sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
షట్ షష్టితమోZధ్యాయః - దుర్గా స్తోత్రము నారద ఉవాచ- నారదుడిట్లనెను- శ్రుతం సర్వం నావశిష్టం కించిదేవ హి నిశ్చితం | ప్రకృతేః కవచం స్తోత్రం బ్రూహి మే మునిసత్తమ ||
1 ఓ రాయణమునీ! నీ వలన ప్రకృతి సంబంధించిన అన్ని విషయములను తెలిసికొంటిని. ఐనను ఆ దేవియొక్క కవచమును స్తోత్రమును నాకు వివరించి చెప్పుము. నారాయణ ఉవాచ- నారాయణుడు నారదునితో నిట్లనెను- పురాస్తుతా సా గోలోకే కృష్ణేన పరమాత్మనా | సంపూజ్య మధమాసే చ సంప్రీత్యై రాసమండలే || మధుకైటభయోర్యుద్దే ద్వితీయే విష్ణునా పురా || 2 తత్రైవ కాలే సాదుర్గా బ్రహ్మణా ప్రాణసంకటే | చతుర్థే సంస్తుతా దేవీ భక్త్యా చ త్రిపురారిణా || 3 పురా త్రిపుర యుద్దే చ మహాఘోరతరే మునే | పంచమే సంస్తుతా దేవీ వృత్రాసురవధే తథా || 4 శ##క్రేణ సర్వదేవైశ్చ ఘోరే ప్రాణసంకటే | తదామునీంద్రైర్మనుభిర్మానవైః సురథాదిభిః || 5 సంస్తుతా పూజితా సా చ కల్పే కల్పే పరాత్పరా | స్తోత్రం చ శ్రూయాతాం బ్రహ్మన్ సర్వవిఘ్న వినాశకం | సుఖదం మోక్షదం సారం భవసంతార కారణం || 6 ప్రకృతి రూపిణియగు దుర్గాదేవిని పూర్వము శ్రీకృష్ణుడు లోకమందలి రాసమండలమున చైత్రమాసమున పూజించెను. తరువాత మధుకైటభులతో యుద్దము చేయుచున్నప్పుడు శ్రీమహావిష్ణువు ఆ దేవిని పూజించెను. అట్లే బ్రహ్మదేవుడు తన ప్రాణసంకటమేర్పడినదని తలచి ఆ దేవిని పూజించెను. ఆ తరువాత త్రిపురాసుర యుద్ద సమయమున త్రిపురారియగు శివు డా దుర్గాదేవిని పూజించెను. అట్లే వృత్రాసురునితో యుద్ధము జరుగుచున్న సమయములో ఇంద్రు డా దేవిని పూజించెను. అట్లే దేవతలు స్థానభ్రష్టులై ప్రాణాపాయ సంకట పరిస్థితిలోనున్నప్పుడు ఆ దేవిని పూజించిరి. ఆ తరువాత మునీంద్రులు, మనువులు, సురథుడు మొదలైన రాజు లా దుర్గాదేవిని పూజించిరి. ఈ విధముగా ప్రతికల్పములో ఆ దేవిని పూజించుచున్నారు. ఇక నారదా! సమస్త విఘ్నములను తొలగించునది, సుఖమును, మోక్షమును కలిగించు ఆ దేవియొక్క స్తోత్రమును వినుము. శ్రీకృష్ణ ఉవాచ- శ్రీకృష్ణుడిట్లు పలికెను (స్తుతించెను)- త్వమేవ సర్వజననీ మూలప్రకృతిరీశ్వరీ | త్వమేవాద్యా సృష్టివిధౌ స్వేచ్ఛయా త్రిగుణాత్మికా || 7 కార్యార్థే సగుణా త్వం చ వస్తుతో నిర్గుణా స్వయం | పరబ్రహ్మ స్వరూపా త్వం సత్యా నిత్యా సనాతనీ || 8 తేజస్స్వరూపా పరమా భక్తానుగ్రహవిగ్రహా | సర్వస్వరూపా సర్వేశా సర్వాధారా వరాత్పరా || 9 సర్వబీజ స్వరూపా చ సర్వపూజ్యా నిరాశ్రయా | సర్వజ్ఞా సర్వతోభద్రా సర్వమంగళ మంగళా || 10 సర్వబుద్ధి స్వరూపా చ సర్వశక్తి స్వరూపిణీ | సర్వజ్ఞానప్రదా దేవి సర్వజ్ఞా సర్వభావినీ || 11 త్వం స్వాహా దేవదానే చ పితృదానే స్వధ స్వయం | దక్షిణా సర్వదానే చ సర్వశక్తి స్వరూపిణీ || 12 నిద్రా త్వం చ దయా త్వం చ తృష్ణా త్వం చాత్మనః ప్రియా | క్షుత్ క్షాంతిః శాంతిరీశా చ శాంతిః సృష్టిశ్చ శాశ్వతీ || 13 శ్రద్దా పుష్టిశ్చ తంద్రా చ లజ్జా శోభా దయా తథా | సతాం సంపత్స్వరూపా శ్రీర్విపత్తిరసతా మిహ || 14 ప్రీతిరూపా పుణ్యవతాం పాపినాం కలహాంకురా | శశ్వత్కర్మమయీ శక్తిః సర్వదా సర్వజీవినాం || 15 దేవేభ్యః స్వపదో దాత్రీ ధాతుర్ధాత్రీ కృపామయీ | హితయ సర్వదేవానాం సర్వాసురవినాశినీ || 16 యోగనిద్రా యోగరూపా యోగదాత్రీ చ యోగినాం | సిద్ధిస్వరూపా సిద్దానాం సిద్దిదా సిద్ద యోగినీ || 17 బ్రహ్మాణీ మహేశ్వరీ చ విష్ణుమాయా చ వైష్ణవీ | భద్రదా భద్రకాళీ చ సర్వలోక భయంకరీ || 18 గ్రామే గ్రామే గ్రామ దేవీ గృహాదేవీ గృహే | సతాం కీర్తిః ప్రతిష్ఠా చ నిందా త్వమసతాం సదా || 19 మహాయుద్దే మహామారీ దుష్టసంహారరూపిణీ | రక్షా స్వరూపా శిష్టానాం మాతేవ హితకారిణీ || 20 వంద్యా పూజ్యా స్తుతా త్వం చ బ్రహ్మాదీనాం చ సర్వదా | బ్రహ్మణ్యరూపా విప్రాణాం తపస్యా చ తపస్వినాం || 21 విద్యా విద్యావతాం త్వం చ బుద్ధిర్భుద్దిమతాం సతాం | మేధా స్మృతి స్వరూపా చ ప్రతిభా ప్రతిభావతాం || 22 రాజ్ఞాం ప్రతాపరూపా చ విశాం వాణిజ్య రూపిణీ | సృష్టౌ సృష్టి స్వరూపా త్వం రక్షా రూపా చ పాలనే || 23 ఓ దుర్గా! నీవు అందరకు తల్లివి, మూలప్రకృతివి, ఈశ్వరివి. సృష్టి జరుగునప్పుడు నీవే తొలుత జన్మించితివి. నీవు సత్వరజస్తమోగుణ స్వరూపిణివి. నీవు నిజముగా నిర్గుణవేయైనను దేవకార్యమునకై, భక్తులకై సగుణ స్వరూపిణివి, సనాతనివి. తేజోమూర్తివి అగుచున్నావు. అట్లే భక్తుల నెల్లప్పుడు అనుగ్రహించుదానవు. ఈ ప్రపంచముననున్న సమస్త రూపములు నీవే. అట్లే నీవు ప్రపంచముననున్న సమస్త జీవులకు ఈశ్వరివి. అన్నిటికి ఆధారభూతవు, పరాత్పరవు, సమస్త కారణములు నీవే సర్వపూజ్యవు, నిరాశ్రయవు, సర్వజ్ఞవు, సర్వతోభద్రవు, సర్వమంగళ మంగళవు నీవే. నీవే సమస్త బుద్ది స్వరూపవు. సర్వశక్తి స్వరూపిణివి సర్వజ్ఞానములనిచ్చు దేవివి. సర్వభావినివి అంతయు నీవే. అట్లే దేవతలకు యజ్ఞమున చరువు మొదలగు వస్తువులను దానముచేయునప్పుడు నీవు అగ్ని పత్నియగు స్వాహాదేవి రూపములో ఉంటున్నావు. పితృయజ్ఞమున స్వధారూపిణివిగా అన్ని దానములలో సర్వశక్తి స్వరూపిణివగు దక్షిణా స్వరూపమున కనిపించుచున్నావు. నిద్ర, దయ, తృష్ణ, ఆకలి, క్షమ, శాంతి, శశ్వతసృష్టి, శ్రద్ధా, పుష్టి, తంద్ర, సిగ్గు, శోభ, దయ, అన్నియు నీ స్వరూపములే. పుణ్యముచేసికొన్నవారికి సంతోషరూపిణివిగా, పాపులకు కలహబీజముగా, సజ్జనులకు సంపదగా, దుష్టులకు ఆపదగా దర్శనమొసగుచున్నావు. సమస్త జీవులకు కర్మమయివైన శక్తి రూపిణిగా కనిపించుచున్నావు. దేవతలు తమ స్థానములను పోగొట్టుకొనినప్పుడు వారికి తిరిగి వారి అధికారములనిప్పించితివి. దేవతల కొరకు సమస్త రాక్షసులను నీవే సంహరించితివి. యోగనిద్ర, యోగరూప, సిద్ధిస్వరూప, సిద్ధిని కలిగించుదానవు, యోగమును కలిగించుదానవు అంతయునీవే. నీవు బ్రహ్మాణియగు బ్రహ్మశక్తిగా మహేశ్వరియగు మహేశ్వరుని శక్తిగా, వైష్ణవియగు విష్ణుమాయగా సర్వలోకములకు భయంకరివైన భద్రకాళిగా కన్పించుచున్నావు. ఓ తల్లీ! నీవు ప్రతిగ్రామమున గ్రామదేవతగా, ప్రతి ఇంటిలో గృహలక్ష్మిగా కన్పించుచున్నావు. సజ్జనుల కీర్తిప్రతిష్ఠలు, దుర్జనులయొక్క నింద నీ స్వరూపములే. మహాయుద్ధమున దుష్టులను సంహరించు మహామారిగానున్నావు. నీవు సజ్జనులను తల్లివలె రక్షించుచున్నావు. నీవు బ్రహ్మాదీ దేవతలచే ఎల్లప్పుడు నతులు, నుతులనందుకొనుచున్నావు. నీవు బ్రాహ్మణులయొక్క బ్రహ్మతేజస్సువు. మునులకు తపస్యా రూపిణివి. విద్యావంతులకు విద్యవు, బుద్ధిమంతులకు బుద్ధివి, మేధా, స్మృతిరూపిణివి, ప్రతిభావంతులకు ప్రతిభవు. రాజులకు ప్రతాపరూపిణివి. వర్తకులకు వాణిజ్య రూపిణివి. సృష్టియందు సృష్టిస్వరూపవు స్థితియందు రక్షారూపిణివిగా కన్పిచుచున్నావు. తథాంతే త్వం మహామారీ విశ్వేవిశ్వైశ్చ పూజితే | కాళరాత్రిహారాత్రిర్మోహరాత్రిశ్చ మోహినీ || 24 దురత్యయా మే మాయాత్వం యయా సంమోహితం జగత్ | యయా ముగ్ధోహి విద్వాంశ్చ మోక్షమార్గ న పశ్యతి || 25 అదేవిధముగా ప్రళయకాలమున నీవు మహామారిగా అవతరించుచున్నావు. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి ఇవి అన్నియు నీయొక్క రూపములే. నాయొక్క మాయారూపిణివగు నిన్ను ఎవ్వరు అతిక్రమింపజాలరు.అందువలన నీవలన ఈ ప్రపంచమంతయు మోహపరవశమగుచున్నది. ఆ కారణము వలననే విద్వాంసుడు సహితము ప్రాకృతుని వలె మోక్షమార్గము పొందుటకు ప్రయత్నించడు అని శ్రీకృష్ణుడు ఆ దుర్గాదేవిని స్తుతించెను. ఇత్యాత్మానా కృతం స్తోత్రం దుర్గాయా దుర్గనాశనం | పూజాకాలే పఠేద్యో హి సిద్ధర్భవతి వాంఛితా || 26 వంధ్యా చ కాకవంధ్యా చ మృతవత్సా చ దుర్భగా | శ్రుత్వా స్తోత్రం వర్షమేకం సుపుత్రం లభ##తే ధ్రువం || 27 కారాగారే మహాఘోరే యోబద్ధో దృఢబంధనే | శ్రుత్వాస్తోత్రం మాసమేకం బంధనాన్ముచ్యతే ధ్రువం || 28 యక్ష్మగ్రస్తో గళత్కుష్ఠీ మహాశూలీ మహాజ్వరీ | శ్రుత్వా స్తోత్రం వర్షమేకం సద్యోరోగాత్ర్పముచ్యతే || 29 పుత్రభేదే ప్రజాభేదే పత్నీ భేదే చ దుర్గతః | శ్రుత్వా స్తోత్రం మాసమేకం లభ##తే నాzత్ర సంశయః || 30 రాజద్వారే శ్మశానే చ మహారణ్య రణస్థలే | హింస్రజంతు సమీపే చ శ్రుత్వా స్తోత్రం ప్రముచ్యతే || 31 గృహదాహే చ దావాగ్నౌ దుస్యు సైన్య సమన్వితే | స్తోత్ర శ్రవణమాత్రేణ లభ##తే నాత్ర సంశయః || 32 మహాదరిద్రో మూర్ఖశ్చ వర్షం స్తోత్రం పఠేత్తు యః | విద్యావాన్ ధనవాశ్చైవ స భ##వేన్నాత్ర సంశయః || 33 మానవుల కష్టములన్నిటిని తొలగించు ఈ దుర్గాస్తోత్రమును నేను (శ్రీకృష్ణ పరమాత్మ) చేసితిని. దీనిని పూజాకాలమున పఠించువారికి సర్వసిద్ధులు కలుగును. గొడ్డురాలైనను, సంతానము కలిగి చనిపోవుచున్నను స్త్రీ ఈసోత్రమును సంవత్సరమువరకు నియతముగా విన్నచో మంచి పుత్రుని పొందును. మహా భయంకరమైన కారాగారముననున్నను, దృఢబంధనములతో కట్టబడినను ఈ స్తోత్రమును ఒక నెలవరకు చదివినచో బంధముక్తుడగును. క్షయవ్యాధిగ్రస్తుడైనను, కుష్ఠురోగమున్నను, కడుపునొప్పియున్నను, గొప్ప రోగము వచ్చినను ఈ స్తోత్రమును ప్రతిదినము వినుచు పోయిన సంవత్సరకాలముననే అతడు రోగవిముక్తుడగును. తనవారు తప్పిపోయన సమయమున ఈస్తోత్రమును నియతముగా ఒక నెలవరకు వినుచున్న యెడల వారిని తిరిగి పొందును. రాజద్వారమున, శ్మశానమున, మహారణ్యమున, యుద్ధరంగమున భయంకరమైన జంతువుల సమీపమున గృహదాహమున, ఇతర కష్టకాలములందు ఈ స్తోత్రమును చదివినచో అతని కష్టములన్నియు దూరమగును. మహాదరిద్రుడైనను, మూర్ఖుడైనను, ఒక సంవత్సరము వరకు ఈ స్తోత్రమును చదివినచో అతడు ధనవంతుడు, విద్యావంతుడు తప్పక అగును. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే దుర్గాస్తోత్రం నామ షట్ షష్టితమోzధ్యాయః || శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణములో రెండవదగు ప్రకృతిఖండమున నారదనారాయణులసంవాదమున చెప్పబడిన దుర్గాదేవియొక్క ఉపాఖ్యానమున దుర్గాస్తోత్రమను అరవైయారవ అధ్యాయము సమాప్తము.