sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షష్టితమోzధ్యాయః - శ్రీకృష్ణుడు దేవతలకు తారనుద్ధరించు విధానము చెప్పుట నారద ఉవాచ- నారదమహర్షి నారాయణునితోనిట్లు పలికెను- నారాయణ మహాభాగ వేదవేదాంగ పారగ | నిపీతం చ మహాఖ్యానం త్వన్ముఖేందు వినిస్పృతం ||
1 అధునా శ్రోతుమిచ్చామి కిమువాచ బృహస్పతిః | శివం చ గత్వా కైలాసం దాతారం సర్వసంపదాం ||
2 జగత్కర్తా విధాతా చ కిం వా తం ప్రత్యువాచ సః | ఏతత్సర్వం సమాలోచ్య వదవేదవిదాం వర ||
3 వేదములు, వేదాంగములు అన్నియు తెలిసిన నారాయణుడా! నీవలన అనేక ఉపాఖ్యానములను వింటిని. ఇప్పుడు సమస్త సంపదల నొసగు పరమశివుడు కైలాసమునకు వెళ్ళిన బృహస్పతితో ఏమనెను? ఈ విషయమును సంపూర్ణముగా నాకు తెలుపుమని అడిగెను. నారాయణ ఉవాచ- నారాయణుడు ఇట్లనెను- శీఘ్రం గత్వా చ కైలాసం భ్రష్టశ్రీః శంకరం గురుః | ప్రణమ్య తస్థౌ పురతో లజ్జావనత కంధరః || 4 దుష్ట్వా గురుసుతం శంభురుదతిష్ఠత్కుశాసనాత్ | ఆలింగనం దదౌతసై#్మ శీఘ్రం మాంగళికాశిషః || 5 స్వాసనే వాసయిత్వా వై పప్రచ్ఛ కుశలం వచః | ఉవాచ మధురం వాక్యం భీతం తం లజ్జితం శివః || 6 బృహస్పతి బ్రహ్మదేవుని మాటలననుసరించి శీఘ్రముగా కైలాసపర్వతమునకు వెళ్ళి అచ్చట సిగ్గుతో తలవంచుకొని నమస్కరించి నిలబడెను. గరుసుతుడగు బృహస్పతి కనిపించగానే శంకరుడు దర్భాసనమునుండి లేచి బృహస్పతిని కౌగిలించుకొని ఆశీర్వదించెను. తరువాత అతనిని తనతోపాటు ఆసనమున కూర్చుండబెట్టుకొని యోగక్షేమములు విచారించెను. అటుపిమ్మట శంకరుడు భయముతో, సిగ్గుతోనున్న బృహస్పతితో మధురముగా ఇట్లు మాట్లాడ దొడగెను. శ్రీ శంకర ఉవాచ- శంకరుడిట్లు పలికెను- కథమేవంవిధస్త్యం చ దుఃఖీమలిన విగ్రహః | సాశ్రునేత్రో లజ్జితశ్చ భ్రాతస్తత్కారణం వద || 7 కిం వా తపస్యాహీనా తే సంధ్యా హీనాzధూనా మునే | కిం వా శ్రీకృష్ణసేవా సా విహీనా దైవదోషతః || 8 కిం వా గురౌభక్తి హీనోzభీష్ట దేవేzథవా గురౌ | కిం వా నరక్షితుం శక్తః ప్రసన్నం శరణాగతం || 9 కిం వాzతిథిస్తే విముఖః కిం వా పోష్యా బుభుక్షితాః | కిం వా స్వతంత్రా స్త్రీవా తే కిం వా పుత్రోzవచస్కరః || 10 సుశాసితో న శిష్యోవా కిం భృత్యాశ్చోత్తరప్రదాః | కింవా తే విముఖాలక్ష్మీః కిం వా రుష్టో గురుస్తవ || 11 గరిష్ఠశ్చ వరిష్ఠశ్చ శశ్వత్సంతుష్టమానసః | గురుస్తవ వసిష్ఠశ్చ ప్రేష్ఠః శ్రేష్ఠః సతామహో || 12 కిం వా రుష్టోzభీష్టదేవః కిం వా రుష్టాశ్చ బాడబాః | కిం వా రుష్టా వైష్ణవాశ్చ కిం వా తే ప్రబలో రిపుః || 13 కిం వా తే బంధువిచ్ఛేదో విగ్రహో బలినా సహ | కిం వా పదం పరగ్రస్తం కిం వా బంధుదనం చవా || 14 కేన తే వా కృతానిందా ఖలైర్వా పాపిభిర్మునే | కేనప త్వం పరిత్యక్తో బాంధవేన ప్రియేణ వా || 15 బంధుస్త్యక్తస్త్వయా కిం వా వైరాగ్యేణ కృధాzథవా | కిం వా తీర్థే న హి స్నాతం న దత్తం పుణ్యవాసరే || 16 గురునిందా బంధునిందా ఖలవక్త్రాత్ శ్రుతాzథవా | గురునిందా హి సాధూనాం మరణాదతిరిచ్యతే || 17 అసద్వంశ ప్రజాతానాం ఖలానాం నిందనం తథా | దౌశ్శీల్యమేవమసతాం శశ్వన్నారాకిణామిహ || 18 పరప్రశంసకాః సంతః పుణ్యవంతో హి భారతే | శశ్వన్మంగళయుక్తాశ్చ రాజంతే మనసా సదా || 19 పుత్రే యశసి తోయే చ సమృద్ధే చ పరాక్రమే | ఐశ్వర్యే వా ప్రతాపే చ ప్రజాభూమి ధనేషు చ || 20 వచనేషు చ బుద్దౌ చ స్వభావే చ చరిత్రతః | ఆచారే వ్యవహారే చ జాయతే హృదయం నృణాం || 21 యాదృగ్యేషాం చ హృదయే తాదృక్తేషాం చ మంగళం | యాదృగ్యేషాం పూర్వపుణ్యం తాదృక్తేషాం చ మానసం || 22 ఓ బృహస్పతీ! నీవెందులకిట్లున్నావు? మలినమైన శరీరముతో కన్నీళ్ళతో దుఃఖించుచున్నట్లున్నావు. నీ దుఃఖమునకు కారణమేమిటో చెప్పుము. నీతపస్సున కేమైన అవాంతరమేర్పడినదా? లేక సంధ్యావందనమునకు ఇబ్బంది కలిగినా? దురదృష్టము వలన నీవు శ్రీకృష్ణపరమాత్మను ధ్యానింపలేక పోవుచున్నావా? నీగురుభక్తికి గాని దైవభక్తికిగాని అవాంతరము కలిగినదా? నిన్ను శరణుచెందిన ప్రపన్నుని రక్షింపలేక పోయితివా? నీఇంటికి వచ్చిన అతిథి నీవు చక్కగా సత్కారము చేయలేదని వెనుదిరిగి పోయినాడా? లేక నీ ఇంటిలోనున్న అనుచరవర్గమునకు భోజనము పెట్టలేక పోవుచున్నావా? నీభార్యకాని పుత్రుడుకాని స్వతంత్రులై ఎదురుతిరిగి మాట్లాడుచున్నారా? లేక నీ శిష్యులుగాని భృత్యులుగాని ఎదురుతిరిగినారా? లక్ష్మీదేవి నిన్ననుగ్రహించకుండ ఉన్నదా? నీ గురువు నీపై కోపపడినాడా? నీ అభిష్టదేవత కాని బ్రహ్మణులు కాని నీపై కోపగించినారా? నీబంధువులెవరైన పోయిరా? బలవంతుడైన వానితో కయ్యమేమైనా జరిగినదా? నీ స్థానమును ఇతరులాక్రమించుకొనిరా? నీ బంధువుల ధనమును ఎవరైనను దోచుకొనిరా? పాపులు దుష్టులైన వారు నిన్ను నిందించిరా? నీకు మిక్కిలి ఇష్టమైన బంధువులు నిన్ను వదలిపోయిరా ? లేక నీవే ఏమైమన వైరాగ్యమువలన లేక కోపమువలన నీ బంధువులను వదలుకొంటివా? నీవు పుణ్యతీర్థములలో స్నానము చేయలేదా? అచ్చట పుణ్యదినమున దానము చేయలేకపోతివా? లేక దుష్టులు నీ గురువును కాని బంధువులను కాని నిందించిరా ? మంచివారు తన గురువును ఇతరులు నిందించుచున్నచో దానిని మరణముకంటె ఎక్కువగా భావింతురు. చెడువంశములో పుట్టిన దుష్టులు వృథాగా ఇతరులను నిందింతురు. సత్పురుషులు ఎల్లప్పుడు పరప్రశంస సేయుదురు. అందువలననే వారు పుణ్యవంతులగుచున్నారు. వారి మనస్సులో సైతము సద్భావనయుండును. మానవులు సాధారణముగా, పుత్రుని, కీర్తిని, సమృద్ధమగు నీటిని, మంచి పరాక్రమమును, ఐశ్వర్యమును, సంతానమును, భూమిని ధనమును, మంచిమాటలను, చక్కని స్వభావమును ఇష్టపడుదురు. తమ మనస్సులో ఎట్టి భావన చేయుదురో మానవులకు అట్టి పనులే జరుగును. వారి పూర్వపుణ్యముననుసరించి ఈజన్మలో వారి చిత్తముండును. ఇత్యుక్త్వా చ మహాదేవో విరరామ స్వసంసది | తమువాచ మహావక్తా స్వయమేవ బృహస్పతిః || 23 మహాదేవుడిట్లు బృహస్పతితో ననగా బృహస్పతి పరమశివునితో ఈవిధముగా మాటలాడసాగెను. బృహస్పతిరువాచ- బృహస్పతి ఇట్లనెను- అకథ్యమేవ వృత్తాంతం కథయామి కిమీశ్వర | లోకాః కర్మవశాన్నిత్యం నానాజన్మసు యత్కృతం || 24 స్వకర్మణాం ఫలం భుంక్తే జంతుర్జన్మని జన్మని | న హి నష్టం చ తత్కర్మ వినాభోగాచ్చ భారతే || 25 సుఖందుఃఖం భయం శోకో నరాణాంభారతే ప్రభో | కేచి ద్వదంతి హి భ##వేత్ స్వకృతేన చకర్మణా || 26 కేచిద్వదంతి దైవేన స్వాభావేనేతి కేచన | త్రివిధా గతయో యస్యవేద వేదాంగ పారగ || 27 స్వయం చ కర్మజనకః కర్మ వై దైవకారణం | స్వభావో జాయతే నృణాం స్వాత్మనః పూర్వకర్మణః || 28 స్వకర్మణాం చ జంతూనాం సర్వేషాం ప్రతిజన్మని | సుఖం దుఖం భయం శోకం స్వాత్మనశ్చ ప్రజాయతే || 29 స్వకర్మఫలభోక్తా చ జీవో హి స గుణః సదా | ఆత్మభోజయితా సాక్షీ నిర్గుణః ప్రకృతేః పరః || 30 స ఏవాత్మ సర్వసేవ్యః సర్వేషాం చ ఫలప్రదః | స వై సృజతి దైవం చ స్వభావం కరమ చైవ హి || 31 కర్మణా చ నృణాం లజ్జా ప్రశంసా చ ప్రపుల్లతా | లజ్జాబీజం చ వృత్తాంతం తథాzపి కథయామి తే || 32 ఓ మహేశ్వర! నా వృత్తాంతము చెప్పదగనిదైనను చెప్పెదను. జీవులు కర్మవలన అనేక జన్మలనొందుచున్నారు. ప్రతిజన్మలోను వారు తాము చేసిన కర్మఫలముననుభవించుచున్నారు. కర్మఫలమనుభవింపనిదే కర్మ ఈ భారతభూమిపై నశింపదు. సుఖము, దుఃఖము, భయము, శోకమనునవి మానవులకు తాము చేసిన కర్మవలన ఈ భారతభూమిపై ఏర్పడుచున్నవని కొందరనగా మరికొందరు వారివారి అదృష్టమువలన సుఖదుఃఖాదులు కలుగుచున్నవందురు. దీనికి కర్మ, అదృష్టము, స్వభావము అను మూడు కారణములగుచున్నవి. మానవుడు స్వయముగా కర్మకు కారణమగుచున్నాడు. ఆ కర్మ అదృష్టమునకు కారణమగుచున్నది. జీవులు తాము పూర్వజన్మలో చేసికొన్న కర్మవలన స్వభావము పొందుచున్నారు. సుఖము, దుఃఖము, భయము, శోకమనునవి తన ఆత్మనుండి పుట్టుచున్నవి. సగుణుడైన జీవుడు తాను చేసిన కర్మలనెప్పుడు అనుభవించుచుండును. నిర్గుణుడు ప్రకృతికంటె శ్రేష్ఠుడైన పరమాత్మ సర్వసాక్షిగానుండును. ఆ పరమాత్మయే సమస్తజీవులచే సేవింపదగినవాడు. అందువలన అన్ని ఫలితముల నొసగువాడు. ఆ పరమాత్మయే అదృష్టమును, స్వభావమును, కర్మను సృష్టించుచున్నాడు. ఆ కర్మవలననే మానవులకు సిగ్గు, ప్రశంస, సంతోషము కలుగుచున్నవి. ఐనను నేను సిగ్గుపడుటకు గల కారణమును నీకెరింగింతును. ఇత్యుక్త్వా సర్వవృత్తాంతమవోచత్తం బృహస్పతిః | శ్రుత్వా బభూవ నమ్రాస్యో గౌరీశోలజ్జయా తదా || 33 జపమాలా కరాద్భ్రష్టా కోపావిష్టస్య శూలినః | బభూవ సద్యః కంపశ్చ రక్త పంకజలోచనే || 34 సంహర్తురీశో రుద్రస్య విష్ణోః పాతుః సఖా శివః | స్రష్టుఃస్తుత్యశ్చ మాన్యశ్చ స్వాత్మనః పరమాత్మనః || 35 నిర్గుణస్య చ కృష్ణస్య ప్రకృతీశస్య నారద | కోపాత్ప్రవక్తుమారేభే శుష్కకంఠౌష్ఠ తాలుకః || 36 బృహస్పతి ఈ విధముగానని విషయమంతయు నెరిగించగా విని శివుడు సిగ్గుతో తలవంచుకొనెను. అతనికి వెంటనే కోపము కలిగెను. దానివలన అతని చేతినుండి అక్షమాల జారిపడెను. అతని శరీరము కంపించెను. కండ్లు ఎఱ్ఱబడినవి. ఆ పరమేశ్వరుడు లోక సంహరము చేయు రుద్రునకు అధిపతియు, లోకములను రక్షించు విష్ణుమూర్తికి స్నేహితుడు, లోకములను సృజించు బ్రహ్మదేవునిచే స్తుతింపబడువాడు ఆతడు పరమాత్మ నిర్గుణ స్వరూపుడు, ప్రకృతికి అధిపతి, శివునకు ఆత్మస్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మకు మాన్యుడు. అట్టి పరమశివుడు కోపముచే గొంతు నాలుక ఎండిపోగా బృహస్పతితో ఇట్లనెను. శివ ఉవాచ- పరమశివుడిట్లనెను- శివమస్తు చ సాధూనాం వైష్ణవానాం సతామిహ | అవైష్ణవానా మసతా మశివం చ పదేపదే || 37 దదాతి వైష్ణవేభ్యశ్చ యోదుఃఖం సుస్థితో జనః | శ్రీకృష్ణస్తస్య సంహర్తా విఘ్నస్తస్య పదేపదే || 38 అవైష్ణవానాం హృదయం నహి శుద్దం సదామలం | శ్రీకృష్ణమంత్రస్మరణం మనోనైర్మల్య కారణం || 39 భిద్యతే హృదయగ్రంథిశ్చిద్యంతే సర్వ సంశయాః | విష్ణుమంత్రోపాసనయా క్షీయతే కర్మ తన్నృణాం || 40 అహో శ్రీకృష్ణదాసానాం కః స్వభావః సునిర్మలః | హృతభార్యం మూర్ఛితశ్చ న శశాప రిపుం గురుః || 41 గురుర్యశ్చ వరిష్ఠశ్చ క్రోధహీనశ్చ ధార్మికః | శతపుత్రఘ్నమప్యేనం న శశాప రిపుంగురుః || 42 నిశ్వాసాద్వై సురగురోర్భ్రతుర్మమ బృహస్పతేః | భస్మీభూతో నిమేషేణ శతచంద్రో భ##వేత్ ధ్రువం || 43 తథాzపి తం నో శశాప ధర్మభంగభ##యేన చ | తపస్యా హీయతే శప్తుః కోపావిష్టస్య నిత్యశః || 44 అహో హ్యత్రేరసత్పుత్రః పరస్త్రీలుబ్దకః శఠః | తపస్వినో వైష్ణవస్య బ్రహ్మపుత్రస్య ధీమతః || 45 ధర్మిష్ఠా బ్రహ్మణః పుత్రా వైష్ణవా బ్రాహ్మాణాస్తథా | కేచిద్దేవా ద్విజా దైత్యాః పౌత్రాశ్చ త్రివిధాః స్మృతాః || 46 యే సాత్వికా బ్రాహ్మణాస్తే దేవా రాజసికాఃతథా| దైత్యాస్తామసికా రౌద్రాః బలిష్ఠోశ్చోద్దతా స్తథా || 47 సాధువులు, సత్పరుషులు, అగు వైష్ణవులకు ఎల్లప్పుడు మేలు జరగును. అట్లే సత్పురుషులు కాని అవైష్ణవులకు ఎల్లప్పుడు కీడు జరుగును. వైష్ణవులగువారిని కష్టపెట్టువారికి ఎల్లప్పుడు విఘ్నములు కలుగును. శ్రీకృష్ణుడు వారిని బ్రతుకనీయడు. వైష్ణవులు కానివారి హృదయము ఎల్లప్పుడు అపరిశుద్దముగా నుండును. శ్రీకృష్ణుని మంత్రమును స్మరించినచో మనస్సు నిర్మలమగును. అతని హృదయగ్రంథి విడిపోగా సంశయములన్నియు పటాపంచలగును. శ్రీకృష్ణమంత్రమును ఉపాసించినచో అతని కర్మఫలము నశించును. శ్రీకృష్ణభక్తుల మనస్సు చాల నిర్మలముగానుండును. అందువలననే తన భార్యను చంద్రుడెత్తుకొని పోయినను అతనిని గురువు శపింపలేదు. శ్రేష్ఠుడు, కోపములేనివాడు ధార్మికుడగు గురువు తన శాపమువలన నూరుమందినైనను చంపగలడు. కాని గురువగు బృహస్పతి తనకు అపకారము చేసిన చంద్రుని శపింపలేదు. నాకు సోదరునివంటివాడు దేవతలకు గురవైన బృహస్పతి తన బాధాపూరితమగు నిట్టూర్పుచే చంద్రుని ఒక నిముషములోనే భస్మము చేయగలడు. అతని నూరు ముక్కలుగా చేయగలుగును. ఐనను బృహస్పతి ధర్మమునకు భంగము కలుగునని చంద్రుని శపింపలేదు. కోపముచే శపించువాని తపస్సు క్షీణించును కాన బృహస్పతి చంద్రుని శపింపలేదు. తపస్వి, విష్ణుభక్తుడు, బ్రహ్మదేవుని పుత్రుడు, మహాజ్ఞానియగు అత్రిమహర్షికి పరస్త్రీ వ్యామోహము కలవాడు, ధూర్తుడైన ఇటువంటి చెడు పుత్రుడు కలిగెను. ఇది చాలా ఆశ్చర్యము. బ్రహ్మదేవుని పుత్రులందరు ధర్మపరాయణులు, విష్ణుభక్తులు అందరు బ్రాహ్మణులే. అతని మనుమలు దేవతలు, ద్విజులు, దైత్యులని మూడు విధములుగా నున్నారు. సాత్విక గుణము కలవారు బ్రాహ్మణులు కాగా రజోగుణము కలవారు దేవతలు. తమోగుణ సంపన్నులు రౌద్రులు, బలవంతులు, ఉద్ధతులైనవారు దైత్యులు. స్వధర్మ నిరతా విప్రా నారాయణ పరాయణాః | శైవా శాక్తాశ్చ తే దేవా దైత్యా పూజావివర్జితాః || 48 ముముక్షవో విష్ణుభక్తా బ్రహ్మణా దాస్యలిప్సవః | ఐశ్వర్య లిప్సవో దేవాశ్చాసురాస్తామసాస్తథా || 49 బ్రహ్మణానాం స్వధర్మశ్చ కృష్ణస్యార్చన మీప్సితం | నిష్కామానాం నిర్గుణస్య పరస్య ప్రకృతేరపి || 50 యే బ్రాహ్మణా వైష్ణవాశ్చ స్వతంత్రాః పరమం పదం | యాంత్యన్యోపాసకాశ్చాన్యైః సార్థం చ ప్రాకృతే లయే || 51 వర్ణానాం బ్రహ్మణాః శ్రేష్ఠాః సాధవో వైష్ణవా యది | విష్ణుమంత్ర విహీనేభ్యో ద్విజేభ్యో శ్వపచో వరః || 52 పరిపక్వా విపక్వా వా వైష్ణవాః సాధవశ్చ తే | సతతం పాతి తాంశ్చైవ విష్ణుచక్రం సుదర్శనం || 53 యథావహ్నౌ శుష్కతృణం భస్మీభూతం భ##వేత్సదా | తథా పాపం వైష్ణవేషు కాష్ఠానీన హుతాశ##నే || 54 గురువక్త్రాద్విష్ణుమంత్రో యస్య కర్ణే ప్రవేక్ష్యతి | తం వైష్ణవం మహాపూతం ప్రవదంతి మనీషిణః || 55 పుంసాం శతం పితృణాంచ శతం మాతామహస్య చ | స్వసోదరాంశ్చ జననీముద్దరం త్యేవ వైష్ణవా ః || 56 గయాయాం పిండదానేన పిండదాః పిండ భోజనం | సముద్దరంతి పుంసాం చ వైష్ణవాశ్చ శతం శతం || 57 మంత్రగ్రహణమాత్రేణ జీవన్ముక్తో భ##వేన్నరః | యమస్తస్మాన్మహాభీతో వైనతేయాదివోరగః || 58 పునంత్యేవ హి తీర్థాని గంగాదీని చ భారతే | కృష్ణమంత్రోపాసకాశ్చ స్పర్శమాత్రేణ వాక్పతే || 59 పాపాని పాపినాం తీర్థే యావంతి ప్రభవంతి చ | నశ్యంతి తాని సర్వాణి వైష్ణవస్శర్శమాత్రతః || 60 కృష్ణమంత్రోపాసకానాం రజసా పాదపద్మయోః | సద్యోముక్తాః పాతకేభ్యోకృత్స్నా పూతావసుంధరా || 61 వాయుశ్చ పవనో వహ్నిః సూర్యః సర్వం పునాతి చ | ఏతే పూతా వైష్ణవానాం స్పర్శమాత్రేణ లీలయా || 62 అహం బ్రహ్మా చ శేషశ్చ ధర్మః సాక్షీ చ కర్మణాం | ఏతే హృష్టాశ్చ వాంఛంతి వైష్ణవానాం సమాగమం || 63 బ్రహ్మణులు స్వధర్మనిరతులై శ్రీమహావిష్ణు పాదాబ్జములనెల్లప్పుడు సేవించుచుందురు. దేవతలు శివుని, శక్తిని పూజింతురు. దైత్యులకు పూజయుండదు. విష్ణుభక్తులగు బ్రాహ్మణులు ముక్తిని గోరుచు శ్రీకృష్ణదాస్యమునెల్లప్పుడు అభిలషింతురు. దేవతలు ఐశ్వర్యమును కోరుదురు. అసురులు తామసప్రవృత్తి కలవారు. కోరికలేమియు లేని బ్రాహ్మణులయొక్క ధర్మము నిర్గణుడు, ప్రకృతికన్నను పరుడగు శ్రీకృష్ణుని అర్చించుట వైష్ణవులగు బ్రాహ్మణులకు స్వతంత్రముగా పరమపదమునకు పోవుదురు. కాని ఇతరదేవతలనుపాసించువారు ప్రాకృతలయమున ఆ ఇతరదేవతలతో కలిసి పరమపదమునకు పోవుదురు. చతుర్వర్ణములలో బ్రాహ్మణజాతి చాలా శ్రేష్ఠమయినది. వారు వైష్ణవులైనచో సాధుపురుషులగుదురు. నారాయణ మంత్రోపదేశము పొందని బ్రాహ్మణుకంటె చండాలుడు పరమశ్రేష్ఠుడు. వైష్మవులు పరిపక్వతను పొందినను పొందకున్నను సాధువు లేయగుచున్నారు. వైష్ణవుల నందరను సుదర్శన చక్రము అహర్నిశలు రక్షించుచుండును. అగ్నిలో పడిపోయన ఎండు గడ్డిపోచ ఏవిధముగా క్షణములో భస్మమగునో అట్లే వైష్ణవులందరు పాపము క్షణములో భస్మమైపోవును. గురువుయొక్క ముఖతః విష్ణుమంత్రము ఎవరి చేవిలో ప్రవేశించునో అతడే పరమ పవిత్రుడైన వైష్ణువుడని విద్వాంసులందురు. వైష్ణవులు తమ తండ్రివంకనున్న నూరు తరములవారిని తల్లివంశమునకు చెందిన నూరు తరములవారిని. తన సోదరులను, తల్లిని ఉద్దరింతురు. గయలో పిండప్రదానము చేసినందువలన ఆ పిండమును భక్షించువాడు మాత్రము ముక్తడు కాగా వైష్ణవులు నూరుతరములవారిని సముద్దరింతురు. నారాయణమంత్రమును గురుముఖతః పొందినంతమాత్రముననే అతడు జీవన్ముక్తుడగును. ఆ వైష్ణవుని చూచి యముడు గరుత్మంతుని చూచిన సర్పమువలే భయపడిపోవపును. ఓ బృహస్పతి! భారత భూభాగముననున్న గంగాది, పుణ్యతీర్థములు మానవుల పవిత్రము చేయును. శ్రీకృష్ణమంత్రోపాసకులు తమ స్పర్శమాత్రమున జీవులను పవిత్రులుగా చేయుదురు. శ్రీకృష్ణమంత్రోపాసకులు భూమిపై తిరుగుచున్నందువలన వారి పాదపద్మములయొక్క ధూళివల పాపాత్మలందరు విముక్తులగుదురు. భూమి సహితము పవిత్రమగుచున్నది. వాయువు, అగ్ని, సూర్యుడు వీరందరు లోకమును పవిత్రముగా చేయుదురు. కాని ఈ దేవతలు వైష్ణవులయొక్క స్పర్శమాత్రమున పవిత్రులైరి. నేను, బ్రహ్మదేవుడు, సర్వకర్మలకు సాక్షీభూతుడైన ధర్మదేవత మేమందరము వైష్ణవులతో కలిసియుండవలెనని సంతోషముగా కోరుకొందురు. ఫలం కర్మానురూపేణ సర్వేషాంభారతే భ##వేత్ | న భ##వేత్తద్వైష్ణవే చ సిద్ధధాన్యే యథాంకురం || 64 హంతి తేషాం కర్మపూర్వం భక్తానాం భక్తవత్సలః | కృపయా స్వపదం తేబ్యో దదాత్యేవ కృపానిధిః || 65 తేజస్వినాం చ ప్రవరం వైష్ణవం భృగునందనం | స చంద్రో దుర్బలో భీతః శుక్రం చ శరణం య¸° || 66 సుదర్శనో బలిష్ఠం చ శుక్రం జేతుం న శక్తిమాన్ | తథాzపి చోద్ధరిష్యామి తారాం మంత్రేణ మద్గురోః || 67 భజ సత్యం పరంబ్రహ్మ కృష్ణమాత్మానం మీశ్వరం | సుప్రసన్నే భగవతి పత్నీం ప్రాప్స్యసి లీలయా || 68 ఈ భరతదేశమున అందరకు వారువారు చేసికొన్న కర్మలననుసరించి ఫలితము లభించును. కాని వైష్ణవులకు కర్మఫలమంటదు. భక్తవత్సలుడైన శ్రీహరి తన భక్తులయొక్క పూర్వకర్మ ఫలమును నశింపజేయును. పైగా దయా సముద్రుడగు ఆ పరమాత్మ కృపతో తన స్థానముచే వారికిచ్చివేయును. దుర్బలుడు, భయముచెందిన పరమవైష్ణవుడు అధిక తేజస్వియగు శుక్రుని శరణుపొందెను. శక్తిమంతుడైన సుదర్శనచక్రము కూడ ఆ భృగునందనుని ఏమి చేయలేదు. ఐనను నా గురువగు శ్రీకృష్ణుని మంత్రప్రభావమువలన తారను ఉద్ధరించి నీకీయగలను. నీవు సత్యరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు, ఈశ్వరుడగు శ్రీకృష్ణపరమాత్మను సేవింపుము. ఆ పరమాత్మ సంతోష పడినచో నీ బార్య నీకు తప్పక లభించును. మంత్రం తస్య ప్రదాస్యామి భ్రాతః కల్పతరుం పరం | కోటిజన్మాషు నిఘ్నం చ సర్వమంగళ కారణం || 69 బ్రహ్మాది స్తంబపర్యంతం శ్వరం జలబింబవత్ | షరణం యాహి గోవిందం పరమాత్మాన మీశ్వరం | తావద్భవేచ్ఛా భోగేచ్ఛా స్త్రీసుఖేచ్ఛా నృణామిహ || 70 యావద్గురు ముఖాంభోజన్న ప్రాప్నోతి మనుం హరేః | సంప్రాస్య దుర్లభం మంత్రం వితృష్ణో హి భ##వేన్నరః || 71 ఇంద్రత్వమమరత్వం చ నహి వాంఛంతి వైష్ణవాః |నహివాంఛంతి మోక్షం చ దాస్యం భక్తిం వినా భహరేః || 72 భక్తినిర్మథనం భక్తో మోక్షం నో వాంఛతిప్రభోః | జ్ఞానం మృత్యుంజయత్వం చ సర్వసిద్ధిం తదీప్సితం || 73 వాక్సిద్ధిం చైవ ధాతృత్వం భక్తానాం నహి వాంఛితం | భక్తిం నిహాయ కృష్ణస్య విషయం యోహివాంఛతి || 74 విషమత్తి సుధాం త్యక్త్వా వాంఛితో విష్ణుమాయయా | అహంబ్రహ్మా చ విష్ణుశ్చ ధర్మోzనంతశ్చ కశ్యపః || 75 కపిలశ్చ కుమారశ్చ నరనారయణావృషీ | స్వాయంభువో మనుశ్చైవ ప్రహ్లాదశ్చ పరాశరః || 76 భృగుః శుక్రశ్చ దుర్వాసా వసిష్ఠః క్రతురంగిరాః | బలిశ్చ వాలఖిల్యాశ్చ వరుణశ్చ హుతాశనః || 77 వాయుః సూర్యశ్చ గరుడో దక్షో గణపతిః స్వయం | ఏతే పరా భక్తవరా కృష్ణస్య పరమాత్మనః || 78 యే చ తస్య కళాశ్రేష్ఠాః తే తద్భక్తి పరాయణాః | ఇత్యుక్త్వా శంకరస్తసై#్మ దదౌ కల్పతరుం మనుం ||79 ఓ సోదరుడా! నీకు కల్పతరువువంటి శ్రీకృష్ణమంత్రమును ఉపదేశింతును. ఇది కోటి జన్మలలో పొందిన పాపములన్నిటిని తొలగించును. సమస్త మంగళములను కలిగించును. బ్రహ్మమొదలు స్తంబ పర్యంతమున్న ఈ చరాచర సృష్టి జలమునందు కన్పించు నీడవల నశించిపోవును. అందువలన నిత్యుడగు శ్రీకృష్ణ పరమాత్మను నీవు సేవింపుము. గురువుయొక్క ముఖమునుండి శ్రీకృష్ణమంత్రోపదేశము పొందనంతవరకు సంసారమున, భోగములపై, స్త్రీసుఖమున ఇచ్ఛ కలుగును. దుర్లభ##మైన శ్రీకృష్ణమంత్రము లభించినంతమాత్రమున మానవునకు కోరికలన్నియు నశించును. వైష్ణవులు ఇంద్రత్వమును, దేవత్వమును, మోక్షమును కోరుకొనరు. వారెల్లప్పుడు శ్రీహరి దాస్యమును, శ్రీహరి భక్తిని మాత్రము కోరుకొనెదరు. వైష్ణవులు శ్రీహరి భక్తిని తొలగించు మోక్షమును జ్ఞానమును, మృత్యుంజయత్వమును, సమస్త సిద్దులను, తన ఇతర కోరికలను, వాక్సిద్ధిని, బ్రహ్మపదవిని ఎట్టిస్థితిలోను, కోరుకొనరు. శ్రీకృష్ణభక్తి కాక ఇతర విషయములను వైష్ణవుడు కోరుకొనినచో అమృతమును వదలి విషయమును భుజించువాడగును. నేను, బ్రహ్మదేవుడు, విష్ణువు, ధర్ముడు, అనంతుడు, కశ్యపుడు, కపిలుడు, కుమారస్వామి, నరనారాయణమునులు, స్వాయంభువమునువు, ప్రహ్లాదుడు, పరాశరుడు, భృగువు, శుక్రుడు, దుర్వాసుడు, వసిష్ఠుడు, క్రతువు, అంగిరసుడు, బలి, వాలిఖిల్యులు, వరుణుడు, అగ్నిదేవుడు, వాయువు, సూర్యుడు, గరుడుడు, దక్షుడు గణపతి వీరందరు శ్రీకృష్ణుని యొక్క గొప్ప భక్తులు. ఆ శ్రీకృష్ణదేవుని భక్తిగలవారందరు అతని అంశరూపులే . అని చెప్పుచు బృహస్పతికి మహాదేవుడు శ్రీకృష్ణమంత్రమును ఉపదేశించెను. లక్ష్మీమాయా కామబీజం జేంతం కృష్ణపదం మునే | పరం పూజావిధానం చ స్తోత్రం చ కవచం మునే || 80 తత్పురశ్చరణం ధ్యానం శుద్ధే మందాకినీ తటే | గురుః సంప్రాప్య తం మంత్రం శంకరాచ్చ జగద్గురోః || 81 విషణ్ణో హి భవాబ్ధౌ చ బభువ తమువాచ హ || 82 లక్ష్మీమాయా కామబీజాక్షరములు చతుర్థీవిభక్త్యంతమైన కృష్ణపదము కలది ఓం శ్రీం హ్రీం క్లీం కృష్ణాయనమః అను శ్రీకృష్ణమంత్రము. ఆ మంత్రముతోపాటు శ్రీకృష్ణ పూజావిధానమును, స్తోత్రమును, కవచమును, తత్పురశ్చరణమును, ధ్యానమును శంకరుడు గంగాతీరమున బృహస్పతికి ఉపదేశించెను. సంసార సాగరమున కొట్టుమిట్టాడుచున్న బృహస్పతి శంకరునితో ఇట్లనెను. ఆజ్ఞాం కురు జగన్నాథ యామి తప్తుం హరేస్తపః | తారా తిష్ఠతు తత్రైవ న తయా మే ప్రయోజనం || 83 పశ్యామి విషతుల్యం చ సర్వం నశ్వర మీశ్వర | శ్రీకృష్ణం శరణం యామి సత్యం నిత్యం చ నిర్గుణం || 84 ఓ మహాదేవ! నన్ను ఆజ్ఞాపించినచో శ్రీహరి తపస్సుచేసికొనుటకు పోవుదును. తార చంద్రుని దగ్గరనే ఉండనిమ్ము . ఆమెవలన నాకెట్టి ప్రయోజనము లేదు, సమస్తము నాకు విషముతో సమానముగా కన్పించుచున్నది. ఇది అంతయు అశాశ్వతమైనది. అందువలన నిత్యుడు, సత్యస్వరూపుడు, నిర్గుణుడగు శ్రీకృష్ణపరమాత్మను శరణు వేడెదను. అని బృహస్పతి అనెను. శ్రీమహాదేవ ఉవాచ - మహాదేవుడిట్లనెను- పరగ్రస్తాం స్త్రియం త్యక్త్వా న ప్రశస్యం తపోమునె | సంభావితస్య దుశ్చర్చా మరణాదతిరుచ్యతే || 85 పురోగచ్ఛ మహాబాగ తమేతం నర్మదాతటం | యత్రబ్రహ్మాదయో దేవాస్తత్రాహం యామి సత్వరం || 86 బృహస్పతీ! తన భార్య ఇతరుల అధీనమునందుండగా తపస్సు చేయుట మంచిదికాదు. మంచివానికి కలిగిన కష్టము మరణముకంటె గొప్పనిది. అందువలన నీవు బ్రహ్మాది దేవతలున్న నర్మదా నదీ తీరమునకు పొమ్ము . నేను కూడ నీవెంటనే అచ్చటికి వచ్చెదనని శంకరుడనెను. శివస్య వచనం శ్రుత్వా య¸° సురగురుః స్వయం | ఆయయో చ మహాభాగః శంకరో నర్మదాతటం || 87 సగణం శంకరం దృష్ట్యా ప్రసన్నదనేక్షణం | ప్రణముర్దేవతాః స సర్వా మనవో మునయస్తథా|| 88 ననామ శంభుః శిరసా విష్ణుం చ కమలోద్భవం | దదాతుస్తౌ మహేశాయ ప్రేవ్ణూzలింగనమాసనం || 89 ఏతస్మిన్నంతరే తత్ర చాగమచ్చ బృహస్పతిః | ప్రణనామ మహాదేవం విష్ణుం చ కమలోద్భవం || 90 శివునియొక్క మాటలు విని వెంటనే బృహస్పతి నర్మదానదీ తీరమునకు బయలుదేరెను. శంకరుడు కూడ వెంటనే అచ్చటకు వచ్చెను. శంకరుడు తన పరివారముతో అక్కడకు రాగా నర్మదానదీ తీరముననున్న దేవతలు, మునులు, మనువులందరు ఆ పరమశివునికి నమస్కరించిరి. శంకరుడు కూడ బ్రహ్మ, విష్ణువులకు నమస్కారము చేసెను. బ్రహ్మవిష్ణువు లా శివుని ప్రేమతో ఆలింగనము చేసికొనిరి. ఆ సమయమున అక్కడకు వచ్చిన బృహస్పతి బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులకు నమస్కరించెను. సూర్యం ధర్మమనంతం చ నరం మాం చ మునీశ్వరాన్ | స్వగురుం పితరం భక్త్యా చావసత్తత్ర సంసది || 91 సంచింత్య మనసా యుక్తిమూచే తత్ర చ సంసది | స్వయం విష్ణుశ్చ భగవాన్ బ్రహ్మాణం చంద్రశేఖరం || 92 బృహస్పతి అక్కడకు వచ్చి సూర్యుని, ధర్మదేవతను, అనంతుని, నరుని, నన్ను (నారాయణుని) మునీశ్వరులను, తన గురువును, తండ్రిని భక్తితో నమస్కరించి ఆ సభలో కూర్చుండెను. అప్పుడు విష్ణుమూర్తి బృహస్పతి గురించి ఒక ఆలోచన చేసి బ్రహ్మాదేవుడు చంద్రశేఖరులతో ఇట్లు వివరించెను. విష్ణురువాచ- విష్ణుమూర్తి ఇట్లు పలికెను- యువాం చ మునయశ్చైవ సముద్ర పులినం ద్రుతం | శుక్రం కంచిచ్చ మధ్యస్థం ప్రస్థాపయితుమర్హథ || 93 విగ్రహేణౖవ విషమం భవిష్యతి నసంశయః | మదాశిషా సురగురుస్తారాం ప్రాప్స్యతి నిశ్చితం || 94 సురైః స్తుతశ్చ సంతుష్టః శుక్రాచోర్యో భవిష్యతి | సురైః శుక్రోహి న జితః కృష్ణచక్రేణ రక్షితః || 95 యువాభ్యాం ప్రార్థ్యమానోzహం యువయోః స్తవనేన చ | శ్వేతద్వీపాదాగతోzస్మి పరితుష్టః స్తవేన చ || 96 శుక్రాశ్రమమసీపర్ణం సర్వాగచ్ఛంతు దేవతాః | రిపుర్బలిష్ఠః స్తోత్రేణ వశీభూత ఇతిశ్రుతిః || 97 ఇత్యుక్త్యా జగతీం నాథస్తత్రైవాంతరధీయత | స్తుతోబ్రహ్మాదిభిర్దేవైః ప్రణతైః పరిపూజితః || 98 మీరిద్దరు మునులు అందరు కలిసి సముద్రతీరమునకుపొండు. అచ్చట శుక్రుని దగ్గరకు ఒక దూతను పంపుడు. యుద్ధమువలన చాలా కష్టములు ఏర్పడును. అందు సంశయము లేదు. అందువలన నా ఆశీర్వచనము వలన బృహస్పతి తనభార్యను తిరిగిపొందును. దేవతలు స్తుతించినచో శుక్రాచార్యులు సంతోషపడును. అందువలన అసీపర్ణమను శుక్రుని ఆశ్రమమునకు మీరందరు కలిసిపోయి అతనిని స్తుతింపుడు. శత్రువు ఎంతటి బలవంతుడైనను పొగిడినచో వశ##మైపోవునని వేదము చెప్పుచున్నది. శుక్రాచార్యుడు శ్రీకృష్ణుని చక్రముచే రక్షింపబడుచున్నందువలన అతనిని దేవతలు జయింపలేరు. అందువలన అతనిని పొగడి పనిని సానుకూలము చేయుటయే మంచిది. మీరు నన్ను ప్రార్థించినందువలన సంతోషపడి శ్వేతద్వీపము నుండి ఇచ్చటకు వచ్చితిని అని శ్రీమన్నారాయణుడు అచ్చటనే అదృశ్యమయ్యెను. గతే చ జగతాం నాథే శ్వేతద్వీపం చ నారద | చింతితాశ్చ సురాః సర్వే విషణ్ణమనసస్తథా || 99 శ్రీమన్నారాయణుడు శ్వేతద్వీపమునకు పోగానే దేవతలమదరు చాలా బాధపడిరి. మునీన్దేవాంశ్చ సంబోధ్య బ్రహ్మ వై తత్ర సంసది | ఉవాచ నీతిసారం తత్సమ్మతం శంకరస్య సః || 100 మునులు దేవతలున్న ఆ సభలో బ్రహ్మదేవుడు వారిని సంబోధించి శంకరునకు సమ్మతమైనది, నీతిసారమగు మాటను ఇట్లు పలికెను. బ్రహ్మోzవాచ - బ్రహ్మదేవుడిట్లు పలికెను. మమ శంభోశ్చ ధర్మస్య విష్ణోర్వా సర్వసాక్షిణః | అస్మాకం చ సమం స్నేహో దైత్యే దేవే చ పుత్రకాః || 101 దైత్యానాంచ గురుం శుక్రం ప్రసన్నశ్చ నిశాకరః | ననాజితశ్చ సురైః శుక్రః పూజితో దితినందనైః || 102 తారాహేతోరహం యామి శుక్రస్య భవనం సురాః | సర్వే సముద్రపులినం యాంతు విష్ణోర్నిదేశతః || 103 ఇత్యుక్త్యా జగతాం ధాతా చాగమత్ శుక్రసన్నిధిం | ప్రయయుర్దేవతా విప్రాః సముద్రపులినం మునే || 104 ఓ దేవతలారా! నాకు శంకరునకు , ధర్మదేవతకు సర్వసాక్షియగు విష్ణువునకు కూడ దైత్యులపై దేవతలపై సమానమైన ప్రేమకలదు. ఇప్పుడు చంద్రుడు దైత్యులకు గురువగు శుక్రుని శరణుజొచ్చెను. శుక్రుని దేవతలు జయింపలేరు. అందువలన అతడు మీమాట వినడు. పైగా అతనిని మీ శత్రువులగు దైత్యులు పూజించుచున్నారు. అందువలన తారకొరకు నేను శుక్రుని ఇంటికి వెళ్ళెదను. మీరందరు సముద్రతీరముననే ఉండుడని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పి తాను శుక్రుని దగ్గరకు పోయెను. బ్రహ్మదేవుని మాటననుసరించి దేవతలందరు సముద్రతీరమునకు పోయిరి. ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితియే ప్రకృతిఖండే నారదనారాయణసంవాదే శ్రీకృష్ణోపదిష్టతారోద్ధరణోపాయజ్ఞానం నామ షష్టితమోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము రెండవదగు ప్రకృతిఖండమున నారద నారాయణుల సంవాదమున తెల్పబడిన శ్రీకృష్ణుడుపదేశించిన తారాదేవి ఉద్ధరణోపాయజ్ఞానమను అరవయవ అధ్యాయము సమాప్తము.