sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

అష్టాత్రింశమోzధ్యాయః- సముద్ర మథన వృత్తాంతము

నారాయమ ఉవాచ - నారాణుడిట్లనెను-

హరిం ధ్యాత్వా హరిః బ్రహ్మన్‌ జగామ బ్రహ్మణః సభాం | బృహస్పతిం పురస్కృత్య సర్త్వైః సురగణౖః సహ || 1

శీఘ్రం గత్వా బ్రహ్మలోకం దృష్ట్వా చ కమలోద్భవం | ప్రణముర్దేవతాః సర్వా గురుణా సహ నారద || 2

వృత్తాంతం కథయామాస సురాచార్యో విధిం విభుం | ప్రహస్యోవాచ తచ్ఛ్రత్వా మహేంద్రం కమలోద్భవంః || 3

ఓ నారదా ! దేవేంద్రుడు శ్రీమహావిష్ణువును మనస్సులో ధ్యానించుకొని బృహస్పతి, మిగిలిన దేవతాగణము వెంటరాగా బ్రహ్నలోకమునకు పోయెను. అచ్చట బృహస్పతి మహేంద్రుడు మొదలగు దేవతలు బ్రహ్మదేవునకు నమస్కరించిరి , బృహస్పతి బ్రహ్మదేవునకు దేవేంద్రుని వృత్తాంతమునంతయు వివరించగా బ్రహ్మదేవుడు నవ్వి ఇట్లనెను.

బ్రహ్మోవాచ - బ్రహ్మదేవుడిట్లనెను-

వత్స మద్వంశజాతోzసి ప్రపౌత్రో మే విచక్షణః | బృహస్పతేశ్చ శిష్యస్త్యం సురాణామధిపః స్వయం || 4

మాతామహస్తే దక్షశ్చ విష్ణుభక్తః ప్రతాపవాన్‌ | కులత్రయం చ యచ్ఛుద్ధం చ కథం సోzహంకృతో భ##వేత్‌ || 5

మాతా పతివ్రతా యస్య పితా శుద్ధో జితేంద్రియః | మాతామహో మాతులశ్చ కథం సోzహంకృతో భ##వేత్‌ ||6

జనః పైతృకదోషేణ దోషాన్మాతామహస్య చ | గురోర్దోషాత్త్రిభిర్దోషైః హరిద్వేషీ భ##వేత్‌ ధ్రువం || 7

సర్వాంతరాత్మా భగవన్‌ సర్వదేహేష్వవస్థితః | యస్య దేహాత్‌ స ప్రయాతి స శవస్తక్షణం భ##వేత్‌ || 8

మనోzహమింద్రియేశశ్చ జ్ఞానరూపో హి శంకరః | అసవః ప్రకృతిర్విష్ణుః బుద్ధిర్భగవతీ సతీ || 9

నిద్రాదయః శక్తయశ్చ తాః సర్వాః ప్రకృతేః కళాః | ఆత్మనః ప్రతిబింబం చ జీవో భోగీ శరీర భృత్‌ || 10

ఆత్మనీశేగతే దేహాత్సర్వే యాంతి ససంభ్రమాత్‌ | యథా వర్త్మని గచ్ఛంతం నరదేవ మివానుగాః || 11

ఓ దేవేంద్రా ! నీవు నా వంశములో పుట్టితివి. నాకు నీవు మునిమనుమడవు. నీ గురువు బృహస్పతి. నీవు దేవతలకు అధిపతివి. నీ మాతామహుడు దక్షప్రజాపతి. అతడు పరాక్రమవంతుడేకాక గొప్ప విష్ణుభక్తుడు. ఈ విధముగా తండ్రివంకవారు. తల్లివంకవారు. గురువు ఈ ముగ్గురు పవిత్రులైనచో అహంకారమునకు తావు ఉండదు.

పతివ్రతయగు తల్లి, జితేంద్రియుడైన తండ్రి, సాత్విక స్వభావము కల మాతామహుడు, మేనమామ కలవాడు అహంకారి కాజాలడు. సాధారణముగా మానవుడు తండ్రి వంకనున్నవారి దోషమున, తల్లివంకనున్న వారి దోషమున గురువుయొక్క దోషమువలన శ్రీహరి ని ద్వేషించును. సర్వాంతర్యామియగు పరమాత్మ సమస్త దేహములందుడును. ఎవరి దేహమును ఆ పరమాత్మవదలి వేయునో అతడప్పుడే శవమగును .

ఇంద్రియములకు ఈశ్వరుడనగు నేను జీవునకు మనోరూపమున ఉందును. శంకరుడు జ్ఞానరూపుడుగానుండును. శ్రీహరి ప్రాణరూపముననుండును. భగవతియగు రాధాదేవి బుద్ధిరూపముననుండును. ప్రకృతి యొక్క అంశస్వరూపలైన శక్తులన్ని నిద్రాదిరూపముననుందురు. పరమాత్మకు ప్రతిబింబమైన జీవుడు శరీరమును ధరించి కర్మఫలములననుభవించుచుండును. ఆత్మకు ఈశ్వరుడైన పరమాత్మ దేహమునుండి బయటకు వచ్చినచో మహారాజువెంట పోవు అతని అనుచరులవలె మనోబుధ్యహంకారాదులన్నియు ఆ పరమాత్మవెంటపోవును.

అహం శివశ్చ శేషశ్చ విష్ణుర్ధర్మో మహాన్విరాట్‌ | మయం యదంశా భక్తాశ్చ తత్పుష్పం న్యక్కృతం త్వయా || 12

శివేన పూజితం పాదపద్మం పుష్పేణ యేన చ | తచ్చ దుర్వాససా దత్తం దైవేనా న్యక్కతం సుర || 13

తత్పుష్పం మస్తకే యస్య కృష్ణపాదాబ్జతశ్య్చతం | సర్వేషాం వై సురాణాం చ తత్పూజా పురతో భ##వేత్‌ || 14

నేను , పరమశివుడు, ఆదిశేషుడు, విష్ణువు, ధర్ముడు, మహావిరాట్‌ ఈ మేమందరము శ్రీకృష్ణుని యొక్క అంశస్వరూపులము, అతని భక్తులము కూడ. అట్టి పరమాత్మకు సమర్పించిన పుష్పమును నీవు తిరస్కరించితివి. పరమశివుడు ఏ పుష్పముచే శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములను పూజించెనో ఆ పరమ పవిత్రమగు పుష్పమును దుర్వాసమహాముని నీకు ఇచ్చెను. కాని

నీవు దురదృష్టము వలన దానిని గౌరవింపలేదు. శ్రీకృష్ణుని పాదపద్మములనుండి జారిపడిన పుష్పమునెవరు శిరస్సుపై ధరింతురో అతనిని సమస్త దేవతలు తొలుత పూజింతురు.

దైవేన వంచితస్త్వం చ దైవం చ బలవత్తరం | భాగ్యహీనం జనం మూఢం కోవారక్షితుమీశ్వరః || 15

కృష్ణం న మన్యతే యోహి శ్రీనాథం సర్వవందితం | ప్రయాతి రుష్టా తద్దాసీ మహాలక్ష్మీ ర్విహాయ తం || 16

శతయజ్ఞేన యాలబ్ధా దీక్షీతేన త్వయా పురా | సా శ్రీర్గతాzధునా కోపాత్‌ కృష్ణనిర్మాల్యవర్జనాత్‌ || 17

అధునాగచ్ఛ వైకుంఠం మయా చ గరుణా సహ | నిషేవ్య తత్ర శ్రీనాథం శ్రియం ప్రాస్స్యసి తద్వరాత్‌ || 18

ఇత్యేవముక్త్యా సబ్రహ్మా సర్వైః సురగణౖః సహ | శీఘ్రం జగామ వైకుంఠం వైకుంఠం యత్రశ్రీశస్తయా సహ || 19

దురదృష్టము నిన్ను మోసగించినది. అన్నిటికంటె అదృష్టము చాలా బలమైనది. అదృష్టములేని వానిని ఎవ్వరు కూడ రక్షింపలేరు. అందరిచే నమస్కరింపబడుచున్నవాడు, శ్రీనాథుడు శ్రీకృష్ణుని ఎవరు గౌరవింపరో అతని దగ్గర మహాలక్ష్మీ అసలే యుండదు. నీవు నూరు అశ్వమేధయాగములుచేసి సంపాదించుకొన్న లక్ష్మీ శ్రీకృష్ణనిర్మాల్యమును పరిహరించుటవలన కోపముతో నిన్ను వదలిపోయినది.

అందువలన నీవు వెంటనే వైకుంఠమునకు పొమ్ము . నీ వెంట నేను, దేవతల గురువైన బృహస్పతి కూడ వచ్చును. నీవా శ్రీకృష్ణపరమాత్మను ప్రసన్నముచేసికొని అతని అనుగ్రహమువలన మరల నీ స్వర్గలక్ష్మీని పొందెదవు.

బహహ్మదేవుడిట్లు మహేంద్రునితో పలికి దేవేంద్రుడు దేవతలందరు వెంటరాగా శ్రీనాథుడున్న వైకుంఠమునకు పోయెను.

తత్రగత్వా పరంబ్రహ్మ భగవంతం సనాతనం | దృష్ట్యా తేజః స్వరూపం చ ప్రజ్వలంతం స్వతేజసా || 20

గ్రీష్మ మధ్నాహ్న మార్తాండ శతకోటి సమప్రభం | శాంతం చానాది మద్యాంతం లక్ష్మీకాంతమనంతకం || 21

చతుర్భుజైః పార్షదైశ్చ సరస్వత్యాస్తుతం నతం | భక్తా చతుర్భిర్వేదైశ్చ గంగయా పరిసేవితం || 22

తంప్రణముః సురాః సర్వే మూర్ద్నా బ్రహ్మపురోగమాః | భక్తినమ్రాః సాశ్రునేత్రాః తుష్టువుః పురుషోత్తమం || 23

వృత్తాంతం కథయామాస స్వయం బ్రహ్మా కృతాంజలిః | రురుదుర్దేవతాః సర్వాః స్వాధికారాత్‌ చ్యుతాశ్చ తాః || 24

దేవతలందరు వైకుంఠమునకు పోయి అచ్చట సనాతనుడు, భగవంతుడు, పరబ్రహ్మస్వరూపుడు, తేజః స్వరూపుడు గ్రీష్మకాల మధ్యాహ్న సమయమున ప్రజ్వలించుచున్న కోటి సూర్యులవంటికాంతి కలవాడు. పరమశాంతుడు, ఆదిమధ్యాంతరహితుడు, శ్రీనాథుడు అనంతుడగు నారాయణుని దేవతలు చూచిరి. అతని యొద్ద నాల్గు భుజములు కల అతని అనుచరవర్గము సరస్వతి, నాల్గువేదములు, గంగాదేవి, ఉండిరి.

అప్పుడు బ్రహ్మదేవుడు, భార్యలతో సేవితుడైన శ్రీన్నారాయణుని భక్తిచే తలలు వంచుకొని నమస్కరించిరి.

అప్పుడు బ్రహ్మదేవుడు చేతులు కట్టుకొని ఇంద్రుని వృత్తాంతమంతయు శ్రీమన్నారాయణునకు నివేదింపగా తమ అధికారమును కోల్పోయిన దేవతలందరు అతని పాదములపైబడి ఏడ్వసాగిరి.

స చాపశ్యత్సురగణం విపద్గ్రస్తం భయాకులం | వస్త్రభూషణ శూన్యం చ వాహానాది వివర్జితం || 25

శోభాశూన్యం హతశ్రీకం పరీవారైరనావృతం | ఉవాచ కాతరం దృష్ట్యా విపన్న భయభంజనః ||26

శ్రీమన్నారాయణుడు ఆపదలలో మునిగి భయముతో నున్నవారు, వస్త్రములు ఆభరణములు లేనివారు, వాహనములు మొదలైనవి లేనివారు. సంపద తొలగిపోగా ముఖమున కాంతి లేనివారు పరివారము సహితము లేనివారగు దేవతాగణమును చూచి ఆపదలలోనున్నవారి భయమును పోగొట్టువాడై వారితోనిట్లనెను.

నారాయణ ఉవాచ- క్షీమన్నారాయణుడిట్లనెను-

మా భైర్బ్రహ్మన్‌ హే సురాశ్చ భయం కిం వోమయిస్థితే | దాస్యామి లక్ష్మీ మచలాం పరమైశ్వర్య వర్ధినీం || 27

కించ మ ద్వచనం కించిత్‌ శ్రూయతాం సమయోచితం | హితం సత్యం సారభూతం పరిణామసుఖావహం || 28

జనాశ్చాసంఖ్య విశ్వస్థాః మదధీనాశ్చ సంతతం | యథా తథాzహం మద్భక్తైః పరాధీనః స్వతంత్రకః || 29

యోయో రుష్టో హి మద్భక్తే మత్పరే హి నిరంకుశః | తద్గృహేzహం న తిష్ఠామి పద్మయా సహ నిశ్చితం || 30

ఓ బ్రహ్మదేవుడా ! దేవతలారా! నేనుండగా మీరు బయపడవద్దు, నేను మీకు పరమైశ్వర్యములనిచ్చు సుస్ధిర లక్ష్మిని ఇచ్చెదను. ఐనను హితమైన నామాటను కొద్దిగా వినుడు.

ఈ ప్రపంచములలో నున్న జనులందరు ఎల్లప్పుడు నాకు అధీనులై ఉందురు. అట్లే నేను స్వతంత్రుడనైనను, నా భక్తపరతంత్రుడనై ఉందును. నన్ను ఎల్లప్పుడు సేవించు నా భక్తుని కోపించువాని ఇంటిలో లక్ష్మీదేవితో సహ నేనెల్లప్పుడు నివసించను.

దర్వాసాః శంకరాంశశ్చ వైష్ణవో మత్పరాయణః | తచ్ఛాపాదాగతోzహం చ సశ్రీకో వో గృహాదపి || 31

యత్ర శంఖధ్వనిర్నాస్తి తులసీ చ శిలార్చనం | న భోజనం చ విప్రాణాం న పద్మా తత్ర తిష్ఠతి || 32

మద్భాక్తానాం చ మే నిందా యత్ర తత్ర భ##వేత్సురాః | మహారుష్టా మహాలక్ష్మీస్తతో యాతి పరాభవాత్‌ || 33

మద్భక్తిహీనో యో మూఢో యో భుంక్తే హరివాసరే | మమజన్మదినే చాపి యాతి శ్రీస్తద్గృహాదపి || 34

మన్నామ విక్రయీ యశ్చ విక్రీణాతిస్వకన్యకాం | యత్రాతిథిర్నభుంక్తే చ మత్ప్రియా యాతి తద్గృహాత్‌ || 35

పాపినాం యో గృహం యాతి శూద్రశ్రాద్ధాన్న బోజినాం | మహారుష్టా తతో యాతి మందిరాత్కమలాలయా || 36

శూద్రాణాం శవదాహా చ బాగ్యహీనశ్చ బాడవః | యాతి రుష్టా తద్గృహాచ్ఛ దేవీ కమలవాసినీ || 37

శూద్రాణాం సూపకారో యో బ్రాహ్మణో వృషవాహకః | తత్తోయపానభీతా చ కమలా యాతి తద్గృహాత్‌ || 38

విప్రో యవనసేవీచ దేవలః శూద్రయాజకః | తత్తోయపాన భీతా చవైష్టవీ యాతి తద్గృహాత్‌ || 39

దుర్వాసమహర్షి శంకరుని అంశవలన పుట్టినావాడు. పరమ వైష్ణవుడు. అతని శాపము వలననే నేను లక్ష్మీదేవితో కలసి మీ ఇండ్లనుండి బయటకు వచ్చితిని

పూజావేళయందు శంఖధ్వని లేనిచోట, తులసీ, సాలగ్రామ-శిలార్చన చేయనిచోట, బ్రాహ్మణులకు భోజనము దొరకనిచోట లక్ష్మీదేవి నిలవదు. అట్లే నా భక్తులను నిందించుచోట, లక్ష్మీదేవి తనకవమానము జరిగినట్లు భావించి కోపముతో ఆ ఇంటినుండి వెళ్ళిపోవును. నాయందు భక్తిలేని మూర్ఖుడు ఏకాదశీ తిథినాడు శ్రీకృష్ణాష్టమీ దినమున బోజనము చేయును. కొందరు నా పేరు చెప్పుకొని ధనమార్జింతురు. మరికొందరు తమ కన్యలను విక్రయింతురు. కొందరు అతిథి అభ్యాగతులకు భోజనము పెట్టరు. కొందరు పాపులను ఆశ్రయింతురు. కొందరు బ్రాహ్మణులు శూద్రుడు పెట్టిన శ్రాద్ధాన్నమును తిందురు. కొందరు బీదబ్రాహ్మణులు శవములు కాల్చుచుందురు. వంటలు వండుచు బ్రతుకుచుందురు. కొందరు బ్రహ్మణులు ఎద్దులపై కూర్చుండి పోవుచుందురు. యవనులను కొందరు బ్రహ్మణులు సేవింతురు. దేవాలయమున అర్చనచేసి బ్రతుకుదురు. అట్లే మరికొందరు బ్రహ్మణులు శూద్రులచే యాగములు చేయింతురు. ఇటువంటివారి ఇండ్లలో లక్ష్మీ దేవి ఉండదు.

విశ్వాసఘాతీ మిత్రఘ్నో నరఘాతీ కృతఘ్నకః | అగమ్యాం యాతి యో విప్రో మద్భార్యా యాతి తద్గృహాత్‌ || 40

అశుద్ధహృదయః క్రూరో హింసకో నిందకో ద్విజః | బ్రాహ్మణ్మాం శూద్రజాతశ్చ యాతి దేవీ చ తద్గృహాత్‌ || 41

యో విప్రో పుంశ్చలీపుత్రో మహాపాపీ చ తత్పతిః | అవీరాన్నం యో భుంక్తే తస్మాద్యాతి జగత్ర్పసూః ||42

తృణం భనత్తి నఖరైః తైర్వాయో హి మహీం లిఖేత్‌ | జిహ్మో వా మలవాసాశ్చ సాప్రయాతి చ తద్గృహాత్‌ || 43

సూర్యోదయే చ ద్విర్భోజీ దివాశాయీ చ బాడవః | దివా మైథునకారీ చ తస్మాద్యాతి హరిప్రియా || 44

ఆచారహీనో యో విప్రో యశ్చ శూద్రప్రతిగ్రహీ | అదీక్షీతో హి యో మూఢస్తస్మాల్లోలా ప్రయాతిచ || 45

విశ్వాసఘాతి, మిత్రులను వంచనచేయు బ్రాహ్మణుడు, మానవులను చంపువాడు, కృతఘ్నుడు, అగమ్యాగమనము చేయు బ్రాహ్మణుల ఇంట లక్ష్మీదేవి ఉండదు. అట్లే అపవిత్రమైన హృదయముకలవాడు, క్రూరుడు, హింసించువాడు, పరులను నిందించు బ్రాహ్మణుల ఇంట, బ్రామ్మణస్త్రీకి జన్మించిన శూద్రుని ఇంటిలో, జారస్త్రీకి పుట్టినవాడు, మహాపాపములు చేయువాని పుత్రుడు భర్త మరియు, సంతానము లేని స్త్రీ పెట్టిన అన్నము భుజించు బ్రాహ్మణుల ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు.

అనవసరముగా గోళ్ళతో గడ్డిని, గిల్లువాడు, అట్లే గోళ్ళతో భూమిపై వ్రాయుచుండువాడు, కుటిలుడు, మలినమైన బట్టలు ధరించువాడు సూర్యోదయమువరకు రెండు పర్యాయములు భుజించువాడు. పగటి పూట నిద్రపోవు వాడు, పగటిపూట మైథునము చేయు బ్రాహ్మణుల ఇండ్లలో లక్ష్మీదేవి నివసించదు. సదాచారము లేనివాడు , శూద్రుడు చేసిన దానము స్వీకరించివాడు , యాగదీక్షితుడు కాని బ్రాహ్మణుల ఇంట లక్ష్మీదేవి ఉండదు.

స్నిగ్ధపాదశ్చ నగ్నో వా యః శేతే జ్ఞాన దుర్బలః | శశ్వద్ధర్మాతివాచోలో యాతి వైతద్గృహాత్సతీ || 46

శిరస్నాతశ్చ తైలేన యోzన్యదంగం మసుపస్ప్సశేత్‌ | స్వాంగే చ వాదయే ద్వాద్యం రమాయాతి హరిప్రియా || 47

వ్రతోపవాస హీనోయః సంధ్యాహీనోzశుచిర్ద్విజః | విష్ణుభక్తిహీనో యస్తస్మాద్యాతి హరిప్రియా || 48

బ్రాహ్మణం నిందయే ద్యోహి తాన్యై ద్వేష్టి చ సంతతం | హింసాకారి దయాహీనో యాతి సర్వప్రసూస్తతః || 49

తడియారని కాళ్ళతో, లేక నగ్నముగా పడుకొనువాడు ఎల్లప్పుడు ధర్మమును గురించి విపరీతముగా మాట్లాడుచు తాను మాత్రము ధర్మమనుష్ఠింపనివాడు, నూనె అంటుకొని శిరస్నానము చేసిన తరువాత మర్మాంగమును స్పృశించువాడు, వ్రతములు ఉపవాసములు చేయనివాడు, సంధ్యావందన మాచరింపనివాడు, విష్ణుభక్తి లేనివాడు, బ్రాహ్మణులను నిందించువాడు, వారిని ద్వేషించువాడు, దయాహీనుడు, ఇటువంటి వారి ఇండ్లలో లక్ష్మీదేవి నివసించదు.

యత్ర తత్ర హరేర్ఛా హరేరుత్కీర్తనం శుభం | తత్ర తిష్ఠతి సాదేవీ కమలా సర్వమంగళా || 50

యత్ర ప్రశంసాకృష్ణస్య తద్భక్తస్య, పితామహ | సా చ కృష్ణప్రియా దేవీ తత్ర తిష్ఠతి సంతతం || 51

యత్ర శంఖ ధ్వనిః శంఖః శిలా చ తులసీదళం | తత్సేవా వందనం ధ్యానం తత్ర సాతిష్ఠతి స్వయం || 52

శివలింగార్చనం యత్ర తస్య చోత్కీర్తనం శుభం | దుర్గార్చనం తద్గుణాశ్చ తత్ర పద్ననివాసినీ || 53

విప్రాణాం సేవనం యత్ర తేషాం వై భోజనం శుభం | అర్చనం సర్వదేవానాం తత్ర పద్మముఖీ సతీ || 54

శ్రీహరి పూజ, శ్రూహరి గుణకీర్తనము జరుగుచోట, శంఖముల ధ్వని, శంఖము, సాలగ్రామ శిల, తులసి, తులసీసేవ, నమస్కారములు జరుగు ప్రదేశమున, శివలింగార్చన, పరమశివుని గుణకీర్తన జరుగుస్థలమున , సమస్త దేవతార్చన జరుగు ప్రదేశమున లక్ష్మీదేవి ఎల్లప్పుడు నివసించును.

ఇత్యుక్తా చ సురాన్నర్వాన్‌ రమామాహ రమా పతిః | క్షీరోద సాగరే జన్మ లభస్వ కళయా రమే || 55

ఇత్యుక్త్యా తాం జగన్నాథో బ్రహ్మాణం పునరాహ చ | మథిత్వా సాగరం లక్ష్మీ దేవేభ్యో దేహి పద్మజ || 56

ఇత్యుక్త్యా కమలాకాంతో దేవశ్చాంతరధాన్మునే | దేవాశ్చిరేణ కాలేన యయుః క్షీరోద సాగరం || 57

శ్రీ మహావిష్ణువు దేవతలతోనిట్లు పలికి, లక్ష్మీదేవితో నివు నీయొక్క అంశస్వరూపమున పాలసముద్రమున జన్మించుమని చెప్పెను. అట్లే బ్రహ్మదేవునితో మీరందరు పాలసముద్రమును చిలికి ఆ పాలకడలినుండి పుట్టిన లక్ష్మీని దేవతలకు ఇమ్మని చెప్పెను.

శ్రీహరి యొక్క ఆజ్ఞననుసరించి దేవతలందరు క్షీరసాగరమునకు వెళ్ళిరి.

మంథానం మందరం కృత్వా కూర్మం కృత్వా చ భాజనం | రజ్జుం కృత్వా వాసుకిం చ మమంథుశ్చైవ సాగరం || 58

ధన్వంతరిం చ పీయూషం ఉచైః శ్రవసమీప్సతం | నానారత్నం హస్తిరత్నం ప్రారుర్లక్ష్మాశ్చ దరిశనం || 59

వనమాలాం దదౌ సా చ క్షీరోదశాయినే మునే | సర్వేశ్వరాయ రమ్యాయ విష్ణవే వైష్ణవీ సతీ || 60

దేవైస్తుతా పూజితా చ బ్రహ్మణా శంకరేణ చ | దదౌ దృష్టిం సురగృహో బ్రహ్మశాపవిమోచికాం || 61

ప్రాపుర్దేవాః స్వవిషయం దైత్యైర్గ్రస్తం భయంకరైః | మహాలక్ష్మీ ప్రసాదేవ వరదానేన నారద || 62

క్షీరసాగరమున మందరపర్వతమును కవ్వముగా , ఆది కూర్మముగా పాత్రగా, వాసుకిని చిలుకుటకు ఉవయోగించు తాడుగా చేసికొని ఆ సముద్రమును మథించిరి. అప్పుడు భిషగ్వరుడైన ధన్వంతరి, అమృతకలశము, ఉఛ్ఛైః శ్రవమను అశ్వరాజము, కౌస్తుభాది నానార్త్నములు, ఐరావతమను ఏనుగు, లక్ష్మీదేవి ఆవిర్భవించిరి.

లక్ష్మీ దేవి క్షీరసాగరమున వపళించియున్నవాడు, సుందరుడు, సర్వేశ్వరుడు అగు విష్ణుమూర్తి మెడలో వైష్ణవియగు లక్ష్మీదేవి వన(ర?) మాలను వేసినది. ఆమెను బ్రహ్మ , శంకరుడు మొదలగు దేవతలు పూజింపగా ఆ లక్ష్మీదేవి దేవతలపై దుర్వాసమహర్షి శాపమును పోగొట్టు దయాదృష్టిని ప్రసరింపచేసినది.

ఆ మహాలక్ష్మీదేవియొక్క అనుగ్రహమువలన, ఆమె ఇచ్చిన వరమువలన దైత్యులాక్రమించుకొనిన దేవలోకమును దేవతలు తిరిగి పొందిరి.

ఇత్యేవం కథితం సర్వం లక్ష్మ్యుపాఖ్యాకముత్తమం | సుఖదం సారభూతం చ కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 63

నారదా ఉత్తమమైన లక్ష్మీ ఉపాఖ్యానమును నీకు నేను వివరించితిని. ఇంకను వినదలచినదేదైనా ఉన్నచో అడుగుము.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదే లక్ష్మ్యుపాఖ్యానే సముద్రమథనం నామాష్టా త్రింశోzధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్తమను మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున నరనారాయణుల సంవాదమున తెల్పబడిన లక్ష్మీ ఉపాఖ్యానములో సముద్రమథనమను

ముఫై#్ప ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters