sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షట్ త్రింశోధ్యాయః - ఇంద్రునకు దుర్వాసమహర్షి శాపము పెట్టుట నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను- నారాయణప్రియా సా చ వరా వైకుంఠవాసినీ | వైకుంఠాధిష్ఠాతృదేవీ మహాలక్ష్మీః సనాతనీ || 1 కథం బభూవ సా దేవీ పృథివ్యాం సింధు కన్యకా | కిం తత్ ధ్యానం చ కవచం సర్వం పూజావిధి క్రమం || 2 పురా కేనస్తుతాz దౌ సా తన్మే వ్యాఖ్యాతుమర్హసి || 3 వైకుంఠవాసిని, శ్రీమన్నారాయణునకు పత్నియగు మహాలక్ష్మి సింధుకన్యకగా ఎట్లు మారెను. ఆమె యొక్క ధ్యానము, కవచము, పూజావిధి మొదలగు వాని నన్నిటిని నాకు వివరించుమని అడిగెను. నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను- పురా దుర్వాససః శాపాత్ భ్రష్టశ్రీకః పురందరః | బభూవ దేవసంఘశ్చ మర్త్యలోకశ్చ నారద || 4 లక్ష్మీః స్వర్గాదికం త్యక్త్యా రుష్టా పరమ దుఃఖితా | గత్వా లీనా చ వైకుంఠే మహాలక్ష్మ్యాం చ నారద || 5 తదా శోకాద్యయుర్దేవాః దుఃఖితాః బ్రహ్మణః సభాం | బ్రహ్మాణం చ పురస్కృత్య యముః వైకుంఠమేవ చ || 6 వైకుంఠే శరణాపన్నా దేవా నారాయణ పరే | అతీవ దైన్యయుక్తాశ్చ శుష్క కంఠౌష్ఠతాలుకాః || 7 తదా లక్ష్మీశ్చ కళయా పురా నారాయణాజ్ఞయా | బభూవ సింధుకన్యా సా శక్ర సంపత్స్వరూపిణీ ||8 పూర్వము దూర్వాస మహర్షి శాపమున దేవేంద్రుడు, దేవతాసమూహము, మానవలోకము లక్ష్మిని కోలుపోయినది. లక్ష్మీదేవి స్వర్గమును, భూమిని వదలి వైకుంఠమునకు పోయి మహాలక్ష్మిలో లీనమైనది. అందువలన దేవతలు మిక్కిలి దుఃఖమునంది బ్రహ్మదేవుని దగ్గరకు పోయిరి. అక్కడ బ్రహ్మదేవుని వెంటపెట్టుకొని వైకుంఠమునుక పోయి వారందరు మిక్కిలి దీనులై శ్రీమన్నారాయణుని శరణువేడిరి. అప్పుడు నారాయణుని ఆజ్ఞవలన లక్ష్మీదేవి దేవేంద్రుని సంపత్స్వరూపిణియై క్షీరాబ్ది కన్యగా జన్మించినది. తదా మథిత్వా క్షీరోదం దేవా దైత్య గణౖః సహా | సంప్రాపుశ్చ వరం లక్ష్మ్యా దద్రుశుస్తాం చ తత్ర హి || 9 సురాదిభ్యోవరం దత్వా వనమాలాం చ విష్ణవే | దదౌ ప్రసన్నవదనా తుష్టా క్షీరోదశాయినే || 10 దేవాశ్చాప్యసురాక్రాంతం రాజ్యం ప్రాపుశ్చ తద్వరాత్ | తాం సంపూజ్య చ సంస్తూయ సర్వత్ర చ నిరాపదః || 11 దేవతలందరు శ్రీమహావిష్ణువు యొక్క ఆజ్ఞవలన రాక్షసులతో కలిసి క్షీరసముద్రమును మథించి అచ్చట లక్ష్మీదేవిని దర్శించగలిగిరి. అట్లే వారు లక్ష్మీదేవి వలన వరమును పొందిరి. లక్ష్మీదేవి దేవతలకు అనుగ్రహమునొసగి, శ్రీమహావిష్ణువునకు వరమాలను సమర్పించి శ్రీమహావిష్ణువుపై తన సంతోషమును వ్యక్తపరచినది. లక్ష్మీదేవి అనుగ్రహమువలన దేవతలు రాక్షసులాక్రమించుకొన్న రాజ్యమును తిరిగి సంపాదించుకొని ఆమెను స్తుతించిరి. పూజించిరి. నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను. కథం శశాప దుర్వాసాః మునిశ్రేష్ఠః పురందరం | కేన దోషేణ వా బ్రహ్మన్ బ్రహ్మిష్ఠం బ్రహ్మవిత్పురా || 12 మమంథ కేన రూపేణ జలధిసై#్తః సురాదిభిః | కేన స్తోత్రేణ సా దేవీ శ##క్రే సాక్షాద్బభూవ హ || 13 కోవా తయోశ్చ సంవాదో హ్యభవత్తద్వద ప్రభో || 14 ముని శ్రేష్ఠుడగు దుర్వాసుడు దేవేంద్రుని ఏకారణమువలన శపించెను?సముద్రము వారితో ఏవిధముగా మధింపబడినది? దేవేంద్రుడామెను ఏవిధముగా స్తుతించెను. లక్ష్మీదేవి దేవేంద్రులమధ్య ఎటువంటి సంభాషణ నడిచెను. దానినంతయు నాకు వివరింపుము. అని అడిగెను. నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను- మధుపాన ప్రమత్తశ్చ త్రైలోక్యాధిపతిః పురా | క్రీడాం చకార రహసి రంభయా సహ కాముకః ||15 కృత్వా క్రీడాం తయా సార్ధం కాముక్యా హృతచేతనః | తస్థౌ తత్ర మహారణ్య కామోన్మథిత చేతనః || 16 కైలాస శిఖరం యాంతం వైకుంఠాదృపిపుంగవం | దుర్వాససం దదర్శేంద్రో జ్వలంతం బ్రహ్మతేజసా || 17 గ్రీష్మ మధ్యాహ్న మార్తండ సహస్ర ప్రభమీశ్వరం | ప్రతప్త కాంచనాభాసం జటా భార మహేశ్వరం || 18 శుక్ల యజ్ఞోపవీతం చ చీరం దండం కమండలుం | మహోజ్వలం చ తిలకం బిభ్రతం చంద్రసన్నిభం || 19 సమన్వితం శిష్యవర్గైర్వేద వేదాంగ పారగైః | దృష్ట్యా ననామ శిరసా సంభ్రమాత్తం పురందరః || 20 శిష్యవర్గం సభక్త్యా వై తుష్టావ చ ముదాన్వితః | మునినా చ సశిష్యేణ తసై#్మ దత్తుశ్శుభాశిషః || 21 విష్ణుదత్తం పారిజాతపుష్పం చ సుమనోహరం | మృత్యురోగ జరాశోకహరం మోక్షకరం దదౌ || 22 ఒకప్పుడు త్రిలోకాధిపతియైన దేవేంద్రుడు మధుపానము చేసి రహస్యప్రదేశమున రంభతో క్రీడింపసాగెను. అచ్చట అతడు కామము వలన కన్ను గానకయుండెను. ఆసమయమున వైకుంఠమునుండి కైలాసమున కేగుచు ఋషిపుంగవుడగు దుర్వాసమహర్షి అచ్చటికి వచ్చెను. ఆ ముని గ్రీహ్మకాలమునందలి మధ్యాహ్న సూర్యునివలె వెలిగిపోవుచుండెను. బంగారు వన్నెతో గొప్పని జటాభారమును, తెల్లని యజ్ఞోపవీతమును, తెల్లని వస్త్రమును, దండకమండలువులను, చంద్రబింబమంత తిలకమును ఆ మహర్షి ధరించి యుండెను. ఆతని వెంట వేదవేదాంగపారంగతులైన అతని శిష్యులుండిరి. వారిని చూచి దేవేంద్రుడు వెంటనే వారి కందరకు నమస్కరించెను. అప్పుడు దుర్వాసుడు అతని శిష్యులు అతనికి ఆశీస్సులనొసగిరి. దుర్వాసుడతనికి విష్ణుమూర్తి తనకిచ్చిన పారిజాతపుష్పమును ఇచ్చెను. ఆ పుష్పము మృత్యువు, ముసలితనము, రోగము, దుఃఖము మొదలగు వానినన్నిటిని తొలగించునది. మోక్షమును కలిగించునది. మిక్కిలి మనోహరమైనది. శక్రః పుష్పం గృహీత్వా చ ప్రమత్తో రాజసంపదా | భ్రమేణ స్ధాపయామాస తత్రవై హస్తిమస్తకే || 23 హస్తీ తత్ స్పర్శమాత్రేణ రూపేణ చ గుణనచ | తేజసా వయసా కాంత్యా విష్ణుతుల్యో బభూవ హ || 24 త్యక్త్వా శక్రం గజేంద్రశ్చప్యగచ్ఛత్ ఘోరకాననం | నశశాక మహేంద్రస్తం రక్షితుం తేజసా మునే || 25 దేవేంద్రుడు దుర్వాసుడిచ్చిన పారిజాతపుష్పమును తీసికొని రాజ్యమదమువలన దానిని తన ఐరావతముయొక్క శిరస్సుపై నుంచెను. ఆ ఏనుగు పారిజాతపుష్పముయొక్క స్పర్శమాత్రముననే గుణమున, వయస్సున, కాంతితో, విష్ణుమూర్తితో సమానమయ్యెను. అందువలన ఆ గజేంద్రుము దేవేంద్రుని వదలి భయంకరమైన అడవికి వెళ్ళిపోయెను. ఆ సమయమున దేవేంద్రుడు దానిని పట్టుకొనలేకపోయెను. తత్పుష్పం త్యక్తవంతం చ దృష్ట్వా శక్రం మునీశ్వరః | తం శశాప మహాతేజాః క్రోధసంరక్తలోచనః || 26 దుర్వాసుడు తానిచ్చిన పుష్పమును దేవేంద్రుడు గౌరవించక, పారవేసిన విషయమును గమనించి కోపముతో అతనినిట్లు శపించెను. దుర్వాసా ఉవాచ- దుర్వాసుడిట్లనెను- అరే శ్రియా ప్రమత్తస్యం కథం మా మవమన్యసే | మద్దత్త పుష్పం గర్వేణ త్యక్తవాన్ హస్తిమస్తకే || 27 విష్ణోర్నివేదితం పుష్పం నైవేద్యం వా జలం ఫలం | ప్రాప్తిమాత్రేణ భోక్తవ్యం త్యాగేన బ్రహ్మహాజనః || 28 భ్రష్టశ్రీర్భ్రష్ట బుద్ధిశ్చ భ్రష్టజ్ఞానో భ##వేన్నరః | యస్త్యజేత్ విష్ణునైవేద్యం భాగ్యేనోపస్థితం శుభం || 29 ప్రాప్తిమాత్రేణ యో భుంక్తే భక్త్యా విష్ణు నివేదితం | పుంసాం శతం సముద్ధృత్య జీవన్ముక్తః స్వయం భ##వేత్ || 30 విష్ణునైవేద్యభోజీ యో నిత్యం తు ప్రణమేద్దరిం | పూజయోత్ స్తౌతి వా భక్త్యా స విష్ణుసదృశో భ##వేత్ || 31 ఓరే దేవేంద్రుడా ! నీవు ధనము వలన మదించి నన్ను అవమానపరచితివి. నేను నీకిచ్చిన పుష్పమును గర్వించి ఏనుగుతలపై వదలి వేసితివి. ఇదం పుష్పం యస్యమార్థ్ని తస్య వై పూజనం పురః | మూర్థ్ని ఛిన్నే శివశిశోః ఛిత్వేదం యోజయిష్యతి || 45 ఇతి శ్రుత్వా మహేంద్రశ్చ ధృత్వా తచ్చరణ ద్వయం | ఉచ్చైరురోద శోకార్త స్తమువాచ భయాకులః || 46 ఈపారిజాతపుష్పము ఎవరి శిరస్సున ఉండునో అతనిని తొలుత పూజింపలెను. శివుని పుత్రుని శిరస్సు ఛేదింపబడినప్పుడు దీనినే (ఏనుగు శిరస్సును) ఛేదించి అతనికి అతుకుదురు. అని దుర్వాసుడనగానే ఇంద్రుడు దుర్వాసుని పాదములు పట్టుకొని ఏడ్చుచు ఇట్లనెను- ఇంద్ర ఉవాచ- ఇంద్రుడిట్లనెను- దత్తః సముచితః శాపో మహ్యం మత్తాయ హే ప్రభో | గతాత్వయా చేత్సంపత్తిః కియత్ జ్ఞానం చ దేహివే || 47 ఐశ్వర్యం విపదాం బీజం ప్రచ్ఛన్న జ్ఞాన కారణం | ముక్తి మార్గార్గళం దార్ధ్యాద్ధరి భక్తి వ్యపాయకం || 48 జన్మమృత్యు జరా రోగ శోక దుఃఖాంకురం పరం | సంపత్తి తిమిరాంధశ్చ ముక్తిమార్గం న పశ్యతి || 49 సంపన్నమత్తః సుమూఢశ్చ సురామత్తః సచేతనః | బాంధవైర్వేష్టితః సోzపి బంధుద్వేషకరో మునే || 50 సంపన్మదే ప్రమత్తశ్చ విషయంధశ్చ విహ్వలః | మహాకామీ సాహసికః సత్వమార్గం నపశ్యతి || 51 ఓ మహర్షీ! నీవు ఐశ్వర్యమదమత్తుడనైన నాకు తగిన శాపము నిచ్చితివి. నీశాపమువలన నా సంపద పోయినను, నాకు కొద్ది జ్ఞానమును ప్రసాదించుము. ఐశ్వర్యము ఆపదలకు కారణమగుచున్నది. జ్ఞానమున పోగొట్టుచున్నది. ముక్తిమార్గమునుకు అడ్డంకిగా ఉండును. శ్రీహరిభక్తిని కలుగనీయదు. జన్మ, మృత్యువు, ముసలితనము, రోగము మొదలగువాటికి మూలకాణమగుచున్నది. సంపదవలన మత్తుడైనవాడు ముక్తిమార్గమును చూడలేడు. అతడు సురామత్తుడైన వానివలె కన్పించును. అతని చుట్టు బంధువులున్నను అందరిని ద్వేషించును. సంపన్మత్తుడు. విషయలంపటుడు, అతికాముకుడు, అతిసాహసికుడు వీరు సత్వమార్గమును చూడలేరు. ద్వివిధో విషయంధశ్చ రాజసస్తామసః స్మృతః | అశాస్త్రజ్ఞస్తామసశ్చ శాస్త్రజ్ఞోరాజసః స్మృతః || 52 శాస్త్రే చ ద్వివిధం మార్గం నిర్దిష్టం మునిపుంగవ | ప్రవృత్తిబీజమేకం చ నివృత్తేః కారణం పరం || 53 చరంతి జీవనశ్చాzదౌ ప్రవృత్తౌ దుఃఖవర్త్మని | స్వచ్ఛందే చాప్రసన్నే చ నిర్నిరోధే చ సంతతం || 54 ఆపాతమధురే లోభాత్ క్లేశే చ సుఖమానినః | పరిణామోత్పత్తిబీజే జన్మమృత్యుజరాకరే || 55 అనేక జన్మపర్యంతం కృత్వా చ భ్రమణం ముదా | స్వకర్మవిహితాయాం చ నానాయోన్యాం క్రమేణ చ || 56 తతః కృష్ణానుగ్రహాచ్చ సత్సంగం లభ##తే జనః | విషయలంపటులు రాజసులు తామసులని రెండు విధములుగా ఉందురు. శాస్త్ర జ్ఞానములేనివాడు తామసుడు కాగా శాస్త్రములన్ని తెలిసినవాడు రాజసుడు, అట్లే శాస్త్రమున ప్రవృత్తిమార్గమని నివృత్తిమార్గమని రెండు విధములు కన్పించుచున్నవి. ప్రాణులు ఎక్కువగా దుఃఖకారణమైన ప్రవృత్తి మార్గము నెంచుకొందురు. అది ఉత్పత్తి పరిణామములకు, జన్మ, మృత్యు, జరాదులకు కారణమగుచున్నది. ప్రవృత్తి మార్గమున సంచరించువారు అనేక జన్మలెత్తుచు తాము చేసికొన్న కర్మలననుసరించి అనేక యోనులలో జన్మించుచున్నారు. తరువాత శ్రీకృష్ణుని అనుగ్రహమువలన వారు సంత్సంగమును పొందుచున్నారు. సహస్రేషు శ##తేష్వేకో భవాబ్దేః పారకాణం ||57 సాధుః సత్వప్రదీపేన ముక్తిమార్గం ప్రదర్శయేత్ | తదా కరోతి యత్నం చ జీవీ బంధన ఖండనే || 58 అనేక జన్మయోగేన తపసాzనశ##నేన చ | తదా లభేన్ముక్తిమార్గం నిర్విఘ్నం సుఖదం పరం ||59 అనేక లక్షలమందిలో ఒకడు సంసార సాగరమునుండి తరించును. సాధుపురుషుడు సత్వగుణమనే దీపమునందుకొని ఇతరులకు ముక్తి మార్గమును చూపించును. అప్పుడు సాధారణ జీవుడు అనేక జన్మలలో చేసిన యోగములవలన, తపస్సువలన, నిరాహార దీక్షవలన సుఖమునిచ్చు మూక్తిమార్గమును పొందును. ఇదం శ్రుతం గురోర్వక్త్రాత్ ప్రసంగావసరేణ చ | న హి పృష్టమతోzన్యచ్చ భవదుఃఖౌఘవేష్టితాః || 60 అధునా విధినా దత్తో విపత్తౌ జ్ఞానసాగరః | సంపద్రూపా విపదియం మమనిస్తార కారిణీ || 61 జ్ఞానసింధో దీనబంధో మహ్యం దీనాయ సాంప్రతం | దేహి కించిత్ జ్ఞానసారం భవపారం దయానిధే ||62 ఈ విషయమంతయు నా గురువగు బృహస్పతితో మాటలాడుచున్నప్పుడు తెలిసికొంటిని. ఇంతకంటె నేను ఎక్కువగా తెలిసికొనలేకపోతిని. ఇప్పుడు ఈ కష్టసమయమున జ్ఞానసముద్రులైన మిమ్ము అదృష్టవశమున పొందితిని. ఈ ఆపద నా సంపదవలన ఏర్పడినది ఐనను నన్ను తరింపజేయుటకు (మీవలన) ఇది కారణమైనది. అందువలన జ్ఞానసముద్రుడవు దీనులకు బంధువు ఐన దుర్వాసమహర్షీ! ఈ దీనునకు సంసారమును తరింపజేయు జ్ఞానము కొంతనైన ఉపదేశింపుము. ఇంద్రస్య వచనం శ్రుత్వా ప్రహస్య జ్ఞానినాం గురుః | జ్ఞానం కథితుమారేభే హ్యతితుష్టః సనాతనః || 63 పరమజ్ఞాని, సనాతనుడగు దుర్వాసమహర్షి ఇంద్రుని మాటలు విని సంతోషముతో ఈ విధముగా చెప్పనారంభించెను. దుర్వాసా ఉవాచ- దుర్వాస మహర్షి ఇట్లు పలికెను. అహో మహేంద్ర మాంగల్యమాత్మనం ద్రష్టుమిచ్ఛసి | ఆపాతతో దుఃఖబీజం పరిణామ సుఖావహం || 64 స్వగర్భయాతనానాశ పీడా ఖండన కారణం | దుష్పారాసార దుర్వార సంసారార్ణవ తారకం || 65 కర్మవృక్షాంకురచ్చేద కారణం సర్వతారకం | సంతోష సంతతికరం ప్రవరం సర్వవర్త్మనాం || 66 దానేన తపసా వాzపి వ్రతేనాzనశనాదినా | కర్మణా స్వర్గభోగాది సుఖం భవతి జీవినాం || 67 కామ్యానాం కర్మణాంచైవ మూలం సంఛిద్య యత్నతః | అధునేదం మోక్షబీజం సంకల్పాభావ ఏవ చ || 68 ఓ మహేంద్ర!నీవు సుఖముగా ఉండవలెనని అనుకొనుచు నన్ను ఈ ప్రశ్నవేసితివి. నేను తెలుపునది మొదలు దుఃఖమును కలిగించినను పరిణామదశలో సుఖమును కలిగించును. ఇవి గర్భయాతనలను తొలగించును. సంసార సముద్రమును తరింపజేయును. కర్మలనే చెట్ల మొలకలను తుంచివేయును. అనేక విధములగు సంతోషములను కలిగించును. అన్నిటికంటె ఇది చాలా శ్రేష్ఠమైనది. దానము, తపస్సు, వ్రతములు, ఉపవాసము మొదలగు కర్మలచేత ప్రాణులు స్వర్గాది భోగములననుభవింతురు. అందువలన కామ్యకర్మలయొక్క మూలమును కష్టపడి ఛేదించి మోక్షమును పొందించు జ్ఞానమును పొందవలెను. అది సంకల్పా భావము అనగా కోరికలను కోరుకొనకుండుట. యత్కర్మసాత్వికం కుర్యాదసంకల్పితమేవ చ | సర్వం కృష్ణార్పణం కృత్వా పరే బ్రహ్మణి లీయతే || 69 సాంసారికాణా మేతత్తు నిర్వాణం మోచకం విదుః | నేచ్ఛంతి వైష్ణవాస్తత్తు సేవావిరహ కాతురాః || 70 సేవాం కుర్వంతి తే నిత్యం విధాయోత్తమ దేహకం | గోలోకే వాపి వైకుంఠే తసై#్యవ పరమాత్మనః || 71 హరిసేవాదిరూపాం చ ముక్తిమిచ్ఛంతి వైష్ణవః | జీవన్ముక్తాశ్చ తే శక్ర స్వకులోద్దారకారిణః || 72 సాత్వికమైన కర్మను సంకల్పము లేకుండనే చేయవలెను. శ్రీకృష్ణార్పణముగా సమస్త కర్మలు చేయువాడు పరబ్రహ్మలో విలీనమగును. సాధారణ సంసారులు మోక్షము కావలెనని కోరుకొందురు. కాని విష్ణుభక్తులు మాత్రము మోక్షమును కాక శ్రీహరి సేవాదిరూపమైన ముక్తిని కోరుకుందురు. వారు దివ్య శరీరమును ధరించి వైకుంఠముననో, గోలోకముననో ఉన్న పరమాత్మను అనుక్షణము సేవించుచుందురు. వారు జీవన్ముక్తులు మాత్రమే కాక తన కులమును కూడ ఉద్దరింతురు. స్మరణం కీర్తనం విష్ణోరర్చనం పాదసేవనం | వందనం స్తవనం నిత్యం భక్త్యా నైవేద్య భక్షణం || 73 చరణోదకపానం చ తన్మంత్ర జపనం పరం | ఇదం నిస్తారబీజం చ సర్వేషా మీప్సితం భ##వేత్ || 74 శ్రీ మహావిష్ణువును స్మరించుట, కీర్తించుట, అతనిని సదా అర్చించుట, అతని పాదములను సేవించుట, నమస్కరించుట, స్తోత్రములు చేయుట, ప్రతిదినము భక్తితో శ్రీహరి నైవేద్యమును తినుట, అతని పాదోదకమును త్రాగుట, అతని మంత్రమును జపించుట అనునవి సంసారమును తరింపజేయునవి. ఇవి అందరికి ఇష్టమైనవి. ఇదం మృత్యుంజయజ్ఞానం దత్తం మృత్యుంజయేన మే | తచ్ఛిప్యోzహం చ నిశ్శంకః తత్ర్పసాదాచ్చ సర్వతః || 75 స జన్మదాతా స గురుః స చ బంధుః సతాం పరః | యోదదాతి హరేర్భక్తిం త్రైలోక్యే చ సుదుర్లభం || 76 దర్శయేదన్యమార్గం చ వినా శ్రీకృష్ణసేవనం | స చ తం నాశయత్యేవ ధ్రువం తద్వధభాగ్భవేత || 77 సంతతం జగతాం కృష్ణనామ మంగళకారణం | మంగళం వర్ధతే నిత్యం న భ##వేదాయుషో వ్యయః || 78 తేభ్యోzప్యపైతి కాలశ్చ మృత్యుః స్యాద్రోగ ఏవచ | సంతాపశ్చైవ శోకశ్చ వైనతేయాదివోరగాః || 79 కృష్ణమంత్రోపాసకశ్చ బ్రాహ్మణః శ్వపచోzపి వా | బ్రహ్మలోకం సముల్లంఘ్య యాతి గోలోకముత్తమం || 80 బ్రహ్మణా పూజితః సోzపి మధుపర్కాదినా చ యః | స్తుతః సురైశ్చ సిద్ధైశ్చ పరమానందభావనః || 81 జ్ఞానసారం తపఃసారం బ్రహ్మసారం పరం శివం | శివేనోక్తం యోగసారం శ్రీకృష్ణపదసేవనం || 82 బ్రహ్మాదిస్తంబపర్యంతం సర్వం మిథ్యైవ కేవలం | భజ సత్యం పరం బ్రహ్మ రాధేశం ప్రకృతేః పరం || 83 ఈ విషయమును నాకు గురవైన మృత్యుంజయుడు తెల్పినందువలన దీనిని మృత్యుంజయ జ్ఞానమని అందురు. నేను ఆ మృత్యుంజయుని అనుగ్రహము వలన ఎట్టి సందేహములు లేక తిరుగుచున్నాను. ముల్లోకములలో దుర్లభ##మైన శ్రీహరిభక్తి కలిగించినవాడే నిజమైన తండ్రి, నిజమైన గురువు, బంధువు, సజ్జనుడు, ఆవిధముగా కాక ఇతర మార్గములను చూపించు తండ్రి, గురువు, బంధువు మొదలగువారు అతనిని చెడగొట్టుచున్నారు. అతనిని చంపినవారగుచున్నారు. ప్రపంచమున అందరికి శ్రీకృష్ణనామము మేలు కల్గించును. అతని ఆయుస్సును కూడ పెంచును. శ్రీకృష్ణ నామమును సంతతము స్మరించువానిని చూచి కాలుడు, వృత్యువు, రోగము, సంతాపము, శోకము, మొదలైనవి గరుత్మంతుని చూచిన సర్పములవలె పరుగెత్తిపోవును. శ్రీకృష్ణమంత్రమును ఉపాసన చేయు బ్రాహ్మణుడు, అంత్యజుడైనను, బ్రహ్మలోకమునుండి గోలోకమునుకు పోవును. తన లోకమును దాటి గోలోకమునకు పోవుచున్న ఆ విష్ణుభక్తుని చూచి బ్రహ్మదేవుడు, సిద్దులు, దేవతలు అందరు అతనిని గౌరవింతురు. పరమశివుడు చేప్పిన శ్రీకృష్ణ విషయమైన జ్ఞానములకు,తపస్సుకు సారభూతమైనది.ఈప్రపంచమున కన్పించు బ్రహ్మాది దేవతలు, జడాజడ పదార్ధములన్నియు క్షణికమైనవి. ప్రకృతికి అతీతుడు రాధాప్రియుడు శ్రీకృష్ణ పరబ్రహ్మయే శాస్వతమైన వాడు. అతీవ సుఖదం సారం భుక్తిదం ముక్తిదం పరం | సిద్ధయోగప్రదం చైవ దాతారం సర్వసంపదాం || 84 యోగినామపి సిద్ధానాం యతీనాం చ తపస్వినాం | సర్వేషాం కర్మభోగోzస్తి న నారాయణ సేవినాం || 85 భస్మసాచ్చ భ##వేత్పాపం యదుపస్పర్శమాత్రతః | జ్వలదగ్నౌ పాతితం చ యథా శుష్కేంధనం యథా || 86 తతో రోగా హి వేపంతే పాపాని చ భయాని చ | దూరతశ్చ పలాయంతే యమదూతాస్తతో భయాత్ || 87 తావన్నిబద్ధః సంసారే కారాగారే విధేర్జనః | న యావత్కృష్ణమంత్రం చ ప్రాప్నోతి గురువక్త్రతః || 88 కృతకర్మౌఘ భోగాఖ్య నిగడచ్ఛేద కారణం | మయా జాలోచ్ఛేద కరం మాయాసాశనికృంతనం || 89 గోలోకమార్గ సోపానం నిస్తారే బీజ కారణం | భక్త్యంకుర స్వరూపం చ నిత్యం వృద్ధ మనశ్వరం || 90 సారం చ సర్వతపసాం యోగానాం సాధనం తథా | సిద్ధీనాం వేదపాఠానాం వ్రతాదీనాం చ నిశ్చితం || 91 దానానాం తీర్థ శౌచానాం యజ్ఞాదీనాం పురందర | పూజానాముపవాసానామిత్యాహ కమలోద్భవః || 92 పుంసాం లక్షం పితౄణాం చశతం మాతామహస్య చ | పూర్వం పరం చ తత్సంఖ్యం పితరం మాతరం గురుం || 93 సహోదరం కళత్రం చ బంధుం శిష్యం చ కింకరం | సముద్ధరేచ్ఛ శ్వశురం శ్వుశ్రూం కన్యాం చ తత్సుతం || 94 స్వాత్మానం చ సతీర్ధ్యం చ గురుపత్నీం గురోః సుతం | ఉద్దరేద్బలవాన్భక్తో మంత్రగ్రహణమాత్రతః || 95 మంత్రగ్రహణమాత్రేణ జీవన్ముక్తో భ##వేన్నరః | తత్స్పర్శపూతస్తీర్థౌఘః సద్యః పూతా వసుంధరా || 96 శ్రీకృష్ణమంత్రము సుఖమును, భుక్తిని, ముక్తిని, ఇచ్చును. ఆ మంత్రము సిద్ధ యోగములను సమస్త సందపదలనిచ్చును. యోగులు, సిద్ధులు. యతులు, మహర్షులు అందరు కర్మ ఫలమును తప్పక అనుభవింతురు. కాని శ్రీహరి భక్తులు దానికి అతీతులు. వారి స్పర్శ తలగినంతమాత్రముననే పాపములు భస్మీపటలమగును. రోగములు, పాపములు వారిని చూచి భయపడును. అట్లే గురువునుండి శ్రీకృష్ణమంత్రమును పోందగానే మానవులు సంసారకారాగారమునుండి విముక్తులగుదురు. ఆ మంత్రము కర్మభోగమను ఇనుపసంకెళ్లను ఛేదించును. మాయాజాలమును మాయాపాశములను తొలగించును. ఇంకను అది గోలోకమునకు మార్గము చూపును. ముక్తికి ప్రధాన కారణము. భక్తియను వృక్షాంకురమును దినదినము ప్రవర్ధమానమగునట్లు చేయును. తపస్సులన్నింటికి అదిసారభూతమైనది. యోగములకు, సిద్ధులకు, వేదములకు, వ్రతములు పూజలు, దానములు, తీర్థస్నానములు యజ్ఞములు మొదలగువాటికన్నిటికి సారమైనది. ఆ మంత్రము నిష్ఠతో జపించినవారి తండ్రివంశమువారు లక్షతరములవరకు, తల్లి వంశమువారు నూరు తరములవరకు ఉద్ధరింపబడుదురు. అట్లే తల్లి, తండ్రి, గురువు, సోదరుడు, భార్య, బంధువులు, శిష్యులు, సేవకులు, అత్తామామలు వారి సంతానమునంతను ఈ మంత్రము పవిత్రము చేయును, అట్లే అతనిని అతనితోటివానిని గురుపత్నిని, గురుపుత్రుని అందరిని శ్రీకృష్ణ భక్తుడు ఉద్ధరించును. శ్రీకృష్ణమంత్రమును గురువు వలన ఉపదేశము పొందినంత మాత్రమున అతడు జీవన్ముక్తుడై తన స్పర్శవలన తీర్థ స్థానములను, భూమిని పవిత్రము చేయును. అనేక జన్మపర్యంతం దీక్షాహీనో భ##వేన్నరః | తదన్య దేవమంత్రం చ లభ##తే పుణ్య లేశతః || 97 సప్తజన్మసు దేవానాం కృత్వాసేవాం స్వకర్మతః | లభ##తే చ రవేర్మంత్రం సాక్షిణః సర్వకర్మణాం || 98 జన్మత్రయం భాస్కరంచ సేవిత్యా మానవః శుచిః | లభేద్గణశమంతత్రంచ సర్వవిఘ్నహరం పరం ||99 జన్మత్రయం తం నిషేన్య నిర్విఘ్నశ్చ భ##వేన్నరః | విఘ్నేశస్య ప్రసాదేన దివ్యజ్ఞానం లభేన్నరః || 100 తదా జ్ఞాన ప్రదీపేన సమాలోచ్య మహామతిః | ఆజ్ఞానాంధ తమశ్ఛిత్వా మహామాయాం భ##జేన్నరః || 101 ప్రకృతిం విష్ణుమాయాం చ దుర్గాం దుర్గతినాశినీం | సిద్ధిదాం సిద్ధిరూపాం చ పరమాం సిద్ధయోగినీం || 102 వాణీరూపాం చ పద్మాం చ భద్రాం కృష్ణప్రియాత్మికాం | నానారూపాం తాం నిషేవ్య జన్మనాం శతకం నరః || 103 తత్ర్పసాదాత్ భ##వేత్ జ్ఞానీ జ్ఞానానందం తదాభ##జేత్ | కృష్ణ జ్ఞానాధిదేవం మహాదేవం సనాతనం || 104 శివం శివస్వరూపం చ శివదం శివకారణం | అమరత్వప్రదం చైవ దీర్ఘమాయుష్యదం పరం || 106 ఇంద్రత్వం చ మనుత్వం చ దాతుం శక్తం చ లీలయా | రాజేంద్రత్వప్రదం చైవ జ్ఞానదం హరిభక్తిదం || 107 జన్మత్రయం తమారాధ్య చాశుతోష ప్రసాదతః | సర్వదస్య ప్రసాదేన శంకరస్య మహాత్మనః || 108 వరదస్య వరేణౖవ హరిభక్తిం లభేత్ ధ్రువం | తదాతద్భక్త సంసర్గాత్ కృష్ణమంత్రం లభేత్ ధ్రువం || 109 అనేక జన్మలవరకు కృష్ణమంత్రము లభించని మానవునకు ఆతని పుణ్యవిశేషమువలన ఇతర దేవతామంత్రమును లభించును. ఆ మంత్రముచే ఆ దేవతను ఏడు జన్మలవరకు ఆరాధించి, సేవించి తానొనర్చిన పుణ్యకర్మవలన సూర్యమంత్రమును పొందును. సమస్త కర్మలకు సాక్షియగు ఆ సూర్యుని మూడు జన్మలవరకు ఆరాధించి అతని అనుగ్రహమువలన గణపతి మంత్రోపదేశము పొందును. సమస్త విఘ్నములను తొలగించు ఆ వినాయకుని మూడు జన్మలవరకు ఆరాధించి, విఘ్నములన్ని తొలగిపోగా గణపతియొక్క అనుగ్రహమువలన దివ్యజ్ఞానమును పొందును. విఘ్న నాయకుడొసగిన జ్ఞానదీపమువలన అజ్ఞానాంధకారము తొలగిపోయి మహామాయయైన దుర్గామంత్రమతనికి లభించును. విష్ణుమాయాస్వరూపిణి, దుర్గతిని పోగొట్టు దుర్గాదేవిని, సరస్వతీదేవిని, లక్ష్మీదేవిని, రాధను అందరిని భజించి వారి అనుగ్రహమువలన జ్ఞానానంద రూపుడు, కృష్ణజ్ఞానమునకు అధిదేవతయగు మహాదేవమంత్రమును అతడు పొందును. మహాదేవమంత్రము మంగళరూమైనది, సమస్త మంగళములను కలిగించునది. ఆనందదాయకమైనది. అది అమరత్వమును, దీర్ఘాయుస్సును ప్రసాదించును. ఇంద్రత్వము, మనుత్వము, రాజేంద్రత్వము ఆ మంత్రానుగ్రహమువలన తేలికగా లభించును. అట్లే ఆ మంత్రప్రభావమువలన శ్రీహరి భక్తికూడా లభించును. ఆ పరమశివుని మంత్రమును మూడుజన్మలవరకు జపించి అన్ని కోరికలు తీర్చు ఆ పరమేశ్వరుని అనుగ్రహమువలన శ్రీహరి భక్తిని పొందును. అప్పుడతనికి శ్రీహరి భక్తుల సాహచర్యమువలన శ్రీకృష్ణమంత్రము తప్పక లభించును. నిర్మల జ్ఞాన దీపేన ప్రదీప్తేన చ తత్వవిత్ | బ్రహ్మాది స్తంబపర్యంతం సర్వం మిథ్యైవ పశ్యతి || 110 దయానిధేః ప్రసాదేన నిర్మలజ్ఞానమాలభేత్ | వరదస్య వరేణౖవ హరిభక్తిం లభేత్ ధ్రువం || 111 తదా నిర్వృతిమాప్నోతి సారాత్సారాం పరాత్పరాం | యత్ర దేహో లభేన్మంత్రం దద్దేహావధి భారతే || 112 తత్పాంచభౌతికం త్యక్త్యా బిభృయాద్దివ్యరూపకం | కరోతి దాస్యం గోలోకే వైకుంఠే వా హరేః పదే || 113 పరమశివుని అనుగ్రహమువలన లభించిన జ్ఞానమువలన తత్వమును తెలిసికొని ఈ చరాచర సృష్టియంతయు క్షణికమైదని భావించి నిర్మల జ్ఞానమును పొంది మరల ఆ మహాదేవుని అనుగ్రహమువలననే హరిభక్తిని పొందును. తరువాత శ్రీకృష్ణమంత్రమును ఉపదేశముపొంది పాంచ భౌతిక దేహమువదలిన తరువాత వైకుంఠమునకో లేక గోలోకమునకో పోయి అచ్చట భగవద్దాస్యమును చేయుచుండును. పరమానంద సంయుక్తో మోహాదిషు వివర్జితః | న విద్యతే పునర్జన్మ పునరాగమనం హరే || 114 పునశ్చ నసిబేత్ క్షీరం ధృత్వా మాతృస్తనం పరం | విష్ణుమంత్రోపాసకానాం గంగాదేస్తీర్థ సేవినాం || 115 స్వధర్మిణాం చ భక్షూణాం పునర్జన్మ న విద్యతే | తీర్థే పరిత్యజేత్పాపం క్రియాం కృత్వా హరిం భ##జేత్ || 116 అయం నిరూపితో ధాత్రా స్వధర్మస్తీర్థ సేవినాం | తన్నామమంత్రం ప్రజపేత్తత్సేవాదిషు తత్పరః || 117 వ్రతోపవాసరత ఇత్యుక్తో వి ష్ణుసేవినాం | సదన్నే వా కదన్నే వా లోష్టే వా కాంచనే తథా || 118 సమా బుద్ధిరస్య శశ్వత్ స సన్యాసీతి కీర్తితః | దండం కమండలుం రక్తవస్త్రమాత్రం చ ధారయేత్ || 119 నిత్యం ప్రవాసీ నైకత్ర స్యాత్సన్యాసీతి కీర్తితః | శుద్దాచార ద్విజాన్నం చ భుంక్తే లోభాదివర్జితః || 120 కింతు కించిన్న యాచేత స సన్యాసీతి కీర్తితః | న వ్యాపారీ నాశ్రమీ చ సర్వకర్మ వివర్జితః || 121 ధ్యాయేన్నారాయణం శశ్వత్ స సన్యాసీతి కీర్తితః | శశ్వన్మౌనీ బ్రహ్మచారీ సంభాషా పరివర్జితః || 122 సర్వం బ్రహ్మమయం పశ్యేత్స సన్యాసీతి కీర్తితః | సర్వత్ర సమబుద్థిశ్ఛ హింసామాయా వివర్జితః || 123 క్రోధాహంకార రహితః స సన్యాసీతి కీర్తితః | అయాచితోపస్ధితం చ మిష్టామిష్టం చ భుక్తవాన్ || 124 న యాచతే భక్షణార్థీ స సన్యాసీతి కీర్తితః |న చ పశ్యేన్ముఖం స్త్రీణాం న తిష్ఠేత్తత్సమీపతః || 125 దారవీమపి యోషాం చ న స్పృశేద్యః స భిక్షుకః | అయం సన్యాసినా ధర్మ ఇత్యాహ కమలోద్భవః || 126 విష్ణుమంత్రోపాసకులు, గంగాదిపుణ్యతీర్ధముల సేవించువారు తమతమ ధర్మమును చక్కగా నిర్వర్తించు భిక్షుకులకు పునర్జన్మ అనునది ఉండదు. పుణ్యతీర్ధముల సేవించువారు ప్రతిదినము ఆ పుణ్యతీర్థములందు స్నానము చేయుచు తమ పాప ప్రక్షాళనము చేసికొనవలెను. అట్లే పుణ్యకార్యములు చేయుచు సదా శ్రీహరి భజనము చేయవలెను. ఇది పుణ్యతీర్థములను సేవించువారి ధర్మము. విష్ణుమంత్రోపాసకులు ఎల్లప్పుడు శ్రీహరిమంత్రమును జపించుచుండవలెను. అట్లే శ్రీహరి సేవాకార్యక్రమములయందు సదా నిమగ్నులై యుండవలెను. ఇంకను శ్రీహరి వ్రతములు, ఉపవాసము చేయుచుండవలెను. ఇది విష్ణుసేవకుల ధర్మము. సన్యాసులు మంచి అన్నమైనా, చెడిపోయిన అన్నమైనా సమానముగా చూడవలెను. రాయి, బంగారములను సమానముగా చూడవలెను. దండము, కమండలము, కాషాయవస్త్రములను ధరింపవలెను. స్థిరముగా ఒకచోటనుండక ప్రతిదినము ఒక చోటినుండి మరియొకచోటికి పోవలెను. లోభము మొదలగు గుణములను వదలిపెట్టి మంచి ఆచారముకల బ్రాహ్మణుల ఇంటిలో భోజనము చేయవలెను. ఎవరిని స్వార్థమునకై యాచించరాదు. వ్యాపారము చేయరాదు. ఆశ్రమమును ఏర్పరచు కొనరాదు. అన్ని విధములైన చెడ్డపనులను వదిలివేసి శ్రీమన్నారాయణుని ఎల్లప్పుడు ధ్యానించుచుండవలెను. అట్లే బ్రహ్మచారిగానుండి ఎవరితోను ఎక్కువగా మాట్లాడక మౌనముగా నుండవలెను. సమస్త విశ్వమును బ్రహ్మమయముగా భావించుకొనవలెను. అందరి పై సమానమైన బుద్ధి కలిగి హింస, మోసము, కోపము, అహంకారము మొదలగు గుణములను వదలిపెట్టవలెను. యాచన చేయకుండ లభించిన అన్నము మృష్టాన్నమైనను, కాకపోయినను సంతోషముతో భుజింపవలెను. భోజనమునకై ఎవరిని యాచనచేయకూడదు. స్త్రీల ముఖమును చూడరాదు. స్త్రీల సమీపమున కూర్చొనరాదు. చివరకు స్త్రీయొక్క బొమ్మనైన తాకరాదు. ఇవన్నియు సన్యాసులు అనుష్ఠింపవలసిన ధర్మములని బ్రహ్మదేవుడు తెలిపెను. విపర్యయే వినాశశ్చ జన్మయామ్యం భయం భ##వేత్ | జన్మదుఃఖం యామ్యదుఃఖం జీవినామతిదారుణం || 127 సుర సూకరయోనౌ నా గర్భే దుఃఖం సమం సుర | యోనౌ వా క్షుద్రజంతూనాం పశ్వాదీనాం తథైవ చ || 128 గర్భే స్మరంతి సర్వేతేకర్మజన్మశతోద్భవం | విస్మరేన్నిర్గతో జీవో గర్భాద్వై విష్ణుమాయయా || స్వదేహం పాతి యత్నేన సురోవా కీట ఏవ వా | 129 తీర్థముల సేవించువారు, శ్రీహరి మంత్రోపాసకులు, సన్యాసులు తమతమ ధర్మములను వదలి ప్రవర్తించినచో వారు చెడిపోవుదురు. పైగా జీవులకందరకు అతిభయంకరమైన జన్మదుఃఖమును నరక దుఃఖముననుభవింతురు. దేవతాస్త్రీల యోనియందున్నను, పందుల యోనులందున్నను, క్షుద్రజంతువులు, పశువులు మొదలగువాని యోనులందున్నను గర్భదుఃఖము అన్ని ప్రాణులకు సమానముగానే యుండును. ఆ ప్రాణులు గర్భమునందుండగా పూర్వజన్మలో చేసిన పాపకార్యములన్నిటిని స్మరించుకొనును. గర్భమునుండి బయటకు రాగానే విష్ణుమాయవలన అన్నిటిని మరచిపోవుచున్నారు. దేవతలైనా కీటకములైనా జన్మించునపుడు గర్భమున తమ దేహమును కష్టపడి తామే రక్షించుకొనును. యోనే రభ్యంతరే శుక్తే పతితే పురుషస్య చ | శుక్రం శోణితయుక్తం చ సహసా తక్షణం భ##వేత్ || 130 రక్తాధికే మాతృసమః చేతరే పితురాకృతిః | యుగ్మాహే చ భ##వేత్ పుత్రః కన్యకా తద్విపర్యయే || 131 రవి భౌమగురూణాం చ వారే చేత్తద్భవేత్సుతః | అయుగ్మాహే తదితరే వారే వై కన్యకా భ##వేత్ || 132 ప్రథమ ప్రహారే జన్మ యస్య సోzల్పాయురేవ చ | ద్వితీయే మధ్యమశ్చైవ తృతీయే తత్పరో భ##వేత్ || 133 చతుర్థే చిరజీవీ స్యాత్ క్షణానామనురూపకః | దుఃఖీవాzథసుఖీవాzపి పూర్వకర్మానురూపతః || 134 శుక్రశోణితములు స్త్రీయొక్క యోనిలో పురుషుని శుక్రము పడినప్పుడు వెంటనే రెండు కలిసిపోవును. ఆ పిండమున స్త్రీ రక్తము ఎక్కువగా నున్నప్పుడు తల్లిపోలిక వచ్చును. లేక శుక్రము ఎక్కువగా నున్నచో ఆ శిశువునకు తండ్రి పోలిక వచ్చును. సరిసంఖ్యగల తిథులలో గర్భమేర్పడినచో పుత్రుడగును. అట్లే ఆది, మంగళ, గురువారములలో గర్భముకలిగినచో పుత్రుడు కలుగును. లేక బేసిసంఖ్యగల తిథులలో సోమ, బుధ, శుక్ర, శనివారములలో గర్భము కలిగినచో స్త్రీ యగును. ప్రథమ యామములో జన్మించినవాడు అల్పాయుష్కుడగును. రెండవజామున, మూడవజామున జన్మించినవారి వయస్సు ఎక్కువగా ఉండును. నాల్గవ జామున జన్మించినవాడు చాలాకాలము బ్రతుకును. అట్లే జీవి తమతమ పూర్వకర్మలననుసరించి సుఖవంతుడగనో దుఃఖవంతుడుగనో అగుచున్నది. యాదృశేచ క్షణ జన్మ ప్రసవస్తాదృశో భ##వేత్ | ప్రసూతిక్షణచర్చాంచ కుర్వంత్యేం విచక్షణాః || 135 కలలం త్వేకరాత్రేణ ప్రవృద్ధః స్యాద్దినే దినే | సప్తమే బదరాకారో మాసే గండుసమో భ##వేత్ || 136 మాసత్రయో మాంసపిండో హస్తపాదాదావర్జితః | సర్వావయవ సంపన్నో దేహీ మాసే చ పంచమే || 137 భ##వేత్తు జీవసంచారః| షణ్మాసే సర్వతత్వవిత్ | దుఃఖీ స్వల్పస్థలస్థాయీ శకుంత ఇవ పంజరే || 138 మాతృ జగ్దాన్నపానం చ భుంక్తేzమేధ్యస్థలే స్థితః | హాహేతి శబ్దం కృత్వా చ చింతయే దీశ్వరం పరం || 139 ఏవం చ చతురో మాసాన్ భుక్త్యా పరమయాతనాః | ప్రేరితో వాయునా కాలే గర్భాద్వై నిర్గతో భ##వేత్ || 140 తాను పుట్టిన సమయమెటువంటిదో ఆ శిశువు అట్లే యుండును. అనగా పుట్టిన సమయముననుసరించి శిశువు స్వభావము భాగ్యము ఏర్పడుచున్నవి. విజ్ఞులు ప్రసూతి విషయమున ఇటువంటి చర్చచేయుచున్నారు. రక్తశుక్లములు కలిసిపోయిన తరువాత ఒకరాత్రికి కలలాకారమునొందును. అటుపిమ్మట దినదిన వృద్ధి కనిపించును. ఏడు దినములలో అది రేగుపండంత యగును. తరువాత నెలలో అది బొంగరమంతయగును. మూడు నెలలో చేతులు కాళ్ళులేని పిండముగా రూపొందును. ఐదవనెలలో ఆ పిండమునకు అన్ని అవయవములు చేకూరును. తరువాత ఆరవనెలలో జీవమేర్పడి సమస్త తత్వమును తెలిసినందువలన పంజరములో నున్న పక్షివలె దుఃఖించుచు స్వల్పస్థలమున ముడుచుకొని యుండును. తల్లియొక్క అమేధ్యస్థలముననుండి తల్లి తీసికొను ఆహారమును తినుచుండును. తత్వమునెరిగియున్నందువలన హాహాకారము తగు సమయమున గర్భమునుండి బయటికి వచ్చును. దిగ్దేశకాల వ్యుత్పన్నో విస్మృతో విష్ణుమాయయా | శశ్వద్విణ్మూత్రసంయుక్తః శిశుః స్యాత్ శైశవావధి|| 141 పరాయత్తోzప్యక్షమశ్చ మశకాదినివారణ | కీటాదిభుక్తో దుఃఖీ చ రౌతితత్ర పునః పునః || 142 స్తనాంధోzప్యసమర్థశ్చ యాజ్ఞాం కర్తు మభీప్సితం | న వాణీ నిస్సరేత్తస్య పౌగండావధి సుస్ఫుటా || 143 పౌగండే యతనాం భుక్తయా ప్రాప్నుతే ¸°నం పునః | స స్మరేన్మాయయా దే హే గర్బాదేర్యాతనాం పునః || 144 ఆహార మైథునార్తశ్చ నానామోహాదివేష్టితః | పుత్రం కళత్రమనుగం యత్నేన పరిపాలయేత్ || 145 ఏవం యావత్సమర్థశ్చ తావదేవహి పూజితః | అసమర్ధం చ మన్యంతే బాంధవా గోజరం యథా || 146 యదాzతీవ జరాయుక్తో జడోzతి బధిరో భ##వేత్ | కాస శ్వాసాది యుక్తశ్చ పరాయత్తోzతిమూఢవత్ || 147 తదంతరేzనుతాపం చ కురుతే సంతతం పునః | న సేవితం హరేస్తీర్థం సత్సంగశ్చాపి కామతః || 148 పునశ్చ మానవీం యోనిం లభామి భారతే యది | తదా తీర్థం గమిష్యామి భ##జేవై కృష్ణమిత్యహో || 149 విష్ణుమూర్తియొక్క మాయవలన జన్మనెత్తగానే తన పూర్వజ్ఞానము నంతయు మరచిపోవును. నాటినుండి శైశవమువరకు మలమూత్రముల మధ్యనుండును. తన స్వాతంత్య్రమును కోల్పోయి ఇతరులకధీనమై దోమలు మొదలుగువానిని సైతము నివారించుకొనలేడు. అట్లే పురుగులు కుట్టుచున్నప్పుడు దుఃఖముతో మాటిమాటికి ఏడ్చును. పాలుకూడ తాగలేడు తనకు కావలసినవాటిని అడుగుకొనలేడు. ఆ విధముగా బాల్యమువరకు అతని మాటలు స్పష్టముగా ఉండవు. బాల్యమున అనేక యాతనలననుభవించి ¸°వనమును పొందును. అప్పుడు విష్ణుమాయవలన గర్భాది యాతనలనన్నిటిని మరచిపోవును. తరువాత ఆహారము, మైథునము మొదలగు వాటికై అనేక మోహములలో మునిగి పుత్రులు, ఖళత్రము మొదలగువారిని కష్టపడి పోషించును. ఈ విధముగా తన వారినెంతవరకు పోషింపగలగునో అంతవరకే అతనికి గౌరవముండును. తనవారిని పోషింపలేని దశలో బంధువులు అతనిని చులకనా చూతురు. తాను పూర్తిగా ముసలివాడైనప్పుడు చెవుడు, దగ్గు, దమ్ము మొదలగు రోగములచే పూర్తిగా పరాయత్తుడగును. అప్పుడు అయ్యో పుణ్యతీర్థములను సేవించలేదు. సత్సంగము చేయలేదని బాధపడుచు మరల భారతభూమిపై మానవ జన్మనెత్తినచో పుణ్యక్షేత్ర దర్శనము చేయుచు శ్రీకృష్ణుని దర్శించుకొందనని తలచును. ఇత్యేవమాది మనసి కుర్వంతం తం జడం సుర | గృహ్ణాతి యమదూతశ్చ కాలే ప్రాప్తేzతిదారుణః || 150 స పశ్యేద్యమదూతం చ పాశహస్తం చ దండినం | అతీవ కోపరక్తాక్షం వికృతాకారాముల్బ ణం || 151 దుర్నివార్యముపాయైశ్చ బలిష్ఠం చ భయంకరం | దుర్దృశ్యం సర్వసిద్ధిజ్ఞం సర్వాదృష్టం పురఃస్థితం || 152 దృష్టమాత్రాన్మహాభీతో విణ్మూత్రం చ సముత్సృజేత్ | తదా ప్రాణాంస్త్యజేత్సద్యో దేహం వై పాంచ భౌతికం || 153 ఈవిధముగా మనస్సులో అనుకుంటున్న ఆ బుద్ధిహీనుని యమదూతలు మృత్యుకాలము దాపురించగనే తీసికొనిపోవుదురు. యమదూతలు చేతిలో పాశమును, దండమును ధరించి, అధిక కోపమున ఎఱ్ఱని కన్నులు కలవారై వికృతాకారముతో భయంకరముగానుందురు. వారు ఎవ్వరికిని కనిపించరు. కాని ఇట్టి బుద్ధి హీనులకు కనిపింతురు. వారు మహాభయంకరులైన ఆ యమదూతను చూడగానే అతి భయముతో మలమూత్రములను వదలి తమ పాంచభౌతికమైన దేహమును వదలిపెట్టుదురు. అంగుష్ఠమాత్రం పురుషం గృహీత్వా యమకింకరః | విన్యస్య భోగదేహే చ స్వస్థానం ప్రాపయేత్ ద్రుతం || 154 జీవో గత్వా యమం పశ్యేత్ సర్వధర్మజ్ఞమేవ చ | రత్నసింహాసనస్థం చ సస్మితం సుస్థి తంపరం || 155 ధర్మాధర్మ విచారజ్ఞం సర్వజ్ఞం సర్వతోముఖం | విశ్వేష్వేకాధికారం చ విధాత్రా నిర్మితం పురా || 156 వహ్నిశుద్దాంశుకాధనం రత్నభూషణ భూషితం | వేష్టితం పార్షదగణౖః దూతైశ్చాపి త్రికోటిభిః || 157 జపంతం శ్రీకృష్ణనామ శుద్ధస్పటికమాలయా | ధ్యాయమానం తత్పదాబ్జం పులకాంకిత విగ్రహం || 158 సగద్గదం సాశ్రునేత్రం సర్వత్ర సమదర్శినం | అతీవ కమనీయం చ శశ్వత్ సుస్థిర ¸°వనం || 159 స్వతేజసా ప్రజ్వలంతం సుఖదృశ్యం విచక్షణం | శరత్పార్వణ చంద్రాభం చిత్రగుత్తపురః స్థితం || 160 పుణ్యాత్మనాం శాంతరూపం పాపినాం చ భయంకరం | తం దృష్ట్యా ప్రణమేద్దేహీ మహాభీతశ్చ తిష్ఠతి || 161 బొటనవేలంత ఉన్న జీవుని పోశములతో కట్టి ఆ జీవిని భోగదేహముననుంచి నరకమునకు వెంటనే తీసికొని వెళ్ళును. జీవుడు యమలోకమునకు పోయి అచ్చట రత్నసింహాసనముపై కూర్చొనియున్న యమధర్మరాజును చూచును. యమధర్మరాజు సమస్త ధర్మములు తెలిసినవాడు. ధర్మాధర్మ విచారము తెలిసియున్నందువలన బ్రహ్మదేవుడతనిని ఆ స్థలమున నియోగించెను. అతడు మేలిమి బంగారుము చిన్నెలు కల వస్త్రమును, రత్నభూషణములను ధరించి మూడుకోట్ల భటులు సేవించుచుండగా శ్రీకృష్ణనామమును శుద్ధ స్ఫటిక మాలతో జపముచేయును. అట్లే శ్రీకృష్ణుని పాదములను మనస్సులో ధ్యానము చేయుచు పులకించిన శరీరముతో, గద్గద కంఠముతో, కన్నీళ్లుకారుచుండగా అందరిని సమానముగా చూచును. అతడు మంచి తేజస్సుతోనున్నను మహాభయంకరుడు, శరత్కాలమందలి పున్నమిచంద్రునివంటి దేహకాంతి కలవాడు. అతనికెదురుగా చిత్రగుప్తుడున్నాడు. అతడు పుణ్యము చేసినవారికి శాంతస్వరూపుడై కనిపించును. కాని పాపులకు మాత్రము అతి భయంకరముగా నుండును. చిత్రగుప్త విచారేణ యేషాం యదుచితం ఫలం | శుభాశుభం చ కురుతే తదేవ రవినందనః || 164 ఏవం తేషాం గతాయతే నివృత్తిర్నాస్తి జీవినాం | నివృత్తి హేతురూపం చ శ్రీకృష్ణపద సేవనం || 165 చిత్రగుప్తుడాజీవుని విచారించుచుండగా ఆ జీవి చేసిన పుణ్యపాప కర్మలకు తగిన ఫలమును యమధర్మరాజిచ్చును. ఈ విధముగా జన్మలెత్తుచున్న జీవులకు శ్రీకృష్ణుని పాదములను సేవించునటువంటి నివృత్తి మార్గము లభించదు. ఇత్యేవం కథితం సర్వం వరం ప్రార్థయ వాంఛితం | సర్వం దాస్యామి తే వత్స నమేzసాధ్యం చ కించన || 164 దుర్వాస మహర్షి ఈ విధముగా తెలిపి నీ కోరికలనన్నిటిని అడుగుమని, అవి ఏవియు నాకు అసాధ్యముకావు కావున వాటన్ననిటిని నీకిత్తునని చెప్పెను. మహేంద్ర ఉవాచ- దేవేంద్రుడిట్లు పలికెను- ఇంద్రత్వం చ గతం భద్రం కిమైశ్వర్యే ప్రయోజనం | కల్పవృక్ష మునిశ్రేష్ఠ దేహిమే పరమం పదం || 165 మహేంద్రస్య వచః శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః | తమువాచ వచః సత్యం వేదోక్తం సారమేవ చ || 166 కల్పవృక్షమువంటి ఓ మహర్షీ! నా ఇంద్రపదవి పోయిన తరువాత ఎంత ఐశ్వర్యమున్నను ఫలితమేమున్నది. అందువలన నాకు మీరు పరమపదమును ఇప్పించుడు అని ఇంద్రుడనగానే మునిశ్రేష్ఠుడైన దుర్వాసుడు నవ్వి వేదసారమని చెప్పదగిన మాటను ఇట్లు చెప్పెను. దుర్వాసా ఉవాచ- దుర్వాసమహర్షి ఇట్లనెను- పరం పదం విషయిణాం మహేంద్రాతి సుదుర్లభం | ముక్తిర్యుష్మద్విధానాం చ న లయే ప్రాకృతేzపి చ || 167 ఆవిర్భావః సృష్టివిధౌ తిరోభావో లయేzపి చ | యథా జాగరణం సుప్తిః భవత్యేవ క్రమేణ చ || 168 యథా భ్రమతి కాలశ్చ తథావిషయణో ధ్రువం | చక్రనేమి క్రమేణౖవ నిత్యమేవేశ్వరేచ్ఛయా || 169 పలమేకం భ##వేదేవ యథా విపలషష్టిభిః | షష్టిభిశ్చ పలైర్దండో ముహూర్తో ద్విగుణాత్తతః || 170 త్రింశద్భిశ్చ ముహుర్తైశ్చ భ##వేదేవ దివానిశం | దశపంచ దివారాత్రిః పక్షమేకం విదుర్భాధాః || 171 పక్షాభ్యాం శుక్లకృష్ణాభ్యాం మానఏవ విధీయతే | ఋతుర్ద్వాభ్యాం చ మాసాభ్యాం సంఖ్యావిద్భిః ప్రకీర్తితః || 172 ఋతుత్రయేణాయనం చ తాభ్యాం ద్యాభ్యాం చ వత్సరః | త్రింశత్సహస్రాధికైశ్చ త్రచత్వారింశలక్షకైః || 173 వత్సరైర్నరమానైశ్చ యుగానాం చ చతుష్టయం | షష్ట్యాzధికే పంచశ##తే సహస్రే పంచవింశతౌ || 174 యుగే నరాణాం శక్రాయుః మనోరాయుః ప్రకీర్తితం | దిగ్లక్షేంద్ర నిపాతేzష్ట సహస్రాధిక ఏవ చ || 175 నిపాతే బ్రహ్మణస్తత్ర భ##వేత్ర్పాకృతికో లయః | లయే ప్రాకృతికే వత్స కృష్ణస్య పరమాత్మనః || 176 చక్షుర్నిమేషః సృష్టిశ్చ పునరున్మీలనే తథా | బ్రహ్మ సృష్టి లయామాం చ సంఖ్యా నాస్తి శ్రుతౌ శ్రుతం || 177 యథా పృథివ్యా రేణూనాం ఇత్యూచే చంద్రశేఖరః | ఏతేషాం మోక్షణం నాస్తి కథితాని చ యాని తు || 178 ఓ మహేంద్రా ! సంసారమున ఆసక్తిగలవారికి పరమపదము మిక్కిలి దుర్లభ##మైనది. మీవంటివారికి ప్రాకృతలయమున కూడ ముక్తిదొరకదు. సృష్టికార్యము జరిగినపుడు ఈ చరాచర ప్రపంచము ఆవిరభవించుచున్నది. అట్లే లయము జరిగినప్పుడు మాయమగుచున్నది. నిద్రపోవుట మేల్కొనుట తిరిగి నిద్రపోవుట మరల మేల్కొనుట అన్నట్లు కాలము చక్రములోని ఆరెలవలె నిత్యము తిరుగుచుండును. ఇదంతయు ఈశ్వరేచ్ఛ ననుసరించి జరుగుచున్నది. విపలములు అరవై ఐనచో ఒక పలము కాలమగును (ఘడియ). అరవై పలములు ఒక దండకాలము, రెండు దండములు ఒక ముహూర్తకాలమగును. ముఫై ముహుర్తకాలము ఒక దినము (రాత్రి, పగలు). పదునైదు దినములను పక్షమందురు. శుక్ల కృష్ణపక్షములు కలసినచో ఒక నెలయగును. రెండు నెలలను ఋతువందురు. మూడు ఋతువులు ఒక అయనమగును. రెండు అయనముల కాలము ఒక సంవత్సరము. నలభై మూడు లక్షల మూఫైవేల సంవత్సరములు నాలుగు యుగములగును. ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై మానవయుగములు దేవేంద్రునకు మనువుకు జీవితకాలమగుచున్నవి. ఎనిమిది లక్షల ఎనిమిదివేల ఇంద్రులు గతించినచో అది బ్రహ్మదేవుని జీవితకాలమగుచున్నది. బ్రహ్మదేవుడు మరణించినపుడు ఈ సృష్టిలయమగుచున్నది. దానినే ప్రాకృతిక లయమందురు. ఇది పరమాత్మయగు శ్రీకృష్ణునకు రెప్పపాటు కాలము. భూమి యందలి రేణువుల సంఖ్యను లెక్కపెట్టలేనట్లు సృష్టి లయముల సంఖ్యను ఎవ్వరు లెక్కించలేరని శ్రీమహాదేవుడు తెలిపెను. సృష్టిసూత్రస్వరూపం హి చాన్యత్ వృణువరం సుర | మునీంద్రస్య వచః శ్రత్వా దేవేంద్రో విస్మితో మునే || 179 ఆత్మనః పూరమైశ్వర్యం వరయామాస తత్రవై | తత్ ప్రాప్స్యస్య చిరేణౖవ ఇత్యుక్త్యా సప్రయ¸° గృహం || 180 మహేంద్రా! నేనింతవరకు నీకు సృష్టిసూత్రమును గురించి వివరించితిని. ఇంకను నివేమైనా అడుగదలచినచో అడుగుమని దుర్వాసుడనగా దేవేంద్రడు తనకుండిన ఐశ్వర్యము మాత్రమే (ఇంద్రత్వము) కావలెనని అడుగగా ఆ మహర్షి ఇంద్రునితో నీవనుకొన్న ఇంద్రత్వము త్వరలోనే పొందగలవని చెప్పి తన మార్గమున తాను వెళ్ళెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే దుర్వాసోముని సురేంద్ర సంవాదే ఇంద్రంప్రతి దుర్వాసః శాపాది కథనం నామ షట్ త్రింశోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండములో నారద నారాయణ సంవాదమున తెల్పబడిన దుర్వాసదేవేంద్రుల సంవాదములో ఇంద్రునకు దుర్వాసుడు పెట్టిన శాపాది వృత్తాంతములు గల ముప్పయ్యారవ అధ్యాయము సమాప్తము.