sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters   

పంచాత్తమోzధ్యాయః - రాధాదేవి యొక్క పూజ, స్తోత్రాదులు

శ్రీపార్వత్యువాచ- పార్వతీదేవి ఇట్లనెను -

శ్రీకృష్ణస్వస్థితే మంత్రే చాన్యేషామీశ్వరస్య వః | కథం జగ్రాహ రాధాయాః మంత్రం వై వైష్ణవోనృపః || 1

కిం విధానం చ కిం ధ్యానం కింస్తోత్రం కవచం చ కిం | కం మంత్రం చ దదౌ రాజ్ఞే తాం పూజాపద్ధతిం వద || 2

ఓ మహదేవా! మీకు, ఇతరులకు కూడా ఈశ్వరుడగు శ్రీకృష్ణమంత్రముండగా దానిని కాదని విష్ణుభక్తుడైన రాజు రాధికామంత్రము నేల గ్రహించెను.

ఆ రాధికా పూజలు ఎట్లు చేయవలెను? ఆమెను ఎట్లు ధ్యానింపవలెను. ఆదేవియొక్క స్తోత్రము, కవచము ఏ తీరున ఉన్నవి? ఆ దేవిని ఉపాసించు మంత్రమేది ఈ విషయములనన్నిటిని నాకు వివరింపుము.

శ్రీమహేశ్వర ఉవాచ - మహాదేవుడిట్లనెను -

హేవిప్ర కం భజామితి ప్రశ్నం కుర్వతి రాజవి | శీఘ్రం ప్రాపయ గోలోకం కస్యారాధనతో మునే || 3

ఇత్యుక్తవంతం రాజేంద్రమువాచ బ్రాహ్మణోత్తమః | తత్సేవయా చ తల్లోకం ప్రాప్స్యసే బహుజన్మతః || 4

తత్ర్పాణాధిష్ఠాతృదేవీం భజ రాధాం పరాత్పరాం | కృపామయీప్రసాదేన శ్రీఘ్రం ప్రాష్నోషి తత్పదం || 5

ఇత్యుక్త్వా రాధికామంత్రం దదౌ తసై#్మ షడక్షరం | ఓం రాధేతి చతుర్థ్యంతం వహ్నిజాయాంతమేవచ || 6

ప్రాణాయామం భూతశుద్ధిం మంత్రన్యాసం తథైవ చ | కరాంగన్యాస మేవం చ ధ్యానం సర్వసుదుర్లభం || 7

స్తోత్రం చ కవచం తం చ శిక్షయామాస భక్తితః | రాజా తేన క్రమేణౖవ జజాప పరమం మనుం || 8

ధ్యానం చ సామవేదోక్తం మంగలానాం చ మంగళం | కృష్ణస్తాం పూజయామాస పురా ధ్యానేన యేనచ || 9

సుయజ్ఞ మహారాజు బ్రాహ్మణునితో ఆర్యా నేనెవరిని సేవింపవలెను? ఏదేవతను ఆరాధించినచో త్వరగా నేను గోలోకమును పొందగలనో ఆ దేవతామంత్రము నాకు ఉపదేశింపుడని బ్రాహ్మణుని అడుగగా సుతపుడను ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని ఆరాధించింనచో అనేక జన్మలకు అతడుండు గోలోకమును చేరుకొందువు. కాని శ్రీకృష్ణునకు ప్రాణవల్లభయగు రాధికాదేవిని సేవించిన కృపామూర్తియగు ఆ తల్లియొక్క అనుగ్రహమువలన నీవు గోలోకమును త్వరగా పొందుదువని చెప్పెను.

తరువాత ఆ మహారాజునకు షడక్షరమైన రాధికాదేవి మంత్రమునుపదేశించెను. ఆమంత్రము ఓంకారపూర్వమై చతుర్థీ విభక్తి చివర కలిగియున్న రాధాశబ్దమునకు వహ్నిజాయయగు స్వాహాకారాంతమై (ఓం రాధికాయై స్వాహా) ఉండును.

ఆ మంత్రమును ప్రాణాయామము, భూతశుద్ధి, మంత్రన్యాసము, అంగన్యాసము, కరన్యాసము మొదలగు వాటితో ధ్యానించవలయునని ఆ దేవియొక్క, స్తోత్రమును, కవచమును బోధించెను. సుయజ్ఞుడు తన మంత్రగురువగు సుతపుడు చెప్పినట్లు రాధికామంత్రమును జపించెను. అట్లే శ్రీకృష్ణుడు రాధికాదేవిని ఏరీతిగా ధ్యానము చేసెనో సామవేదమున రాధాదేవి ధ్యానమేరీతిగా కలదో ఆ పద్ధతిలో రాధాదేవిని ధ్యానించెను.

శ్వేతచంపక వర్ణాభాం కోటిచంద్రసమప్రభాం | శరత్పార్యణచంద్రాస్యాం శరత్పంకజ లోచనాం |

సుశ్రోణీం సునితంబాంచ పక్వబింబాధరాం వరాం || 10

ముక్తాపంక్తి ప్రతినిధి దంతపంక్తి మనోహరాం | ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం భక్తానుగ్రహ కారికాం |

వహ్నిశుద్ధాంశుకాధానాం రత్నమాలా విభూషితాం ||

రత్నకేయూరవలయాం రత్నమంజీర రంజితాం | రత్నకుండల యుగ్మేన విచిత్రేణ విరాజితాం |

సూర్యప్రభాప్రతికృతి గంఢస్థల విరాజితాం ||

అమూల్యరత్నఖచిత గ్రైవేయక విభూషితాం | సద్రత్నసారఖచిత కిరీట ముకుటోజ్వలాం || 13

బభ్రతీం కబరీభారం మాలతీమాల్య శోభితాం | రూపాధిష్ఠాతృదేవీం చ మత్తవారణగామినీం || 14

గోపీభిః సుప్రియాభిశ్చ సేవితాం శ్వేత చామరైః | కస్తూరీబిందుభిః సార్థమర్ధచందన బిందునా || 15

సిందూరబిందునా చారుసీమంతాధః స్థలోజ్వలాం | నిత్యం సుపూజితాం భక్త్యా కృష్ణేన పరమాత్మనా || 16

కృష్ణసౌభాగ్య సంయుక్తాం కృష్ణప్రాణాధికాం వరాం | కృష్ణప్రణాధిదేవీం చ నిర్గుణాంచ పరాత్పరాం || 17

మహావిష్ణు విధాత్రీం చ ప్రదాత్రీం సర్వసంపదాం | కృష్ణభక్తి ప్రదాంశాంతాం మూలప్రకృతి మీశ్వరీం || 18

వైష్ణవీం విష్ణుమాయాం చ కృష్ణప్రేమమయీం శుభాం | రాసమండల మధ్యస్థాం రత్నసింహాసన స్థితాం |

రాసే రాసేశ్వర యుతాం రాధాం రాసేశ్వరీం భ##జే || 19

రాధాదేవి ధ్యానశ్లోకములలో ఈవిధముగా వర్ణింపబడినది. ఆ దేవి తెల్లని చంపకపుష్పములవలె తెల్లగానుండును. శరత్కాలమందలి పూర్ణిమాచంద్రుని వలె నిండైన ముఖముగలది. ఆమె నేత్రములు సైతము శరత్కాలమందలి పద్మములవలె శోభించుచుండును. చక్కని నడుము, నితంబములు కలది. ఆ దేవి పెదవులు పండిన దొండపండువలె ఎఱ్ఱగా నుండును. ఆ దేవి దంతములు ముత్యాల వరుస వలెనుండును. ఆమె ఎల్లప్పుడు చిరునవ్వుతో ప్రసన్నముగా నుండును. భక్తులననుగ్రహించును. పరిశుద్ధమైన వస్త్రమును, రత్నమాలలను, రత్నకేయూరములను, రత్నమంజీరములను, రత్నకుండలములను ఆమె ఎల్లప్పుడు ధరించును. సూర్యకాంతివంటి కాంతిగల చెక్కిళ్ళతో ఆ దేవి అమూల్యములైన రత్నములున్న కంఠాభరణమును, మంచి రత్నములుగల కిరీటమును, రత్నముల యుంగరమును, రత్నపాశమును మాలతీ మాలచే అలంకరింపబడిన కొప్పును ధరించుచున్నది. ఆదేవి సురూపమునకు అధిష్ఠాన దేవత. మదించిన ఏనుగువంటి నడకగలది. ఆ దేవిని గోపికలు చెలికత్తెలు తెల్లని చామరములు వీయుచు సేవింతురు. ఆమె పాపిటలో కస్తూరి బిందువులు దానికింద అర్ధచందనపు చుక్క దానికింద సింధూరపు చుక్కలున్నవి. ఆ తల్లిని పరమాత్మయగు శ్రీకృష్ణుడే ప్రతిదినము ఆరాధించుచుండును. శ్రీకృష్ణునకు ప్రాణములకంటె మిన్నయైనది. ఆమె నిర్గుణ, పరాత్పర, సమస్తసంపదల నొసగునది. మహావిష్ణువునకు మాత. శ్రీకృష్ణునియందు భక్తిని కలిగించునది. మూలప్రకృతి రూపిణి. ఈశ్వరి, వైష్ణవి, విష్ణుమాయ, శ్రీకృష్ణప్రేమరూపిణి. ఆ మహాదేవి రాసమండలమున రత్నసింహాసనమున రాసేశ్వరుడగు శ్రీకృష్ణునితో కలిసియున్నట్లు ధ్యానించుచు ఆమెను సేవింపవలెను.

ధ్యాత్వాపుష్పం మూర్ద్ని దత్వా పునర్ధ్యాయేత్‌ జగత్ప్రభుం | దద్యాత్‌ పుష్పం పునర్ధ్యాత్వా చోపచారిణి షోడశ || 20

ఆసనం వసనం పాద్యమర్ఘ్యం గంధానులేపనం | ధూపం దీపం సుపుష్పం చ స్నానీయం రత్నభూషణం || 21

నానాప్రకారనైవేద్యం తాంబూలం వాసితం జలం | మధుపర్కం రత్నతల్పముపచారాణి షోడశ || 22

ప్రత్యేకం వేదమంత్రేణ దత్తం భక్త్యా చ భూభృతా | మంత్రాశ్చ శ్రూయతాం దుర్గే వేదోక్తాన్‌ సర్వసమ్మతాన్‌ || 23

రాధాదేవిని పై విధముగా ధ్యానించి ఆదేవి శిరస్సుపై పుష్పమునుంచి జగత్ప్రభువగు శ్రీకృష్ణుని కూడ ధ్యానింపవలెను. ఆ తరువాత మరల ఆ దేవి శిరస్సుపై పుష్పమునుంచి ఆమెను ధ్యానము చేయవలెను. అటుపిమ్మట షోడశోపచారములతో ఆమెను పూజింపవలెను.

షోడశోపచారములేవనగా ఆసనము, వస్త్రము, పాద్యము, అర్ఘ్యము, గంధానులేపనము, ధూపము, దీపము, పుష్పము, స్నానము, రత్నభూషణములు, అనేక విదములైన నైవేద్యములు, తాంబూలము, సువాసనలగల జలము, మధుపర్కము, రత్నశయ్య అనునవి. వీటిని ప్రత్యేక ప్రత్యేకముగా వేదమంత్రములతో సుయజ్ఞుడు చేసెను.

ఓ పార్వతి ఈ షోడశోపచారములు చేయునపుడు ఉచ్చరిపంపవలసిన మంత్రములు వేదమున చెప్పబడినవి. అవి అందరికి అన్ని సమయములందు సమ్మతమైనవి. ఆ మంత్రములివి.

సింహాసన మంత్రము -

రత్నసారవికారం చ నిర్మితం విశ్వకర్మణా | వరం సింహాసనం రమ్యం రాధే పూజాసు గృహ్యతాం || 24

ఓ రాధేదేవీ! నేను సమర్పించుచున్న ఈ ఆసనమును విశ్వకర్మ మంచి రత్నములను కూర్చి అందముగా నిర్మించెను. దీనిని పూజయందు నీవు స్వీకరింపుము.

వస్త్రమంత్రము -

అమూల్యరత్నఖచితమమూల్యం సూక్ష్మమేవ చ | వహ్నిశుద్ధం నిర్మలం చ వసనం దేవి గృహ్యతాం || 25

ఓ దేవి! ఈ వస్త్రము అమూల్యములైన రత్నములు కలది. చాలా పలుచనిది. మిక్కిలి పరిశుద్ధమైనది. ఇట్టి వస్త్రమును నీవు అంగీకరింపుము.

పాద్యమంత్రము-

సద్రత్నసారపాత్రస్థం సర్వతీర్థోదకం శుభం | పాదప్రక్షాళనార్థం చ రాధే పాద్యం చ గృహ్యతాం || 26

ఓ తల్లీ! నీయొక్క పాదములను కడుగవలయునని మంచి రత్నములచే ఖచితమైన పాత్రలో సమస్త పుణ్యతీర్ధములనుండి ఉదకమును తెచ్చితిని. నీవు ఈ పాద్యమును తీసికొమ్ము.

అర్ఘ్యమంత్రము-

దక్షిణావర్త శంఖస్థం సదూర్వాపుష్పచందనం | పూతయుక్తం తీర్థతోయై రాధేzర్ఘ్యం ప్రతిగృహ్యతాం || 27

ఓ దేవి! నీకై దక్షిణావర్త శంఖమున గఱక, పుష్పములు, చందనములతో సువాసితమై, పుణ్యతీర్థముల నీరుకావున పవిత్రమైన ఈ అర్ఘ్యమును స్వీకరింపుము.

గంధమంత్రము-

పార్థివద్ర్యవ్య సంభూతం అతీవసురభీకృతం | మంగళార్హం పవిత్రం చ రాధే గంధం గృహాణ మే || 28

భూమియందు దొరుకుచున్న సువాసన ద్రవ్యములతో మిక్కలి వాసనగలది, పవిత్రమైనది, మంగళకార్యములందు అర్హమైన గంధమును ఓ రాధాదేవి! నీవు గైకొనుము.

అనులేపమంత్రము-

శ్రీఖండచూర్ణం సుస్నిగ్ధం కస్తూరీ కుంకుమాన్వితం | సుగంధయుక్తం దేవేశి గృహ్యతామనులేపనం || 29

కస్తూరి కుంకుమలు కలది, చిక్కనిది అగు ఈ చందన చూర్ణము మంచి సువాసన కలిగియున్నది. దీనితో చేయు అనులేపనమును ఓ దేవేశి! నీవు గ్రహింపుము.

ధూపమంత్రము-

వృక్షనిర్యాససంయుక్తం పార్థివ ద్రవ్యసంయుతం | అగ్నిఖండశిఖాజాతం ధూప గృహాణ మే || 30

ఓ దేవి! ఈధూపము చెట్లనుండి వచ్చు జిగురు, భూమిపై దొరుకు సువాసన ద్రవ్యములు కలిసి నిప్పువలన వెలువడుచున్నది. దీనిని నీవు దయతో స్వీకరింపుము.

దీపమంత్రము-

అంధకారే భయహరమమూల్యమణిశోభితం | రత్నప్రదీపం శోభాఢ్యం గృహాణ పరమేశ్వరి || 31

ఓ పరమేశ్వరి! చీకటియందు కలుగు భయమును పోగొట్టునది, అమూల్యమణులచే శోభిల్లు ఈ రత్న దీపమును దయతో నీవు స్వీకరింపుము.

పుష్పమంత్రము-

పారిజాతప్రసూనం చ గంధ చందన చర్చితం | అతీవ శోభనం రమ్యం గృహ్యతాం పరమేశ్వరి || 32

ఓ పరమేశ్వరి! గంధము చందనములు కలది చాలా అందమైన ఈ పారిజాతపుష్పమును సమర్పించుచున్నాను. దీనిని నీవు ప్రతిగ్రహింపుము.

స్నానీయమంత్రము-

సుగంధామలకీచూర్ణం సుస్నిగ్ధం సుమనోహరం | విష్ణుతైల సమాయుక్తం స్నానీయం దేవిగృహ్యతాం || 33

ఓ దేవి! విష్ణుతైలము గలది, సుమనోహరమైనది అగు సువాసనగల ఊసిరిక పప్పుయొక్క పిండిని తెచ్చితిని. ఈ నలుగుపిండిని నీవు స్వీకరింపుము.

భూషణమంత్రము-

అమూల్యరత్నఖచితం కేయూరవలయాదికం | శశ్వత్సుశోభనం రాధే గృహ్యతాం భూషణం మమ || 34

ఓ దేవి! నేనొసగు ఈ కేయూరములు హస్తవలయములు (గాజులు) మొదలగు భూషణములు అమూల్యమైన రత్నములచే నిర్మితమైనవి. ఎల్లప్పుడు శోభను కలిగించు వీటిని నీవు స్వీకరింపుము.

నైవేద్యమంత్రము-

కాలదేశోద్భవం పక్వఫలం వై లడ్డుకాదికం | పరమాన్నం చ మిష్టాన్నం నైవేద్యం దేవి గృహ్యతాం || 35

ఆయా కాలములందు ఆయా ప్రదేశములలో పండు ఫలమును, లడ్డులు మొదలైనవాటిని, పరమాన్నమును, మృష్టాన్నమును నైవేద్యముగా నీవు స్వీకరింపుము.

తాంబూల మంత్రము-

తాంబూలం చ వరం రమ్యం కర్పూరాది సువాసితం | సర్వభోగాదికం స్వాదు తాంబూలం దేవిగృహ్యతాం || 36

ఓ దేవి! ఈ తాంబూలము కర్పూరాది సుగంధ ద్రవ్యములతో వాసన కలిగియున్నది. రుచిగల ఈ తాంబూలమును నీవు గ్రహింపుము.

అన్నమంత్రము-

ఆశనం రత్న పాత్రస్థం సుస్వాదు సుమనోహరం | మయానివేదితం భక్త్వా గృహ్యతాం పరమేశ్వరి || 37

ఓ దేవి! రత్నపాత్రలో మనోహరము రుచియైన అన్నమును నీకు నివేదన చేయుచున్నాను. దీనిని దయతో స్వీకరింపుము.

శయ్యామంత్రము-

రత్నేంద్రసారఖచితం వహ్నిశుద్ధాంశుకాన్వితం | పుష్పచందన చర్చాఢ్యం పర్యంకం దేవి గృహ్యతాం || 38

ఓ తల్లీ! నీవు రత్నములచే నిర్మింపబడిన మంచమును సమర్పించుచున్నాను. దీనిపై పరిశుద్ధమైన వస్త్రముకలదు. అందు పుష్పములు చందనము చల్లితిని. ఇట్టి పర్యంకికాయుక్తమైన శయ్యను నీవు పరిగ్రహింపుము.

ఏవం సంపూజ్య దేవీం తాం దద్యాత్పుష్పాంజలిత్రయం | యత్నేన పూజయేద్దేవీం నాయికాశ్చ వ్రతే వ్రతీ || 39

ప్రాగాది క్రమయోగేన దక్షిణావర్తతః ప్రియే | భక్త్యా పంచోపచారేణ సుప్రియాః పరిచారికాః || 40

మాలవతీం పూర్వకోణ వహ్నికోణ చ మాధవీం | దక్షిణ రత్నమాలాం చ సుశీలాం నైఋతే సతీం || 41

పశ్చిమే వై శశికళాం పారిజాతాం చ మారుతే | పద్మావతీముత్తరే చాథైశాన్యాం సుందరీం తథా || 42

యాధికా మాలతీ పద్మమాలా దద్యాద్యో వ్రతే వ్రతీ | పరిహారం చ కురుతే సామవేదోక్తమేవ చ || 43

పై విధముగా రాధాదేవిని షోడశోపచారములచే పూజించి ఆ దేవికి మూడుసార్లు పుష్పాంజలిని సమర్పింపవలెను. ఇట్లు రాధాదేవిని పూజించి అటుపిమ్మట దేవికి మిక్కిలి సన్నిహితులైన పరిచారికలను తూర్పుదిశనుండి కుడివైపు అన్ని దిక్కులలోనుంచి పంచోపచారపూజ సల్పవలయును.

తూర్పుదిక్కున మాలావతిని, ఆగ్నేయ దిశయందు మాధవిని, దక్షిణదిశయందు రత్నమాలను, నైఋతిదిక్కున సుశీలను, పడమర దిక్కున శశికళను వాయవ్యమున పారిజాతను ఉత్తరమున పద్మావతిని, ఈశాన్య దిశయందు సుందరిని నిలిపి మల్లెలు, మాలతీపుష్పములు, పద్మముల మాలలను వారికి సమర్పించుకొని సామవేదమున కనిపించు పరిహారమును ఈ విధముగా కోరుకొనవలెను.

త్వం దేవీ జగతాం మాతా విష్ణుమాయా సనాతనీ | కృష్ణప్రాణాధిదేవీ చ కృష్ణప్రాణాధికా శుభా || 44

కృష్ణప్రేమమయాశక్తిః కృష్ణే సౌభాగ్యరూపిణీ | కృష్ణభక్తిప్రదే రాధే నమస్తే మంగళప్రదే || 45

అద్య మే సఫలం జన్మ జీవనం సార్థకం మమ | పూజితాసి మయా సా చ యా శ్రీకృష్ణేన పూజితా || 46

కృష్ణవక్షసి యా రాధా సర్వసౌభాగ్య సంయుతా | రాసే రాసేశ్వరీ రూపా బృందాబృందావనే వనే || 47

కృష్ణప్రియా చ గోలోకే తులసీ కాననే తు యా | చంపావతీ కృష్ణసంగే క్రీడా చంపక కాననే || 48

చంద్రావళీ చంద్రవనే శతశృంగే సతీతి చ | విరజాదర్పహంత్రీ చ విరజాతటకాననే || 49

పద్మావతీ పద్మవనే కృష్ణా కృష్ణ సరోవరే | భద్రా కుంజకుటీరేచ కామ్యావై కామ్యకే వనే || 50

వైకుంఠే చ మహాలక్ష్మీర్వాణీ నారాయణోరసి | క్షీరోదే సింధుకన్యా చ మర్త్యే లక్ష్మీః హరిప్రియా || 51

సర్వస్వర్గే స్వర్గలక్ష్మీర్దేవదుఃఖ వినాశినీ | సనాతనీ విష్ణమాయా దుర్గా శంకరవక్షసి || 52

సావిత్రీ వేదమాతా చ కళయా బ్రహ్మవక్షసి | కళయా ధర్మపత్నీ త్వం నరనారాయణ ప్రభోః || 53

కళయా తులసీ త్వం చ గంగా భువన పావనీ | లోకకూపోద్భవా గోప్యః కలాంశా రోహిణీ రతిః || 54

కళాకళాంశ రూపాచ శతరూపా శచీ దితిః | అదితిర్దేవ మాతా చ త్వత్కలాంశా హరిప్రియా || 55

దేవ్యశ్చ మునిపత్న్యశ్చ త్వత్కళాకళయా శుభే | కృష్ణభక్తిం కృష్ణదాస్యం దేహి మే కృష్ణపూజితే || 56

ఏవం కృత్వా పరీహారం స్తుత్వా చ కవచం పఠేత్‌ | పురాకృతం స్తోత్రమేతద్భక్తి దాస్యప్రదం శుభం || 57

ఓ తల్లీ! నీవు జగన్మాతవు, విష్ణుమాయవు. సనాతనివి, శ్రీకృష్ణునకు ప్రాణాధికురాలవు, కృష్ణప్రేమ స్వరూపిణివి, శక్తివి, కృష్ణసౌభాగ్య రూపిణివి. మంగళప్రదురాలవు. శ్రీకృష్ణభక్తిని కలిగించు నీకు నమస్కారము.

శ్రీకృష్ణపరమాత్మ పూజించిన నిన్ను నేను పూజించుట నా అదృష్టమువలన జరిగినది. దీనివలన నా జన్మకు సార్థక్యమేర్పడినది, నాజన్మ సఫలమైనది.

సమస్త సౌభాగ్యములు కల నీవు శ్రీకృష్ణుని సమీపమున రాధగాను, రాసమండలమున రాసేశ్వరిగాను, బృందావనమున బృందాదేవిగాను, గోలోకమున కృష్ణప్రియగాను, తులసీవనమున తులసిగాను, శ్రీకృష్ణుని సమీపమున చంపావతిగాను, చంపకావనమున క్రీడగాను, చంద్రవనమున చంద్రావళిగాను, శతశృంగపర్వతమున సతిగాను, విరజానదియొక్క తీరముననున్న వనమున విరజాదేవిగాను, పద్మవనమున పద్మావతిగాను, కృష్ణ సరోవరమున కృష్ణగా, కుంజకుటీరమున భద్రగా, కామ్యకవనమున కామ్యగా, వైకుంఠమున మహాలక్ష్మిగా, నారాయణుని సమీపమున సరస్వతిగా, గంగగా పాలసముద్రమున సింధుకన్యగా, భూలోకమున శ్రీహరి ప్రియురాలగు లక్ష్మీదేవిగా, స్వర్గమున దేవతల దుఃఖములను బాపు స్వర్గలక్ష్మిగా, శంకరుని సమీపమున సనాతని విష్ణమాయయగు దుర్గగా, బ్రహ్మదేవుని సమీపమున నీ అంశరూపము వేదమాతయగు సావిత్రిగా, అట్లే ధర్ముని సమీపమున అంశరూపిణివైన ధర్మపత్నిగా, నరనారాయణులకు మాతగా, నీ కళ##యైన తులసిగా, గంగగా, పరమాత్మయొక్క రోమకూపములనుండి జన్మించిన గోపికలుగా, నీ అంశాంశాలైన శతరూప, దితి, శచి, అదితి, మొదలగు రూపములతో నున్నావు. దేవతాస్త్రీలు, మునిపత్నులు నీ అంశాంశ స్వరూపాలే.

అట్టి నీవు నాకు కృష్ణభక్తిని శ్రీకృష్ణనకు సేవచేయు పరమ సౌభాగ్యమును కలిగింపుము.

ఈ విధముగా పరిహారమును చేసికొని రాధాదేవిని స్తుతించి ఆమె కవచమును చదువవలెను.

పూర్వమున చేయబడిన ఈ రాధాస్తోత్రము శ్రీకృష్ణభక్తిని, శ్రీకృష్ణ దాస్యమును, కలిగించును.

ఏవం నిత్యం పూజయేద్యో విష్ణు తుల్యః సభారతే | జీవన్ముక్తశ్చ పూతశ్చ గోలోకం యాతి నిశ్చితం || 58

ఈ విధముగా ప్రతిదినము రాధాదేవిని పూజించువాడు విష్ణుమూర్తితో సమానుడగును. అతడు జీవన్ముక్తుడై పవిత్రుడై మరణించిన తరువాత గోలోకమునకు పోవును.

కార్తికాపూర్ణిమాయాం చ రాధాం యః పూజయేత్‌ శివే | ఏవంక్రమేణ ప్రత్యబ్దం రాజసూయ ఫలం లభేత్‌ || 59

పరమైశ్వర్యయుక్తః స్యాత్‌ ఇహలోకే స పుణ్యవాన్‌ | సర్వపాపాద్వినిర్ముక్తో యాత్యంతే విష్ణు మందిరం || 60

ఆదావేవ క్రమేణౖవ రాసే బృందావనే వనే | స్తుతా సా పూజితా రాధా శ్రీకృష్ణేన పురాసతీ || 61

సంపూజితా ద్వితీయే చ ధాత్రా త్వేవం క్రమేణ చ | త్వద్వరేణ చ సంప్రాప్య విధాతా వేదమాతరం || 62

నారాయణో మహాలక్ష్మీం ప్రాప సంపూజ్య భారతీం | గంగాం చ తులసీం చైవ పరాం భువన పావనీం || 63

విష్ణుః క్షీరోదశాయీ చ ప్రాప సింధుసుతాం తథా | మృతాయాం దక్షకన్యాయాం మయా కృష్ణాజ్ఞయా పురా || 64

త్వమేవ దుర్గా సంప్రాప్తా పూజితా పుష్కరే చ సా | అదితిం కశ్యపః ప్రాప చంద్రః సంప్రాప రోహిణీం || 65

కామో రతిం చ సంప్రాస ధర్మో మూర్తిం పతివ్రతాం | దేవాశ్చ మునయశ్చైవ యాం సంపూజ్య ప్రతివ్రతాం || 66

సంప్రాపుర్యద్వరేణౖవ ధర్మకామార్థమోక్షకం | ఏవం పూజావిధానం చ కథితం చ స్తవం శ్రుణు || 67

కార్తిక మాసమున పూర్ణిమనాడు రాధాదేవిని పూజింపవలెను. ఈ విధముగా ప్రతిసంవత్సరము ఆ దేవిని పూజించినచో రాజసూయయాగ ఫలము కలుగును. ఈ లోకమున అంతులేని సంపదను పొంది పుణ్యవంతుడై పాపములు పోగా విష్ణుమూర్తి సమీపమునకు పోవును.

ఆ రాధాదేవిని ఈ విధముగా కార్తీక పూర్ణిమనాడు బృందావనమున శ్రీకృష్ణుడు పూజించెను. అటుపిమ్మట బ్రహ్మదేవుడు ఈ దేవిని శ్రీకృష్ణదేవుడు పూజించినట్లే పూజించి ఆ దేవియొక్క అనుగ్రహమువలన వేదములకు తల్లియైన సావిత్రీదేవిని భార్యగా పొందెను. అటుపిమ్మట నారాయణుడా మాతను పూజించి ఆమెయొక్క అనుగ్రహమువలన మహాలక్ష్మిని, సరస్వతీదేవిని, గంగాదేవిని, తులసీదేవిని భార్యలుగా పొందగలిగెను.

క్షీరసముద్రమున పవళించియున్న శ్రీమహావిష్ణువు సింధుసుతను భార్యగా పొందగా నేను శ్రీకృష్ణునియొక్క ఆజ్ఞవలన ఆ మహాదేవిని పూజించి దక్షయజ్ఞమున దక్షుని కూతురైన సతీదేవి మృతిచెందిన తరువాత నిన్ను భార్యగా పొందితిని. అట్లే కశ్యపముని అదితిని, చంద్రుడు రోహిణిని, మన్మథుడు రతిని, ధర్ముడు మూర్తీదేవిని, దేవతలు మునులు కూడ ఆ దేవిని పూజించి ధర్మార్థకామమోక్షములను పొందగలిగిరి.

ఓ భవానీ! రాధాదేవి పూజావిధానమిట్లుండును.

ఏకదా మానినీ రాధా బభూవాగోచరా ప్రభోః | సంసక్తస్య తులస్యాం చ గోప్యాం చ తులసీ వనే || 68

సా సంహృత్య స్వమూర్తీశ్చ కళాః సర్వాశ్చ లీలయా | సర్వే బభూపుర్దేవాశ్చ బ్రహ్మవిష్ణుశివాదయః || 69

భ్రష్టైశ్వర్యాశ్చ నిశ్శ్రీకా భార్యాహీనా హ్యుపద్రుతాః | తే చ సర్వే సమాలోచ్య శ్రీకృష్ణం శరణం యయుః || 70

తేషాం స్తోత్రేణ సంతుష్టః స్నాత్వా సంపూజ్య తాం శుచిః | తుష్టావ పరమాత్మా స సర్వేషాం రాధికాం సతీం || 71

శ్రీకృష్ణుడు తులసీవనములో తులసియును గోపికతో తిరుగుచుండగా రాధాదేవి చూచి అభిమానవతిగావున, తాను తన యొక్క అంశలు అంశాశలగు దేవతా స్త్రీలందరితో కలిసి మాయమయ్యెను. అందువలన బ్రహ్మవిష్ణు శివాది దేవతలు తమతమ ఐశ్వర్యములను, కోల్పోయి భార్యావిహీనులైరి. అందువలన వారందరు కలిసి ఆలోచించి శ్రీకృష్ణ పరమాత్మను శరణవేడుకొనిరి. దేవతలందరు తన్ను స్తోత్రము చేయగా సంతోషపడిన శ్రీకృష్ణపరమాత్మ వారి బాధలు పోగొట్టుటకై తాను స్నానముచేసి శుచియై రాధాదేవిని పూజించి ఆమెతో ఇట్లనెను.

శ్రీకృష్ణ ఉవాచ - శ్రీకృష్ణపరమాత్మ ఇట్లనెను-

ఏవమేవ ప్రియోzహం తే ప్రమోదశ్చైవ తే మయి | సువ్యక్తమద్య కాపట్యవచనం తే వరాననే || 72

హే కృష్ణ త్వం మమ ప్రాణా జీవాత్మేతి చ సంతతం | యద్బ్రూహి నిత్యం ప్రేవ్ణూ త్వం సాంప్రతం తద్గతం ద్రుతం|| 73

తస్మాత్సర్వమలీకం తే వచనం జగదింబికే | క్షురధారం చ హృదయం స్త్రీజాతీనాం చ సర్వతః || 74

అస్మాకం వచనం సత్యం యద్బ్రవీమి చ తత్‌ధ్రువం | పంచప్రాణాధిదేవీ త్వం రాధాప్రాణాధికేతి మే || 75

శక్తో న రక్షితుం త్వాం చ యాంతి ప్రాణాస్త్వయా వినా | వినాధిష్ఠాతృ దేవీం చ కోవా కుత్ర చ జీవతి || 76

మహావిష్ణోశ్చ మాతా త్వం మూలప్రకృతిరీశ్వరీ | సగుణా త్వం చ కళయా నిర్గుణా స్వయమేవతు || 77

జ్యోతీ రూపా నిరాకారా భక్తానుగ్రహ విగ్రహా | భక్తానాం రుచివైచిత్ర్యాన్నానామూర్తీశ్చ బిభ్రతీ || 78

మహాలక్ష్మీశ్చ వైకుంఠే భారతీచ సంతాంప్రసూః పుణయక్షేత్రే భారతే చ సతీ త్వం పార్వతీ తథా || 79

తులసీ పుణ్యరూపా చ గంగా భువన పావనీ | బ్రహ్మలోకే చ సావిత్రీ కళయా త్వం వసుంధరా || 80

గోలోకే రాధికా త్వం చ సర్వగోపాలకేశ్వరీ | త్వయావినాzహం నిర్జీవో హ్యశక్తః సర్వకర్మసు || 81

శివః శక్తస్త్వయా శక్త్యా శవాకారస్త్వయా వినా | వేదకర్తా స్వయంబ్రహ్మా వేదమాత్రా త్వయా సహ || 82

నారాయణస్త్వయా లక్ష్మ్యా జగత్పాతా జగత్పతిః | ఫలం దదాతి యజ్ఞశ్చ త్వయా దక్షిణయా సహ || 83

బిభర్తి సృష్టిం శేషశ్చ త్వాం కృత్వా మస్తకే భువం | బిభర్తి గంగారూపాం త్వాం మూర్ద్ని గంగాధరః శివః || 84

శక్తిమచ్చ జగత్సర్వం శవరూపం త్వయా వినా | వక్తా సర్వస్త్వయా వాణ్యా సూతో మూకస్త్వయా వినా || 85

'నేను నీకు చాలా ఇష్టమైనవాడను. నీకు నాపై చాలా ప్రేమకలదు'. అని నీవెప్పుడు నాతో అనుచుంటివి. ప్రస్తుతము నీవు చేసిన పనివలన నీ మాటలు కల్లలని నాకు తోచుచున్నవి. అట్లే 'ఓ కృష్ణుడా! నీవు నా ప్రాణములవంటివాడవు. జీవాత్మవు' అని ఎల్లప్పుడు చెప్పుచుంటివి. అవన్ని అబద్ధములుగా కన్పించుచున్నవి. ఓ రాధాదేవి! స్త్రీల మనస్సు కత్తి అంచువలె ఇతరులను బాధపెట్టునను నా మాట ఎల్లప్పుడు సత్యమైనదే.

నీవు మూలప్రకృతి స్వరూపిణివి, ఈశ్వరివి, శ్రీమహావిష్ణువునకు తల్లివి. నీవు స్వయముగా నిర్గుణురాలవైనను నీ అంశస్వరూపముచే సగుణవుగా కన్పించుచున్నావు. నీవు జ్యోతిస్స్వరూపముననున్నావు. నిరాకారవైనను భక్తులనెల్లప్పుడు అనుగ్రహించుటకు ఆకారమును ధరించితివి. నీవు భక్తుల అభిరుచులనుబట్టి అనేక రూపములను ధరించితివి.

నీవు వైకుంఠమున మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా కన్పించుచున్నావు. పుణ్యభూమియగు భారతక్షేత్రమున నీవు సతీదేవిగా పార్వతీదేవిగా పుణ్యమూర్తియైన తులసిగా, సమస్తలోకములను పవిత్రముచేయు గంగగా మారితివి. నీవు బ్రహ్మలోకమున సావిత్రిగాను, నీ అంశరూపముతో భూమిగాను, గోలోకమున సమస్త గోపాలురకు ఈశ్వరివగు రాధగానున్నావు.

నీవు లేనిచో నేను ప్రాణములు లేనివాడను. ఏపనిచేయుటకైనను అసమర్థుడను. అట్లే శివుడు శక్తిస్వరూపిణివగు నీవలననే శక్తిమంతుడగుచున్నాడు. నీవు లేనిచో అతడు శవమువలె సర్వశక్తులను కోల్పోవును. నీవలననే బ్రహ్మదేవుడు వేదములను దర్శింపగలిగెను.

నీవలననే నారాయణుడు మహాలక్ష్మీ సమేతుడై సమస్తలోకములను రక్షించుచు జగత్పతియైనాడు. ఆదిశేషుడు నీవలన సమస్తలోకములను తన శిరస్సుపై ధరించగలుగుచున్నాడు. అట్లే శివుడు గంగను ధరించి గంగాధరుడాయెను. నీవుండినచో ప్రపంచమంతయు శక్తి కలిగియుండును. నీవు లేనిచో ఇది శవమువలె సర్వశక్తులను కోల్పోగలదు. అట్లే నీవలననే అందరు వక్తలగుచున్నారు. నీవులేనిచో అందరు మూగవారగుదురు.

యథామృదాఘటం కర్తుం కులాలః శక్తిమాన్‌ సదా | సృష్టిం స్రష్టుఃతథాzహం చ ప్రకృత్యా చ త్వయా సహ || 86

త్వయా వినా జడశ్చాహం సర్వత్ర చ న శక్తిమాన్‌ | సర్వశక్తి స్వరూపా త్వం త్వమాగచ్ఛ మమాంతికం || 87

వహ్నౌ త్వం దాహికా శక్తిః నాగ్నిశ్శక్తస్త్వయా వినా | శోభస్వరూపా చంద్రే త్వం త్వాం వినాన స సుందరః || 88

ప్రభారూపా హి సూర్యేత్యం త్వాం వినా న సభానుమాన్‌ | నకామః కామినీ బంధుస్త్వయా రత్యా వినా ప్రియే || 89

ఇత్యేవం స్తవనం కృత్యా తాం సంప్రాప జగత్ప్రభుః | దేవా బభూవుః సశ్రీకాః సభార్యా శక్తి సంయుతాః || 90

సస్త్రీకం చ జగత్సర్వం సమభూచ్ఛైల కన్యకే | గోపీ పూర్ణశ్చ గోలోకే హ్యభవత్తత్ర్పసాదతః || 91

కుమ్మరివాడు మట్టితో కుండలు చేయునట్లే ప్రకృతిరూపిణివగు నీ వలన నేను సమస్త సృష్టిని చేయగలుగుచున్నాను. నీవు లేనిచో నేను జడునివలె శక్తినంతయు కోల్పోవుదును. అందువలన సర్వశక్తి స్వరూపిణివగు నీవు నా దగ్గరకు రమ్ము. దాహికాశక్తి లేక అగ్నిదేవుడు కాల్చలేడు. ఆ దాహికాశక్తివి నీవే. అట్లే శోభాస్వరూపిణివి అగు నీవులేనిచో చంద్రుడు సుందరుడుగా కన్పించడు. కాంతిరూపిణివైన నీవులేనిచో సూర్యుడు కిరణములను కోల్పోవును. అదేవిధముగా రతీ స్వరూపిణివగు నీవు లేక మన్మథుడు కామినీ బంధువు కాజాలడు.

ఈ విధముగా శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవిని స్తుతించి ఆమెను తిరిగి పొందెను. రాధాదేవి కన్పించగానే అంతవరకు అదృశ్యముగా నున్న దేవతాస్త్రీలందరు కన్పించిరి. అందువలన దేవతలందరు శోభతో శక్తితో భార్యలతో కలిసియుండిరి. ప్రపంచమున స్త్రీలందరు దర్శనమొసగిరి. ఇట్లు గోలోకము గోపికాస్త్రీలచే నిండిపోయినది.

రాజా జగామ గోలోకమితి స్తుత్వా హరిప్రియాం | శ్రీకృష్ణేన కృతం స్తోత్రం రాధాయా యః పఠేన్నరః || 92

కృష్ణభక్తిం చ తద్దాస్యం సంప్రాప్నోతి న సంశయః | స్త్రీ విచ్ఛేదే యః శ్రుణోతి మాసమేకమిదం శుచిః || 93

అచిరాల్లభ##తే భార్యాం సుశీలాం సుందరీం సతీం | భార్యాహీనో భాగ్యహీనో వర్షమేకం శ్రుణోతి యః || 94

అచిరాల్లభ##తే భార్యాం సుశీలాం సుందరీం సతీం | పురా మయా చ త్వం ప్రాప్తా స్తోత్రేణానేన పార్వతి || 95

మృతాయాం దక్షకన్యాయామాజ్ఞయా పరమాత్మనః | స్తోత్రేణానేన సంప్రాప్తా సావిత్రీ బ్రహ్మణా పురా || 96

పురా దుర్వాససః శాపాత్‌ నిఃశ్రీకే దేవతాగణ | స్తోత్రణానేన దేవైసై#్తః సంప్రాప్తా శ్రీః సుదుర్లభా || 97

శ్రుణోతి వర్షమేకం చ పుత్రార్థీ లభ##తే సుతం | మహావ్యాధీ రోగముక్తో భ##వేత్‌ స్తోత్ర ప్రసాదతః|| 98

కార్తికీ పూర్ణిమాయాం తు తాం సంపూజ్య పఠేత్తుయః | అచలాం శ్రియమాప్నోతి రాజసూయఫలం లభేత్‌ || 99

నారీశ్రుణోతి చేత్‌ స్తోత్రం స్వామి సౌభాగ్య సంయుతా | భక్త్యా శ్రుణోతి యః స్తోత్రం బంధనాన్ముచ్యతే ధ్రువం || 100

నిత్యం పఠతి యో భక్త్యా రాధాం సంపూజ్య భక్తితః | స ప్రయాతి చ గోలోకం నిర్ముక్తో భవబంధనాత్‌ || 101

రాజైన సుయజ్ఞుడు రాధాదేవిని ఈ విధముగా స్తుతించి గోలోకమునకు పోయెను.

శ్రీకృష్ణుడు స్తుతించిన ఈ రాధాస్తోత్రమును ఎవరు పఠింతురో అతనికి తప్పక శ్రీకృష్ణభక్తి శ్రీకృష్ణ దాస్యము లభింపగలదు. భార్య వియోగ సమయమున ఈ స్తోత్రమును ఒక నెలవరకు వినినచో (చదివినచో) అట్లే భార్యా రహితుడు, భాగ్యములేనివాడు దీనిని సంవత్సరమువరకు విన్నచో (చదివినచో) త్వరగా భార్యను పొందును. నేనుకూడ దక్షయజ్ఞమున సతీస్వరూపిణివగు నీవు చనిపోయినపుడు శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞవలన ఈ స్తోత్రము పఠించి నిన్ను పొందితిని. అదే విధముగా దుర్వాస మహర్షి శాపము వలన దేవతలు లక్ష్మిని కోల్పోవగా ఈ స్తోత్రమువలన తిరిగి శ్రీని పొందిరి. పుత్రులు కావలెనని అనుకొనువాడు, మహారోగముతో బాధపడువాడు ఈ స్తోత్రమును సంవత్సరము వరకు నియమముతో విన్నచో సంతానమును పొందును. మహావ్యాధి నిర్ముక్తుడు కూడ అగును.

కార్తికమాసమున పూర్ణిమనాడు రాధాదేవిని పూజించి ఈ స్తోత్రమును చదివినచో అంతులేని సంపదను, రాజసూయ యాగమువలన లభించు ఫలితము లభించును.

స్త్రీలు ఈ స్తోత్రమును విన్నచో భర్తవలన సకల సౌఖ్యములు పొందుదురు. సంసారభంధమునుండి విముక్తులగుదురు.

ఈ స్తోత్రమును విన్నచో భర్తవలన సకల సౌఖ్యములు పొందుదురు. సంసారబంధమునుండి విముక్తులగుదురు.

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదాంతర్గత హరగౌరీ సంవాదే

శ్రీరాధికోపాఖ్యానే రాధాపూజాస్తోత్రాది కథనం నామ సంచ పంచాశత్తమోధ్యాయః ||

శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున కనిపించు గౌరీ శంకరుల సంవాదమున చెప్పబడిన రాధాదేవి పూజ స్తోత్రాదులుగల

యాభైయైదవ అధ్యాయము సమాప్తము.

sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1    Chapters