sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
ద్విషష్టితమ్శోధ్యాయః - సురథుడు, వైశ్యుడు వారి కోరికలు సిద్ధించుట నారద ఉవాచ- నారదుడిట్లనెను- కథం రాజా మహాజ్ఞానం సంప్రాప మునిసత్తమాత్ | వైశ్యోముక్తిం మేధసశ్చ తన్మేవ్యాఖ్యాతుమర్హసి ||
1 రాజైన సురథుడు మునిశ్రేష్ఠుడగు మేధసునివలన మహాజ్ఞానము నెట్లు పొందెను. వైశ్యుడుకూడ ఆ మహర్షివలన ముక్తినెట్లు పొందెనో వివరించగలరని ప్రార్థించెను. శ్రీనారాయణ ఉవాచ- శ్రీమన్నారాయణుడిట్లనెను- ధ్రువస్యపౌత్రో బలవాన్ నందిరుత్కళనందనః | స్వాయంభువమనోర్వంశ్యః సత్యవాదీ జితేంద్రియః || 2 అక్షౌహిణీనాం శతకం గృహీత్వాం సైన్యమేవ చ | కోలాం చ వేష్టయామాస సురథస్య మహామతేః || 3 యపద్ధం బభూవ నియతం పూర్ణమబ్దం చ నారద | చిరంజీవీ వైష్ణవశ్చ జిగాయసురథం నృపః || 4 ఏకాకీ సురథో భీతో నందినా చ బహిష్కృతః | నిశాయాం హయమారుహ్య జగామ గహనం వనం || 5 దదర్శ తత్ర వైశ్యం చ పుష్పభద్రానదీ తటే | తయోర్బభూవ సంప్రీతః కృతబాంధవయోర్మునే || 6 వైశ్యేన సార్థం నృపతి రగచ్ఛన్మేధసాశ్రమం | పుష్కరం దురష్కరం పుణ్యక్షేత్రం వై భారతే సతాం || 7 దదర్శ తత్ర నృపతిర్మునిం తం తీవ్ర తేజసం | శిష్యే భ్యశ్చ ప్రవోచం తం బ్రహ్మతత్వం సుదుర్లభం || 8 ధ్రువమహారాజునకు ఉత్కళుడను పుత్రుడుండెను. అతని పుత్రుడు నంది. స్వాయంభువ వంశమున పుట్టిన ఆ మహారాజు చాలాబలవంతుడు. సత్యమును మాట్లాడువాడు, ఇంద్రియములను జయించినవాడు. ఆ రాజు మూరు అక్షౌహిణుల సైన్యము తిసికొని మహాజ్ఞానియైన సురథమహారాజు యొక్క పట్టణమును చుట్టుముట్టెను. వారిద్దరు సంవత్సరము వరకు యుద్ధముచేసిరి. ఆయుద్ధమున చిరంజీవియు, విష్ణుభక్తుడునగు నందిమహారాజు సురథును జయించెను. నంది మహారాజువల్ల తిరస్కృతుడైన సురథుడు భయముతో ఒంటరిగా దట్టమైన అడవిలోనికి పారిపోయెను. ఆ అడవిలో పుష్పభద్రానదీ తీరమున ఆ మహారాజునకు ఒక వైశ్యుడు కనిపించెను. ఆ ఇద్దరు మధ్య స్నేహమేర్పడినది. వారిద్దరు పుష్కరక్షేత్రమునకు వేళ్ళి అచ్చటనున్న మేధోముని ఆశ్రమమునకు పోయిరి. ఆ సమయమున మేధోముని తన శిష్యులకు దుర్లభ##మైన బ్రహ్మతత్వమును గూర్చి చెప్పుచుండెను. రాజా ననాం వైశ్యశ్చ శిరసామునిపుంగవం | మునిస్తౌ పూజయామాస దదౌ తాభ్యాం శుభాశిషం || 9 ప్రశ్నం చకార కుశలం జాతినామ పృథక్ పృథక్ | దదౌ ప్రత్యుత్తరం రాజా క్రమేణ మునిపుంగవం || 10 రాజగు సురథుడు, వైశ్యుడు ఈ ఇద్దరు మునిశ్రేష్ఠుడగు మేధసుని నమస్కరించిరి. ఆ మహర్షి వారిద్దరకు అతిథి సత్కారముచేసి వారి కుశలమును జాతిని పేరును వేరు వేరుగా అడిగెను. అప్పుడు రాజగు సురథుడా మునిపుంగవునికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. సురథ ఉవాచ- సురథుడిట్లనెను- రాజాzహం సురథోబ్రహ్మన్ చైత్రవంశ సముద్భవః | బహిర్భూతః స్వరాజ్యాచ్చ నందినాబలినాzధువా || 11 కిముపాయం కరిష్యామి కథం రాజ్యం భ##వేన్మమ | తన్మాం బ్రూహి మహాభాగ త్వామేవ శరణాగతం || 12 ఆయం వైశ్యః సమాధిశ్చ స్వగృహాచ్చ బహిష్కృతః | పుత్రైః కళ##త్రైర్దైవేన ధనలోభేన ధార్మికః || 13 బ్రాహ్మణాయ దదౌనిత్యం రత్నకోటిం దినే దినే | నిషిధ్యమానః పుత్రైశ్చ కళ##త్రైర్బాంధవైరయం || 14 కోపాన్నిరాకృతసై#్తశ్చ పునరన్వేషితః శుచా | ఆయం గృహం చ న య¸°విరక్తో జ్ఞానవాన్ శుచిః || 15 పుత్రాశ్చ పితృశోకేన గృహం త్యక్త్వా యయుర్వనం | దత్వా దానాని విప్రేభ్యో విరక్తాః సర్వకర్మసు || 16 సుదుర్లభం హరేర్దాస్యం వైశ్యస్యాస్య చ వాంఛితం | కథం ప్రాప్నోతి నిష్కామస్తన్మే వ్యాఖ్యాతు మర్హసి || 17 పూజ్యుడా! నేను చైత్రవంశమున పుట్టిన సురథుడను రాజును. నన్ను బలవంతుడైన నందియను రాజు జయించి పట్టణమునుండి తరిమివేసెను. నేను ఏ ఉపాయమున రాజ్యమును తిరిగిపొందెదనో దానిని మీరు నాకు చెప్పుడు. నేను మిమ్ము శరణు వేడితిని. ఈ వైశ్యుని పేరు సమాధి. ఇతడు పరమధార్మికుడు. ఇతనిని భార్యాపుత్రులు ధనముపైగల ఆశ##చే ఇంటినుంచి వెడలగొట్టిరి. ఈతడు ప్రతిదినము బ్రాహ్మణులకు కోటిరత్నములు దానము చేయుచుండెడువాడు. ఈతడు చేయు దానధర్మములను ఇతని భార్యపుత్రులు వ్యతిరేకించుచుండిరి. వారు కోపముతో ఇతనిని ఇంటినుండి వెళ్ళగొట్టిరి. తరువాత వారు పశ్చాత్తాపపడి రమ్మన్నను విరక్తుడై జ్ఞానవంతుడై తిరిగి ఇంటికిపోలేదు. అతని పుత్రులు పితృశోకముతో విరుక్తులై తమ సంపదనంతయు బ్రాహ్మణులకు దానముచేసి ఇంటిని వదలిపెట్టి అడవికి పోయిరి. చాలా కష్టముతో లభించు శ్రీమరి దాస్యము కావలెనని ఈ వైశ్యుడు కోరుచున్నాడు. కోరికలు లేని ఇతడు ఈ కోరికను ఎట్లు పొందునో మీరు వివరింపుడని పలికెను. శ్రీమేధా ఉవాచ- మేధోమహర్షి ఎట్లు పలికెను- కరోతి మాయయాఛన్నం విష్ణుమాయా దురత్యయా | నిర్గుణస్య చ కృష్ణస్య చ త్రిగుణా విశ్వమాజ్ఞయా || 18 కృపాం కరోతి యేషాం సా ధర్మిణాం చ కృపామయీ | తేభ్యో దదాతి కృపయా కృష్ణభక్తిం సుదర్లభాం || 19 యేషాం మాయావినాం మాయా న కరోతి కృపాం నృప | మాయయా తన్నిబధ్నాతి మోహజాలేన దుర్గతాన్ || 20 నశ్వరేzనిత్యంసంసారే భ్రామయేద్బర్బరా సదా | కుర్వంతీ నిత్యబుద్ధిం చ విహాయ పరమేశ్వరం || 21 దేవమన్యం నిషేవంతే తన్మంత్రం చ జపంతి చ | మిథ్యా కించిన్నిమిత్తం చ కృత్వా మనసి లోభతః || 22 సప్తజన్మసు సంసేవ్య దేవతాశ్చ హరేః కళాః | తదా ప్రకృత్యా కృపయా సేవంతే ప్రకృతిం తదా || 23 సప్తజన్మసు సంసేవ్య విష్ణుమాయాం కృపామయీం | శివేభక్తిం లభంతే తే జ్ఞానానందే సనాతనే || 24 నిర్గుణుడైన శ్రీకృష్ణపరమాత్మయొక్క ఆజ్ఞచే లంఘించుటకు వీలులేనిది, త్రిగుణాత్మికయైన విష్ణుమాయ ప్రపంచమునంతయు తన మాయచే కప్పివేయుచున్నది. ఆ దేవి కృపతో ఎవరిని అనుగ్రహించునో వారికి సుదుర్లభ##మైన భక్తిని ఇచ్చుచున్నది. విష్ణుమాయయగు దుర్గ దుర్మార్గులైన ఎవరిని అనుగ్రహింపదో వారిని తన మాయవలన మోహజాలమున పడవేయును. వారికి అశాశ్వతమైన ఈ లోకమును నిత్యబుధ్ధిని కలిగించును. అట్లే వారికి శ్రీకృష్ణునిగాక ఇతర దేవతలను ఆరాధించు బుద్ధిని కలిగించును. ఇతరదేవతా మంత్రముల జపించునట్లు చేయును. లోభమువలన మనస్సులో మిథ్యయగు ఏదో నిమిత్తమును కల్పించుకొని ఇటునటు తిరుగుదురు. అన్యదేవతలు కూడా శ్రీహరియొక్క అంశరూపులుకావున వారిని ఏడు జన్మలవరకు సేవించి ప్రకృతీదేవియొక్క దయవలన ప్రకృతిని సేవింతురు. ఆ విధముగా విష్ణుమాయయగు ప్రకృతిని ఏడుజన్మలవరకు సేవించి సనాతనుడు, జ్ఞానానందుడగు పరమశివుని భక్తితో సేవింతురు. జ్ఞానాధిష్ఠాతృదేవం చ హరేస్సంసేవ్య శంకరం | అచిరాద్విష్ణుభక్తిం చ ప్రాప్నువంతి మహేశ్వరాత్ || 25 సేవంతే సగుణం సత్వం విష్ణుం విషయిణం తదా | సత్వజ్ఞానాచ్చ పశ్యంతి జ్ఞానం వై నిర్మలం నరాః || 26 నిషేవ్య సగుణం విష్ణం సాత్వికా వైష్ణవా నరాః | లభంతే నిర్గుణ భక్తిం శ్రీకృష్ణే ప్రకృతేః పరే || 27 గృహ్ణంతి సంతస్తద్భక్తా మంత్రం తస్య నిరామయం | నిషేవ్య నిర్గుణం దేవం తే భవంతి చ నిర్గుణాః || 28 అసంఖ్య బ్రహ్మణాంపాతం తే చ పశ్యంతి వైష్ణవాః దాస్యం కుర్వంతి సతతం గోలోకే చ నిరామయే || 29 శ్రీమరియొక్క జ్ఞానాధిష్ఠాన దేవతయగు శివుని సేవించి అతని దయవలన త్వరలోనే శ్రీహరి భక్తిని వారు పొందుచున్నారు. సగుణాత్మకుడు, సత్వస్వరూపియగు విష్ణువును సేవించినందువలన సత్వ జ్ఞానము కలిగి నిర్మలమైన జ్ఞానము పొందుదురు. సాత్విక గుణ సంపన్నులైన వైష్ణవులు సగుణ స్వరూపుడైన విష్ణువును సేవించి ప్రకృతికి అతీతుడు, నిర్గుణుడైన శ్రీకృష్ణభక్తిని పొందుదురు. సత్పురుషులైన శ్రీకృష్ణభక్తులు శ్రీకృష్ణమంత్రమును పొంది ఆ మంత్రమును జపించి నిర్గుణుడైన ఆ స్వామిని సేవించి వీరుకూడా నిర్గుణులగుచున్నారు. ఇట్టి వైష్ణవులు నిరామయమైన గోలోకమున ఉండి ఆ గోలోకవాసుని దాస్యమును సతతము చేయుచుందురు. వారు ఆ గోలోకముననుండి అనేకులైన బ్రహ్మదేవులు గతించుచుండగా వారిని చూచుచుందురు. కృష్ణభక్తాత్ కృష్ణమంత్రం యో గృహ్ణాతి నరోత్తమః | పురుషాణాం సహస్రం చ స్వపితౄణాం సముద్ధరేత్ || 30 మాతా మహానాం సహస్రముద్ధరేన్మాతరం తథా | దాసాదికం సముధృత్య గోలోకం సప్రయాతి చ || 31 భవార్ణవే మహాఘోరే కర్ణధార స్వరూపిణీ | దీనాన్పారయతే నిత్యం కృష్ణభక్త్యా చ నౌకయా || 32 స్వకర్మబధనం ఛేత్తుం వైష్ణవానాం చ వైష్ణవీ | తీక్షశస్త్రస్వరూపా సా కృష్ణస్య పరమాత్మనః || 33 వివేచికా చావరణీ శక్తిర్ద్వి ధా నృప | పూర్వం దదాతి భక్తాయ చేతరాయ పరాత్పరా || 34 సత్యస్వరూపః శ్రీకృష్ణస్తస్మాత్సర్వం చ నశ్వరం చ నశ్వరం | అవైష్ణవానామసతాం కర్మభోగభుజామహో || 36 శ్రీకృష్ణభక్తునినుండి విష్ణుమంత్రోపదేశమునెవరు పొందుదురో వారు తమ తండ్రి వంకనున్న వేయి తరములవారిని, తల్లి పక్షముననున్న వేయితరముల వారిని తల్లిని, తన భృత్యులను అందరిని ఉద్ధరించి గోలోకమునకు పోవును. శ్రీకృష్ణభక్తియను నౌక ద్వారా వైష్ణవియగు దుర్గ మహాభయంకరమైన సంసారమనే సముద్రమునకు పయనించుచున్న దీనులను కర్ణధార రూపిణియై తరింపజేయుచున్నది. ఆదేవి వైష్ణవుల కర్మబంధనములను శ్రీకృష్ణపరమాత్మయొక్క తీక్షణమైన శస్త్ర స్వరూపిణియై ఛేదించుచున్నది. వైష్ణవియగు ఆ శక్తి వివేచికా, ఆవరణీ అనురెండురూపములతోనున్నది. వివేచికా శక్తి శ్రీకృష్ణభక్తునకు ఇతరులకు శ్రీకృష్ణుడు సత్యస్వరూపుడు నిత్యుడనియు, తద్భిన్నములన్నియు అశాశ్వతమైన భావమును కలిగించుచున్నది. వివేచనాత్మకమైన ఈ బుద్ధి మిక్కిలి సనాతనమైనది. తనకు లభించిన లక్ష్మి నిత్యమైనది అనుబుద్ధి ఆవరణీ బుద్ధి. ఇట్టి బుద్ధి విష్ణుభక్తులు కాని కర్మభుజులకు మాత్రముండును. అహం ప్రచేతసః పుత్రః పౌత్రశ్చ బ్రహ్మణోనృప | భజామి కృష్ణమాత్మానం జ్ఞానం సంప్రాస్య శంకరాత్ || 37 గచ్ఛ రాజన్నదీతీరం భజ దుర్గాం సనాతనీం | బుద్ధిమావరణీం తుభ్యం దేవో దాస్యతి కామినే || 38 నిష్కామాయ చ వైశ్యా వైష్ణవాయ చ వైష్ణవీ | బుద్ధిం వివేచికాం శుద్ధాం దాస్యత్యేవ కృపమయీ || 39 ఓరాజా! నేను ప్రచేతసుడను మహర్షి పుత్రుడను. నా తాత బ్రహ్మదేవుడు. నేను శ్రీశంకరునివల్ల కృష్ణ జ్ఞానమును పొంది సనాతనుడగు ఆ పరమాత్మనెల్లప్పుడు ధ్యానించుచున్నాను. అందువలన రాజానీవు నదీతీరమునకు పోయి వైష్ణవియగు, దుర్గాదేవిని పూజింపుము. నీకు రాజ్యమును తిరిగి పొందవలెనను కోరికయున్నందువలన ఆ పరమాత్మ నీకు ఆవరణబుద్ధిని కలిగించును. ఇక కోరికలన్నిటిని త్యజించి దుర్గను సేవించు వైశ్యునకు ఆ దయావతి శుద్ధమైన వివేచికా బుద్ధిని కలిగించును. ఇత్యుక్త్వా చ మునిశ్రేష్ఠో దదౌ తాభ్యాం కృపానిధిః | పూజావిధానం దుర్గాయాః స్తోత్రం చ కవచం మనుం || 40 వైశ్యో ముక్తిం చ సంప్రాప తాం నిషేవ్య కృపామయీం | రాజా రాజ్యం మనుత్వం చ పరమైశ్వర్య మీప్సితం || 41 ఇత్యేవం కథితం సర్వం దుర్గోపాఖ్యానముత్తమం | సుఖదం మోక్షదం సారం కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 42 మిక్కిలి దయగల మేధోమహర్షి వారితో నిట్లని, దుర్గాదేవి పూజావిధానమును, స్తోత్రమును, కవచమును, మంత్రమును వారికి ఉపదేశించెను. వైశ్యుడా స్తోత్రకవచాదికములచే ప్రతిదినము దుర్గాదేవిని సేవించి ఆమె అనుగ్రహము వలన ముక్తిని పొందెను. రాజగు సురథుడా దేవిని పూజించి దయగల ఆ తల్లివలన రాజ్యమును, పరమైశ్వర్యమును, మనుత్వమును పొందెను. నారదమునీ! ఇది దుర్గోపాఖ్యానము. ఇది సుఖమును మోక్షమును కలిగించు శక్తిగలది. ఇతిశ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే సురద మేధస్సందవాదే సురథవైశ్యయోః అఖిలషితసిద్ధిర్నామ ద్విషష్టితమోzధ్యాయః శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదగు ప్రకృతిఖండములోని నారదనారాయణుల సంభాషణమున చెప్పబడిన దుర్గాదేవి యొక్క ఉపాఖ్యానమున కనిపించు సురధమేధో మహర్షి సంవాదనమున సురథునకు, వైశ్యునకు వారివారి కోరికలు లభించు విషయమును తెలుపు అరవై రెండవ అధ్యాయము సమాప్తము.