sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచాశత్తమోzధ్యాయః - సుయజ్ఞోపాఖ్యానము పార్వత్యువాచ- పార్వతీదేవి శంకరునితో నిట్లనినది- కోవా సుయజ్ఞో నృపతిః కుత్రవంశే బభూవ సః | కథం విప్రాభిశప్తశ్చ కథం సంప్రాప రాధికాం ||
1 సర్వాత్మనశ్చకృష్ణస్య పత్నీం శ్రీకృష్ణపూజితాం | కథం విణ్మూత్రధారీ చ సిషేవ పరమేశ్వరీం ||
2 షష్టివర్ష సహస్రాణి తపస్తేపే పూరావిధిః | యత్పాదాంభోజరేణూనాం లబ్దయే పుష్కరే విభుః ||
3 కథం దదర్శ తాం దేవీం మహాలక్ష్మీ పురాసతీం | దుర్దర్శామపియుష్మాకం దృశ్యా సాzభూత్కథం నృణాం ||
4 కథం త్రిజగతాం ధాతా తసై#్మ తత్కవచం దదౌ | ధ్యానం పూజావిధిం స్తోత్రం తన్మే వ్యాఖ్యాతుమర్హసి ||
5 మహాదేవా! సుయజ్ఞడను రాజెవ్వరు? అతడే వంశమున పుట్టెను? అతనికి బ్రాహ్మణశాపమెందులకు తగిలినది? పరమాత్మయగు శ్రీకృష్ణుని ధర్మపత్ని, శ్రీకృష్ణునిచే పూజలనందుకొనిన రాధాదేవిని మానవమాత్రుడగు సుయజ్ఞుడెట్లు పూజించెను. శ్రీరాధాదేవియొక్క పాదపద్మములను దర్శింపవలెనని బ్రహ్మదేవుడు అరవై వేల సంవత్సరములు పుష్కరక్షేత్రమున ఆమెనుగురించి తపస్సు చేసినను అ దేవిని దర్శించుకొనలేకపోయెనుగదా. అట్లే వైష్ణవులలో పరమశ్రేష్ఠులగు మీకు కూడ దర్శనమివ్వని ఆదేవి మానవులకెట్లు దర్శనమొసగినది. ముల్లోకములను సృష్టించు బ్రహ్మదేవుడు ఆ సుయజ్ఞునకు కవచమును, ధ్యానమును, స్తోత్రమును, పూజావిధిని, ఎట్లిచ్చెనో ఈ విషయములన్నిటిని సవివరముగా నాకు తెలుపుడు. శ్రీ మహాదేవ ఉవాచ- శ్రీమహాదేవుడు పార్వతితో ఇట్లు పలికెను- స్వాయంభువో మనుర్దేవి మనూనామాదిరేవ చ | బ్రహ్మాత్మజస్తపస్వీ చ శతరూపాపతిః ప్రభుః ||
6 ఉత్తాన పాదస్తత్పుత్రః తత్పుత్రో ధ్రువ ఏవ చ | ధ్రువస్య కీర్తిర్విఖ్యాతః త్రైలోక్యే శైల కన్యకే ||
7 ఉత్కలస్తస్య పుత్రశ్చ నారాయణపరాయణః | సహస్రం రాజసూయానాం పుష్కరే స చకార హ || 8 సర్వాణి రత్నపాత్రాణి బ్రహ్మణభ్యో దదౌ ముదా | అమూల్య రత్నరాశీనాం సహస్రం తేజసావృతం || 9 బ్రహ్మణభ్యో దదౌ రాజా యజ్ఞాంతే స మహోత్సవే | దృష్ట్వా తచ్చోభవం యజ్ఞం విధాతా జగతాం ప్రియే || 10 ఓ పార్వతీ! స్వాయంభువుడను మనువు మనువులందరిలో మొదటివాడు. అతడు బ్రహ్మదేవుని పుత్రుడు. అతని భార్యపేరు శతరూప. ఆ స్వాయంభువ మనువుయొక్క పుత్రుడు ఉత్తానపాదుడు. అతనిపుత్రుడు ధ్రువుడు. ధ్రువుని పుత్రుడు కీర్తియనువాడు. అతని పుత్రుడు ఉత్కళుడు. అతడు గొప్ప నారాయణభక్తుడు. అతడు పుష్కరక్షేత్రమున వేయి రాజసూయయాగములు చేసెను. ఆ యాగమున బ్రాహ్మణులకు రత్నపాత్రలను, అమూల్యరత్న రాసులను దానముచేసెను. ఆ ఉత్కళమహారాజు చేసిన యజ్ఞము చాలా గొప్పగానుండెను. సుయజ్ఞం నామ నృపతిం చకార సురసంసది | స చ రాజా సుయజ్ఞశ్చ మనువంశసముద్భవః || 11 అన్నదాత రత్నదాతా దాతావై సర్వసంపదాం | ధశలక్షం గవాంచైవ రత్నశృంగపరిచ్ఛదం || 12 నిత్యం దదౌ స విప్రేభ్యో ముదాయుక్తః సదక్షిణం | గవాం ద్వాదశలక్షాణాం దదౌ నిత్యం ముదాన్వితః || 13 సుపక్వాని చ మాంసాని బ్రహ్మణభ్యశ్చ పార్వతి | షట్కోటీర్ర్బాహ్మణానాం చ భోజయామాస నిత్యశః || 14 చోషై#్యశ్చవైర్లేహ్య పేయైరతి తృప్తం దినేదినే | విప్రలక్షం సూపకారం భోజయామాస తత్పరం || 15 పూర్ణమన్నం చ సూపాక్తం సగవ్యం మాంసవర్జితం | విప్రాభోజన కాలేచ మనువంశసముద్భవం || 16 న తుష్టువుః సుయజ్ఞం చ తుష్టువుస్తత్పితౄంశ్చ తే | దినే సుయజ్ఞయజ్ఞాంతే షట్ త్రింశల్లక్ష కోటయః || 17 చక్రుః సుభోజనం విప్రాశ్చాతితృప్తాశ్చ సుందరి | గృహీతాని చ రత్నాని స్వగృహం వోఢుమక్షమాః || 18 వృషలేభ్యో దదుః కించిత్ కించిత్పథిచ తత్యజుః | విప్రాణాం భోజనాంతే చ విప్రాన్యేభ్యో దదౌ నృపః || 19 తథాప్యుర్వరితం తత్రచాన్నరాశి సహస్రకం | కృత్వా యజ్ఞం మహాబాహుః సమువాస స్వసంసది || 20 ఉత్కళ మహారాజు గొప్పయజ్ఞమును చేసినందువలన బ్రహ్మదేవుడతనికి దేవతలందరి సన్నిధిలో సుయజ్ఞుడను పేరును (బిరుదును) పెట్టెను. ఆ విధముగా సుయజ్ఞుడను పేరును ధరించి రత్నములను, సమస్తసంపదలను రత్నములచే అలంకరింపబడిన కొమ్ములు గల పదిలక్షల గోవులను దక్షిణలతో బ్రాహ్మణులకు దానముచేసెను. ఇంకను పన్నెండు లక్షల గోవులను సంతోషముతో బ్రాహ్మణులకు ఇచ్చెను. అట్లే ఆరుకోట్ల బ్రాహ్మణులకు భక్ష్యభోజ్య పరమాన్నములతో భోజనము పెట్టెను. అదేవిధముగా లక్ష బ్రాహ్మణులకు చక్కగా భోజనమును పెట్టెను. సంతృప్తిగా భోజనము చేసిన ఆ బ్రాహ్మణులు మనువంశమున పుట్టిన ఆ మహారాజును పొగడక అతని పితృదేవతలను కొనియాడిరి. సుయజ్ఞమహారాజుయజ్ఞముయొక్క చివరిదినమున ముపై#్ఫఆరు లక్షల కోట్ల బ్రాహ్మణులు తృప్తిగా భోజనము చేసిరి. బ్రాహ్మణభోజనము తరువాత వారికి దానమిచ్చిన రత్నరాశులను వారు తమ ఇంటికి తీసికొని పోలేక కొంత ధనమును ఇతరులకిచ్చి, మిగిలిపోయిన ధనరాశిని మోయలేక తోవలోనే వదిలిపెట్టిపోయిరి. మహారాజు, బ్రాహ్మణ భోజనము తరువాత ఇతరులకందరికి భోజనము పెట్టెను. ఐనను అన్నరాశులు అచ్చట చాలా మిగిలిపోయెను. రత్నేంద్రసార సంక్లుప్త చ్ఛత్ర కోటి సమన్వితే | రత్నసింహాసనే రమ్యేపట్టవసై#్త్రః సుసంస్కృతే || 21 చందనాది సుసంసృష్టే రమ్యే చందనపల్లవైః | శాఖాయుక్తైః పూర్ణకుంభైః రంభా వృక్ష్శ్చశ్చ శ్చ శో భితే || 22 చందనాగురు కస్తూరీ ఘనసిందూర సంస్కృతే | వసు వాసవ చంద్రేంద్ర రుద్రాదిత్య సమన్వితే || 23 ముని నారద మన్వాదిబ్రహ్మవిష్ణు శివాన్వితే | సుయజ్ఞమహారాజు యజ్ఞమును పూర్తిచేసి తన భవనమున నున్న రత్నసింహాసనమున కూర్చొనెను. ఆ సింహాసనమున రత్న నిర్మితములైన అనేక ఛత్రములున్నవి. అందమైన రంగురంగుల వస్త్రములచే అది అలంకరింపబడియున్నది. చందనము మొదలగు సుగంధద్రవ్యములతో సువాసితమైనది. పూర్ణకలశములు, చందన వృక్షపల్లవములు, అరటి చెట్లచే అలంకరింపబడినది. అచ్చట వసువులు, వాసవుడు, చంద్రుడు, రుద్రులు, ఆదిత్యులు మునులు మొదలగు దేవతలుండిరి. ఏతస్మిన్నంతరే తత్ర విప్రఏకః సమాయ¸° || 24 రూక్షో మలినవాసాశ్చ శుష్క కంఠౌష్ఠ తాలుకః | రత్నసింహాసనస్థం చ మాల్యచందన చర్చితం || 25 రాజానమాశిషం చక్రే సస్మితః సంపుటాంజలిః | ప్రణనామనృపస్తం చ నోత్తస్థౌ కించిదేవ హి || 26 సుయజ్ఞుడు సింహసనమున కూర్చుండి విశ్రాంతి తీసుకొనుచున్న సమయమున మాసిన బట్టలతో తడి ఆరిపోవుచున్న కంఠముతో నున్న ఒక బ్రాహ్మణుడచ్చటికి వచ్చెను. వెంటనే అతడు రత్నసింహాసనమున మాలలు ధరించి చందనమునద్దుకొని కూర్చొనియున్న సుయజ్ఞుని ఆశీర్వదించెను. రాజు చిరునవ్వుతో చేతులు జోడించుకొని ఆ బ్రాహ్మణునకు నమస్కరించెను. కాని సింహాసనమున ఏమాత్రము లేచి నిలబడలేదు. అట్లే అచ్చటనున్న సభాసదులందరు ఏమాత్రము ఆసనములనుండి లేచి నిలబడలేదు. పైగా చిన్నాగా నవ్విరి. మునిభ్యోzసి చ దేవేభ్యో నమస్కృత్య ద్విజోత్తమః || 27 శశాప నృపతిం క్రోధాత్తత్రాతిష్ఠన్నిరంకుశః | గచ్ఛదూరమతో రజ్యాత్ భ్రష్టశ్రీర్భవ పామర || 28 భవాచిరం గళత్కుష్ఠీ బుద్దిహీనోzప్యుపద్రుతః | ఇత్యుక్త్వా కంపితః క్రోధాత్ సభాస్థాన్ శప్తుముద్యతః || 29 ఆ బ్రాహ్మణుడు అచ్చటనున్న మునులకు దేవతలకు నమస్కరించి కోపముతో రాజును ఇట్లు శపించెను. "ఓ సుయజ్ఞా! నీవు రాజ్యమదమున నన్ను అవమానపరచినందువలన వెంటనే రాజ్యమును కోల్పోయెదవు. అట్లే నీవు త్వరలో కుష్ఠురోగమువలన బాధించెదవు. బుద్దిని కోల్పోయి, ఉపద్రవములతో కష్టపడెదవు" అని సుయజ్ఞుని శపించి కోపముతో ఊగిపోవుచు అచ్చటనున్న సభాసదులను శపింపబోయెను. యేయత్ర జహసుః సర్వే సముత్తస్థుః సభాసదః | సర్వే చక్రుః ప్రణామం తే క్రోధం తత్యాజ బాడబః || 30 అంతకుముందు ఆ బ్రాహ్మణుని చూచి నవ్విన సభాసదులందరు వెంటనే లేచి అతనికి నమస్కరించిరి. అందువలన ఆ బాపడు కోపమును ఉపసంహరించుకొనెను. ప్రణమ్యాగత్య రాజా తం రురోద భయకాతరః | నిస్ససార సభామధ్యాత్ హృదయేన విదూయతా || 31 బ్రాహ్మణోగూఢరూపీ చ ప్రజ్వలన్ బ్రహ్మ తేజసా | తత్పశ్చాత్ మునయః సర్వే ప్రయముః భయకాతరాః || 32 హే విప్ర తిష్ఠ తిష్ఠేతి సముచ్చార్య పునః పునః | పులహశ్చ పులస్త్యశ్చ ప్రచేతా భృగురాంగిరాః || 33 మరీచిః కశ్యపశ్చైవ వసిష్ఠః క్రతు రేవ చ | శుక్రో బృహస్పతిశ్చైవ దర్వాసా లోమశస్తథా || 34 గౌతమశ్చ కణాదశ్చ కణ్వః కాత్యాయనః కఠః | పాణినిర్జాజలిశ్చైవ ఋష్యశృంగో విభాండకః || 35 తైత్తిరిశ్చాప్యాపిశలిః మార్కండేయో మహాతపాః | సనకశ్చ సనందశ్చ వోడుః పైలః సనాతనః || 36 సనత్కుమారో భగవన్నరనారాయణావృషీ | పరాశరో జరత్కారుః సంవర్తః కరభస్తథా || 37 భరద్వాజశ్చ వాల్మీకి రౌర్వశ్చ చ్యవనస్తథా | అగస్త్యోzత్రిరుతథ్యశ్చ సంకర్తాzస్తీక ఆసురిః || 38 శిలాలిర్లాంగలిశ్చైవ శాకల్యః శాకటాయనః | గర్గో వత్సః పంచశిఖో జమదగ్నిశ్చ దేవళః || 39 జైగీషవ్యో వామదేవో వాలభఖిల్యాదయస్తథా | శక్తిర్థక్షః కర్దమశ్చ ప్రస్కన్నః కపిలస్తథా || 40 విశ్వామిత్రశ్చ కౌత్సశ్చా ప్యృచీకోzస్యఘమర్షణః | ఏతే చాన్యే చ మునయః పితరోzగ్నిర్హరిప్రియాః || 41 దిక్పాలా దేవతాః సర్వాః విప్రం పశ్చాత్సమాయయుః | బ్రాహ్మణం బోధయామాసుర్వాసయామాసురీశ్వరి || 42 సమూచుస్తం క్రమేణౖవ నీతిం నీతివిశారదాః || 43 సుయజ్ఞమహారాజు బ్రాహ్మణుని సమీపమునకు వచ్చి అతనిని నమస్కరించి భయముతో బాధపడుచు, ఏడ్చుచు సభలోనుండి బయలుదేరెను. గొప్పని బ్రహ్మతేజస్సుతో ప్రకాశించుచున్న గూఢరూపియైన ఆ బ్రాహ్మణుడు కూడ సభనుండి బయలుదేరెను. అప్పుడు అచ్చకటనున్న పులహుడు, పులస్త్యుడు, ప్రచేతసుడు, భృగుమహర్షి, ఆంగిరసుడు, మరీచి, కశ్యపుడు, వసిష్ఠమహర్షి, క్రతును, శుక్రుడు, బృహస్పతి, దుర్వాసుడు, లోమశుడు, గౌతముడు కణాదుడు, కణ్వుడు, కాత్యాయనుడు, కఠుడు, పాణిని, జాజలి, ఋష్యశృంగుడు, విభాండకుడు, తైత్తిరి, ఆపిశలి, మార్కండేయుడు, మహాతపుడు, సనకుడు, సనందుడు, వోఢుమహర్షి, సైలుడు, సనాతనుడు, సనత్కుమారుడు, నరనారాయణుడు, పరాశరుడు, జరత్కారువు, సంవర్తుడు, కరభుడు, భరద్వాజుడు, వాల్మీకి, ఔర్వుడు, చ్యవనుడు, అగస్త్యుడు, అత్రి, ఉతథ్యుడు, సంకర్త, ఆస్తీకుడు, ఆసురి, శిలాలి, లాంగలి, శాకల్యుడు శాకటాయనుడు, గర్గుడు, వత్సుడు, పంచశిఖుడు, జమదగ్ని, దేవళుడు, జైగీశషవ్యుడు, వామదేవుడు, వాలభిల్యులు, శక్తి, దక్షుడు, కర్దముడు, ప్రస్కన్నుడు, కపిలుడు, విశ్వామిత్రుడు, కౌత్సుడు, ఋచీకుడు, అఘమర్షణుడు మొదలగు ఋషులు, పితృదేవతలు, అగ్ని, శ్రీహరికి ప్రియమైన వైష్ణవులు, దిక్పాలకులు మొదలగు దేవతలందురు భయపడుచు ఆ బ్రాహ్మణుని వెంట నడచిరి. వారందరు బ్రాహ్మణుని నిలునిలుమని వారించుచు నీతిని బోధించుచు ఒక చోట అతనిని నిలిపిరి. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారదనారాయణ సంవాదాంతర్గత హరగౌరీ సంవాదే రాధో పాఖ్యానే సుయజ్ఞోపాఖ్యానం నామ పంచాశత్తమోzధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదములోని గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాధాచరిత్రలోని సుయజ్ఞ మహారాజు ఉపాఖ్యానమును యాభయ్యవ అధ్యాయము సమాప్తము.