sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ద్వాచత్వారింశత్తమోzధ్యాయః - దక్షిణాదేవి జన్మ మరియు పూజావిధానము

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

ఉక్తం స్వాహా స్వధాఖ్యానం ప్రశస్తం మధురం పరం | వక్ష్యామి దక్షిణాఖ్యానం సావధానం నిశామయ || 1

నారదా!స్వాహాదేవి, స్వధాదేవి చరిత్రలను నీకు వినిపించితిని. ఇప్పుడు దక్షిణాదేవి చరిత్రను చెప్పెదను జాగ్రత్తగా వినుము.

గోపీ సుశీలా గోలోకే పురాzసీ త్ర్పేయసీ హరేః | రాధాప్రధానా సధ్రీచీ ధన్యా మాన్యా మనోహరా |

అతివసుందరీ రామా సుభగా సుదతీ సతీ || 2

విద్యావతీ గుణవతీ సతీ రూపవతీ తథా | కళావతీ కోమలాంగీ కాంతా కమల లోచనా || 3

సుశ్రోణీ సుస్తనీ శ్యామా న్యగ్రోధ పరిమండలా | ఈషద్ధాస్య ప్రసన్నాస్యా రత్నాలంకారభూషితా || 4

శ్వేత చంపకవర్ణాభా బింబోష్ఠీ మృగలోచనా | కామశాస్త్ర సునిష్ణాతా కామినీ కలహంసగా || 5

భావానురక్తా భావజ్ఞా కృష్ణస్య ప్రియభామినీ | రసజ్ఞా రసికా రాసే రాసేశేస్య రసోత్సుకా || 6

ఉవాస దక్షిణ క్రోడే రాధాయాః పురతః పురా | సంబభూవా నమ్రముఖో భ##యేవ మధుసూదనః || 7

పూర్వకాలము గోలోకమున సుశీలయను గోపిక శ్రీహరికి ప్రియురాలుగానుండెను. ఆ సుశీల రాధాదేవికి ముఖ్యమైన చెలికత్తె. మిక్కిలి గౌరవింపదగినది అందగత్తెకూడా. ఇంకను ఆ సుశీల మంచిరూపము కలది. కోమలమైన అవయవములు కలది. కమలములవంటి కన్నులు కలది సుశ్రోణి,సుస్తని, న్యగ్రోధపరిమండల, రత్నాలంకారములు కలది. చిరునవ్వుతో ఉండునది.తెల్లని చంపకము పుష్పమువంటి కాంతిగలది. లేడికన్నులవంటి కన్నులుగలది. కామశాస్త్రమున మంచి అనుభవము కలది. భావమున త్వరగా గ్రహించునది. రసికురాలు. ఆమె రాధాదేవియొక్క దక్షిణభాగమున ఒకప్పుడుండెను.

మధుసూదనుడు తన ప్రియురాలి దగ్గర రాధాదేవిని చూచి భయముతో తలవంచుకొనెను.

దృష్ట్వా రాధాంచ పురతో గోపీనాంప్రవరాం వరాం | మానినీం రక్తవదనాం రక్తపంకజలోచనాం || 8

కోపేన కంపితాంగీం చ కోపనాం కోపదర్శనాం | కోపేన నిష్ఠురం వక్తుం ఉద్యతాం స్ఫురతాధరాం || 9

ఆగచ్ఛంతీం చ వేగేన విజ్ఞాయ తదనంతరం | విరోధభీతో భగవానంతర్ధానం జగామ సః || 10

పలాయంతం చ తం శాంతం సత్వాధారం సువిగ్రహం | విలోక్య కంపితా గోపీ సుశీలాంతర్దధౌ భియో || 11

రాధాదేవి ఎఱ్ఱని ముఖముతో ఎఱ్ఱని తామరలవంటి కన్నులతో, కోపముతో అవయవములదురుచుండగా వేగముగా అచ్చటికి వచ్చుచుండెను. దానిని గమనించి సుశీలా, రాధాదేవులమధ్య విరోధమేర్పడునని శ్రీకృష్ణుడంతర్ధానమునొందెను. దానిని గమనించి సుశీల భయముతో తానుకూడ అంతర్ధానము చెందెను.

విలోక్య సంకటం తత్ర గోపీనాం లక్షకోటయః | బద్ధాంజలిపుటా భీతా భక్తినమ్రాత్మ కంధరాః || 12

రక్షరక్షేత్యుక్తవత్యో హే దేవీతి పునః పునః | యయుర్భయేన శరణం తస్యాశ్చరణపంకజే || 13

త్రిలక్ష కోటయో గోపాః సుదామాదయ ఏవచ | యయుర్భయేన శరణం తత్పాదాబ్జే చ నారద || 14

ఆ యాపదను చూచి గోపికలందరు చేతులు జోడించుకొని భక్తితో తలలు వంచుకొని ఓ దేవీ మమ్ములను రక్షింపుమని మాటామాటికి వేడుకొనుచు రాధాదేవియొక్క పాదపద్మములపై వ్రాలిరి. అట్లే సుదాముడు మొదలగు గొల్లలందరు భయముతో రాధాదేవిని శరణువేడిరి.

పలాయంతం చ కాంతం వై విజ్ఞాయ పరమేశ్వరీ | పలాయంతీం సహచరీం సుశీలాం చ శశాప సా || 15

అద్యప్రభృతి గోలోకం సా చేదాయాతి గోపికా | సద్యోగమనమాత్రేణ భస్మసాచ్ఛ భవిష్యతి || 16

పరమేశ్వరియగు రాధాదేవి పరుగెత్తుచున్న తన భర్తను, తన స్నేహితురాలిని చూచి తన సహచరిని కోపముతో ఈవిధముగా శపించెను. సుశీలా!నేటినుండి నీవీ గోలోకముననుండినచో వెంటనే భస్మమైపోదువు.

ఇత్యేవముక్త్యా తత్రైవ దేవదేవీశ్వరీ రుషా | రాసేశ్వరీ రాసమధ్యే రాసేశం చాజుహావ హ|| 17

నాలోక్య పురతః కృష్ణం రాధావిరహ కాతరా | యుగకోటిసమం మేనే క్షణ భేదేన సువ్రతా || 18

హేకృష్ణ హే ప్రాణనాథగచ్ఛ ప్రాణాధిక ప్రియ | ప్రాణాధిష్ఠాతృదేవేహ ప్రాణా యాంతి త్వయావినా || 19

స్త్రీగర్వః పతి సౌభాగ్యాద్వర్ధతే చ దినే దినే | సుస్త్రీ చేద్విభవో యస్మాత్తం భ##జేద్దర్మతః సదా || 20

పతిర్బంధుః కులస్త్రీణామధిదేవః సదాగతిః | పరం సంపత్స్వరూపశ్చ సుఖరూపశ్చ మూర్తిమాన్‌ || 21

ధర్మదః సుఖదః శశ్వత్ర్పీతిదః శాంతిదః సదా | సమ్మానదో మానదశ్చ మాన్యో వై మానఖండనః. || 22

సారాత్సారతమః స్వామీ బంధూనాం బంధువర్ధనః | న చ భర్తుః సమోబంధుః సర్వబంధుషు దృశ్యతే ||

శరీరేశాచ్చ స స్వామీ కామదః కాంత ఏవ చ || 24

బంధుశ్చ సుఖంబందాచ్చ ప్రీతిదానాత్ప్రియః పరః | ఐశ్వర్య దానాదీశశ్చ ప్రాణశాత్ర్పాణనాయకః || 25

రతిదానాచ్చ రమణః ప్రియోనాస్తి ప్రియాత్పరః | పుత్రస్తు స్వామినః శుక్రాత్‌ జాయతే తే సప్రియః || 26

శతపుత్రాత్పరః స్వామీ కులజానాం ప్రియః సదా | అసత్కుల ప్రసూతా యా కాంతం విజ్ఞాతుమక్షమా || 27

స్నానం చ సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షణం | ప్రాదక్షిణ్యం పృథివ్యాశ్చ సర్వాణి చ తపాంసివై || 28

సర్వాణ్యవవ్రతాదీని మహాదానాని యాని చ | ఉపోషణాని పుణ్యాని యాన్యన్యాని చ విశ్వతః || 29

గురుసేవా విప్రసేవా దేవసేవాదికం చ యత్‌ | స్వామినః పాదసేవాయాః కళాం నార్హంతి షోడశీం || 30

గురువిప్రేష్టదేవేషు సర్వేభ్యశ్చ పతిర్గురుః | విద్యాదాతా యథాపుంసాం కులజానాం తథా ప్రియః || 31

దేవదేవీశ్వరీ యగు రాధాదేవి సుశీలను శపించి రాసమధ్యమున రాసేశ్వరుడగు శ్రీకృష్ణుని రమ్మని పిలిచెను. కాని కృష్ణుడచ్చటకు రాలేదు. అందువలన రాధాదేవి విరహముతో క్షణమొక యుగముగా భావించెను.

ఓ కృష్ణ! ప్రాణనాథ!ప్రాణములకన్న మిన్నయైన ప్రియుడా! ప్రాణములకు అధిష్టాన దేవత! నీవు వెంటనే రమ్ము. నీవు లేనిచో నేను బ్రతకలేను.

స్త్రీకి గర్వము పతివలననే వచ్చును. మంచి స్త్రీకి భర్తవలననే గౌరవము కలుగును. కులస్త్రీకి పతియే బంధువు, దేవత, గొప్ప సంపద, శరీరముగల సుఖము, అతడే ధర్మమును సుఖమును, ఎల్లప్పుడు ప్రీతిని, శాంతిని సన్మానమును ఇచ్చువాడు. స్వామి ఆమెకు చాలా గొప్పవాడు. స్త్రీకి భర్తను మించిన బంధువు లేడు.

అతడు తన భార్యను భరించుచున్నందువలన భర్తయని, పాలించుటచే పతియని భార్యయొక్క శరీరమునకు ఈశుడు కావున స్వామియని, కామమును తీర్చువాడు కావున కాంతుడని, సుఖబంధమువలన బంధువని ప్రియమును కలిగించువాడు కావున ప్రియుడని, ఐశ్వర్యమునిచ్చుచున్నందువలన ఈశుడని, ప్రాణశుడు కావున ప్రాణనాయకుడని, రతిని కల్గించుచున్నందువలన రమణుడని, పిలువబడుచున్నాడు. స్త్రీకి భర్తకున్న ప్రియుడు ఎవ్వరు కారు. పుత్రుడు భర్తయొక్క శుక్రమువలన జన్మించును కావున భర్త ప్రియుడైనాడు.

స్త్రీకి నూరుగురు పుత్రులకంటెను తన భర్త చాలా ప్రియమైనవాడు. చెడు నడకగల స్త్రీ తనయొక్క ప్రియుని తెలిసికొనలేదు.

సమస్త తీర్థములలో చేయు స్నానము, సమస్త యజ్ఞములను చేయు దీక్ష, భూ ప్రదక్షిణము, సమస్త తపస్సులు, వ్రతములు, మహాదానములు, ఉపవాసములు, ఇతర పుణ్యకార్యములు, గురువును, బ్రాహ్మణుని, దేవతలను సేవించుట మొదలగునవి భర్తయొక్క పాదసేవలో పదహారవ వంతైన కాజాలవు. స్త్రీకి గురువు, బ్రాహ్మణుడు, ఇష్టదేవత వీరందరికంటె భర్త శ్రేష్ఠుడు. పురుషులకు విద్యనిచ్చువానివలె స్త్రీకి భర్త గురువగుచున్నాడు.

గోపీ త్రిలక్షకోటీనాం గోపానాం చ తథైవ చ | బ్రహ్మాండానామసంఖ్యానాం తత్రస్థానాం తథైవ చ || 32

రమాదిగోపకాంతానాం ఈశ్వరీ తత్ర్పసాదతః | అహం న జానే తం కాంతం స్త్రీ స్వభావో దురత్యయః || 33

నేను ముడు లక్షల గోపస్త్రీలకు, మూడు లక్షల గోపకులకు రమ మొదలగు గోపికలకు ఆ శ్రీకృష్ణ పరమాత్మయొక్క అనుగ్రహము వలననే యజమానురాలినైతిని.

ఈవిధముగా శ్రీకృష్ణుని అనుగ్రహమువలననే ఉన్నతస్థానముననున్నను అతనిపై కోపపడితిని. తన భర్త ఇంకొక స్త్రీ తో చనువుగా ఉండుటను ఏ భార్య సహించలేదు. ఇది స్త్రీలందరికి సహజమైనది. స్వభావమునకు విరుద్ధముగా ఎవ్వరు ప్రవర్తింపలేరు.

ఇత్యుక్త్యా రాధికా కృష్ణం తత్ర దధ్యౌ సుభక్తితః | ఆరాత్సంప్రాప తం తేన విజహార చ తత్రవై || 34

అథ సా దక్షిణా దేవి ధ్వస్తా గోలోకతో మునే | సుచిరం చ తపస్తప్త్వా వివేశ కమలా తనౌ || 35

అథ దేవాదయః సర్వే యజ్ఞం కృత్వా సుదుష్కరం | న లభంతే ఫలం తేషాం విషణ్ణాః ప్రయయుర్విధిం || 36

విధిర్నివేదనం శ్రుత్వా దేవాదీనాం జగప్తతిః | దధ్యౌ సుచింతితో భక్త్యా తత్ర్పత్యాదేశమాపసః || 37

నారాయణశ్చ భగవాన్‌ మహాలక్ష్మాశ్చ దేహతః | మర్త్యలక్ష్మీం వినిష్కృష్య బ్రహ్మణ దక్షిణాం దదౌ || 38

బ్రహ్మ దదౌ తాం యజ్ఞాయ పూర్ణార్థం కర్మణాం సతాం | యజ్ఞః సంపూజ్య విధివత్తాం తుష్టావ రమాం ముదా || 39

పై విధముగా రాధాదేవి తన భర్తయగు కృష్ణునిగూర్చి పిలికి, ఆ శ్రీకృష్ణుని చక్కని భక్తితో ధ్యానించెను. ఆ ధ్యానబలమువలన శ్రీకృష్ణుని రాధ పొందగలిగెను. సుశీల యను పేరుగల దక్షిణాదేవి వెంటనే ఆ స్థలమును వదలి గోలోకమునుండి భ్రష్టయై చాలాకాలము శ్రీకృష్మపరమాత్మ గురించి తపమాచరించి లక్ష్మీదేవియొక్క శరీరమున అంతర్థానము చెందెను.

నాటినుండి దేవతలు ఎంతగొప్పని యజ్ఞము చేసినను దైని ఫలితమును మాత్రము పొందలేకపోయిరి. అందువలన వారు బాధాపీడితులై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళిరి. బ్రహ్మదేవుడు దేవతల బాధలను చక్కగా విని, శ్రీమన్నారాయణుని చక్కగా మనస్సులో ధ్యానించుకొని ఆతని అనుగ్రహమును పొందెను. అందువలన శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మియొక్క శరీరమున విలీనమైన భూలక్ష్మిని బయటకు తీసి బ్రహ్మదేవనికిచ్చెను. బ్రహ్మదేవుడా భూలక్ష్మియైన దక్షిణను సత్పురుషులు చేయు సత్కార్యములు పరిపూర్ణమగుటకై యజ్ఞునకిచ్చివేసెను. యజ్ఞదేవత ఆ దక్షిణాదేవిని శాస్త్రప్రకారముగా పూజించి ఆమెనిట్లు స్తుతించెను.

తప్తకాంచనవర్ణాభాం చంద్రకోటి సమప్రభాం | అతీవ కమనీయాం చ సుందరీం సమనోహరాం || 40

కమలాస్యాం కోమలాంగీం కమలాయత లోచనాం | కమలాసన సంపూజ్యాం కమలాంగసముద్భవాం || 41

వహ్నిశుద్ధాంశుకాధానాం బింబోష్ఠీం సుదతీం సతీం | బిభ్రతీం కబరీభారం మాలతీమాల్యభూషితం || 42

ఈషద్దాస్య ప్రసన్నాస్యాం రత్న భూషణ భూషితాం | సువేశషాఢ్యాం చ సుస్నాతాం మునిమానస మోహినీం || 43

కస్తూరీ బిందుభిస్సార్థం చందనైశ్చ సుగంధిభిః | సిందూరబిందునాzత్యంతం మస్తకాధస్థలోజ్వలాం || 44

సుప్రశస్త నితంబాఢ్యాం బృహచ్చ్రోణి పయోధరాం | కామదేవాధార రూపాం కామబాణప్రపీడితాం || 45

దక్షిణాదేవి పరిశుద్ధమైన బంగారు వన్నెగలది. కోటి చంద్రులకాంతి గలది. మిక్కిలి అందమైనది. కమలములవంటి ముఖముతో కమలములవలె విశాలమైన నేత్రములతో మహాలక్ష్మీదేవి అవయవములనుండి పుట్టిన దక్షిణాదేవి బ్రహ్మదేవునిచే పూజలందుకొనినది. ఆమె పరిశుద్ధమైన వస్త్రములను ధరించినది. దొండపండువంటి పెదవులు కలది. అందమైన పలువరస కలది. ఆమె తన కొప్పులో మాలతీమాలను, మెడలో రత్నాభరణములను, పాపిటలో సిందూరబిందువులను ధరించి తన వేషముతో మునులను సహితము మోహింపజేయునది. ఎత్తైన నితంబములతో పీనపయోధరములతో మన్మథనకు ఆధారమైన దక్షిణాదేవి మదనుని బాణములచే మిక్కిలి పీడింపబడినది.

తాం దృష్ట్వా రమణీయాం చ యజ్ఞో మూర్ఛామవాప హ | పత్నీం తామేవ జగ్రాహ విధిబోధిత మార్గతః || 46

దివ్యం వర్షశతం చైవ తాం గృహీత్యాzథ నిర్జనే | యజ్ఞో రేమే ముదాయుక్తో రామయా రమయా సహ || 47

గర్భం దధార సా దేవీ దివ్యద్వాదశ వత్సరం | తతః సుషావ పుత్రం చ ఫలం వై సర్వకర్మణాం || 48

కర్మణాం ఫలదాతా చ దక్షిణా కర్మణాం సతాం | పరిపూర్ణే కర్మణి చ తత్పుత్రః ఫలదాయకః || 49

యజ్ఞో దక్షిణయా సార్థం పుత్రేణ చ ఫలేన చ | కర్మణాం ఫలదాతా చేత్యేవం వేదవిదోవిదుః || 50

యజ్ఞదేవుడు మదనునిచే బాదపడుచున్న సుందరియగు దక్షిణాదేవిని చూచి మూర్ఛ పడెను. అప్పుడాతడు బ్రహ్మదేవుడు నిర్దేశించిన పద్ధతిలో తానామెను వివాహమాడెను.

యజ్ఞదేవుడా రమణిని వివాహము చేసికొని నిర్జన వనమునకామెను తీసికొనివెళ్ళి వంద దివ్య సంవత్సరములామెతో సుఖముగా ఉండెను.

ఆ దేవి పన్నెండు దివ్య సంవత్సరములు గర్భమును ధరించి సమస్త కర్మలయొక్క ఫలములనిచ్చు పుత్రుని కన్నది. దక్షిణాదేవి సత్కర్మల ఫలితములనిచ్చుచుండగా ఆమె పుత్రుడు సత్కర్మలు పరిపూర్ణమైన తరువాత ఫలితములనొసగును.

యజ్ఞదేవుడు దక్షిణాదేవితో తన పుత్రునితో కలసి సత్కర్మల ఫలితమునొసగునని వేదములు తెలిసిన వారందురు.

యజ్ఞశ్చ దక్షిణాం ప్రాప్య పుత్రం చ ఫలదాయకం | ఫలం దదౌ చ సర్వేభ్యః కర్మఠేభ్యో యదా మునే || 51

తదా దేవాదయస్తుష్టాః పరిపూర్ణ మనోరథాః | స్వస్థానం ప్రయయుః సర్వేధర్మవక్త్రాదిదం శ్రుతం || 52

యజ్ఞదేవత దక్షిణాదేవిని, సర్వకర్మ ఫలితములనొసగు పుత్రునిబడసి, వైదిక కర్మలు సక్రమముగా నిర్వర్తించు వారందరికి ఫలితమునొసగెను. దేవతలు తమ కోరికలు తీర్చుకొని తమ తమ నివాసముల కేగిరి.

నారదా! ఈ వృత్తాంతమునంతయు ధర్మదేవత చెప్పగా నేను వింటిని. అని నారాయణుడనెను.

కృత్వా కర్మ చ కర్తా తు తూర్ణం దద్యాచ్చ దక్షిణాం | తత్‌ క్షణం ఫలమాప్నోతి వేదైరుక్తమిదం మునే || 53

కర్తా కర్మణి పూర్ణేzపి తత్‌ క్షణాద్యది దక్షిణాం | న దద్యాద్బ్రాహ్మణభ్యశ్చ దైవేనాzజ్ఞానతోzథవా || 54

ముహూర్తే సమతీతే చ ద్విగుణా సా భ##వేత్‌ ధ్రువం || 55

ఏకరాత్రే వ్యతీతే తు భ##వేద్రసగుణా చ సా | త్రిరాత్రే వై దశగుణా సప్తాహో ద్విగుణా తతః || 56

మాసే లక్షగుణా ప్రోక్తా బ్రహ్మణానాం వర్ధతే | సంవత్సరే వ్యతీతే తు సాత్రికోటిగుణా భ##వేత్‌ || 57

కర్మ తద్యజమానానాం సర్వం వై నిష్పలం భ##వేత్‌ | స చ బ్రహ్మస్వాపహారీ న కర్మార్హోzశుచిర్నరః || 58

దరిద్రో వ్యాధియుక్తశ్చ తేన పాపేన పాతకీ | తద్గృహాద్యాతి లక్ష్మీశ్చ శాపం దత్వా సుదారుణం || 59

పితరో నైవ గృహ్ణాంతి తద్దత్తం శ్రాద్ధతర్పణం | ఏవం సురాశ్చ తత్పూజాం తద్దత్తాం పావకాzహుతిం || 60

సత్కర్మలు చేసి వెంటనే దక్షిణనివ్వవలెనని అప్పుడే ఆ కర్మఫలము లభించునని వేదములందు చెప్పబడినది.

కర్త కర్మ పరిపూర్ణముగా చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వనిచో ఆ దక్షిణపరిమాణము కాలముగననుసరించి పెరుగుచుండును. ముహూర్తకాలము తర్వాత రెట్టింపు దక్షిణనీయవలెను. ఒకరాత్రి గడచినచో ఆరురెట్లెక్కువగా దక్షిణనీయవలెను. మూడు రాత్రులు గడచినచో పదిరెట్లెక్కువగానియ్యవలెను. అట్లె వారము గడచినచో ఇరవై రెట్లెక్కువ దక్షిణనీయవలెను. మాసము గడచినచో లక్షరెట్లు, సంవత్సరము గడచినచో మూడుకోట్ల రెట్లెక్కువగా ధనమునీయవలెను. ఐనను ఆ కర్మయంతయు నిష్పలమగును.

ఈ విధముగా సంవత్సరమువరకు దక్షిణనీయనిచో కర్త బ్రాహ్మణుల ధనమపహరించిన వాడగును. అతడు మరల సత్కర్మలు చేయుటకు అర్హుడు కాడు. అపవిత్రుడగును. లక్ష్మీదేవి అతనికి శాపము పెట్టుట అతని ఇంటినుండి వెళ్ళిపోవును.

పితృదేవతలు ఆ వ్యక్తి ఇచ్చు శ్రాద్ధ తర్పణాదికమును స్వీకరింపరు. అట్లే దేవతలు అతడు చేయు పూజలను, అతడు యజ్ఞముమన ఇచ్చు ఆహుతులను స్వీకరింపరు.

దాతా దదాతి నో దానం గ్రహీతా తన్నయాచతే | ఉభౌ తౌ నరకం యాతః ఛిన్నరజ్జుర్యథా ఘటః || 61

నార్పయేద్యజమానశ్చేద్యాచితారం చ దక్షిణాం | భ##వేద్బ్రహ్మస్వాపహారీ కుంభీపాకం వ్రజేత్‌ ధ్రువం || 62

వర్షలక్షం వసేత్తత్ర యమదూతేన తాడితః | తతో భ##వేత్స చండాలో వ్యాధియుక్తో దరిద్రకః || 63

పాతయేత్పురుషాన్‌ సప్తపూర్వాన్‌ వై పూర్వజన్మనః | ఇత్యేవం కథితం విప్ర కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 64

యజ్ఞాది సత్కర్మలలో దాత దక్షిణలివ్వక, దక్షిణ తీసికొనవలసినవాడు దానిని నిరాకరించినచో, బావిలో నీరు చేదునపుడు తాడు తెగినచో తాడు, బొక్కెన నీటిలో పడునట్లు ఆ ఇద్దరు నరకమునకు పోవుదురు. దక్షిణనివ్వనివాడు కుంభీపాకనరకమున లక్ష సంవత్సరములు నరకబాధలనుభవించి, తిరిగి జన్మించినపుడు రోగముతో, దరిద్రుడగును. ఆతడు తనకు ముందుండిన ఏడుతరములవారిని నరకమునకు పంపును. అందువలన యజ్ఞాది సత్రక్మలయందు తప్పక దక్షిణలు సమర్పించుకొనవలెను.

ఈ విధముగా నారాయణముని నారదునకు దక్షిణాదేవి చరిత్రను తెలిపి ఇంకను అతడు తెలిసికొనవలసిన దేమైన ఉన్నచో అడుగుమనెను.

నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లనెను.

యత్కర్మ దక్షిణాహీనం కో భుంక్తే తత్ఫలం మునే | పూజావిధిం దక్షిణాయాః పూరాయజ్ఞకృతం వద || 65

శ్రీమనన్నారాయణ!దక్షిణలు ఇవ్వక చేసిన శుభకర్మలయొక్క ఫలితము ఎవరికి చెందును?యజ్ఞదేవత చేసిన దక్షిణాదేవి పూజాపద్ధతి ఎటువంటిది?వీటిని నాకు తెలుపుము.

నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లనెను.

కర్మణోzదక్షిణసై#్యవ కుత ఏవఫలం మునే | స దక్షిణ కర్మణి చ ఫలమేవ ప్రవరతతే || 66

యాయా కర్మణి సామగ్రీ బలిర్భుంక్తే చ తాం మునే | బలయే తత్ర్పదత్తం చ వామనేన పురామునే || 67

అశ్రోత్రియం శ్రాద్ధవస్తు చాశ్రద్ధం దానమేవచ | వృషలీపతి విప్రాణాం పూజాద్రవ్యాదికం చ యత్‌ || 68

ఋత్విజా న కృతం యజ్ఞం అశుచేః పూజనం చ యత్‌ | గురావభక్తస్య కర్మ బలిర్భుంక్తే న సంశయః || 69

దక్షిణాయాశ్చ యధ్యానం స్తోత్రం పూజావిధిక్రమం | తత్సర్వం కాణ్వశాఖోక్తం ప్రవక్ష్యామి నిశామయః || 70

యజ్ఞాది సత్కర్మలను దక్షిణలిచ్చుచు ఆచరించినపుడే వాటి ఫలితము లభించును. లేనిచో ఫలమే కలగదు. ఐనను ఆ సత్కర్మవలన కలుగు ఫలితమును బలిచక్రవర్తి అనుభవించునట్లు వామనుడు పూర్వము కట్టడిచేసెను.

శ్రోత్రియముకాని శ్రాద్ధమునందలి వస్తువులు, అశ్రద్ధతో చేసిన దానము, వృషలీపతియగు బ్రాహ్మణుని పూజాద్రవ్యములను, ఋత్విక్కులేని యజ్ఞఫలమును, శుచిత్వము లేనివాని పూజా ఫలితమును, గురవుపై భక్తిశ్రద్ధలు లేనివాడు చేసిన కర్మఫలమును బలిచక్రవర్తి అనుభవించును.

నారదా! నీకింతవరకు దక్షిణలు లేని యజ్ఞాది ఫలమును పొందు వానిని గురించి తెలిపిని. ఇక కాణ్వాశాఖలో చెప్పబడిన దక్షిణా దేవి స్తోత్రము, ధ్యానము, పూజాది విషయములను నీకు తెల్పుదును.

పురా సంప్రాప్య తాం యజ్ఞః కర్మదక్షాం చ దక్షిణాం | ముమోహ తస్యా రూపేణ తుష్టువే కామ కాతరః || 71

యజ్ఞదేవతకు బ్రహ్మదేవుని అనుగ్రహమువలన దక్షిణాదేవి లభించగనే అందమైన ఆమె రూపమును చూచి అతడు మోహపరవశుడయ్యెను.

యజ్ఞఉవాచ- యజ్ఞదేవుడిట్లు పలికెను-

పురా గోలోకగోపీ త్వం గోపీనాం ప్రవరాపరా | రాధాసమా తత్సఖీ చ శ్రీకృష్ణప్రేయసీ ప్రియే || 72

కార్తికీ పూర్ణిమాయాంతు రాసేరాధా మహోత్సవే | ఆవిర్భూతా దక్షిణాంశాత్‌ కృష్ణస్యాతో హి దక్షిణా || 73

పురా త్వం చ సుశీలాఖ్యా శీలేన సుశుభేన చ | కృష్ణ దక్షాంశవాసాచ్చ రాధాశాపాచ్చ దక్షిణా || 74

గోలోకాత్త్వం పరిద్వస్తా మమభాగ్యాదుపస్థితా | కృపాం కురమత్వమేవాద్య స్వామినం కురు మాం ప్రియే || 75

కర్తౄణాం కర్మణాం దేవీ త్వమేవ ఫలదా సదా | త్వయా వినా చ సర్వేషాం సర్వం కర్మ చ నిష్ఫలం || 76

ఫలశాఖా విహీనశ్చ యథావృక్షో మహీతలే | త్వయా వినా తథా కర్మ కర్తౄణాం న చ శోభ##తే || 77

బ్రహ్మవిష్ణు మహేశాశ్చ దిక్పాలాదయ ఏవ చ | కర్మణశ్చ ఫలం దాతుం న శక్తాశ్చ త్వయా వినా || 78

కర్మరూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరః | యజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ || 79

ఫలదాతా పరం బ్రహ్మ నిర్గుణః ప్రకృతేః పరః | స్వయం కృష్ణశ్చ భగవాన్‌ న చ శక్తస్త్వ యా వినా || 80

త్వమేవ శక్తిః కాంతే మే శశ్వజ్జన్మని జన్మని | సర్వకర్మణి శక్తోzహం త్వయాసహ వరాననే || 81

ఓ దక్షిణాదేవి!నీవు పూర్వము గోలోకమున రాధాదేవికి ఇష్టసఖివి, గోపికలలో శ్రేష్ఠురాలవు. కార్తీక పౌర్ణమినాడు గోలోకమున శ్రీకృష్ణుని దక్షిణాంశమునుండి ఉద్భవించినందువలన నీవు దక్షిణవైతివి. పూర్వము నీకచ్చట సుశీలయను పేరు నీ శీలమునకు తగినట్లుండినది. గోలోకమునుండి నా అదృష్టమువలన ఇచ్చటకు వచ్చితివి. నీవు దయదలచినచో నేను నీకు భర్తనగుదును.

నీవు సత్కర్మలు చేయువారి కర్మలన్నిటి ఫలితములనిచ్చుదానవు. సమస్తకర్మలు నీవులేనిచో మొండిచెట్టువలె నిష్ఫలమగును. బ్రహ్మ, విష్ణు, శంకరుడు మొదలగు దేవతలు, ప్రకృతికి అతీతుడు పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడు సహితము నీవులేనిచో ఫలితములనివ్వరు.

ఓకాంతా నీవే అన్నిజన్మలలో నాకు శక్తి రూపిణివి. నీవున్నచో నేను సమస్తకర్మలు చేయగలను.

ఇత్యుక్త్యా తత్పురస్తస్థౌ యజ్ఞాధిష్ఠాతృదేవకః | తుష్టా బభూవ సా దేవీ భేజే తం కమలాకళా || 82

యజ్ఞదేవత ఈవిధముగా దక్షిణాదేవిని స్తుతింపగా ఆమె పరమ సంతోషముతో అతనివద్దకు చేరెను.

ఇదం చ దక్షిణాస్తోత్రం యజ్ఞకాలే చ యః పఠేత్‌ | ఫలం చ సర్వయజ్ఞానాం లభ##తే నాత్ర సంశయః || 83

రాజసూయే వాజపేయే గోమేధే నరమేధకే | అశ్వమేధే లాంగలే చ విష్ణుయజ్ఞే యశస్కరే || 84

ధనదే భూమిదే ఫల్గౌ పుత్రేష్టే గజమేధకే | లోహయజ్ఞే స్వర్ణయజ్ఞే పాటలవ్యాధిఖండనే || 85

శత్రుయజ్ఞే రుద్రయజ్ఞే శక్రయజ్ఞే చ బంధకే | ఇష్టౌ వరుణయాగే చ కందుకే వైరిమర్దనే || 86

శుచియాగే ధర్మయాగే రేచనే పాపమోచనే | బంధనే కర్మయాగే చ మణియాగే సుభద్రకే || 87

ఏతేషాం చ సమారంభే ఇదం స్తోత్రం చ యః పఠేత్‌ | నిర్విఘ్నేన చ తత్కర్మ సాంగం భవతి నిశ్చితం || 88

ఈ దక్షిణాదేవి స్తోత్రమును యజ్ఞసమయములందు చదివినచో అతనికి సమస్తయజ్ఞములు చేసిన ఫలితము లభించును.

రాజసూయ, వాజపేయ, గోమేధ, నరమేధ, అశ్వమేధ, విష్ణుయజ్ఞము మొదలగు యాగములు ప్రారంభించు సమయమున ఈ స్తోత్రమును పఠించినచో ఆ యజ్ఞము సాంగముగా విఘ్నములు లేక పూర్తియగును.

ఇదం స్తోత్రం చ కథితం ధ్యానం పూజావిధానకం | శాలగ్రామే ఘటే వాzపి దక్షిణాం పూజయేత్సుధీః || 89

లక్ష్మీ దక్షాంశ సంభూతాం దక్షిణం కమలాకళాం | సర్వకర్మసు దక్షాం చ ఫలదాం సర్వకర్మణాం || 90

విష్ణోః శక్తి స్వరూపాం చ సుశీలాం శుభదాం భ##జే | ధ్యాత్వాzనేనైవ వరదాం సుధీర్మూలేన పూజయేత్‌ || 91

దత్వాపాద్యాదికం దేవ్యై వేదోక్తేన చ నారద | ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహేతి చ విచక్షణః || 92

పూజయేద్విధివద్భక్త్యా దక్షిణాం సర్వపూజతాం | ఇత్యేవం కథితం సర్వం దక్షిణాఖ్యానముత్తమం || 93

సుఖదం ప్రీతిదం చైవ ఫలదం సర్వకర్మణాం |

ఇది దక్షిణాదేవి ధ్యానము, స్తోత్రము, పూజాదికము, ఆ దక్షిణాదేవిని సాలగ్రామము లేక కలశమున ఆవాహనము చేసి పూజింపవలెను. ఈదేవి లక్ష్మీదేవియొక్క దక్షిణభాగమునుండి పుట్టినది. మహాలక్ష్మీ యొక్క అంశస్వరూపిణి విష్ణుమూర్తియొక్క శక్తిస్వరూపిణి.

ఈదేవిని ఓం శ్రీం క్లీం, హ్రీం, దక్షిణాయైస్వాహా అను మూల మంత్రముచే పూజించుచు అర్ఘ్యపాద్యాది షోడశోపచార పూజలను చేయవలెను.

ఈ విధముగా నీకు సుఖమును, సంతోషమును ఫలితమును కలిగించు దక్షిణాదేవి కథనంతయు సవిస్తరముగా తెల్పితిని.

ఇదం చ దక్షిణాఖ్యానాం యః శ్రుణోతి సమాహితః || 94

అంగహీనం చ తత్కర్మ న భ##వేద్భారతే భువి | అపుత్రో లభ##తేపుత్రం నిశ్చితం చ గుణాన్వితం || 95

భార్యాహీనో లభేద్భార్యాం సుశీలాం సుందరీం పరాం | వరారోహాం పుత్రవతీం వినీతాం ప్రియవాదినీం || 96

పతివ్రతాం సువ్రతాం చ శుద్ధాం చ కులజాం వరాం | విద్యాహీనో లభేద్విద్యాం ధనహీనో ధనం లభేత్‌ || 97

భూమిహీనో లభేద్భూమిం ప్రజాహీనో లభేత్ప్రజాః | సంకటే బంధువిచ్ఛేదే విపత్తౌ బంధనే తథా || 98

మాసమేకమిదం శ్రుత్వా ముచ్యతేనాzత్ర సంశయః || 99

ఈ దక్షిణాఖ్యానమును శ్రద్ధగా విన్నచో అతడు చేయు సత్కర్మలు నిర్విఘ్నముగా పరిపూర్ణమగును. పుత్రులు లేని వారికి పుత్రులు, భార్యలేనివారికి గుణవతియగు భార్య, విద్యలేనివానికి విద్య, ధనములేనివానికి ధనము, భూమిలేనివానికి భూమి లభించును. కష్టకాలమున, బంధువుల వియోగకాలమున, కారాగారమున బద్దుడైనప్పుడు దీనిని ఒక నెలవరకు విన్నప్పటికిని అతని కష్టములన్నియు తీరిపోవును.

ఇతి శ్రీ బ్రహ్మ వైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారదనారాయణసంవాదే దక్షిణోపాఖ్యానే దక్షిణోత్పత్తి తత్పూజాది విధానే నామ ద్విచత్వారింశత్తమోzధ్యాయః ||

శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున తెల్పబడిన దక్షిణాదేవి చరిత్రలో దక్షిణాదేవి పుట్టుక, ఆమె పూజావిధానము కల

నలభైరెండవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters