sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుశ్చత్వాంశత్తమోzధ్యాయః - మంగళోపాఖ్యానము నారాయణ ఉవాచః నారాయణుడిట్లు నారదునితో అనెను- కథితం షష్ఠ్యుపాఖ్యానం బ్రహ్మపుత్ర యథాగమం | దేవీ మంగళచండీ చ తదాఖ్యానం నిశామయ ||
1 తస్యాః పూజాదికం సర్వం ధర్మవక్త్రాచ్చ యచ్ఛ్రతం | శ్రుతి సమ్మతమేవేష్టం సర్వేషాం విదుషామపి ||
2 చండాయాం వర్తతే చండీ జాగ్రతీ శత్రుమండలే | మంగళేషు చ యా దక్షా మంగళా సైవ చండికా ||
3 దుర్గాయాం విద్యతే చండీ మంగళోzపి మహీసుతే | మంగళాzభీష్ట దేవీ యాసా స్యాన్మంగళ చండికా || 4 మంగళో మనువంశశ్చ సప్తద్వీపావనీపతిః | తస్య పూజ్యాzభీష్టదేవీ తేన మంగళచండికా || 5 మూర్తి భేదేన సా దుర్గా మూలప్రకృతిరీశ్వరీ | కృపారూపాతిప్రత్యక్షా యోషితా మిష్టదేవతా || 6 నారదా! నీకు ఇంతవరకు షష్ఠీదేవి చరిత్రము తెల్పితిని. ఇప్పుడు మంగళచండీదేవియొక్క ఉపాఖ్యానమును వినుము. అట్లే ధర్మదేవతవలన నేను ఆమెయొక్క పూజ మొదలగువానిని వినుము. ఇది సమస్త వేద సమ్మతము. విద్వాంసులచే ఆమోదితము. శత్రవులమధ్య భయంకరముగానుండి ప్రకాశించుచున్నందువలన ఆమె చండియైనది. అట్లే మంగళకార్యములు చేయించుటలో సమర్థురాలైనందువలన మంగళ##యైనది. ఆదేవి మంగళరూపిణి, అట్లే చండస్వరూపిణి. రెండువిధములైన రూపములతో నున్నందువలన ఆ దేవి మంగళ చండికయైనది. అట్లే దుర్గాదేవికి ఇంకొకపేరు చండిక, మంగళుడను పేరు కుజునకు గలదు, మంగళునకు ఇష్టదేవత కావున ఆమె మంగళచండికయైనది. మనువంశమునందు మంగళుడను రాజు ఈ భూమినంతయు పరిపాలించుచుండెను. ఆ మహారాజునకు అభీష్టదేవి కావున ఆమె మంగళచండికయైనది. ఆ దేవియొక్క మరొక రూపమే దుర్గ. ఆ దేవి మూలప్రకృతి రూపిణి. ఈశ్వరి. మిక్కిలి దయగలది. స్త్రీలందరకు ఇష్టదేవత. ప్రథమే పూజితా సా చ శంకరేణ పురా పరా | త్రిపురస్య వధే ఘోరే విష్ణునా ప్రేరితేన చ || 7 బ్రహ్మన్ బ్రహ్మోపదేశేన దుర్గప్రస్థే చ సంకటే | ఆకాశాత్పతితే యానే రుషా దైత్యేన పాతితే || 8 బ్రహ్మవిష్ణూపదిష్టశ్చ దుర్గాం తుష్టావ శంకరః | సా చ మంగళచండీయం అభవద్రూప భేదతః || 9 ఈ దేవిని తొలుత శంకరుడు త్రిపురాసురవధ కాలమున స్తుతించెను. త్రిపురాసురుల యుద్ధము ఘోరముగా జరుగుచుండగా దానవుడు కోపముతో శంకరుని రథమును ఆకాశమునుండి కిందికి పడవేయుచున్నప్పుడు బ్రహ్మ, విష్ణుమూర్తులయొక్క ప్రేరణ వలన శంకరుడు దుర్గాదేవిని స్తుతించెను. ఆ దుర్గాదేవియై రూపభేదమున మంగళచండికయైనది. ఉవాచ పురతః శంభోః భయం నాస్తీతి తే ప్రభో | భగవాన్ వృషరూపశ్చ సర్వేశశ్చ బభూవ హ || 10 యుద్ధశక్తి స్వరూపాzహం భవిష్యామి తదాజ్ఞయా | మయాత్మనాచ హరిణా సహాయేన వృషధ్వజ|| 11 జహి దైత్యం చ దేవేశ సురాణాం పదఘాతకం | ఇత్యుక్త్వాzంతర్హితా దేవీ శంభోః శక్తిర్బభూవహ || 12 విష్ణుదత్తేన శ##స్త్రేణ జఘాన తముమాపతిః | మునీంద్రపతితే దైత్యే సర్వే దేవా మహర్షయః || 13 తుష్టువుః శంకరం దేవాః భక్తినమ్రాత్మ కంధరాః | సద్యః శిరసి శంభోశ్చ పుష్పవృష్టిర్బభూవ హ || 14 ఆ మంగళచండిక శంకరునితో "నీవు భయపడవలసిన అవసరము లేదు. భగవంతుడు సర్వేశ్వరుడగు శ్రీహరి నీకు వృషభరూపమును ధరించును. నేను ఆ శ్రీహరి ఆజ్ఞననుసరించి యుద్ధ శక్తిస్వరూపనై నీకు సహాయము చేయుదును. మా యిద్దరి సహాయముతో దేవతలను స్వర్గమునుండి తొలగించిన త్రిపురాసురుని సంహరింపుమని చెప్పి ఆ దేవి అంతర్థానము చెందెను. ఆ తర్వాత ఆమె శంకరునకు శక్తిగా మారినది. అప్పుడు శంకరుడు శ్రీహరి తనకిచ్చిన శస్త్రముచే త్రిపురాసురుని సంహరించెను. అప్పుడు దేవతలు, మహర్షులందరు సంతోషపడిరి. దేవతలు శంకరునకు భక్తిశ్రద్ధలతో స్తోత్రములు చేసిరి. ఆతని శిరస్సుపై పుష్పవృష్టిని కురిపించిరి. బ్రహ్మా విష్ణుశ్చ సంతుష్టో దదౌ తసై#్మ శుభాశిషం | బ్రహ్మావిష్ణూపదిష్టశ్చ సుస్నాతః శంకరః శుచిః || 15 పూజయామాస తాం శక్తిం దేవీం మంగళచండికాం | పాద్యార్ఘ్యాచమనీయైశ్చ బలిభిర్వివిధైరపి || 16 పుష్పచందన నైవేద్యైః భక్త్యా నానావిధైర్మునే | ఛాగైర్మేషైశ్చ మహిషైర్గండై ర్మాయావిభిర్వరైః || 17 వస్త్రాలంకార మాల్యైశ్చ పాయసైః పిష్టకైరపి | మధుభిశ్చ సుధాభిశ్చ పక్వైర్నానావిధైః ఫలైః || 18 సంగీతైర్నార్తనై ర్వాద్యైరుత్సవైః కృష్ణకీర్తనైః | ధ్యాత్వా మాధ్యందినోక్తేన ధ్యానేన విధిపూర్వకం ||19 దదౌద్రవ్యాణి మూలేన మంత్రేణౖవ చ నారద | ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళ చండికే || 20 ఐం క్రూం ఫట్ స్వాహేత్యేవం చాప్యేకవింశాక్షరోమనుః | బ్రహ్మదేవుడు నారాయణుడు సంతోషించి శంకరునకు శుభాశీస్సుల నొసగిరి, తరువాత శ్రీహరి ఉపదేశముననుసరించి శంకరుడు స్నానముచేసి శుచియై మంగళచండికాదేవిని ఇట్లు పూజించెను. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, వివిధబలులు, పుష్పములు, చందనము, గొఱ్ఱలు, మేకలు, దున్నపోతులు మొదలగు నైవేద్యములు, వస్త్రములు, అలంకారములు, మాలలు, పాయసములు, పిండివంటలు, తేనెలు మొదలగు తీపి వస్తువులు, అనేక విధములైన పక్వాన్నములు, పండ్లు సంగీతము, నృత్యము, వాద్యము మొదలగు వాటిచే శ్రీకృష్ణకీర్తనలచే మంగళ చండికను శాస్త్రోక్తప్రకారముగా మాధ్యందిన శాఖయందు చెప్పబడున పద్ధతిలో మూలమంత్రముతో శంకరుడు పూజించెను. ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే ఐం క్రూం ఫట్ స్వాహా అనునది మూలమంత్రము. పూజ్యః కల్పతరుశ్చైవ భక్తానాం సర్వకామదః | దశలక్షజపేనైవ మంత్రసిద్ధిః భ##వేత్ నృణాం || 21 మంత్రసిద్ధిర్భవేద్యస్య సవిష్ణుః సర్వకామదః | ఈ మూలమంత్రము కల్పతరువు వంటిది. భక్తులయొక్క సమస్త కోరికలను తీర్చును. ఈ మంత్రమును పదిలక్షల పర్యాయము జపించినచో మంత్రసిద్ధి కలుగును. ధ్యానం చ శ్రూయతాం బ్రహ్మన్ వేదోక్తం సర్వసమ్మతం || 22 దేవీం షోచశవర్షీయాం రమ్యాం సుస్థిర ¸°వనాం | సర్వరూపగుణాఢ్యాం చ కోమలాంగీం మనోహరాం || 23 శ్వేతచంపకవర్ణాభాం చంద్రకోటి సమప్రభాం | వహ్నిశుద్ధాంశుకాధానాం రత్నభూషణభూషితాం || 24 బిభ్రతీం కబరీభారం మల్లికా మాల్యభూషితం | బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్పద్మనిభాననాం ||25 ఈషద్ధాసప్రన్నాస్యాం సునీలోత్పలం లోచనాం | జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదాం || 26 సంసారసాగరే ఘోరే పోతరూపాం వరాం భ##జే || 27 నారదా ! మంగళచండిక యొక్క ధ్యానశ్లోకములను వినుము. అది వేదములందు చెప్పబడినది సర్వసమ్మతమైనది. మంగళచండికాదేవి పదునారు సంవత్సరముల వయసు కలది. అందమైనది. స్ధిరమైన వయసు కలది. సమస్త రూపములు గుణములు కలది. కోమలమైన అవయవములు కలది, తెల్లని చంపక పుష్పములవంటి రంగుకలది, కోటి చంద్రులవంటీ కాంతి కలది, మేలిమి బంగారువన్నెగల వస్త్రము ధరించునది. రత్నభూషణములు కలది. మల్లెలమాలలను కొప్పున ధరించునది. దొండపండు వంటి పెదవులు, చక్కని పలువరుస, శరత్కాలచంద్రునివంటి ముఖము, చిరునవ్వుకల ముఖము, నీలోత్పలములవంటి కండ్లు కలది. ఈ లోకములన్నిటిని రక్షించునది. సమస్త సంపదల నొసగునది. భయంకరమైన సంసారమనే సముద్రమున నున్న ఓడ వంటిది. అట్టి మంగళ చండికాదేవిని నేనెల్లప్పుడు సేవించుచుందును. దేవ్యాశ్చ ధ్యానమిత్యేవం స్తవనం శ్రూయతాం మునే | ప్రయతః సంకటగ్రస్తో యేన తుష్టావ శంకరః || 28 ఇది మంగళచండీదేవి యొక్క ధ్యానము. ఇక ఆపద కలిగినప్పుడు శంకరుడు మంగళచండికను ఎట్లు స్తుతించెనో దానిని నీకు తెలుపుచున్నానని నారాయణుడనెను. శంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను- రక్ష రక్ష జగన్మాతః దేవి మంగళ చండికే | సంహర్త్రి విపదాం రాశే దేవి మంగల చండికే || 29 హర్షమంగళదక్షే చ హార్ష మంగళ చండికే | శుభే మంగళదక్షే చ శుభమంగళ చండికే || 30 మంగళే మంగళార్హే చ సర్వమంగళ మంగళే | సతాం మంగళ##దే దేవి సర్వేషాం మంగళాలయే || 31 పూజ్యా మంగళవారే చ మంగళాభీష్ట దైవతే | పూజ్యే మంగళభూపస్య మనువంశస్య మనువంశస్య సంతతం || 32 మంగళాధిష్ఠాతృదేవి మంగళానాం చ మంగళే | సంసారే మంగళాధారే మోక్షమంగళ దాయిని || 33 సారే చ మంగళాధారే పారే త్వం సర్వకర్మణాం | ప్రతిమంగళవారం చ పూజ్యే త్వం మంగళప్రదే || 34 స్తోత్రేణానేన శంభుశ్చ స్తుత్వా మంగళ చండికాం | ప్రతిమంగళవారే చ పూజాం కృత్వా గతః శివః || 35 మంగళ చండికా స్తోత్రము c
ఓ దేవి! మంగళచండికా ! జగములకు తల్లీ ! నన్ను రక్ష్మింపుము. నీవు ఆపదలను పోగొట్టెదవు. సంతోషమమును మంగళములను కలిగించు దానవు. శుభస్వరూపిణివి. శుభమంగళ చండికవు. సమస్త మంగళములకు మంగళ##మైన దానవు. నీవు మంగళగా, మంగళార్హవుగా పిలువబడుచున్నావు.
ఓ దేవి ! నీవు సజ్జనులకు మేలును చేకూర్తువు. మంగళములకు నిలయమైన దాలవు. మంగళవారమున పూజలందుకొనుచున్న దానవు. మంగళుడగు కుజునకు ఇష్టదేవతవు. అట్లే మనువంశమున పుట్టిన మంగళుడను భూపతిచే పూజలనందుకొన్న దానవు. మంగళములకు అధిష్ఠాన దేవతవు. మంగళములకే మంగళ##మైన దానవు. మంగళమయమైన సంసారమున అందరకు మోక్షమును మంగళమును కలిగించుదానవు. నీకు సార, మంగళాధారము మొదలగు పేర్లు కలవు. ప్రతిమంగళవారమున పూజించదగిన దాలవు. నీవు అందరకు మంగళములను కల్గించుదానవు.
శంకరుడిట్టి స్తోత్రముచే మంగళచండికను స్తుతించి ప్రతిమంగళవారమున ఆమెకు పూజచేసి తన లోకమును చేరుకొనెను.
దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శ్రుణోతి సమాహితః | తన్మంగళం భ##వేత్ శశ్వత్ న భ##వేత్తదమంగళం || 36
ప్రథమే పూజితా దేవీ శంభునా సర్వమంగళా | ద్వితీయే పూజితా దేవీ మంగళేన గ్రహేణ చ || 37
తృతీయే పూజితా దేవీ మంగళేన నృపేణ చ | చతుర్థే మంగళేవారే సుందరీభిశ్చ పూజితా |
పంచమే మంగళాకాంక్షైః నరైః మంగళచండికా || 38
పూజితా ప్రతివిశ్వేషు విశ్వేశైః పూజితా సదా | తతః సర్వత్ర సంపూజ్య సా బభూవ సురేశ్వరి || 39
దేవాదిభిశ్చ మునిభిర్మనుభిర్మానవైర్మునే |
మంగళ చండికా దేవి యొక్క ఈ స్తోత్రమును ఎవరు శ్రద్ధతో విందురో వారికి ఎల్లప్పుడు మంగళ##మే జరుగును. అమంగళము ఎప్పుడును జరుగదు.
ఆ దేవిని తొలుత శంకరుడు పూజించెను. తరువాత మంగళగ్రహమగు కుజుడు పూజించెను. అటు పిమ్మట మంగళుడను రాజు ఆమెను పూజించెను. ఆ తరువాత మంగళవారము ఆమెను స్త్రీలు పూజించిరి. పిమ్మట మంగళములను కోరుకొను మానవు లా మంగళచండికను పూజించిరి. ఆ దేవిని ప్రపంచముననున్న దేవతలందరు పూజింతురు. ఆ తర్వాత ఆమెను దేవతలు, మునులు, మనువులు, మానవులు అందరు పూజించిరి. ఆందువలన ఆ దేవి దేవతలకందరకు ఈశ్వరియైనది.
దేవ్యాశ్చ మంగళస్తోత్రం యః శ్రుణోతి సమాహితః || 40
తన్మంగళం భ##వేత్ శశ్వత్ న భ##వేత్తద మంగళం | వర్ధంతే తత్పుత్ర పౌత్రా మంగళం చ దినే దినే || 41
మంగళ##దేవి యొక్క ఈ స్తోత్రమును భక్తిశ్రద్ధలతో విన్నవారికి ఎల్లప్పుడు మంగళ##మే కలుగునుకాని అమంగళము మాత్రము కలుగదు. వారికి ప్రతిదినము పుత్రపౌత్రాభివృద్ధి తప్పక జరుగును.
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే మంగళోపాఖ్యానే తత్ స్తోత్రాదికథనం నామ చతుశ్చత్వారింశత్తమోzధ్యాయః
శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతి ఖండమున, నారదనారాయణ సంవాదమున చెప్పబడిన మంగళచండికా కథలో ఆమె స్తోత్రాదులను తెలుపు
నలుభై నాలుగవ అధ్యాయము సమాప్తము.