sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్విపంచాశత్తమోzధ్యాయః - కర్మఫలములను వివరించుట శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి శంకరునితో ఇట్లనెను- అన్యేషాం చ కృతఘ్నానాం యద్యత్కర్మ ఫలం ప్రభో | తేషాం కి మూచుర్మునయో వేదవేదాంగపారగాః ||
1 వేదవేదాంగములన్నియు తెలిసిన మునులు, ఇతర కృతఘ్నుల పాప ఫలితమును గూర్చి ఏమనిరో నాకు విపులముగా తెలుపుమనెను. శ్రీ మహేశ్వర ఉవాచ- మహేశ్వరుడిట్లనెను- ప్రశ్నం కుర్వతి రాజేంద్రే సర్వేషు మునిషు ప్రియే | తత్ర ప్రవక్తుమారేభే ఋషిర్నారాయణో మహాన్ ||
2 సుయజ్ఞ మహారాజు ఇతర కృతఘ్నుల కర్మవిషయమును ప్రశ్నించినపుడు అచ్చటనున్న మునులలో శ్రేష్ఠుడైన నారాయణఋషి ఇట్లు సమాధానమునిచ్చెను. శ్రీనారాయణ ఉవాచ- నారాయణముని ఇట్లనెను- స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేత్తు యః | స కృతఘ్న ఇతి జ్ఞేయః ఫలంచ శ్రుణు భూమిప ||
3 యావంతో రేణవః సిక్తా విప్రాణాం నేత్రబిందుభిః | తావద్వర్ష సహస్రం చ శూలపోతే సతిష్ఠతి ||
4 తప్తాంగారం చ తద్భక్ష్యం పానం నై తప్తమూత్రకం | తప్తాంగారే చ శయనం తాడితో యమకింకరైః ||
5 తదంతే చ మహాపాపీ విష్టాయాం జాయతే కృమిః | షష్ఠివర్షసహస్రాణి దేవమానేన భారతే ||
6 తతో భ##వేద్భూమిహీనః ప్రజాహీనశ్చ మానవః | దరిద్రః కృపణో రోగీ శూద్రో నింద్యస్తతః శుచిః ||
7 తాను దానము చేసినను, ఇతరులు దానము చేసినను బ్రాహ్మణ వృత్తిగా సంక్రమించిన భూమిని అపహరించువానిని కృతఘ్నుడందురు. అతని కర్మఫలమిట్లుండును. తాను సంపాదించుకొనిన భూమిని ఇతరులాక్రమించిరని బ్రాహ్మణుడేడ్చుడుండగా అతని కన్నీళ్ళచే ఎన్ని రేణువులు తడి చెందినవో అన్ని సంపవత్సరములా కృతఘ్నుడు "శూలపోత" మను నరకమున నరకయాతనలననుభవించును. అచ్చట అతడు మండుచున్న నిప్పు కణికలను తినుచు వేడిగానున్న మూత్రము తాగుచు మండుచున్న నిప్పు కణికలున్న శయ్యపై యమకింకరులు బాధలుపెట్టుచుండగా పడుకొనవలసి వచ్చును. ఈవిధముగా యమయాతనలనుభవించిన తరువాత ఆ మహాపాపి దివ్యములైన ఆరువేల సంవత్సరములు మలమున క్రిమిగానుండి తరువాత భూమి, సంతానములేని మానవుడై పుట్టును. అతడు రోగములచే దరిద్రుడై అందరిచే నిందలు పొందును. అటుపిమ్మట పరిశుద్దుడగును. నారద ఉవాచ- నారదుడిట్లు పలికెను- హంతి యః పరకీర్తిం వా స్వకీర్తిం వా నరాదమః | స కృతఘ్న ఇతి ఖ్యాతః తత్ఫలం చ నిశామయ || 8 అంధకూపే వసేత్సోzపి యావదింద్రాశ్చ తుర్దశ | కీటైర్నకుల గృధ్రైశ్చ భక్షితః సతతం నృప || 9 తప్తక్షారోదకం పాపీ నిత్యం పిబతి వై తతః | సప్తజన్మస్వతః సర్పః కాకః పంచస్వతః శుచిః || 10 ఇతరుల కీర్తిని గాని తన కీర్తినిగాని చెడగొట్టు దుష్టుడు కృతఘ్నుడని పిలువబడుచున్నాడు. అతడు అంథకూపమను నరకమున పదునలుగురు ఇంద్రులు గతించువరకు నరకదుఃఖములననుభవించుచుండును. అచ్చట ఆ పాపిని కీటకములు, నకులములు, గద్దలు ఎల్లప్పుడు భక్షించుచుండను. ఆ నరకముననునన్న వేడియైన ఉప్పునీటిని ఎల్లప్పుడు తాగుచుండును. ఆనరకయాతనల తరువాత ఏడు జన్మలు సర్పముగాను ఐదు జన్మలు కాకిగాను పుట్టి తరువాత పరిశుద్దుడగును. దేవల ఉవాచ- దేవముని ఇట్లనెను- బ్రహ్మస్వంవా గురుస్వం వా దేవస్వం వాzపియో హరేత్ | స కృతఘ్న ఇతిజ్ఞేయే మహాపాపీ చ భారతే || 11 అవటోదే వసేత్సzపి యావదింద్రాశ్చతుర్తశ | తతో భ##వేత్సురాసీ స తతః శూద్రస్తతః శుచిః || 12 బ్రహ్మణుని లేక గురువు, లేక దేవుని సొత్తునపహరించువానిని కృతఘ్నుడందురు. అతడు మహాపాపిగా పరిగణింపబడును. ఆ మహాపాపి పదునలుగురు ఇంద్రులు గతించువర్కు ఆవటోదమను నరకమున బాధలననుభవించి తరువాత సురాపానము చేయువాడుగా జన్మించి పరిశుద్దుడగును. జౌగీషవ్య ఉవాచ- జౌగీషవ్యుడను ముని ఇట్లనెను- పితృమాతృ గురూంశ్చాపి భక్తిహీనో న పాలయేత్ | వాచాzపితాడయేత్తాంశ్చ స కృతఘ్న ఇతిస్మృతః || 13 వాచా చ తాడయేన్నిత్యం స్వామనం కులటా చ యా | సాకృతఘ్నీతివిఖ్యాతా భారతే పాపినీ వరా || వహ్నికుండెం మహాఘోరం తౌ ప్రయాతః సునిశ్చితం || 15 తల్లిని, తండ్రిని, గురువును భక్తిహీనుడై రక్షింపనివానిని, వారిని మాటలతో నైనను హింసించువానిని కృతఘ్నుండందురు. అట్లే తన భర్తను మాటలతో ప్రతిదినము బాదపెట్టు స్త్రీని కూడ కృతఘ్నురాలని అందురు. వీరిద్దరు మహాభయంకరమైన వహ్నికుండమను నరకమునకు వెళ్ళి అచ్చట సూర్యచంద్రులున్నంతవరకు అగ్నిలో ఉండి బాధలననుభవింతురు. ఆ నరకమునుండి బయటకు వచ్చిన తరువాత ఏడు జన్మలవరకు జలగగా బ్రతుకుదురు. అటుపిమ్మట పరిశుద్దులగుదురు. వాల్మికి రువాచ - వాల్మీకి మహర్షి ఇట్లనెను- యథా తరుషు వృక్షత్వం సర్వత్ర న జహాతి చ | తథా కృతఘ్నతా రాజన్ సర్వపాపేషు వర్తతే || 16 మిథ్యా సాక్ష్యం యోదదాతి కామాత్క్రోధాత్తథా భయాత్ | సభాయాం పాక్షికం వక్తి, స కృతఘ్న ఇతి స్మృతః || 17 పుణ్యమాత్రం చాపి రాజన్ యో హంతి స కృతఘ్నకః | సర్వత్రాపి చ సర్వేషాం పుణ్యహానౌ కృతఘ్నతా || 18 మిథ్యా సాక్ష్యం పాక్షికం వా బారతే వక్తి యో నృప యావదింద్ర సహస్రం చ సర్పకుండే వసేత్ ధ్రువం || 19 సంతతం వేష్టితంః సర్పైర్భీతో వై భక్షితస్తథా | భుంక్తే చ సర్వ విణ్మూత్రం యమదూతేన తాడితః || 20 కృకలాసో భ##వేత్తత్ర భారతే సప్తజన్మసు | సప్త జన్మసు మండూకః పితృభిః సప్తభిః సహ || 21 తతో భ##వేద్వై వృక్షశ్చ మహారణ్యతు శాల్మలిః | తతో భ##వేన్నరో మూకస్తతః శూద్రస్తతః శుచిః || 22 వృక్షములలో వృక్షత్వ మే విధముగా శాశ్వతముగానుండునో అట్లే పాపులయందు కృతఘ్న స్వభావముండును. ఆశవలననో, కోపము వలననో , భయమువలననో తప్పుడు సాక్ష్యము చెప్పువానిని కృతఘ్నడని అందురు. అట్లే ఇతరులు చేసిన పుణ్యకార్యములను చెడగొట్టువానిని కూడ కృతఘ్నుడని అందురు. తప్పుడు సాక్ష్యమును కొద్దగా చెప్పినను అతడువేయి ఇంద్రులు గతించువరకు సర్పకుండమను నరకమున నుండును. అచ్చట అతనిని సర్పములు కాట్లు వేయుచుండగా యమభటులు దండించుచుండగా మాలమూత్రములను భక్షించును. తరువాత ఏడు జన్మలను తొండగా, ఏడుజన్మలవరకు తన పితృదేవతలతో సహ కప్పగా బ్రతుకును. ఆ తరువాత మహారణ్యములో బూరుగు చెట్టుగా నుండును. ఆ తరువాత మూగవాడైయుండి చివరకు పరిశుద్ధుడగును అని వాల్మీకి మహర్షి అనెను. ఆస్తీక ఉవాచ- ఆస్తీక ముని ఇట్లనెను- గర్వంగనానాం గమనే మాతృగామీ భ##వేన్నరః | నరాణాం మాతృగమనే ప్రాయశ్చిత్తం న విద్యతే || 23 భారతే చ నృపశ్రేష్ఠ యో దోషో మాతృగామినాం | బ్రహ్మణీగమనే చైవ శూద్రాణాం తావదేహి హి || 24 బ్రాహ్మణ్యాస్తావదేవ స్యాద్దోషః శూద్రేణ మైథునే | కన్యానాం పుత్రపత్నీనాం శ్వశ్రూణాం గమనే తథా || 25 సగర్భభ్రాతృపత్నీనాం భగినీనాం తథైవ చ | దోషం వక్ష్యామి రాజేంద్ర యథాహ కమలోద్భవః || 26 గురుభార్యతో సంగమించువాడు తల్లితో సంగమించినంత పాపమును పొందును. అట్లే శూద్రుడు బ్రాహ్మణ స్త్రీతో సంగమించినను, బ్రాహ్మణ స్త్రీ శూద్రునితో తిరిగినను, తన కూతుళ్ళు, కోడలు, అత్త, అన్నదమ్ముల భార్యలు , చెల్లెలు మొదలగువారితో వ్యభిచారము చేసినచో కలుగు పాపము కలుగునని ఆస్తీకముని చెప్పెను. యః కరోతి మహాపాపి చైతాభిః సహమైథునం | జీవన్మృతో భ##వేత్యోzపి చండాలోzస్పృశ్య ఏవచ || 27 నాధికారో భ##వేత్తస్య సూర్యమండల దర్శనే |శాలగ్రామం తజ్జలం చ తులస్యాశ్చ దళం జలం || 28 సర్వతీర్థజలం చైవ విప్రపాదోదకం తథా | స్రష్టుం చ నైవ శక్నోతి విట్తుల్యః పాతకే నరః || 29 దేవం గురుం బ్రాహ్మణం చ మనస్కర్తుం న చార్హతి | విష్ఠాదికం తదన్నం చ జలం మూత్రాదికం తథా || 30 దేవతాః పితరో విప్రా నైవ గృహ్ణంతి భారతే | భ##వేత్తదంగ వాతేన తీర్థమంగార వాహనం || 31 సప్తరాత్రం హ్యుపవసేద్దైవస్పర్శాత్తథా ద్విజః | భారక్రాంతా చ పృథివీ తద్భారం వోఢుమక్షమా || 32 తత్పాపాత్పతితో దేశః కన్యావిక్రయిణో యథా | తత్సర్శాచ్చ తదాలాపాత్ శయనాశ్రయ భోజనాత్ || 33 నృణాం చ తత్సమం పాపం భవత్యేవ న సంశయః | కుంభూపాకే వసేత్సోzపి యావద్వై బ్రహ్మణో వయః || 34 దివానిశం భ్రమేత్తత్ర చక్రావర్తం నిరంతరం | దగ్ధోవాzగ్నిశిఖాభిశ్చ యమదూతైశ్చ తాడితః || 35 ఏవం నిత్యం మహాపాపీ భుంక్తే నిరయయాతనాం | విష్ఠాహారశ్చ సర్వత్ర కుంభీపాకేzథ పాతితః || 36 పైవారితో వ్యభిచరించు మహాపాపి బ్రతికియున్నను చనిపోయినవానితో సమానుడగును. అస్పృశ్యుడగును. ఆ పాపికి సూర్యమండలమును దర్శించు అధికారములేదు. సాలగ్రామము, సాలగ్రామ జలము, తులసీదళము, తులసీజలము, పవిత్రమైన తీర్థముల జలము, బ్రాహ్మణులయొక్క పాదోదకము వీటిని ముట్టుటకు కూడ అధికారములేదు. అట్లే ఆ పాతకి దేవతలను, గురువును , బ్రహ్మణుని నమస్కరించు అధికారము కోల్పోవును. వారు ఆ పాపాత్ముడు చేయు పూజను స్వీకరింపరు. ఆ పాపాత్ముని శరీరమునకు తగిలిన గాలి సోకినచో పుణ్యతీర్థము కూడ నిప్పుల కుంపటియగును. ఆ పాతకిని పొరపాటున తగిలినను ఏడు దినములు ఉపవాసముండవలెను. ఇంతమంది ప్రాణుల భారమును మోయుచున్న భూమి ఆ పాపాత్ముని బరువును మోయలేదు. తన కన్యలను అమ్ముకొను వానివలె (కన్యా విక్రయం) ఈ పాపియున్నందువలన ఆ స్థలము అవిత్రమగును. ఆ పాపిని తగిలినను, అతనితో మాట్లాడినను, ఆతనితో కలిసి పడికొన్నను, భోజనము చేసినను వారికి ఆ పాపితో సమానమైన పాపము లభించును. ఆ పాపి కుంభీపాకనరకమున బ్రహ్మయొక్క జీవితాకాలమువరకుండును. ఆ నరకమున ప్రతిదినము నిరంతరము చక్రమునకు కట్టివేయబడి తిరుగుచుండును. అతనిని యమభటులు ఎల్లప్పుడు బాధించుచుందిరు. అతనిని నిప్పులలో పడద్రోయుదురు. ఈ విధముగా ఆ పాపి కుంభీపాక నరకమున మలమూత్రములను భుజించుచు నరకయాతనల ననుభవించును. గతే ప్రాకృతికే ఘోరే మహతి ప్రళ##యే తథా | పునః సృష్టే సమారంభే తద్విధో వా భ##వేత్పునః || 37 షష్టివర్షసహస్రాణి విష్టాయాం చ కృమిర్భవేత్ | తతో భవతి చండాలో భార్యాహీనో నపుంసకః || 38 సప్తజన్మసు శూద్రశ్చ గళత్కుష్ఠీ నపుసంకః | తతోభ##వేబ్రాహ్మణశ్చాప్యంధః కుష్ఠీ నపుంసకః || 39 లబ్ద్వైవం సప్తజన్మాని మహాపాపి భ##వేచ్ఛుచిః || 40 ప్రకృతి సంబంధమైన ప్రళయముగడిచి మరల సృష్టి ప్రారంభ##మైనను ఈ పాపి అట్లే నరకయాతలననుభవించును. అతడ అరవైవేల సంవత్సరములు మలయలోని పురుగుగా బ్రతుకును, తరువాత చండాలుడై, భార్యాహీనుడై నపుంసకుడగును. తరువాత ఏడు జన్మలవరకు శూద్రుడైపుట్టి కుష్ఠురోగముతో బాధపడుచు, నపుంసకుడగును, ఆ తరువాత బ్రహ్మణజన్మ లభించినను గుడ్డివాడై నపుంసకుడుగా నుండును. ఈ విధముగా ఏడు జన్మలవరకు గుడ్డివాడై చివరకు పవిత్రమగును అని ఆస్తీక మహర్షి అనెను. మునయః ఊచు - మునులు ఇట్లనిరి - ఇత్యేవం కథితం సర్వం అస్మాభిర్వో యథాగమం | ఏభిస్తుల్యోభ##వేద్దోషోzప్యతిథీనాం పరాభ##వే || 41 ప్రణామం కురు విప్రేంద్రం గృహం ప్రాపయ నిశ్చితం | సంపూజ్యం బ్రహ్మణం యత్నాత్ గృహీత్వా బ్రాహ్మణాశిషం || 42 వనం గచ్ఛ మహారాజ తపస్యాం కురు సత్వరం | బ్రహ్మశాపైర్వినిర్ముక్తః పునరేవాగమిష్యసి || 43 ఇత్త్యుక్త్యా మునయః సర్వేయయుస్తూర్ణం స్వమందిరం | సురాశ్చాపి చ రాజానో బంధువర్గాశ్చ పార్వతి || 44 ఓ మహారాజా కృతఘ్నులు ఏవిదంముగానుందురో వారు ఎట్టి కర్మఫలితముననుభవింతురో ఇంతవరకు చెప్పితిమి. ఇంటికి వచ్చిన అతిథిని పరాభవించినను ఇంతటి పాపము కలుగును. అందువలన నీవు ఈ బ్రాహ్మణునకు నమస్కరించి అతనిని తృప్తిపరచి కష్టపడియైనను నీ ఇంటికి తీసుకొని వెళ్ళి అతని ఆశీర్వచనములను స్వీకరింపుము. అటుపిమ్మట అడవికి వెళ్ళి తపస్సు చేసినచో బ్రాహ్మణ శాపదోషమునుండి విముక్తుడవగుదువు. ఈ విధముగా సుయజ్ఞమహరాజుతో మహర్షులు పలికి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అట్లే దేవతలు, రాజులు, అతని బంధువులందరు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదాంతర్గత హరగౌరీసంవాదే రాధోపాఖ్యానే సుయజ్ఞో పాఖ్యానే కర్మవిపాకో నామ ద్విపంచాశత్తమోధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండములోని నారద నారాయణ సంవాదములో కనిపించు గౌరీ శంకరుల సంవాదములోని రాధోపాఖ్యానమున చెప్పబడిన సుయజ్ఞాపాఖ్యానమున కర్మవిపాకమను యాభై రెండవ అధ్యాయము సమాప్తము.