sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
పంచషష్టితమో
నారద ఉవాచ - నాదుడిట్లనెను-
శ్రుతం మహాభాగ సుధారసపరం వరం | స్తోత్రం చ కవచం పూజాఫలం కాలంవద ప్రభో || 1
ఓ మునిసత్తమా నీవలన అమృతముకంటె ఇంపైన పెక్కువిషయములు తెలిసికొంటిని. ఇప్పుడు ఆ దుర్గాదేవి కవచమును, పూజాకాలమును, పూజా ఫలము మున్నగువాటిని తెలుపుము.
నారాయణ ఉవాచ - నారాయణుడిట్లలనెను-
ఆర్ద్రాయాం బోధయేద్దేవీం మూలేనైవ ప్రవేశ##యేత్ | ఉత్తరేణార్చయిత్వా తాం శ్రవణాయాం విసర్జయేత్|| 2
ఆర్ద్రాయాం బోధయేద్ధేవీం మూలేనైవ ప్రవేశ##యేత్ | ఉత్తరేణార్చయిత్వా తాం శ్రవణాయాం విసర్జయేత్ ||2
ఆర్ద్రాయుక్త నవమ్యాం తు కృత్వా దేవ్యాశ్చ బోధనం | పూజాయాః తశవార్షిక్యాః ఫలమాప్నోతి మానవః || 3
మూలాయాం తు ప్రవేశే చ నరమేధఫలం లభేత్ || 4
కృత్వా విసర్జనం దేవ్యాః శ్రవణాయాం చ మానవః | లక్ష్మీం చ పుత్రపౌత్రాంశ్చ లభ##తే నాzత్ర సంశయః || 5
భువః ప్రదక్షిణం పుణ్యం పూజాయాం లభ##తే నరః | నక్షత్ర యోగాభావే తు పార్వత్యాశ్చైవ నారద || 6
నవమ్యాం బోధనం కృత్వా పక్షం సంపూజ్య మానవః | అశ్వమేధ పలావాపై#్త్య దశమ్యాం చ విసర్జయేత్ || 7
సప్తమ్యాం పూజనం కృత్వా బలిం దద్యాద్విచక్షణః | అష్టమ్యాం పూజనం శస్తం బలిదాన వివర్జితం || 8
అష్టమ్యాం బలిదానేన విపత్తిర్జాయతే నృణాం | దద్యాద్విచక్షణో భక్త్యా నవమ్యాం విధివద్బలిం || 9
బలిదానేన విప్రేంద్ర దుర్గాప్రీతిర్భవేన్నృణాం | హింసాజన్యం న పాపం చ లభ##తే యజ్ఞకర్మణి || 10
ఉత్సర్గ కర్తా దాతా చ ఛేత్తా పోష్టా చ రక్షకః | అగ్రే పశ్చాన్నిబద్దా చ సపై#్తతేzవధ కారీణః || 11
యోయం హంతి సతం హంతి చేతివేదోక్తమేవ చ | కుర్వంతి వైష్ణవీం పూజాం వైష్ణవాస్తేన హేతునా || 12
నారదమునీ! దుర్గాదేవిని ఆర్ద్రానక్షత్రమున ఉత్థాపనము చేసి మూలా నక్షత్రమునాడు ఆ దేవిని ఆర్చమూర్తిలో ప్రవేశ##పెట్టవలెను. తరువాత ఉత్తరాషాఢ నక్షత్రము వరకు ఆమెను అర్చనసేసి శ్రవణా నక్షత్రమున ఆ దేవిని విసర్జింపవలెను. ఆర్ద్రానక్షత్రమున్న నవమినాడు దుర్గాదేవిని ఉత్థానముచేసి పూజించిన అధిక ఫలితము లభించును. మూలా నక్షత్రమున ఆ దేవిని అర్చామూర్తిలో ప్రవేశ##పెట్టినచో నరమేధము చేసిన ఫలము లభించును. శ్రవణానక్షత్రమున ఆ దేవిని విసర్జించినచో ధనమును, పుత్రపౌత్రులన పొందును. అట్లే అతనికి భూమిచుట్టు ఒకసారి ప్రదక్షిణము చేసినచో కలుగుఫలితము లభించును.
నవమినాడు ఆర్ద్రానక్షత్రము లేనిచో ఆదేవిని నవమినాడు ఉత్థాపనచేసి పక్షము దినములవరకు ఆమెను పూజించి దశమినాడు విసర్జన చేసినచో అశ్వమేధఫలితము లభించును. సప్తమినాడు పూజ తరువాత బలిని ఇవ్వవలెను. అష్టమీ తిథినాడు ఎట్టి పక్షమునను బలి ఇవ్వకూడదు. అట్లు చేసినచో బలి ఇచ్చినవానికి తప్పక విపత్తి జరుగును, అట్లే నవమీ తిథినాడు భక్తితో ఆ దేవికి తప్పక బలి నివ్వ వలెను. ఆ దినమున బలియిచ్చినచో దుర్గాదేవి మిక్కిలి సంతోషించును, ఈ పూజాసమయమున బలి ఇచ్చినవానికి పశుహింసవలన కలుగు పాపము సంభవింపదు. ఎందువలన అంటే వేదములందు ఏ ప్రాణి ఏ ప్రాణిని చంపునో చంపబడిన ప్రాణి మరుజన్మలో చంపిన వానిని చంపుచున్నట్లు చెప్పబడినది. అందువలన ఇద్దరు పరస్పరము చంపుకొనుచున్నందువలన హింసాపాపము అంటబోదు. అట్లే వేదమున వీరు వధచేయనట్లు చెప్పవడినది.
ఏవం సంపూజ్యం సురథః పూర్ణం వర్షం చ భక్తితః | కవచం చ గళే బధ్వా తుష్టావ పరమేశ్వరీం || 13
స్తోత్రేణ పరితుష్టా సా తస్య సాక్షాద్బభూవ హ | స దదర్శ పురో దేవీం గ్రీష్మసూర్యసమప్రభాం || 14
తేజః స్వరూపాం పరమాం సగుణాం నిర్గుణాం వరాం | దృష్ట్వా తాం కమనీయాం చ తేజోమండల మధ్యతః || 15
స్వేచ్ఛామయీం కృపారూపాం భక్తానుగ్రహ కారిణీం | పునస్తుష్టావ రాజేంద్రో భక్తినమ్రాత్మకం ధరః || 16
సురథుడా దేవిని సంవత్సర పర్యంతము భక్తితో పూజచేసెను. తన మెడలో దుర్గా కవచమును ధరించి ఆమెను స్తుతించెను.
అందువలన ఆ దేవి మహారాజునకు ప్రత్యక్షమమ్యెను. ఆమె గ్రీష్మకాలమందలి సూర్యునివంటి కాంతికలది. తేజఃస్వరూప, సగుణ, నిర్గుణాత్మిక, తేజో మండలమధ్యముననున్న ఆ దేవిని సురథుడు చూచి భక్తిచే తలనువంచి అనేకమార్లు స్తుతించెను.
స్తవేన పరితుష్టా సా సస్మితా భక్తిపూర్వకం | ఉవాచ సత్యం రాజేంద్రం కృపయా జగదంబికా || 17
నారదా! సురథుడు భక్తితో చేసిన స్తుతికి సంతోషించిన జగన్మాత అతనితో దయతో నిట్లనెను.
ప్రకృతిరువాచ- ప్రకృతి ఈ విధముగా అనినది-
సాక్షాత్ సంప్రాప్య మాం రాజన్ వృణోషి విభవం వరం | దదామి తుభ్యం విభవం సాంప్రతం వాంఛితం తవ || 18
నిర్జిత్య సర్వాన్ శత్రూంశ్చ లబ్ద్వా రాజ్యమకంటకం | భవిష్యసి మహారాజ సావర్ణిర్మనురష్టమః || 19
దాస్యామి తుభ్యం జ్ఞానం చ పరిణామే నరాధిప | భక్తిం దాస్యం చ పరమం శ్రీకృష్ణే పరమాత్మని || 20
వృణోతి విభవం యోzహి సాక్ష్మాన్మాం ప్రాప్య మందధీః | మాయయా వంచితః సోzపి విషమత్యంమృతం లభేత్ || 21
బ్రహ్మాదిస్తంబ పర్యంతం సర్వం నశ్వరమేవ చ | నిత్యం సత్యం పరం బ్రహ్మ కృష్ణం నిర్గుణ మేవ చ || 22
బ్రహ్మవిష్ణు శివాదీనామహ మాద్యా పరాత్పరా | సగుణా నిర్గుణాచాzపి వరా స్వేచ్ఛమయీ సదా || 23
నిత్యాzనిత్యా సర్వరూపా సర్వకారణకారణం | బీజరూపా చ సర్వేషాం మూలప్రకృతిరీశ్వరీ || 24
పుణ్యబృందావనే రమ్యే గోలోకే రాసమండలే | రాధా ప్రాణధికాZహం చ కృష్ణస్య పరమాత్మనః || 25
అహం దుర్గా విష్ణుమాయా బుధ్యధిష్ఠాతృదేవతా | అహం లక్ష్మీశ్చ వైకుంఠే స్వయం దేవీ సరస్వతీ || 26
సావిత్రీ వేదమాతాZహం బ్రహ్మాణీ బ్రహ్మలోకతః | అహం గంగా చ తులసీ సర్వాధారా వసుంధరా || 27
నానావిధాZహం కళయా మాయయా సర్వయోషితః | సాZహం కృష్ణేన సంసృష్టా నృప భ్రూభంగలీలయా || 28
ఓ రాజా నేను నీకు సాక్షాత్కరించినను నీవు రాజ్యవైభవము కావలెనని కోరుచున్నావు. నీవు కోరుకున్నట్లే నీకు రాజ్య వైభవమును ఇత్తును. నీవు నీ శత్రువుల నందర సంహరించి రాజ్యమును ఎదురులేకుండ పరిపాలించి చివరకు సావర్ణిమనువను ఎనిమిదవ మనువు కాగలవు. నేను నీకు చివరకు జ్ఞానమునిత్తును. దానివలన నీవు శ్రీకృష్ణ భక్తిని, శ్రీకృష్ణ దాస్యమును పొందెదవు.
నేను సాక్షాత్కరించినపుడు బుద్ధి తక్కువై వైభవమునెవరు కోరునో వాడు మాయా మోహితుడై ఆ పని చేయుచున్నాడు. అట్లే అతడు అమృతమునకు బదులు విషమును పొందుచున్నాడు. ఈ ప్రపంచమున బ్రహ్మ మొదలు స్తంభమువరకు సమస్తము అశాశ్వతమైనది. నిత్యుడు, సత్యస్వరూపుడు నిర్గుణుడు పరమాత్మయగు శ్రీకృష్ణుడొక్కడే.
నేను బ్రహ్మ విష్ణు శివాది దేవతలకంటె ముందు పుట్టిన దానను, పరాత్పరను, సగుణను, నిర్గుణను, ఐనను ఎల్లప్పుడు స్వేచ్ఛగానుందును. నేను నిత్యురాలను, అనిత్యురాలను, సమస్త రూపములు నావే. అన్ని జీవులకు నేను మూలకరాణమును నేనే మూలప్రకృతిని. పుణ్యమైన బృందావనములోని సురమ్యమైన రాసమండలమున శ్రీకృష్ణపరమాత్మకు రాధాదేవికంటెను ఇష్టమైనదానిని. నేను బుద్దికి అధిష్ఠానదేవతను, విష్ణుమాయయగు దుర్గాదేవిని, వైకుంఠమున లక్ష్మీదేవిగా, సరస్వతీ దేవిగానున్నాను. బ్రహ్మలోకమున నేను వేదమాతయగు సావిత్రీ దేవిగానున్నాను. అట్లే నేను గంగా, తులసీ, భూమి మొదలగు ఆకారములతోనున్నాను. నా మాయవలన జనించినవారే నా అంశస్వరూపలైన స్త్రీలు.
ఇట్టి నన్ను కృష్ణపరమాత్మ తన లీలతో సృష్టించెను.
భ్రూ భంగలీలయా సృష్టో యేన పుంసా మహాన్విరాట్ | లోమ్నాం కుపేషు విశ్వాని యస్య సంతిహి నిత్యశః || 29
అసంఖ్యాని చ తాన్యేవ కృత్రిమాణి చ మాయయా | అనిత్యే నిత్యబుద్ధిం చ సర్వే కుర్వంతి సంతతం || 30
సప్తసాగర సంయుక్తా సప్తద్వీపా వసుంధరా | తదధః సప్తపాతాళాః స్వర్లోకాశ్చైవ సప్త చ || 31
ఏవం విశ్వం బహువిధం బ్రహ్మాండం బ్రహ్మణా కృతం | ప్రత్యేకం సర్వవిధ్యండే బ్రహ్మ విష్ణు శివాదయాః || 32
సర్వేషామీశ్వరః కృష్ణ ఇతిజ్ఞానం పరాత్పరం | వేదనాం చ వ్రతానాం చ తీర్ధానాం తపసాం తథా || 33
దేవానాం చైవ సర్వేషాం సారః కృష్ణ ఇతిస్మృతః | తద్భక్తి హీనో మూఢస్సచ జీవన్మృతో ధ్రువం || 34
పవిత్రాణి చ తీర్ధాని తద్భక్త స్పర్శవాయునా | తన్మంత్రోపాసకశ్చైవ జీవన్ముక్త ఇతిస్మృతః || 35
మంత్రగ్రహణమాత్రేణ నరో నారాయణో భ##వేత్ | వినా జపేన తపసావినా తీర్ధేన పూజయా || 36
మాతామహానాం శతకం పితౄనాం చ సహస్రకం | పుంసామేవం సముద్దృత్య గోలోకం చ స గచ్ఛతి || 37
ఇదం జ్ఞానం సారభూతం కథితం తే నరాధిప |
శ్రీకృష్ణ పరమాత్మయొక్క లీల చేతనే మహావిరాట్ స్వరూపుడు సృష్టింపబడెను. అతని రోమకూపములందు అనేక విశ్వములున్నవి. ఇవి యన్నియు పరమాత్మయొక్క మాయవలన సృష్టింపబడినవి. ఈ మాయవలననే అందరు అనిత్యములైన వస్తువులను నిత్యములని తలంచుచున్నారు.
సప్త సముద్రములు, సప్త ద్వీపములతో నున్న ఈ భూమికి క్రింద పాతాళాది లోకము లేడు పైన స్వర్గాది లోకములేడు కలవు. ఇట్టి లోకములు అనేకములున్నవి. బ్రహ్మాండమును బ్రహ్మదేవుడు సృష్టించుచున్నాడు. ఇట్టి బ్రహ్మాండములన్నిటిలో బ్రహ్మవిష్ణు శివాది దేవతలు ప్రత్యేకముగా నున్నారు.
అందరకు శ్రీకృష్ణ పరమాత్మ ఈశ్వరుడను జ్ఞానము చాలా మిన్నయైనది. వేదములకు, తపస్సులకు, వ్రతములకు, తీర్థములకు, దేవతలకందరకు శ్రీకృష్ణుడే సారభూతుడు. శ్రీకృష్ణభక్తిలేనివాడు జీవన్మృతుడగును. ఆ శ్రీకృష్ణ భక్తులకు తగిలిన వాయువు సోకినచో సమస్త తీర్థములు పవిత్రములగును.
శ్రీకృష్ణ మంత్రమును ఉపాసన చేయు భక్తుడు జీవన్ముక్తుడగును. శ్రీకృష్ణమంత్రమును గురుముఖతః పొందగనే నరుడు నారాయణునితో సమానుడగుచున్నాడు. అతనికి జపము, తపము, తీర్థసేవన, పూజమున్నగునని అవసరములేదు శ్రీకృష్ణమంత్రమును గురుముఖతః పొందిన భక్తుడు అతని తల్లివంశము వారిని నూరు తరములవారిని, తండ్రి వంశమువారిని వేయి తరముల వారిని సముద్దరించును. చివరకాభక్తుడు గోలోకమును చేరుకొనును.
ఓ మహారాజా! నీకు సారభూతమైన జ్ఞానమును చెప్పితిని.
మన్వంతరాంతే భోగాంతే భక్తిం దాస్యామి తే హరౌ || 38
నాZభుక్తం క్షీయతే కర్మ కల్పకోటిశ##తైరపి | అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాZశుభం || 39
అహం యమనుగృహ్ణామి తసై#్మ దాస్యామి నిర్మలాం | నిశ్చలాం సుదృఢాం భక్తిం శ్రీకృష్ణే పరమాత్మని || 40
కరోమి వంచనాం యంయం తేభ్యోదాస్యామి సంపదం | ప్రాతః స్వప్న స్వరూపాంచ మిథ్యేతి భ్రమ రూపిణీం || 41
ఇతి తే కథితం జ్ఞానం గచ్ఛ వత్స యథా సుఖం | ఇత్యుక్త్వా చ మహాదేవ తత్రైవాంతరధీయత || 42
ఓ రాజా! మన్వంతరము చివర లేక నీ కర్మ భోగము పూర్తియైన తరువాత శ్రీకృష్ణభక్తిని కల్పింతును. జీవుడు చేసి కర్మను సంపూర్ణముగా అనుభవించనిదే ఎన్ని సంవత్సరములు గడచినను తీరదు. అట్లే నేను ఎవరిని అనుగ్రహింతునో అతనికి నిర్మలము, నిశ్చలమైన శ్రీకృష్ణభక్తిని ఇత్తును. నేను ఎవరిని మోసగింతునో అతనికి ప్రాతః కాలమున పడిన స్వప్నమువంటిది. మిథ్య అను భ్రమను కలిగించు సంపదను ఇత్తును.
వత్స! నీకు ఇట్టి జ్ఞానమును కలిగించితిని. నీవు సుఖముగా నీ ఇంటికి వెళ్ళుమని దుర్గాదేవి అక్కడే అంతర్దానము చెందెనని నారాయణుడు నారదునితో చెప్పెను.
రాజా సంప్రాప్య రాజ్యం చ నత్వా తాం ప్రయ¸° గృహం | ఇతి తే కథితం వత్స దుర్గోపాఖ్యాన ముత్తమం || 43
సురథుడు ఆ దుర్గాదేవికి నమస్కరించి గృహమునకు పోయి రాజ్యమును తిరిగి సంపాదించెను.
నారాయణ! నీకు ఇట్లు దుర్గోపాఖ్యానమును సంపూర్ణముగా వివరించితిని అని నారాయణుడు పలికెను.
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే ప్రకృతి సురథ సంవాదే జ్ఞావ కథనం నామ పంచషష్టితమోZధ్యాయః ||
శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములోని రెండవదైన ప్రకృతిఖండము నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్గోపాఖ్యానములోని ప్రకృతి సురథుల సంవాదమున జ్ఞాన కథనమను
అరవైయైదవ అధ్యాయము సమాప్తము.