sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

చత్వారింశత్తయోzధ్యాయః - స్వాహదేవి జన్మవృత్తాంతము

నారద ఉవాచ - నారదుడిట్లనెను.

నారాయణ మహాభాగ సమశ్చైవ త్వయా ప్రభో | రూపేణ చ గుణౖశ్చైవ యశసా తేజసా త్విషా || 1

త్వమేవ జ్ఞానినాం శ్రేష్ఠః సిద్ధానాం యోగినాం తథా | తపస్వినాం మునీనాం చ పరో వేదవిదాం తథా || 2

అన్యత్కించి దుపాఖ్యానం నిగూఢం వద సాంప్రతం | అతీవగోపనీయం యదుపయుక్తం చ సర్వతః || 3

శ్రీమన్నారాయణ! మహాభాగ! రూపమున, సుగుణములలో కీర్తియందు, తేజస్సున నీకు సమానుడు లేనేలేడు, జ్ఞానవంతులలో, సిద్ధులలో, యోగులయందు, తపస్వులలో వేదవేత్తలలో నీవే శ్రేష్ఠుడవు, నీవలన పరమాద్భుతమైన మహాలక్ష్మీ ఉపాఖ్యానమును వింటిని.

ఇకంను మిక్కిలి రహస్యముగానుండి అందరికి ఉపయోగపడు ఉపాఖ్యానము నొక్కదానికి నాకు వినిపింపుము.

శ్రీ నారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను-

నానాప్రకారమాఖ్యానం అప్రకాశ్యం పురాణతః| శ్రుతౌ కతివిధం గూఢమాస్తే బ్రహ్మన్‌ సుదుర్లభం || 4

తేషు యత్సారభూతం చ శ్రోతుం కిం వా త్వమిచ్ఛసి | తన్మేబ్రూహి మహాభాగ పశ్చాద్వక్షామి తత్పునః || 5

నారదా! వేదములలో అనేకవిధములైన అఖ్యానములు గూఢముగా నున్నవి. వాటిలో అనేకమైన ఉపాఖ్యానములను పురాణములు వవరించలేదు.

అందువలన నీకు వేదమునందు నిగూఢముగా ఉన్న ఆఖ్యానములలో ప్రధానమని తోచిన దానిని అడిగినచో నేను చెప్పెదను.

నారద ఉవాచ- నారదుడిట్లనెను-

స్వాహా దేవ హవిర్దానే ప్రశస్తా సర్వకర్మసు | పితృదానే స్వధా శస్తా దక్షిణా సర్వతో వరా || 6

ఏతాసాం చరితం జన్మఫలం ప్రాధాన్యమేవ చ | శ్రోతుమిచ్ఛామి తే వక్త్రాత్‌ వదవేదవిదాం వర || 7

శ్రీమన్నారాయణ! అగ్నికి హవిస్సునిచ్చునప్పుడు స్వాహా దేవి, కవ్యమును ఇచ్చునప్పుడు స్వధాదేవి. అన్ని కర్మలలో దక్షిణా దేవి శ్రేష్ఠురాలని అందురు. వీరి జన్మ, చరిత్ర, ప్రాధాన్యమును వినవలెనని అనుకొనుచున్నాను. అందువలన దయచేసి చెప్పుడు.

సౌతిరువాచ -సౌతి మహర్షి శౌనకునితో ఇట్లనెను-

నారదస్య వచః శ్రుత్వా ప్రహస్య మునిపుంగవః| కథాం కథితుమారేభే పురాణోక్తాం పురాతనీం || 8

నారదుని మాటలు విని నారాయణముని పురాణములందున్న ప్రాచీనమైన కథవనిట్లు చెప్పుటకు మొదలిడెను.

శ్రీనారాయణ ఉవాచ- శ్రీనారాయణుడిట్లనెను-

సృష్టేః ప్రథమతో దేవాశ్చాహారార్థం యయుః పురా| బ్రహ్మలోకే బ్రహ్మ సభామగమ్యాం సుమనోహరాం || 9

గత్వా నివేదనం చక్రుర్మునే త్వాహార హేతుకం | బ్రహ్మ శ్రుత్వా ప్రతిజ్ఞాయ సిషేవే శ్రీహరేః పదం || 10

యజ్ఞరూపో హి భగవన్‌ కళయా చ బభూవ సః | యజ్ఞే యద్యద్ధవిర్దానం దత్తం తేభ్యశ్చ వేధసా || 11

హవిర్దదతి విప్రాశ్చ భక్త్యా చ క్షత్రియాదయః | సురానైన ప్రాప్నువంతి తద్దానం మునిపుంగవ || 12

సృష్టిప్రారంభకాలమున దేవతలు ఆహారమునకై ఎవ్వరు చేరలేని బ్రహ్మసభకు వెళ్ళి ఆహార విషయమున తమకున్న బాధలను నివేదించుకొనిరి. బ్రహ్మదేవుడు వారి మాటలు విని దేవతలకు మేలు చేయుదునని చెప్పి శ్రీహరి నివసించు వైకుంఠమునకు వెళ్ళి శ్రీహరిని సేవించెను. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అంశ##చే యజ్ఞరూపుడాయెను. ఆ యజ్ఞమున బ్రహ్మదేవుడొసగిన హవిస్సులను ఆయా దేవతలు పొందిరి. కాని బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు భూలోకవాసులిచ్చిన హవిస్సులు మాత్రము దేవతలకు అందలేదు.

దేవా విషణ్ణా స్తే సర్వే తత్సభాం చ పునర్యయుః | గత్వానివేదనం చక్రు రాహారాభావ హేతుకం || 13

బ్రహ్మా శ్రుత్వా తు మనసా శ్రీకృష్ణం శరణం య¸° | ప్రకృతిం పూజయామాస ధ్యాయన్నేవ తదాజ్ఞయా || 14

ప్రకృతిః కళయా చైవ సర్వశక్తి స్వరూపిణీ | బభూవ దాహికాశక్తిః అగ్నేః స్వాహాస్వరూపిణీ || 15

అందువలన దేవతలు మరల దుఃఖించుచు బ్రహ్మదేవుని సభకు పోయి తమకు ఆహారము దొరుకుచులేదని విన్నవించిరి. బ్రహ్మదేవుడు వారి మాటలు విని దయదలచి శ్రీకృష్ణని ధ్యానించుచునే అతని ఆజ్ఞననుసరించి ప్రకృతిని పూజించెను. సర్వశక్తి స్వరూపిణియగు ఆ ప్రకృతి తన అంశస్వరూపముతో అగ్నియొక్క దాహికా శక్తి ''స్వాహా'' రూపమున ఆవిర్భవించినది.

గ్రీష్మమధ్యాహ్నమార్తండ ప్రభాన్యక్కార కారణీ | అతీవసుందరీ రామా రమణీయా మనోహరా || 16

ఈషద్ధాస్య ప్రసన్నాస్యా భక్తానుగ్రహకారిణీ |ఉవాచేతి విధేంగ్రే పద్మయోనే పరం వృణు || 17

విధిస్తద్వచనం శ్రుత్వా సంభ్రమాత్సమువాచ తాం || 18

స్వాహాదేవి గ్రీష్‌మకాలమందలి మధ్యాహ్న సూర్యునికన్న మిన్నయైన కాంతితో చిరునవ్వుగల ముఖముతో భక్తులను అనుగ్రహించునదై బ్రహ్మదేవుని వరము వేడుకొమ్మని కోరినది.

స్వాహాదేవియొక్క మాటలు విని బ్రహ్మదేవుడు ససంభ్రమముగా ఆమెతోనిట్లనెను.

బ్రహ్మోవాచ-బ్రహ్మదేవుడిట్లు పలికెను.

త్వమగ్నేర్దాహికాశక్తిర్భవపత్నీ చ సుందరీ | దగ్ధుం న శక్తః స్వహుతం హుతాశశ్చ త్వయా వినా || 19

త్వన్నామోచ్చార్య మంత్రాంతే యుద్ధాస్యతి హవిర్నరః | సురేభ్యస్తత్ప్రాప్నువంతి సురాః సానం ద పర్వకం || 20

అగ్నేః సంపత్స్యరూపా చ శ్రీరూపా చ గృహేశ్వరీ | దేవానాం పూజితా శశ్వన్నరాదీనాం భవాంబికే || 21

బ్రహ్మణశ్చ వచః శ్రుత్వా సా విషణ్ణా బభూవ హ | తమువాచ స్వయం దేవీ స్వాభిప్రాయం స్వయంభువం || 22

ఓ స్వాహాదేవీ! నీవు అగ్నియొక్క దాహిక శక్తివి. అందమైన దానవు. అతనికి భార్యవుకమ్ము నీవే లేనిచో అగ్ని దేవుడు తనకు సమర్పింపబడ్డ హవిస్సులను దగ్ధము చేసికొనలేడు. మంత్రము యొక్క చివర నీ పేరును (స్వాహా) ఉచ్చరించి దేవతలకు మానవులు సమర్పించిన హవిస్సులను దేవతలు ఆనందముతో స్వీకరింతురు. నీవు అగ్నియొక్క సంపదవు. శ్రీ రూపమైన గృహిణివి. ఓ తల్లీ నిన్ను ఎల్లప్పుడు దేవతలు, మానవులు పూజింతురు అని బ్రహ్మదేవుడనగా స్వాహాదేవి విచారవదనముతో నిట్లనెను.

స్వాహోవాచ- స్వాహాదేవి ఇట్లనెను-

అహం కృష్ణంభజిష్యామి తపసా సుచిరేణ చ | బ్రహ్మన్‌ తదన్యద్యత్కించిత్‌ స్వప్నవద్భ్రమ ఏవ చ || 23

విధాతా జగతాం త్వం చ శంభు ర్మ్రుత్యుంజయః ప్రభుః | బిభర్తి శేషో విశ్వం చ ధర్మః సాక్షీ చ దేహినాం || 24

సర్వాదద్యపూజ్యో దేవానాం గణషు చ గణశ్వరః | ప్రకృతిః సర్వనూః సర్వే పూజితాయత్ప్రసాదతః|| 25

ఋషయో మునయశ్చైవ పూజితా యం నిషేవ్య చ | తత్సాదపద్మం బ్రహ్మైక్యభావాద్వై చింతయామ్యహం || 2 6

ఓ బ్రహ్మదేవుడా! నేను చాలాకాలము తపస్సుచేయుచు శ్రీకృష్ణుని సేవించుచున్నాను. శ్రీకృష్ణుడు తప్ప మిగిలిన ప్రపంచమంతయు స్వప్నములవలె కరిగిపోవును. ఆశాశ్వతమైనది. అన్ని లోకములకు సృష్టికర్తవగు నీవు, మృత్యుంజయుడైన శంకరుడు. ఈ విశ్వమున తన పడగలపై మోయుచున్న ఆదిశేషుడు. ప్రాణులు చేయు కర్మలకు సాక్షియగు ధర్మదేవత, దేవతలందరిలో ఆదిపూజను పొందు గణపతి. ఈ ప్రపంచమంతయు తల్లియైన స్రకృతి. వీరందరు ఆ శ్రీకృష్ణుని అనుగ్రహమువలననే పూజలందుకొనుచున్నారు. అట్లే ఆ మహామహుని సేవించి ఋషులు, మునులు గౌరవింపబడుచున్నారు.

పరబ్రహ్మమునందు ఐక్యము కావలెననని నేను శ్రీకృష్ణుని పదపంకజములను ధ్యానించుచున్నాను.

పద్మాస్యా పాద్మమిత్యుక్త్వా పద్మలాభానుసారతః | జగామ తపసే పాద్మే పద్మాధీశస్య పద్మజా || 27

అపస్తేపే లక్షవర్షం ఏకపాదేన పద్మజా | తదా దదర్శ శ్రీకృష్ణం నిర్గుణం ప్రకృతేః పరం || 28

అతీవ కమనీయం చ రూపం దృష్ట్యాతిసుందరీ | మూర్ఛాం సంప్రాప కామేన కామేశస్య చ కాముకీ || 29

విజ్ఞాయ తదభిప్రాయం సర్వజ్ఞస్తామువాచ హ | స్వక్రోడే చ సముత్థప్య క్షీణాంగీం తపసా చిరం || 30

తామరపువ్వు వంటి ముఖముగల స్వాహాదేవి బ్రమ్మదేవునితో నిట్లని. శ్రీకృష్ణునికై తపస్సు చేయుటకు పోయెను. ఆమె ఒంటికాలుపై నిలుచుండి లక్షసంవత్సరములు తపస్సు చేసెను. ఆప్పుడామె నిర్గుణ స్వరూపి, ప్రకృతికంటె శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుని దర్శించుకొనగలిగెను. శ్రీకృస్ణుని రూపమతిసుందరము కాన అతనిని చూడగనే కామముతో మూర్చనొందెను.

మూర్ఛపడిన స్వాహాదేవి మనోభావమును తెలిసికొన్న సర్వజ్ఞుడు తపస్సుచే కృశించిపోయిన స్వాహాదేవిని తన అంకమున ఉంచుకొని ఆమెతో ఇట్లనెను.

శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లు పలికెను-

వరాహే చ త్వమంవేన మమపత్నీ భవిష్యసి | నామ్నా నాగ్నజితీ కన్యాకాంతే నగ్నజితస్య చ || 31

అధునాzగ్నేర్ధాహికా త్వం భవ పత్నీ చ భావిని | మంత్రాంగరూపా పూతా చ మత్ప్రసాదాద్భవిష్యసి || 32

వహ్నిస్త్వాం భక్తిభావేన సంపూజ్య చ గృహేశ్వరీం | రమిష్యతే త్వయా సార్థం రామయా రమణీయమా || 33

ఓ స్వాహాదేవీ! భావికాలమున శ్వేతవరాహ కల్పమున నీ అంశతో నీవు నాగ్నజితి యనుపేర నా భార్యవగుదువు. ఇప్పుడు నీవు దాహికాశక్తిగా అతని భార్యగా నుందువు. నా అనుగ్రహమువలన నీవు మంత్రాంగరూపవై పవిత్రురాలవగుదువు. అగ్నిదేవుడు నిన్ను భక్తిభావముచే గౌరవించి గృహేశ్వరివగు నీతో రమించును.

ఇత్యుక్త్వాంతర్దధే దేవో దేవీ మాశ్వాస్య నారద | తత్రాజగాను సంత్రస్తో వహ్నిర్బ్రహ్మని దేశత ః || 34

ధ్యానైశ్చ సామవేదోక్తైః ధ్యాత్వా తాం జగదంబికాం | సంపూజ్య పరితుష్టావ పాణిం జగ్రాహ మంత్రత || 35

తదా దివ్యం వర్షశతం సరేమే రామయా సహ | అతీవనిర్జనే రమ్యే సంభోగసుఖదే సదా || 36

బభూవ గర్భం తస్యాశ్చ హుతాశ##సై#్యవ తేజసా | తద్దధార చ సా దేవీ దివ్యం ద్వాదశవత్సరం || 37

తతః సుషావ పుత్రాంశ్చ రమణీయాన్మనోహరాన్‌ | దక్షిణాగ్నిర్గార్హ పత్యాహవనీయాన్‌ క్రమేణ చ || 38

శ్రీకృష్ణుడు తన్ను పూజించిన స్వాహాదేవితో పైవిధముగాపలికి, ఆమెను ఓదార్చి అంతర్ధానమునొందెను.

బ్రహ్మదేవుని ఆజ్ఞవలన అచ్చటకు అగ్నిదేవుడు వచ్చి స్వాహాదేవిని సామవేదముననున్న ధ్యానమంత్రములచే ధ్యానించి గౌరవించి మంత్రపూర్వకముగానామెను వివాహము చేసికొనెను.

అగ్నిదేవుడు సంపూర్ణముగా నిర్జనమైన వనమున దివ్యమైన వర్షశతము తన భార్యతో సుఖముగానుండెను. అప్పుడామెకు గర్భమాయెను. ఆ గర్భమును స్వాహాదేవి దివ్యమైన పన్నెండు సంవత్సరములు మోసి దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, అహవనీయాగ్ని అను ముగ్గురు పుత్రులను కనెను.

ఋషయో మునయశ్చైవ బ్రాహ్మణాః క్షత్రియాదయః | స్వాహాంతం మంత్రముచ్చార్య హవిర్దదతి నిత్యశః || 39

స్వాహాయుక్తం చ మంత్రం చ యో గృహ్ణాతి ప్రశస్తకం | సర్వసిద్ధిర్భవేత్తస్య బ్రహ్మన్‌ గ్రహణ మాత్రతః || 40

విషహీనో యథాసర్పోవేదీహినో యథాద్విజః | పతిసేవా విహీనా స్త్రీ విద్యాహీనో యథానరః || 41

ఫల శాఖా విహీనశ్చ యథావృక్షోహి నిందతః | స్వాహహీనస్తథా మంత్రో న దృతం ఫలదాయకః || 42స

పరితుష్టాః ద్విజాః సర్వే సంప్రాపు రాహుతిం | స్వాహాంతేనైన మంత్రేణ సఫలం సర్వకర్మ చ|| 43

అప్పటినుంచి ఋషులు, మునులు, బ్రాహ్మణాదు లందరు మంత్రముయొక్క చివర స్వాహాకారమును చేసి ప్రతిదినము అగ్నియందు హవిస్సుల నొసగుచున్నారు.

మంత్రము స్వాహాకారాంతమైనచో అది ప్రశస్తమగుచున్నది. దానివలన సమస్తసిద్ధులు కలుగును.

స్వాహాకారములేని మంత్రము విషములేని సర్పమువలె వేదములు నేర్వని ద్విజునివలె, పతిసేవ చేయని స్త్రీవలె, విద్యాగంధములేని మానవునివలె పండ్లకొమ్మలు లేని చెట్టువలె పనికిరానిది.

ద్విజులందరు సంతుష్టులై స్వాహాకారంతమైన మంత్రములనుచ్చరించుచు ఆహుతుల నివ్వసాగిరి. సమస్త యజ్ఞ కర్మలు స్వాహాంతమైన మంత్రములవలననే సఫలమగుచున్నవి.

ఇత్యేవం వర్ణితం సర్వం స్వాహోపాఖ్యానముత్తమం | సుఖదం మోక్షదం సారం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 44

ఈ విధముగ మోక్షమును సుఖమునిచ్చు స్వాహోపఖ్యానమును నీకు తెలిపితిని. ఇంకను వినవలసినదేమైన ఉన్నచో అడుగుము.

నారద ఉవాచ- నరదుడిట్లనెను

స్వాహాపూజావిధానం చ ధ్యానం స్తోత్రం మునీశ్వర | సంపూజ్య వహ్నిస్తుష్టావ యేన తాం వదమేప్రభో || 45

అగ్నిదేవుడు స్వాహాదేవిని ఏవిధముగా స్తుతించి పూజించెను. ఆ పూజావిధానమును, ధ్యానమును, స్తోత్రమును, నాకు తెలుపుడని నారాయణునితో అనెను.

ƒyLS¸R…Vßá Dªy¿RÁc ORPQª«sVƒyõLS¸R…VßáV²T…ÈýÁ®ƒsƒ«sVc

ధ్యానం చ సామవేదోక్తం స్తోత్రం పూజావిధానకం | వదామి శ్రూయతాం బ్రహ్మన్‌ సావధానం నిశామయ|| 46

సర్వయజ్ఞారంభకాలే శాలగ్రామే ఘటేzథవా | స్వాహం సంపూజ్య యత్నేవ యజ్ఞం కుర్యాత్ఫలాప్తయే|| 47

స్వాహాం మంత్రాంగ భూతాం చ మంత్రసిద్ధి స్వరూపిణీం | సిద్ధాంచ నౄణాం కర్మణాం ఫలదాం భ##జే | | 48

ఇతి ధ్యాత్వ చ మూలేన దత్వా పాద్యాదికం నరః | సర్వసిద్ధిం లభేత్‌ మూలం స్తోత్రంముంచే శ్రుణు || 49

నారదా! సామవేదమునందున్న స్వాహాదేవి ధ్యానమును స్తోత్రమును పూజావిధానమును సావధానముగా వినుము.

సమస్తయజ్ఞములు ప్రారంభించునపుడు సాలగ్రామమున లేక కలశమందు స్వాహాదేవిని ఆవాహనచేసి ఆరాధించి యజ్ఞమును చేయవలెను.

మంత్రసిద్ధి స్వరూపిణీ, మంత్రమునకు అంగభూతమైనది, స్వయముగా సిద్ధస్వరూపము కలది, మానవులకు సిద్ధిని కలిగించునది సమస్త కర్మలయొక్క ఫలితములనిచ్చు స్వాహాదేవిని ధ్యానింతునని ధ్యానించి మూలమంత్రముచే పాద్యాది ఉపచారములనొసగి స్తోత్రము చేయవలెను.

ఇక స్వాహాదేవియొక్క మూలమంత్రమును, స్తోత్రమును నీవు వినుమని నారదునితో అనెను.

''ఓం హ్రీం శ్రీం వహ్నిజాయా యై దేవ్యై స్వాహేత్యనేన చ | యః పూజయేచ్ఛతాం దేవీం సర్వేష్టం లభ##తే ధ్రువం || 50

''ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహా'' అనుమూల మంత్రముచే స్వాహాదేవిని పూజించువాడు అన్ని కోరికలను పొందును.

వహ్నిరువాచ- అగ్నిదేవుడిట్లనెను-

స్వాహాzద్యా ప్రకృతేరంశా మంత్ర తంత్రాంగరూపిణీ | మంత్రాణాం ఫలదాత్రీ చ ధాత్రీచ జగతాం సతీ || 51

సిద్ధిస్వరూపా సిద్ధా చ సిద్ధిదా సర్వదానృణాం | హుతాశదాహికాశక్తిః తత్ప్రాణాధిక రూపిణీ || 52

సంసారసారరూపా చ దేవపోషన్‌ కారిణీ || 53

షోడశైతాని నామాని యః పఠేద్భక్తి సంయుతః | సర్వసిద్ధిర్భవేత్తస్య చేహలోకే పరత్ర చ || 54

నాంగహీనో భ##వేత్తస్య సర్వర్మసు శోభనం | అపుత్రో లభ##తే పుత్రమభార్యో లభ##తే ప్రియాం || 55

స్వాహా, ఆది ప్రకృతి యొక్క అంశ, మంత్రతంత్రాంగ రూపిణీ, మంత్రములయొక్క ఫలితము నొసగునది, లోకములనన్నిటిని భరించునది, సిద్ధిస్వరూప, సిద్ధ, మానవులకెల్లప్పుడు సిద్ధిని చేకూర్చునది, అగ్నియొక్క దాహికాశక్తి, అగ్నికి ప్రాణముల కంటె ఎక్కువ ప్రియమైనది. సంసార సారరూప, భయంకరమైన సంసారమునుండి కడకు చేర్చునది, దేవతలకు ప్రణరూపమైనది, దేవతలను పోషించునది అను స్వాహాదేవియొక్క పదహారు పేర్లను భక్తితో ప్రతిదినము పఠించినవానికి ఇహపరలోకములలో సమస్త సిద్ధులుకలుగును. అన్నిపనులలో మంచి జరుగును. పుత్రులు లేనివారికి పుత్రులు, భార్యలేనివానికి భార్య లభించును.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వతీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే స్వాహోపాఖ్యానే

స్వాహాజన్మాధికథనం నామ చత్వారింశత్తయోzధ్యాయః |

ఇతి స్వాహోపాఖ్యానం సమాప్తం

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదైన ప్రకృతిఖండములో నారదనారాయణ సంవాదములో తెలుపబడిన స్వాహోపాఖ్యానములో స్వాహాదేవి జన్మాది వృత్తాంతమును తెలుపు

నలభయ్యవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters