Sri Devi Bagavatham-2    Chapters   

శ్రీః

శ్రీదేవీ భాగవతము

ఆంధ్రానువాద సహితము

ద్వితీయ భాగము

అనువాదకులు :

శ్రీ దేవులపల్లి శివరామయ్య ఎం. ఏ.

పరిష్కర్తలు:

శ్రీ పాతూరి సీతారామాంజనేయులు ఎం. ఏ.

(తెలుగు - సంస్కృతము)

విద్వాన్‌ శ్రీ జంధ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి

వ్యాకరణ విద్యాప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ, వేదాంతవిశారద

ప్రకాశకులు:

శ్రీవేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాదు - 500 020.

సర్వస్వామ్యములు ప్రకాశకులవి.

ప్రధమ ముద్రణము

1985

ప్రతులు : 2000 మూల్యము : రూ.100.00

ద్వితీయ ముద్రణము

1997

ప్రతులు - 1000

ఇంటింట దేవతా మందిరములందు పూజింపవలసినవి ఆడపడుచులు అత్తవారింటికి వెళ్లునపుడు సారె పెట్టవలసినవి ఆచంద్రార్కము మనుమల మునిమనుమల ఆయురారోగ్య భాగ్య సౌభాగ్య సమృద్ధికి ధర్మము ధనము భోగము మోక్షమును కోరి చదివి చదివించి విని వినిపించవలసినవి వేద వేదాంత రహస్య సుబోధకములైనవి వ్యాసప్రోక్త అష్టాదశ (18) మహాపురాణములు. వానిని సంస్కృతమూల - సరళాంధ్రానువాద-పరిశోధనలతో శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు ముంద్రించి అందించుచున్నది.

ప్రతులకు : ముద్రణ :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు శ్రీ కళా ప్రింటర్స్‌,

గురుకృప గాంధీనగరం,

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాదు

హైదరాబాదు - 500 020. ఫోన్‌ : 7611864

శ్రీ శృంగేరిశ్రీ జగద్గురు సంస్థానమ్‌

శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణపారావారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణా సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్యక్రవర్త్యనాద్యవిచ్చిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్‌ దర్శన స్దాపనాచార్య వ్యాఖ్యాన సంహాసనా ధీశ్వర సకలనిగమాగమసారహృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదికమార్గప్రవర్తక సర్వతంత్ర సర్వతంత్రాది రాజధానీవిద్యానగర మహారాజధానీ కర్ణాటక సంహాసన ప్రతిష్ఠాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగ పురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీ మద్విద్యాశంకరపాద పద్మారాధక శ్రీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీస్వామి గురు కరకమల సంజాత'' శ్రీ జగద్గురు శృంగేరీ శ్రీమదభినవ విద్యాతీర్ద స్వామిభిః అనుగృహితం-

శ్రీ ముఖమ్‌

ఆస్మదత్యంత ప్రియశిష్య పలెంపాటి వెంకటేశ్వర్లు గారికి నారాయణస్మరణపూర్వకాశీస్సులు.

''పురాణన్యాయ మీమాంసా ధర్మ శాస్రాంగ మిశ్రితాః | వేదాః స్థానాని విద్యానాం ధర్మస్యచ చతుర్దశ.'' యని చతుర్దశ విద్యాస్థానములలో నొకటిగా పురాణము చెప్పబడియున్నది. వేదార్దనిర్ణయమున కుపకరించునది గావున పురాణమునకు ప్రాశస్త్యము గలదు. ధర్మార్థ కామమోక్షములను చతుర్విధ పురుషార్ధములకు అనేకములయిన ఉపాఖ్యానములద్వారా ప్రతిపాదించుటయే పురాణములందలి వైశిష్ట్యము. కావున పురాణములు అందరకును ఉపాదేయములు. అట్టి పురాణములను వేదవ్యాసమహర్షి రచించెను. ఆ పురాణములందు భాగవతపురాణము పేరెన్నికగన్నది. అది విష్ణు భాగవతమనియు దేవీభాగ వతమనియు రెండు విధములుగా నున్నది. ఈ రెండును పురాణ లక్షణలక్షితములై యొప్పారుచున్నవి.

ప్రస్తుతము మీరు ''శ్రీవేంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్టు'' అను పేరున ఒక సంస్దను స్దాపించి తన్మూలముగా అష్టాదశ పురాణములను ఆంధ్రానువాదముతో ప్రకటింప నిశ్చయించి ఇప్పుడు దేవీభాగవతమును అనువాద సహితముగ ప్రకటించుట ముదావహముగనున్నది. పరదేవత యొక్క మహాత్మ్యము అనేక విధములుగ ఈ పురాణమునందు చెప్పబడి యున్నది. దీనిని సరసమైన తెలుగున అనువదించిన అనువాదకుల కృషి మెచ్చదగియున్నది. సర్వజన సులభ##మైన రీతిలో నున్న ఈ యనువాదము చదువరుల కత్యంతోపకారము కాగలదు.

శ్రీశారదాచంద్రమౌళీశ్వరుల యనుగ్రహమున మీరు ఇదేరీతిగా అన్ని పురాణములను ఆంధ్రీకరింపజేసి ప్రకటింతురుగాక యనియు ఈ గ్రంధములు భక్త జనాదరణీయములై విలసిల్లుగాకయనియు నారాయణస్మరణ పూర్వకముగ ఆశీర్వదించుచున్నాము.

శృంగేరి

రక్తాక్షి మార్గశిర శుద్ధ చవితి సోమవారం ఇతి నారాయణ స్మరణమ్‌

26-11-1984 శ్రీః

సమర్పణమ్‌

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధారణా ధ్యానసమాధ్యష్టాంగ యోగానుష్టాన నిష్ఠ తపశ్చక్రవర్త్యనాద్యవిచ్చిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీశ్వర సకలనిగమాగమసారహృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదికమార్గప్రవర్తక సర్వతంత్ర స్వతంత్రాది రాజధానీ విద్యానగర మహారాజధానీ కర్ణాటక సంహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీ మద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగ పురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యా శంకర పాదపద్మారాధక శ్రీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీస్వామి కరకమలసంజాత శ్రీ జగద్గురు శృంగేరీ శ్రీమదభినవ విద్యాతీర్ధ స్వామి గురు కరకమల సంజాత శ్రీ భారతీతీర్ద స్వామినాం కరకమలయోః సాష్టాంగప్రణామ సహస్రపూర్వకం సప్రశ్రయం సాంజలి బంధంచ సమర్ప్యతే

ఆంధ్రలిపి ముద్రితం ఆంధ్రానువాద సమేతం చేదం శ్రీమద్దేవీ భాగవతమ్‌.

1. శ్రీ శృంగగిరి పీఠేశాన్‌ శంకరాన్‌ శ్రీ జగద్గురూన్‌|

విద్యాతీర్థ యతి శ్రేష్ఠాన్‌ సాష్టాంగం ప్రణతావయమ్‌ ||

2. జయతు జయతు | సాక్షా ద్దక్షిణా మ్నాయ శోభా

జయతు జయతు | శృంగేర్యాశ్రితా శారదాంబా

జయతు జయతు | గుర్వీ వ్యాసముఖ్యానుపూర్వీ

జయతు జయతు | విద్యాతీర్ధ పాదప్రసాదః

3. జయత్యాశ్రిత వాత్సల్యామృత పూర్ణ హృదంతరః

భారతీర్థ యతిరాట్‌ ధర్మసేతుర్జగద్గురుః

4. తేషాం శ్రీ భారతీతీర్థ యతీంద్రాణాం కరాబ్జయోః

ఆర్ప్యతే పరయా భక్త్యా దేవీ భాగవతం శివమ్‌

5. శ్రీమద్దేవులపల్లి వంశ్య శివరామార్యైర్యదాంధ్రీకృతమ్‌

దేవీ భాగవతం పురాణ మమలం వ్యాసోక్త సారస్వతమ్‌

ముద్రాప్యాంధ్ర లిపావుదార హృదయః శ్రీవేంకటేశః కృతీ

హస్తాబ్జే భవతాం సమర్పయతి తద్భక్త్యానుగృహ్ణన్తుతమ్‌.

హైదరాబాద్‌ ఇతి సవినయం ప్రార్ధయతి

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు

ప్రకాశకుల మనవి

శ్రీదేవీ కృపాకటాక్ష వీక్షణ ప్రభావమున శ్రీమద్దేవీ భాగవత పూర్వార్ధము (ప్రధమ స్కందము మొదలు షష్ఠస్కంధాంతము) ఆంధ్రానువాదముతో ముద్రితమై ఆంధ్ర జనులకు నందజేయబడినది. తరువాత త్వరలోనే ఈ ఉత్తరార్ధమును (7స్కం. నుండి 12 స్కం. వరకు) కూడ తెలుగువారికి నందజేయ గలుగుచున్నందులకు ''శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతీ ట్రస్ట్‌'' చాల సంతృప్తి నందుచున్నది.

ఈ మహా గ్రంధమునందలి విషయమును వివేచించు పీఠిక పూర్వార్ధముతోపాటే ముద్రించబడినది. కనుక దాని నిట మరల పునరావృతము చేయవలసిన పనిలేదు. ఈ ఉత్తరార్ధమునందు శ్రీదేవీ గీతలు-శ్రీగాయత్ర్యనుష్ఠానాదికము శ్రీదేవీ నివాసమగు మణిద్వీపపు వర్ణనము మొదలగు తాత్త్వికాంశములనేకములు కలవు. అవి భక్తిశ్రద్దలతో పఠించి మననము చేసిన వారికిని అందలి ఆయా విధానములతో శ్రీదేవీనామక పరతత్త్వము నారాధించిన వారికిని ఇహపర సుఖములు కరతలామలకములనునది ప్రత్యక్ష గోచరమగు విషయము.

కావున ఆంధ్రజను లెల్లరు ఈ సద్గృంధమును ఆయా విధముల వినియోగించుటయు విద్యావంతులగు వారు చదువురాని వారికిని దీనిని చదివి వినిపించి దీని యందలి తత్త్వము నట్టివారికి నందించి తన్మూలమున తాము తరించుటతో బాటు ఇతరులను గూడ తరింపజేయుట శ్రీవేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు సత్సంకల్పము.

అది నెరవేర నెల్లరును శ్రీదేవీ కృపాపాత్రులగుదురు గాక యని హృదయపూర్వకముగ నాకాంక్షించు

హైదరాబాద్‌

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

ది. 11-5-85

Sri Devi Bagavatham-2    Chapters