sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకోన చత్వారింశత్తమో zద్యాయః- లక్ష్మీ దేవి యొక్క పూజావిధానము నారద ఉవాచ - నారదుడిట్లు నారాయణునితో ననెను- హరేరుత్కీర్తనం భద్రం శ్రుతం తజ్జ ముత్తమం | ఈప్సితం లక్ష్మ్యుపాఖ్యానం ధ్యానం స్తోత్రాదికం వద ||
1 హరిణా పూజితా పూర్వం తతోబ్రహ్మాదిభిస్తథా | శ##క్రేణ భ్రష్టరాజ్యేణ సార్థం సురగణన చ ||
2 ధ్యానేన పూజితా యేన విధినా కేన వా పురా | కేన స్తుతా వా స్తోత్రేణ తన్మే వ్యాఖ్యాతుమర్హసి ||
3 మీ అనుగ్రహమువలన శ్రీహరి గుణకీర్తనము, లక్ష్మీదేవియొక్క ఉపాఖ్యానమును వినగలిగితిని. ఇక నాకు లక్ష్మీదేవియొక్క ద్యానము స్తోత్రాదికమును తెలుపుడు. పూర్వకాలమున ఆ దేవి శ్రీహరిచే ఆ తరువాత బ్రహ్మ మొదలగువారిచే, ఆ తరువాత రాజ్యభ్రష్టుడైన మహేంద్రునిచే దేవతా సమూహముచే పూజింపబడినట్లు తెలుసుకొంటిని. ఆ దేవి ఎట్టి ధ్యానమంత్రముచే పూజింపబడినది? వారు ఏ పద్ధతిలో ఆమెను పూజించిరి? ఏ స్తోత్రముచే ఆమెను స్తుతించిరో ఆ విషయములనన్నిటిని నాకు వివరింపుడని నారాయణుని అడిగెను. శ్రీ నారాయణ ఉవాచ - శ్రీ నారాయణుడిట్లనెను. స్నాత్వా తీర్థే పురా శక్రో ధృత్వా ధౌతే చ వాససీ | క్షీరోదే సంస్థాప్య ఘటం దేవషట్కమపూజయత్ || 4 గణశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం | ఏతాన్ భక్త్యా సమభ్యర్చ్య పుష్పగంధాదిభిస్తదా || 5 తత్రావాహ్య మహాలక్ష్మీం పరమైశ్వర్య రూపిణీం | పూజాం చకార దేవేశో బ్రహ్మణా చ పురోధసా || 6 పురః స్థితేషు మునిషు బ్రహ్మణషు గురౌ తథా | దేవాదిషు చ దేవేశే జ్ఞానానందే శివే మునే || 7 పారిజాతస్య పుష్పం చ గృహీత్వాం చందనోక్షితం | ధ్యాత్వా దేవీం మహా లక్ష్మీం పూజయామాస నారద || 8 ధ్యానం చ సామవేదోక్తం యదుక్తం బ్రహ్మణ పురా | ధ్యానేన హరిణా తేన తన్నిబోధ వదామి తే || 9 పూర్వము ఇంద్రుడు పుణ్యతీర్ధమున స్నానముచేసి ఉతికిన వస్త్రములను ధరించి క్షీరసముద్ర తీరమున కలశమును స్థాపించెను. తరువాత గణపతిని, సూర్యుని , అగ్నిని, విష్ణుమూర్తిని, శివుని, దుర్గాదేవి అను ఆరు దేవతలను పుష్పగంధాదులచే అర్చన చేసి కలశమున పరమైశ్వర్య స్వరూపిణియగు మహాలక్ష్మిని ఆవాహనచేసి పూజ చేసెను. అచ్చట దేవతలు, మునులు, బ్రాహ్మణులు, బృహస్పతి బ్రహ్మదేవుడు, శివుడు ఉండిరి. వారిముందు పారిజాతపుష్పమును చందనముతో అద్ది దానిని మహాలక్ష్మీదేవికి సమర్పించెను. తరువాత శ్రీహరి బ్రహ్మదేవునకుపదేశించిన సామవేదమందలి ధ్యానశ్లోకములతో ఆ మహాలక్ష్మిని ధ్యానించెను. ఆ మహా లక్ష్మీ ధ్యానమును నీకు వినిపింతును శ్రద్ధగా వినుము. సహస్రదళ పద్మస్య కర్ణికావాసినీ పరాం | శరత్పార్వణ కోటీందు ప్రభాజుష్టకరాం వరాం || 10 స్వతేజసా ప్రజ్వలంతీం సుఖదృశ్యాం మనోహరం | ప్రతప్త కాంచననిబాం శోభా మూర్తిమతీం సతీం || 11 రత్నభూషణ భూషాఢ్యాం శోభితాం పీతవాససా | ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం రమ్యాం సుస్థిర ¸°వనాం || 12 సర్వ సంత్ప్రదాత్రీం చ మహాలక్ష్మీం భ##జే శుభాం | శ్రీ మహాలక్ష్మి సహస్ర దళములుగల పద్మముయొక్క కర్ణికయందు నివసించును. శరత్కాలమందలి కోటి పున్నమిచంద్రుల కాంతితో గొప్పనైన తన తేజస్సుతో ప్రకాశించును. ఆమె మిక్కిలి అందముగలది. మనోహరముగా నుండునది. బంగారువంటి శరీరము కలది. అనేక రత్నాభరణములను ధరించును. పీతాంబరమును ధరించి, చిరునవ్వుతో భక్తులకు సమస్త సంపదలను ఇచ్చును. సుస్థిరమైన ¸°వనముగల ఆ మహాలక్ష్మిని సేవింతును. ధ్యానేన తాం ధ్యాత్యా చోపహారైస్సుసంయుతః| సంపూజ్య బ్రహ్మవాక్యేన ప్రత్యేకం మంత్రపూర్వకం || 14 ప్రశంస్యాని ప్రహృష్టాని దుర్లభాని వరాణి చ | పై మహాలక్ష్మీ ధ్యానముతో ఆమెను ధ్యానించి బ్రహ్మదేవుడు చెప్పినట్లు ఆమెను పూజించి దుర్లభ##మైనవి, శ్రేష్ఠమైనవి అగు షోడశోపచారములను ప్రత్యేకమైన మంత్రములతో శాస్త్రపద్ధతిగా సమర్పించెను. ఆసన మంత్రముc
ఆమూల్య రత్నఖచితం నిర్మితం విశ్వకర్మణా | ఆసనం చ విచిత్రం చ మహాలక్ష్మి ప్రగృహ్యతాం || 15
ఓ మహాలక్ష్మీ! అమూల్యమైన రత్నములచే విశ్వకర్మ నిర్మించిన విచిత్రమైన ఈ ఆసనమును స్వీకరింపుము.
గంగాజల మంత్రము (ఆర్ఘ్య)
శుద్ధం గంగోదకమిదం సర్వవందితమీప్సితం | పాపేధ్మ వహ్నిరూపం చ గృహ్యతాం కమలాలయే || 16
పాపములను ఇధ్మములను అగ్నివలె కాల్చునది , పరిశుద్ధమైనది, అందరిచే నమస్కరింబడినది, ఇష్టమైనది అగు ఈ గంగోదకమును నీవు స్వీకరింపుము.
శంఖజల మంత్రము (పాద్య)
పుష్పచందన దూర్వాది సంయుతం జాహ్నవి జలం | శంఖగర్భస్థితం శుద్ధం గృహ్యతాం పద్మవాసిని || 17
ఓ పద్మవాసిని !పువ్వులు, చందనము, గరక మొదలైన వస్తువులు కల గంగాజలము శంఖమున నున్నది. ఇది మిక్కిలి పరిశుద్ధమైనది . ఈ శంఖజలమును నీవు స్వీకరింపుము.
అమలకీ జలమంత్రము-
సుగంధియుక్త తైలం చ సుగంధామలకీజలం | దేహసౌందర్య బీజం చ గృహ్యతాం శ్రీహరిప్రియే || 18
ఓ శ్రీహరి ప్రియా! శరీర సౌందర్యమును పెంచునది, సువాసనా భరితమైన తైలముగల ఉసిరిక ముద్దగల నీటిని నీకు సమర్పించుచున్నాను.
ధూపమంత్రము -
వృక్షనిర్యాస రూపం చ గంధద్రవ్యాదిసంయుతం | కృష్ణకాంతే పవిత్రో వై ధూపోzయం ప్రతిగృహ్యతాం || 19
ఓ శ్రీకృష్ణకాంతా! చెట్ల యొక్క సారమనదగు జిగురునకు సుగంధద్రవ్యములు చేర్చబడినవి. పవిత్రము, సువాసనా భరితమైన ధూపమును నీవు స్వీకరింపుము.
చందన మంత్రము c
మలయాచల సంభూత వృక్షసారం మనోహరం | సుగంధియుక్తం సుఖదం చందనం దేవి గృహ్యతాం || 20
ఓ మహాలక్ష్మీ! ఈ చందనము మలయపర్వతమున పుట్టిన వృక్షములయొక్క సారరూపమైనది. పరమ సుగంధభరితము, సుఖమును, ఆహ్లాదమునిచ్చు ఈ చందనమును నీకు సమర్పించుచున్నాను.
దీపమంత్రము c
జగచ్చక్షు స్వరూపం చ ధ్వాంతప్రధ్వంస కారణం | ప్రదీపం శుద్ధరూపం చ గృహ్యతాం పరమేశ్వరీ || 21
ఓ పరమేశ్వరి! ప్రపంచమునకంతయు కంటివంటిది, చీకటిని పారద్రోలునది, శుద్ధమైన ఈ దీపమును నీకు సమర్పించుచున్నాను.
నైవేద్యమంత్రము-
నానోపహార రూపం చ నానా రస సమన్వితం | నానాస్వాదుకరం చైవ నైవేద్యం ప్రతిగృహ్యతాం || 22
అన్నం బ్రహ్మ స్వరూపం చ ప్రాణరక్షణ కారణం | తుష్టిదం పుష్టిదం చాన్నం మదురం ప్రతిగృహ్యతం || 23
శాల్యక్షత సుపక్వం చ శర్కరాగసంయుతం | సుస్వాదు రమ్యం పద్మే చ పరమాన్నం ప్రగృహ్యతాం || 24
శర్కకాగవ్యపక్వం చ సుస్వాదు సుమనోహరం | మయానివేదితం లక్ష్మి స్వస్తికం ప్రతిగృహ్యతాం || 25
నానావిధాని రమ్యాణి పక్వాని చ ఫలాని తు | స్వాదురస్యాని కమలే గృహ్యంతాం ఫలదాని చ || 26
ఓ దేవి అనేక సరములు కలది, మిక్కిలి రుచుకలది, అనేక ఉపాహార రూపములతో నున్న ఈ నైవేద్యమును స్వీకరింపుము. అట్లే బ్రహ్మస్వరూపము, ప్రాణములను నిలుపునది, తుష్టిని, పుష్టిని కలిగించునది. మధురమైనది అగు ఈ అన్నము నీకు నివేదించుచున్నాను. అట్లే బాగుగా వండిన అన్నము, చక్కర, ఆవుపాలు కలిసినది ఇది మిక్కిలి రుచికలది, కంటికి ఇంపైనది. ఈ పరమాన్నమును నీవు స్వీకరింపుము. ఆవుపాలు చక్కర కలిపి వండిన ఈ స్వస్తికమను దానిని నీవు స్వీకరింపుము. బాగుగా పండినవి, అందమైనవి, మంచి రుచిగల రసముకల ఈ అనేక విధములైన పండ్లను నీవు ఆస్వాదింపుము.
క్షీరమంత్రముc
సురభిస్తన సంభూతం సుస్వాదు సుమనోహరం | మర్త్యామృతం చ గవ్యం వై గృహ్యతామచ్యుతప్రియే ||27
అచ్యుతునకు ప్రియురాలవగు ఓ దేవి | సురభి స్తనములనుండి చీయబడినది, మంచిరుచికలది, మనోహరమైనది, మానవులకు అమృతమువంటిదగు ఈ ఆవుపాలను నీవు స్వీకరింపుము
గుడమంత్రముc
సుస్వాదరస సంయుక్త మిక్షు వృక్షరసోద్భవం | అగ్నిపక్వమపక్వం వాగుడం వై దేవి గృహ్యతాం || 28
ఓ దేవి చెరుకునుండి పుట్టిన మదురరసమును అగ్నిపక్వము చేయగా నేర్పడిన గుడమును, పక్వముచేయని ఇక్షురసమును నీవు ఆరగింపుము.
మిష్టాన్న మంత్రముc
యవగోధూమ సస్యానాం చూర్ణరేణు సముద్భవం | సుపక్వ గుడ గవ్యాక్తం మిష్టాన్నం దేవి గృహ్యతాం || 29
యవలు, గోధుమపిండితో సిద్ధముచేయబడినది, బాగుగా పక్వమైన గుడము ఆవుపాలు కల మిష్టాన్నమును స్వీకరింపుము.
పిష్టక మంత్రము c
సస్యచూర్ణోద్భవం పక్వం స్వస్తికాది సమన్వితం | మయా నివేదితం దేవి పిష్టకం ప్రతిగృహ్యతాం || 30
బియ్యపుపిండి స్వస్తికము కలిపి సిద్ధము చేయబడిన ఈ పిండిని ఓ దేవి నీవు గైకొనము.
ఇక్షుమంత్రము c
పార్థివం వృక్షభేదం చ వివిధద్రవ్యకారకం | సుస్వాదు రస సంయుక్తం ఐక్షవం ప్రతిగృహ్యతాం || 31
ఈ చెరకు భుమిలోనుండు ఒక వృక్షము. దీనివలన బెల్లము మొదలగు అనేకవిధ ద్రవ్యములు ఉత్పత్తియగును. ఇది మంచి రుచి గల రసముకలది. అట్టి ఈ చెరకు స్వీకరింపుము.
వ్యజన మంత్రము-
శీతవాయుప్రదం చైవ దాహే చ సుఖదం పరం | కమలే గృహ్యతాం చేదం వ్యజనం శ్యేతం చామరం || 32
ఓ దేవి ఎండకాలమున మిక్కిలి సుఖమును కలిగించునది, చల్లని వాయువు నిచ్చునది, తెల్లని చమరీమృగముల తోకల కుచ్చులచే నిర్మితము అగు వ్యజనమును (చామరమును) స్వీకరింపుము.
తాంబూల మంత్రము-
తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం | జిహ్వాజాడ్యచ్ఛేదకరం తాంబూలం దేవి గృహ్యతాం || 33
ఓ మహాలక్ష్మి! ఈ తాంబూలము కర్పూరము మొదలగు ద్రవ్యములు కలది. నాలుకను ఉత్తేజపరచును. ఇట్టి తాంబూలమును నీకు అర్పించుచున్నాను.
జలమంత్రము-
సువాసితం శీతలం చ పిపాసా నాశకారణం | జగజ్జీవనరూపం చ జీవనం దేవి గృహ్యతాం || 34
ఓ లక్ష్మీదేవి! దప్పిని పోగొట్టునది, ప్రపంచములోని జీవులు జీవించు కారణమైనది, చల్లనిది, మంచి వాసన కలదియగు ఈ జలమును నీవు స్వీకరింపుము.
వస్త్రమంత్రము-
దేహసౌందర్యబీజం చ సదా శోభా వివర్ధనం | కార్పాసజం చ క్రిమిజం వసనం దేవి గృహ్యతాం || 35
అమ్మా! నేను సమర్పించుచున్న వస్త్రమును స్వీకరింపుము. ఇది దేహమునకు అందమును తెచ్చును. శోభను పెంచుచుండును. దీనిని పత్తితోగాని, పట్టుపురుగులతోగాని నేయుదురు. అట్టి వస్త్రమును స్వీకరింపుము.
భషణమంత్రము-
రత్నస్వర్ణవికారం చ దేహసౌఖ్య వివర్ధనం | శోభాధానం శ్రీకరం చ భూషణం ప్రతిగృహ్యతాం || 36
రత్నములు బంగారము కలిపి నిర్మింపబడినది, శరీర సౌఖ్యమును, శరీరమునకు శోభను కలిగించునది అగు భూషణమును స్వీకరింపుము.
మాల్యమంత్రము-
నానా కుసుమ సందర్భం బహుశోభాప్రదం పరం | సురలోకప్రియం శుద్ధం మాల్యం దేవి ప్రగృహ్యతాం || 37
అమ్మా! అనేక విధుములైన పుష్పములు కలది, చక్కని శోభను కలిగించునది, దేవతలకందరకు ప్రియమైనది అగు ఈ పుష్పమాలను నీకు అర్పించుచున్నాను.
గంధమంత్రము-
శుద్ధిదంశుద్దిరూపం చ సర్వమంగళమంగళం | గంధవస్తూద్భవం రమ్యం గంధం దేవి ప్రగృహ్యతాం || 38
ఓ దేవి! సమస్త మంగళవస్తువులలో శ్రేష్ఠమైనది, పరమ శుద్ధమైనది, రమ్యమైనది, గందపు చెక్కనుండి ఏర్పడిన ఈ గంధమును స్వీకరింపుము.
ఆచమనీయ మంత్రము-
పుణ్యతీర్థోదకం చైవ విశుద్ధం శుద్ధిదం సదా | గృహాణ కృష్ణకాంతే త్వం రమ్యమాచమనీయకం || 39
శ్రీకృష్ణ కాంతవగు లక్ష్మీదేవి! పవిత్రమైన తీర్థములకు చెందిన ఉదకమిది. ఇది చాల పరిశుద్ధమైనది, ఇతరులను కూడా పవిత్రము చేయునది, ఇట్టి ఆచమనీయమును నీవు స్వీకరింపుము.
శయ్యామంత్రము-
రత్నసారైః సంగ్రథితం పుష్పచందన సంయుతం | రత్నభూషాఢ్యం సుతల్పం ప్రతిగృహ్యతాం || 40
ª«sVLiÀÁ „sÌÁVª«sgRiÌÁ LRi»R½õª«sVVÌÁV, xmsoª«so*ÌÁV, ¿RÁLiµR…ƒ«sª«sVV, LRi»yõÌÁLiNSLRiª«sVVÌÁV NRPÌÁ C aRP¸R…Vùƒ«sV {qs*NRPLjiLixmsoª«sVV. ¸R…VµR…ùµôR…ûª«sùª«sVxmspLRi*Li ¿RÁ xmsX´j…ªyùª«sVzqsò µR…VLýRi˳ÏÁLi e ®µ…[„s ˳ÏÁWFy²³R…ù˳Ü[gRiùLi ¿RÁ »R½µôR…ûª«sùLi ®µ…[„sgRiXx¤¦¦¦ù»yLi ee 41
ఓ మహాలక్ష్మి! ఈ భూమిలో అరుదుగా దొరుకునది, చాలా విచిత్రమైనది, రాజులు, ధనవంతులు మాత్రము అనుభవించునదియగు ద్రవ్యమును నీకు సమర్పింతును.
ద్రవ్యాణ్యతాని దత్వా వై మూలేన దేవపుంగవః | మూలం జజాప భక్త్యాచ దశలక్షం విధానతః || 42
జపేన దశలక్షేణ మంత్రసిద్ధిర్భభూవ హ | మంత్రశ్చ బ్రహ్మణా దత్తః కల్పవృక్షశ్చ సర్వదా || 43
దేవేంద్రుడుపై ద్రవ్యములన్నిటిని మూలమంత్రముచే మహాలక్ష్మికి సమర్పించి విధి విధానమున మూలమంత్రమును పదిలక్షలమార్లు భక్తితో జపించెను. పదిలక్షల జపమువలన మంత్రసిద్ధి అతనికి జరిగెను. కల్పవృక్షమువలె అన్ని కోరికలు తీర్చు ఈ మంత్రరాజమును బ్రహ్మదేవుడు దేవేంద్రునకుపదేశించెను.
లక్ష్మీర్మాయా కామవాణీ తతః కమలవాసినీ | స్వాహాంతో వైదికో మంత్రరాజోzయం ద్వాదశాక్షరః || 44
శ్రీం హ్రీం క్లీం, ఐం, కమలవాసిన్యై స్వాహా | కుబేరోzనేన మంత్రేణ సర్వైశ్వర్యమవాప్తవాన్ ||
రాజరాజేశ్వరో దక్షః సావర్ణిర్మనురేవ చ || 45
మంగళోzనేన మంత్రేణ సప్తద్వీపవతీ పతిః | ప్రియవ్రతోzత్తానపాదౌ కేదారో నృప ఏవ చ || 46
ఏతే చ సిద్ధా రాజేంద్రా మంత్రేణానేన నారద | సిద్ధే మంత్రే మహాలక్ష్మీర్దదౌ శక్రాయ దర్శనం || 47
లక్ష్మీ బీజమగు శ్రీం, మాయా బీజమంత్రమగు హ్రీం, కామబీజాక్షరమగు, క్లీం, సరస్వతీ బీజాక్షరమగు ఐం తరువాత చతుర్థీ విభక్త్యంతమైన కమలవాసినీ అనుపదము చివరకు స్వాహా అను పదముగల ద్వాదశాక్షరమంత్రము వైదికమైనది.
శ్రీం హ్రీం క్లీం, ఐ కమలవాసిన్యై స్వాహా అను మంత్రమును జపించి కుబేరుడు సమసై#్తశ్వర్యమును పొందెను. రాజరాజేశ్వరుడు, దక్షుడు, సావర్ణిమనువు, మంగళుడు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వీరందరు సిద్ధిపొందిరి.
దేవేంద్రుడు మహాలక్ష్మీ మంత్రమును సిద్ధిపొందగనే మహాలక్ష్మి అతనికి దర్శనమొసగును.
రత్నేంద్రవ్యూహ ఖచిత విమాన స్థావర ప్రదా | సప్తద్వీపవతీం పృథ్వీం ఛాదయంతీ త్విషాచసా || 48
శ్వేతచంపకవర్ణాభా రత్నభూషణ భూషితా | ఈషద్ధాస్య ప్రసన్నాస్యా భక్తానుగ్రహ కారికా || 49
బిభ్రతీ రత్నమాలాం చ కోటి చంద్రసమప్రభా | దృష్ట్యా జగత్ప్రసూంశాంతాం తుష్టావ పురందరః || 50
పులకాంకిత సర్వాంగః సాశ్రునేత్రః కృతాంజలి ః| బ్రహ్మణా చ ప్రదత్తేన స్తోత్రరాజేన సంయతః |
సర్వాభీష్టప్రదేనైవ వైదికేనైన తత్ర చ || 51
శ్రీమహాలక్ష్మి విలువగల రత్నములు గల విమానములో కూర్చొని ఏడు ద్వీపములుగల భూమిని తన శరీర కాంతితో కప్పుచు ప్రత్యక్షమైనది. ఆ దేవి వరముల నొసగునది, తెల్లని చంపకపుష్పము వంటి శరీరకాంతిగలది, రత్నభూషణములు అంకరించుకొనినది, చిరునవ్వుగల ముఖముతో, భక్తులననుగ్రహించు ఆ మహాలక్ష్మి చేతిలో రత్నముల మాలను ధరించును.
కోటి చంద్రుల కాంతిగల, జగములకన్నిటికి తల్లియగు ఆ మాతను ఇంద్రుడు దర్శించుకొని తన అవయవములు పులకించగా, కన్నీళ్ళు కారగా నమస్కరించెను. ఆ తరువాత సమస్తమైన కోరికలను తీర్చునది, వైదికమును, బ్రహ్మదేవునిచే ఉపదేశింపబడినది అగు మహాలక్ష్మీ స్తోత్రముచే ఆ దేవిని స్తుతించెను.
ఇంద్ర ఉవాచ - ఇంద్రుడు మహాలక్ష్మితో ఇట్లనెను-
ఓం నమః కమల వాసిన్యై నారాయణ్యౖ నమో నమః | కృష్ణప్రియాయై సారాయై పద్మాయై చ నమోనమః || 52
పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః | పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః || 53
సర్వసంపత్స్యరూపాయై సర్వదాత్య్రై నమోనమః | సుఖదాయై మోక్షదాయై సిద్ధిదాయై నమోనమః || 54
హరిభక్తి ప్రదాత్య్రై చ హర్షదాత్య్రై నమోనమః | కృష్ణవక్షస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః || 55
కృష్ణశోభా ప్వరూపాయై రత్నాఢ్యాయై నమోనమః | సంపత్త్యధిష్ఠాతృ దేవ్యై మహాదేవ్యై నమోనమః || 56
సస్యాధిష్ఠాతృ దేవ్యై చ సస్యలక్ష్మ్యై నమోనమః | నమో బుద్ధి స్వరూపాయై బుద్ధిదాయై నమోనమః || 57
వైకుంఠే చ మహాలక్ష్మీర్లక్ష్మీః క్షీరోద సాగరే | స్వర్గలక్ష్మీరింద్ర గేహే రాజలక్ష్మీః నృపాలయే || 58
గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహేచ గృహ దేవతా | సురభిస్సా గవాం మాతా దక్షిణా యజ్ఞకామినీ || 59
కమలవాసిని, నారాయణునకు ప్రియురాలు, శ్రీకృష్ణుని భార్య, పద్మ, తామరరేకులవంటి కన్నులు కలది, తామరవంటి ముఖము కలది, పద్మమున నివసించునది, పద్మిని, వైష్ణవి, నమస్తసంపదల స్వరూపము కలది. అన్ని కోరికలను తీర్చునది, సుఖమును, సిద్ధిని, మోక్షమునిచ్చునది, హరిభక్తిని, ఆనందమును ఒసగునది, శ్రీకృష్ణుని కాంతికలది, రత్నాలంకారములచే అలంకరించబడినది, సంపదలకన్నిటికీ అధిదేవత, మహాదేవి, సస్యములకు అధిష్ఠాన దేవత సస్యలక్ష్మీ, బుద్ధిరూప, బుద్ధినొసంగునది యగు మహాలక్ష్మికి అనేక నమస్కారములు.
నీవు వైకుంఠమున మహాలక్ష్మిగను, పాలసముద్రమున లక్ష్మిగాను, అమరావతిలోస్వర్గలక్ష్మిగను, రాజుల దగ్గర రాజలక్ష్మిగాను, గృహస్థలు దగ్గర గృహలక్ష్మిగాను వారి ఇండ్లలో గృహదేవతగాను, గోవులకు మాతయగు సురభిగాను, యజ్ఞ దేవతకు భార్యవైన దక్షిణగా ప్రసిద్ధిని పొందుచున్నావు.
అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే | స్వాహా త్వం చ హవిర్దానే కవ్యదానే స్వధాస్మతా || 60
త్వం హి విష్ణస్వరూపా చ సర్వాధారా వసుంధరా | శుద్ధసత్వస్వరూపా త్వం నారాయణ పరాయణా || 61
క్రోధహింసావర్జితా చ వరదా చ శుభాననా | పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదాపరా || 62
నీవు దేవమాతయగు అదితివి, కమలాలయమున కమలవు, నీవు విష్ణుస్వరూపగాను నారాయణుపై భక్తి కలదిగాను, కోపము హింస లేనిది, వరములిచ్చునది, ఇంపైన ముఖము కలది, పరమార్థమును హరి దాస్యమును ఇచ్చునదిగా కీర్తించెందితివి. యయా వినా జగత్సరం భస్మీభూతమసారకం | జీవస్మృతం చ విశ్వం చశవతుల్యం యయావినా || 63
యయా వినా న సంభాష్యో బాంధవైర్బాంధవః సదా || 64
త్వయాహీనో బంధుహీనస్త్వయా యుక్తః సబాంధవః - ధర్మార్థకామ మోక్షాణాం త్వం చ కారణరూపిణీ || 65
స్తనంధయానాం త్వం మాతా శిశూనాం శైశ##వే యథా | తథా త్వం సర్వదామాతా సర్వేషాం సర్వవిశ్వతః || 66
త్యక్తస్తనో మాతృహీనః స చోజ్జీవతి దైవతః | త్వయా హీనో జనః కోzపి నజీవత్యేవ నిశ్చితం || 67
సుప్రసన్న స్వరూపా త్వం మే ప్రసన్నా భవాంబికే | వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని || 68
ఓ దేవి! నీవు లేనిచో ఈ ప్రపంచమంతయు భస్మమైనట్లు సారరహితముగా, జీవించియున్నను మృతమైనట్లు శవమువలె తేజోహీనముగా కనిపించును. నీవు అందరికి పరదేవతవ. సమస్తబాంధవ స్వరూపిణివి. నీవు లేనిచో బంధువులు ఒకరికొకకరు మాటాడుకొనరు. నీవులేనిచో మానవుడు బందువువలు లేనివాడే. నీవున్నచో అతనికి నిజముగా బంధువులు లేకున్నను, ఏదోఒక విధముగా మానవులు బంధుత్వమును నెరపుదురు. ధర్మ, అర్థం, కామ , మోక్షములచే చతుర్వర్గములకు నీవే కారణమగుచున్నావు. పసితనమున స్తనంధయులగు శిశువులనుతల్లి ఏ విధముగా లాలించి పాలించునో అట్లే సమస్త విశ్వములను నీవు ఎల్లప్పుడు లాలించి పాలించుచున్నావు.
చంటిపిల్ల వానికి తల్లిలేకపోయినను అదృష్టమువలను ఆ శిశువు బ్రతుకవచ్చును. కానీ నీవు లేనిచో జనము అసలు బ్రతుకలేదు. అమ్మ! నీవు సుప్రసన్నవగునీవు నాకు ప్రసన్నురాలవు కమ్ము. శత్రువు లాక్రమించుకొనిన నా రాజ్యమును నీ అనుగ్రహము వలన పొందునట్లు చేయుము.
వయం యావత్త్వయా హీనా బంధుహీనాశ్చ భిక్షుకాః సర్వసంపద్విహీనాశ్చ తావదేవ హరిప్రియే || 69
రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి | కీర్తి దేహి ధనం దేహి పుత్రాన్మహ్యంచ దేహివై|| 70
కామం దేహి మతిం దేహి భోగాన్దేహి హరిప్రియే | జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితం || 71
సర్వాధికారమేవం వై ప్రభావం చ ప్రతాపకం | జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమేవ చ || 72
శ్రీహరికి ప్రియురాలైన ఓ తల్లీ నీవు లేనందువలన మేము ఆదుకొనువారులేక భిక్షుకులమైతమి. సమస్త సంపదలను కోల్పోతిమి. అందువలన ఓ తల్లీ! నాకు రాజ్యమును, లక్ష్మిని, బలమును, కీర్తిని, దనమును, కోరికను, తెలివిని, భోగములను, జ్ఞానమును, దర్మమును, సమస్త సౌభాగ్యములను, సమస్త అధికారములను, పరాక్రమమును, రణరంగమున జయమును. పరమైశ్వర్యమును ఒసగుమని దేవేంద్రుడు మహాలక్ష్మిని కోరెను.
ఇత్యుక్త్వా తు మహేద్రశ్చ సర్వైం సురగణౖః సహ | ననామ సాశ్రునేత్రోzయం మూర్ద్నా చైవ పునః పునః || 73
బ్రహ్మా చ శంకరశ్చై శేషో ధర్మశ్చ కేశవః | సర్వే చక్రుః పరీహారం సురార్థే చ పునః పునః || 74
మహేంద్రడు పైన చెప్పినట్లు మహాలక్ష్మికి దేవతలందరితో కలిసి కన్నీళ్ళు పెట్టుకొని అనేకమార్లు నమస్కారము చేసెను. బ్రహ్మ, శంకురుడు, ఆదిశేషుడు మొదలగు దేవతలందరు దేవేంద్రుని రక్షింపుమని అనేకమార్లు కోరిరి.
దేవేభ్యశ్చ వరం దత్వా పుష్పమాలాం మనోహరాం | కేశవాయ దదౌ లక్ష్మీః సంతుష్టా సురసంసది || 75
యయుర్దేవాశ్చసంతుష్టాః స్వంస్వంస్థానం చ నాదర | దేవీ య¸° హరేః క్రోడం హృష్టా క్షీరోదశాయినః || 76
యయతుస్తౌ స్వగృహం బ్రహ్మేశానౌ చ నారద | దత్వా శుభాశిషం తౌ చ దేవేభ్యః ప్రీతిపూర్వకం || 77
శ్రీమహాలక్ష్మి దేవతలకు వారు కోరిన వరమునిచ్చి ఆ దేవతల సమక్షముననే మనోహరమైన పుష్పమాలను కేశవుని మెడలో వేసెను.
దేవతలందరూ సతోషముతో తమ తమ ఇండ్లకు పోగా మహాలక్ష్మి శేషాశాయియైన కేశవుని వక్షఃస్థలమునలంకరించినది.
బ్రహ్మ, పరమశివుడు దేవతలకు శుభాశీస్సులను సంతోషముతో నొసగి తమ తమ స్థానములకు చేరుకొనిరి.
ఇదం స్తోత్రం మహాపుణ్యం త్రిసంధ్యం యః పఠేన్నరః | కుబేరతుల్యః సభ##వేత్ రాజరాజేశ్వరో మహాన్ || 78
సిద్ధస్తోత్రం యదిపఠేత్ సోzపి కల్పతరుర్నరః | పంచలక్షజపేనైవ స్తోత్రసిద్ధిః భ##వేత్ నృణాం || 79
సిద్ధిః స్తోత్రం యదిపఠేన్మాసమేకం చ సంయతః | మహాసుఖీ చ రాజేంద్రో భవిష్యతి న సంశయః || 80
ఈ మహాలక్ష్మీ స్తోత్రమును మూడు సంధ్యలలో చదువువాడు కుబేరునితో సమముగా ధనవంతుడు, చక్రవర్తి అగును.
ఐదులక్షలమార్లు ఈ స్తోత్రమును జపించినచో మంత్రసిద్ధి జరుగును. ఆ విధముగా సద్ధించిన స్తోత్రమును పఠించువాడు. కల్పవృక్షమువలె ఇతరులకు కోరినవన్నియు ఇచ్చును.
మంత్రసిద్ధింని పొందా ఈ స్తోత్రమును ఒక నెలవరకు దీక్షతో పఠించినవాడు రాజేంద్రుడై అనేక సుఖములను పొందును.
నారద ఉవాచ - నారదుడిట్లనెను-
పుష్పం దుర్వాససా దత్తమస్తి వై యస్య మస్తకే | తస్య సర్వాపురః పూజేత్యుక్తం పూర్వం త్వయాప్రభో || 81
తదేవ స్థాపితం పుష్పం గజేంద్రసై#్వవ మస్తకే | యతో జన్మ గణశస్య స చ మత్తో వనం గతః || 82
మూర్ద్ని ఛిన్నే గణపతేఃశ##నేర్దృష్ట్యా పురామునే | తత్‌స్కంధే యోజయామాస హస్తిమస్తం హరిః స్యయం || 83
అధునోక్తం దేవషట్కం సంపూజ్య చ పురందరః | పూజయామాస లక్ష్మీం చ క్షీరోదే చ సురైః సహా || 84
అహోపురాణవక్తృణాం దుర్భోధం వచనం నృణాం | సువ్యక్తమస్య సిద్ధాంతం వదవేదవిదాం వర || 85
ఇంతకు ముందు మీరు దుర్వాసుడు ఇచ్చిన పుష్పము ఎవరి శిరస్సుపై నుండునో అతనికి అందరికంటే ముందు పూజ జరుగునని చెప్పితిరి.
ఆ పుష్పమునే ఇంద్రుడు ఏనుగు శిరస్సుపై నుంచినందువలన మదించిన ఆ ఏనుగు అడవిలోకి వెళ్ళగా దానివలననే గణశుడు పుట్టినట్లు చెప్పితిరి. అట్లే పూర్వము శనిదృష్టి గణపతిపై పడినందువలన అతని శిరస్సును ఖండించినపుడు శ్రీహరి స్వయముగా ఏనుగు శిరస్సును గణపతి కతికించినట్లును చెప్పితిరి.
కాని ఇప్పడు దేవేంద్రుడు దేవతలతో కలిసి దేవషట్కమునగణపతిని మొదలు పూజించి మహాలక్ష్మిని పూజించినట్లు చెప్పితిరి.
పురాణము చెప్పువారిమాటలు గజిబిజిగా అర్థము కాకుండనున్నవి.
అందువల్ల దీనిని స్పష్టముగా నాకు వివరింపుడని నారాయణుని ప్రార్థించెను.
శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లు పలికెను-
యదాశశాప శక్రం చ దుర్వాసా మునిపుంగవః | తదా నాస్త్యేవ తజ్జన్మ పూజాకాలే బభూవః సః || 86
సుచిరం దుఃఖితా దేవా బభ్రముర్బ్రహ్మశాపతః | పశ్చాత్ప్రాపుశ్చ తాం లక్ష్మీం వరేణ చ హరేర్మునే || 87
నారదా! దుర్వాసుడు దేవేంద్రుని శపించినపుడు గణపతి పుట్టనేలేదు. అందువలన పూజాకాలమున ఆ గణపతికి అగ్రపూజయనునది జరుగలేదు.
ఇక దుర్వాసమహాముని శాపమువలన దేవతలు రాజ్యభ్రష్టులై చాలాకాలము దుఃఖించుచు తిరిగి చివరకు శ్రీహరి అనుగ్రహమువలన రాజ్యలక్ష్మిని పొందిరి.
ఇతి శ్రీబ్రహ్మ వైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే లక్ష్మీ పూజావిధానం నామ
ఏకోన చత్వారింశత్తమోzధ్యాయః
శ్రీలక్ష్మ్యుపాఖ్యానం సమాప్తం
శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండమున నారద నారాయణ సంవాదమున లక్ష్మీపూజా విధానమను
ముపై#్ప తొమ్మిదవ యధ్యాయము సమాప్తము.