sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ఏకోనషష్టితమోzధ్యాయః - బృహస్పతి కైలాసము చేరుట నారద ఉవాచ- నారదుడిట్లనెను- బృహస్పతిః కిం చకార తారకాహరణాంతరే | కథం సంప్రాప తాం సాధ్వీం తన్మే వ్యాఖ్యాతు మర్హసి ||
1 తారాదేవిని చంద్రుడు ఎత్తుకొని పోయిన తరువాత ఆమె భర్తయగు బృహస్పతి ఏమి చేసెను? తిరిగి ఆమెనెట్లు స్వీకరించెను. అను విషయములను నాకు వివరించి చెప్పుడు. శ్రీ నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను- దృష్ట్వావిలంబం తారాయాః స్నాంత్యాశ్చాపి గురుః స్వయం | ప్రస్థాపయామాస శిష్యమన్వేషార్థం చ జాహ్నవీం || 2 శిష్యోగత్వా చ తద్వృత్తం జ్ఞాత్వా వై లోకవక్త్రతః | రుదన్నువాచ స్వగురుం తారకాహరణం మునే || 3 శ్రుత్వా సురుగుర్వార్తాం శశినా చ ప్రియాం హృతాం | ముహూర్తం ప్రాప మూర్ఛాంచ తతః సంప్రాప్య చేతనాం || 4 రురోదోచ్చైః సశిష్యశ్చ హృదయేన విదూయతా | శోకేన లజ్జాయాzవిష్టో విలలాపముహుర్ముహుః || 5 ఉవాచ శిష్యాన్ సంబోధ్య నీతిం చ శ్రుతి సమ్మతాం | సాశ్రునేత్రః సాశ్రునేత్రాన్ శోకార్తః శోకకర్శితాన్ || 6 తార స్నానమునకైపోయి ఆలస్యము చేసినదును విషయమును తెలుసుకొని ఆమెను వెదుకుటకై తన శిష్యుని గంగానదికి పంపెను. ఆ శిష్యుడుచ్చటకు పోయి ఆ ప్రాంతముననున్న జనులవలన చంద్రుడామెను ఎత్తుకొని పోయిన వృత్తాంతమును తెలిసికొని ఏడ్చుడు ఆ విషయమును గురువున కెరిగించెను. తన భార్యను చంద్రుడెత్తుకొని పోయెనను వార్తను విని బృహస్పతి కొంతసేపు మూర్చపోయి తరువాత లేచి దుఃఖము, సిగ్గు ఆవరించుకొనగా శిష్యసహితముగా ఏడ్చేను. తరువాత తాను తాను దుఃఖించుచు, దుఃఖించుచున్న తన శిష్యులతో ఇట్లు పలికెను. బృహస్పతిరువాచ- బృహస్పతి ఇట్లనెను- హేవత్సాః కేన శప్తోzహం న జానే కారణం పరం | దుఃఖం దర్మవిరుద్దో యః స ప్రాప్నోతి న సంశయః || 7 యస్య నాస్తి సతీ భార్యా గృహేషు ప్రియవాదినీ | అరణ్యం తేన గంతవ్యం యథాzరణ్యం తథా గృహం || 8 భావానురక్తా వనితా హృతా యస్య చ శత్రుణా | అరణ్యం తేనగంతవ్య యథారణ్యం తథా గృహం || 9 సుశీలా సుందరీ భార్యా గతా యస్య గృహాదహో | అరణ్యం తేన గంతవ్యం యథాzరణ్యం తథాగృహం || 10 దేవేనాపహృతా యస్య పతిసాధ్యా పతివ్రతా | అరణ్యం తేన గంతవ్యం యథాzరణ్యం తథాగృహం || 11 యస్యమాతా గృహేనాస్తి గృహిణీ వా సుశాసితా | అరణ్యం తేన గంతవ్యం యథాzరణ్యం తథాగృహం || 12 ప్రియాహీనం గృహం యస్య పూర్ణం ద్రవిణబందుభిః | అరణ్యం తేన గంతవ్యం యథారణ్యం తథాగృహం || 13 భార్యాశున్యావనసమా సభార్యాశ్చ గృహా గృహాః | గృహిణీ చ గృహం ప్రోక్తం న గృహం గృహముచ్యతే || 14 అశుచిః స్త్రీ విహానశ్చ దైవేప్రిత్య్రే చ కర్మణి | యదహ్నా కురతే కర్మ న తస్య ఫలభాగ్భవేత్ || 15 దాహికా శక్తి హీనశ్చ యథామందో హుతాశనః | ప్రబాహీనోయథాసూర్యః శోభాహీనోయథా శశీ || 16 శక్తిహీనో యథా జీవో యథా చాత్మాతనుం వినా | వినాzధారం యథాzధేయః యథేశః ప్రకృతిం వినా || 17 న చ శక్తో యథాయజ్ఞః ఫలదోదక్షిణాం వినా | కర్మణాం చ ఫలం దాతుం సామగ్రీ మూలమేవ చ || 18 వినాస్వర్ణం స్వర్ణకారో యథాశక్తః స్వకర్మణి | యథాశక్తః కులాలశ్చ మృత్తికాం చ వినాద్విజాః || 19 తథా గృహీ న శక్తశ్చ సతతం సర్వకర్మణి | గృహాధిష్ఠాతృ దేవీం చ స్వశక్తిం గృహిణీం వినా || 20 ఓ వత్సలారా! నన్నెవరు శపించిరి ? దీనికి గల కారణము నాకు తెలియదు. ధర్మమునకు వ్యతిరేకముగా ప్రవర్తించువాడు మాత్రమే దుఃఖమును పొందును. మరి నేను ఎటువంటి ధర్మవిరుద్ధమైన పనులు చేసితిని. ఇంటిలో ప్రియముగా మాట్లాడు భార్యలేనిచో, తన మనసెరిగి ప్రవర్తించు స్త్రీని శత్రువు లెత్తుకొని పోయినచో, సుశీల సుందరియగు భార్య ఇల్లు వదలి పోయినచో, పతివ్రతయగు స్త్రీ దురదృష్టము వలన పోయినచో, ఆ ఇల్లు అడవివంటిది అగును. అట్లే ఎవని ఇంటిలో తల్లి యండదో, భార్య లేక ధనము బంధువులెందరున్నను ఆ ఇల్లు అడవివంటిదేగాని ఇల్లు కాజాలదు. భార్యలేనిచో ఇంటి యజమాని అపవిత్రుడగును. అందువలన దేవతా పితృకార్యములు చేయుటకతనికి అర్హత ఉండదు. అతడు దేవపితృకర్మలు చేసినను తత్ఫలమతనికి లభింపదు. అగ్నివలె దాహికాశక్తిలేని, ప్రభ##లేని సూర్యునివలె, శోభ##లేని చంద్రునివలె, శక్తిలేని జీవునివలె, శరీరములేని ఆత్మవలె, ఆధారములేని ఆధేయమువలె, ప్రకృతిలేని ఈశ్వరునివలె, దక్షిణలేని యజ్ఞమువలె, బంగారములేని కంసాలివలె, మట్టిలేని కుమ్మరివానివలె, గృహాధిష్ఠాతృదేవియగు భార్యలేని ఇంటియజమాని ఎట్టిపనులు చేయజాలడు. భార్యామూలాః క్రియాః భార్యామూలా గృహాస్తథా | భార్యామూలం సుఖంసర్వం గృహస్ధానాం గృహేసదా || 21 భార్యామూలః సదాహర్షో భార్యామూలం చ మంగళం | భార్యామూలం చ సంసారో భార్యామూలం చ సౌరభం || 22 యథారథశ్చ రథినాం గృహిణాం చ తథా గృహం | సారథిస్తు యథా తేషాం గృహిణాం చ తథా ప్రియా || 23 సర్వరత్న ప్రధానా చ స్త్రీ రత్నం దుష్కులాదపి | గృహీతా సా గృహస్తేనేవేత్యాహ కమలోద్భవః || 24 యథాజలం వినాపద్మం పద్మం శోభాం వినాయథా | తథైవ పుంసాం స్వగృహం గృహిణాం గృహిణీం వినా || 25 క్రియలకన్నిటికి భార్య ప్రధాన కారణమగును, అట్లే ఇంటికి శోభ భార్యవలననే కలుగును. గృహస్థులకు సుఖమంతయు భార్యమూలముననే లభించును. రథము కలవానికి రథమెట్టిదో, గృహస్థులకు గృహము అట్టిది. అట్టి గృహస్థుకు భార్య సారథి వంటిది. స్త్రీ అన్ని రత్నములలో ప్రధానమైనది అని బ్రహ్మదేవుడు పలికెను. జలము లేక పద్మమెట్లు శోభింపదో శోభ##లేని పద్మమెట్లుండునో అట్లే గృహస్థుకు భార్య లేక శోభ ఉండదు. ఇత్యేవ ముక్త్వా స గురుః ప్రవివేశ గృహం ముహుః | గృహాద్బహిర్నిస్ససార భూయోభుయః శుచాన్వితః || 26 ముహుర్ముహుశ్చ మూర్ఛాంచ చేతనాం సమవాప హ | భూయో భూయో రురోదోచ్చైః స్మారంస్మారం ప్రియాగుణాన్ || 27 బృహస్పతి ఈవిధముగా శిష్యులతో నని తన ఇంటిలోని ప్రవేశించి, బయటకు వచ్చి మరల ప్రవేశించి మాటిమాటికి బాధపడుచుండెను. మాటిమాటికి మూర్ఛపొందుచు లేచుచుండెను. అట్లే తన భార్య గుణములను స్మరించుకొనుచు ఏడ్చుచుంéడెను. అథాంతరే మహాజ్ఞానీ జ్ఞానిభిశ్చ ప్రబోదితః | సచ్ఛిషై#్యర్మునిభిశ్చాన్యైః పురందరగృహం య¸° || 28 స గురుః పూజితస్తేన చాతిథ్యేన మరుత్వాతా | తమువాచ స్వవృత్తాంతం హృదిశల్యమివాప్రియం || 29 ఆ సమయమున మహాజ్ఞానవంతుడగు బృహస్పతి తోటివారు ఓదార్చగా తన శిష్యులందరితో గూడి అతడు మహేంద్రుని ఇంటికివెళ్ళెను. మహేంద్రుడు తనకు గురువగు బృహస్పతికి ఆతిథ్యమొసగి గౌరవించెను. అప్పుడు బృహస్పతి హృదయశల్యము వలె బాధించుచున్న తన వృత్తాంతమును అతనికి తెలిపెను. బృహస్పతి వచః శ్రుత్వా రక్తపంకజలోచనః | తమువాచ మహేంద్రశ్చ కోపప్రస్ఫురితాధరః || 30 దేవేంద్రుడు బృహస్పతి మాటలు విని కోపమువలన ఎరుపెక్కిన కళ్ళతో వణకుచున్న పెదవులతో ఇట్లనెను. మహేంద్ర ఉవాచ- మహేంద్రుడిట్లనెను- దూతానాం వై సహస్రం చ చారకర్మణి గచ్ఛతు | అతీవ నిపుణం దక్షం తత్వ ప్రాప్తి నిమిత్తకం || 31 యత్రాస్తి పాతకీ చంద్రోమన్మాత్రా తారయా సహ | గచ్ఛామి తత్ర సన్నద్ధః సర్వైః దేవగణౖః సహ || 32 త్యజ చింతాం మహాభాగ సర్వం భద్రం భవిష్యతి | భద్రబీజం దుర్గమిదం కన్య సంపద్విపద్వినా || 33 ఇత్యుక్తా చ శునాసీరో దూతానాం చ సహస్రకం | తూర్ణం ప్రస్థాపయామాస తత్కర్మనిపుణం మునే || 34 వేలకొలది నా దూతలు గూఢచర్యము చేయుటకు వెళ్ళి పాతకియైన చంద్రుడు నా తల్లియగు తారతో ఎక్కడ ఉన్నాడో తెలసికొంటారు. తరువాత నేను దేవతలతో సర్వసన్నద్దుడనై అతనిపై యుద్దమునకు వెళ్ళుదును. అందువలన పూజ్యులగు బృహస్పతి మహాశయా! మీరు చింతింపవద్దు. మీకు అంతయు మంగళ##మే జరుగును. మంగళమునకు కారణమైన దుఃఖమే ఇది. ఎవ్వరికిని కష్టము లేక సంపదలు కలుగవు. కదా . అందువలన మీరు దుఃఖపడవద్దు అనెను. తే దూతా వర్షశతం యయుర్నిర్జన మేవ చ | సుదుర్లంఘ్యం చ విశ్వేషు భ్రమిత్వా శక్రమాయముః || 35 చంద్రం చ శుక్రభవనే తం ప్రపన్నం చ విజ్వరం | దృష్ట్వా సతారకం భీతం కథయామాసురీశ్వరం || 36 ఇతి శ్రుత్వా శునాసీరో నతవక్త్రో బృహస్పతిం | ఉవాచ శోకసంతప్తో హృదయేన విదూయతా || 37 దేవేంద్రుని దూతలు నూరు సంవత్సరములు, నిర్జనములు, దుర్లంఘ్యములు అగు ప్రదేశములలో లోకములన్నియు తిరిగి చంద్రుని జాడ తెలుసుకొని తిరిగివచ్చిరి. వారు మహేంద్రునితో చంద్రుడు దేవతలకు భయపడి తారతో శుక్రుని శరణు పొందినట్లు, అతడిచ్చిన అభయమువలన భయములేక శుక్రుని ఇంటిలో ఉన్నట్లు తెలిపిరి. చారులవలన ఈ వృత్తాంతము తెలిసికొన్న దేవేంద్రుడు తలవంచుకొని బాధపడుచు తన గురువుతో నిట్లనెను. మహేంద్ర ఉవాచ- మహేంద్రుడిట్లనెను- శ్రుణునాథ ప్రవక్ష్యామి పరిణామ సుఖావహం | భయం త్యజ మహాభాగ సర్వం భద్రం భవిష్యతి || 38 త్వయా న హి జితః శుక్రో న మయా దితినందనః | ఏతదాలోచ్య చంద్రశ్చ జగామ శరణం కవిం || 39 గచ్ఛలోకం బ్రహ్మలోకమస్మాభిః సార్ధమేవ చ | బ్రహ్మణా సహ యాస్యామః కైలాసే శంకరం వయం || 40 ఇత్యుక్త్వా తు మహేంద్రశ్చ సంతప్తో గురుణా సహ | జగామ బ్రహ్మలోకం చ సుఖదృశ్యం నిరామయం || 41 పూజ్యుడా! ఇది సుఖాంతమగును. మీరు భయము పెట్టుకొనవద్దు. మీకు సర్వము మంగళమగును. మీరు శుక్రుని జయింపలేదు. నేను దైత్యులను జయింపలేదు, అని ఆలోచించి దైత్యగురువగు శుక్రుని శరణువేడెను. అందువలన మనమందరము కలిసి బ్రహ్మలోకమునకు వెళ్ళి, బ్రహ్మదేవునితో కలసి శంకరుని దగ్గరకు పోవుదము అని దేవేంద్రుడు బాధపడుచు గురవగు బృహస్పతితో కలిసి బ్రహ్మలోకమును చేరుకొనెను. తత్రదృష్ట్యా చ బ్రహ్మాణం ననామ గురుణా సహ | ప్రోవాచ సర్వవృత్తాంతం దేవానామీశ్వరం పరం || 42 మహేంద్రవచనం శ్రుత్వా హసిత్వా కమలోద్భవః | హితం తథ్యం నీతిసారమువాచ వినయాన్వితః || 43 మహేంద్రుడు మొదలగు దేవతలు బ్రహ్మలోకమున బ్రహ్మదేవుని చూచి బృహస్పతితో సహ అందరు బ్రహ్మదేవునకు నమస్కరించిరి. తరువాత దేవతలకందరకు ఈశ్వరుడగు బ్రహ్మదేవునకు విషయమంతయు వివరించిరి. అప్పుడు బ్రహ్మదేవుడు వినయముతో నిట్లు పలికెను. బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను- యోదదాతి పరసై#్మ చ దుఃఖమేవ చ సర్వతః | తసై#్మ దదాతి దుఃఖం చ శాస్తాకృష్ణః సనాతనః || 44 అహంస్రష్టా చ సృష్టేశ్చ పాతవిష్ణుః సనాతనః | యథారుద్రశ్చ సంహర్తా దదాతి చ శివం శివః || 45 నిరంతరం సర్వసాక్షీ ధర్మో వై సర్వకారణం | సర్వే దేవా విషయిణః కృష్ణాజ్ఞా పరిపాలకా ః || 46 బృహస్పతి రుతథ్యశ్చ సంవర్తశ్చ జితేంద్రియః | త్రయాశ్చాంగిరసః పుత్రా వేద వేదాంగపాగరాః || 47 సంవర్తాయ కనిష్ఠాయ న కించిద్దదౌ గురుః | స బభూవ తపస్వీ చ కృష్ణం ధ్యాయతి చేశ్వరం || 48 మధ్యమస్యోతథ్యకస్య సతీం భార్యాం చ గుర్విణీం | జహార కామతస్తాం చ భ్రాతృజాయామకాముకీం || 49 యోహరేత్ భ్రాతృజాయాం చ కామీ కామాదకాముకీం | బ్రహ్మహత్యాసహస్రం చ లభ##తే నాzత్ర సంశయః || 50 స యాతి కుంభీపాకం చ యావచ్చంద్ర దివాకరం | భ్రాతృజాయాపహీరీ చ మాతృగామీ భ##వేన్నరః || 51 తస్మాదుత్తీర్య పాపాచ్చ విష్ఠాయాం జాయతే కృమిః | వర్షకోటి సహస్రాణి తత్రస్థిత్వా చ పాతకీ || 52 తతో భ##వేన్మహాపాపీ సహస్రకం | పుంశ్చలీయోనిగర్తే చ కృమిశ్చైవ పురందర || 53 గృధ్రః కోటి సహస్రాణి శతజన్మాని కుక్కురః | భ్రాతృజాయాపహరణాత్ శతజన్మని సూకరః || 54 దదాతి యో న దాయం చ బలిష్ఠో దుర్బలాయ చ | సయాతి కుంభీపాకం చ యావచ్చంద్ర దివాకరం || 55 నాభుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శ##తైరపి | అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాzశుభం || 56 ఎవరు ఇతరులకు దుఃఖమును కలిగింతురో వారికి సనాతనుడగు శ్రీకృష్ణపరమాత్మ దుఃఖమును కలిగించును. నేను సృష్టిని చేయగా విష్ణుమూర్తి ఈ సృష్టిని కాపాడుచున్నాడు. రుద్రుడీ సృష్టిని సంహరించుచున్నాడు. శివుడు అందరకు మంగళమును కలిగించును. ధర్ముడు ఎల్లప్పుడు సర్వవిషయములకు సాక్షియై యుండును. ఈ దేవతలమందరము శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞను పరిపాలించెదము. అంగిరస మహర్షికి బృహస్పతి, ఉతథ్యుడు, సంవర్తుడను ముగ్గురు పుత్రులు కలరు. వారందరు వేదవేదాంగములన్నిటిని క్షుణ్ణముగా అభ్యసించినవారు. తండ్రియగు అంగిరస మహర్షి చిన్నవాడగు సంవర్తున కెట్టి సంపదను ఇవ్వలేదు. అయినను అతడు తపస్సు చేయుచు నిరంతరము శ్రీకృష్ణుని ధ్యానించుచుండును. నీవు నీ సోదరుడగు ఉతథ్యునియొక్క భార్యను కామించి, ఆమె గర్భవతియనికూడ గమనించక ఎత్తుకొని పోతిని. కాముకుడై సోదరుని భార్యను బలాత్కరించిన కాముకుడు వెయిరెట్లు బ్రహ్మహత్యా ఫలమును పొందును. అతడు సూర్యచంద్రులున్నంతవరకు కుంభీపాకమను నరకమన యాతనలననుభవించును. సోదరుని భార్యను బలాత్కరించినవాడు తల్లితో జారత్వము చేసిన వానితో సమానుడు. అందువలన వాడు నరకయాతనలననుభవించిన పిదప మలమునందలి క్రిమిగా వేలకోట్ల సంవత్సరములుండును. తరువాత ఆ మహాపాపి స్త్రీ యోనిలోని పురుగై కోట్లకొలది సంవత్సరములుండును. అటుపిమ్మట గద్దగాను, కుక్కగాను, పందిగాను అనేక జన్మలెత్తును. అట్లే బలవంతుడైనవాడు దుర్బలుడైన తన సోదరునకు దాయభాగమివ్వక మోసగించినచో అతడు కూడ సూర్యచంద్రులున్నంతకాలము కుంభీపాకనరకమున పడును. శుభాశుభ కర్మలయొక్క ఫలితమును అనుభవించనిదే ఆ కర్మలు తీరవు. అందువలన మానవుడు తప్పక ఆ కర్మఫలితములననుభవించి తీరవలసినదే. జగద్గురోః శివస్యాపి గురుపుత్రో బృహస్పతిః | జ్ఞాతం కరోతు వృత్తాంతమీశ్వరం బలినాం వరం || 57 సర్వే సమూహాశ్చ దేవానాం సన్నద్దాశ్చ సవాహనాః | మధ్యస్థా మునయశ్చైవ సంతువై నర్మదాతటే || 58 పశ్చాదహం చ యాస్వామి పుణ్యం తన్నర్మదాతటం | గురుస్తద్గురుపుత్రోzపి శీఘ్రం యాతు శివాలయం || 59 బృహస్పతి జగద్గురువగు శివునకు సైతము గురుపుత్రుడు. అందువలన మహాబలవంతుడైన శంకరునకు కూడ ఈ విషయము తెలియవలెను. అందువలన దేవతలందరు సర్వసన్నద్దులై వాహనములనధిరోహించి మధ్యభాగమున మునులుండగా నర్మదానదీ తీరమునకు పొండు. మీ వెనక నేను కూడ పవిత్రమైన నర్మదానదీ తీరమునకు వత్తును. అట్లే పరమేశ్వరునకు గురువు అతని పుత్రుడగు బృహస్పతి కూడ పరమేశ్వరుడున్న కైలాసమునకు పోవలెనని బ్రహ్మదేవుడనెను. కథం వా వేదకర్తుశ్చ సిద్దానాం యోగినాం గురో ః | మృత్యుంజయస్య శంభోశ్చ గురుపుత్రో బృహస్పతిః || 60 అంగిరాస్తవ పుత్రశ్చ తత్పుత్రశ్చ బృహస్పతిః | త్వత్తోజ్ఞానీ మహాదేవః కథం శిష్యోగురోః పితుః || 61 వేదములన్ని తెలిసిన నీకు, సిద్దులకు యోగలకు గురువగు పరమేశ్వరునకు బృహస్పతి గురుపుత్రుడెట్లయ్యెను. అంగిరసుడు నీ పుత్రుడు, బృహస్పతి అతని యొక్క పుత్రుడు. పరమ శివుడు నీ కంటె గొప్ప జ్ఞానవవంతుడు. అట్టి పరమశివునకు బృహస్పతి గురుపుత్రుడెట్లయ్యెను. బ్రహ్మోవాచ- బ్రహ్మదేవుడిట్లనెను- కథేయమతిగుప్తా చ పురాణషు పురందర | ఇమాం పురా ప్రవృత్తిం చ కథయామి నిశామయ || 62 మృతవత్సా కర్మ దోషాద్భార్యా చాంగిరసః పురా | వ్రతం చకార సా చైవ కృష్ణస్య పరమాత్మనః || 63 వ్రతం పుంసవనం నా మ వర్షమేకం చకార సా | సనత్కుమారో భగవాన్ కారయామాస తాం వ్రతం || 64 తదాగత్య చ గోలోకాత్పరమాత్మా కృపామయాః | స్వేచ్ఛామయం పరం బ్రహ్మ భక్తానుగ్రహవిగ్రహః || 65 సువ్రతాం చ సలక్ష్మీకాం తామువాచ కృపానిధిః | ప్రణతాం సాశ్రునేత్రాం చ వినీతాం చ తయాస్మృతః || 66 మహేంద్రా! ఈ కథ పురాణములలో చాలా రహస్యముగానున్నది. ఇట్టికథను నీకు తెల్పెదను. అంగిరసునికి కర్మదోషమువలన పుట్టిన సంతానము నశించుచుండుటచే అతని భార్య కృష్ణపరమాత్మయొక్క వ్రతమును చేసెను. పుంసవనమను ఆ వ్రతమును సనత్కుమారుడు ఒక సంవత్సరమువరకు జరిపించెను. ఆ వ్రతమహాత్మ్యమువలన గోలోకమునుండి కృపామయుడు, పరమాత్మ, స్వేచ్ఛామయుడు, భక్తులననుగ్రహించువాడగు శ్రీకృష్ణపరమాత్మ ప్రత్యక్షమై చక్కగా వ్రతమును చేసి శ్రీకృష్ణుని చూడగానే కన్నీళ్ళతో వినయముతో నమస్కరించుచున్న ఆమెతో ఇట్లనెను. శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లనెను- గృహాణదం వ్రతఫలం మమతేజస్సమన్వితం | భుంక్ష్య మద్వరతః పుత్రి భవిష్యతి మదంశతః || 67 పతిర్గురుశ్చ దేవానాం మహతాంజ్ఞానినాం వరః | పుత్రస్తే భవితా సాధ్వి మద్వరేణ బృహస్పతిః || 68 మద్వరేణ భ##వేద్యోహి స చ మద్వరపుత్రకః | త్వద్గర్భే మమ పుత్రోzయం చిరజీవి భవిష్యతి || 69 వరజో వీర్యజశ్చైవ క్షేత్రజః పాలకస్తథా | విద్యామంత్రసుతౌ చైవ గృహీతః సప్తమః సుతః || 70 ఇత్యుక్త్వా రాధికానాథః స్వలోకం చ జగామ సః | శ్రీకృష్ణవరపుత్రోzయం జ్ఞానీశ్వరగురుః స్వయం || మృత్యుంజయం మహాజ్ఞానం శివాయ ప్రదదౌ పురా || 71 స్వ శక్తిం విష్ణు మయాంచ స్వాంశం వైనాహనం వృషం || దివ్యం వర్ష త్రిలక్షం చ తపశ్చక్రే హిమాలయో | స్వయోగం జ్ఞనమఖిలం తేజస్స్వామ సమం పరం || 72 స్వశూలం చ స్వకవచం స్వమంత్రం ద్వాదశాక్షరం | కృపామయస్తుతస్తేన శ్రీకృష్ణశ్చ పరాత్పరః || శివలోకే శివాసా చ విష్ణుమాయా శివప్రియా || 73 శక్తిర్నారాయణస్యేయం సాzవిర్భూతా సనాతనీ | తేజస్సుసరవభూతానాం సాzవిర్భూతా సనాతనీ || 74 జఘాన దైత్య నికరం దేవేభ్యః ప్రదదౌ పదం | కల్పాంతే దక్షకన్యా చ సామూల ప్రకృతిః సతీ || 75 పితృయజ్ఞే తనుం త్యక్త్వా యోగాద్వై సిద్దయోగినీ | బభూవ శైలకన్యా సా సాధ్వీ వై భర్తృనిందయా || 76 కాలేన కృష్ణతపసా శంకరం ప్రాస సుందరీ | శ్రీకృష్ణో హి గురుః శంభోః పరమాత్మ పరాత్పరః || 77 కృష్ణస్య వరపుత్రోzయం స్వయమేవ బృహస్పతిః | అతో హేతో సురుగురుర్గురుపుత్రః శివస్య చ || 78 ఇత్యేవం కథితం సర్వమతిగుహ్యం పురాతనం | ఇతి ప్రధాన సంబంధః శ్రుతశ్చ కథితో మయా || 79 ఓ సాధ్వి! నా తేజస్సు గల వ్రతఫలమును తీసికొమ్ము. దీనిని అనుభవించినచో నా వరమువలన నా అంశతో నీకొక పుత్రుడు ఉదయించును. నీ పుత్రుడు గొప్పజ్ఞాని, దేవతలకు గురువు కాగలడు. నా వరమువలన నీకు కలుగు పుత్రుడు బృహస్పతియగును. నావరమువలన పుట్టుపుత్రుడు మద్వరపుత్రుడగును. ఈతడు చిరంజీవియగును. నీగర్భమున నా అంశవలన అతడు పుట్టును. వరమువలన పుట్టినవాడు, వీర్యమువలన పుట్టినవాడు, క్షేత్రజుడు, పాలకుడు, విద్యనుపదేశించుటవలన ఏర్పడు పుత్రుడు (విద్యాపుత్రుడు), మంత్రముపదేశించుటవలన ఏర్పడు పుత్రుడు (మంత్రపుత్రుడు), తీసుకొనబడినవాడని పుత్రులు ఏడువిధములుగా నుందురు. వారిలో ఇతడు వరము వలన పుట్టిన పుత్రుడు. ఈ విధముగా అంగిరసుని భార్యతో శ్రీకృష్ణపరమాత్మ పలికి తనలోకమగు గోలోకమునకు వెళ్ళిపోయెను. ఇట్లు బృహస్పతి, శ్రీకృష్ణునకు వరపుత్రుడగును. జ్ఞానీశ్వరులకు సైతము గురువు అగు పరమాత్మ ఒకప్పుడు పరమశివునకు మృత్యుంజయమను మహాజ్ఞానము నొసగెను. ఆ మృత్యుంజయజ్ఞానమును పొంది పరమశివుడు హిమాలయములలో మూడులక్షల దివ్యవర్షములు తపస్సు చేసెను. దానివలన అతడు తనదైన యోగమును, సమస్త జ్ఞానమును, స్వశక్తిని, విష్ణుమాయను, తనకు వాహనమగు వృషభమును, త్రిశూలమును, కవచమును, ద్వాదశాక్షరమైన స్వమంత్రమును పొందగలిగెను. ఆ పరమశివుడు కృపామయుడగు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించగా శివలోకమున శివా అనుపేరుతో ప్రసిద్ధినొందిన నారాయణుని శక్తియగు విష్ణుమాయ ఆవిర్భవించినది. ఆ సనాతని సర్వప్రాణుల తేజస్సుతో కూడుకొన్నది. ఆ మాయ రాక్షసుల నందరను చంపి వారి నివాసస్థానమును దేవతల కొసగినది. ఆ దేవి కల్పముయొక్క అంతమున దక్షకన్యగా జనించి పరమేశ్వరునకు పత్నియైనది. ఆమె తండ్రియగు దక్షడు చేయుచున్న యజ్ఞమున తన భర్తృనిందను సహింపలేక యోగశక్తిచే శరీరత్యాగము చేసినది. అటుపిమ్మట ఆమె పార్వతిగా అవతరించి శ్రీకృష్ణుని తపః ప్రభావమువలన మరల శంకరునకు భార్యయైనది. శ్రీకృష్ణుడు శంకరునకు గురువు. బృహస్పతి శంకరునికి గురువగు శ్రీకృష్ణుని వరపుత్రుడు. అందువలన దేవతా గురువగు బృహస్పతి శంకరునకు గురుపుత్రుడగుచున్నాడు. దేవేంద్రా! ఈ విధముగా పరమ రహస్యమైన బృహస్పతి జన్మవృత్తాంతమును తెలిపితిని అని బ్రహ్మదేవుడనెను. పారంపరికమన్యం చ కథయామి నిశామయ | దుర్వాసాగరుడశ్చైవ శంకరాంశః ప్రతాపవాన్ || 80 శిష్యౌచాంగిరసస్తౌ ద్వౌ గురుపుత్రోzథవా తతః | ప్రాణాధికాయాం సత్యాం చ మృతాయాం దక్షశాపతః || 81 స్వజ్ఞానం స్వంచ భగవాన్ విసస్మార స్వమోహతః | స్మరణం కారయామాస కృష్ణేన ప్రేరితోzంగిరాః || 82 అతోహేతోర్గురుశ్చైవం మత్సుతస్స్యాత్ శివస్య చ | శ్రీఘ్రంగచ్ఛతు కైలాసం స్వయమేవ బృహస్పతిః || 83 త్వం గచ్ఛ తత్ర సన్నద్ధః సదేవో నర్మదా తటం | ఇత్యుక్త్వా జగతాం ధాతా విరరామ చ నారద || 84 నారదా! పరంపరగా వచ్చుచున్న ఇంకొక సంబంధమును కూడ నీకు తెలిపెదను. దుర్వాసమహర్షి, గరుత్మంతుడు వీరిద్దరు శంకరాంశకలవారు. వీరిద్దరు అంగిరసుని దగ్గర విద్యనభ్యసించినందువలన శంకరుడు అంగిరసుని శిష్యుడైనాడు. బృహస్పతి అంగిరసుని పుత్రుడు కావున శంకరునకతడు గురుపుత్రుడాయెను. లేక దక్షునియొక్క శాపము వలన సతీదేవి దక్షయజ్ఞమున శరీర పరిత్యాగము చేసినప్పుడు శంకరుడు మోహమువలన తన జ్ఞానమును, తనను మరిచిపోయెను. ఆ సమయమున శ్రీకృష్ణుని ప్రేరేపరణవలన అంగిరసుడు శంకరునకు వాటి స్మరణ కలిగించినందువలన నా పుత్రుడగు అంగిరసుడు శంకరునికి గురువగును. అందువలన బృహస్పతి స్వయముగా తన బాధలు చెప్పుకొనుటకు పరమశివుని దగ్గరకు పోవలయును. నీవుకూడ దేవతలందరితో కలసి సర్వసన్నద్దుడవై నర్మదానదీతీరమునకు పొమ్మని బ్రహ్మదేవుడు పలికి ఊరకుండెను. గురుర్య¸°చ కైలాసం మహేంద్రో నర్మదాతటం || 85 బృహస్పతి బ్రహ్మదేవుని మాటననుసరించి కైలాసమునకు పోగా దేవతాధిపతియైన ఇంద్రుడు నర్మాదానదీ తీరమునకు పోయెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతి ఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే బృహస్పతేః కైలాసగమనం నామైకోనషష్టితమోధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణ సంవాదములో తెల్పబడిన దుర్గోపాఖ్యానములో బృహస్పతి కైలాసమునకు వెళ్ళుట అను యాభై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.