sri vedavyasuni Brahavyvarthamaha Puranamu-1
Chapters
సప్త షష్టితమోzధ్యాయః - బ్రహ్మాండ మోహనమను దుర్గాకవచము నారద ఉవాచ- నారదుడిట్లనెను- భగవాన్ సర్వధర్మజ్ఞ సర్వజ్ఞాన విశారద | బ్రహ్మండమోహనం నామ ప్రకృతేః కవచం వద ||
1 సమస్త ధర్మములు, సమస్త జ్ఞానములు తెలిసిన ఓ నారాయణా! బ్రహ్మాండముల నన్నిటిని మోహింపచేయు దుర్గాకవచమును నాకు చెప్పుమని అడిగెను. నారాయణ ఉవాచ- నారాయణుడిట్లు పలికెను- శ్రుణవక్ష్యామి హేవత్స కవచం చ సుదుర్లభం | శ్రీకృష్ణేనైవ కథితం కృపయా బ్రహ్మణ పురా ||
2 బ్రహ్మాణా కథితం సర్వం ధర్మార్థం జాహ్నవీ తటే | ధర్మేణ దత్తం మహ్యం చ కృపయా పుష్కరే ప్రభుః ||
3 త్రిపురారిశ్చ యత్ ధృత్వా జఘాన త్రిపురం పురా | ముమోచ ధాతా యత్ ధృత్వా మధుకైటభయోర్భయం || జఘాన రక్తబీజం తం యుద్దృత్వా భద్రకాళికా ||
4 యుద్ధృత్వా తు మహేంద్రశ్చ సంప్రాప కమలాలయాం | యద్ధృత్వా తు మహాకాళశ్చిరజీవీ చ ధార్మికః || 5 యద్ధృత్వా చ మహాజ్ఞానీ నందీ సానంద పూర్వకం | యద్ధృత్వా చ మహాయోద్ధా రామః శత్రుభయంకరః || 6 యద్ధృత్వా శివతుల్యశ్చ దుర్వాసా జ్ఞానినాం వరః || ఓ వత్స! సుదుర్లభ##మైన దుర్గాకవచమును నీకు చెప్పుదును. దీనిని పూర్వము శ్రీకృష్ణపరమాత్మ దయతో బ్రహ్మదేవునకు చెప్పెను. బ్రహ్మదేవుడు దీనిని గంగానదీ తీరమున ధర్మునకుపదేశించెను. ధర్ముడు దీనిని పుష్కర క్షేత్రమున నాకుపదేశించెను. త్రిపురారియగు శంకరుడు ఈ కవచమును ధరించి త్రిపురాసురుల సంహరించెను. బ్రహ్మదేవుడీ కవచమును ధరించి మధుకైటభుల భయమును తొలగించుకొనెను. భద్రకాళి ఈ కవచమును ధరించి రక్తబీజులను రాక్షసులను సంహరించెను. దేవేంద్రుడు దీనిని ధరించి రాజ్యలక్ష్మిని తిరిగి పొందెను. మహాకాళుడు దీనివలననే చిరంజీవియయ్యెను. అట్లే నందీశ్వరుడు దీనిని ధరించి మహాజ్ఞాని యయ్యెను. శ్రీరామచంద్రుడుకూడ దీనిని ధరించి మహాజ్ఞానియయ్యెను. మహాజ్ఞానియగు దుర్వాసమహర్షి ఈ కవచమును ధరించినందువలననే శివునితో సమానుడయ్యెను అని నారాయణుడనెను. ఓం దుర్గేతి చతుర్థ్యంతం స్వాహాంతో మే శిరోzవతు || 7 మంత్రః షడక్షరోzయం చ భక్తానాం కల్పపాదపః | విచారో నాస్తి వేదేషు గ్రహాణ చ మనోర్మునే || 8 మంత్రగ్రహణమాత్రేణ శివతుల్యోభ##వేన్నరః | ఓం దుర్గా దేవ్యై స్వాహా అను షడక్షర మంత్రము నా శిరస్సును రక్షింపనిమ్ము. ఈ మంత్రము భక్తులకు కల్పవృక్షము వంటిది. ఈ మంత్రముయొక్క వివరణకాని, దీనిని గ్రహించిన వారి గురించిగాని వేదములలో ఎచ్చట కన్పింపదు. ఈ మంత్రమును గురుముఖతః పొందినంతమాత్రమున అతడు శివునితో సమానుడగుచున్నాడు. మమవక్త్రం సదాపాతు చోం దుర్గాయై నమో తతః || 9 ఓం హ్రీం శ్రీమితి మంత్రోzయం స్కందం పాతు నిరంతరం || 10 ఓం హ్రీం క్లీమితి పృష్ఠం చ పాతు మే సర్వతః సదా | హ్రీం మే వక్షఃస్థలం పాతు హస్తం శ్రీమితి సంతతం || 11 ఓం శ్రీం హ్రీం క్లీం పాతు సర్వాంగం స్వప్నే జాగరణ తథా | ప్రాచ్యాం మే ప్రకృతిః పాతు పాతు వహ్నౌ చ చండికా || 12 దక్షిణ భద్రకాళీ చ నైఋత్యాం చ మహేశ్వరీ | వారుణ్యాం పాతు వారాహీ వాయవ్యాం సర్వమంగళా || 13 ఉత్తరే వైష్ణవీ పాతు తథైశాన్యాం శివప్రియా | జలే స్థలే చాంతరిక్షే పాతుమాం జగదంబికా || 14 ఇతి తే కథితం వత్స కవచం చ సుదుర్లభం | ''ఓం దుర్గాయైనమః'' అనుమంత్రము నా ముఖమునెల్లప్పుడు రక్షించుగాక, ''ఓం దుర్గేరక్షయ'' అను మంత్రము నా కంఠమును, ''ఓం హ్రీం శ్రీం'' దుర్గాయై నమః అను మంత్రము నాకంఠమును ''ఓం హ్రీం క్లీం దుర్గాయై నమః'' అను మంత్రము నా పృష్ఠభాగమును, ''హ్రీం'' అనునది నా వక్షః స్థలమును, 'శ్రీం' అనునది నా చేతిని, ''ఓం శ్రీం హ్రీం క్లీం'' అనునది నా సర్వాంగములను స్వప్నమున, జాగ్రదవస్థలోను, ఎల్లప్పుడు రక్షించుగాక. దుర్గాదేవి నా తూర్పు దిక్కును, చండిక నా ఆగ్నేయభాగమును, భద్రకాళి నా దక్షిణ భాగమును, మహేశ్వరి నా నైఋతి భాగమును, వారాహి నా పశ్చిమ భాగమును, సర్వమంగళ నా వాయవ్య భాగమును, వైష్ణవి ఉత్తర భాగమును, శివప్రియ నా ఈశాన్యభాగమును, జగదంబిక నన్ను జలము, స్థలమున, అంతరిక్షమున ఎల్లప్పుడు రక్షించుగాక. ఓనారదా! ఇది సుదుర్లభ##మైన దుర్గాదేవి కవచము. యసై#్మ కసై#్మ న దాతవ్యం ప్రవక్తవ్యం న కస్యచిత్ || 15 గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలంకార చందనైః | కవచం ధారయే ద్యస్తు సోzపి విష్ణుర్న సంశయః || 16 భ్రమణ సర్వతీర్థానాం పృథివ్యాశ్చ ప్రదక్షిణ | యత్పలం లభ##తే లోకస్తదేత ద్దారణాన్ముఖే || 17 పంచలక్ష జపేనైవ సిద్ధమేతద్భవేద్ద్రువం | లోకే చ సిద్ధకవచం నాస్త్రం విధ్యతి సంకటే || 18 న తస్య మృత్యుర్భవతి జలౌ వహ్నౌ విశేద్ద్రువం | జీవన్ముక్తో భ##వేత్సోzపి సర్వసిద్ధే శ్వరః స్వయం || 19 యది స్యాత్సిద్ధ కవచో విష్ణుతుల్యో భ##వేద్ధ్రువం | కథితం ప్రకృతేః ఖండం సుధాఖండాత్పరం మునే || 20 నారదా! ఈ కవచమును అందరకు తెలుపరాదు. కావున కవచమును పొందవలెనని అనుకొనువాడు గురువును శాస్త్రప్రకారముగా పూజించి అలంకారములు, చందనాదికముల నిచ్చి సమ్మానింపవలెను. ఇట్లు గురువుచే అనుగ్రహింపబడి దుర్గాకవచమును ధరించినచో అతడు విష్ణుతుల్యుడగును. సమస్త పుణ్యతీర్థములన్ని తిరిగినచో, భూ ప్రదక్షిణము చేసినచో కలుగు ఫలితము ఈ దుర్గాదేవి కవచమును ధరించినచో కలుగును. ఈ కవచమును ఐదు లక్షమార్లు జపించినచో కవచము సిద్ధించును. సిద్ధ కవచుడైనవానిని ఎట్టి అస్త్రము బాధింపదు. అతడు నీటిలో పడినను, నిప్పులో బడినను కవచప్రభావము వలన మరణము సంభవింపదు. అతడు జీవన్ముక్తుడగును. సర్వసిద్ధేశ్వరుడుకూడ అగును. దుర్గా కవచము సిద్ధించిన మానవుడు విష్ణుమూర్తితో సమానుడగును. నారదా! నీకు అమృత ఖండము కన్నను శ్రేష్ఠమైన ప్రకృతి ఖండమునింతవరకు చెప్పితినని నారాయణుడు పల్కెను. యా చైవ మూల ప్రకృతిః యస్యాః పుత్రోగణశ్వరః | కృత్వా కృష్ణవ్రతం సా చ లేభే గణపతిం సుతం || 21 స్వాంశేన కృష్ణో భగవాన్ బభూవ చ గణశ్వరః | శ్రుత్వా చ ప్రకృతేః ఖండం సుశ్రావ్యం చ సుధోపమం || 22 భోజయిత్వా చ దధ్యన్నం తసై#్మ దద్యాచ్చ కాంచనం | సవత్సాం సురభిం దద్యాద్వై భక్తిపూర్వకం || 23 వాసోzలంకార రత్నైశ్చ తోషయే ద్వాచకం మునే | పుష్పాలంకారవనైరుపహార గణౖస్తథా || 24 పుస్తకం పూజయే దేవం భక్తిశ్రద్ధా సమన్వితః | ఏవం కృత్వా యః శ్రుణోతి తస్యవిష్ణుః ప్రసీదతి || 25 వర్ధతే పుత్రపౌత్రాదిర్యశస్వీ తత్ర్పసాదతః | లక్ష్మీర్వసతి తద్గేహే హ్యంతే గోలోక మాప్నుయాత్ | లభేత్ కృష్ణస్య దాస్యం స భక్తిం కృష్ణే సునిశ్చలాం || 26 నారదా! దుర్గాదేవియే మూలప్రకృతి. గణపతి ఆ దేవియొక్క పుత్రుడు. దుర్గాదేవి శ్రీకృష్ణవ్రతమునాచరించి గణపతిని పుత్రునిగా పొందెను. శ్రీకృష్ణపరమాత్మయే తన అంశముచే గణపతిగా జన్మనెత్తెను. సుశ్రావ్యము, అమృతమువంటి ఈ ప్రకృతి ఖండమును బ్రాహ్మణుని వలన విన్న తరువాత ఆ బ్రాహ్మణునకు మృష్టాన్న భోజనముపెట్టి బంగారమును దక్షిణగా ఇవ్వవలెను. అట్లే దూడతోనున్న ఆవును వస్త్రములను, అలంకారములను, పుష్పమాలలను దీనిని చదివిన బ్రాహ్మణునకు భక్తి పూర్వకముగా దానము చేయవలెను. గ్రంథమును కూడ పుష్పాదులచే భక్తిశ్రద్ధలతో పూజింపవలెను. ఈవిధముగా ఈ ఖండమును వినినచో శ్రీ మహావిష్ణువు సంతోషించును. అతనికి పుత్ర పౌత్రాది భాగ్యములనిచ్చును. శ్రీకృష్ణ భక్తుడై గోలోకమునకు పోవునని నారాయణుడు నారదమునికి చెప్పెను. ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణ ద్వితీయే ప్రకృతిఖండే నారదనారాయణ సంవాదే దుర్గోపాఖ్యానే బ్రహ్మాండ మోహన కవచం నామ సప్త షష్టితమోzధ్యాయః || శ్రీబ్రహ్మవైవర్త మహాపురాణమున రెండవదైన ప్రకృతిఖండమున నారదనారాయణుల సంవాదమున చెప్పబడిన దుర్గాదేవియొక్క ఉపాఖ్యానమున బ్రహ్మాండమోహన కవచమను అరవై ఏడవ అధ్యాయము సమాప్తము. సమాప్తశ్చాయం శ్రీబ్రహ్మవైవర్త ప్రకృతిఖండో ద్వితీయః శ్రీ బ్రహ్మహ్మవైవర్త మహాపురాణములో రెండవదగు ప్రకృతిఖండము సమాప్తము.