు, అన్నిటికీ ఆదిభూతుడు, సర్వజ్ఞుడు, సమస్త రూపములను ధరించువాడు, నిత్యరూపి, నిత్యదేహి, నిత్యానందుడు, ఆ కారరహితుడు, నిరంకుశుడు, సంగరహితుడు, నిర్గుణుడు, నిరాశ్రయుడు, నిర్లిప్తుడు, సమస్త కర్మములకు సాక్షీభూతుడు, సమస్తమునకు ఆధారమైనవాడు, పరాత్పరుడు. ప్రకృతి అతని వలన ఉత్పన్నమైనది. ఈ చరాచరసృష్టి ఆ ప్రకృతినండి పుట్టినది. స్వయం పుమాంశ్చ ప్రకృతిః స్వయం చ ప్రకృతేః పరః | రూపం విధత్తేzరూపశ్చ భక్తానుగ్రహహేతవే || 29 ఆ పరమాత్మ తానే పరమపురుషుడు, తానే ప్రకృతి స్వరూపుడు, అతడు ప్రకృతికంటె అతీతుడు. ఆ పరమాత్మకు. రూపములేకపోయినప్పటికిని భక్తుల ననుగ్రహింపవలెనని రూపము ధరించుచున్నాడు. అతీవ కమనీయం చ సుందరం సుమనోహరం | నవీన నీరదశ్యామం కిశోరం గోపవేషకం || 30 కందర్ఫ కోటి లావణ్య లీటలా ధామ మనోహరం | శరన్మధ్యాహ్న పద్మానాం శోభామోచకలోచనం || 31 శరత్పార్వణ కోటీందు శోభాసంశోభఙతాననం | అమూల్య రత్నఖచిత రత్నాభరణ భూషితం || 32 సస్మితం శోభితం శశ్వదమూల్యాzపీతవాససా | పరం బ్రహ్మ స్వరూపం చ జ్వలంతం బ్రహ్మ తేజా || 33 సుఖదృశ్యం చ శాంతం చ రాధాకాంతమనంతకం | గోపీభిర్వీక్ష్యమాణం చ సస్మితాభిః సమంతతః|| 34 రాసమండల మధ్యస్థం రత్నసింహాసన స్థితం | వంశీం క్వణంతం ద్విభుజం వనమాలా విభూషితం || 35 కౌస్తుభేన మణీంద్రేణ సుందరం వక్షసోజ్వలం | కుంకుమాగరుకస్తూరీ చందనార్చిత విగ్రహం || 36 చారుచంపకమాలాబ్జమాలతీ మాల్యమండితం | చారు చంపకశోభాఢ్య చూడా వక్త్రిమరాజితం || 37 ధ్యాయంతి చైవం భూతావై భక్తా భక్తి పరిప్లుతాః | యద్భయాజ్జగతాం ధాతా విధత్తే సృష్టిమేవ చ || 38 కరోతి లేఖనం కర్మానురూపం సర్వదేహినాం | తపసాం ఫలదాతా చ కర్మణాం చ యదాజ్ఞయా || 39 విష్ణుః పాతా చ సర్వేషాం యద్భయాత్పాతి సంతతం | కాలాగ్ని రుద్రః సంహర్తా సర్వవిశ్వేషు యద్భయాత్ || 40 ఆ పరమాత్మరూపము చాలా కమనీయమైనది. సుందరమైనది, మనోహరమైనది, నూతన మేఘములవలె నల్లనిది, బాలారూపమున నుండునది, గొల్లవాని వేషమున కన్పించునది, కోటి మన్మథుల సౌందర్యము కలది, అందమైనది, శరత్కాలమందలి కోటి పూర్ణిమా చంద్రుల కాంతిగల ముఖము కలది, అమూల్యమైన రత్నములు గల రత్నాభరణములు గలది. చిరునవ్వుకలది. పీతాంబరమును ధరించినది. పరబ్రహ్మరూపము కలది. అమితమైన బ్రహ్మతేజస్సుచే ప్రకాశించునది. రాధాకాంతుడగు ఆ పరమాత్మ స్వరూపము చూచుటకు ఇంపైనది. పరమశాంత స్వరూపము కలది. చిరునవ్వు కల గోపికలు ఆతని చుట్టు ఉందురు. అతడు రాసమండలమున రత్న సింహాసనమున కూర్చొని వనమాలాలంకృతుడై వేణువును మనోహరముగా వాయించుచుండును. కౌస్తుభమణిని వక్షస్థలమున ధరించి యుండును, కుంకుమ, అగరు, కస్తూరి, చందనము మొదలగు సుగంధ ద్రవ్యములను శరీరమునకు అలదుకొని యుండును. ఆతని మెడలో అందమైన చంపకమాల పద్మమాల మాలతీ మాలలుండును. ఆతని వంకర కొప్పుచుట్టు చంపకమాల చుట్టి యుండును. పరమాత్మయొక్క ఇటువంటి రూపును భక్తులు అనుక్షణము ధ్యానింతురు. ఆ పరమాత్మ భయము వలననే విధాత చరాచరసృష్టిని చేయుచున్నాడు. అట్లే సమస్త జీవులనొసటిపై వారి కర్మననుసరించి వ్రాయుచున్నాడు. అదేవిధముగా విష్ణుమూర్తి అందరినీ రక్షించుచున్నాడు. కాలాగ్నిరుద్రుడు సంహరించుచున్నాడు. శివో మృత్యుంజయశ్చైవ జ్ఞానినాం చ గురోర్గురుః | యత్‌జ్ఞాన దానాత్ సిద్ధేశో యోగీశః సర్వవిత్ స్వయం || 41 పరమానంద యుక్తశ్చ భక్తి వైరాగ్య సంయుతః | యత్ప్రసాదాద్వాతి వాతః ప్రవరః శ్రీఘ్రగామినాం || 42 తపనశ్చ ప్రతపతి యద్భయాత్సంతతం సతి | యదాజ్ఞయా వర్షతీంద్రో మృత్యుశ్చరతి జంతుషు || 43 యదాజ్ఞయా దహేద్వహ్నిః జలమేవ సుశీతలం | దిశో రక్షంతి దిక్పాలా మహాభీతా యదాజ్ఞయా || 44 భ్రమంతి రాశి చక్రాణి గ్రహావై యద్భయేన చ | భయాత్ఫలంతి వృక్షాశ్చ పుష్పంత్యపి ఫలంతి చ || 45 భయాత్ఫలాని పక్వాని నష్ఫలాస్తరవో భయాత్ | యదాజ్ఞయా స్థలస్థాశ్చ నజీవంతి జలేషు చ || 46 యథాస్థలే జలస్థాశ్చ నజీవంతి యదాజ్ఞయా | అహం నియమ కర్తా చ ధర్మాధర్మే చ యద్భయాత్ || 47 కాలశ్చ కలయేత్సర్వం భ్రమత్యేవ యదాజ్ఞయా | అకాలేనహరేత్కాలో మృత్యుర్వై యద్భయేన చ || 48 పరమజ్ఞానినులకు సహితము గురువు, మృత్యుంజయుడైన శివుడు ఆ రాధారమణుడిచ్చిన జ్ఞానము వలననే సిద్ధేశుడుగా మోగీశుడుగా, సర్వజ్ఞుడుగా, భక్తి వైరాగ్యములతో పరమానంద సహితుడై యున్నాడు. ఆతని అనుగ్రహమువలననే గాలి వీచుచున్నాడు. సూర్యడు మండుచున్నాడు. ఇంద్రుడు వర్షించుచున్నాడు. మృత్యువు తన కార్యమును పూర్తి చేయుచున్నాడు. అట్లే ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞవలననే అగ్ని, జలము, దిక్పాలకులు, రాశి చక్రము, గ్రహములు, తమ తమ కార్యములను చేయుచున్నవి. అదేవిధముగా చెట్లు పుష్పించుచున్నవి. ఫలించుచున్నవి. ఆ పరమాత్మ ఆజ్ఞవలననే భూమిపైనుండు ప్రాణులు నీటిలో , నీటిలో నుండు ప్రాణులు భూమిపై జీవించలేకపోవుచున్నవి.యముడైన నేను కూడా ఆ పరమాత్మ భయమువలననే ధర్మాధర్మములను నియమించుచున్నాను. కాలము అతని ఆజ్ఞననుసరించి సమస్త ప్రాణులను తిప్పుచున్నది. అట్లే అతని భయమువలననే మృత్యువు, కాలము, అకాలమృత్యువును కలిగించకున్నవి. జ్వలదగ్నౌ పతంతం చ గభీరే చలార్ణవే | వృక్షాగ్రాత్తీక్ష్‌ణఖడ్గే చ సర్పాదీనాం ముఖేషు చ|| 49 నానా శస్త్రాస్త్రవిద్ధం చ రణషు విషమేషు చ | పుష్పచందన తల్పే చ బంధవర్గైశ్చ రక్షితం || 50 శయానం తంత్రమంత్రైశ్చ కాలే కాలో హరేద్భయాత్ | ధత్తే వాయుస్తోయరాశిం తోయం కూర్మః యదాజ్ఞయా || 51 కూర్మోzనంతం స చ క్షోణీం సముద్రాన్ సప్త పర్వతాన్ | సర్వాంశ్చైవ క్షమారూపో నానారూపం బిభర్తిసః || 52 యతః సర్వాణి భూతాని లీయంతే తే చ తత్రవై| కాలుడు శ్రీహరి భయమువలననే అగ్నిలోను, సముద్రములోను, చెట్టుపైనుండి, కత్తులపైన పడువారి ప్రాణములను, సర్పాది విష జంతువుల బారిన పడ్డవారి ప్రాణములను హరించును. అనేక శాస్త్రాస్త్రములకు గురియైన వారు, రణరంగమున నున్నవారు,మంత్రతంత్రములకు గురియైనవారు, చివరకు పుష్పచందన శయ్యపై సుఖముగా నున్నవారు, బంధువులచే ప్రయత్నపూర్వకముగా రక్షింపబడినవారి ప్రాణములను కూడా అతడు కాలము సమీపించగానే హరించును. అదే విధముగా శ్రీహరి ఆజ్ఞననుసరించి వాయువు నీటిని, నీరు ఆది కూర్మమును, ఆ ఆదికూర్మము ఆదిశేషుని, ఆదిశేషుడు భూమిని, ఈ భూమి సముద్రములను సప్తకుల పర్వతములను మోయుచున్నది. క్షమా స్వరూపుడగు ఆ పరమాత్మ అన్నిటిని నానా రూపములతో భరించుచున్నాడు. సమస్త ప్రాణికోటి పరమాత్మవలననే పుట్టుచున్నది. తిరిగి పరమాత్మలోనే విలీనమగుచున్నది. ఇంద్రాయుశ్చ దివ్యానాం యుగానామేక సప్తతి ః || 53 అష్టవింశచ్ఛక్రపాతే బ్రహ్మణః స్యాదహర్నిశం | అష్టాధికే పంచశ##తే సహస్రే పంచ వింశతౌ || 54 యుగే నరాణాం శుక్రాయురేవం సంఖ్యావిదో విదుః | ఏవం త్రిశద్ధినైర్మాసో ద్వాభ్యాం తాభ్యాంఋతుః స్మృతః || 55 ఋతుభిఃషడ్భిరేవాబ్దం శతాబ్దం బ్రహ్మణోవయః | బ్రహ్మణశ్చ నిపాతేవై చక్షురున్మీలనం హరేః || 56 చక్షుర్నిమీలనే తస్య లయం ప్రాకృతికం విదుః | ప్రళ##యే ప్రాకృతాః సర్వే దేవాద్యాశ్చ చరాచరాః || 57 లీనా ధాతరి ధాతా చ శ్రీకృష్ణే నాభిపంకజే | విష్ణుః క్షీరోదశాయీ చ వైకుంఠే యశ్చతుర్భుజః || 58 విలీనో వామపార్శ్వే చ కృష్ణస్య పరమాత్మనః | రుద్రాద్య భైరవాద్యాశ్చ యావంతశ్చ శివానుగాః || 59 శివాధారే శివేలీనాః జ్ఞానానందే సనాతనే | జ్ఞానాధిదేవః కృష్ణస్య మహాదేవస్య చాత్మనః || 60 తస్య జ్ఞానే విలీనశ్చ బభూవాథ క్షణం హరేః | దివ్యయుగములు డెబ్బైఒకటి గడిచినచో ఇంద్రుని ఆయుస్సు తీరిపోవును. ఇరవై ఎనిమిది ఇంద్రులు గతించినచో ఆ కాలము బ్రహ్మదేవునకు ఒక దినము రాత్రి, పగలు) ఇరవై ఐదు వేల ఐదువందల ఎనిమిది యుగముల కాలము ఇంద్రుని యొక్క ఆయువుండునని జ్యోతిః శాస్త్రవేత్తలు తెల్పుచున్నారు. ముపై#్ప దినములు ఒక మాసమగును. రెండు మాసములు ఒక ఋతువు, ఆరు ఋతువులు ఒక సంవత్సరమగును. ఇటువంటి బ్రహ్మ సంవత్సరాలు నూరు పూర్తియైనచో బ్రహ్మదేవును ఆయుస్సు తీరిపోవును. ఈ బ్రహ్మదేవుని ఆయుఃకాలము శ్రీహరికి కనురెప్పవేయుకాలము. శ్రీహరి కనురెప్పవేసిన సమయమున (బ్రహ్మదేవుని ఆయువు పూర్తి కాగానే) ప్రాకృతిక లయమేర్పడును. ప్రాకృత లయమున దేవాది చరాచరసృష్టి బ్రహ్మదేవునిలో విలీనమగును. ఆ బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని నాభి పద్మమున విలీనమగును. వైకుంఠమున క్షీరసాగరమున పవళించి యున్న చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఎడమభాగమున విలీనమగును. ఏకాదశ రుద్రులు, భైరవుడు మొదలైన సదాశివుని అనుచరులందరు సనాతనుడు, జ్ఞనానందస్వరూపుడగు సదాశివునిలో విలీనమగుచున్నారు. జ్ఞానాధి దేవుడైన శివుడు మహాదేవుడైన సదాశివుని అనుచరులందరూ, సనాతనుడు, జ్ఞానానంద స్వరూపుడగు సదాశివునిలో విలీనమగుచున్నారు. జ్ఞానాధి దేవుడైన శివుడు మహాదేవుడైన శ్రీకృష్ణుని జ్ఞానమున విలీనమగుచున్నాడు. దుర్గాయాం విష్ణుమాయాయాం విలీనాః సర్వశక్తయః || 61 సాచ కృష్ణస్య బుద్ధౌ చ బుధ్యధిష్ఠాతృదేవతా | ప్రాకృతిక లయమున సర్వశక్తి స్వరూపిణులు విష్ణుమాయ అగు దుర్గాదేవిలో విలీనమగుచున్నవి. బుద్ధికి అధిష్ఠానదేవతయగు దుర్గాదేవి శ్రీకృష్ణ పరమాత్మయొక్క బుద్ధిలో విలీనమగుచున్నది. నారాయణాంశం స్కందశ్చ లీనోవక్షసి తస్య చ || 62 శ్రీకృష్ణాంశశ్చ తద్బాహౌ దేవాధీశో గణశ్వరః | పద్మాంశభూతా పద్మాయాం సా రాధాయాం చ సువ్రతే || 63 గోప్యశ్చాzపి చ తస్యాం చ సర్వావై దేవ యోషితః | కృష్ణప్రాణాధిదేవి సా తస్య ప్రాణషు సా స్థితా || 64 సావిత్రీ చ సరస్వత్యాం వేదశాస్త్రాణి యాని చ | స్థితా వాణీ చ జిహ్వాయాం తసై#్యవ పరమాత్మనః || 65 గోలోకస్థస్య గోపాశ్చ విలీనాస్తస్య లోమసు | తత్ప్రాణషు చ సర్వేషాం ప్రాణావాతాహుతాశనః || 66 జఠరాగ్నౌ విలీనశ్చ జలం తద్రసనాగ్రతః | వైష్ణవాశ్చరణాంభోజే పరమానంద సంయుతాః || 67 సారాత్సారంతా భక్తిరస పీయూష పాయినః | విరాట్ క్షుద్రశ్చ మహతి లీనః కృష్ణే మహాన్విరాట్ || 68 యసై#్యవ లోమకూపేషు విశ్వాని నిఖిలాని చ | యస్య చక్షునిమేషేణ మహాంశ్చ ప్రళయో భ##వేత్ || 69 నారాయణాంశ స్వరూపుడగు కుమారస్వామి శ్రీకృష్ణుని వక్షఃస్థలమున, శ్రీకృష్ణాంశుడు దేవతలకందరకు స్వామియైన గణపతి శ్రీకృష్ణుని బాహువున విలీనమగుచున్నారు. లక్ష్మీదేవి యొక్క అంశభూతులైన స్త్రీలు మహాలక్ష్మియందు విలీనము కాగా ఆమె రాధాదేవి యందు లయమగుచున్నది. సమస్త దేవతాస్త్రీలు, గోపికలు కూడ రాధాదేవియందే విలీనమగుచున్నారు. శ్రీకృష్ణదేవునకు ప్రాణములకన్నమిన్నయైన రాధాదేవి అతని ప్రాణములందే విలీనమగుచున్నది. సావిత్రీదేవి, వేదశాస్త్రములన్నియు సరస్వతిలో విలీనము కాగా, ఆ సరస్వతీ దేవి శ్రీకృష్ణ పరమాత్మయొక్క నాలుకయందు విలీనమగుచున్నది. g][ÍÜ[NRPª«sVVƒ«s ƒ«sVƒ«sõ $NRPXxtñsQxmsLRiª«sW»R½ø L][ª«sVª«sVVÌÁLiµR…V g][xmsNRPVÌÁV „sÖdÁƒ«sª«sVV NSgS @LiµR…Lji úFyßáLRiWxms\®ªsVƒ«s ªy¸R…VVª«soÌÁV $NRPXxtñsv¬s úFyß᪫sVVÌÁLiµR…V, @gjiõ @»R½¬s ÇÁhRiLSgjiõÍÜ[, ÇÁÌÁª«sVV $NRPXxtñsv¬s ƒyÌÁVNRP\|msƒ«s „sÖdÁƒ«sª«sVgRiV¿RÁVƒ«sõ„s. $NRPXxtñsQxmsµR…xmsµR…øª«sVVÌÁƒ«sV }qs„sLi¿RÁV¿RÁV xmsLRiª«sWƒ«sLiµR…ª«sVVƒ«s ƒ«sVƒ«sõ \®ªsxtñsQª«soÌÁV A $NRPXxtñsQ xmsLRiª«sW»R½ø FyµR…ª«sVVÌÁLi®µ…[ „sÖdÁƒ«sª«sVgRiV¿RÁVƒyõLRiV.
క్షుద్రవిరాట్ మహావిరాట్ స్వరూపునిలో అంతర్ధానము కాగా మహావిరాట్ స్వరూపుడు శ్రీకృష్ణునిలో లీనమగుచున్నాడు.
ఈ విధముగానే సమస్త విశ్వములు శ్రీకృష్ణపరమాత్మ యొక్క రోమకూపములందు లీనమగుచున్నవి.
చక్షురున్మీలనే సృష్టిర్యసై#్యవ పరమాత్మనః | యావన్నిమేషే సృష్టిః స్యాత్ తావదున్మీలనే వ్యయః ||70
బ్రహ్మణశ్చ శతాబ్దేన సృష్టిస్తస్య లయః పునః | బ్రహ్మ సృష్టిలయానాం చ సంఖ్యా నాస్త్వేవ సువ్రతే || 71
యథా భూరజసాం చైవ సంఖ్యానం చ నిశామయ | చక్షుర్నిమేషే ప్రళయో యస్య సర్వాంతరాత్మనః || 72
ఉన్మీలనే పునః సృష్టిః భ##వేదేవేశ్వరేచ్ఛయా | తద్గుణోత్కీర్తనం వక్తుం బ్రహ్మాండేషు చ కః క్షమః || 73
శ్రీకృష్ణపరమాత్మ కన్నులు తెరిచినచో ఈ చరాచర జంతుసృష్టి జరుగును. అట్లే అతడు కండ్లు మూసినచో ప్రళయము సంభవించును. అదే బ్రహ్మదేవుని యొక్క నూరు సంవత్సరముల జీవిత కాలము. అట్లే సృష్టి. లయములు జరుగుచున్నవి.
ఇంతవరకు జరిగిన సృష్టిలయముల సంఖ్యను భూమియందున్న రేణువుల సంఖ్యవలె ఎవ్వరు లెక్కపెట్టలేరు. సర్వాంతరాత్మయైన పరమేశ్వరుడు కండ్లు తెరిచినచో సృష్టి జరుగును. అట్లే అతడు కండ్లు మూసికొన్నచో మరల లయము జరుగును.
శ్రీకృష్ణపరమాత్మ గుణగణవర్ణనమును చేయు బ్రహ్మాండములన్నిటలో నున్న ఎవ్వరును కూడా సమర్థులు కాజాలరు.
తత్ప్రధానా హరేర్భక్తిః ముక్తేరపిగరీయసీ | సాలోక్యదా హరరేకా చాన్యా సారూప్యదా పరా || 75
సామీప్యదా చ నిర్వాణదాత్రీ చైవమితి స్మృతిః | భక్తాస్తానహి వాంఛంతి వినా తత్సేవనాధికం || 76
సావిత్రి ! నాతండ్రి యగు సూర్యని వలన శాస్త్రములవలన నేను తెలుసుకొన్న విషయమునంతయునీకు చెప్పితిని.
ముక్తులునాల్గు విధములుగా నుండునని వేదములు తెల్పుచున్నవి. ఈ ముక్తులన్నిటి కంటె శ్రీహరి భక్తి చాలా గొప్పనిది. ముక్తులలో సాలోక్యమును కలిగించు ముక్తి ఒకటి కాగా సారూప్యమునిచ్చు ముక్తి రెండవది. సామీప్యమును, నిర్వాణమునిచ్చు ముక్తు లును తక్కినవి, శ్రీహరి భక్తులకు శ్రీకృష్ణపాదసేవనము తప్ప ఎట్టి ముక్తులు అవసరమని అనుకొనరు.
సిద్ధత్యమమరత్వం చ బ్రహ్మత్వ చావహేళనా | జన్మమృత్యు జరావ్యాధి భయశోకాది ఖండనం || 77
ధారణం దివ్యరూపస్య వదుర్నిర్వాణ మోక్షదం | ముక్తిశ్చ సేవా రహితా భక్తిః సేవా వివర్ధినీ || 78
భక్తి ముక్త్యోరయం భేదో నిషేకే లక్షణం శ్రుణు |
సిద్ధత్వము, అమరత్వము, బ్రహ్మత్వము, దివ్వరూపధారణము ఇవి నిర్వాణమోక్షమును కలిగించున. ముక్తియనునది భగవంతుని సేవా విరహితము. భక్తి భగవంతుని సేవను పెంచును. భక్తిముక్తుల యొక్క ప్రధానమైన భేదమిది. ఇక నిషేకలక్షణమును వినుము.
విదుర్భుధా నిషేకం చ భోగం చ కృతకర్మణాం || 79
తత్ఖండనం చ శుభదం పరం శ్రీకృష్ణసేవనం | తత్వజ్ఞానమిదం సాధ్వి సారం వై లోక వేదయోః || 80
జీవి తాను చేసిన కర్మముల ఫలముననుభవించుటను నిషేకమని పండితులందురు. దానిని ఖండించునది శుభ##మైనది మిక్కిలి శ్రేష్ఠమైనది శ్రీకృష్ణసేవనము.
ఈతత్వమును లోకము, వేదముల యొక్క సారమని చెప్పవచ్చును.
విఘ్నఘ్నం సుఖదం చోక్తం గచ్ఛ వత్సే యథాసుఖం | ఇత్యుక్త్వా సూర్యపుత్రశ్చ జీవయిత్వా చ తత్పతిం || 81
తసై#్య శుభాశిషం దత్వా గమనం కర్తుముద్యతః | దృష్ట్యా యమంచ గచ్ఛంతం సావిత్రీ తం ప్రణమ్యచ || 82
రురోద చరణ ధృత్వా సద్విచ్చేదోzతి దుఃఖదః | సావిత్రీరోదనం దృష్ట్యా యమస్సోzయం కృపానిధిః || 83
తామువాచ చ సంతుష్టస్త్వరోదీచ్చాz పి నారద || 84
ఈ తత్వము విఘ్నముల తొలగించును. సుఖమును కలిగించును. ఓ సావిత్రీ! నీవు సుఖముగా ఇంటికి పొమ్మని యమధర్మరాజు సత్యవంతుని బ్రతికించి శుభాశీస్సులనొసగి తనలోకమునకు కదిలెను.
అప్పుడు సావిత్రి అతనికి నమస్కరించి ఏడ్వమొదలిడెను. సత్సురుషులతోడి వియోగము మిక్కిలి దుఃఖమును కలిగించును కదా!
దయగల యమధర్మరాజు ఏడ్చుచున్న సావిత్రిని చూచి అతడు కూడ దుఃఖించెను. తరువాత ఇట్లు పలికెను.
యమ ఉవాచ- యమధర్మరాజిట్లనెను-
లక్షవర్షం సుఖం భుక్త్యా పుణ్యక్షేత్రే చ భారతే | అంతే యాస్యసి గోలోకే శ్రీకృష్ణ భవనం శుభే || 85
గత్వా చ స్వగృహం భ##ద్రే సావిత్ర్యాశ్చ వ్రతం కురు | ద్విసప్తవర్షపర్యంతం నారీణాం మోక్షకారణం || 86
జ్యేష్ఠే శుక్ల చతుర్దశ్యాం సావిత్ర్యాశ్చ వ్రతం శుభం | శుక్లష్టమ్యాం భాద్రపదే మహాలక్ష్మ్యాః వ్రతం శుభం || 87
ద్వ్యష్ట వర్షవ్రతం చేదం ప్రత్యబ్దం పక్షమేవ చ | కరోతి పరయా భక్త్యా సా యాతి చ హరేః పదం || 88
ప్రతి మదగళవారే చ దేవీం మంగళచండికాం | ప్రతి మాసం శుక్ల షష్ఠ్యాం షష్ఠీం మంగళదాయికాం || 89
తథా చాషాఢ సంక్రాంత్యాం మనసాం సర్వసిద్ధిదాం | రాధాం రాసే చ కార్తిక్యాం కృష్ణప్రాణాధికాం ప్రియాం || 90
ఉపోష్య శుక్లాష్టమ్యాం చ ప్రతి మాసే వరప్రదాం | విష్ణుమాయాం భగవతీం దుర్గాం దుర్గార్తి నాశినీం || 91
ప్రకృతిం జగదంబాం చ పతిపుత్రవతీం సతీం | పతివ్రతాసు శుద్దాసు యంత్రేషు ప్రతిమాసు చ || 92
యా నారీ పూజయోద్భక్త్యా ధన సంతాన హేతవే | ఇహలోకే సుఖం భుక్త్యా యాత్యంతే శ్రీహరేః పదం || 93
సావిత్రి! నీవు భారతదేశమున లక్ష సంవత్సరములు సుఖముగా ఉండి చివరకు గోలోకమున శ్రీకృష్ణమందిరమునకు పోదువు.
నీవు ఇంటికి వెళ్ళి స్త్రీలకు మోక్షమునిచ్చు సావిత్రి వ్రతమును పదునాలుగు సంవత్సరములు ఆచరింపుము. ఆ వ్రతమును ప్రతి సంవత్సరము జేష్ఠమాసమున శుక్లపక్ష చతుర్దశినాడు ఆచరించుట శ్రేయోదాయకము.
మహాలక్ష్మీ వ్రతమును ప్రతి సంవత్సరము భాద్రపద మాసమున శుక్లపక్షమున అష్టమీ తిథినాడు అనుష్ఠించవలెను. దీనిని పదహారు సంవత్సరములు దీక్షతో భక్తి కలిగి చేసినచో ఆ స్త్రీ శ్రీహరి పాద సన్నిధికేగును. అట్లే ప్రతి మంగళవారమున మంగళచండికా వ్రతమును చేయవచ్చును. ప్రతినెల శుద్ధ షష్ఠీ తిథినాడు షష్ఠీదేవి వ్రతము చేయుట మంచిది. ఆషాడమాసమున వచ్చు సూర్య సంక్రమణమున మానసాదేవి వ్రతము చేయవలెను. ప్రతి సంవత్సరము కార్తీకమాసమున శ్రీకృష్ణునకు ప్రాణప్రియురాలైన రాధికా వ్రతమును చేయవలెను. అదేవిధముగా ప్రతిమాసము శుద్దాష్టమి నాడు ఉదయము ఉపవసించి వరములను ఒసగునది ఆర్తిని పోగొట్టునది, విష్ణుమాయం, జగదంబయగు దుర్గాదేవీ వ్రతమునాచరింపలెను. అట్లే ప్రతివ్రతలయందును, యంత్రములయందును, అర్చామూర్తులయందును పతిపుత్రవతి, సతి, జగదంబ యగు ప్రకృతిని ఆరాధించినచో ఈ లోకమున సుఖముగా నుండి పరలోకమున శ్రీహరి నివాస స్థానమగు వైకుంఠమును చేరుదురు.
ఇత్యుక్త్యా తాం ధర్మరాజో జగామ నిజమందిరం | గృహీత్వా స్వామినం సా చ సావిత్రీ చ నిజాలయం || 94
సావిత్రీ సత్యవంతం చ వృత్తాంతం చ యథాక్రమం | అన్యాంశ్చ కథయామాస బాంధవాంశ్చై వ నారద || 95
సావిత్రీజనకః పుత్రాన్స ప్రాపద్వై క్రమేణ చ | శ్వశురః చక్షుషీ రాజ్యం సా చ పుత్రాన్వరేణ చ || 96
లక్షవర్షం సుఖం భుక్త్వా పుణ్యక్షేత్రే చ భారతే | జగామ స్వామినా సార్ధం గోలోకం సా పతివ్రతా || 97
ఈ విధముగా సావిత్రితో మాట్లాడి యమధర్మరాజు తన నివాసమునకు పోయెను. సావిత్రి సత్యవంతుని వెంటపెట్టుకొని తన నివాసమునకు చేరెను. తరువాత ఆమె తన భర్తయగు సత్యవంతునకు ఇతర బంధువులకు అరణ్యములో జరిగిన వృత్తాంతమునంతయు పూసగుచ్చినట్లుగా వివరించెను.
యమధర్మరాజొసగిన వర ప్రభావము వలన సావిత్రి తండ్రియైన అశ్వపతికి పుత్రులు పుట్టిరి. అట్లే సావిత్రి మామయగు ద్యుమత్సేనునికి దృష్టి, రాజ్యముతోబాటు, పుత్రులు కలిగిరి.
సావిత్రి పవిత్రమైన భారతదేశమున లక్షసంవత్సరములు సుఖముగా నుండి తన భర్తతో కలిసి గోలోకమును చేరుకొనెను.
సవితుశ్చాధిదేవీ య మంత్రాదిష్ఠాతృదేవతా | సావిత్రీ చాపి వేదానాం సావిత్రీ తేన కీర్తితా || 98
సూర్యునకు అధిష్ఠాన దేవత, సూర్యమంత్రమునకు అధిష్ఠాన దేవత, వేదములకు జనని (సావిత్రీ) కావున ఆదేవతను సావిత్రి యని పిలుతురు.
ఇత్యేవం కథితం వత్స సావిత్ర్యుపాఖ్యానముత్తం | జీవకర్మ విపాకం చ కిం పునః శ్రోతు మిచ్ఛసి || 99
నారదా ! ఈ విధముగా సావిత్రుపాఖ్యానమును, జీవకర్మ విపాకమును నీకు చెప్పితిని. ఇంకను నీవు వినగోరు విషయమేదైన యున్నచో చెప్పుమని నారాయణుడు నారదునితో ననెను.
ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే సావిత్ర్యుపాఖ్యానే సావిత్ర్యాః యమోపదేశసమాప్తిర్నామ చతుస్త్రింశత్తమోzధ్యాయః ||
ఇతిశ్రీ సావిత్ర్యుపాఖ్యానం
శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాదమున చెప్పబడిన సావిత్రి ఉపాఖ్యానములో సావిత్రికి యమోపదేశ పరిసమాప్తి యను ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.
సావిత్ర్యుపాఖ్యానము సమాప్తమైనది.