sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకచత్వారింశత్తమ్శోధ్యాయః - స్వధాదేవి జన్మ మరియు పూజావిధానం నారాయణ ఉవాచ - నారాయణుడిట్లనెను - శ్రుణునారదవక్ష్యామి స్వధోపాఖ్యానముత్తమం | పితౄణాం వై తృప్తికరం శ్రాద్ధానాం ఫలవర్ధనం || 1 సృష్టేరాదౌ పితృగణాన్ ససర్జ జగతాం విధిః | చతురోవై మూర్తిమతః త్రీంశ్చ తేజః స్వరూపిణః || 2 సప్తదృష్ట్యా పితృగణాన్ సిద్ధి రూపాన్మనోహరాన్ | ఆహారం ససృజే తృషాం శ్రాద్ధ తర్పణపూర్వకం || 3 స్నానం తర్పణపర్యంతం శ్రాద్ధాంతం దేవపూజనం | అహ్నికం చ త్రిసంధ్యాంతం శ్రాద్ధాంతం దేవపూజనం || అహ్నికం చ త్రిసంధ్యాంతం విప్రాణం చశ్రుతౌ శ్రుతం || 4 నిత్యం న కుర్యాద్యో విప్రస్త్రిసంధ్యం శ్రాద్ధ తర్పణం | బలిం వేదధ్వనిం సోzపి విషహీనో యథోరగః || 5 హరిసేవావిహీనశ్చ శ్రీహరే రనివేద్యభుక్ | భస్మాంతం సూతకం తస్య న కర్మార్హః స నారద || 6 నారదా! నీకిప్పుడు స్వధా చరిత్రను చెప్పుదును. ఇది పితృదేవతలకు తృప్తిని కలిగించును. శ్రాద్ధఫలమును పెంపొందించును. సృష్టిప్రారంభమున బ్రహ్మదేవుడు పితృగణమును సృష్టించెను. వారిలో నలుగురికి శరీరమున్నది. తక్కిన ముగ్గురు తేజోరూపులు, బ్రహ్మదేవుడు ఈ ఏడుగురు పితృగణమును సృష్టించి వారికి శ్రాద్ధ తర్పణపూర్వకమైన ఆహారమును సృష్టించెను. తర్పణాంతమైన స్నానమును, శ్రాద్ధంతమైన దేవతాపూజను, త్రికాల సంధ్యాంతమైన ఆహ్నికకర్మను బ్రహ్మణుడు చేయవలెనని వేదములలో కలదు త్రిసంధ్యాకాలములందు శ్రాద్ధమును, తర్పణమును, బలిని, వేదపఠనమును (స్వాధ్యాయము) చేయని బ్రాహ్మణుడు విషమలేని పామువంటివాడు. శ్రీహరి సేవ చేయక శ్రీహరికి పెట్టిన నైవేద్యమును తినని బ్రాహ్మణునకు చనిపోవువరకు సూతకము (అశోచకం) ఉండును. అందువలన అతడు వైదిక కర్మలు చేయుటకు ఏమాత్రము అర్హుడు కాడు. బ్రహ్మ శ్రాద్ధా దికం సృష్ట్యా జగామ పితృహేతవే | న ప్రాప్నువంతి పితరో దదతి బ్రాహ్మణాదయః || 7 సర్వే ప్రజగ్ముః క్షుధితాః విషణ్ణాః బ్రహ్మణః సభాం | సర్వే నివేదనం చక్రుస్తమేవ జగతాం విధం || 8 బ్రహ్మా చ మానసీం కన్యాం ససృజే తాం మనోహరాం | రూప¸°వన సంపన్నాం శరచ్చంద్రసమప్రభాం || 9 విద్యావతీం గుణవతీమపి రూపవతీం సతీం | శ్వేతచంపక వర్ణాభాం రత్నభూషణ భూషితాం || 10 విశుద్ధాం ప్రకృతేరంశాం సస్మితాం వరదాం శుభాం | స్వధాభిధానం సుదతీం లక్ష్మీం లక్షణసంయుతాం || 11 శతపద్మపదన్యస్తపాదపద్మం చ బిభ్రితం | పత్నీం పితౄణా పద్మాస్యాం పద్మజాం పద్మలోచనా || 12 పితృభ్యస్తాం దదౌ కన్యాం తుష్టేభ్యస్తుష్టిరూపిణీం | బ్రాహ్మణానాం చోపదేశం చక్రే వై గోపనీయకం|| 13 బ్రహ్మదేవుడు పితృదేవతల ఆహారార్థమై శ్రాద్ధ తర్పణములు సృష్టించినను. బ్రహ్మణులు పిండములు మొదలగు వాటిని ఇచ్చచున్నను, పితృదేవతలకవి దక్కలేదు. అందువలన పితృదేవతలందరు ఆకలితో బాధపడుచు బ్రహ్మదేవుని సభకు వెళ్ళి అక్కడ తమ బాధను విన్నవించుకొనిరి అప్పుడు బ్రహ్మదేవుడు సుమనోమర, రూప¸°వన సంపన్న శరత్కాలచంద్రునివంటి కాంతిగలది, విద్య, సుగుణములు, రూపము కలది, రత్నభూషణములు కలది, పరిశుద్ధమైనది, వరములనిచ్చునది, మంచి లక్షణములు కలది అగు స్వధా అను కన్యను మనస్సనుండి సృష్టించెను. పద్మములవంటి పాదముల, ముఖముకల స్వధాదేవిని పితృదేవతలకు భార్యగా బ్రహ్మదేవుడిచ్చెను. స్వధాంతం మంత్రముచార్య పితృభ్యో దేహి చేతి చ | క్రమేణ తేన విప్రాశ్చ పిత్రే దానం దదః పురా || 14 స్వధాకరాంతమైన మంత్రమునుచ్చరించి పితృదేవతలకు పిండము మొదలుగువానిని ఇవ్వవలయునని బ్రాహ్మదేవుడు బ్రాహ్మణులకు రహస్యముగా ఉపదేశించును. ఆనాటినుండి బ్రహ్మణులు పితృదేవతలకు పిండాది దానము స్వధాకారాంతముగ చేయుచుండిని. స్వాహా శస్తా దేవదానే పితృదానే స్వధా వధ - సర్వత్ర దక్షిణా శస్తా హతో యజ్ఞస్యతదక్షిణః || 15 పితరొ దేవతా విప్రా మునయో మనవాస్తథా | పూజాం చక్రుః స్వధాం శాంతాం తుష్టావ పరమాదరం || 16 దేవాదయశ్చ సంతుష్టాః పరిపూర్ణమనోరథాః | విప్రాదయశ్చ పితరః స్వధాదేవీవరేణ చ || 17 దేవతలకు ఆహులులిచ్చునపుడు మంత్రాంతమందు స్వాహాకారమును ప్రయోగించుట శ్రేష్ఠము. అట్లే పితృదేవతలకు పిండదానము చేయునపుడు స్వధాకారాంతముగా చేయుట మంచిది. దేవపితృయజ్ఞములందు దక్షిణ తప్పక ఈయవలెను. దక్షిణలేని యాగము సఫలము కాదు. స్వధాదేవియొక్క వరమువలన దేవతలు, పితరులు, బ్రాహ్మణులు మొదలగువారందరు సంతోషమును పొందిరి. ఇత్యేవం కథితం సర్వం స్వధోపాఖ్యాన ముత్తమం | సర్వేషాం వై తుష్టికరం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 18 నారదా! ఇంతవరకు నీకు స్వధాదేవి చరిత్రను చెప్పితిని. ఇంకను నీవు వినవలసినదేదైన ఉన్నచో అడుగుము. అని నారాయణుడనెను. నారద ఉవాచ-నారదుడిట్లనెను- స్వధాపూజావిధానం చ ధ్యానం స్తోత్రం మహామునే | శ్రోతుమిచ్ఛామి యత్నేన వరవేదవిదాం వర || 19 శ్రీమన్నారాయణ! నాకు స్వధాదేవియొక్క పూజావిధానమును ధ్యానము, స్తోత్రపద్ధతిని వినవలెనని యున్నది. వేదార్థ విజ్ఞానవేత్తలలో శ్రేష్ఠుడా నాకు వీటిని వివరింపుము. నారాయణ ఉవాచః నారాయణుడిట్లనెను- తద్ధ్యానం స్తవనం బ్రహ్మన్ వేదోక్తం సర్వసమ్మతం | సర్వం జానాసి వక్ష్యే వై జ్ఞాతుమిచ్ఛసి వృద్ధయే || 20 శరత్కృష్ణత్రయోదశ్యాం మఘాయాం శ్రాద్ధవాసరే | స్వధాం సంపూజ్య యత్నేన తతః శ్రాద్దం సమాచరేత్ || 21 స్వధాం నాzభ్యర్చ్య యోవిప్రః శ్రాద్ధం కుర్యాదహంమతిః | నభ##వేత్ఫలభాక్సత్యం శ్రాద్ధతర్పణయోస్తథా || 22 నారదా!స్వధాదేవి ధ్యానము, స్తోత్రము వేదములలో చెప్పబడినది. అది నీకు కూడ తెలియును. అయినను జ్ఞానవృద్ధికై తెలిసికోదలచితివి కావున చెప్పుదును. శరదృతువులోని అశ్వయుజ?కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రమునాడు, కానిచో శ్రాద్ద దినమున స్వధాదేవిని పూజించి శ్రాద్దమునాచరింపవలెను. బ్రాహ్మణుడు అహంకారముతో శ్రాద్ధమునాడు స్వధాదేవిని పూజింపక శ్రాద్ధమును చేసినచో అతనికి శ్రాద్ధతర్పణముల ఫలితము లభింపదు. బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వత్ సుస్థిర ¸°వనాం | పూజ్యాం పితౄణాం దేవానాం శ్రాద్ధానాం ఫలదాంభ##జే || 23 ఎల్లప్పుడు సుస్థిరమైన ¸°వనము కలది, పితృదేవతలకు దేవతలకు పూజ్యురాలు, శ్రాద్ధఫలితము నొసగునది అగు బ్రహ్మమానస పుత్రికను (స్వధాదేవిని) నమస్కరించుచున్నాను. ఇతి ధ్యాత్వా ఘటేరమ్యే శాలగ్రామేzథవా శుభే | దద్యాత్పాద్యాదికం తసై#్య మూలేనేతి శ్రుతౌ శ్రుతం || 24 ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహేతి చ మహామనుం | సముచ్చార్య చ సంపూజ్యస్తుత్వా తాం ప్రణమేద్ద్యిజః || 25 ఈవిధముగా స్వధాదేవిని రమ్యమైన కలశమున, లేక సాలగ్రామశిలయందు ఆవాహనముచేసికొని ధ్యానించి మూలమంత్రముతో పాద్యము మొదలగు ఉపచారములను సమర్పించవలెను. "ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యైస్వాహా" అను మూలమంత్రముచే ఆమెను పూజించి స్తోత్రము చేసి నమస్కరింపవలెను. స్తోత్రం శ్రుణు మునిశ్రేష్ఠ బ్రహ్మపుత్ర విశారద | సర్వవాంఛాప్రదం నృణాం బ్రహ్మదాయత్కృతం పురా || 26 బ్రహ్మపుత్రుడవగు నారదా! మానవులయొక్క సమస్త వాంఛలను తీర్చునది, బ్రహ్మదేవుడు చేసిన స్వధాస్తోత్రమును వినుము. బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను- స్వధోచ్ఛారణమాత్రేణ తీర్థస్నాయీ భ##వేన్నరః | ముచ్యతే సర్వపాపేభ్యో వాజపేయఫలం లభేత్ || 27 స్వధాస్వధా స్వధేత్యేవం యదివారత్రయం స్మరేత్ | శ్రాద్ధస్యఫలమాప్నోతి కాలతర్పణయోస్తథా || 28 శ్రాద్ధకాలే స్వధాస్తోత్రం యః శ్రుణోతి సమాహితః |లభేత్ శ్రాద్ధశతానాం చ పుణ్యమేవ న సంశయః || 29 స్వధాస్వధా స్వధేత్యేవం త్రిసంధ్యం యః పఠేన్నరః | ప్రియాం వినీతాం స లభేత్సాధ్వీం పుత్రగుణాన్వితాం || 30 పితౄణాం ప్రాణతుల్యా త్వం ద్విజ జీవన రూపిణీ | శ్రాద్ధాధిష్ఠాతృదేవీ చ శ్రాద్ధాదీనాం ఫలప్రదా || 31 బహిర్మన్మసో గచ్ఛ పితౄణాం తుష్టిహేతవే | సంప్రీతయో ద్విజాతీనాం గృహిణాం వృద్ధిహేతవే || 32 నిత్యా నిత్యస్వరూపాzసి గుణరూపాzసి సువ్రతే | ఆవిర్భావస్తిరోభావః సృష్టౌ చ ప్రళ##యే తవ || 33 స్వధాశబ్దమునుచ్చరించినంత మాత్రమున మానవుడు పుణ్యతీర్థములందు స్నానముచేసిన ఫలమును పొందును. అతని సమస్త పాపములు తొలగిపోవును. వాజపేయయాగము చేసిన ఫలమును పొందును. స్వధాస్వధా స్వధా యని మూడు మార్లు ఉచ్చరించినంతమాత్రమున శ్రాద్ధఫ లితమును, సకాలమున తర్పణ చేసిన ఫలమును పొందును. శ్రాద్ధసమయమున స్వధాస్తోత్రమును విన్నవాడు నూరు శ్రాద్ధములు చేసిన పుణ్యమును పొందును. స్వధాయని మూడుమార్లు ప్రతిదినము పఠించినచో భార్యారహితుడు మంచిభార్యను పొందును. నీవు పితృదేవతలకు ప్రాణముతో సమానురాలవు. బ్రహ్మణ క్షత్రియ వైశ్యులకు ప్రాణమువంటిదానివి. శ్రాద్ధమునకు అధిష్ఠాన దేవతవు. శ్రాద్ధుదుల ఫలితము నొసగుదానవు. పితృదేవతలకు సంతోషమునకై ద్విజాతుల సంప్రీతికై గృహస్థుల అభివృద్థికై నీవు బయటకు రమ్ము. నీవు నిత్యవు, నిత్యస్వరూపవు, సుగుణరూపిణివి. సృష్టిలయములందు నీవు ప్రత్యక్షమగుదువు, మాయమగుదువు. ఓం స్వస్తి చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణా తథా | నిరూపితాశ్చతుర్వేదే షట్ ప్రశస్తాశ్చ కర్మిణాం || 34 పురాzసీస్త్వం స్వధా గోపీ గోలోకే రాధికా సఖీ | ధృతా స్వోరసి కృష్ణేన యాతస్తేన స్వధా స్మృతా || 35 ధ్వస్తా త్వం రాధికా శాపాత్ గోలోకాద్విశ్వమాగతా | కృష్ణాzశ్లిష్టా తయా దృష్టా పురాబృందావనే వనే || 36 కృష్ణాలింగన పుణ్యన భూతామే మానసీ సుతా | అతృప్త సురతా తేన చతుర్ణాం స్వామినాం ప్రియా || 37 స్వాహా సా సుందరీ గోపీ పురాసీద్రాధికా సఖీ | రతౌ స్వయం కృష్ణమాహ తేన స్వాహా ప్రకీర్తితా || 38 నీవు వేదములందు ఓంకార రూపిణివిగా, నమః స్వస్తి, స్వాహా, స్వధా, దక్షిణా స్వరూపములతో కీర్తింపబడినావు. అట్లే నీవు పూర్వకాలము గోలోకమున రాధాదేవి ప్రియసఖియైన "స్వధా" అను గోపికవు. శ్రీకృష్ణడు నిన్ను స్వవక్షస్థలమున ధరించినందువలన ''స్వధా'' అను పేరు పొందితివి. అట్లే నీవు శ్రీకృష్ణుని వక్షఃస్థలమున ఉండగా రాధాదేవిచూచి శపించినందువలన నీవు భూలోకమునకు వచ్చితివి. నీవు శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొన్న పుణ్యమువలన నాకు మానసపుత్రికగా జన్మించితివి. నీకు "స్వాహా" యను పేరు కూడ కలదు. శ్రీకృష్ణునితో రతిసమయమున స్వయముగా (ఆహ) అనినందున నీకు "స్వాహా" యను పేరు కల్గినది. కృష్ణేన సార్థం సుచిరం వసంతే రాసమండలే | ప్రమత్తా సురతే శ్లిష్టా దృష్టా సారాధయా పురా || 39 తస్యాః శాపేన సా ధ్వస్తా గోలోకాద్విశ్వమాగతా | కృష్ణాzలింగన పుణ్యన సమభూద్వహ్ని కామినీ || 40 పవిత్రరూపా పరమా దేవాద్యైర్వందితానృభిః | యన్నామోచ్చారణనైన నరో ముచ్యేత పాతకాత్ || 41 రాసమండలమున శ్రీకృష్ణునితో కలిసి మైమరచి నిద్రించుచుండగా రాధాదేవి చూచి శపించగా భూలోకమునకు చేరితివి. శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొన్న పుణ్యమువలన అగ్నికి భార్యవైతివి. 'స్వాహాదేవి'రూపముననుండు నీవు మిక్కిలి పవిత్రమైనదానవు. మానవులు, దేవతలచే పూజింపబడితిని. నీ నామోచ్చారణచేసినంత మాత్రముననే మానవులు చేసిన సమస్తపాపములు తొలగిపోవును. యా సుశీలాభిథా గోపీ పురాసీద్రాధికా సఖీ | ఉవాస దక్షిణక్రోడే కృష్ణస్య చ మహాత్మనః || 42 ప్రధ్వస్తా సా చ తచ్ఛాపాద్గో లోకాద్విశ్వమాగతా | కృష్ణాలింగనపుణ్యన సాబభూవ చ దక్షిణా || 43 సా ప్రేయసీ రతౌ దక్ష ప్రశస్తా సర్వ కర్మసు | ఉవాస దక్షిణభర్తుః దక్షిణా తేన కీర్తితా || 44 గోప్యో బభూవుస్తిస్రోవై స్వధా స్వాహా చ దక్షిణా | కర్మిణాం కర్మపూర్ణార్థం పురా చైవేశ్వరేచ్ఛయా || 45 రాధాదేవి ప్రియసఖియగు సుశీలయను గోపిక శ్రీకృష్ణుని ఆలింగనము చేసికొని అతని దక్షిణభాగముననున్నందువలన ఆమె దక్షిణయైనది. అట్లే రతికార్యమున దక్షురాలు కావున ఆమె దక్షిణయైనది. ఈవిధముగా శ్రీకృష్ణపరమాత్మయోక్క ఇచ్ఛవలన మానవుల కర్మలను పూర్తిచేయుటకు "స్వధా", "స్వాహా" "దక్షిణా" అను ముగ్గురు గోపికలు భూలోకమున జన్మించిరి. ఇత్యేవ ముక్త్వా స బ్రహ్మా బ్రహ్మలోకే చ సంసది | తస్థా చ సహసా సద్యః స్వధా సాzవిర్బభూవహ || 46 తదా పితృభ్యః ప్రదదౌ తామేవ కమలాననాం | తాం సంప్రాప్య యయుస్తే చ పితరశ్చ ప్రహర్షితాః || 47 స్వధాస్తోత్రమిదంపుణ్యం యః శ్రుణోతి సమాహితః | సస్నాతః సర్వతీర్థేషు వేదపాఠఫలం లభేత్ || 48 బ్రహ్మదేవుడు దేవతలతో పితృగణముతో ఈవిధముగా పల్కుచున్నప్పుడే స్వధాదేవి అక్కడ ఆవిర్భవించెను. ఆమెను బ్రహ్మదేవుడు పితృదేవతల కొసగగా వారు సంతోషముతో వెళ్ళిపోయిరి. ఈ స్వధాస్తోత్రమును శ్రద్ధతో చదివినవారు సమస్త తీర్థములలో స్నానము చేసిన ఫలితమును, వేదాధ్యయనము చేసిన ఫలమును తప్పక పొందుదురు. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే స్వధోపాఖ్యానే స్వధోత్పత్తి తత్పూజాది కథనం నామ ఏక చత్వారింశోzధ్యాయః || ఇతి స్వధోపాఖ్యానం శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండము నారదనారాయణుల సంవాదమయమున తెలప్పబడిన స్వధాచరిత్రయందు స్వధాదేవి ఉత్పత్తి పూజాదికములు కల నలభైయొకటవ అధ్యాయము సమాప్తము.