sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

సప్త చత్వారింశత్తమోzధ్యాయః - ఉరభి ఉపాఖ్యానము

నారద ఉవాచ- నారదుడు నారాయణునితో ఇట్లనెను-

కావా సా సురభీ దేవీ గోలోకాదాగతా చ యా | తజ్జన్మ చరితం బ్రహ్మన్‌ శ్రోతుమిచ్ఛామి తత్వతః || 1

నారాయణమునీ! గోలోకమునుండి మనసాదేవిని అభిషేకించుటకు వచ్చిన సురభి ఎవరు? ఆ సురభి ఎచ్చట ఏ విధముగా పుట్టినదో దాని చరిత్ర ఏమిటో తెలుసుకొనగోరుతాను.

నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-

గవామధిష్ఠాతృదేవీ గవామాద్యా గవాం ప్రసూః | గవాం ప్రధానా సురభీ గోలోకి చ సముద్భవా || 2

సర్వాది సృష్టేః కథనం కథయామి నిశామయ | బభూవ తేవ తజ్జన్మ పురాబృందావనే వనే || 3

గోవులకు అధిష్ఠాన దేవత, అన్ని గోవులకు తల్లి, గోవులలో ప్రధానభూతయైన సురభి గోలోకమున పుట్టినది. నారదా! సృష్టి ప్రారంభమును గూర్చి నీకు చెప్పెదను. సురభియొక్క జన్మ ఆ సమయమున బృందావనమున జరిగినది.

ఏకదా రాధికా నాథో రాధయా సహ కౌతుకాత్‌ | గోపాంగనా పరివృతః పుణ్యం బృందావనం య¸° || 4

సహసా తత్ర రహసి నిజహార చ కౌతుకాత్‌ | బభూవ క్షీరపానేచ్ఛా తదా స్వేచ్ఛా పరస్య చ || 5

ససృజే సురభీం దేవీం లీలయా వామపార్శ్వతః | వత్సయుక్తాం దుగ్ధవతీం వత్సానాం చ మనోరమాం || 6

దృష్ఠ్యా సవత్సాం సురభిం రత్నభాండే దుదోహ సః | క్షీరం సుధాతిరిక్తం చ జన్మమృత్యుహరం పరం || 7

తదుష్ణం చ పయః స్వాదు పపౌ గోపీపతిః స్వయం | సరో బభూవ పయసా భాండ విస్రంసనేన చ || 8

దీర్ఘే చ విస్తృతే చైవ పరితః శతయోజనం | గోలోకేషు ప్రసిద్ధం తత్‌ రమ్యం క్షీర సరోవరం || 9

గోపికానాం చ రాధాయాః క్రీడావాపీ బభూవ సా | రత్నేన రచితా తూర్ణం భూతా వాపీశ్వరేచ్ఛయా || 10

బభూవ కామధేనూనాం సహసా లక్షకోటయః | తావత్యో హి స వత్సాశ్చ సురభీలోమ కూపతః || 11

తాసాం పుత్రాశ్చ పౌత్రాశ్చ సంబభూవురసంఖ్యకాః | కథితా చ గవాం సృష్టిస్తయా సంపూరితం జగత్‌ || 12

ఒకప్పుడు శ్రీకృష్ణుడు రాధాదేవి గోపికా స్త్రీలతో కలసి బృందావనమునకు వెళ్ళెను. అచ్చట రాధాదేవితో రహస్యముగానున్న సమయమున స్వేచ్ఛాపరుడైన ఆ పరమపురుషునకు పాలు తాగవలెనని కోరిక కలిగినది. అందువలన వెంటనే తన ఎడమ భాగమునుండి దూడతో, పాలనిచ్చు సురభిని సృష్టించెను.

దూడతోనున్న సురభిని చూచి పరమాత్మ దాని పాలను రత్నభాండమున పిదికిపట్టెను. సురభియొక్క పాలు అమృతమువలె జన్మమృత్యువులను పోగొట్టును. వేడిగానున్న ఆ పాలను శ్రీకృష్ణుడు తాగెను. తరువాత రత్నభాండములోనున్న ఆ పాలు ఒలికి శతయోజన విస్తారమైన క్షీర సరోవరముగా మారెను. ఆ సరోవరము గోపికలకు రాధాదేవికి క్రీడించుటకు ఏర్పాటు చేసుకొన్న దిగుడుబావియైనది. దాని మెట్లు గోడలు రత్నములచే కట్టబడినవి.

ఆ సురభియొక్క రోమకూపములనుండి అనేక లక్షలకోట్ల కామధేనువులు, దూడలతో పుట్టినవి. ఆ కామధేనువుల దూడలకు దూడలు, వాటికి మరల దూడలు ఇట్లు ఆవులు అసంఖ్యాకముగా గోలోకమున ఏర్పడినవి. గోవుల సృష్టి ఈవిధముగా జరిగినది.

పూజాం చకార భగవాన్‌ సురభ్యాశ్చ పురా మునే | తతో బభూవ తత్పూజా త్రిషు లోకేషు దుర్లభా || 13

దీపాన్వితా పరదినే శ్రీకృష్ణస్యాజ్ఞయా భ##వే | బభూవ సురభీ పూజా ధర్మవక్త్రా దితి శ్రుతం || 14

ధ్యానం స్తోత్రం మూలమంత్రం యద్యత్సూజావిధిక్రమం | వేదోక్తం చ మహాభాగ నిబోధ కథయామి తే || 15

పూర్వము పరమాత్మయగు శ్రీకృష్ణుడు సురభిని పూజించెను. ఆపూజ ముల్లోకములందు చాలా గొప్పనిది. ఆ తరువాత శ్రీకృష్ణపరమాత్మ యొక్క ఆజ్ఞవలన దీపావళి పండగ దాటిన తరువాత తెల్లవారి సురభిపూజను భూలోకమున జరుపుచుండినట్లు ధర్మునివలన వింటిని.

శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణము

ఆ సురభియొక్క ధ్యానము, మూలమంత్రము వేదమున చెప్పబడినవి. వాటిని నీకిప్పుడు వివరింతును.

'' ఓం సురభ్యై నమ'' ఇతి మంత్రోzయంతు షడక్షరః | సిద్ధో లక్ష జపేనైవ భక్తానాం కల్పపాదపః || 16

స్థితం ధ్యానం యజుర్వేదే పూజనం సర్వసమ్మతం | బుద్ధిదాం వృద్ధిదాం చైవ ముక్తిదాం సర్వకామదాం || 17

లక్ష్మీ స్వరూపాం పరమాం రాధాసహచరీం పరాం | గవామధిష్ఠాతృదేవీం గవామాద్యాం గవాం ప్రసూం || పవిత్ర రూపాం పూజ్యాం చ భక్తానాం సర్వకామదాం | యయాపూతం సర్వవిశ్వం తాం దేవీం సురభీం భ##జే || 19

ఓం సురభ్యై నమః అను ఆరక్షరముల మంత్రమును లక్షమార్లు జపించినచో మంత్రసిద్ధి జరుగును. అది భక్తులకు కల్పవృక్షము వంటిది. సురభియొక్క పూజావిధి, ధ్యానము యజుర్వేదమున కన్పించును.

సురభి బుద్ధిని, వృద్ధిని, ముక్తిని కలిగించును, సమస్తమైన కోరికలను తీర్చును. సురభి లక్ష్మీ స్వరూపము, రాధాదేవి యొక్క సహచరి, గోవులకన్నిటికి అధిష్ఠాన దేవత, గోవులకు మూలమైనది. వాటికన్నింటికి తల్లి. మిక్కిలి పవిత్రమైనది. పూజించదగినది. ఆ సురభీదేవీ వలన ప్రపంచమంతయు పరమపవిత్రమైనది.

అట్టి సురభీదేవిని నేనెల్లప్పుడు ధ్యానింతును.

ఘటే నా దేనుశిరసి బద్ధస్తంభే గవాం చ వా | శాలగ్రామ జలేzగ్నౌ వా సురభీం పూజయేద్ద్విజః || 20

దీపాన్వితా పరదినే పూర్వాహ్ణే భక్తిసంయుతః | యః పూజయేచ్చ సురభీం సచ పూజ్యో భ##వేద్భుని || 21

సురభిని కలశమందైనను, ఆవు శిరస్సునందైనను, ఆవులను కట్టివేయ స్తంభమునందైనను, సాలగ్రామమున, జలమున, అగ్నియందు నీటిలో దేనియందైనను దీపావళి పండుగ మరుసటి దినమున పూర్వాహ్ణ కాలమున సురభిని ఆవాహన చేసి పూజ చేయవలెను.

ఏకదాత్రిషు లోకేషు వారాహే విష్ణుమాయయా | క్షీరం జహార సహసా చింతితాశ్చ సురాదయః || 22

తే గత్వా బ్రహ్మణోలోకం బ్రహ్మాణం తుష్టువుస్తదా | తదాజ్ఞయా చ సురభీం తుష్టవే పాకశాసనః || 23

ఒకప్పుడు వరాహ కల్పమున శ్రీమన్మహా విష్ణువు ఆజ్ఞవలన సురభి పాలిచ్చుట మానివేసెను. అందువలన దేవతలందరు చాలా బాధపడి బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని స్తుతించగా అతని ఆజ్ఞననుసరించి దేవేంద్రుడు సురభిని ఈవిధముగా స్తుతించెను.

మహేంద్ర ఉవాచ - దేవేంద్రడిట్లనెను -

నమోదేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమోనహః | గవాం బీజ స్వరూపాయై నమస్తే జగదింబికే || 24

నమోరాధాప్రియాయై చ పద్మాంశ##యై నమోనమః | నమ కృష్ణప్రియాయై చ గవాంమాత్రే నమోనమః || 25

శ్రీదాయై ధనదాయై చబుద్ధిదాయై నమోనమః | శుభదాయై ప్రసనన్నా గోప్రదాయై నమోనమః || 26

యశోదాయై సౌఖ్యాదాయై దర్మజ్ఞాయై నమోనమః |

దేవి, మహాదేవి అగు సురభికి నమస్కారము. ఆవులకన్నిటికి మూలరూపము జగన్మాతవగు నీకు నమస్కారము. రాధాదేవికి ప్రియురాలు, లక్ష్మీదేవి యొక్క అంశవగు నీకు నమస్సులు, శ్రీకృష్ణునకు ప్రియమైనది గోవులకు తల్లివగు నీకు నమస్కారములు, శోభ, ధనము, బుద్ధి, శుభములు, గోవులను ఇచ్చు నీకు నమస్కారములు, ప్రసన్న బుద్ధి, శుభములు, గోవులను ఇచ్చు నీకు నమస్కారములు. ప్రసన్న స్వరూపిణి, యశోదాదేవికి సౌఖ్యమును కలిగించిన నీకు నమస్కారములు.

స్తోత్రశ్రవణమాత్రేణ తుష్టా హృష్టా జగత్ప్రసూః || 27

ఆవిర్భూవ తత్రైవ బ్రహ్మలోకే సనాతనీ | మహేంద్రాయ వరందత్వా వాంచితం సర్వదుర్లభం || 28

జగామ సా చ గోలోకం యయుర్దేవాదయో గృహం | బభూవ విశ్వం సహసా దుగ్ధపూర్ణం చ నారద || 29

దుగ్ధాత్‌ ఘృతం తతోయజ్ఞ ః తతః సురస్య చ |

మహేంద్రుడు చేసిన స్తోత్రమును విని లోకమాత, సనాతనియగు సురభి బ్రహ్మలోకముననే కనిపించి మహేంద్రునకు కోరిన కోరకలనన్నిటిని ఇచ్చి గోలోకమునకు పోయెను. అందువలన దేవతలందరు సంతోషముతో తమతమ స్థానములకు చేరుకొనిరి.

ద్వితీయ ఖండము- 48వ అధ్యాయము

అప్పటినుండి ప్రపంచమున పాలు మరల కన్పడసాగినవి.

పాలవలన నేయి కలిగెను. నేయివలన యజ్ఞములు చేయుటకు వీలయ్యెను. యజ్ఞములవలన దేవతలకు సంతోషము కలిగినది.

ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్‌ || 30

సగోమాన్‌ ధనవాంశ్చైవ కీర్తిమాన్పుణ్యవాన్భవేత్‌ | సుస్నాతః సర్వతీర్థేషు సర్వయజ్ఞేషు దీక్షితః || 31

ఇహలోకేసుఖం భుక్త్వా యాత్యంతే కృష్ణమందిరం | సుచిరం నివసేత్తత్ర కురుతే కృష్ణసేవనం || 32

న పునర్భవనం తస్య బ్రమ్మపుత్ర భ##వే భ##వేత్‌ || 33

మహాపుణ్యప్రదమైన ఈ స్తోత్రమును భక్తితో ప్రతిదినము చదివినచో అతడు గోసంపద కలవాడగును. ధనవంతుడు, కీర్తివంతుడు, పుణ్యవంతుడగును. అతడు సమస్త తీర్థములలో స్నానముచేసిన పుణ్యమును, సమస్త యజ్ఞముల నాచరించిన సుకృతమును పొందును. ఇంకను ఇహలోకమున సుఖముగానుండి చివరకు గోలోకమునకు పోవును. ఈస్తోత్రమును సర్వదా పఠించు పుణ్యాత్మునకు పునర్జన్మ అనునది లేనేలేదు.

ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే సురభ్యుపాఖ్యానే తదుత్పత్తి తత్పూజాకథనం నామ సప్త చత్వారింశత్తయోధ్యాయః |

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారద నారాయణుల సంవాదసమయమున పేర్కొనబడిన సురభీ చరిత్రలో సురభియొక్క పుట్టుక, దాని పూజాదులను తెలుపు నలభై ఏడవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters