sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచచత్వారింశత్తమోzధ్యాయః - మనసా దేవి ఉపాఖ్యానము నారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లనెను- ఉక్తం ద్వయోరుపాఖ్యానం బ్రహ్మపుత్ర యథాగమం | శ్రూయతాం మనసాఖ్యానం యచ్ఛ్రుతం ధర్మవక్త్రతః ||
1 కన్యా భగవతీ సా చ కశ్యపస్య చ మానసీ | తేనేzయం మనసా దేవీ యోగేనేతైన దీవ్యతి || 2 మనసా ధ్యాయతే యా వా పరమాత్మానమీశ్వరం | తేన సా మనసా దేవీ యోగీనేతైన దీవ్యతి || 3 ఆత్మారామా చ సాదేవీ వైష్ణవీ సిద్ధయోగినీ | త్రియుగం చ తపస్తప్త్వా కృష్ణస్య పరమాత్మనః || 4 నారదమహర్షీ! నీకు షష్ఠీదేవి మంగళచండికాదేవి ఈ ఇద్దరి కథను తేల్పితిని. ఇక ఇప్పుడు ధర్మునివలన నేను విన్న మనసా దేవియొక్క ఉపాఖ్యానమును వినుము. కశ్యప ప్రజాపతికి మానసిక అను పుత్రిక కలదు. మానసిక పుత్రి కావున ఆకన్యను మనస యని పిలుతురు. లేక పరమాత్మను సదా మనసున ధ్యానించునది కావున 'మనస' యైనది. ఆదేవి తనలో తానే రమించునది. సిద్ధయోగిని, వైష్ణవికూడ అందువలన ఆమె పరమాత్మయగు శ్రీకృష్ణుని గురించి మూడు యుగములు తపస్సు చేసినది. జరత్కారు శరీరం దృష్ట్యా యాం క్షణమీశ్వరః | గోపీపతిర్నామ చక్రే జరత్కారురితి ప్రభుః || 5 వాంఛితం చ దదౌ తసై#్య కృపయా చ కృపానిధిః | పూజాంచ కారయామాస చకార చ పునః స్వయం || 6 స్వర్గే చ నాగలోకే చ పృథివ్యాం బ్రహ్మలోకతః | భృశం జపత్సు గౌరీ సా సుందరీ చ మనోహరా || 7 జగద్గౌరీతి విఖ్యాతా తేన సా పూజితా సతీ | శివశిష్యా చ సా దేవీ తేనశైవీతి కీర్తితా || 8 విష్ణుభక్తాzతీవరమ్యా వైష్ణవీ తేన నారద | నాగానాం ప్రాణరక్షిత్రీ జనమేజయ యజ్ఞకే || 9 నాగేశ్వరీతి విఖ్యాతా సా నాగ భగినీ తథా | విషం సంహర్తుమీశా సా తేన సా విషహారిణీ || 10 సిద్ధం యోగం హారాత్ప్రాప తేనాzసౌ సిద్ధయోగినీ | మహాజ్ఞానం చ గోప్యం చ మృతసంజీవినీం పరాం || 11 మహాజ్ఞానయుతాం తాం చ ప్రవదంతి మనీషిణః | ఆస్తీకస్య మునీంద్రస్య మాతా సావై తపస్వినః || 12 ఆస్తీక మాతా విఖ్యాతా జరత్కారురితిస్మసా | ప్రియా మునేర్జక్తారోర్మునీంద్రస్య మహాత్మనః || 13 యోగినో విశ్వపూజ్యస్య జరత్కారోః ప్రియా తతః || 14 ఆ మనసాదేవి శ్రీకృష్ణుని గురించి తపస్సు చేయుచుండగా ఆమె వస్త్రము, శరీరము శిథిలమగుచుండెను. అందువలన సమస్తలోకములకు ప్రభువు గోపీపతి అగు శ్రీకృష్ణుడు ఆమెకు జరత్కారు అను సార్థక నామమునుంచెను, అట్లే దయానిధియగు ఆ శ్రీకృష్ణుడు ఆమె కోరిన కోరికలను అన్నిటిని తీర్చెను. అందువలన ఆ దేవి ఆ పరమాత్మను మరల పూజించినది, అట్లే ఇతరులా పరమాత్మను పూజించునట్లొనర్చినది. ఆ మనసాదేవిని భూమిపైనున్న వారు, స్వర్గలోకముననున్నవారు, పాతాళ లోకముననున్నవారు పూజించుచుండిరి, తెల్లగా, మనోహరముగా , సుందరముగానుండి అన్ని జగత్తులనుండు వారిచే పూజలనందుకొనుచున్నందువలన ఆమెను "జగద్గౌరి" అనిరి. ఆ దేవి శివునకు శిష్యురాలు కావున 'శైవి' యైనది. విష్ణుమూర్తిపై పరమతీవ్రమయిన భక్తి కలది కావున "వైష్ణవి" యైనది. జనమేజయుని యజ్ఞమున నాగులనందరిని అగ్ని ఆహుతి కాకుండ రక్షించినందువలన నాగేశ్వరియని నాగభగిని యని ఆమెను పిలుతురు. సర్పములయొక్క విషమును సంహరింపచేయగలది కావున ఆమెను "విషహారిణి" యనిరి. పరమశివుని వలన సిద్ధయోగమును, మహాజ్ఞానమును అత్యంత రహస్యమైన మృతసంజీవినీ విద్యను పొందినందువలన సిద్ధయోగినియైనది. పండితులామెను మహాజ్ఞాని యని కూడ పిలుతురు . ఆస్తీకమునీంద్రుని తల్లి కావిన ఆస్తీక మాతయైనది. జరత్కారు అనునది ఆమె పేరైనా ఆమె జరత్కారు అనుమునీంద్రునకు భార్యయైనది. ఈ విధముగా మనసాదేవి అన్నిలోకములందు ప్రసిద్ధిని పూజలను పొందినది. "ఓం నమో మనసాయై "- మనసా దేవికి మనస్కారింతును. జగత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ | వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా || 15 జరత్కారు ప్రియాzస్తీక మాతా విషహారీతి చ | మహాజ్ఞానయుతాచైవ సా దేవీ విశ్వ పూజితా ||16 ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్ | తస్య నాగభయం నాస్తి తస్యవంశోద్భవస్య చ || 17 ఇదం స్తోత్రం పఠిత్వాతు ముచ్యతే నాత్ర సంశయః | నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే || నాగక్షతే నాగదుర్గే నాగవేష్టిత విగ్రహే || 18 జరత్కారు, జగద్గౌరి, మనసా, సిద్ధయోగిని, వైష్ణవీ, నాగభగిని, శైవీ, నాగేశ్వరీ, జగత్కారుప్రియా, ఆస్తీక, మాతా, విషహరి, మాహాజ్ఞానయుతా, అను మనసాదేవియొక్క పన్నెండు పేర్లను పూజా సమయమున చదువువానికి నాగభయమనునది ఉండదు. అతని వంశమున పుట్టబోవు వారికి కూడ నాగభయముండదు. నాగభయముకల శయన మందిరమున సర్పములు తరచుగా వచ్చు ఇంటిలో, సర్పము కాటువేయు సమయమున, సర్పములు చుట్టుముట్టినప్పుడు , ఈ స్తోత్రమును చదివినచో సర్పభయముండదు. నిత్యం పఠేద్యస్తం దృష్ట్యా నాగవర్గః పలాయతే || 19 దశలక్ష జపేనైవ స్తోత్రసిద్ధిర్భవేత్ నృణాం | స్తోత్రం సిద్ధం భ##వేద్యస్య స విషం భోక్తుమీశ్వరః || 20 నాగౌఘం భూషణం కృత్వా సభ##వేన్నాగవాహనః | నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భ##వేన్నరః || 21 ఈ స్తోత్రము ప్రతిదినము పఠించు చున్నచో అతనిని చూచి సర్పములన్నియు పరుగెత్తి పోవును. ఈ స్తోత్రమును పదిలక్షలమార్లు జపముచేసినచో సిద్ధి కలుగును, స్తోత్రసిద్ధి జరిగినవాడు విషమునైనా తినగలడు. అతడు పాపములను ఆభరణములుగా చేసికొని యైనను నాగవాహనుడు నాగాసనుడు, నాగతల్పుడైనను కావచ్చును. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే మానసోపాఖ్యానే మానసా స్తోత్రాది కథనం నామ పంచచత్వారింశత్తమోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణ సంవాద సమయమున తెల్పబడిన మానసోపాఖ్యానమందు మానసా స్తోత్రాదులను తెలిపే నలభై యైదవ అధ్యాయము సమాప్తము.