sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
త్రి పంచాశత్తమోZధ్యాయః - సుయజ్ఞనకు అతిథివేషముననున్న విష్ణూపదేశము శ్రీ పార్వత్యువాచ- శ్రీ పార్వతిదేవి ఇట్లనెను- గతేషు మునిసంఘేషు శ్రుత్వా కర్మఫలం నృణాం | కిం చకార నృపశ్రేష్ఠో బ్రహ్మశాపేన విహ్వలః ||
1 అతిథిర్బ్రాహ్మణోవాZపి కించకార తదాప్రభో | జగామ నృపగేహం వా నవా తద్వక్తుమర్హసి || 2 మహేశ్వరా! మునులందరు వెళ్ళిపోయిన తరువాత సుయజ్ఞమహారాజు బ్రహ్మశాపభీతుడగుచు ఏమి చేపెను? అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడు రాజుయొక్క ఇంటికివెళ్ళెనా ? లేదా? ఆ విషయమునంతయు చెప్పుము. మహేశ్వరా ఉవాచ- శంకరుడామెతో ఇట్లనెను- గతేషు మునిసంఘేషు నిందాగ్రస్తో నరాధిపః | ప్రేరితశ్చ వసిష్ఠేన పురోధసా || 3 పపాత దండవద్భూమౌ పాదయోర్బ్రాహ్మణస్య చ | త్యక్త్యా మన్యుంద్విజ శ్రేష్ఠో దదౌ తసై#్మ శుభాశిషం || 4 సస్మితం బ్రాహ్మణం దృష్ట్వా త్యక్తమన్యుం కృపామయం | ఉవాచ నృపతిశ్రేష్ఠః సాzశ్రునేత్రః కృతాంజలిః || 5 మహేశ్వరి! మునులందరు తమ ఇండ్లుకు వెళ్ళిపోయిన తరువాత ధర్మిష్ఠుడగు వసిష్ఠ మహాముని ప్రేరణవల్ల మహారాజి బ్రాహ్మణునకు సాష్టాంగ దండప్రణామములాచరించెను. బ్రాహ్మణుడప్పుడు కోపమును వదలిపెట్టి ఆ మహారాజునకు శుభాశీస్సులనొసగెను. కోపములేక , చిరునవ్వుతో నున్న బ్రాహ్మణుని జూచి మహారాజు కన్నీళ్ళు కారగా దండముపెట్టుచు ఇట్లనెను. రాజోవాచ- సుయజ్ఞ మహారాజిట్లనెను.- కుత్రవంశే భవాన్ జాతః కిం నామ భవతః ప్రభో | కి నామా వాzపి తత్ బ్రూహి క్వవాసః కథమాగతః || 6 విప్రరూపే స్వయం విష్ణుః గూఢః కపటమానుషః | సాక్షాత్సమూర్తిమానగ్నిః ప్రజ్వలన్ బ్రహ్మతేజసా || 7 కోవా గురుస్తే భగవన్ ఇష్టదేవశ్చ భారతే | తవ వేషః కథమయం జ్ఞాన పూర్ణస్య సాంప్రతం || 8 గృహాణ రాజ్యమఖిలం ఐశ్వర్యం కోశ##మేవ చ | స్వభృత్వం కురు మే పుత్రం మాంచ దాసీం స్త్రియం మునే || 9 సప్తసాగర సంయుక్తాం సప్తద్వీపాం వసుంధరాం | అష్టాదశోపద్వీపాఢ్యాం సశైల వనశోభితాం || 10 మయాభృత్యేన శాధిత్వం రాజేంద్రో భవ భారతే | రత్నేంద్ర సారఖచిచే తిష్ఠ సింహాసనే వరే || 11 నృపస్య వచనం శ్రుత్వా జహాస ముని పుంగవః| ఉవాచ పరమం తత్వం అజ్ఞాతం సర్వదుర్లభం || 12 ఓ బ్రాహ్మణుడా! నీవే వంశమున జన్మించితివి. నీ పేరేమి? మీ నివాసమెక్కడనుండును? ఇక్కడకు ఎట్లు వచ్చితివి. బ్రాహ్మణుడు బ్రహ్మతేజస్సుచో ప్రకాశించు అగ్నివలె నుండును. భగవన్! మీ గురువెవరు? మీ ఇష్టదైవము పేరేమి? సంపూర్ణ జ్ఞానముతో నిండిన మీ వేషమిట్లెందుకున్నది? మీరు నా యొక్క సమస్త రాజ్యమును ఐశ్వర్యమును, కోశాగారమును, స్వీకరింపుడు. నన్ను నా పుత్రుని భృత్యునివలె నా బార్యను దాసివలె మీరు స్వీకరింపుడు. సప్త సాగరములు కలది, సప్త ద్వీపములు , అష్టాదశ ఉపద్వీపములు, పర్వతములు అడవులతోనున్న ఈ భూమినంతయు స్వీకరించి మీరు రాజుగానుండి రత్నసింహాసనమున కూర్చుండి నన్ను భృత్యునిగా స్వీకరింపుడు. అను సుయజ్ఞమహారాజు మాటలు విని బ్రాహ్మణుడు నవ్వుచు సర్వదుర్లభ##మైన , పరతత్వమును ఇట్లు తెలిపెను. అతిథిరువాచ- అతిథిగా వచ్చిన బ్రాహ్మణుడిట్లనెను- మరీచిర్బ్రహ్మణః పుత్రః తత్పుత్రః కశ్యపః స్వయం | కశ్యపస్య సుతాః సర్వే ప్రాప్తా దేవత్వ మీప్సితం || 13 తేషు త్వష్టా మహాజ్ఞానీ చకార పరమం తపః | దివ్యం వర్ష సహస్రం చ పుష్కరే దుష్కరం తపః || 14 సిషేవే బ్రాహ్మణార్థం చ దేవదేవం హరిం పరం | నారాయణాద్వరం ప్రాప విప్రతేజస్వినం సుతం || 15 తతో బభూవ జేజస్వీ విశ్వరూపస్తపోధనః | పురోధసం చకారేంద్రో వాక్పతో తం కృధా గతే || 16 మాతామాహేభ్యో దైత్యేభ్యో దత్తవంతం ఘృతాహూతిం | చిచ్ఛేదం తం శునాసీరో బ్రాహ్మణం మాతురాజ్ఞయా || 17 విశ్వరూపస్య తనయో విరూపో మత్పితా నృప | అహం చ సుతపా నామ విరాగీ కశ్యపో ద్విజః || 18 మహాదేవో మమగురుః విద్యాజ్ఞానమనుప్రదః | అభీష్టదేవః సర్వాత్మా శ్రీకృష్ణః ప్రకృతేః పరః || 19 తచ్చింతయామి పాదాబ్జం నమే వాంఛాzస్తి సంపది | సాలోక్య సార్‌ష్టిసారూప్య సామీప్యం రాధికా పతేః || 20 తేన దత్తం న గృహ్ణామి వినా తత్సేవనం శుభం | బ్రహ్మత్వమమరత్వం వా మన్యేzహం జలబింబవత్ || 21 భక్తివ్యవహితం మిథ్యాభ్రమమేవ తు నశ్వరం | ఇంద్రత్వం వా మనుత్వం వా సౌరత్వం వా నరాధిప || 22 న మన్యే జలరేఖేతి నృపత్వం కేన గణ్యతే || బ్రహ్మదేవునకు మరీచి మహర్షి పుత్రుడు . అతని పుత్రుడు కశ్యప ప్రజాపతి . ఆ ప్రజాపతి పుత్రులందరు దేవత్వమును పొందిరి. ఆ కశ్యపపుత్రులతో మిక్కిలి జ్ఞానసంపన్నుడైన త్వష్ట పుష్కర క్షేత్రమున వేయి దివ్య సంవత్సరములు గొప్పనైన తపస్సు చేసెను. అతడు పుత్రసంతానములకై శ్రీహరిని సేవింపగా అతని అనుగ్రమువలన మంచి తేజస్సంపన్నుడగు పుత్రుని పొందెను. ఆ పుత్రుడే గొప్ప తపః సంపద కల విశ్వరూపుడు. ఒకప్పుడు బృహస్పతి కోపముతో వెళ్ళిపోగా దేవేంద్రుడు విశ్వరూపుని పురోహితునిగా చేసికొనెను. కాని ఆ విశ్వరూపుని శిరస్సు ఖండించెను. ఆ విశ్వరూపునకు విరూపుడనువాడు పుత్రుడు . ఆ విరూపుని పుత్రుడను నేను. నా పేరు సుతపుడు. నాకు శంకరుడు విద్యము జ్ఞానమును ప్రసాదించెను. పరమాత్మయగు శ్రీకృష్ణుడు నా అభీష్టదైవము, నేనెల్లప్పుడు డా శ్రీకృష్ణుని చరణ పద్మములను మనస్సులో ద్యానించుచుందును. నాకు సంపదలపై ఎట్టి వ్యామోహము లేదు. శ్రీహరి నాకు చతుర్విధముక్తులగు సాలోక్య సార్షి, సారూప్య సామీప్యములను ఇవ్వదలచినను నేను స్వీకరింపను. నాకు పరమ మంగళ రూపమైన శ్రీహరి సేవయే చాలును. బ్రహ్మత్వము, అమరత్వములను నేను నీటిలోను ప్రతిబింబము వలె అశాశ్వతమైనవని విశివసింతును. శ్రీహరి భక్తిలేనిచో సమస్తము మిథ్యాభ్రమములుగా తలపోయిదును. ఇంద్రత్వమైనను, మనుత్వమైనను, సూప్యత్వమైనను నీటిలో గీచిన గీతవలె వ్యర్ధమైనవని భావింతును. అందువలన నీవు ఇచ్చు రాచరికమును నేను శాశ్వతమని స్వీకరింపజాలను. శ్రూత్వా సుయజ్ఞ యజ్ఞే తే మునీనాం గమనం నృప || 23 లాలసాం విష్ణుభక్తి తే సంప్రాపయితుమాగతః | కేవలానుగృహీతస్త్వం న హి శప్తో మయాzధునా || 24 సముధృతశ్చ పతితో ఘోరే నిమ్మే భవార్ణవే | న హ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్చిలామయాః || 25 తే పునంత్యురు కాలేన కృష్ణభక్తాశ్చ దర్శనాత్ | రాజన్నిర్గమ్యతాం గేహాత్ దేహి రాజ్యం సుతాయ చ || 26 పుత్రే న్యస్య ప్రియాం సాధ్వీం గచ్ఛ వత్స వనం ద్రుతం | బ్రహ్మాదిస్తంబపర్యంతం సర్వం మిథ్యైవ భూమిప || 27 శ్రీకృష్ణం భ##జే రాదేశం పరమాత్మానమీశ్వరం | ధ్యానసాధ్యం దురారాధ్యం బ్రహ్మవిష్ణు శివాదిభిః || 28 ఆవిర్భూతైస్తిరోభూతైః ప్రాకృతైః ప్రకృతేః పరం | బ్రహ్మ స్రష్టా హరిః పాతా హరః సంహార కారకః || 29 దిక్పాలాశ్చ దిగీశాశ్చ భ్రమంత్యేవాzస్య మాయయా | యదాజ్ఞయా వాతి వాయుః సూర్యో దినపతిః సదా || 30 నిశాపతిః శశీ శశ్వత్సస్య సుస్నిగ్ధతా కరః | కాలేన మృత్యుః సర్వేషాం సర్వవిశ్వేషు వైభ##వేత్ || 31 కాలే వర్షతి శక్రశ్చ దహత్యగ్నిస్చ కాలతః | భీతవద్విశ్వశాస్తా చ ప్రజాసంయమనో యమః || 32 కాలః సంహరతే కాలే కాలే సృజతి పాతి చ | స్వదేశే వై సముద్రశ్చ స్వదేశే వై వసుంధరా || 33 స్వదేశే పర్వతాశ్చైవ స్వాః పాతాళాః స్వదేశతః | స్వర్లోకాః సప్త రాజేంద్ర సప్తద్వీపా వసుంధరా || 34 శైలసాగరసంయుక్తాః పాతాళాః సప్తచైవ హి | బ్రహ్మండమేభిర్లోకైశ్చ డింబాకారం జలం ప్లుతం || 35 నీవు చేయుచున్న యజ్ఞమునకు మునులందరు వచ్చుచున్నారని తెలిసికొని నీకు విష్ణుభక్తిని కలిగింపవలెనని ఇచ్చటకు వచ్చితిని. నేను నిన్ను అనుగ్రహించితినే కాని శపింపలేదు. చాలా భయంకరము, లోతైన సంసారసాగరమున పడిపోయిన నిన్ను ఉద్ధరించుటకు ఇచటకు వచ్చితిని. కేవలము జలమయమైనవి మాత్రమే తీర్థములు కాజాలవు. విష్ణు భక్తులు తీర్థములవంటివారు . అట్లే మట్టి, శిలలతో రూపొందించినవారే దేవతలుకారు. శ్రీహరి పాదభక్తులు కూడ దేవతలవంటివారు. అంబుమయములైన తీర్థములు, మృచ్ఛిలామయములైన దేవతలు చాలాకారమునకు మానవులను పవిత్రులనగా చేయుచుండగా శ్రీకృష్ణ భక్తుల దర్శనము జరిగినంతమాత్రముననే జనులు పవిత్రులగుదురు. ఓ రాజా! నీవు ఇంటినుండి బయటకు రమ్ము. నీరాజ్యమును నీ పుత్రునకిచ్చివేయుము. సాధ్వియగు నీ భార్యను నీ పుత్రునకప్పగించి నీవు అడవికి వెళ్ళుము. ఈ ప్రపంచమున బ్రహ్మమొదలుకొని స్తంబమువరకున్న దంతయు అశాశ్వతమైనది. పరమాత్మ, ఈశ్వరుడు, రాధాపతియగు, శ్రీకృష్ణుడు మాత్రమే శాశ్వతమైనవాడు. అందువలన ఆ శ్రీకృష్ణుని నీవు సేవింపుము. అతడు బ్రహ్మవిష్ణు, మహేశ్వరులకు దురారాధ్యుడు, అతడు కేవలము ద్యానమువలననే భక్తులకు సాధ్యుడగును. అతడు ఉత్పత్తి లయములు కల ప్రాకృత పదార్థములకంటెను ప్రకృతికంటెను శ్రేష్ఠుడు. శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞననుసరించి బ్రహ్మదేవుడు ఈ చరాచర ప్రపంచమును సృష్టించుచున్నారు. శ్రీహరి దానిని రక్షించుచున్నాడు. హరుడు దానిని సంహరించుచున్నాడు. అట్లే అతని ఆజ్ఞననుసరించియే దక్పాలకులు సంచరించుచున్నారు. వాయువు, సూర్యుడు, చంద్రుడు, మృత్యువు, తమ తమ కార్యములను నిర్వహించుచున్నారు. ఇంద్రుడు అతని ఆజ్ఞననుసరించియే సకాలమున వర్షములను కురిపించుచున్నాడు. అగ్ని కాల్చుచున్నాడు. ప్రపంచమునే శాసించుచున్న యముడుకూడ భయముతో తిరుగుచున్నాడు. కాలుడు కాలముననుసరించి సంహరించుచు, సృష్టిచేయుచున్నాడు. సముద్రములు, భూమి, పర్వతములు, పాతాళములు అన్నియు ఆ పరమాత్మయొక్క భయమువలననే తమ తమ స్థానమున ఉన్నవి. ఏడు స్వర్లోకములు, సప్తద్వీపములతో సముద్రపర్వతములతోనున్న భూమి, సప్తపాతాళలోకములతో నున్న బ్రంహ్మాండమంతయు నీటిలో అండమువలె తేలియాడుచున్నది. సంత్యేవ ప్రతివిధ్యండే బ్రహ్మ విష్ణు శివాదయః | సురానరాశ్చ నాగాశ్చ గంధర్వా రాక్షసాదయః || 36 ఆపాతాళాద్బ్రహ్మాలోత పర్యంతం డింబరూపకం | ఇదమేవతు విద్యండం ఉత్తమం కృత్రమం నృప || 37 నాభిపద్మే విరాడ్విష్ణోః క్షుద్రస్య జలశాయినః | స్థితం యతాపద్మబీజం కర్ణికాయాం చ పంకజే || 38 ఏవం సోZ పి శయానస్స్యాత్ జలతల్ఫే సువిప్లుతే | ద్యాయత్యేవ మహాయోగీ ప్రాకృతః ప్రకృతేః పరం || 39 కాలభీతశ్చ కాలేశం కృష్ణమాత్మానం మీస్వరం | మహావిష్ణోర్లోమ కూప సాదారః సోZస్తి విస్తృతే || 40 మహావిష్ణోః గాత్రలోమ్నాం బ్రహ్మాండానాం చ భూమిప | సంఖ్యాంకర్తుం నశక్నోతి కృష్ణోప్యన్యస్య యా కథా || 41 బ్రహ్మాండములన్నిటిలో ప్రత్యేకముగా బ్రహ్మవిష్ణు శివాది దేవతలు, మానవులు, సర్పములు, గంధర్వులు, రాక్షసులు, మొదలగువారున్నారు. పాతాళలోకమున మొదలుకొని బ్రహ్మలోకమువరకు అండరూపముననున్నది. ఈ అండమే బ్రహ్మయొక్క కృత్రిమమైన అండముగా కన్పించుచున్నది. ఇది జలమున శయనించియున్న క్షుద్రవిరాట్ స్వరూపుడైన విష్ణుమూర్తియొక్క నాభికమలమున, కమలముయొక్క కర్ణికలోనుండు పద్మబీజమువలె కన్పించును. ఈ విధముగా జలతల్పమున శయనించియున్న ప్రాకృతుడు మహాయోగి, క్షుద్రవిరాట్ స్వరూపుడు విష్ణువు, ప్రకృతికంటె శ్రేష్ఠుడు, కాలమునకు ఈశుడు అగు శ్రీకృష్ణ పరమాత్మను మనస్సులో ధ్యానించుచుండును. మహావిష్ణువుయొక్క రోమకూపములు క్షుద్రవిరాట్ స్వరూపునకు ఆదారములగుచున్నవి. మహావిష్ణువు యొక్క రోమకూపములందు ప్రత్యేకముగా బ్రంహ్మాడములు కల్పించుచున్నవి. అందువలన ఈ మహావిష్ణుయొక్క రోమ కూపములు అందున్న బ్రహ్మండములసంఖ్యాకమైనవి. వీటి సంఖ్యను శ్రీకృష్ణపరమాత్మయే లెక్కపెట్టలేడనినచో ఇతరులగురించిన మాట ఏమియుండును. మహావిష్ణుః ప్రాకృతికః సోZపిడుబోద్భవః సదా | భ##వేత్కృష్ణేచ్ఛయా డింబః ప్రకృతేర్గర్భ సంభవః || 42 సర్వాధారో మహాన్విష్ణుః కారభీతః స శంకితః | కాలేశం ధ్యాయతి సై#్వరం కృష్ణమాత్మానమీశ్వరం || 43 ఏవం చ సర్వ విస్వస్థా బ్రహ్మవిష్ణు శివాదయః | మహావిరాట్ క్షుద్రవిరాట్ సర్వే ప్రాకృతికాః సదా || 44 సా సర్వబీజరూపాచ మూపప్రకృతిరీశ్వరీ | కాలే లీనా చ కాలేశే కృష్ణే తం ధ్యాయతిస్మ సా || 45 ఏవం సర్వే కాలభీతాః ప్రకృతిః ప్రాకృతాస్తథా | ఆవిర్భూతాస్తిరోభూతాః కాలేన పరమాత్మని || 46 ఇత్యేవం కథితం సర్వం మహాజ్ఞానం సుదుర్లభం | శివేన గురుణా దత్తం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 47 శ్రీమహావిష్ణువు ప్రాకృతికుడు. అతడు అండాకారమైన బ్రహ్మాండముయొక్క ఉత్పత్తికి కారణమైనవాడు. అతడు శ్రీకృష్ణ పరమాత్మయొక్క కోరికననుసరించి ప్రకృతియొక్క గర్భమున అండ రూపమున కన్పించుచున్నాడు. సమస్తమునకు ఆధారభూతుడైన శ్రీమహావిష్ణువు కాలమునకు ఈశ్వరుడు, పరమాత్మయగు శ్రీకృష్ణుని ఎల్లప్పుడు ద్యానించుచుండును. ఈ విధముగా సమస్త బ్రహ్మాండములందున్న బ్రహ్మవిష్ణుశివాది దేవతలు, మహావిరాట్, క్షుద్రవిరాట్ వీటి కన్నిటికి బీజరూపమైనది మాల ప్రకృతియగు ఈశ్వరి. ఈమె ప్రళయకాలమున కాలేశుడగు పరమాత్మయైన శ్రీకృష్ణునియందు విలీనమై అతనిని ధ్యానించుచుండును. ఈ విధముగా ప్రకృతి, ప్రాకృతులైన బ్రహ్మావిష్ణు, శివాదులు, ప్రళయకాలమున కాలేశుడగుపరమాత్మయందు విలీనమగుచున్నారు. తిరిగి సృష్టికాలమున ఆవిర్భవించుచున్నారు. సుయజ్ఞమహారాజా! ఈ విధముగా పరమదుర్లభ##మైన జ్ఞానమునంతయు నీకు తెలిపితిని . దీనిని నేను నాగరువగు శివుని దయవలన నేర్చుకొంటిని. ఇంకను నీకు తెలుసుకొనవలసిదేమైన ఉన్నచో అడుగుమని బ్రాహ్మణుడు చెప్పెను. ఇతి బ్రహ్మవైపర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారద నారాయణ సంవాదాంతర్గత శ్రీబ్రహరగౌరిసంవాదే రాదోపాఖ్యానే సుయజ్ఞం ప్రత్యతుథ్యుపదేశోనామ త్రిపంచాశత్తమోzధ్యాయః బ్రహ్మ వైవర్తమహాపురామములోని రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదమున కన్పించు గౌరీశంకరుల సంవాదమున చెప్పబడిన రాధోపాఖ్యానములోని సుయజ్ఞమహారాజునకు అతిథిచేసిన ఉపదేశమను యాభైమూడవ అధ్యాయ సమాప్తము.