sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
సప్తత్రింశత్తమో zధ్యాయః- కర్మల ఫలితములు
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
హరేర్గుణం సమాకర్ణ్య జ్ఞానం ప్రాప్య పురందరః | కిం చకార గృహం గత్వా తన్మే వ్యాఖ్యాతుమర్హసి|| 1
పురందరుడు దుర్వాసమహర్షి వలన శ్రీహరి గుణకీర్తనము విని జ్ఞానమును పొంది ఏమి చెసెనో నాకు వివరించమని నారాయణుని అడిగెను.
నారాయమ ఉవాచ- శ్రీమన్నారాయణుడుట్లనెను-
శ్రీకృష్ణస్య గుణం శ్రుత్వా వీతరాగో బభూవ సః వైరాగ్యం వర్ధయామాస తదా బ్రహ్మన్ దినే దినే || 2
మునిస్థానాద్గృహం గత్వా స దదర్శారావతీం | దైత్యైరసుర సంఘైశ్చ సమాకీర్ణాం భయాకులాం || 3
విషణ్ణబాంధవాం చైవ బంధుహీనాం చ కుత్రచిత్ | పితృమాతృ కళత్రాది విహీనామతిచంచలాం || 4
శత్రుగ్రస్తాం తాం దృష్ట్యాzగమద్వాకృతిం ప్రతి | శక్రో మందాకినీ తీరే దదర్శగురుమీశ్వరం || 5
శ్రీకృష్ణుని గుణగణములు విని మహేంద్రుడు వైరాగ్యమున పడి దానిని అనుదినము పెంచుకొనసాగెను. దుర్వాసమహర్షితో తాను మాట్లాడిన స్థలమును వదిలి ఇంటికిపోవుచు తన అమరావతి పట్టణమును చూచెను. ఆ పట్టమమును అప్పటికే దైత్యులు, అసురులు ఆక్రమించుకొనిరి. ఇంద్రుని బంధువులందరు విషాదముతోనుండిరి. ఒకచోట అసలు అతని బంధువే కన్పడలేదు. అట్లే అతని తల్లి, తండ్రి, భార్య మొదలగువారు అతనికి కన్పించలేదు. తన పట్టణమును శత్రువులాక్రమించుకొనిరని సంపూర్ణముగా తెలిసికొని తన గురువుగు బృహస్పతిని వెదుకుచు పోయెను. ఆ సమయమున బృహస్పతి దేవగంగయొక్క తీరములో ఉండెను.
ధ్యాయమానం పరంబ్రహ్మ గంగాతోయే స్థితం పరం | సూర్యాభిసంముఖం పూర్వముఖం వై విశ్వతోముఖం || 6
సాశ్రునేత్రం పులకితం పరమానంద సంయుతం | వరిష్ఠం చ గరిష్ఠం చ ధర్మిష్ఠం చేష్టసేవినం || 7
శ్రేష్ఠం చ బంధువర్గాణామతిశ్రేష్ఠం చ మానినాం | జ్యేష్ఠం చ బంధువర్గాణాం నేష్టం చ సురవైరిణాం || 8
దృష్ట్యా గురుం జపం తం చ తత్ర తస్థౌ సురేశ్వరః | ప్రహరాంతే గురుం దృష్ట్యా చోత్థితం ప్రణనామసః || 9
ప్రణమ్య చరణాంభోజే రురోదోచ్చైర్ముహుర్ముహుః | వృత్తాంతం కథయామాస బ్రహ్మశాపాదికం తథా || 10
బృహస్పతి గంగా తీరమున తూర్పుముఖముగా కూర్చుండి పరబ్రహ్మను ధ్యానించుకొనుచుండెను. అతని శరీరము పులకాంకురితమైయుండెను. అతని కన్నులలో ఆనందాశ్రువులు జాలువారుచుండెను. అతడు పరమానందముతో తన ఇష్టదేవతను ఆరాధించుచు జపము చేయుచుండెను. రాక్షసులకు శత్రువైన తన గురువు ఒక పాదములపైబడి ఏడ్చుచు తనకు తగిలిన బ్రహ్మాశాపాది వృత్తాంతమునంతయు వివరింపసాగెను.
పునర్వరోమయాలబ్ధో జ్ఞానినామసి దుర్లభం | వైరిగ్రస్తాం స్వీయపురీం క్రమేణౖవ సురేశ్వరః || 11
శిష్యస్య వచనం శ్రుత్వా సతాం బుద్ధిమతాం వరః | బృహస్పతిరువాచేదం కోపరక్తాంతలోచనః || 12
నాకు ఎవరికిని దొరకని వరము కూడ దొరికినది. అది యేమనగా శత్రువులాక్రమించుకొనిన నా పట్టణమును కాలక్రమమున పొందగలనట. అని దేవేంద్రుడు బృహస్పతితో అనగా శిష్యుని మాటలు విని కోపముతో కన్నులు ఎఱ్ఱబడగా అతడు ఇట్లు పలికెను.
బృహస్పతి రువాచ- బృహస్పతి ఈ విధముగా అనెను-
శ్రుతం సర్వం సురశ్రేష్ఠ మారోదీర్వచనం శ్రుణు | న కాతరోహి నీతిజ్ఞో విపత్తౌ స్యాత్కదాచన || 13
సంపత్తిర్వా విపత్తిర్వా నశ్వరా స్వప్నరూపిణీ | పూర్వ స్వకర్మాయత్తా చ స్వయం కర్తా తయోరపి || 14
సర్వేషాం చ భ్రమత్యేవ శశ్వజ్జన్మని జన్మని | చక్రనేమి క్రమేణౖవ తత్ర కా పరిదేవనా || 15
భుంక్తే హి స్వకృతం కర్మ సర్వత్రాపి చ భారతే | శుభాశుభం చ యత్కించిత్ స్వకర్మఫలభుక్ పుమాన్ || 16
నాzభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శ##తైరపి | అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుబాశుభం || 17
ఇత్యేవముక్తం వేదే చ కృష్టేన పరమాత్మనా| సామ్ని కొథుమశాఖాయాం సంభోధ్య స్వకులోద్భవం || 18
దేవేంద్రా ! నీ మాటలన్ని విన్నాను, నీవు ప్రస్తుతము దుఃఖింపవలసిన పనిలేదు. నా మాట వినుము.
బుద్ధిమంతుడు ఆపదలు వచ్చినప్పుడు దుఃఖమునకు గురికాడు , సంపదయైనను, ఆపదయైనను ఎప్పుడు స్థిరమైనవి కావు. అవి స్వప్నమువలె మాయమగుచుండును. అవి పూర్వజన్మలో చేసిన కర్మలపై ఈ జన్మలో చేసిన కర్మలపై ఆదారపడియుండును. ఇవి చక్రమందలి ఆరెలవలె వచ్చుచు పోవుచుండును.
ఈ భారతక్షేత్రమున ప్రతిజీవి తాము చేసిన శుభాశుభకర్మఫలమును తప్పక అనుభవించి తీరును. ప్రాణి తాను చేసిన కర్మను అనుభవింపక ఎన్ని సంవత్సరములైనను అది తీరదు.
ఈ విషయమును సామవేదమునందలి కౌథుమ శాఖయందు శ్రీకృష్ణుడు తెల్పెను.
జన్మభోగావశేషే సర్వేషాం కృతకర్మణాం | అనురూపం చ తేషాం వై భారతేzన్యత్ర చైవ హి || 19
కర్మణా బ్రహ్మశాపం చ కర్మణా చ శుభాశిషం | కర్మణా చ మహాలక్ష్మీ లభేద్దైన్యం చ కర్మణా || 20
కోటి జన్మార్జితం కర్మ జీవినా మనుగచ్ఛతి | న హి త్యజేద్వినా భోగాత్తం ఛాయేవ పురందర || 21
కాలభేదే దేశ##భేదే పాత్రభేదే చ కర్మణాం | నూన్యతాzధికతా వాzపి భ##వేదేవ హి కర్మణాం || 22
జీవులు చేసిన కర్మఫలములనన్నిటిని అనుభవించి ఇంకను కర్మభోగము మిగిలినచో తదనురూపమైన జన్మను భారతభూమియందు ఇతరత్ర పొందుచున్నారు.
మానవుడు చేసిన కర్మలవలన బ్రహ్మశాపమును, దైన్యమును, శుభాశీస్సులను, అంతులేని సంపదను పొందుచున్నాడు.
కోటి జన్మలక్రితం చేసిన కర్మయైనా ఛాయవలె జీవిని అనుసరించును. ఆ కర్మఫలమును అనుభవించనిదే అది అతనిని వదలదు. ఈ కర్మలు దేశకాలపాత్రభేదముననుసరించి న్యూనముగానో అధికముగానో ఫలితములను ఇచ్చును.
వస్తుదానే చ వస్తూనాం సమం పుణ్యం సమే దినే | దిన భేదే కోటిగుణమసంఖ్యం వాzధికం తతః || 23
సమదేశే చ వస్తూనాం దానేపుణ్యం సమం వృషన్ | దేశ##భేదే కోటిగుణం అసంఖ్యం వాzధికం తతః || 24
సమే పాత్రే సమం పుణ్యం వస్తూనాం కర్తురేవ చ | పాత్రభేదే శతగుణమసంఖ్య వా zతతో ధికం || 25
యథా ఫలంతి సస్యానిన్యూనాన్యప్యధికాని చ | కర్షకాణాం క్షేత్రభేదే పాత్రభేదే ఫలం తథా || 26
సామాన్య దివసే విప్రే దానం సమఫలం భ##వేత్ | అమాయాం రవిసంక్రాంతాం త్యాం ఫలం శతగుణం భ##వేత్ || 27
గ్రహణ శశినః కోటిగుణం చ ఫలమేవ చ | సూర్యస్య గ్రహణ చాపి తతో దశగుణం ఫలం || 28
అక్షయాయామక్షయం చాప్యసంఖ్య ఫలముచ్యతే | ఏవమన్యత్ర పుణ్యాహే ఫలాధిక్యం భ##వేదిహ || 29
యథా దానే తథా స్నానే జపేవై పుణ్యకర్మసు | ఏవం సర్వత్ర బోద్ధవ్యం నరాణాం కర్మణాం ఫలం || 30
వస్తువులను సామాన్యదినమున దానము చేసిన సామాన్య ఫలము లభించును. విశేష దినములందు చేయు దానము కోటిరెట్లు అధికముగానో, అసంఖ్యముగానో లేక దానికంటె అధికముగానో పుణ్యమును కలిగించును.
అట్లే సామాన్య ప్రదేశమున చేసిన దానము సామాన్య ఫలితము నీయగా విశిష్టమైన స్థలములలో చేసిన దానము కోటిరెట్లు గాని అంతకంటె అదికమైన ఫలితముగాని ఇచ్చును.
అదేవిధముగా సామాన్యవ్యక్తికిచ్చిన దానము సామాన్య ఫలితము నివ్వగా విశిష్టవ్యక్తుల కిచ్చిన దానము విశిష్టమైన ఫలితమునిచ్చును. రైతులు పంటలు పండించునపుడు క్షేత్రభేదమువలన పంటలెట్లు అధికముగా తక్కువగా పండుచున్నవో అట్లే దాన సమయమున దిన, దేశ, పాత్ర భేదమున ఫలితములలో మార్పులు కన్పించుచున్నవి.
బ్రాహ్మణునకు సామాన్య దినమున దానము చేసినచో సామాన్య ఫలితము లభించును. అదే అమావాస్యనాడు, సూర్య సంక్రాంతి సమయమున చేసిన దానము నూరురెట్లుక్కువ ఫలితమునిచ్చును. అదే చంద్రగ్రహణ సమయమున చేసినచో కోటిరెట్లెక్కువ ఫలము లబించును . సూర్యగ్రహణ కాలమున చేసిన దానము దానికంటె పదిరెట్లెక్కువ ఫలితమునిచ్చును. అక్షయతృతీయనాడు చేసిన దానము అక్షయ ఫలితమునిచ్చును. ఇట్లే ఇతర విశేష దినములలో దానము చేసిన విశేష ఫలితము లభించును.
దానము ఏవిదముగ దేశపాత్ర, కాలభేదమున విశేష ఫలితము నిచ్చుచున్నదో అట్లే స్నానము , జపము, దేశ, కాల, పాత్ర భేదముననుసరించి విశేష ఫలితములనిచ్చుచున్నవి.
సామాన్య దేశే దానం చ విప్రే సమఫలం భ##వేత్ | తీర్థే దేవగృహేచైవ ఫలం శతగుణం స్మృతం || 31
గంగాయాం వై కోటిగుణం క్షేత్రే నారాయణzవ్యయం | కురుక్షేత్రే బదర్యాం చ కాశ్యాం కోటిగుణం తథా || 32
యథా వై కోటిగుణం తథా వై విష్ణుమందిరే | కేదారే వై లక్షగుణం హరిద్వారే తథాఫలం || 33
పుష్కరే భాస్కర క్షేత్రే దశలక్షగుణం ఫలం | ఏవం సర్వత్ర బోద్ధవ్యం ఫలాధిక్యం క్రమేణ చ || 34
సాధారణ ప్రదేశమున విప్రునకు చేసిన దానము సాధారణ ఫలమునిచ్చును. తీర్థ ప్రదేశమున దేవతామందిరమున దానము చేసినచో నూరు రెట్లెక్కువ ఫలము లభించును. గంగా తటమున, నారాయణ క్షేత్రమున దానము చేసినచో అవ్యయ ఫలము లభించును . కురుక్షేత్రమున, బదరీక్షేత్రమున, కాశియందు చేసిన దానము కోటి రెట్లెక్కువ ఫలితమునిచ్చును. అట్లే విష్ణుమందిరమున దానము చేసినచో కోటిరెట్లేక్కువ ఫలితమునిచ్చును. కేదారక్షేత్రమున, హరిద్వారమున లక్షరెట్లు , పుష్కరక్షేత్రమున, భాస్కర క్షేత్రమున చేసిన దానము పదిలక్షల రెట్లు ఎక్కువ ఫలితమునిచ్చును.
ఈ విధముగా అన్ని స్థలములందు క్రమముగా ఫలితము అధికముగా దొరుకును.
సామాన్య బ్రాహ్మణ దానం సమమేవ ఫలం లభేత్ | లక్షం త్రిసంధ్యం పూతే చ పండితే చ జితేంద్రియే || 35
విష్ణుమంత్రోపాసకే చ బుధే కోటిగుణం ఫలం | ఏవం సర్వత్రణాబోద్ధవ్యం పలాధిక్యం గునాధికే || 36
సామాన్య బ్రాహ్మణునకు దానము చేసిన సామాన్య ఫలితము లభించును. త్రికాల సంధ్యావందనము చేసిన బ్రాహ్మణునకు, జితేంద్రియడైన పండితునకు చేసిన దానము లక్ష రెట్లెక్కువ ఫలమునిచ్చును. విష్ణుమంత్రమును ఉపాసన చేయు పండితునకు దానము చేసినచో కోటి రెట్లెక్కువ ఫలితము లభించును.
ఈవిధముగా గుణాధికులకు చేసిన దానము అధిక ఫలితమునిచ్చును.
యథా దండేన సూత్రేణ శరావేన జలేన చ | కుంభం నిర్మాతి చక్రేణ కుంభకారో మృదాభువి || 37
తథైవ కర్మసూత్రేణ ఫలం ధాతా దదాతి చ | యస్యాజ్ఞయా సృష్టివిధౌ తం చ | నారాయణం భజ || 38
స విధాతా విదాతుశ్చ పాతు ః పాతా జగత్త్రయే | స్రష్టుః స్రష్టా చ సంహర్తుః సంహర్తా కాలకాలకః || 39
మహావిపత్తౌ సంసారే యః స్మరేన్మధుసూదనం | విపత్తౌ తస్య సంపత్తిః భ##వేదిత్యాహ శంకరః || 40
కుమ్మరివాడు దండము, ఆవము, నీరు, చక్రము, మట్టి, సూత్రములచే కుండలను నిర్మించునట్లు బ్రహ్మదేవుడు కర్మసూత్రముననుసరించి ఫలితము నొసగుచున్నాడు. అందువలన నీవు ఎవరి ఆజ్ఞవలన ఈ సృష్టి జరుగుచున్నదో ఆ నారాయణుని సేవింపుము. ఆ నారాయణుడు అందరిని సృష్టించువాడు. రక్షించువాడు, సంహరించువాడు, కాలునకే కాలుడు.
మహా విపత్తి సమయమున మధుసూదనుని స్మరించినచో సంపదలు కలుగునని శంకరుడు చెప్పెను.
ఇత్యేవముక్త్యా జీవశ్చ సమాలింగ్యసురేశ్వరం | దత్వా శుభాశిషం చేష్టం బోధయామాస నారద || 41
బృహస్పతి తన శిష్యుడగు దేవేంద్రునకు ఈ విధముగా బోధించి అతనిని కౌగలించుకొని శుబాశీస్సులొసగి చేయవలసిన పనిని బోధించెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణ ద్వితియే ప్రకృతి ఖండమున నారద నారాయణుల సంవాదే బృహస్పతి మహేంద్ర సంవాదే మహాలక్ష్మ్యుపాఖ్యానే కర్మఫల నిరూపణం నామ సప్త త్రింశత్తమోzధ్యాయః ||
శ్రీబ్రహ్మవైవర్తమహారాణమున రెండవదైన ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున కన్పించు బృహస్పతి మహేశ్వరుల సంవాదమున మహాలక్ష్మి ఉపాఖ్యానమున కర్మఫలనిరూపణమను
ముఫై#్ప ఏడవ అధ్యాయము సమాప్తము.