sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
చతుష్షష్టితమోzధ్యాయః - దుర్గాపూజ, ఆ దేవి బలికి ఉపయోగించు పశువులు నారాయణ ఉవాచ- నారాయణుడిట్లనెను- రాజా యేన ప్రకారేణ భ##జే తాం ప్రకృతిం పరాం | తత్ శ్రూయతాం మహా భాగ వేదోక్తం క్రమమేవ చ || 1 స్నాత్వాzచమ్య మహారాజః కృత్వా న్యాసత్రయం తదా | స్వకరాంగాంగ మంత్రాణాం భూతశుద్ధిం చకార సః || 2 ప్రాణాయామం తతః కృత్వా కృత్వా చ శంఖ శోధనం | ధ్యాత్వా దేవీం చ మృణ్మయ్యాం చకారావాహనం తదా || 3 పునర్ధ్యాత్వా చ భక్త్యా చ పూజాయామాస భక్తితః | దేవ్యాశ్చాzపి దక్షిణ భాగే సంస్థాప్య కమలాలయాం || సంపూజ్య భక్తిభావేన భక్త్యా పరమధార్మికః | దేవషట్కం సమావాహ్య దేవ్యాశ్చ పురతోఘటే || 5 భక్త్వా చ పూజయామాస విధిపూర్వం చ నారద | గణశం చ దినేశం చ వహ్నిం విష్ణుం శివం శివాం || 6 దేవషట్కం చ సంపూజ్య నమస్కృత్య విచక్షణః | తదా ధ్యాయేన్మహాదేవీం ధ్యానేనానేన భక్తితః || 7 ధ్యానం చ సామవేదోక్తం పరంకల్పతరుం మునే | ధ్యాయేన్నిత్యం మహాదేవీం మూలప్రకృతిమీశ్వరీం || 8 బ్రహ్మవిష్ణు శివాదీనాం పూజ్యాం పంద్యాం సనాతనీం | నారాయణీం విష్ణుమాయాం వైష్ణవీం విష్ణుభక్తిదాం || 9 సర్వస్వరూపాం సర్వేషాం సర్వాధారాం పరాత్పరాం | సర్వవిద్యా సర్వమంత్ర సర్వశక్తి స్వరూపిణీం || 10 సగుణాం నిర్గుణాం సత్యాం వరాం స్వేచ్ఛామయీం సతీం | మహావిష్ణోశ్చ జననీం కృష్ణస్యార్ధాంగ సంభవాం || 11 కృష్ణప్రియాం కృష్ణశక్తిం కృష్ణబుద్ధ్యధిదేవతాం | కృష్ణస్తుతాం కృష్ణపూజ్యాం కృష్ణవంద్యాం కృపామయీం || 12 తప్తకాంచన వర్ణాభాం కోటి సూర్యసమప్రభాం | ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం భక్తానుగ్రహ కారికాం || 13 దుర్గాం శతభుజాం దేవీం మహద్దుర్గతి నాశినీం | త్రిలోచనప్రియాం సాధ్వీం త్రిగుణాం చ త్రిలోచనాం || 14 త్రిలోచన ప్రాణరూపాం శుద్ధార్ధ చంద్రశేఖరాం | బిభ్రతీం కబరీభారం మాలతీమాల్యమండితం || 15 వర్తులం వామవక్త్రం చ శంభోర్మానస మోహినీం | రత్నకుండలయుగ్మేన గండస్థల విరాజితాం || 16 నాసా దక్షిణభాగేన బిభ్రతీం గజమౌక్తికం | అమూల్యరత్నం బహుళం బిభ్రతీం శ్రవణోపరి || 17 ముక్తాపంక్తి వినింద్యైక దంతపంక్తి సుశోభితాం | పక్వబింబాధరోష్ఠీం చ సుప్రసన్నాం సుమంగళాం || 18 చిత్రపత్రావళీ రమ్య కపోల యుగళోజ్వలాం | రత్నకేయూరవలయ రత్నమంజీర రంజితాం || 19 రత్నకంకణ భూషాఢ్యాం రత్న పాశక శోభితాం | రత్నాంగుళీయనికరైః కరాంగుళి చయోజ్వలాం || 20 పాదాంగుళినఖాసక్తాలక్తరేఖా సుశోభనాం | వహ్నిశుద్ధాంశుకాధానాం గంధచందన చర్చితాం || 21 బిభ్రతీం స్తనయుగ్మం చ కస్తూరీ బిందుశోభితం | సర్వరూపగుణవతీం గజేంద్రమందగామినీం || 22 అతీవ కాంతాం శాంతాం చ నితంతాం యోగసిద్ధిషు | విధాతుశ్చ విధాత్రీం చ సర్వధాత్రీం చ శకంరీం || 23 శరత్పార్వణ చంద్రాస్యామతీవ సుమనోహరాం | కస్తూరీ బిందుభిస్సార్ధమధశ్చందన బిందునా ||24 సిందూరబిందునా శశ్వత్ ఫాలమధ్యస్థలోజ్వలాం | శరన్మద్యాహ్న కమల ప్రభామోచన లోచనాం || 25 చారుకజ్జల రేఖాభ్యాం సర్వతశ్చ సముజ్జ్వలాం | కోటి కందర్ప లావణ్యలీలా నిందిత విగ్రహాం || 26 రత్నసింహాసనస్థాం చ సద్రత్న ముకుటోజ్వలాం | సృష్టౌ స్రష్టుః శిల్పరూపాం దయాం పాతుశ్చ పాలనే || 27 సంహార కాలే సంహర్తుః పరాం సంహార రూపిణీం | నిశుంభ శుంభమథినీం మహిషాసుర మర్దినీం || 28 పురాత్రిపురయుద్ధే చ సంస్తుతాం త్రిపురారిణా | మధుకైటభయోర్యుద్ధే విష్ణుశక్తి స్వరూపిణీం || 29 సర్వదైత్య నిహంత్రీం చ రక్తబీజ వినాశినీం | నృసింహ శక్తిరూపాం చ హిరణ్య కశిపోర్వధే || 30 వరాహశక్తిం వారాహే హిరణ్యాక్షవధే తథా | పరబ్రహ్మస్వరూపాం చ సర్వశక్తిం సదా భ##జే || 31 రాజగు సురథుడు ప్రకృతిరూపిణియగు ఆ దుర్గాదేవిని ఎట్లు పూజించెనో ఆ విషయమును నీకు చెప్పెదను. మహారాజు స్నానము చేసి ఆచమనము చేసి దుర్గాదేవిని పూజింపనారంభించెను. తొలుత నా మహారాజు అంగన్యాసము. కరన్యాసము, మంత్రాంగన్యాసమను మూడు న్యాసములు చేసి తరువాత భూతశుద్ధిని చేసెను. తరువాత మూడుసార్లు ప్రాణాయామమును చేసి శంఖజలముచే ఆ దేవిని అభిషేకించెను. ఆ తరువాత మట్టితో చేసిన దేవతా ప్రతిమయందు ఆ దేవిని ఆవాహన చేసెను. తరువాత ఆ దేవిని మరల ధ్యానిచి భక్తితో ఆమెను. పూజించెను. దుర్గాదేవి పూజచేయునప్పుడు ఆ దేవి కుడివైపు మహాలక్ష్మీదేవి ప్రతిమనుంచెను. ఆ మహాలక్ష్మిని భక్తితో పూజించి దుర్గాదేవి ముందున్న ఘటమున గణపతిని, సూర్యుని, అగ్నిని, విష్ణువును, శివుని, దుర్గాదేవిని, (దేవషట్కమును) ఆవాహన చేసి పూజించెను. దేవషట్కమును పూజించి నమస్కరించి తరువాత వేదమునందు చెప్పబడిన ఈ ధ్యానశ్లోకములతో దుర్గాదేవిని అతడు స్తుతించెను. ఆ మహాదేవి మూలప్రకృతి, ఈశ్వరి, బ్రమ్మవిష్ణుశివాది దేవతలచే ఎల్లప్పుడు నమస్కరింపతగినది. పూజింపదగినది, ఆదేవి సనాతని, నారాయణి, విష్ణుమాయ విష్ణుభక్తినొసగు దేవత, సర్వస్వరూప, అందరకు ఆధారభూత, పరాత్పర, సమస్తవిద్యలు, సమస్తమంత్రములు, సమస్త శక్తులయొక్క స్వరూపిణి. ఆమె సగుణ, నిర్గుణ, సత్వస్వరూపిణి, స్వేచ్ఛామయి, సతి, మహావిష్ణువుయొక్క మాత, శ్రీకృష్ణుని అర్ధాంగమునుండి జన్మించినది. ఆ దేవత శ్రీకృష్ణునకు ప్రియ, శ్రీకృష్ణశక్తి స్వరూపిణి. శ్రీకృష్ణబుద్ధికి అధిదేవత. శ్రీకృష్ణునిచేత స్తుతింపబడినది. కృష్ణపూజ్య, కృష్ణవంద్య, కృపగలది, ఆ దేవి మేలిమి బంగారువంటి వన్నెగలది. కోటి సూర్యులతో సమానమైన కాంతిగలది. చిరునవ్వుతోనున్న ముఖముతో భక్తజనులనెల్లప్పుడు అనుగ్రహించును. ఆ దుర్గకు నూరు భుజములు కలవు. భక్తుల కష్టములనన్నిటిని తొలగించును. శివునకు ప్రియురాలు, సత్వరజస్తమో గుణములు, త్రిలోచనములు కలది. ముక్కంటికి ప్రాణములవంటిది. శిరస్సున అర్ధచంద్రుని ధరించునది. మాలతీ మాలలు కొప్పునగలది. ఆదేవి ముఖము గండ్రము అదముగా ఉండును. రత్నకుండలములు ఆ దేవి చెవులకు కలవు. ముక్కుయొక్క కుడివైపు పెద్దనైన ముత్యపు పోగును ధరించును. ఆదేవి చెవిపైన అమూల్యమైన రత్నములున్నవి. ముత్యములను మించిన పలువరుస కలదు. ఆమె పెదవులు పండిన దొండపండువలె ఉండును. చెంపలపై చిత్రవిచిత్రములైన పత్రములున్నవి. చేతులకు రత్నకేయూరములు కాళ్ళకు రత్నమంజీరములు ధరించినది. అనేక విధములైన రత్నాభరణములు ఆ దేవి శరీరమున కలవు. పాదములు, చేతులయొక్క గోళ్ళకు లత్తుకను అలంకరించుకొనినది. ఆ దేవి ధరించిన వస్త్రము మిక్కిలి పరిశుద్ధమైనది. ఆమె శరీరమునకంతా గంధమును నద్దుకొన్నది. స్తనములపై కస్తూరి చుక్కలున్నవి. ఆమె సర్వరూపగుణవతి. గజేంద్రమువలె మందగమనము కలది. మిక్కిలి అందమైనది. శాంతురాలు, విధాతనే సృష్టించునది. శరత్కాలచంద్రునివంటి ముఖముగలది. ముఖమున కస్తూరి బిందువులు దానికింద చందనబిందువులు, దానికి కింది సిందూరబిందువులు కలది. ఆ దేవత నయనములు శరత్కాల మధ్యాహ్న సమయమున కనిపించు పద్మములవలె ఉన్నవి. కాటుకరేఖలు ఆమె కండ్లలో కనిపించును. ఆమె కోటిమన్మథుల లావణ్యముకలది. రత్నసింహాసనముపై నున్న ఆ దేవి మంచి రత్నములున్న కిరీటమును ధరించినది. సృష్టికర్తయగు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినపుడు శిల్పముగా, జగద్రక్షకుడైన మహావిష్ణువు రక్షించునపుడు కృపామయిగా, సంహారకర్తయగు రుద్రుడు సంహారము చేయుచున్నప్పుడు సంహారరూపిణిగా కనిపించును. ఆమె శుంభనిశుంభులను, మహిషాసురుని సంహరించినది. త్రిపురాసురయుద్ధమున త్రిపురారియైన శివుడు ఆ దేవిని స్తుతించి విజయము పొందగా, శ్రీమహావిష్ణువు మధుకైటభులతో యుద్ధము చేయుచున్నపుడామె విష్ణుశక్తిస్వరూపిణియై అతనికి విజయమును కలిగించినది. హిరణ్యకశిపుతో నృసింహస్వామి పో%ాడునపుడు నృసింహశక్తిగా, హిరణ్యాక్ష వధ జరుగుచున్నప్పుడు వరాహస్వామికి వరాహశక్తిగా అవతరించింది. ఆమె రక్తబీజులను, ఇతరరాక్షసులను సంహరించినది. పరబ్రహ్మస్వరూపిణి, ఆ సర్వశక్తి రూపిణియగు ఆ దేవతను ఎల్లప్పుడు నమస్కరింతును అని సురథమహారాజు ఆ దుర్గాదేవిని భక్తిపూర్వకముగా ధ్యానించెను. ఇది భగవతియొక్క ధ్యాన విధానము- ఇతి ద్యాత్వా స్వశిరసి పుష్పం దత్వా విచక్షణః | పునర్ధ్యాత్వా చైవ భక్త్యా కుర్యాదావాహనం తతః || 32 ప్రకృతేః ప్రతిమాం దృత్యా మంత్రమేవం పఠేన్నరః | జీవన్యాసం తతః కుర్యాన్మనునాzనేన యత్నతః || 33 ఈ విధముగా దుర్గాదేవిని ధ్యానించి తన శిరస్సుపై ఒక పుష్పమునుంచుకొని మరల ఆ దేవిని ధ్యానంచి ఆవాహన చేయవలెను. ప్రకృతిరూపిణియగు ఆ దుర్గాదేవియొక్క ప్రతిమను చేతిలో ధరించి ఈ మంత్రముచే జీవన్యాసమును చేయవలెను. ఏహ్యేహి భగవత్యంబ శివలోకాత్సనాతని | గృహాణ మమ పూజాం చ శారదీయాం సురేశ్వరి || 34 ఇహాగచ్ఛ జగత్పూజ్యే తిష్ఠ తిష్ఠ మహేశ్వరి | హే మాతరస్యామర్చాయాం సన్నిరుద్ధా భవాంభికే || 25 ఇహాzగచ్ఛంతు త్వత్ప్రానాశ్చాధిప్రాణౖః సహాzచ్యుతే | ఇహాzగచ్ఛంతు త్వరితం తవైవ సర్వశక్తయః || 36 ఓం హ్రీం శ్రీం క్లీం చ దుర్గాయై వహ్నిజాయాంతమేవ చ | సముచ్చార్యోరసి ప్రాణాః సంతిష్ఠంతు సదాశివే || 37 సర్వేంద్రియాధిదేవాస్తే ఇహాzగచ్ఛంతు చండికే | తే శక్తయోzత్రాగచ్ఛంతు ఇహాగచ్ఛంతు ఈశ్వరాః || 38 స ఇహాzగచ్చేత్యావాహ్య పరిహారం కరోతి చ | మంత్రేణానేన విప్రేంద్ర తత్ శ్రుణుష్వ సమాహితః || 39 సనాతనియగు ఓ తల్లీ శివలోకమునుండి ఇచ్చటకు వచ్చి నేను చేయు శరత్కాలపూజను స్వీకరింపుము. జగత్పూజ్యవైన మహేశ్వరి | ఇచ్చటకు వచ్చి ఈ అర్చామూర్తిలో నీవుండుము. ఓ అచ్యుతే! నీ ప్రాణములు అధిప్రాణములతో కలసి ఈ అర్చామూర్తియందు ప్రవేశించుగాక! అట్లే సర్వశక్తులు వెంటనే ఈ మూర్తియందు రానిమ్ము. ఓం హ్రీం శ్రీం క్లీం దుర్గాయై స్వాహా అను మంత్రముచే ఆ దేవి ప్రాణములను ఈ మూర్తియందు ఆవాహన చేయవలెను. అట్లే సర్వేంద్రియాధిదేవతలను, సర్వశక్తులను, ''ఇహాzగచ్ఛ'' అని ఆవాహనము చేయవలెను. తరువాత ఈ మంత్రముచే సంహారమును చేయవలెను. స్వాగతం భగవత్యంబ శివలోకాచ్ఛివప్రియే | ప్రసాదం కురు మాం భ##ద్రే భద్రకాళి నమోzస్తుతే || 40 ధన్యోzహం కృతకృత్యోzహం సఫలం జీవనం మమ | ఆగతాzసి యతో దుర్గే మహేశ్వరి మదాలయం || 41 అద్యమే సఫలం జన్మ సార్థకం జీవనం మమ | పూజయామి యతో దుర్గాం పుణ్యక్షేత్రే చ భారతే || 42 భారతే భవతీం పూజ్యాం దుర్గాం యః పూజయేద్భుధః | సోzంతే యాతి చ గోలోకం పరమైశ్వర్యవానిహ || 43 కృత్వా చ వైష్ణవీ పూజాం విష్ణులోకం వ్రజేత్ సుధీః | మహేశ్వరీం చ సంపూజ్య శివలోకం చ గచ్ఛతి || 44 సాత్వికీ రాజసీ చైవ త్రిధాపూజా చ తామసీ | భగవత్యాశ్చ వేదోక్తా చోత్తమా మధ్యమాzధమా || 45 సాత్వికీ వైష్ణవానాం చ శాక్తాదీనం చ రాజసీ | అదీక్షితానామసతామన్యేషాం తామసీ స్మృతా || 46 జీవహత్యావిహీనా యా వరాపూజాతు వైష్ణవీ | వైష్ణవా యాంతి గోలోకం వైష్ణవీ బలిదానతః || 47 మహేశ్వరీ రాజసీ చ బలిదానం సమన్వితా | శాక్తాదయో రాజసాశ్చ కైలాసం యాంతి తే తథా || 48 కిరాతాస్త్రిదివం యాంతి తామస్యా పూజయా తయా | త్వమేవ జగతాం మాతః చతుర్వర్గ ఫలప్రదా || 49 సర్వశక్తి స్వరూపా చ కృష్ణస్య పరమాత్మనః | జన్మమృత్యు జరావ్యాధిహరా త్వం చ పరాత్పరా || 50 సుఖదా మోక్షదా భద్రా కృష్ణభక్తిప్రదా సదా | నారాయణి మహమాయే దుర్గే దుర్గతినాశిని || 51 దుర్గేతి స్మృతిమాత్రేణ యాతి దుర్గం నృణామిహ | ఇతికృత్వా పరీహారం దేవ్యా వామే చ సాధకః || 52 ఓ తల్లీ శివలోకమునుంచి వచ్చిన నీకు స్వాగతము. ఓ భద్రకాళి! నన్ను ఎల్లప్పుడు అనుగ్రహింపుము. ఓ దుర్గా! నీవు నా ఇంటికి వచ్చినందువలన నేను ధన్యుడనైతిని. నా జన్మ ధన్యమైనది. నిన్ను ఈ పుణ్యక్షేత్రమగు భారత క్షేత్రమున పూజించుచున్నందువలన నా జీవితము ధన్యమైనది. ఈ భారత భూభాగమున నిన్ను పూజించువాడు పరమైశ్వర్యమును, జీవితాంతమున గోలోకమును పొందును. వైష్ణవియగు ఈ దేవతను పూజించినచో విష్ణులోకము సులభముగా లభించును. అట్లే మహేశ్వరియగు ఈ దేవిని పూజించినచో శివలోకమగు కైలాసము లభించును. ఆ దుర్గాదేవియొక్క పూజ సాత్వికీ, రాజసీ, తామసీ అని మూడు విధములు, వీటిలో సాత్వికీ పూజ చాల శ్రేష్ఠమైనది. రాజసీపూజ మధ్యమమైనది. తామసీపూజ అధమమైనది. వైష్ణవులు సాత్వికపూజ చేయగా శాక్తులు, శైవులు మొదలగువారు రాజసీ పూజను చేయుదురు. శ్రీకృష్ణమంత్రమును గురుముఖతః పొందనివారు, అసత్పురుషులు చేయుపూజ తామసి, జీవహత్య జరుపక చేయు పూజ వైష్ణవీపూజ ఇట్టి పూజచేసిన విష్ణుభక్తులు గోలోకమునకు పోవుదురు. జీవహత్య లేక బలితోనున్న పూజను చేసి కైలాసమును పొందుదురు. తామసీపూజ చేసిన కిరాతులు మొదలగు అనాగరికులు స్వర్గలోకమునకు వెళ్ళుదురు. నీవు లోకముల కన్నిటికి మాతృదేవతవు, నీ పూజవలన ధర్మార్థ కామమోక్షములనే చతుర్వర్గములు లభించును. నీవు శ్రీకృష్ణ పరమాత్మయొక్క సర్వశక్తి స్వరూపిణివి. పరాత్పరవగు నీవు జన్మ, మృత్యు, జర వ్యాధి మొదలగు వానిని పోగొట్టెదవు. నీవు నారాయణివి, మహామాయవు, దుర్గతులను తొలగించు దుర్గాదేవివి,. నీవు శ్రీకృష్ణపరమాత్మయొక్క శక్తి స్వరూపిణివి. దుర్గా అను పదమును విన్నంతనే మానవుల కష్టములన్నియు నశించును. ఈవిధముగా దేవి పరిహారమును చేయు సాధకుడు దేవియొక్క ఎడమవైపున కూర్చుండవలెను. అని నారాయణడు నారదునితో ననెను. త్రిపద్యా ఉపదిష్టాత్తు శంఖం సంస్థాపయేత్తు సః | తత్ర దత్వా జలం పూర్ణం దూర్వాం పుష్పంచ చందనం || 53 ధృత్వా దక్షణ హస్తేన మంత్రమేవం పఠేన్నరః | శంఖమును ముక్కాలిపీటపైన పెట్టి ఆ శంఖమునిండ నీరును పోయవలెను. అందుగఱకను, పుష్పమును, చందనమును వేసి ఆ శంఖమును కుడిచేతిలో నుంచుకొని ఈ మంత్రమును పఠించవలెను. పుణ్యస్త్వం శంఖ పుణ్యానాం మంగళానాం చ మంగళం | ప్రభూతః శంఖచూడాత్త్వం పురా కల్పే పవిత్రకః || 54 తతోzర్ఘ్యపాత్రం సంస్థాప్య విధినాzనేన పండితః | దత్వా సంపూజయేద్దేవీ ముపచారాంశ్చ షోడశ || 55 త్రికోణమండలం కృత్వా సజలేన కుశేన చ | కూర్మం శేషం ధరిత్రీం చ పూజయేత్తత్ర ధార్మికః || 56 త్రిపదీం స్థాపయేత్తత్ర త్రిపద్యాం శంఖమేవ చ | శంఖే త్రిభాగతోయం చ దత్వా సంపూజయేత్తతః || 57 గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి | నర్మదే సింధు కావేరి చంద్రభాగే చ కౌశికి || 58 స్వర్ణరేఖే కనఖలే పారిభ##ద్రే చ గండకి | శ్వేతగంగే చంద్రరేఖే పంపే చంపే చ గోమతి || 59 పద్మావతి త్రిపర్ణాశే విపాశే విరజే ప్రభో | శతహ్రదే చేలగంగే జలేzస్మిన్ సన్నిధింకురు || 60 ఓ శంఖమా నీవు చాలా పవిత్రమైనదానివి. మంగళములకు మంగళ##మైనదానివి. పూర్వము నీవు శంఖచూడునివలన పుట్టిన దానవు. అందువలననే పరమ పవిత్రమైన దానవగుచున్నావు. అని అర్ఘ్యపాత్రమును శాస్త్ర పద్ధతిలో అచ్చటనుంచి దుర్గాదేవిని షోడశోపచారములతో పూజింపవలెను. తడిసిన దర్భతో త్రికోణాకృతి గల మండలమును చేసి అచ్చట కూర్మమును, ఆదిశేషుని, భూమిని ఒకదానిపైనొకటి ఉన్నట్లు భావించి పూజింపవలెను. ఆస్థలమున ముక్కాలిపీటను వేసి దానిపై శంఖమునుంచవలెను. ఆ శంఖమున మూడువంతులవరకు నీరును పోసి ఆ నీటినిట్లు భావింపవలెను. ఓ గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి, చంద్రభాగ, కౌశికి, స్వర్ణరేఖ, కనఖలమా, సారిభద్రమా, గండకి, శ్వేతగంగ, చంద్రరేఖ, పంప, చంప, గోమతి, పద్మావతి, త్రిపర్ణాశ, విపాశ, విరజ, శతహ్రద, ఇంకను భూమిపైనున్న గంగలారా మీరందరు నా పూజాజాలమున ఉండుడని నదులనన్నిటిని ప్రార్థింపవలెను. వహ్నిం సూర్యం చ చంద్రం చ విష్ణుం చ వరుణం శివం | పూజయేత్తత్ర తోయేన తులస్యా చందనేన చ || 61 ప్రత్యేకం వై తతో దద్యాదుపంచారాంశ్చ షోడశ | ఆసనం వసనం పాద్యం స్నానీయమనులేపనం || 62 మధుపర్కం గంధమర్ఘ్యం పుష్పం నైవేద్యమీప్సితం | పునరాచమనీయం చ తాంబూలం రత్నభూషణం || 63 ధూపం ప్రదీపం తల్పం చేత్యుపచారాస్తు షోడశ || 64 తొలుత అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, వరుణుడు, శివుడు అనువారిని నీరు, తులసి, చందనములతో పూజింపవలెను, తరువాత ఒక్కొక్క దేవతను ప్రత్యేకముగా షోడశోపచారములతో పూజింపవలెను. అవి ఆసనము, వస్త్రము, పాద్యము, స్నానీయము, అనులేపనము, మధుపర్కము, గంధము, అర్ఘ్యము, పుష్పము, నైవేద్యము, ఆచనమనీయము , తాంబూలము, రత్నభూషణము, ధూపము, ప్రదీపము, తల్పము అనునవి. వీటిలో ఆసనమంత్రము - అమూల్యరత్న సంక్లుప్తం నానాచిత్ర విరాజితం | వరం సింహాసనం శేష్ఠం గృహ్యతాం శంకర ప్రియే || 65 ఓ శంకరప్రియా! అనేక రత్నరచితము అనేక చిత్రములు కలది అగు సింహాసనమును నీవు పరిగ్రహింపుము. వస్త్రమంత్రము- అనంతసూత్రప్రభవమీశ్వరేచ్ఛా వినిర్మితం | జ్వలదగ్ని విశుద్ధం చ వసనం గృహ్యతాం శివే || 66 ఓ శివుని ప్రియురాలా! అనేకమైన సూత్రములతో, ఈశ్వరుని కోరిక ప్రకారము నిర్మించబడినది వహ్నివలె పరిశుద్ధమైనది అగు వస్త్రమును స్వీకరింపుము. పాద్యమంత్రము- అమూల్యరత్నపాత్రస్థం నిర్మలం జాహ్నవీజలం | పాదప్రక్షాళనార్థాయ దుర్గే దేవి ప్రగృహ్యతాం || 67 ఓ దుర్గా! అమూల్యమైన రత్నపాత్రలోనున్న ఈ గంగా జలమును నీ పాదములు కడుగుట కొరకు స్వీకరింపుము. అమలేపన మంత్రము- కస్తూరీ కంకుమాక్తం చ సుగంధి ద్రుతచందనం | సువాసితం జగన్నాతః గృహ్యత్యామనులేపనం || 69 ఓ జగన్మాతా కస్తూరీ కుంకుమలు, చందనములతో సువాసితమైన ఈ అనులేపనమును నీవు స్వీకరింపుము. మధుపర్కమంత్రము- మాధ్వీకం రత్నపాత్రస్థం సుపవిత్రం సుమంగళం | మధుపర్కం మహాదేవి గృహ్యతాం ప్రీతిపూర్వకం || 70 ఓ దేవి రత్నపాత్రలోఉన్న పవిత్రమైన మధుపర్కమును నీవు స్వీకరింపుము. గంధమత్రము- సుగంధమూల చూర్ణం చ సుగంధ ద్రవ్య సంయుతం | సుపవిత్రం మంగళార్హం దేవి గంధం గృహాణ మే || 71 ఓ దేవి! సువాసనగల చూర్ణములు, ద్రవ్యములు కల ఈ గంధము చాలా పవిత్రమైనది. మంగళకరమైనది. దీనిని నీవు దయతో పరిగ్రహింపుము. ఆర్ఘ్యమంత్రము- పవిత్రం శంఖపాత్రస్థం దూర్వాపుష్పాక్షతాన్వితం | స్వర్గమందాకినీతోయమర్ఘ్యం చండి గృహాణ మే || 72 ఓ చండి ఆకాశగంగయొక్క నీటిని శంఖపాత్రలో ఉంచితిని. అందు దర్భ, పుష్పములు, అక్షతలు కలవు, ఇట్లు పవిత్రమైన ఈ అర్ఘ్యమును నీవు గైకొనవమ్మా! మాల్యమంత్రము- సుగంధి పుష్పశ్రేష్ఠం చ పారిజాత తరూద్భవం | నానాపుష్పాది మాల్యాని గృహ్యతాం జగదంబికే || 73 ఓ జగన్మాతా! పారిజాతపుష్పములు మొదలగు పుష్పములచే చేయబడిన ఈ పుష్పమాలలను నీవు స్వీకరింపుము. నైవేద్యమంత్రము- దివ్యం సిద్ధాన్నమాషాన్న పిష్టకం సాయసాన్వితం | మిష్టాన్నం లడ్డుక ఫలం నైవేద్యం గృహ్యతాం శివే || 74 సిద్ధాన్నము, పప్పన్నము, పిండివంటలు, పాయసము, లడ్డూలు కల ఈ అన్నమును నైవేద్యముగా స్వీకరింపుము. ఆచమనీయ మంత్రము- సువాసితం శీతతోయం కర్పూరాది సుసంస్కృతం | మయానివేదితం భక్త్యా గృహ్యతాం శైలం కన్యకే ||75 ఓ శైలకన్యకా! నీవు కర్పూరము మొదలగు సువాసనా ద్రవ్యములు కలిపిన ఈ చల్లని నీరును స్వీకరింపుము. తాంబూల మంత్రము- గువాకపర్ణచూర్ణం చ కర్పూరాది సువాసితం | సర్వభోగకరం గమ్యం తాంబూలం దేవి గృహ్యతాం || 76 ఓ దేవి తమలపాకులు, సున్నమ, కాచువంటి చూర్ణములు, కర్పూరము, మొదలగు సుగంధ ద్రవ్యములలో సువాసితమైనది అగు తాంబూలమును నీవు స్వీకరింపుము. భూషణమంత్రము- అమూల్య రత్నసారైశ్చ ఖచితం చేశ్వరేచ్ఛయా | సర్వాంగ శోభనకరం భూషణం దేవి గృహ్యతాం || 77 ఓదేవి! మిక్కిలి విలువైన రత్నములచే నిర్మించబడినవి, సమస్త అవయవములకు అందమును చేకూర్చు ఈ ఆభరణములను దయతో స్వీకరింపుము ధూపమంత్రము- తరు నిర్యాస చూర్ణం చ గంధవస్తు సమన్వితం | హుతాశన శిఖాశుద్ధం ధూపం దేవి చ గృహ్యతాం || 78 ఓ దేవి! చెట్లనుండి వెలువడిన జిగురు పదార్ధముల చూర్ణమున సుగంధ ద్రవ్యములన్ని కలిసి వాసనాభరితమై పరమశుద్ధమైన ఈ ధూపమును నీవు స్వీకరింపుము. దీపమంత్రము- దివ్యరత్న విశేషం చ సాం ద్వ్రాంత నివారకం | సుపవిత్రం ప్రదీపం చ గృహ్యతాం పరమేశ్వరి || 79 ఓ పరమేశ్వరి! నేను నీకిచ్చు దీపము దివ్యరత్నములచే నిర్మితమైనది. ఇది దట్టమైయున్న చీకట్లను సహితము పారద్రోలును. ఇది పరమపవిత్రమైనది. ఈ దీపమును నీవు తీసికొనుము. తల్పమత్రము- రత్నసారసమాకీర్ణం దివ్యం పర్యంకముత్తమం | సూక్షవసై#్త్రశ్చ సంస్యూతం దేవి తల్పం ప్రగృహ్యతాం || 80 ఓ దేవి! ఈ మంచము అమూల్యరత్నములచే నిర్మితమైనది. దీనిపై నున్న తల్పము సన్నని వస్త్రములచే నిర్మితమైనది. ఇట్టి పాన్పును నీవు స్వీకరింపుము. ఏవం సంపూజ్య తాం దేవీం దద్యాత్పుష్పాంజలిం మునే | తతోzష్టనాయకాః దేవీః యత్నతః పరిపూజయేత్ 81 ఉగ్రచండాం ప్రచండాం చ చండోగ్రాం చండనాయికం | అతి చండాంచ చండాం చ చండాం చండవతీం తథా || 82 పద్మే చాష్టదళే చైతాః ప్రాగాదిక్రమతస్తథా | పంచోపచారైః సంపూజ్య భైరవాన్ మధ్యదేశతః 83 అదౌ మహాభైరవం చ తథా సంహార భైరవం | అసితాంగ భైరవం చ రురుభైరమేవ చ కాలభైరవమస్యేవం క్రోధభైరవమేవ తామ్రచూడం చంద్రచూడమంతే వై భైరవద్వయం 85 ఏతాన్సంపూజ్య మధ్యే వై నవ శక్తీశ్చ పూజయేత్ || ఈ విధముగా షోడశోపచారములతో ఆ దుర్గాదేవిని పూజించి పుష్పాంజలిని ఇవ్వవలెను. తరువాత అష్టనాయకులను అష్టదేవతాస్త్రీలను పూజించవలెను. ఆ దేవతాస్త్రీల పేర్లు ఇవి. ఉగ్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, అతిచండ, చండ, చండ, చండవతి అనువారు. వీరిని అష్టదళ పద్మమున తూర్పునుండి కుడిగా ఎనిమిది దిక్కులలో ఎనిమిది దళములపైనుంచి పంచోపచారములచే పూజింపవలెను. తరువాత అష్టదేవతా స్త్రీలమధ్య అష్టభైరవుల నుంచి వారిని పూజింపవలెను. వారి పేర్లివి. మాహాభైరవుడు, సంహార భైరవుడు, అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, కాలభైరవుడు, క్రోధ భైరవుడు, తామ్రచూడుడు, చంద్రచూడుడను ఇద్దరు భైరవులు, వీరందరినీ పూజించిన తరువాత అష్టదళ పద్మములో తొమ్మండుగురు శక్తి దేవతలనుంచి పూజింపవలెను. తత్రపద్మే చాష్టదళే మధ్యే వై భక్తి పూర్వకం || 86 బ్రహ్మణీం వైష్ణవీం చైవ రౌద్రీం మహేశ్వరీం తథా | నారసింహం చ వారాహీమింద్రాణీం కార్తికీంతథా || 87 సర్వశక్తి స్వరూపాం చ ప్రధానాం సర్వమంగళాం | నవ శక్తీశ్చ సంపూజ్య ఘటే దేవాంశ్చ పూజయేత్ || 88 శంకరం కార్తికేయం చ సూర్యం సోమం హుతాశనం | వాయుం చ వరుణం చైవ దేవ్యాశ్చేటీం బటుంతథా || 89 చతుష్షష్టియోగినీనాం సంపూజ్య విధిపూర్వకం | యథాశక్తి బలిం దత్వా కరోతి స్తవనం బుధః || 90 బ్రహ్మాణీ, వైష్ణవి, రౌద్రి, మహేశ్వరి, నారసింహ, వారాహి ఇంద్రాణి, కార్తికీ వీరు కాక తొమ్మిదవ శక్తి సర్వశక్తిసంపన్నురాలైన సర్వమంగళ. శక్తి దేవతలను పూజించిన పిదప కలశమున ఆహ్వానింపబడిన దేవతలను పూజింపవలెను. వారిపేర్లు శంకరుడు, కుమారస్వామి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వరుణుడు, వీరి తర్వాత దుర్గాదేవియొక్క చేటిని, వటువును అటుపిమ్మట అరవై నలుగురు యోగినీ స్త్రీలను విధిప్రకారము పూజించి శక్తికొద్ది బలిని ఇచ్చి ఆ దేవీ స్తోత్రమును చేయవలెను. కవచం చ గళే బద్ధ్వా పఠిత్వా భక్తిపూర్వకం | తతః కృత్వా పరీహారం నమస్కుర్యాద్విచక్షణః || 91 బలిదానవిధానం చ శ్రూయతాం మునిసత్తమ | మాయాతిం మహిషం ఛాగం దద్యాన్మేషాదికం శుభం || 92 సహస్రవర్షం సుప్రీతా దుర్గా మాయాతి దానతః | మహిషాచ్ఛతవర్షం చ దశవర్షం చ ఛాగలాత్ || 93 వర్షం మేషేణ కూష్మాండై పక్షిభిర్హరిణౖస్తథ | దశవర్షం కృష్ణసారైః సహస్రాబ్దం చ గండకైః || 94 కృత్రిమైః పిష్టకలితైః షణ్మాసం పశుభిస్తథా | మాసం సుపక్వాదిఫలై రక్షతైరితి నారద || 95 దుర్గాదేవీ కవచమును కంఠమున కట్టుకొని దానిని భక్తితో చదివి పరిహారమంత్రములను పఠించి అటుపిమ్మట నమస్కరించవలెను. నారదమునీ! బలిదానముచేయతగిన వాటిని గూర్చి నీవు తెలిసికొమ్ము. మాయాతి, దున్నపోతు, గొఱ్ఱ, మేకలు మొదలగు వాటిని బలిగా ఇవ్వవలెను. మాయాతిని బలిచేసినచో ఆ దేవి వేయిసంవత్సరములవరకు సుప్రీతయైయుండును. దున్నపోతును బలిఇచ్చినచో నూరుసంవత్సరములు, గొఱ్ఱను బలి ఇచ్చిన పది సంవత్సరములు, మేకను, గుమ్మడికాయను, పక్షులను, లేళ్ళను బలి ఇచ్చినచో ఆ దేవి సంవత్సరము వరకు సంతోషముగానుండును. అట్లే కృష్ణసారమను లేడిని బలిఇచ్చినచో పది సంవత్సరములు, గండకమును బలిఇచ్చినచో వేయి సంవత్సరము లా దేవి సంతోషపడును. కృత్రిమములైన పిండివంటలతో, ఇతర పశువులతో ఆరుమాసములు, పండినపండ్లు, అక్షతలతో ఒక నెలవరకు ఆ దేవి సంతోషముతోనుండును. యువకం వ్యాధిహీనం చ సశృంగం లక్షణాన్వితం | విశుద్ధమవికారాంగం సువర్ణం పుష్టమేవ చ || 96 శిశునా బలినా దాతుర్హంతి పుత్రం చ చండికా | వృధ్ధేన వై గురుజనం కృశేనాపీష్ట బాంధవాన్ || 97 ధనం చైవాధికాంగేన హీనాంగేన ప్రజాస్తథా | కామినీ శృంగంభంగేన కాణన భ్రాతరం తథా || 98 ఘటికేన భ##వేన్మృత్యుర్విఘ్నం స్యాచ్ఛిత్ర మస్తకైః | హంతిమిత్రం తామ్రపృష్టైః భ్రష్టశ్రీః పుచ్ఛహీనతః || 99 వ్యాధిలేనిది, మంచి వయసులో నున్నది, కొమ్ములు కలది, మంచి లక్షణములు కలది, వికారమైన అవయవములు లేనిది మంచి రంగుగలది, బాగుగా పోతరించినది అగు పశువును ఆ దేవికి బలిగా ఈయవలెను. అట్లుకాక పిల్లను (తక్కువ వయస్సులోనున్న పశువును) బలిగా ఇచ్చినచో బలినిచ్చినవాని పుత్రుడు చనిపోవును. అట్లే వయసుమీరిన పశువునిచ్చినచో తల్లిదండ్రులు చనిపోవుదురు. అధికాంగములు గల పశువును బలి ఇచ్చినచో ధనమును, కొన్ని అవయవములు లేని పశువునిచ్చినచో సంతానమును, కొమ్ములు, లేని పశువును బలి ఇచ్చినచో భార్యను, గుడ్డిదైన పశువునిచ్చినచో సోదరుని ఆ దేవి చంపును, దూడను బలిచేసినచో తనకే మృత్యువు కలుగును. విచిత్రమైన శిరస్సుగల పశువును బలి ఇచ్చినచో విఘ్నము, రాగిరంగుగల వెంట్రుకల పశువునిచ్చినచో మిత్రుని, తోకలేని పశువును బలి ఇచ్చినచో సపందనంతయు ఆదేని హరించును. మాయాతీనాం స్వరూపం చ శ్రూయతాం మునిసత్తమ | వక్ష్యామ్యథర్వ వేదోక్తం ఫలహానిర్వ్యతిక్రమే || 100 పితృమాతృ విహీనం చ యువకం వ్యాధివర్జితం | వివాహితం దీక్షితం చ పరదారవిహీనకం || 101 అజారజం విశుద్ధం చ సచ్ఛూద్ర పరిపోషితం | తద్బంధుభ్యో ధనం దత్వా క్రీతం మూల్యాతిరేకతః || 102 స్నాపయిత్వా చ తం కర్తా పూజయే ద్వస్త్ర చందనైః | మాల్యైర్ధూపైశ్చ సిందూరైర్దధిగోరోచనాదిభిః || 103 తం చ వర్షం భ్రామయిత్వా భృత్యద్వారేణ యత్నతః | వర్షాంతే చ సముత్సృజ్య దుర్గాయై తం నివేదయేత్ || 104 అష్టమీ నవమీ సంధౌ దద్యాన్మాయాతి మేవ చ |ఇత్యేవం కథితం సర్వం బలిదానం ప్రసంగతః || 105 అథర్వవేదమునందు చెప్పబడిన మాయాతి స్వరూపమును నీకు చెప్పెదను. నారదమునీ! తల్లిదండ్రులు, వ్యాధులు లేని యువకుడు వివాహితుడై, విష్ణుమంత్ర దీక్షను స్వీకరించి, జారత్వ దోషములు లేనివాడు కావలెను. ఆ యువకుడు జారత్వ దోషమువలన పుట్టకూడదు. అతనిని పోషించినవారు కూడా సత్పురుషులు కావలెను. ఇట్టి పురుషుని బంధువులకు ధనమునిచ్చి అతనిని కొనవలెను. ధనమునిచ్చికొన్న ఆ పురుషుని ఇంటికి తెచ్చి స్నామనముచేయించి అతనికి వస్త్రము, చందనాదులచే అతనినలంకరించి ఒక సంవత్సరము వరకు అతనిని యథేచ్ఛగా తిప్పుచు అతనివెంట తన భృత్యుని ఉంచవలెను. ఇట్టి యువకుని మాయాతి అందరు. ఈ మాయాతిని అశ్వయుజమాసమున అష్టమీ నవమీ తిథుల మధ్య దుర్గాదేవికి బలినీయవలెను. నారదా! బలిదానము చేయవలసిన పశువుల వివరముల నన్నిటిని నీకు తెలిపితిని. బలింస్తుత్వా చ దత్వా చ ధృత్వా చ కవచం బుధం | ప్రణమ్య దండవద్భూమౌ దద్యాద్విప్రాయ దక్షిణాం || 106 బలి వస్తువును స్తుతించి దేవికి బలినిచ్చి ఆ దేవియొక్క కవచమును దరించి ఆ దేవికి సాష్టాంగదండము సమర్పింపవలెను. ఆ తరువాత బ్రాహ్మణునకు దక్షిణనిచ్చి పంపించవలెను. ఇతి శ్రీబ్రహ్మావైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారద నారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే పూజావిధి బలిపశులక్షణ విశేషో నామ చతుష్షష్టితమోzధ్యాయః || శ్రీబ్రహ్మ వైవర్తమహాపురాణమున రెండవదగు ప్రకృతి ఖండమున నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్గోపాఖ్యానము దుర్గాదేవిని పూజించుపద్ధతి, ఆ పూజలో సమర్పింపవలసిన బలిపశువుయొక్క లక్షణములుగల అరవై నాలుగవ అధ్యాయం సమాప్తము.