sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచత్రింశోzధ్యాయః - లక్ష్మీ పూజాది వర్ణనము నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను- శ్రీకృష్ణస్యాత్మనశ్చైవ నిర్గణస్య నిరాకృతేః | సావిత్రీ యమ సంవాదే శ్రుతం సువిమలం యశః || 1 తద్గుణోత్కీర్తనం సత్యం మంగళానాం చ మంగళం | అధునాశ్రోతు మిచ్ఛామి లక్ష్య్యుపాఖ్యానమీశ్వర || 2 కేనాదౌ పూజితా సాzపి కిం భూతా కేనవాపురా | తద్గుణోత్కీర్తనం సత్యం వద వేదవిదాం వర || 3 ఓనారాయణ! నిర్గుణుడు, నిరాకృతి, పరమాత్మయగు శ్రీకృష్ణుని నిర్మలమైన కీర్తిని సావిత్రీయమ సంవాద సమయమున విన్నాను. ఆ శ్రీకృష్ణదేవుని గుణకీర్తన మంగళకరమైనది. ఇప్పుడు నాకు లక్ష్మీదేవి చరిత్రను వినవలెనను కోరిక కలదు. ఆ దేవిని మొదట ఎవరు పూజించిరి? ఆమె ఏవిధముగా ఉండినది. అందువలన ఆ లక్ష్మీదేవియొక్క గుణ కీర్తన జరుగునట్లు ఆమె చరిత్రను నాకు వివరింపుము. నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను- సృష్టేరాదౌ పురా బ్రహ్మన్ కృష్ణస్య పరమాత్మనః | దేవీ వామాంశ సంభూతా చాసీత్సా రాసమండలే || 4 అతీవ సుందరీ శ్యామా న్యగ్రోధ పరిమండలా | యథా ద్వాదశవర్షీయా రమ్యా సుస్థిర ¸°వనా || 5 శ్వేత చంపక వర్ణాభా సుఖదృశ్యా మనోహరా | శరత్పార్వణ కోటిందు ప్రభా సంశోభితాననా || 6 శరన్మధ్యాహ్న పద్మానాం శోభా శోభిత లోచనా | సా చ దేవీ ద్విధాభూతా సహసైవేశ్వరేచ్చయా || 7 సమా రూపేణ వర్ణేన తేజసా వయసా త్విషా | యశసా వాససా మూర్త్యా భూషణన గుణన చ || 8 స్మితేన వీక్షణనైవ వచసా గమనేన చ | మధురేణ స్వరేణౖవ ప్రేవ్ణూ చానునయోన చ || 9 ఓ నారదా! పూర్వము సృష్టిప్రారంభమున రాసమండలమున శ్రీకృష్ణపరమాత్మయొక్క ఎడమభాగమునుండి ఒక దేవి ఉదయించినది. ఆమె చాలా సౌందర్యము గలది. ¸°వనవతి. పన్నెండు సంవత్సరముల కన్యవలె స్థిరమైన ¸°వనము కలది. తెల్లని చంపక పుష్పము వంటి కాంతి కలది. అందమైనది. శరత్కాలమందలి కోటి పున్నమి చంద్రుల వంటి ముఖసౌందర్యము గలది.అట్లే శరన్మధ్యాహ్న కాలమందలి పద్మమువంటి కన్నులు కలది. ఆ దేవి పరమేశ్వరుని ఇచ్ఛననుసరించి వెంటనే రెండు రూపములతో కన్పించినది. ఇద్దరి రూపము, రంగు, కాంతి, తేజస్సు, వయస్సు, వస్త్రములు, భుషణములు,గుణములు, చిరునవ్వు,చూపు,మాటలు,నడక, మధురస్వరము,ప్రేమగానుండుట అనునయము అన్నియు సమానముగా నుండెను. తద్వామాంశా మహాలక్ష్మీః దక్షిణాంశా చ రాధికా | రాధాzదౌ వరయామాస ద్విభుజం చ పరాత్పరం || 10 మహాలక్ష్మీశ్చ తత్పశ్చాత్ చమేక కమనీయకం | కృష్ణస్తద్గౌరవేణౖవ ద్విధారూపో బభూవ హ || 11 దక్షిణాంశో వై ద్విభుజో వామాంశశ్చ చతుర్భుజః చతుర్భుజాయ ద్విభుజో మహాలక్ష్మీం దదౌ పురా || 12 లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యా యయాzనిశం | దేవీషు యా చ మహతీ మహాలక్ష్మీశ్చ సా స్మృతా || 13 ద్విభుజో రాధికాకాంతో లక్ష్మీకాంతశ్చతుర్భుజః | గోలోకే ద్విభుజస్తస్థౌ గోపైర్గోపీభిరావృతః || 14 చతుర్భుజశ్చ వైకుంఠం ప్రయ¸° పద్మయా సహ | సర్వాంశేన సమౌ తౌ ద్వౌ కృష్ణనారాయణౌ పరౌ || 15 ఆ దేవి యొక్క ఎడమ భాగమునుండి ఏర్పడినది మహాలక్ష్మి. కుడిభాగమునుండి ఆవిర్భవించినది రాధాదేవి. వారిలో రాధ ద్విభుజుడగు శ్రీకృష్మపరమాత్మను భర్తగా వరించగా ఆ తర్వాత సుందరుడగు ఆ పరమాత్మను మహాలక్ష్మీ వరించినది. శ్రీకృష్ణుడు వారిపై గల గౌరవభావమున రెండు రూపములతో ఆవిర్భవించెను. అతనిలో కుడివైపున ఆవిర్బవించినవాడు ద్విభుజుడగు శ్రీకృష్ణుడు. ఎడమవైపున చతుర్భుజుడగు నారాయణుడుద్భవించెను. ద్విభుజుడగు శ్రీకృష్ణుడు చతుర్భుజుడగు నారాయణునకు మహాలక్ష్మిని ఇచ్చెను. చల్లని చూపుతో ప్రపంచమును ఎల్లప్పుడు చూచునది (రక్షించునది) దేవతాస్త్రీలలో శ్రేష్ఠురాలు కావున ఆమె మహాలక్ష్మియైనది.రాధికా ప్రియుడు ద్విభుజుడగు శ్రీకృష్ణుడు. మహాలక్ష్మి ప్రియుడు చతుర్భుజుడగు నారాయణుడు. ద్విభుజుడగు శ్రీకృష్ణుడు గోప, గోపికలతో గోలోకముననుండెను. చతుర్భుజుడగు నారాయణుడు మహాలక్ష్మితో వైకుంఠమునకు పోయెను. శ్రీకృష్ణ నారాయణులిద్దరు అన్నివిధములుగా సమానమైనవారు. మహాలక్ష్మీశ్చ యోగేన నానారూపా బభూవ సా | వైకుంఠే చ మహాలక్ష్మీః పరిపూర్ణతమా పరా || 16 శుద్ద సత్వస్వరూపా చ సర్వ సౌభాగ్య సంయుతా | ప్రేవ్ణూ సావై ప్రధానా చ సర్వాసు రమణీషు చ || 17 స్వర్గేచ స్వర్గలక్ష్మీశ్చ శక్రసంపత్స్యరూపిణీ | పాతాళేషు చ మర్త్యేషు రాజలక్ష్మీశ్చ రాజసు || 18 గృహలక్ష్మీర్గృహేష్వేవ గృహిణీ చ కళాంశయా | సంపత్స్వరూపా గృహిణాం సర్వమంగళమంగళా || 19 గవాం ప్రసూః సా సురభిః దక్షిణా యజ్ఞాకామినీ | క్షీరోదసింధుకన్యా సా శ్రీరూపా పద్మినీషు సా || 20 శోభారూపా చ చంద్రే సా సూర్యమండల మండితా | విభూషణషు రత్నేషు ఫలేషు జలజేషు చ || 21 నృపేషు నృపపత్నీషు దివ్యస్త్రీషు గృహేషు చ | సర్వ సస్యేషు వస్త్రేషు స్ధానే సా సంస్కృతే తథా ||22 ప్రతిమాసు చ దేవానాం మంగళేషు ఘటేషు చ | మాణిక్యేషు చ ముక్తాసు మాల్యేషు చ మనోహరా || 23 మణీంద్రేషు చ హారేషు క్షీరే వై చందనేషు చ | వృక్షశాఖసు రమ్యాసు నవమేఘేషు వస్తుషు || 24 మహాలక్ష్మి యోగ శక్తివలన అనేక రూపములుగా మారినది. వైకుంఠమున పరిపూర్ణతమయైన మహాలక్షిగా ఉండును.ఆమెశుద్ద సత్వ స్వభావము కలది. సమస్త సౌభాగ్యములు కలది. స్త్రీలందరిలో ప్రేమ మూర్తియై ప్రధానమైనదిగా ఆమె కన్పించును. ఆ మహాలక్ష్మి స్వర్గలోకమున ఇంద్రుని సంపదకు మారురూపైన స్వర్గలక్ష్మిగా రూపొందినది. పాతాళమున, భూలోకమున నున్న రాజులకు ఆమె రాజలక్ష్మి యైనది. అన్ని గృహములలో గృహలక్ష్మిగా ఆమె తన అంశ##చే గృహిణిగా ఐనది. అట్లే గృహ యజమానులకు సంపత్స్వరూపయగు సర్వమంగళ మంగళ##యైనది. అట్లే ఆవులలో ఆమె గోవులకు మాతయగు సురభిగాను, యజ్ఞభార్యయగు దక్షిణాదేవిగాను, క్షీరాబ్ధికన్యగాను, చంద్రునిలోను, సూర్యమండలమున, సమస్త భూషణములయందు జలజములలో శోభారూపిణిగను మారినది. అట్లే సమస్త సస్యములందు దేవ ప్రతి మలయందు మంగళ కుంభముల యందు మాణిక్యములందు రత్నమాలలయందు, పాలలో, చందనమున, అందమైన వృక్షములందు నూతన మేఘములందు లక్ష్మి కనిపించును. వైకుంఠే పూజితా సాzదౌ దేవీ నారాయణన చ | ద్వితీయే బ్రహ్మణా భక్త్యా తృతీయే శంకరేణ చ || 25 విష్ణునా పూజితా సా చ క్షీరోదే భారతే మునే | స్వయంభువేన మనునా మానవేంద్రైశ్చ సర్వతః || 26 ఋషీంద్రైశ్చ మునీంద్రైశ్చ సద్భిశ్చ గృహిభిర్భవేత్ | గంధర్వాద్యైశ్చ నాగాద్యైః పాతాళేషు చ పూజితా || 27 శుక్లాష్టమ్యాం భాద్రపదే పూజా వై బ్రహ్మణా కృతా | భక్త్యా చ పక్షపర్యంతం త్రిషులోకేషు నారద || 28 చైత్రే పౌషే చ భాద్రేచ పుణ్య మంగళవాసరే | విష్ణునా నిర్మితా పూజా త్రిషులేకేషు భక్తితః || 29 వర్షాంతే పౌషసంక్రాంత్యాం మేద్యమావాహ్య చాంగణ | మనుస్తాం పూజయామాస సా భూతా భువనత్రయే || 30 లక్ష్మీదేవిని మొదట నారాయణుడు వైకుంఠమున పూజించెను. తరువాత బ్రహ్మదేవుడు, అటుపిమ్మట శంకరుడామెను పూజించెను. నారాయణుడు క్షీరసముద్రమున ఆమెను పూజించగా భారతదేశమున మనువు, రాజులు, ఋషులు, మునులు, గృహస్థులు, గంధర్వులు మొదలగువారు ఆమెను పూజించుచున్నారు. పాతాళలోకమున నాగులు మొదలగువారు ఆమె పూజను చేయుచున్నారు. బ్రహ్మదేవుడు చేసిన లక్ష్మీపూజ భాద్రపద శుద్ద అష్టమి మొదలుకొని పదిహేను దినములవరకు జరుగును. శ్రీమహావిష్ణువు చేసిన లక్ష్మీపూజ చైత్రమాసమున, పుష్యమాసమున, భాద్రపదమాసమున ప్రతి మంగళవారము చేయవలెను. మనువు ఆ శ్రీదేవిని ఫాల్గుణమాసమున, పుష్యమాసమున పూజించెను. రాజ్ఞా సంపూజితా సావై మంగళేనైవ మంగళా | కేదారేణౖవ నీలేన నలేన సుబలేన చ || 31 ధ్రువేనోత్తానపాదేన శ##క్రేణ బలినా తథా | కశ్యపేన చ దక్షేణ కర్దమేన వివస్వతా || 32 ప్రియవ్రతేణ చంద్రేణ కుభేరేణౖవ వాయునా | యమేన వహ్నినా చైవ వరుణనైవ పూజితా || 33 లక్ష్మీదేవిని మంగళుడను రాజు పూజించినందువలన ఆ దేవి మంగళ##యైనది. అదేవిధముగా ఆదేవిని కేదారుడు, నీలుడు, నలుడు, సుబలుడు, ధ్రువుడు, ఉత్తానపాదుడు, ఇంద్రుడు, బలిచక్రవర్తి, కశ్యప ప్రజాపతి, దక్షప్రజాపతి, కర్దముడు, సూర్యుడు, ప్రియవ్రతుడు, చంద్రుడు, కుబేరుడు, వాయువు, యముడు అగ్ని, వరుణుడు పూజించిరి. ఏవం సర్వత్రం సర్వైశ్చ వందితా పూజితా సదా | సర్వైశ్వర్యాధిదేవీ సా సర్వసంపత్స్వరూపిణీ || 34 ఈ విధముగా మహాలక్ష్మీని అందరు అన్ని చోట్ల నమస్కరించుచున్నారు. పూజించుచున్నారు. ఆదేవిని సమస్తసంపదలకు సమసై#్యశ్వరములకు అధిదేవత కావున అందరిపూజలనందుకొనుచున్నది అని నారాయణుడు నారదునితోననెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతే ఖండే నారద నారాయణ సంవాదే లక్ష్మ్యుపాఖ్యానే లక్ష్మీస్వరూప పూజాది వర్ణనం నామ పంచత్రింశోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నారద నారాయణ సంవాద సమయమున చెప్పబడిన లక్ష్మీ ఉపాఖ్యానమున శ్రీమహాలక్ష్మీస్వరూపము, పూజావర్ణనములు కల ముప్పది ఐదవ అధ్యాయము సమాప్తము