sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

ఏక పంచాశత్తమోzధ్యాయః - కర్మఫలములను వివరించుట

శ్రీపార్వత్యువాచ- శ్రీపార్వతీదేవి శంకరునితో ఇట్లనినది-

కిమూచుర్ర్బాహ్మణం బ్రహ్మన్‌ బ్రాహ్మణాః బ్రహ్మణః సుతాః | నీతిజ్ఞా నీతి వచనం తన్నాం వ్యాఖ్యాతుమర్హసి || 1

శంకరా! నీతిజ్ఞులు, బ్రహ్మదేవుని వంశమున పుట్టిన ఆ బ్రాహ్మణులు సుయజ్ఞుని శపించిన బ్రాహ్మణునితో ఎటువంటి నీతి వచనములు పల్కిరో వాటిని సవివరముగా నాకు తెలియజేయుడని పార్వతీదేవి పలికెను.

శ్రీమహాదేవ ఉవాచ- శ్రీశంకరుడిట్లు పలికెను-

సంతోష్య తం బ్రాహ్మణం చ స్తవేన వినయేన చ | క్రమేణ వక్తుమారేభే ముని సంఘో వరాననే || 2

మహర్షుల సమూహమంతయు తమ వినయ విధేయతలచేత స్తోత్రములచే ఆ బ్రాహ్మణుని సంతోషపెట్టి క్రమముగా ఇట్లు మాటలాడిరి.

సనత్కుమార ఉవాచ- సనత్కుమారుడిట్లనెను.

త్వత్పాశ్చాదాగతా లక్ష్మీః కీర్తిః సత్వం యశస్తథా | సుశీలం చ మహైశ్వర్యం పితరోzగ్నిః సురాస్తథా || 3

ఆగతా నృపగేహేభ్యః కృత్వా భ్రష్టశ్రియం నృపం | భవతుష్టో ద్విజశ్రేష్ఠ చాశు తోషశ్చ బాడబః || 4

బ్రాహ్మణానాం తు హృదయం కోమలం నవనీతవత్‌ | శుద్దం సునిర్మలం చైవమార్జితం తపసా మునే || 5

క్షమస్వాగచ్ఛ విప్రేంద్ర శుద్ధం కురునృపాలయం | ఆశిషం కురు తసై#్మ త్వం పవిత్రపదరేణునా || 6

ఓ బ్రహ్మణుడా! నీవు రాజగృహమునుండి బయటకు అడుగుపెట్టగానే నీవెంట లక్ష్మీదేవి, కీర్తి, బలము, యశస్సు, సుశీలము, అంతులేని ఐశ్వర్యము, పితృదేవతలు, అగ్నిదేవుడు, ఇతర దేవతలందరు లక్ష్మీభ్రష్టుడైన సుయజ్ఞుని ఇంటినుండి బయటకు వచ్చిరి.

మహారాజునకు గొప్ప శిక్షపడినది కావున కోపపడక సంతోషపడుము. బ్రాహ్మణుడెప్పుడు త్వరగా సంతృప్తిని పొందును. బ్రాహ్మణుల మనస్సు అప్పుడే చిలికి చేసిన వెన్నెల మృదువుగా ఉండును. అదివారి తపస్సుచే పరిశుద్దమై నిర్మలముగా నుండును.

అందువలన ఓ బ్రాహ్మణుడా! నీవు మహారాజును క్షమింపుము. వెనకకు రమ్ము. రాజభవనమును నీయొక్క పవిత్రమైన పాదరేణువుచే పవిత్రము చేయుము. ఆ మహారుజును ఆశీర్వదింపుము. అని సనత్కుమారుడనెను.

భృగురువాచ-భృగుమహర్షి ఇట్లనెను-

అతిథిర్యస్య భగ్నాశో గృహాత్ప్రతినివర్తతే | నిరాశాః ప్రతిగచ్ఛంతి చాతిథేరప్రతిగ్రహాత్‌ |

క్షమస్వాగచ్ఛ విప్రేంద్ర శుద్ధం కురు నృపాలయం |. 8

స్త్రీఘ్నై గోఘ్నైః కృతఘ్నైశ్చ బ్రహ్మఘ్నైర్గురుతల్పగైః | తుల్యదోషోభవత్యేతైః యస్యాతిథినర్చితః || 9

అతిథి ఎవరి ఇంటికి వెళ్ళి తన ఆశ భగ్నము కాగా అతని ఇంటినుండి తిరిగిపోవునో అతని పితృదేవతలు, ఇతరదేవతలు, అగ్ని వీరందరు ఆ గృహస్ధు ఇంటినుండి బాధతో వెళ్ళిపోవుదురు. అతిథి దేవును గౌరవించని గృహస్థు స్త్రీలను, ఆవులను, బ్రాహ్మణులను, చంపినవారితో, కృతఘ్నులు, గురుతల్పగులతో సమానమైన పాపమును పొందును. ఐనను ఓ బ్రహ్మణుడా! నీవు మహారాజు చేసిన తప్పును క్షమించి అతని గృహమును పావనము చేయుమని భృగుమహర్షి అనెను.

పులస్త్య ఉవాచ- పులస్త్యమహర్షి ఇట్లనెను-

పశ్యంతి యే వక్రదృష్ట్యా చాతిథిం గృహమాగతం | దత్వా స్వపాపం తసై#్మ తత్పుణ్యమాదాయ గచ్ఛతి || 10

క్షమస్వ నృపదోషం చ గచ్ఛవత్స యథాసుఖం | రాజా స్వకర్మదోషేణ నోత్తస్థౌ తత్‌ క్షమాం కురు || 11

అతిథి ఇంటికి రాగా అతనిని నిరాదరించిన గృహస్థునకు అతడు తాను చేసిన పాపములను సమర్పించి గృహపతి చేసిన పుణ్యమును తీసుకొని వెళ్ళును.

ఐనను ఓ బ్రాహ్మణుడా! రాజుచేసిన దోషమును క్షమింపుము. రాజు తన పూర్వకర్మ యొక్క దోషము వలన తప్పుచేసెను. అందువలన ఆ రాజును క్షమించి నీ ఇష్టమొచ్చిన చోటుకు వెళ్ళుమని పులస్త్యమహర్షి కోరెను.

పులహ ఉవాచ- పులహమహర్షి ఇట్లు పలికెను-

రాజశ్రియా విద్యాయా వా బ్రాహ్మణం యోzవమన్యతే | విప్రస్త్రిసంధ్యహీనో యః శ్రీహీనః క్షత్రియో భ##వేత్‌ || 12

ఏకాదశీ విహీనశ్చ విష్ణునైవేద్యవంచితః | క్షమస్వాగచ్ఛ విప్రేంద్ర శుద్దం కురు నృపాలయం || 13

తాను రాజుననియో, అధిక విద్యావంతుడననియో బ్రాహ్మణుని అవమాన పరచినచో, అతడు బ్రాహ్మణుడైనచో త్రిసంధ్యలయందు సంధ్యావందనము చేయని బ్రాహ్మణబ్రువుడు పొందు ఫలిత మనుభవించును. క్షత్రియుడైనచో లక్ష్మీని కోల్పోయి ఏకాదశీవ్రతమాచరింపనివాడు, విష్ణునైవేద్యమును భుజింపనివాడు పొందు పాప ఫలితముననుభవించును.

అందువలన నీవు ఆ మహారాజును క్షమించి, మహారాజు ఇంటికి వచ్చి అతని భవనమును పరిశుద్దము చేయుమని పులహ మహర్షి అనెను.

క్రతురువాచ-క్రతుమహర్షి ఇట్లు పలికెను-

బ్రహ్మణఃక్షత్రియోవాzపి వైశ్యోవా శూద్ర ఏవ చ | దీక్షాహీనోభ##వేత్సోzపి బ్రాహణం యోzవమన్యతే || 14

ధనహీనః పుత్రహీనః భార్యహీనో భ##వేత్‌ ధ్రువం | క్షమాస్వాగచ్ఛ భగవాన్‌ శుద్దం కురునృపాలయం || 15

ఏ కులమునందు పుట్టినవాడైనను బ్రాహ్మణుని అవమాన పరచినచో యాగదీక్షను వదలివేసినవాడు పొందు పాపమును పొందును. ఇంకను అతడు ధనము, పుత్రులు, భార్య మొదలగు వారినందరను కోల్పోవును. అయినను ఓ బ్రాహ్మణుడా!మహారాజును క్షమించి అతని భవనమునకు వచ్చి దానిని పవిత్రము చేయుమని క్రతుమహర్షి కోరెను.

అంగిరా ఉవాచ- అంగీరసమహర్షి ఇట్లు పలికెను-

జ్ఞానవాన్‌ బ్రహ్మణో భూత్వా బ్రాహ్మణం యోzవమన్యతే | వృషనాహో భ##వేత్సోzపి భారతే సప్త జన్మసు || 16

జ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుని అవమాన పరచినచో అతడు భారతవర్షమున ఏడు జన్మల వరకు వృషవాహనుడగును అని పలికెను.

మరీచిరువాచ- మరీచి మహర్షి ఇట్లు పలికెను-

పుణ్యక్షేత్రే భారతే చ దేవం చ బ్రాహ్మణం గురుం | విష్ణుభక్తి విహీనశ్చ స భ##వేద్యోzవమన్యతే || 17

పుణ్యభూమియగు ఈ భారతక్షేత్రమున దేవతలను, బ్రాహ్మణులను, గురువును అవమానించినవాడు విష్ణుభక్తి విహీనుడగును.

కశ్యప ఉవాచ- కశ్యప ప్రజాపతి ఇట్లనెను-

వైష్ణవం బ్రాహ్మణం దృష్ట్వా యోzసత్య మవమన్యతే | విష్ణుమంత్ర విహీనశ్ఛ తత్పూజావిరతో భ##వేత్‌ || 18

వైష్ణవుడగు బ్రాహ్మణుని అవమానపరచినవాడు విష్ణు మంత్రవిహీనుడగును. అట్లే విష్ణుపూజకు విముఖుడగును.

ప్రచేతా ఉవాచ- ప్రచేతనుడిట్లనెను-

అతిథిం బ్రాహ్మణం దృష్ట్వా నాభ్యుత్థానం కరోతి యః | పితృభక్తి విహీనః స్యాత్‌ సభ##వేత్‌ భారతే భువి || 19

ప్రాప్నోతి కౌంజరీం యోనిం స మూఢః సప్త జన్మసు | శీఘ్రం గచ్ఛ ద్విజశ్రేష్ఠ రాజ్ఞే దేహ్యాశిషః శుభాః || 20

అతిథియగు బ్రాహ్మణుని చూచి గౌరవముతో ఎవడు లేచినిలబడడో అతడీ భారతక్షేత్రమున పితృభక్తివిహీనుడగును. అట్లే అతడు ఏడు జన్మలవరకు ఏనుగై పుట్టును.

ఐనను ఓ బ్రాహ్మణోత్తమా! త్వరగా వెనకకు పోయి సుయజ్ఞునకు ఆశీర్వాదమునిమ్ము అని ప్రచేతసుడనెను.

దుర్వాసా ఉవాచ- దుర్వాసమహర్షి ఇట్లనెను-

గురుం వా బ్రాహ్మణం వాపి దేవతా ప్రతిమామపి | దృష్ట్యా శీఘ్రం న ప్రణమేత్సభ##వేత్సూకరోభువి || 21

మిథ్యాసాక్షీ చ భవతి తథా విశ్వాస ఘాతకః | క్షమస్వ సర్వామస్మాకం ఆతిథ్య గ్రహణం కురు || 22

గురువైనా, బ్రాహ్మణునైనా, దేవతామూర్తినైనా చూచిన వెంటనే నమస్కరింపనివాడు తరువాతి జన్మలో పందిగా పుట్టును. కానిచో అబద్దపు సాక్ష్యములు చెప్పువాడగును. అట్లే విశ్వాసఘాతకుడగును.

ఐనను మాతప్పులన్నియు క్షమించి మా ఆతిథ్యమును స్వీకరింపుమని దుర్వాసమహర్షి ఆ బ్రాహ్మణునితో ననెను.

రాజోవాచ-సుయజ్ఞ మహారాజిట్లనెను-

ఛలేన కథితో ధర్మో యుష్మాభిర్ముని పుంగవైః | సర్వం కృత్వా చ విస్పష్టం మాం మూఢం బోధయంత్వహో || 23

స్త్రీఘ్నగోఘ్న కృతఘ్నానాం గురుస్త్రీగామినాం తథా | బ్రహ్మఘ్నానాం చ కో దోషో బ్రూత మాం యోగినాం వరాః || 24

మీరందరు ధర్మమును విస్పష్టముగా తెలుపలేదు. మూఢుడనగు నాకు ధర్మమును స్పష్టముగా బోధింపుడు. స్త్రీ, గో , కృతఘ్నములు, గురుస్త్రీగమనము చేసినవారు, బ్రాహ్మణుని చంపిన వారికి ఏ పాపమంటునో మీరు స్పష్టముగా తెలుపడని అనెను.

వసిష్ఠ ఉవాచ- వసిష్ఠుడు సుయజ్ఞునితో నిట్లనెను-

కామతో గోవధే రాజన్‌ వర్షం తీర్థం భ్రమేనన్నరః | యవయావక భోజీ చ కరేణ చ జలం పిబేత్‌ || 25

తథాధేనుశతం దివ్యం బ్రాహ్మణభ్యః సదక్షిణం | దత్వాముంచతి పాపాచ్చ భోజయిత్వా శతం ద్విజాన్‌ || 26

ప్రాయశ్చిత్తే తు వై చీర్ణే సర్వపాపాన్న ముచ్యతే | పాపావశేషాద్భవతి దుఃఖీ చాండాల ఏవచ || 27

అతిదేశిక హత్యాయాం తదర్ధం ఫలమశ్నుతే | ప్రాయశ్చిత్తానుకల్పేన సర్వపాపా న్న ముచ్యతే || 28

తెలిసి తెలిసి గోవధ చేసినవాడు ఒక సంవత్సరము తీర్థయాత్ర చేయవలెను. యవలు యవలకు సంబంధమైన వాటిని తినుచు దప్పియైనచో చేతితో నీటిని తాగుచు కాలము గడపవలెను. తరువాత నూరు ఆవులను దక్షిణలతో బ్రాహ్మణులకు దానముచేయవలెను. తరువాత నూరుగురు బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలెను. ఇట్లు ప్రాయశ్చత్తము చేసికొన్నచో పాపము పోవును. కాని సమస్త పాపము తొలగిపోదు. పాపము కొంత మిగులుటచే అతడు దుఃఖమును పొందుచు చండాలుడగుచున్నాడు.

ఆతిదేశిక గోహత్యయందు అనగా పొరపాటువలన గోవధ జరిగినను, గోవధతో సమానమైన పాపము చేసినను, తెలిసి గోవధ చేసిన పాపములో సగము పాపమును పొందును. ప్రాయశ్చిత్తము వంటి దానిని చేసికొన్నను సమస్త పాపమును పోగొట్టుకొనడు అని వసిష్ఠుడనెను.

శుక్ర ఉవాచ- శుక్రడిట్లనెను-

గోహత్యాత్‌ ద్విగుమం పాపం స్త్రీహత్యాయాం భ##వేద్ధ్రువం | షష్టివర్షసహస్రాణి కాలసూత్రే వసేత్‌ ధ్రువం || 29

తతో భ##వేన్మహాపాపీ సూకరః సప్తజన్మసు | తతో భవతి సర్పశ్చ సప్త జన్మన్యతః శుచిః || 30

స్త్రీహత్య చేసినచో గోహత్యను చేసిన పాపము కంటె రెండు రెట్లెక్కువ పాపమును పొందును. అరవైవేల సంవత్సరములు నరకమున బాధలననుభవించును. ఆ తరువాత ఏడు జన్మముల వరకు పందిగను తరువాత ఏడుజన్మలు సర్పముగను పుట్టి తరువాత పరిశుద్ధుడగును.

బృహస్పతిరువాచ-బృహస్పతి ఇట్లనెను-

స్త్రీహత్యాత్‌ ద్విగుణం పాపం బ్రహ్మహత్యాకృతోభ##వేత్‌ | లక్షవర్షం మహాఘోరే కుంభీపాకే వసేత్‌ ధ్రువం || 31

తతో భ##వేన్మహాపాపీ విష్ఠాకీటః శతాబ్దికం | తతో భవతి సర్పశ్చ సప్త జన్మన్యతః శుచిః || 32

బ్రాహ్మణుని చంపినచో స్త్రీహత్యచేసిన దానికి రెట్టింపు పాపమును పొందును. అతడు కుంభీపాకమను మహాభయంకరమైన నరకమున లక్షసంవత్సరములు నరకయాతన లనుభవించును. తరువాత అతడు నూరు సంవత్సరములు అశుద్దమునందలి పురుగుగా నుండును. ఆతర్వాత ఏడు జన్మలవరకు సర్పముగా ఉండి పరిశుద్ధుడగునని బృహస్పతి చెప్పెను.

గౌతమ ఉవాచ-గౌతమ మహర్షి ఇట్లనెను-

దోషః కృతఘ్నే రాజేంద్ర బ్రహ్మహత్యాచతుర్గణః | నిష్కృతిర్నాస్తి వేదోక్తా కృతఘ్నానాం చ నిశ్చితం || 33

మేలుచేసిన వానికి అపకారము చేయువానికి బ్రహ్మహత్యాపాపమునకు నాల్గురెట్లెక్కువ పాపము లభించును. కృతఘ్నుని పాపపరిహారమునకై వేదమున ప్రాయశ్చత్తము కన్పించదు. అందువలన కృతఘ్నుడు చాలా నీచుడని గౌతమ మహర్షి అనెను.

రాజోవాచ- రాజు ఇట్లు పలికెను-

లక్షణం చ కృతఘ్నానాం వద వేదవిదాంవర | కృతఘ్నః కతిధా ప్రోక్తః కేషు కో దోష ఏవ చ || 34

వేదవేదార్థములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడా! కృతఘ్నుడనగా ఎట్టివాడు? వారెన్నివిధములుగా నుందురు. వారిదోషములెట్లుండును చెప్పుమనెను.

ఋష్యశృంగ ఉవాచ- ఋష్యశృంగుడిట్లనెను-

కృతఘ్నాః షోడశవిధాః సామవేదే నిరూపితాః | సర్వం ప్రత్యేక దోషేణ ప్రత్యేకం ఫలమశ్నుతే || 35

కృతే సత్యే చ పుణ్య చ స్వధర్మే తపసిస్థితే | ప్రతిజ్ఞాయాం చ దానే చ స్వగోష్ఠీ పరిపాలనే || 36

గురుకృత్యే దేవకృత్యే కామ్యకృత్యే ద్విజార్చనే | నిత్యకృత్యే చ విశ్వాసే పరధర్మ ప్రదానయోః || 37

ఏతాన్యోమంతి పాపిష్ఠః సకృతఘ్న ఇతిస్మృతః | ఏతేషాం సంతి లోకాశ్చ తజ్జన్మ భిన్నయోనిషు || 38

యాన్యాంశ్చ నరకాంస్తే చ యాంతి రాజేంద్ర పాపినః | తేతే చ నరకాః సంతి యమలోకే సునిశ్చితం || 39

సామవేదమున కృతఘ్నలు పదహారు రకములుగా ఉన్నట్లు చెప్పబడినది. వారు తమ తమ ప్రత్యేక పాపములననుసరించి ఫలితమును సైతము ప్రత్యేకముగా పొందుచున్నారు.

సత్కర్మ, సత్యము, పుణ్యము, స్వధర్మము, తపస్సు, ప్రతిజ్ఞ , దానము, స్వగోష్ఠీ పరిపాలనము, గురుకృత్యము, దేవకృత్యము, కామ్యకృత్యము, బ్రాహ్మణారాధన, నిత్యకృత్యము, విశ్వాసము, పరధర్మము, ప్రదానము అనువాటిలో నిష్ఠగలిగియున్నవారిని చంపు పాపిని కృతఘ్నుడని అందురు. ఇటువంటి కృతఘ్నులకు ప్రత్యేకమైన నరకములు కలవు. అట్లే వారు భిన్న భిన్నమైన జన్మలు పొందుదురు. అనేక విధములుగానుండు కృతఘ్నులు పొందు నరకములన్నియు యమలోకమున ఉన్నవని ఋష్యశృంగ మహర్షి చెప్పెను.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞుడిట్లనెను-

కే కింకృత్వా కృతఘ్నాశ్చ రౌరవాన్‌ | ప్రత్యేకం శ్రోతుమిచ్ఛామి వక్తుమర్హసి మే ప్రభో || 40

ఎటువంటి కృతఘ్నులు ఎటువంటి నరకమునకు పోవుచున్నారో ఆ విషయమును వివరముగా నాకు చెప్పుడని మహారాజడిగెను.

కాత్వా శపథరూపం చ సత్యం హంతి న పాలయేత్‌ | స కృతఘ్నః కాలసూత్రే వసేదేవ చతుర్యుగం || 41

సప్తజన్మసు కాకశ్చ సప్తజన్మసు పేచకః | తతః శూద్రో మహావ్యాధిః సప్తజన్మస్వతః శుచిః || 42

శపథముచేసి దానిని అనుష్ఠించని కృతఘ్నుడు కాలసూత్రనరకమున నాలుగు యుగములుండును. తరువాత ఏడుజన్మలు కాకిగాను, ఏడు జన్మలు గుడ్లగూబగా జన్మనెత్తును. తరువాత ఏడుజన్మలు రోగిష్ఠియై చివరకు పరిశుద్దుడగును.

శ్రీసనంద ఉవాచ- శ్రీసందను డిట్లనెను-

పుణ్యం కృత్వా వదత్యేవ కీర్తివర్ధన హేతువా | స కృతఘ్నుస్తప్తసూర్మ్యాం వసత్యేవ యుగత్రయం || 43

పంచజన్మసు మండూకః త్రిషు జన్మసు కర్కటః | తదామూకో మహావ్యాధిర్దరిద్రశ్చ తతః శుచిః || 44

పుణ్యకర్మలు చేసి తన కీర్తిని పెంచుకొనుటకై వాటిని గురించి చెప్పుకొనువాడు కూడ కృతఘ్నుడే. అతడు తప్తసూర్మి అను నరకమున మూడు యుగములవరకుండి నరకయాతనలననుభవించి తరువాత ఐదుజన్మలు కప్పగాను, తరువాత మూడు జన్మలు ఎండ్రిగాను జన్మించి ఆ తరువాత మూగవాడై మహావ్యాధిగల దరిద్రుడగును. ఆ తరువాత పరిశుద్దు డగును. అని సనందనుడనెను.

సనాతన ఉవాచ- సనాతనుడిట్లనెను-

స్వధర్మం హంతి యో విప్రః సంధ్యాత్రయ వివర్జితః | అతర్పయంశ్చ యః స్నాతి విష్ణునైవేద్య వర్జితః || 45

విష్ణుపూజావిహీనశ్చ విష్ణుమంత్ర విహీనకః | ఏకాదశీవిహీనః శ్రీకృష్ణజన్మదినే తథా || 46

శివరాత్రౌ చ యోభుంక్తే శ్రీరామనవమీ దినే | పితృకృత్యాది హీనో యః స కృతఘ్న ఇతిస్మృతః || 47

కుంభీపాకే వసత్యేవం యావదింద్రాశ్చతుర్దశ | తతశ్చాండాలతాం యాతి సప్తజన్మసు నిశ్చితం || 48

శతజన్మని గృధ్రశ్చ శతజన్మని సూకరః | తతో భ##వేద్ర్బాహ్మణశ్ఛ శూద్రాణాం సూపకారకః || 49

తతో భ##వేజ్జన్మ సప్త బ్రాహ్మణో వడషవాహకః | శూద్రాణాం శవదాహీ చ భ##వేత్సప్తసు జన్మసు || 50

ద్విజోభూత్వా సప్తజనౌ భారతే వడషలీ పతిః | భుక్త్వా స్వభోగలేశం చ భ్రమిత్వా యాతి రౌరవం || 51

పునః పునః పాపయోనిం నరకం చ పునః పునః | తతో భ##వేద్గర్దభశ్చ మార్జారః పంచజన్మసు || 52

పంచజన్మసు మాండూకో భ##వేచ్ఛుద్దస్తతః క్రమాత్‌ || 53

బ్రాహ్మణుడు త్రి సంధ్యలలో సంధ్యవందనము చేయక, తర్పణలు చేయకుండా స్నానము చేయుచు, విష్ణుమూర్తికి నివేదించిన అన్నమును విసర్జించి, విష్ణుపూజను చేయక విష్ణుమంత్రమును జపింపక, ఏకాదశీవ్రత విహీనుడై శివరాత్రి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, మొదలగు దినములలో భోజనము చేయుచు పితృకర్మలను వదలివేయుచు బ్రాహ్మణులకు నిర్దిష్టమైన ధర్మమును వదలివేయు వాడు కూడ కృతఘ్నుడే యగును.

అట్టి కృతఘ్నుడు కుంభీపాక నరకమున పదునలుగురు ఇంద్రులు గతించువరకు యమయాతనల ననుభవించును. తరువాత ఏడు జన్మలు చండాలుడై నూరుజన్మలు గద్దగాపుట్టి, నూరుజన్మలు పందిగా జన్మించి, తరువాత ఏడు జన్మలు వృషవాహకుడైన బ్రాహ్మణుడై, తరువాత ఏడు జన్మలు శపములను తగులబెట్టువాడై, తరువాత వృషలీపతియగు బ్రాహ్మణుడగును. ఇంకను అనుభవింపవలసిన పాపమేమైనా ఉన్నచో రౌరవ నరకమునుకు వెళ్ళి అచ్చట నరకయాతనలననుభవించును. తరువాత పాపిగా పుట్టి తరువాత నరకయాతనలననుభవించును. తిరిగి పాపిగా పుట్టును. ఇట్లు నరకబాధలు పొంది ఐదేసి జన్మలు గాడిదగాను, పిల్లిగాను, కప్పగాను జన్మించి పాప ఫలితమునంతయు అనుభవించును. ఇట్లు పాప ఫలితమునంతయు అనుభవించిన తరువాత పరిశుద్దుడగునని సనాతనుడు చెప్పెను.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞుడిట్లు పలికెను-

శూద్రాణాం సూపకరణ శూద్రాణాం శవదాహనే | శూద్రాన్నభోజనేవాzపి శూద్రస్త్రీగమనేzపి చ || 54

బ్రాహ్మణానాం చ కోదోషా వృషాణాం వాహనే తథా | ఏతాన్సర్వాన్సమాలోచ్య బ్రూహి మాం నిశ్చయం మునే || 55

బ్రాహ్మణుడు శూద్రుల ఇంటిలో వంటచేసినచో, శవములను తగులబెట్టినచో, శూద్రుల అన్నమును తినినచో, శూద్రస్త్రీని అనుభవించినచో వృషవాహనుడైనచో అతని తప్పేమి కలదు. వీటిని చక్కగా నాకు వివరించి చెప్పుమని అడిగెను.

పరాశర ఉవాచ-పరాశర మహర్షి ఇట్లనెను-

శూద్రాణాం సూపకారశ్చ యో విప్రోజ్ఞాన దుర్బలః | అసిప్త్రే వసత్యేవ యుగానా మేకసప్తతిః || 56

తతోభ##వేద్గ ర్గభశ్చ మూషికః సప్త జన్మసు | తైల కీట స్సప్త జన్మస్వతః శుద్దో భ##వేన్నరః || 57

బ్రాహ్మణుడు చదువుకొనక శూద్రుల ఇండ్లలో వంటలు చేసిపెట్టుచు జీవించుచున్నచో అసిపత్రమను నరకమున డెబ్బైయొక్క యుగములుండును. అటుపిమ్మట ఏడేడు జన్మలు గాడిదగాను, ఎలుకగాను, జిల్ల పురుగుగాను పుట్టును. అటుపిమ్మట అతడు పరిశుద్దుడగును.

జరత్కారురువాచ- జరత్కారు మహర్షి ఇట్లనెను-

భృత్యద్వారా స్వయంవాzపి యోవిప్రో వృషవాహకః | స కృతఘ్న ఇతిఖ్యాతః ప్రసిద్దో భారతే నృప || 58

బ్రహ్మహత్యా సమంపాం తన్నిత్యం వృషతాడనే | వృషసృష్ఠే భారదానాత్పాపం తద్ద్విగుణం భ##వేత్‌ || 59

సూర్యాతపే వాహయేద్యః క్షుధితం తృషితం వృషం | బ్రహ్మహత్యాశతం పాపం లభ##తే నాzత్ర సంశయః || 60

అన్నం విష్ఠా జలం మూత్రం విప్రాణాం వృషవాహినాం | నాధికారో భ##వేత్తేషాం పితృదేవార్చనే నృప || 61

లాలాకుంéడే వసత్యేవ యావచ్చంద్ర దివాకరౌ | విష్ఠాభ్యక్ష్యం మూత్రజలం తత్ర తస్య భ##వేద్ద్రువం || 62

త్రిసంధ్యం తాడయేత్తం చ శూలేన యమకింకరః | ఉల్కాం దదాతి ముఖతః సూచ్యా కృంతతి సంతతం || 63

షష్టివర్షసహస్రాణి విష్టాయాం చ కృమిర్భవేత్‌ | తతః కాకః పంచజన్మస్వథైకం బక ఏవ చ || 64

పంచ జన్మసు గృధ్రశ్చ శృగాలః సప్తజన్మసు | తతో దరిద్రః శూద్రశ్చ మహావ్యాధిస్తతః శుచిః || 65

స్వయముగా కాని, భృత్యునితోకాని వృషభమువాహనముగా చేసికొని తిరుగు బ్రాహ్మణుడు కృతఘ్నుడని చెప్పబడుచున్నాడు. అతడు వాహనముగాచేసికొని తిరుగునపుడు వృషభమను కొట్టును కావున అతనికి బ్రహ్మహత్య చేసినంత పాపము కలుగును. వృషభములను ఎండలో దిప్పుచు వాటికి ఆకలి దప్పులగుచున్నను వాహనముగా తిప్పును కావున అతడు నూరు బ్రహ్మహత్యలు చేసిన పాపమును పొందును.

వృషభవాహనులగు బ్రాహ్మణులు తాగు నీరు మూత్రము వంటిది. అన్నము అశుద్దముతో సమానమగును. వారు పితృదేవతలను అర్చనసేయు అధికారమును కోల్పోవుదురు. వారు చంద్రసూర్యులున్నంతవరకు లాలాకుండమను నరకమున బాధలననుభవింతురు. అచ్చట అశుద్దమును తినుచు, మూత్రమును తాగుచుందురు. నరకమున అతనిని యమకింకరులు శూలములతో మూడుపూటలు బాధలు పెట్టుదురు. ముఖము పై పిడుగులు వేయుదురు. సూదులతో ముఖమును పొడుతురు.

ఇట్లు నరకయాతనలననుభవించిన తరువాత ఆ కృతఘ్నడు అరవై వేల సంవత్సరములు మలముననుండు పురుగుగా జన్మించును. అటుపిమ్మట ఐదుజన్మలు కాకిగాను, ఒక జన్మ కొంగగాను, ఐదు జన్మలు గద్దగాను, ఏడుజన్మలు నక్కగాను పుట్టును. ఆ తరువాత దరిద్రుడై మహావ్యాధితో బాధపడును. అటుపిమ్మట అతడు పరిశుద్దుడు కాగలడు అని అనెను.

భరద్వాజ ఉవాచ- భారద్వాజ మహర్షి ఇట్లనెను-

శూద్రాణాం శవదాహీ యః స కృతఘ్న ఇతి స్మతః | నయః ప్రయాణం రాజేంద్ర బ్రహ్మహత్యాం లభేత్‌ ధ్రువం || 66

తత్తుల్యయోని భ్రమణాత్‌ తత్తుల్య నరకాచ్చుచిః | యో దోషో బ్రాహ్మణానాం చ శూద్రాణాం శవదాహనే || 67

తావదేవ భ##వే ద్దోషః శూద్రశ్రాద్దాన్నభోజనే || 68

శవములను తగులబెట్టు బ్రాహ్మణుడు కూడ కృతఘ్నుడని పిలువబడుచున్నాడు. నూరు సంవత్సరములవరకు అతడు బ్రహ్మహత్యాపాపమును పొందుచున్నాడు. ఈ నూరు సంవత్సరములు బ్రహ్మహత్యా పాపము చేసినవాడనుభవించు నరకయాతనలను ఇతడు కూడ అనుభవించును. అతనివలె ఇతడు కూడ అనేక జన్మలెత్తును.

అదేవిధముగ శూద్రుని ఇంటిలో శ్రాద్ధాన్నమును భుజించినచో శవదహనము చేసిన బ్రాహ్మణుడు పొందుపాప ఫలితముననుభవించును.

విభాండక ఉవాచ- విభాండక మహర్షి ఇట్లనెను-

పితృశ్రాద్దే చ శూద్రాణాం భుంక్తే యో బ్రాహ్మణోzధమః | సురాపీతీ బ్రహ్మఘాతీ పితృదేవార్చనాద్భహీః || 69

శూద్రులు పెట్టు పితృశ్రాద్దమున అన్నమును తిను బ్రాహ్మణుడు సురాపానము చేయువాడు, బ్రాహ్మణుని చంపువాడు పొందు పాపమును పొందును. అతడు పితృదేవతలను, ఇష్టదేవతలను అర్చనసేయు అర్హతను గోల్పోవును.

మార్కండేయ ఉవాచ- మార్కండేయుడిట్లనెను-

యో దోషో బ్రాహ్మణానాం చ శూద్ర స్త్రీ గమనే నృప | అహం వక్ష్యామి వేదోక్తం సావధానం నిశామయ || 70

కృతఘ్నానాం ప్రధానశ్చ యోవిప్రోవృషలీపతిః | కృమిదం ష్ట్రే వసేత్సోzపి యావదింద్రాశ్చతుర్దశ || 71

కృమి భక్ష్యో భ##వే ద్విప్రో నిహ్వలోయమకింకరైః | ప్రతిమాం తాం తప్తలౌహీం ఆశ్లేషయతి నిత్యశః || 72

తతశ్చ పుంశ్చలీయోనౌ కృమిర్భవతి నిశ్చితం | ఏవం వర్షసహస్ర చ తతః శూద్రస్తతః శుచిః || 73

బ్రాహ్మణుడు శూద్రుస్త్రీతో వ్యభిచరించినచో కలగు పాపము వేదమున చెప్పబడినది. అతడు కృతఘ్నులందరిలో గొప్పవాడు. అతడు పదునలుగురింద్రులు గతించువరకు కృమిదంష్ట్రమను నరకమున క్రిములతో బాధలందుచుండును. అచ్చట యమకింకరులు బాగుగా వేడిచేసిన లోహప్రతిమను ప్రతిదినము కౌగలించుకొనునట్లు చేయుదురు. ఆతరువాత అతడు జారస్త్రీయొక్క యోనిలో కృమిగా వేయి సంవత్సరములుండును. ఆ తరువాత శూద్ర జన్మనెత్తి పరిశుద్దుడగును.

సుయజ్ఞ ఉవాచ- సుయజ్ఞమహారాజిట్లనెను-

అన్యేషాం చ కృతఘ్నానాం వద కర్మఫలం మునే | శ్లాఘ్యో మే బ్రహ్మశాపశ్చ కస్యసంపద్వినాzపదం || 74

ధన్యోzహం కృతకృత్యోzహం సఫలం జీవనం మమ | ఆగతాస్తు యతోముక్తా మద్గేహేమునయః సురాః || 75

ఇంకను నాకు ఇతర కృతఘ్నులు ఎటవంటి కర్మఫలమును పొందుదురో చెప్పుడు. నాకు బ్రహ్మశాపము కూడ వరముగా మారినది. ఆపదలు లేకుండ సంపదలెవ్వరికి లభింపవుగదా!

నేను ధన్యుడను, కృతకృత్యుడనైతిని. నా జీవితము సఫలమైనది. ఎందుకనగా నా ఇంటికి ముక్తులైన మునులు దేవతలు విచ్చేయుట నా అదృష్టముననే జరిగినదని సుయజ్ఞుడనెను.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తై మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదాంతర్గత హరగౌరీ సంవాదే రాధోపాఖ్యనే నృపముని సంవాదే కర్మవిపాకోనామ ఏకపంచాశత్తమోzధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదములోని గౌరీశంకరుల సంవాదమున తెల్పబడిన రాధాపాఖ్యానమున నున్న నృపమునిసంవాదమున చెప్పబడిన కర్మవిపాకమను

యాభైఒకటవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters