sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
అష్టంచాశత్తమో
నారద ఉవాచ- నారదమహర్షి ఇట్లు నారాయణునితో పలికెను-
కస్యవంశోద్భవో రాజా సురథో ధర్మిణాం వరః | కథం సంప్రాస వై జ్ఞానం మేధసో జ్ఞానినాం వరాత్ || 1
కస్య వంశోద్భవో బ్రహ్మన్ మేధసో మునిసత్తమ | బభూవ కుత్ర సంవాదో నృపస్య మునినా సహ || 2
సఖ్యం బభూవ కుత్రాస్య వా ప్రభో నృపవైశ్యయోః | వ్యాసేన శ్రోతుమిచ్ఛామి వద వేదవిదాం వర || 3
నారాయణమహర్షీ! సురథుడను రాజు ఏ వంశములో పుట్టెను. జ్ఞానవంతులలో శ్రేష్టుడగు మేధోముని సుర
థునకు ఏ విధముగా గురువయ్యెను? మేథోముని, మహారాజు ఇద్దరి మధ్య కలయిక ఎట్లేర్పడినది? అట్లే వైశ్యునకు మహారాజునకు స్నేహమెట్లేర్పడినది అను విషయములను నాకు తెల్పుమని అడిగెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
అత్రిశ్చ బ్రహ్మణః పుత్రః తస్య పుత్రో నిశాకరః | స చ కృత్వా రాజసూయం ద్విజరాజో బభూవ హ || 4
గురుపత్న్యాం చ తారాయాం తస్యాభూచ్చ బుధః సుతః | బుధపుత్రస్తు చైత్రశ్చ తత్పుత్రః సురథః స్మృతః || 5
బ్రహ్మదేవుని పుత్రుడు అత్రిమహర్షి. అతని పుత్రడు చంద్రుడు, అతడు రాజసూయ యాగముచేసినందువలన ద్విజశ్రేష్ఠుడయ్యెను. ఆ చంద్రునకు గురువైన బృహస్పతి భార్యయగు తారకు పుట్టినవాడు బుధుడు. బుధుని పుత్రుడు చైత్రుడు. చైత్రుని కుమారుడు సురథుడనను మహారాజు.
నారద ఉవాచ- నారదుడిట్లనెను-
గురుపత్న్యాం చ తారాయాం సమభూత్తత్సుతః కథం | అహోవ్యతిక్రమం బ్రూహి వేదస్య చ మహామునే || 6
ఆచార్యా! గురుపత్నియగు తారకు చంద్రునకు పుత్రుడెట్లు కలిగెను. ఇది విపరీతముగానున్నది. అందువలన దీనిని వివరించి చెప్పుమని అడిగెను.
నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను-
సంపన్మత్తో మహాకామీ వ్యచరజ్జాహ్నవీ తటే | తారాం సురగురోః పత్నీం ధర్మిష్ఠాం చ పతివ్రతాం || 7
సుస్నాతాం సుందరీం రమ్యాం పీనోన్నత పయోధరాం | సుశ్రోణీం సునితంబాఢ్యాం మధ్యక్షీణాం మనోహరాం || 8
సుదతీం కోమలాంగీం నవ¸°వన సంయుతాం | సూక్ష్మవస్త్రపరీధానాం రత్నభూషణ భూషితాం || 9
కస్తూరీ బిందునా సార్థమధశ్చందన బిందునా | సిందూరబిందునా చారుఫాలమధ్యస్థలోజ్వలాం || 10
వాయునాzధోవస్త్రహీనాం సకామాం రక్త లోచనాం | శరత్పార్వణచంద్రాస్యాం పక్వబింబాధరాం వరాం || 11
సస్మితాం నమ్రవక్త్రాం చ లజ్జయా చంద్రదర్శనాత్ | గచ్ఛంతీం స్వగృహం హర్షాత్ మత్తవారణగామినీం || 12
తాం దృష్ట్యా మన్మథాకాంత్రశ్చంద్రో లజ్జాం జహౌమునే | పులకాంకిత సర్వాంగః సకామస్తామువాచ సః || 13
చంద్రుడు అధిక ధనమువలన మదించి కాముకుడై గంగానదీ తీరమున తిరుగుచుండెను. అప్పుడు దేవగురువగు బృహస్పతి భార్యయైన తారాదేవి అచ్చటనుండెను. ఆమె ధర్మనిష్ఠ కలది. పతివ్రత, కాని ఆ సమయమున ఆమె నదిలో చక్కగా స్నానము చేసివచ్చుచుండెను. ఆమె మంచి అందముగలది. పీనోన్నత స్తని, చక్కని నడుము, నితంబములు కలది. మంచి ¸°వనమున నున్నది. ఆమె ధరించిన వస్త్రములు చాలా పలుచగానుండెను. రత్నభూషణములతో, ముఖము కస్తూరిచుక్క దానికింద చందన బిందువులు, సిందూరబిందువులతో చాలా ఉజ్వలముగానున్నది. గాలివలన ఆమె ధరించిన వస్త్రము కొద్దిగా పైకి లేచినది. ఆమె కన్నులలో కామము కన్పించుచుండెను. ఆమె ముఖము శరత్కాల పూర్ణిమనాటి చంద్రబింబమువలెనుడెను. పెదవులు దొండపడువలె ఎఱ్ఱగానుండెను. ఆమె సుందరుడైన చంద్రునిచూచి సిగ్గుతో తలవంచుకొని చిరునవ్వు నవ్వుచుండెను. మదించిన ఏనుగువంటి గమనముతో తన ఇంటికి పోవుచున్న తారను చూచి చంద్రుడు మన్మథబాధకు గురియయ్యెను. అందువలన శరీరము పులకించిపోగా, సిగ్గును వదలి కామముతో కూడుకున్నవాడై తారతో ఇట్లనెను.
చంద్ర ఉవాచ - చంద్రుడిట్లనెను-
యోపిచ్ఛ్రేష్ఠే క్షణం తిష్ఠ వరిష్ఠే రసికాసు చ | సువిదగ్ధే విదగ్ధానాం మనోహరసి సంతతం || 14
నిషేవ్య ప్రకృతిం జన్మసహస్రం కామసాగరే | తపః ఫలేన త్వాం ప్రాప బృహచ్ఛ్రోణీం బృహస్పతిః || 15
అహో తపస్వినా సార్థమవిదగ్ధేన వేదసా | యోజితా త్వం రసవతీ శశ్వత్కామాతురావరా || 16
కిం వా సుఖం నా విజ్ఞాతమవిజ్ఞేషు సమాగమే | విడగ్ఢాయ విదగ్ధేన సంగమః సుఖసాగరః || 17
కామేన కామినీ త్వం చ దగ్ధాసి వ్యర్థమీశ్వరి | కర్మణావాత్మదోషాద్వా కో జానాతి మనః స్త్రియాః || 18
దినేదినవృధాయాతి దుర్లభ నవ¸°వనం | నవీన ¸°వనస్థా యా వృద్దేన స్వామినా తప|| 19
శశ్వత్తపస్యా యుక్తశ్చ కృష్ణమాత్మాన మీప్సితం | స్వప్నే జాగరణ వాzపి ధ్యాయన్నేస్తే బృహస్పతిః || 20
సర్వకామరసజ్ఞా త్వం నిష్కామం కామమీప్సితం | ధ్యాయంతీ కాముకీ శ్శ్వద్యూనాం శృంగారమాత్మని || 21
అన్యశ్చ త్వన్మనః కామో భిన్నం త్వద్భర్తు రీప్సితం | యయోశ్చ భిన్నౌ విషయా ప్రీతిః సంగమే తయోః || 22
వాసంతీ పుష్పతల్పే చ గంధచందన చర్చితే | మోదస్వమాం గృహీత్వా త్వం వసంతే మాధవీవనే || 23
సుగంధ్యుత్ఫుల్ల కుసుమే నిర్జనే చందనే వనే | భవతీయువతీ భాగ్యసతీ తత్రైవ మోదతా ం|| 24
చందనే చంపకవనే శితచంపక వాయునా | రమ్యే చంపక తల్పే చ క్రీడాం కురు మయా సహ 25
నీవు స్త్రీలలో గొప్పదానవు. రసికస్త్రీలలో గొప్పదానివి. నీవు విదగ్దురాలవు. అందువలన విదగ్ధులగు పురుషుల మనస్సును ఆకర్షించుచున్నావు. బృహస్పతి ప్రకృతిని వేలకొద్ది జన్మలనుండి పూజించి తన బహు తపః ఫలితముగా అందమైన నిన్ను భార్యగా పొందెను.
ఆ బృహస్పతి తపస్వి. కామవిషయములేమి తెలియనివాడు. నీవు రసికురాలవు. కామముపై ఆసక్తి కలదానివి. మీ ఇద్దరిని బ్రహ్మదేవుడన్యాయముగా ఒకచోట కూర్చెను. కామశాస్త్రమేమియు తెలియని వానితో కామ విషయములలో ప్రవీణవగు నీవు సంగమించిన ప్రయోజనమేమన్నది. విదగ్ధ విదగ్ధునితో కలిసి రమించిననే వారిద్దరు సుఖసాగరమున తేలియాడుదురు. కామినివగు నీవు మన్మధునివలన అనేక బాధలకు గురియగుచున్నావు. ప్రతిదినము నీయొక్క ¸°వనము వ్యర్థముగా గడచిపోవుచున్నది. నీభర్త వృద్ధుడు, నీవో నవ¸°వనవతివి. అతడెల్లప్పుడు తన ఇష్టదేవతయగు శ్రీకృష్ణుని ఆరాధించుచుండును. నీవు సమస్త కామవిషయములు తెలిసినదానవు. నీవెల్లప్పుడు యువకులు చేయు శృంగారమును మనస్సులో ఎల్లప్పుడు ధ్యానించుచుందువు.
నీ మనస్సులోనుండి కోరికయొకటి. నీ భర్త కోరికయొకటి మీ ఇద్దరి కోరికలు చాలా భిన్నమైనవి. ఇట్టి మీ ఇద్దరి సమాగమమున ప్రీతి ఏమియుండును. వసంతకాలపు పుష్పశయ్య గంధము చందనములతో సువాసితమైయున్నది. ఆ శయ్యపై మాధవీలతా నికుంజమున నాతో రమింపుము. జనులు లేని చందన వనమున సువాసనగల పుష్పములపై నీవు సుఖింపుము. చంపకవనమున చంపక పుష్పముల వాసనలు చల్లగా వచ్చుచుండగా చంపక పుష్పతల్పమున నాతో రతిక్రీడ సలుపుము.
ఇత్యుక్త్యా మదనోన్మత్తో మదనాధిక సుందరః | పపాత చరణ దేవ్యా మందోమందాకినీ తటే || 26
నిరుద్ద మార్గా చంద్రేణ శుష్క కంఠౌష్ఠ తాలుకా | అభీతోవాచ కోపేన రక్త పంకజ లోచనా || 27
మన్మథునికంటె అధిక సౌందర్యము గలవాడు, మన్మథునిచే బాధితుడైన చంద్రుడు గంగానదీ తీరమున పై విధముగా మాట్లాడుచు ఆమె కాళ్ళపై పడెను. చంద్రుడు తనను ముందుకు పోకుండ ఆపివేయగా తారాదేవి గొంతెండిపోవుచుండగా కోపముతో ఇట్లనెను.
తారోవాచ- తార ఈవిధముగా అనెను-
ధిక్ త్వాం చంద్ర తృణం మన్యే పరస్త్రీలంపటం శఠం | అత్రేరభాగ్యాత్త్వం పుత్రో వ్యర్థం తే జన్మ జీవనం || 28
అరే కృత్వా రాజసూయమాత్మానాం మన్యసే బలీ | బభూవ పుణ్యం తే వ్యర్థం విప్రస్త్రీషు చ యన్మనః || 29
యస్య చిత్తం పరస్త్రీషు సోzశుచిః సర్వకర్మసు | న కర్మ ఫలభాక్పాపీ నింద్యో విశ్వేషు సర్వతః || 30
సతీత్వం మే నాశయసి యక్ష్మగ్రస్తో భవిష్యసి | అత్యుచ్ఛ్రితో నిపతనం ప్రాప్నోతీతి శ్రుతౌ శ్రుతం || 31
దుష్టానాం దర్పహా కృష్ణో దర్పం తే నిహనిష్యతి | త్యజమాం మాతరం వత్స సత్యం తే శం భవిష్యతి || 32
ఇత్యుక్త్వా తారకా సాధ్వీ రురోద చ ముహుర్ముహుః | చకార సాక్షిణం ధర్మం సూర్యం వాయుహుతాశనం || 33
బ్రహ్మాణం పరమాత్మానమాకాశం పవనం ధరాం | దినం రాత్రిం చ సంధ్యాం చ సర్వం సురగణం మునే || 34
ఓ చంద్రుడా నిన్ను గడ్డిపరకతో సమానముగా తలచుచున్నాను. నీవు స్త్రీలంపటుడవు. నీచుడవు. అత్రి మహర్షి దురదృష్టమున నిన్ను పుత్రునిగా పొందెను. రాజసూయ యాగము చేసినందువలన బలవంతుడనైతినని నిన్ను నీవు తలచుచున్నావు. విప్రస్త్రీని కామించుటవలన నీ పుణ్యమంతయు వ్యర్ధమైపోయినది. ఇతరుల భార్యను కామించువాడు అపవిత్రుడు. ఆతడు తాను చేసిన పుణ్యకర్మలయొక్క ఫలితమును పొందజాలడు. అతనిని అందరు నిందింతురు.
నీవు నా సతీత్వమును చెడగొట్టవలెనని తలచుచున్నావు. కాని నీవు క్షయరోగముచే పీడింపబడదువు. అత్యుచ్ఛ్రయము పతన హేతువని వేదములందు కలదు. నీవు రాజసూయాది యాగములవలన సంపాదించుకొన్న పుణ్యమంతయు నశించి పాపఫలమనుభవింపగలవు. దుష్టులయొక్క గర్వమును అణచివేయు శ్రీకృష్ణుడు నీ గర్వమును కూడ అణచివేయగలడు. నేను నీకు తల్లివంటి దానిని. నీవు నాకు పుత్రునివంటివాడవు. నన్ను వదలిపెట్టినచే నీకు శుభముకలుగును.
తార ఈవిధముగా పలుకుచు ఏడ్వసాగెను. అట్లే చంద్రుని కర్మకు సాక్షులుగా ధర్మాది దేవతలను ఉంచెను.
తారకావచనం శ్రుత్వా న భీతః స చుకోప చ | కరే ధృత్వా రథే తూర్ణం స్థాపయామాస సుందరీం || 35
రథం చ చాలయామాస మనోయాయీ మనోహరం | మనోహరాం గృహీత్వా తాం సచరేమే మనోహరం || 36
విస్పందకే సురవనే చందనే పుష్పభద్రకే | పుష్కరే చ నదీతీరే పుష్పితే పుష్పకాననే || 37
సుగంధి పుష్పతల్పే చ పుష్పచందన వాయునా | నిర్జనే మలయద్రోణ్యాం స్నిగ్ధ చందన చర్చితే || 38
శైలే శైలే నదేనద్యాం శృంగారం కుర్వతోస్తయోః | గతం వర్షశతం హర్షాన్ముహూర్తమివ నారద || 39
తారాదేవి మాటలను లెక్క సేయక చంద్రుడు కోపముతో సుందరియగు తారను ఎత్తిపట్టుకొని తన రథమునందుంచుకొని మనోగమనమున రథమును నడిపించెను.
తరువాత చందనము, పుష్పములు కల దేవతావనమున సువాసనగల పుష్పతల్పముపైన ఆమెతో రమించెను. అటుపిమ్మట వారిద్దరు ప్రతి పర్వతమున ప్రతి నదీ తీరమున రమించుచుండిరి. వారికప్పుడు నూరు సంవత్సరములు ఒక ముహూర్తమువలె గడచిపోయినవి.
బభూవ శరణాపన్నో భీతో దైత్యేషు చంద్రమాః | తేజస్విన %ి తథాశుక్రే తే షాం చ బలినాం గురౌ || 40
అభయం చ దదౌ తసై#్మ కృపయాభృగునందనః | గురుం జహాస దేవానాం సువిపక్షం బృహస్పతిం || 41
సభాయాం జహసుః హృష్టాః బలినో దితినందనాః | అభయం చ దదుస్తసై#్మ భీతాయ చ కళంకినే || 42
సతీ సతీత్వ ధ్వంసేన పాపిష్ఠే చంద్రమండలే | బభూవ శశరూపం చ కళంకం నిర్మలం మలం || 43
ఉవాచ తం మహాభీతం శుక్రోవేదవిదాం వరః | హితం పథ్యం వేదయుక్తం పరిణామ సుఖావహం || 44
ఆ తరువాత చం ద్రుడు దేవతలవలన భయముచెంది దైత్యులను శరణువేడెను. అట్లే రాక్షసుల గురువగు శుక్రునికూడ శరణువేడెను. అప్పుడు భృగునందనుడగు శుక్రుడు దయతో చంద్రునకు అభయము నొసగెను. తరువాత తనకు ప్రతిపక్షియగు దేవతాగురువును సభలో చూచి శుక్రుడు పరిహసించెను. అదేవిధముగా దైత్యులాచంద్రునకు అభయమునిచ్చి బృహస్పతిని చూచి నవ్విరి.
కాని పతివ్రతయైన తారాదేవియొక్క సతీత్వమును చంద్రుడు ధ్వంసము చేసినందువలన ఆ కళంకరూపమైన పాపము చంద్రమండలమున శశరూపమైన కళంకముగా మారినది.
అప్పుడు మిక్కిలి భయపడుచున్న చంద్రుని చూచి వేదజ్ఞులలో శ్రేష్ఠుడైన శుక్రమహర్షి పరిణామకాలమున సుఖమును కలిగించునది హితవైనది అగు మాటలు పలికెను.
త్వమహో బ్రహ్మణః పౌత్రోzప్యత్రేర్భగతః సుతః | దుర్నీతం కర్మ తే పుత్ర నీచవన్నయశస్కరం || 45
రాజసూయస్య సుఫలే నిర్మలేకీర్తిమండలే | సుధారాశౌ సురాబిందు రూపమంకముపార్జితం || 46
త్యజ దేవగురోః పత్నీం ప్రసూమివ మహాసతీం | ధర్మిష్ఠస్య వరిష్ఠస్య బ్రాహ్మణానాం బృహస్పతేః || 47
శంభోః సురాణా మీశస్య గురుపుత్రస్య వేధసః | పౌత్రస్యాంగిరసో నిత్యం జ్వలితో బ్రహ్మతేజసా || 48
ఓ చంద్రా!నీవు బ్రహ్మదేవును పౌత్రుడవు. అత్రిమహర్షియొక్క పుత్రుడవు. నీవు చేసిన పని నింద్యమైనది. అది నీచుడైనవాడు చేసిన పనివలె చెడుకీర్తిని కలిగించును. నీవు రాజసూయయాగమొనర్చి దాని ఫలితముగా నిర్మలమైన కీర్తిని పొందితివి. కాని నీవు చేసిన ఈ తప్పుడు పనివలన అమృతభాండమున సురాబిందువు పడినట్లు మచ్చ ఏర్పడినది.
బృహస్పతి దేవతలందరకు గురువు. అతడు సద్ధర్మ పరాయణుడు. బ్రాహ్మణులందరిలోను శ్రేష్ఠుడు. బ్రహ్మతేజో సంపన్నుడు. అతని భార్యయగు తార మహాపతివ్రత. ఈమెను తల్లిని వలె కామింపక వదిలిపెట్టుము.
శత్రోరసి గుణావాచ్యా గురోరపి | ఇతి సద్వంశజాతానాం స్వభావం చ సతామపి || 49
స శత్రుర్మే సురగురుః పరో విశ్వే నిశాకర | తథాzపి సహజాఖ్యానం వర్ణితం ధర్మసంసది ||
యత్ర లోకాశ్చ ధర్మిష్ఠా తత్ర ధర్మః సనాతనః || 50
యతో ధర్మస్తతః కృష్ణోయతః కృష్ణస్తతో జయః | గౌరేకం పంచ చ వ్యాఘ్రీ సింహీ సప్త ప్రసూయతే || 51
హింసకాః ప్రళయం యాంతి ధర్మో రక్షతి ధార్మికం | దేవాశ్చ గురవో విప్రాః శక్తాయద్యపి రక్షితుం || 52
తథాzపి న హిరక్షంతి ధర్మఘ్నం పాపినం జనం | కులటా విప్రపత్నీనాం గమనే సురవిప్రయోః || 53
బ్రహ్మహత్యా షోడశాంశ పాతకం చ భ##వేత్ ధ్రువం | తాసా ముపస్థితానాం చ గమనే తచ్చతురర్థకం || 54
విప్రపత్నీ సతీనాం చ గమనం వై బలేన చేత్ | బ్రహ్మహత్యా శతం పాపం భ##వేదేవ శ్రుతౌ శ్రుతం || 55
ధర్మంచర మహాభాగ బ్రహ్మణీం త్యజ సాంప్రతం | కృత్వానుతాపం పాపాచ్చ నివృత్తిస్తు మహాఫలా || 56
ఉపాయేన చ తే పాపం దూరీ భూతం భ##వేన్నను | శరణాగతస్య భీతస్య మయి దేవస్య ధర్మతః || 57
శస్త్రహీనం చ భీతం చ దీనం చ శరణార్థినం | యో న రక్షత్యధర్మిష్ఠః కుంభీపాకే వసేత్ ధ్రువం || 58
రాజసూయ శతానాం చ రక్షితా లభ##తే ఫలం | పరమైశ్వర్యయుక్తశ్చ ధర్మేణ స భ##వేదిహ || 59
శత్రువైనను సత్కర్మలు చేసినచో అతని సుగుణములను కీర్తింపవలెను. అట్లే గురవైనను తప్పుడు పనులు చేసినచో అతని చెడుగుణములను చెప్పవలెననుట సద్వంశమున పుట్టిన మంచివారియొక్క స్వభావము.
ఓ చంద్రుడా! బృహస్పతి నాకు బద్ధశత్రువే అయినను ధర్మవిషయమున సహజమైన దానిని చెప్పితిని. లోకములు ధర్మమార్గమున నున్నప్పుడే సనాతనుడగు ధర్మదేవత అచ్చట ఉండును. ధర్మముండుచోట కృష్ణుడు, కృష్ణుడుండు చోట జయము కలుగును.
ఆవు ఒకే దూడను కనును. కాని వ్యాఘ్రము ఐదు పిల్లలను, సింహము ఏడు పిల్లలను కనును. కాని అవి వాటిని చంపి తినును. కావున హింసచేయువారు త్వరగా చనిపోవుదురు. ధర్మము మాత్రము ధార్మికుని రక్షించును.
దేవతలు, గురువు, బ్రహ్మణులు అందరిని రక్షింపగల్గినను, ధర్మమును చెడగొట్టు పాపిని మాత్రము వారు రక్షింపరు.
కులటలగు బ్రాహ్మణస్త్రీలను పొందినచో బ్రహ్మ హత్యా పాపమున పదునారంశగల పాపమును పొందుదురు. సమీపముననున్న బ్రాహ్మణ స్త్రీలను చెరచినచో బ్రహ్మహత్యాపాపమునకు నాలుగు రెట్లెక్కువ పాపమును పొందెదరు. వారిని బలాత్కారముగా అనుభవించినచో నూరు రెట్లెక్కువగా బ్రహ్మహత్యా పాపమును పొందుదురు.
అందువలన ఓ చంద్రుడా! ధర్మమును అనుష్ఠింపుము. బ్రాహ్మణస్త్రీని వదలిపెట్టుము. తరువాత అనుతాపమును పొంది పాపమునుండి నివృత్తుడవగుదువు. నీ పాపమును ఏదియో ఒక ఉపాయముచేత దూరము చేసికొనవచ్చును.
భయముచే శరణుజొచ్చిన వానిని తప్పక రక్షింపవలెను. శస్త్రములు లేని వానిని, భయముచెందినవారిని, దీనుడైనవానిన , శరణాగతుడైనవానిని రక్షింప ధర్మహీనుడు కుంభీపాక నరకమునకు పోవును. వీరిని రక్షించినచో నూరు రాజసూయ యాగములు చేసిన పాపము పొందును. ధర్మము నాచరించినందువలన పరమైశ్యర్య సంపన్నుడగును.
ఇత్యుక్త్వా వై దైత్యగురుః స్వర్గే మందాకినీ తటే | స్నాత్వా తం స్నాపయామాస విష్ణుపూజాం చకార సః || 60
విష్ణుపాదాబ్జజాతేన తన్నైవేద్యం శుభప్రదం | గంగోదకేన పుణ్యన భోజయామాస చంద్రకం || 61
క్రోడేకృత్వా తు తం భీతం సజ్జితం పాపకర్మణా | కుశహస్తస్త మిత్యూచే స్మారంస్మారం హరిం మునే || 62
దైత్యగురువగు శుక్రుడు చంద్రునితో నిట్లని స్వర్గముననున్న గంగానదీ తీరమున తాను స్నానముచేసి చంద్రుని స్నానము చేయించెను. తరువాత శుక్రుడు విష్ణుపూజను చేసి పుణ్యప్రదమైన గంగానదీ జలముతో చంద్రునకు భోజనము పెట్టెను. అటుపిమ్మట చంద్రుని తన తొడపైనుంచుకొని దర్భలను చేతిలోనుంచుకొని చంద్రునితో నీవు శ్రీహరిని మాటిమాటికి స్మరింపుమనెను.
శుక్ర ఉవాచ- శుక్రుడిట్లనెను-
యద్యస్తిమే తపః సత్యం సత్యం పూజాఫలం హరేః | సత్యంవ్రత ఫలం చైవ సత్యం వచః ఫలం || 63
తీర్థస్నానఫలం సత్య సత్యం దానఫలం యది | ఉపవాసఫలం సత్యం పాపాన్ముక్తో భవాన్భవేత్ || 64
విప్రం త్రి సంధ్యహీనం యా విష్ణుపూజా విహీనకం | తమాప్నోతు మహాఘోరం చంద్రపాపం సుదారుణం || 65
స్వభార్యావంచనం కృత్వా యః ప్రయాతిపరస్త్రియం | సయాతు నరకం ఘోరం చంద్రపాపేన పాతకీ || 66
వాచా వా తాడయేత్కాంతం దుః శీలా దుర్ముఖా చ యా | సాయుగం చంద్రపాపేన యాతు లాలాముఖం ధ్రువం || 67
అనైవేద్యం వృథాన్నం చ యశ్చభుంక్తే హరేర్ద్విజః | స యాతు కాలసూత్రం చ చంద్రపాపాచ్చతుర్యుగం || 68
అంబువాచ్యం భూఖననం యః కరోతి నరాధమః | చంద్రపాపాద్యుగశతం కాలసూర్త సగచ్ఛతు || 69
స్వకాంతం వంచయిత్వా చ యా యాతి పరపురుషం ష| సా యాతు వహ్నికుండం చ చంద్రపాపాచ్చతుర్యుగం || 70
కీర్తిం కరోతి రజసా పరకీర్తిం విలుప్య చ | స యుగం చంద్రపాపేన కుంభీపాకం చ గచ్ఛతు || 71
పితరం మాతరం భార్యాం యో న పుష్ణాతి పాతకీ | స్వగురుం చంద్రపాపేన యాతు చండాలతాం ధ్రువం || 72
కులటాన్నమవీరాన్నమృతుస్నాతాన్న మేవ చ | యోzశ్నాతి చంద్రపాపం చ యాతు తం పాపినం ధ్రువం || 73
సయాతు తేన పాపేన కుంభీపాకం చతుర్యుగం | తస్మాదుత్తీర్య చాండాలీం యోనిమాప్నోతి పాతకీ || 74
దివసే యో గ్రామ్యధర్మం మహాపాపీ కరోతి చ | యో గచ్ఛేత్కామతః కామీ గుర్విణీం వా రజస్వలాం || 75
తం యాతు చంద్రపాపం చ మహాఘోరం చ పాపినం | స యాతు తేన పాపేన కాలసూత్రం చతుర్యుగం || 76
నా తపః ఫలితమున్నచో, నేను పూజించు శ్రీహరియొక్క పూజాఫలమున్నచో, నాయొక్క వ్రతముల ఫలితము, నా సత్యవాక్ఫలితము, నా తీర్థస్నాన ఫలము, నేను చేసిన దానములయొక్క ఫలము నా ఉపవాసముల ఫలమున్నచో చంద్రుడు అతడు చేసిన పాపములనుండి విముక్తుడగును.
త్రికాల సంధ్యలు ఆచరింపని వానికి, విష్ణుపూజ చేయనివానికి మహాభయంకరమైన చంద్రపాపము అంటును. తన భార్యను మోసగించి ఇతరస్త్రీలతో పోవువానికి చంద్రపాపము అంటును. చెడునడక లేక కలహములు పెట్టుకొను స్త్రీ తన భర్తను బాధించినచో ఆమె చంద్రపాపము వలన తులాముఖమను నరకమును పొందును. శ్రీహరికి నివేదింపని అన్నమును పనికిరాని అన్నమును తినువాడు చంద్రపాపము వలన కాలసూత్రమను నరకమున నాలుగు యుగముల వరకుండును.
భూమిని తవ్వు పాపాత్మునకు చంద్రపాపము వలన నూరు యుగములవరకు కాలసూత్ర నరకము లభించును. తన భర్తను మోసగించి ఇతర పురుషునితో పోవు స్త్రీ చంద్రపాపమువలన వహ్నికుండమను నరకమున నాల్గు యుగములుండును. తన తలిదండ్రులను, భార్యను తనగురువును పోషింపనివాడు చంద్రపాపమువలన చండాలుడగును. కులటయగు స్త్రీ పెట్టిన అన్నమును, భర్త, సంతానములేని స్త్రీ పెట్టిన అన్నమును, ఋతుస్నాతయైన స్త్రీ పెట్టిన అన్నమును భుజించువాడు చంద్రుని పాపమువలన నాలుగు యుగములవరకు కుంభీపాక నరకముననుభవించి తరువాత చండాలుడగును, పగటివేళయందు రతిక్రీడ సలుపువాడు, గర్భవతి, రజస్వలయగు స్త్రీతో రతిని చేయువాడు చంద్రపాపము వలన నాలుగు యుగములవరకు కాలసూత్రమను నరకమున యాతనలననుభవించును.
ముఖం శ్రోణీం స్తనం చాపి యః పశ్యతి పరస్త్రియాః | కామతః కామ దగ్దశ్చ యాతు తం చంద్రకల్మషం || 77
స యాతు లాలాభక్ష్యం చ చంద్రపాపాచ్చతుర్యుగం | తస్మాదుత్తీర్యభవతు చాండాలోzధో నపుంసకః || 78
కుహూపూర్ణేందు సంక్రాంతిచతుర్దశ్యష్టమీషు చ | మాంసం మసూరం లకుచం యశ్చ భుంక్తే రవేర్దినే || 79
కురుతే గ్రామ్యధర్మం చ యాతు తం చంద్రకిల్బిషం | చతుర్యుగం కాలసూత్రం తేన పాపేన గచ్చతు || 80
తస్మాదుత్తీర్య చాండాలీం యోనిమాప్నోతి పాతకీ | సప్త జన్మసు రోగీ చ దరిద్రః కుబ్జ ఏవ చ || 81
ఏకాదశ్యాం చ యోభుంక్తే కృష్ణజన్మాష్టమీ దినే | శివరాత్రౌ మహాపాపీ యాతు తం చంద్ర పాతకం || 82
స యాతు కుంభీపాకం చ యావదింద్రాశ్చతుర్దశ | తేన పాపేన చాప్నోతు చాండాలీం యోనిమేవచ || 83
తామ్రస్ధం దుగ్దమాధ్వీకముచ్చిష్టే ఘృతమేవ చ | నారికేళోదకం కాంస్యే దుగ్దం సలవణం తథా || 84
పీతశేషజలం చైవ భుక్తశేషం తథౌదనం | అసకృచ్చౌదనం భుంక్తే సూర్యేనాస్తంగతే ద్విజః || 85
తం యాతు చంద్రపాపం చ దుర్నివారం చ దారుణం | స యాతు తేన పాపేన చాంధకూపం చతుర్యుగం || 86
స్వకన్యావిక్రయీ విప్రో దేవలో వృషవాహకః | శూద్రాణాం శవదాహీ చ తేషాం వై సూపకారకః || 87
అశ్వత్థ తరుఘాతీ చ విష్ణువైష్ణవ నిందకః | తం యాతు చంద్రపాపం చ దారుణం పాపినం ధ్రువం || 88
సయాతు తస్మాత్పాపాచ్చ తప్తసూర్మీం చ పాతకీ | శశ్వద్దగ్దో భవతు సః యావదింద్రాశ్చతుర్దశ || 89
తస్మాదుత్తీర్యచాండాలీం యోని మాప్నోతి పాతకీ | సప్త జన్మసు చండాలో వృషభః పంచజన్మసు || 90
గర్దభో జన్మ శతకం సూకరస్సప్త జన్మసు | తీర్థ ధ్వాంక్షస్సప్తమ వై విట్ర్కుమిః పంచజన్మసు | 91
పరస్త్రీయొక్క ముఖమును, స్తనములు, పిరుదులను కామ దృష్టితో చూచు కాముకుడు చంద్రపాపమువలన లాలాభక్ష్యమను నరకమున నాలుగు యుగములుండును. అటుపిమ్మట చాండాలుడగును తరువాత నపుంసకుడగును.
అమావాస్య, పూర్ణిమ, సూర్య సంక్రాంతి, చతుర్దశి, అష్టమీ, ఆదివారములందు మాంసమును, సిరిశనగపప్పును, లకుచమును తినువాడు పై దినములలో రతికార్యము సలుపువాడు చంద్ర పాపమును పొంది ఆ పాపమువలన నాలుగు యుగములవరకు కాలసూత్రమను నరకముననుభవించును. అటు పిమ్మట చండాలుడగును. ఏడు జన్మలవరకు రోగి మరియు దరిద్రుడగును.
ఏకాదశినాడు శ్రీకృష్ణాష్టమి, శివరాత్రి దినములందు భోజనము చేయు పాపాత్ముడు పదునలుగురు ఇంద్రులు గతించునంతవరకు చంద్రపాపము వలన కుంభీపాక నరకమును పొందును. తరువాత చండాలుడగును.
రాగిపాత్రలోనున్న పాలను, తేనెను, ఎంగిళ్ళలో పడిన నేతిని, కంచుపాత్రలోనున్న నారికేళ ఫలోదమును, ఉప్పుగల పాలను, తాగగా మిగిలిన జలమును, తినగా మిగిలిన అన్నమును, మాటిమాటికి అన్నమును, సాయంసంధ్యయందు భోజనమును చేయువాడు చంద్రపాపమును పొంది, దానివలన నాలుగు యుగములు అంధకూపమను నరకమున యాతనలనుభవించును.
తన కూతురును డబ్బుకాశపడి అమ్ముకొనువాడు, దేవుని పూజించి బ్రదుకు బ్రాహ్మణుడు, ఎద్దుల వాహనము కల బ్రాహ్మణుడు, శూద్రుల శవదాహము చేయువాడు, శూద్రుల ఇండ్లలో వంటలు చేసి బ్రతుకు బ్రాహ్మణుడు, రావిచెట్టును నరకు బ్రాహ్మణుడు, విష్ణుమూర్తిని విష్ణుభక్తులను నిందించు బ్రాహ్మణుడు భయంకరమైన చంద్రపాపమువలన తప్తసూర్మియను నరకమును పొంది అచ్చట మన్వంతర కాలము బాధననుభవించును. ఆ తరువాత చండాలుడై పుట్టును. అటుపిమ్మట ఐదు జన్మలవరకు వృషభ##మై జన్మించును. నూరుజన్మలవరకు గాడిదగా పుట్టును. అటుపిమ్మట ఏడు జన్మలు అడవి పందియగును. ఏడు జన్మలు కాకిగాను ఆ తరువాత ఐదు జన్మలవరకు మలములోని క్రిమిగా జన్మించును.
వృథా మాంసం చ యో భుంక్తే స్వార్థం పాకాన్నమేవ చ | తదదత్తం మహాపాపీ ప్రాప్నుయాంచ్చంద్ర పాతకం || 92
సయాతు చంద్రపాపేన చాzసిపత్రం చతుర్యుగం | తతో భవతుసర్పశ్చ పశుః స్యాత్సప్త జన్మసు || 93
విప్రోవార్ధుషికో యో హి యోనిజీవీ చికిత్సకః | హరేర్నామ్నాం చ విక్రేతా యశ్చవా స్వాంగ విక్రయీ || 94
స్వధర్మకథకశ్చైవ యశ్చ స్వాత్మ ప్రశంసకః | మషీజీవీ ధావకశ్చ కులటాపోష్య ఏవ చ || 95
తం యాతు చంద్రపాపం చ చంద్రోభవతు విజ్వరః | సయాతు తేన పాపేన శూలప్రోతం సుదారుణం || 96
తత్రవిద్దోభవతు స యావదింద్రాశ్చతుర్దశ | తతోదరిద్రో రోగీచ దీక్షాహీనో నరః పశుః || 97
లాక్షా మాంస రసానాంచ తిలానాం లవణస్య చ | అశ్వానాం చైవ లౌహానాం విక్రేతా నరఘాతకః || 98
విప్రః కులాలః చౌరశ్చ యాతు తం చంద్రపాతకం | స యాతు చంద్రపాపేన క్షురధారం సుదుస్సహం || 99
తత్ర ఛిన్నో భవతు స యావదింద్ర సహస్రకం | తస్మాదుత్తీర్య సభ##వేత్ సృగాలః సప్తజన్మసు || 100
సప్త జన్మసు మార్జారో మహిషో జన్మపంచకం | సప్తజన్మసు భల్లూకః కుక్కరస్సప్త జన్మసు || 101
మత్స్యశ్చ జన్మశతకం కర్కటీ జన్మపంచకం | గోధికా జన్మశతకం గర్దభః సప్తజన్మసు || 102
సప్తజన్మసు మండూకస్తతః స్యాన్మనవోzధమః | చర్మకారశ్చ రజకసైల కారశ్చ వర్ధకిః || 103
నావికః శవజీవీ చ వ్యాధశ్చ స్వర్ణకారకః | కుంభకారో లోహకారస్తతః క్షత్రస్తతో ద్విజః || 104
వ్యర్ధముగా మాంసమును తినువాడు తనకొరకు మాత్రమే వంటచేసికొని భుజించువాడు మాహాపాపి. అతడు చంద్రపాపమును పొంది నాలుగు యుగములు అసిపత్రమను నరకమున బాధలుపడును. నరకానంతరము ఏడుజన్మలు సర్పముగాను, ఏడు జన్మలు పశువుగా పుట్టును.
వడ్డీ వ్యాపారము చేయుచు, వ్యభిచారము నడుపుచు బ్రతుకుచున్న బ్రాహ్మణుఁడు వైద్యుడగు బ్రాహ్మణుడు, శ్రీహరి పేరును చెప్పి బ్రతుకువాడు, తన అవయవములనమ్ముకొని బ్రతుకువాడు, తన ధర్మమును గురించి మాటలు మాత్రము మాట్లాడువాడు, ఆత్మప్రశంస చేసికొనువాడు, ఇతరులకు వ్రాసిపెట్టి బ్రతుకువాడు, ధావకుడు, కులటను పోషించువాడు చంద్రపాపమును పొందును. అందువలన చంద్రునకు పాపవిముక్తి కలుగును. వీరందరు చంద్రపాపమువలన భయంకరమైన శూలప్రోతమను నరకమునకు పోవుదురు. అచ్చట మన్వంతరమునుండి తరువాత దరిద్రులై పుట్టి రోగములచే బాధపడుదురు.
లక్కను, మాంసమును, రసద్రవ్యములను, నువ్వులను, ఉప్పును, అశ్వములను, లోహములను, అమ్మువాడు, తోటి మానవుని చంపు బ్రాహ్మణుడు, కులాలుడు, చోరుడు, వీరందరకు చంద్రపాపము చుట్టుకొనును. అందువలన ఆ పాపి ఒక మన్వంతర కాలము క్షురధారమను నరకమున దుస్సహమైన యాతనలననుభవించును. ఆ తరువాత నక్కగాను, పిల్లిగాను, బఱ్ఱగాను, ఎలుగుబంటిగాను, కుక్కగా, చేపగా, ఎండ్రిగా, బల్లిగా, గాడిదగా, కప్పగా అనేక మార్లు జన్మలనెత్తి మానవుడై పుట్టును. అప్పుడు తొలుతచర్మకారుడుగా, అటుపిమ్మట, రజకుడుగా తైలకారుడుగా, వడ్డీలిచ్చువాడుగా, నావికుడుగా, శవముల మోసి బతుకువాడుగా, వ్యాధుడుగా, స్వర్ణకారుడుగా, కుంభకారుడుగా, లోహకారుడుగా, జన్మనెత్తి తరువాత క్షత్రియుడై పుట్టి చివరకు బ్రాహ్మణ జన్మపొందును.
ఇతి చంద్రం శుచిం సమువాచ తు తారకాం | త్యక్త్వా చంద్రం మహాసాధ్వి గచ్ఛకాంతమితి ద్విజః || 105
ప్రాయశ్చిత్తం వినాపూతా త్వమేవం శుద్ద మానసా | అకామా యా బలిష్ఠేన న స్త్రీ జారేణ దుష్యతి || 106
ఇత్యేవముక్త్వా శుక్రశ్ఛ చంద్రం వా తారకాం సతీం | సస్మితాం సస్మితం చైవ చకార చ శుభాశిషః || 107
చంద్రుని ఈవిధముగా పాపరహితునిగా చేసి శుక్రుడు తారతో ఇట్లనెను. పతివ్రతా! నీవు చంద్రుని వదిలిపెట్టి నీ భర్త దగ్గరకు పొమ్ము. నీవు పరిశుద్దమైన మనస్సు కలదానవు. అందువలన నీకు జారత్వము వలన కలుగు పాపామంటదు. ప్రాయశ్చిత్తము చేసికొన నప్పటికి నీవు పవిత్రురాలవే. తనకు కోరికలేక బలవంతుడైన పురుషుని వలన బలత్కారింపబడినచో ఆ స్త్రీకి జారత్వ పాపమంటదు అని శుక్రుడు వారిద్దరకు శుభాశీస్సులనొసగి పోయెను.
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే తారాచంద్రయోర్దోషనివారణం నామాష్టపంచాశత్తమోzధ్యాయః ||
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండములోని నారదనారాయణ సంవాదమున తెలుపబడిన దుర్గోపాఖ్యానములోని తారాచంద్రుల పాపనివారణమను
యాభైఎనిమిదవ అధ్యాయము సమాప్తము.