sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
త్రిచత్వారింశత్తమోzధ్యాయః - షష్ఠీదేవి యొక్క పూజ, స్తోత్రాదులు నారద ఉవాచ- నారదుడు నారాయణునితో ఇట్లనెను- అనేకాసాం చ దేవీనాం శ్రుతమాఖ్యానముత్తమం | అన్యాసాం చరితం బ్రహ్మన్ వదవేదవిదాం వర ||
1 నారాయణమునీ! నీ అనుగ్రహమువలన అనేక దేవతలయొక్క చరిత్రను వింటిని. వేదార్థ విదులలో శ్రేష్ఠుడా! ఇతర దేవతలయొక్క చరిత్రను కూడా నాకు చెప్పుము. నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లు నారదునితో ననెను- సర్వాసాం చరితం విప్ర వేదేష్వస్తి పృథక్ పృథక్ | పూర్వోక్తానాం చ దేవీనాం త్వం కాసాం శ్రోతుమిచ్ఛసి ||
2 నారదా!వేదములందు సమస్త దేవతల చరిత్ర విపులముగా ప్రత్యేకముగా కలదు. నీవు ప్రస్తుతము ఏ దేవతాస్త్రీ చరిత్ర వినదలచితివో నాకు తెలుపుము. నారద ఉవాచః నారదముని ఇట్లనెను- షష్ఠీ మంగళచండీ చ మనసా ప్రకృతేః కళాః | ఉత్పత్తిమాసాం చరితం శ్రోతుమిచ్ఛామి తత్వతః ||
3 షష్ఠీదేవి, మంగళచండి, మనసాదేవి వీరందరు ప్రకృతియొక్క అంశలు అందువలన వీరిపుట్టు పూర్వోత్తరములను తెలిసికొనగోరుతున్నాను. నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను- షష్ఠాంశా ప్రకృతేర్యా చ సా చ షష్ఠీ ప్రకీర్తితా | బాలకాధిష్ఠాతృదేవీ విష్ణుమాయా చ బాలదా ||
4 మాతృకాసు చ విఖ్యాతా దేవసేనాభిధా చ సా | ప్రాణాధికప్రియా సాధ్వీస్కందభార్యా చ సువ్రతా ||
5 ఆయుః ప్రదా చ బాలానాం ధాత్రీ రక్షణకారిణీ | సతతం శిశుపార్శ్వస్థా యోగాద్వై సిద్ద యోగినీ ||
6 తస్యాః పూజావిధౌ బ్రహ్మన్ ఇతిహాసవిధిం శ్రుణు | యత్ శ్రుతం ధర్మముఖతః సుఖదం పుత్రదం పరం ||
7 ప్రకృతియొక్క ఆరవ అంశ కావున ఆమెను షష్ఠీ అనిపిలిచిరి. షష్ఠీదేవత బాలురకు అధిష్ఠాన దేవత, పుత్ర సంపత్తినిచ్చునది, విష్ణుమాయకూడ, ఆమె షణ్మాతృకలలో ప్రఖ్యాతిచెందిన "దేవసేన" అనునది. కుమారస్వామికి ఆ దేవత ప్రాణములకంటె ప్రియమైన భార్య. బాలకులకు ఆయుస్సును కలుగజేయుచు వారినెల్లప్పుడు రక్షించుచుండును. ఆమె శిశువుల పక్కనే ఉండి వారిని రక్షించుచుండును. ఆమె సిద్ధయోగినికూడ. ఆ షష్ఠీదేవియొక్క పూజావిధానమును చరిత్రను ధర్మదేవత చెప్పగా వింటిని. ఆ వృత్తాంతమును నీవుకూడా వినుము. రాజా ప్రియవ్రతశ్చాసీత్ స్వాయంభువ మనోః సుతః | యోగీంద్రోనోద్వహేద్భార్యాం తపస్యాసు రతః సదా ||
8 బ్రహ్మజ్ఞయా చ యత్నేన కృతదారో బభూవహ | సుచిరం కృతదారశ్చ నలభే తనయం మునే ||
9 పుత్రేష్టియజ్ఞం తంచాపి కారయామాస కశ్యపః | మాలిన్యై తస్యకాంతయై మునిర్యజ్ఞ చరుం దదౌ ||
10 భుక్త్వా చరుం తస్యాశ్చ సద్యాగర్భో బభూవహ | దధార తం చ సా దేవీ దైవం ద్వాదశవత్సరం ||
11 తతః సుషావ సా బ్రహ్మన్ కుమారం కనకప్రభం | సర్వావయవ సంపన్నం మృతముత్తార లోచనం ||
12 తందృష్ట్వా రురుదః సర్వానార్యో వై బాంధవస్త్రియః | మూర్ఛామవాప తన్మాతా పుత్రశోకేన సువ్రతా ||
13 శ్మశానం చ య¸°రాజా గృహీత్వా బాలకం మునే | రురోద తత్ర కాంతారే పుత్రం కృత్వా స్వవక్షసి ||
14 నోత్సృజ్య బాలకం రాజా ప్రాణాన్ త్యక్తుం సముద్యతః | జ్ఞానయోగం విసస్మార పుత్రశోకాత్ సుదారుణాత్ || 15 ఒకప్పుడు స్వాయంభువ మనువునకు ప్రియవ్రతుడు కొడుకు కలిగెను. అతడు సుజ్ఞానియై, యోగీంద్రుడై తపస్సుచేసికొనుచు వివాహము చేసికొనలేదు. కాని బ్రహ్మదేవుని ఆజ్ఞపై అతడు వివాహమును చేసికొన్నను అతనికి సంతానము కలుగలేదు. అందువలన కశ్యపప్రజాపతి ప్రియవ్రతునిచే పుత్రకామేష్టిని చేయించి యాగమందలి చరువును అతని భార్యయైన మాలినీ దేవికిచ్చెను. ఆ యజ్ఞ చరువుయొక్క ప్రసాదమువలన ఆ మహారాణి వెంటనే గర్భమును ధరించి పన్నెండు దివ్యసంవత్సరములు గర్భమును మోసి బంగారువంటి పుత్రుని కనెను. కాని ఆ శిశువు సమస్తావయవములతో నున్నను, కనుపాపలు తిరిగిపోయి మృతుడుగనే జన్మించెను. అందువలన మాలినీదేవి పుత్రశోకముతో మూర్ఛపడిపోగా ఆమె అంతఃపురముననున్న స్త్రీలు, బంధువులయొక్క భార్యలు అందరు దుఃఖము పొందిరి. రాజు ఆ శిశువును తీసికొని శ్మశానమునకు వెళ్ళినను, పుత్ర ప్రేమచే ఆ శిశువును వదలలేక జ్ఞానము నశించగా తన ప్రాణములను వదలుటకు సిద్ధపడెను. ఏతస్మిన్నంతరే తత్ర విమానం చ దదర్శ హ | శుద్ధస్ఫటిక సంకాశం మణిరాజవిరాజితం || 16 తేజసా జ్వలితం శశ్వత్ శోభితం క్షౌమవాససా | నానాచిత్ర విచిత్రాఢ్యం పుష్పమాలా విరాజితం || 17 దదర్శ తత్ర దేవీం చ కమనీయాం మనోహరాం | శ్వేతచంపక వర్ణభాం రమ్యసుస్థిర ¸°వనాం || 18 ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం రత్నభూషణ భూషితాం | కృపామయీం యోగసిద్ధాం భక్తానుగ్రహ కారిణీం || 19 దృష్ట్వా తాం పురతో రాజా తుష్టావ పరమాదరాత్ | చకార పూజనం తస్యాః విహాయ భువిబాలకం || 20 ఆ సమయమున అచ్చటికొక విమానము వచ్చెను. అదిపరిశుద్ధమైన స్ఫటికమువలె మిక్కిలి తెల్లనై, మణులతో ప్రకాశించుచుండెను. ఇంకను అది పట్టువస్త్రముతో కప్పబడి, చిత్రవిచిత్రములతో, పుష్పమాలలతో శోభించుచుండెను. ప్రియవ్రతు డా దేవిని చూడగనే తన ఒడిలోనున్న మృత శిశువును భూమిపై వదలి భక్తి భావముతో ఆమెను పూజించెను. పప్రచ్ఛ రాజా తాం దృష్ట్యా గ్రీష్మసూర్యసమప్రభాం | తేజసా జ్వలితాం శాంతాం కాంతాంస్కందస్య నారద || 21 గ్రీష్మకాలమందలి సూర్యుని ప్రకాశముతో వెలిగిపోవుచున్నప్పటికి, పరమశాంతముగానున్న దేవసేనను చూచి రాజు ఇట్లడిగెను. ప్రియవ్రత ఉవాచ- ప్రియవ్రతమహారాజిట్లనెను- కాత్వం సుశోభ##నే కాంతే కస్యకాంతాzపి సువ్రతే | కస్య కన్యావరారోహే ధన్యామాన్యా చ యోషితాం || 22 నృపేంద్రస్య వచ- శ్రుత్వా జగన్మంగళ దాయినీ | ఉవాచ దేవసేనా సా దేవరక్షణ కారిణీ || 23 దేవానాం దైత్యభీతానాం పురాసేనా బభూవసా | జయం దదౌ చ తేభ్యశ్చ దేవసేనా చ తేన సా || 24 అమ్మా నీవెవరవు? నీ భర్త ఎవడు? నీ తలిదండ్రులెవరు? నీవలన స్త్రీలందరకు గౌరవమేర్పడుచున్నది అని మహారాజనగా ప్రపంచమునంతయు మంగళమును కలిగించు ఆ దేవసేన ఇట్లనెను. పూర్వము దేవతలు రాక్షసులకు భయపడగా తానే దేవతలకు సేనగా మారి వారికి విజయమును చేకూర్చినందువలన ఆమె దేవసేన యైనది. దేవసేనోవాచ- దేవసేన ఇట్లు పలికెను- బ్రహ్మణో మానసీ కన్యా దేవసేనాహమీశ్వరీ | సృష్ట్యా మాం మనసో ధాతా దదౌ స్కందాయ భూమిప || 25 మాతృకాసు చ విఖ్యాతాస్కందసేనా చ సువ్రతా | విశ్వే షష్ఠీతి విఖ్యాతా షష్ఠాంశా ప్రకృతేర్యతః || 26 పుత్రదాzహమపుత్రాయ ప్రియాదాత్రీ ప్రియాయ చ | ధనదాచ దరిద్రేభ్యః కర్తృభ్యః శుభ కర్మదా || 27 సుఖం దుఃఖం భయం శోకం హర్షం మంగళ##మేవ చ | సంపత్తిశ్చ విపత్తిశ్చ సర్వం భవతి కర్మణా || 28 కర్మణా బహుపుత్రీచ వంశహీనశ్చ కర్మణా | కర్మణా రూపవాంశ్చైవ రోగీశశ్వత్ స్వరక్మణా || 29 కర్మణా మృతపుత్రశ్ఛ కర్మణా చిరజీవినః | కర్మణా గుణవంతశ్చ కర్మణా చాంగహీనకాః || 30 తస్మాత్కర్మ పరం రాజన్ సర్వేభ్యశ్చ శ్రుతౌ శ్రుతం | కర్మరూపే చ భగవాన్ తద్వారా ఫలదో హరిః || 31 మహారాజా! నేను బ్రహ్మదేవునియొక్క మానసపుత్రిని. బ్రహ్మ నన్ను సృష్టించి కుమారస్వామికి భార్యగా నన్ను ఒసగెను. నేను షణ్మాతృదేవతలలో ప్రఖ్యాతి గాంచిన స్కందసేనను. ప్రకృతియొక్క ఆరవఅంశను కావున నన్ను షష్ఠీ అని కూడ పిలుతురు. నేను పుత్రులులేని వారికి పుత్రులను, ప్రేయసిలేని వారికి ప్రేయసిని, దరిద్రులకు ధనమును కర్మలు చేయువారికి శుభకర్మలను, ఇత్తును. జీవులకు సంపదయైనను, ఆపదయైనను వారు వారు చేసికొన్న కర్మలవలననే జరుగును. ఆ కర్మవలన జీవుడు బహుసంతానవంతుడుగాను, సంతాన హీనుడుగాను, రూపవంతుడుగాను, రోగిగాను, మృతపుత్రుడుగాను, చిరంజీవిగాను అగుచున్నాడు. అందువలన కర్మ అన్నిటికంటె గొప్పదని వేదములందు చెప్పబడినది. శ్రీహరి ఆయా జీవులు చేసి కర్మల ననుసరించి ఆయా ఫలితముల నొసగుచున్నాడు. ఇత్యేవముక్త్యా సా దేవీ గృహీత్వా బాలకం మునే | మహాజ్ఞానేన సహసా జీవయామాస లీలయా || 32 రాజా దదర్శ తం బాలం సస్మితం కనకప్రభం | దేవసేనా చ పశ్యంతం నృపమంబరమేవ చ || 33 గృహీత్వా బాలకం దేవీ గగనం గంతుముద్యతా | పునస్తుష్టావ తాం రాజా శుష్కకంఠౌష్ఠతాలుకః || 34 నృపస్తోత్రేణ సా దేవీ పరితుష్టా బభూవ హ | ఉవాచ తం నృపం బ్రహ్మన్ వేదోక్తం కర్మ నిర్మితం || 35 షష్ఠీదేవి మహారాజుతో పై విధముగా అని చనిపోయిన ఆ బాలుని చేతిలోనికి తీసికొని అతనిని బ్రతికించెను. తనపుత్రుడు బ్రతికి నవ్వుతున్నట్లు కన్పించెను. అప్పుడు దేవి బాలకుని పట్టుకొని ఆకాశములోకి ఎగిరిపోవుటకు ప్రయత్నించినది. అప్పుడా రాజు తన పుత్రడు బ్రతికెనను సంతోషముతో ఉండగానే, దేవసేన శిశువును తన లోకమునకు తీసికొని పోనుండుట చూచి పెదవులు గొంతు, నాలుక ఆరిపోగా బాధతో ఆ దేవిని మరల స్తుతించెను. రాజు చేసిన స్తుతికి సంతోషపడి ఆ దేవి అతనితో ఇట్లనెను. దేవసేనోవాచ- దేవసేన ఇట్లు పలికెను- త్రిషులోకేషు రాజా త్వం స్వాయంభువ మనోః సుతః | మమపూజాం చ సర్వత్ర కారయిత్వా స్వయం కురు || 36 తదాదాస్యామి పుత్రం తే కులపద్మం మనోహరం | సువ్రతం నామ విఖ్యాతం గుణవంతం సుపండితం || 37 జాతిస్మరం చ యోగీంద్రం నారాయణ పరాయణం | శతక్రతుకరం శ్రేష్ఠం క్షత్రియాణాం చ వందితం || 38 మత్తమాతంగలక్షాణాం ధృతవంతం బలం శుభం | ధన్వినం గుణినం శుద్ధం విదుషాం ప్రియమేవ చ || 39 యోగినం జ్ఞానినం చైవ సిద్ధరూపం తపస్వినం | యశస్వినం చ లోకేషు దాతారం సర్వసంపదాం || 40 ప్రియవ్రత మహారాజా!నీవు ముల్లోకములకు రాజువు. నీ తండ్రి మనువైన స్వాయంభువు. అటువంటి నీవు నా పూజను స్వయముగా చేయుచు ఇతరులతో కూడ చేయింపుము. అప్పుడు నేను నీ పుత్రుని నీకు తిరిగి ఇత్తును. నీ కుమారుడు సువ్రతుడను పేరుతో మంచి గుణములు కలవాడై , పండితుడై, తన గతస్మృతి కలవాడై యుంéడును. అతడు శ్రీమన్నారాయణభక్తుడగును. అట్లే అతడు నూరు రాజసూయయాగములు చేసి ఈ లోకమందున్న క్షత్రియులందరిచే మన్ననలు పొందును. అతడు మదించిన లక్ష ఏనుగుల బలము కలవాడై యోగియై, జ్ఞానియై తపస్వియై, యశస్వియై వెలుగొందును. ఇత్యేవ ముక్త్యా సా దేవీ తసై#్మ తద్బాలకం దదౌ | రాజా చ తం స్వీచకార తత్పూజార్థం చ సువ్రతః || 41 జగామ దేవీ స్వర్గం చ దత్వా తసై#్మ శుభం వరం | ఆజగామ మహారాజః స్వగృహం హృష్టమానసః | ఆగత్య కథయా మాస వృత్తాంతం పుత్రహేతుకం || 42 తుష్టా బభూవుః సంతుష్టా నరా నార్యశ్చ నారద | మంగళం కారయామాస సర్వత్ర సుతహేతుకం | దేవీం చ పూజయామాస బ్రాహ్మణభ్యో ధనం దదౌ || 43 ఈ విధముగా దేవసేన సుప్రియవ్రత మహారాజుతో అనగా అతడు సరే అనెను. అప్పుడా దేవి ఆ శిశువును మహారాజునకు ఇచ్చెను. అతనికి శుభములను కలుగజేయుచు స్వర్గమునకు వెళ్ళెను. మహారాజు సంతోషముతో ఇంటికివచ్చి అందరకు తన పుత్రుని వృత్తాంతమును వినిపించగా వారందరు సంతోషించిరి. తరువాత మహారాజు తనకు పుత్రుడు కలిగిన వేడుకను జరిపించెను. అట్లే దేవసేనను పూజించి బ్రాహ్మణులకు ధనమును పంచిపెట్టెను. రాజా చ ప్రతిమాసేషు శుక్లపష్ఠ్యాం మహోత్సవం | షష్ఠ్యా దేవ్యాశ్చ యత్నేన కారయామాస సర్వతః || 44 బాలానాం సూతికాగారే షష్ఠాహే యత్న పూర్వకం | తత్పూజాం కారయామాస చైకవింశతి వాసరే || 45 బాలానాం శుభకార్యే చ శుభాన్నప్రాశ##నే తథా | సర్వత్ర వర్ధయామాస స్వయమేవ చకార హ || 46 ప్రియవ్రతుడు ప్రతినెలలో శుద్ధషష్ఠినాడు షష్ఠీదేవీ పూజను అంతట అందరిచే చేయించెను. పిల్లలు పుట్టిన ఆరవ దినమున, ఇరువది ఒకటవ నాడు అన్నప్రాశనము చేయించునాడు దేవసేనా దేవి పూజ అంతట జరుగునట్లు ఏర్పాటు చేసెను. అట్లే తాను కూడా ఆ దినములలో దేవిని పూజించెను. ధ్యానం పూజా విధానం చ స్తోత్రం మత్తో నిశామయ | యచ్చ్రుతం ధర్మవక్త్రేణ కౌథుమోక్తం చ సువ్రత || 47 శాలగ్రామే ఘటే వాzథ వటమూలేzథవా మునే | భిత్యాం పుత్తలికాం కృత్వా పూజయే ద్వా విచక్షణః || 48 షష్ఠాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్ఠాం చ సువ్రతాం | సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ర్పసూం || 49 శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణ భూషితాం | పవిత్రరూపాం పరమాం దేవసేనామహం భ##జే || 50 నారద! "దైవసేన" యొక్క ధ్యానశ్లోకములను, స్తోత్రమును, పూజావిధిని వినుము. ఇది కౌథుమశాఖయందు కన్పించును. దీనిని ధర్మదేవత నాకు తెల్పెను. తొలుత సాలగ్రామమున లేక కలశమున కాకపోయినచో వటవృక్షముయొక్క మూలమున లేక గొడపై షష్ఠీదేవి బొమ్మను వేసి ఆమెను పూజింపవలెను. ఆమె ప్రకృతి యొక్క ఆరవ అంశ. పరిశుద్ధురాలు, మంచి ప్రతిష్ఠగలది. చక్కిని పుత్రులనిచ్చునది. శుభములనిచ్చునది. కృపామయి. లోకములకు తల్లి, తెల్లని చంపక పుష్పములవంటి కాంతిగలది. రత్నాలంకారములు కలది పవిత్రమైనది. అట్టి దేవసేనను నేను సేవించుచున్నాను. ఇతిధ్యాత్వా స్వశిరసి పుష్పం దత్వా విచక్షణః | పునర్ధ్యాత్వా చ మూలేన పూజయేత్ సువ్రతః సతీం || 51 పాద్యార్ఘ్యాచమనీయైశ్చ గంధధూపప్రదీపకైః | నైవేద్యై ర్వివిధైశ్చాపి ఫలేన చ శుభేన చ || 52 మూలమోం హ్రీం షష్ఠీ దేవ్యై స్వాహేతి విధిపూర్వకం | అష్టాక్షరం మహామంత్రం యథాశక్తి జపేన్నరః || 53 తత్రస్తుత్వా చ నమతే భక్తి యుక్తః సమాహితః | స్తోత్రం చ సామవేదోక్త ధనపుత్రఫలప్రదం || 54 అష్టాక్షకరం మహామంత్రం లక్షధా యో జపేన్నరః | స పుత్రం లభ##తే నూనమిత్యాహ కమలోద్భవః || 55 స్తోత్రం శ్రుణు మునిశ్రేష్ఠ సర్వేషాం చ శుభావహం | వాంఛాప్రదం చ సర్వేషాం గూఢం వేదే చ నారద || 56 ఈ విధముగా ధ్యానించి పుష్పములను సమర్పించి మరల మూలమంత్రముచే ధ్యానము చేయవలెను. ఆ తరువాత ఆర్ఘ్యము పాద్యము, ఆచమనీయము, గంధము, ధూపము, దీపము నైవేద్యము మొదలగూ షోడశోపచారములతో దేవసేనా దేవిని పూజింపవలెను. ఓం హ్రీం షష్ఠీదేవ్యై స్వాహా అను అష్టాక్షరీ మంత్రము మూలమంత్రము ఆ మంత్రమును యథాశక్తి జపించవలెను. దీనిని లక్షమార్లు జపము చేసినచో సంతానము కలుగునని బ్రహ్మదేవుడు చెప్పెను. నారదమునీ! దేవసేనాదేవియొక్క సోత్రము అందరకు శుభమును కలిగించును. అన్ని కోరికలు తీర్చును. ఇది వేదములందు నిగూఢమై ఉన్నది. ఆ స్తోత్రమును నీకు వినిపించెదను. ప్రియవ్రత ఉవాచ- ప్రియవ్రత మహారాజిట్లనెను- నమోదేవ్యై మహాదేవ్యై సిద్యైశాంత్యై నమో నమః | సుఖదాయై మోక్షదాయై షష్ఠీదేవ్యై నమోనమః || 57 వరదాయై పుత్రదాయై ధనదాయై నమోనమః | సుఖదాయై మోక్షదాయై షష్ఠీదేవ్యై నమోనమః || 58 శ##క్తేః షష్ఠాంశ రూపాయై సిద్ధాయై చ నమోనమః | మాయయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమోనమః || 59 పరాయై పారదాయై చ షష్ఠీ దేవ్యై నమో నమః | సారాయై సారదాయై చ పారాయై సర్వకర్మణాం || 60 బాలాధిష్ఠాతృదేవ్యై చ షష్ఠీ దేవ్యై నమోనమః | కళ్యాణదాయై కళ్యాణ్యౖ ఫలదాయై చ కర్మణాం || 61 ప్రత్యక్షాయై చ భక్తానాం షష్ఠీ దేవ్యై నమోనమః | పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు || 62 దేవరక్షణ కారిణ్యౖ షష్ఠీదేవ్యై నమో నమః | శుద్ధ సత్వ స్వరాపాయై వందితాయై నృణాంసదా || హింసా క్రోధైర్వర్జితాయై షష్ఠీ దేవ్యై నమో నమః | ధనం దేహి ప్రియాం దేహి పుత్రం దేహి సురేశ్వరి || 64 ధర్మందేహి యశోదేహి షష్ఠీదేవ్యై నమోనమః | భూమిం దేహి ప్రజాం దేహి దేహి విద్యాం సుపూజితే || 65 కళ్యాణం చ జయం దేహి షష్ఠీ దేవ్యై నమోనమః | ఇతి దేవీం చ సంస్తూయ లేభే పుత్రం ప్రియవ్రతః || 66 యశస్వినం చ రాజేంద్రం షష్ఠీదేవీ ప్రసాదతః | షష్ఠీదేవి మహాదేవి సిద్ధిరూపిణి, శాంతి స్వరూపిణి, సుఖమును ప్రసాదించునది. మోక్షమును కల్గించునది, వరములను, పుత్రులను, ధనమును, ఇచ్చునది. శక్తిరూపిణియైన ప్రకృతి యొక్క ఆరవ అంశ. సిద్ధరూపిణి మాయాస్వరూపిణి, సిద్ధ యోగిని, పరా, పారద, సార, సారద, సారారూపిణి, బాలురకు అధిష్ఠానదేవత, కల్యాణముల కలిగించునది. కల్యాణ రూపిణి. సమస్తకర్మల ఫలితము నొసగునది, భక్తులకు ప్రత్యక్షమగునది. పూజించ తగినది కుమారస్వామికి భార్య, దేవతలను రక్షించునది. శుద్ధసత్వస్వరూప. మానవులందరిచే నమస్కరించదగినది. హింస, క్రోధము మొదలగు దుర్గణములు లేనిది. అట్టి షష్ఠీ దేవతను నేను మాటిమాటికి నమస్కరింతును. ఓ తల్లీ ! నీవు నాకు ధనమును, భార్యను, పుత్రుని, ధర్మమును, కీర్తిని భూమిని, సత్సంతానమును, శుభమును, జయమును, కల్గింపుము. ఈ విధముగా ప్రియవ్రతుడు షష్ఠీదేవిని స్తుతించి ఆమె అనుగ్రహమునువలన తన పుత్రుని పడసెను. షష్ఠీ స్తోత్రమిదంపుణ్యం యః శ్రుణోతి చ వత్సరం || 67 అపుత్రో లభ##తే పుత్రం వరం సుచిరజీవినం | వర్షమేకం చ యో భక్త్యా సంయుక్త్యేదం శ్రుణోతి చ || 68 సర్వపాపాద్వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే | వీరపుత్రం చ గుణినం విద్యావంతం యశస్వినం || 69 సుచిరాయుష్మంతమేవ షష్ఠీ మతృప్రసాదతః | కాకవంద్యా చ యా నారీ మృతాపత్యా చ యాభ##వేత్ || 70 వర్షం శ్రుత్వా లబేత్పుత్రం షష్ఠీదేవీ ప్రసాదతః | రోగయుక్తే చ బాలే చ పితామాతా శ్రుణోతి చ || 71 మాసం చ ముచ్యతే బాలః షష్ఠీదేవీ ప్రసాదతః || 72 షష్ఠీదేవతయొక్క ఈ స్త్రోత్రమును సంవత్సర పర్యంతము ఎవరు విందురో వారికి పుత్రులు లేనిచో చిరంజీవియగు పుత్రుని , పొందుదురు. ఆ స్త్రీ ఎంత గొడ్రాలైనను సమస్త పాపములనుండి ముక్తిపొంది వీరుడు, మంచిగుణవంతుడు, విద్యావంతుడు కీర్తివంతుడు మంచి ఆయుస్సు కలవాడగు పుత్రుని ప్రసవించును. ఒకే సంతానము కలిగిన స్త్రీ లేక సంతానము కలిగిన తరువాత ఆ సంతానము నశించు స్త్రీ సైతము ఒక సంవత్సరకాలము ఈస్తోత్రమును భక్తితో విన్నచో దీర్ఘాయుస్సు కల సంతానమును పొందును. అనారోగ్యముగా తమ సంతానమున్నచో ఆ శిశువు తలిదండ్రులు ఒక నెలవరకు నియమముగా షష్ఠీదేవియొక్క స్తోత్రమును వినినచో ఆ శిశువు షష్ఠీదేవియొక్క అనుగ్రహమువలన రోగనిర్ముక్తుడగును. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారదనారాయణ సంవాదే షష్ఠ్యపాఖ్యానే షష్ఠీ దేవ్యుత్పత్తి తత్పూజా స్తోత్రాది కథనం నామ త్రిచత్వారింశత్తమోzధ్యాయః|| శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమును నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన షష్ఠీదేవత ఉపాఖ్యానమున షష్ఠీదేవి జననము, ఆమె పూజా స్తోత్రాదులు గల నలభైమూడవ అధ్యాయము సమాప్తము.