Sri Devi Bagavatham-2    Chapters   

అథ దశమోధ్యాయః

బభూవ చక్రవర్తీ సనృపతిః సత్యసంగరః | మాంధాతా పృథివీం సర్వామజయ న్నృపతీశ్వరః. 1

దస్యవోస్య భయత్రస్తాయము ర్గిరిగుహాసు చ | ఇంద్రేణాస్య కృతం నామ త్రసద్దన్యురితి స్ఫుటమ్‌. 2

తస్య బిందుమతీ భార్యా శశిబిందోః సుతాభవత్‌ | పతివ్రతా సురూపా చ సర్వలక్షణ సంయుతా. 3

తస్యా ముత్పాదయామాస మాంధాతా ద్వౌసుతౌ నృప | పురుకుత్సం సువిఖ్యాతం ముచుకుందం తథాపరమ్‌. 4

పురుకుత్సా త్తతోరణ్యః పుత్రః పరమ ధార్మికః | పితృభక్తిరత శ్చాభూత్‌ బృహతశ్వ స్తదాత్మజః. 5

హర్యశ్య స్తస్య పుత్రోభూ ద్దార్మికః పరమార్థవిత్‌ | తస్యా೭೭త్మజ స్త్రిధన్వా భూ దరుణ స్తస్య చాత్మజః. 6

అరుణస్య సుతః శ్రీమా న్సత్యవ్రత ఇతి శ్రుతః | సోభూ దిచ్ఛాచరః కామీ మందాత్మా హ్యతి లోలుపః. 7

స పాపాత్మా విప్రభార్యాం హృతవా న్కామమోహితః | వివాహే తస్య విఘ్నం స చకార నృపతేః సుతః. 8

మిళితా బ్రాహ్మణా స్తత్ర రాజాన మరుణం నృప | ఊచుర్బృశం సుదుఃఖార్తా హాహతాః స్మేతి చాసకృత్‌. 9

పప్రచ్ఛ రాజా తాన్విప్రా న్దుఃఖితా స్పురవాసినః | కిం కృతం మమ పుత్రేణ భవతా మశుభం దిజాః. 10

తన్ని శన్య ద్విజా వాక్యం రాజ్ఞో వినయపూర్వకమ్‌ | తదోచు స్త్వరుణం విప్రాః కృతాళీ ర్వచనా భృశమ్‌. 11

పదియవ యధ్యాయము

సూర్యవంశ రాజ వృత్తాంతము

సత్యప్రతిజ్ఞుడగు మాంధాత చక్రవర్తి యయ్యెను. ఆ రాజు భూమినెల్ల జయించెను. దస్యు లతనికి గడగడలాడి గిరిగుహలందు వసించుటవలన నింద్రు డితనికి త్రసద్దస్యుడను పేరిడెను. శశబిందుని కూతురు బిందుమతిని మాంధాత తన భార్యగ స్వీకరించెను. బిందుమతి పతివ్రత-సురూప-సర్వలక్షణసంయుత. రాజా! మాంధాత బిందుమతియందు పురు కుత్సుడు ముచుకుందుడను నిర్వురు ప్రసిద్దపుత్రులను కనెను. పురుకుత్సున కారణ్యకుడు పుట్టెను. అతడు పరమధార్మికుడు. పితృభక్తి తత్పరుడు. అరణ్యకునకు బృహదుశ్వుడు పుట్టెను. బృదహశ్వుని కొడుకు హర్యశ్వుడు అతడు పరమార్థవిదుడు- ధార్మికుడు. అతని కుమారుడు త్రిధన్వుడు-త్రిధన్వుని తనయు డరుణుడు. అరుణుని తనయుడు శ్రీమంతుడగు సత్యవ్రతుడు. అతుడు స్వేచ్ఛచారి-మందాత్మడు-కామి-అతిలోలుడు. ఆ రాకొమరుడు పాపాచారి. అతడు వివాహ మంగళ సమయమున నొక విప్రస్త్రీ నపహరించి విఘ్ను మొనరింపెను. అంత బ్రాహ్మణులు గుమిగూడి అరుణరాజును జేరి మేము బతులమైతిమని పల్మారు బిట్టు విలపించిరి. రాజు తన పురవాసులగు విప్రులు దుఃఖించుటగని విప్రులారా: నా కొడుకు మీ కేమి కీడు తలపెట్టనని యడిగెను. రాజు సవినయముగ బలుకుటవిని విప్రులు రాజు నాశీర్వదించి యిట్లనిరి.

బ్రహ్మణాఊచుః: రాజం స్తవ సుతేనా ద్య వివాహేపహృతా కిల | వివాహితా విప్రకన్యాబలేన బలినాం వర.

శ్రుత్వాతేషాం వచ స్తథ్యం రాజపరమ ధార్మికః | పుత్ర మాహ వృథా నామ కృతం తే దుష్టకర్మణా. 13

గచ్ఛ దూరం సుమందాత్మ న్దురాచచార గృహా న్మమ | న స్థాతవనిం త్వయా పాప విషయే మమ సర్వథా. 14

కుపితం పితరం ప్రాహ క్వ గచ్చామీతి వై ముహుః | అరుణ స్తమథోవాచ శ్వపాకైః సహ వర్తయ. 15

శ్వపచస్య కృతం కర్మ ద్విజదారాపహారణమ్‌ | తస్మత్తైః సహ సంసర్గం కృత్వా తిష్ఠ యథాసుఖమ్‌. 16

నాహం పుత్రేణ పుత్రార్థీ త్వయా చ కులపాంసన | యథేష్టం వ్రజ దుష్టాత్మ న్కీర్తినాశః కృత స్త్వయా. 17

స నిశమ్య పితు ర్వాక్యం కుపితస్య మహాత్మనః | నిశ్చక్రామ పురా త్తస్మాత్తరసా శ్వపచాన్య¸°. 18

సత్యవ్రత స్తదా తత్ర శ్వపాకైః సహవర్తతే | ధనుర్బాణధరః శ్రీమా న్కవచీ కరుణాలయః. 19

యదా నిష్కాసితః పిత్రా కుపితేన మహాత్మనా | గరుణాథ వసిష్టేన ప్రేరితోసౌ మహీపతిః. 20

తస్మా త్సత్యవ్రత స్తస్మి న్బభూవ క్రోధసంయుతః | వసిష్ఠే ధర్మశాస్త్రజ్ఞే నివారణపరాజ్ముఖే. 21

కేన చి త్కారణనాథ పితా తస్య మహీపతిః | పుత్రార్థేసౌ తపస్తప్తుం పురం త్యక్త్వా వనం గతః. 22

నవవర్ష తదా తస్మి న్విషయే పాకశాసనః | సమా ద్వాదశ రాజేంద్ర తేనాధర్మేణ సర్వథా. 23

రాజా! మహాబలశాలీ! వివాహము జరుగునపుడు నీ కొడుకొక విప్రకన్యను బల్మి నపహరించెను. వారి సత్య వాక్కులు విని పరమధార్మికుడగు రాజు తన కొడుకుతో నిట్లనెను. ఓరి దుష్టుడా! నీ పేరు వ్యర్థమైనదిరా. ఓరి మందమతీ! దురాచారీ! పాపీ! ఇక నీవు నాయింట క్షణమైన నిలువవద్దు. నా యిల్లు వదలివెళ్ళము. కోపించిన తన తండ్రితో నేనెక్కడి కేగుదునని సత్యవ్రతు డడుగగ నీవు చండాలురతోగూడి తిగురుమని యరుణు డనెను. నీవు బ్రహ్మణ స్త్రీ నపహరించి చండాలుని పని చేసితివి. కనుక నీవు చండాలుర సహవాసముతో సుఖముగ నుండుము. ఓరి కులముచెడ పుట్టినవాడా! నీ వంటి కొడుకువలన నా కపకీర్తి గల్గినది. ఓరి దుష్టుడా ! నీ నచ్చినచోటి కేగుము. నా కీర్తి మంటగలిపితివి. మహాత్ముడగు తన తండ్రి కోపముతో నిట్లు పలుకగ సత్యవ్రతుడు వెంటనే పురము వెడలి చండాలురను గలిసి తిరుగసాగెను. అట్లు సత్య వ్రతుడు చండాలురను గూడి విల్లమ్ములుదాల్చి కవచము తొడిగి దయగలవాడై యుండెను. అరుణ మహారాజు తన కులగురు వగు వసిష్ఠుని ప్రేరణచేత నట్లు కోపించి తన కొడుకును వెడలగొట్టెను. ధర్మశాస్త్రజ్ఞుడైన వసిష్ఠుడు తన్నాపలేదని సత్యవ్రతు నకు వసిష్ఠునందు క్రోధము గల్గెను. తర్వాత నేదో కారణమున నరుణుడు పుత్రార్థియై తపమొనరించుటకు నగరము వదిలి వనము జేరెను. ఈ యధర్మమువలన నింద్రు డా రాజ్యములో పండ్రెండేడులు వానలు కురియలేదు.

విశ్వామిత్ర స్తదా దారాం స్తస్మిం స్తు విషయే నృప | సంన్యస్య కౌశికీతీరే చచార విపులం తపః. 24

కాతరా తత్ర సంజాతా భార్యా వైకౌశికస్య హ | కుటుంబభరణార్థాయ దుఃఖితా వరవర్ణినీ. 25

బాలకాన్‌ క్షుధయా೭೭క్రాంతా న్రుదతః పశ్యతీ భృశమ్‌ | యాచమానాంశ్చ నీవారా న్కష్టమాప పతివ్రతా. 26

చింతయామాస దుఃఖార్తా తోకాన్వీక్ష్య క్షుధా೭೭తురాన్‌ | నృపో నాస్తి పురే హ్యద్య కంయాచే వాకరోమికిమ్‌. 27

నమే త్రాతాస్తి పుత్రాణాం పతిర్మేనాస్తి సన్నిధౌ | రుదంతి బాలకాః కామం ధిజ్‌ మే జీవన మద్యవై. 28

ధనహీనాం చమాం త్యక్త్వా తపస్తప్తుం గతః పతిః | న జానాతి సమర్థోపి దుఃఖితాం ధనవర్జితామ్‌. 29

బాలానాం భరణం కేన కరోమి పతినా వినా | మరిష్యంతి సుతాః సర్వేక్షుధయా పీడితా భృశమ్‌. 30

ఏకం సుతం తు విక్రీయ ద్రవ్యేణ కియతా పునః | పాలయామి సుతా నన్యా నేషమే విహితో విధిః. 31

సర్వేషాం మారణం నాద్దా యుక్తం మమ విపర్యయే | కాలస్య కలనాయా హం విక్రీణామి తథా೭೭త్మజమ్‌. 32

హృదయం కఠినం కృత్వా సంచింత్య మనసా సతీ | సా దర్బ రజ్జ్వా బద్ధ్వాథ గలే పుత్రం వినిర్గతా. 33

మునిపత్నీ గలే బద్ధ్వా మధ్యమం పుత్ర మౌరసమ్‌ | శేషస్య భరణార్థాయ గృహీత్వా చలితా గృహాత్‌. 34

దృష్టా సత్యవ్రతేనా೭೭ర్తా తాపసీ శోకసంయుతా | పప్రచ్ఛ నృపతి స్తాం తు కిం చికీర్షసి శోభ##నే. 35

రుదంతం బాలకం కంఠే బద్ధ్వానయసి కాధునా | కిమర్థం చారు సర్వాంగి సత్యం బ్రూహి మమాగ్రతః. 36

ఆ దినములలో విశ్వామిత్రుడు తన భార్యాపుత్రులను నా రాజ్యములో వదలి కౌశికీతీర్థమున గొప్ప తప మొనరించెను. విశ్వామిత్రుని భార్య దీనయునార్తయునై దుఃఖితురాలై తన కుటుంబమును పోషించుకొనజాలకుండెను. తన కొడుకు లాకటిమంటచే నేడ్చుచు నీ వారన్నము యాచించుచుంటగని యా పతివ్రత బాధ పడెను. అట్లు తన కొమర లాకలిమంటచే దుఃఖార్తులై యుంటగని యీ పురమున రాజు లేడు. ఎవని యాచింతునని యామె వెత జెందెను. ఇపుడు నన్ను నా పుత్రు లను రక్షించువారు లేరు. నా భర్తయును నా చెంతలేడు. పిల్ల లేడ్చుచున్నారు. నా బ్రతుకెంత పనికిమాలినది. బీదరాలనగు నన్ను విడనాడి నా భర్త తపము చేసికొనవెళ్ళెను. అతడు సమర్థుడయ్యును దుఃఖితురాలనగు నా బాధలు తెలిసికొనుటలేదు. మగడు లేనిచో పిల్లల నెవరు పోషింతురు? నా సుతు లాకలిమంటచే నకనకలాడి చత్తురు. కనుక వీరిలో నొకని నమ్మి యా డబ్బుతో మిగిలినవారిని పోషించుట నా కిపుడు తగిన పని. ఇట్లు చేయ కిందఱి నాకలిమంటకు చంపుట తగదు. ఎట్లో కాల మీడ్చుట కొక్కని తప్పక విక్రయించగలను. ఆ సతి యిట్లు గుండె ఱాయి చేసికొని దర్బత్రాటిని తన పుత్రుని మెడకు వేసి బయలుదేరెను. ఆ మునుపత్ని నడిమివాని మెడకు త్రాడువేసి తక్కినవారిని పోషించుట కిల్లు వెడలినంతలో సత్య వ్రత రాజపుత్రు డామెను జూచి యిట్లనెను. ఓ శోభనాంగీ! నీవు శోకమూర్తివై యేమి పని చేయుచున్నావు. సర్వాంగ సుందరీ! ఇపు డీ బాలుని మెడకు త్రాడుగట్టి యత డేడ్చుచుండగ నీ వెచటికి గొనిపోవుచున్నావు. నిజము పలుకుము.

ఋషిపత్న్యువాచ : విశ్వామిత్రస్య భార్యాహం పుత్రోయంమే నృపాత్మజ |

విక్రేతు మౌరసం కానం గమిష్యే విషమేసుతమ్‌. 37

అన్నం నాస్తి పతి ర్ముక్త్వా గత స్తప్తుం నృప క్వచిత్‌ | విక్రీణామి క్షుధార్తైనం శేషస్య భరణాయ వై. 38

రాజోవాచ : పతివ్రతే రక్ష పుత్రం దాస్యామి భరణ తవ | తావ దేవ పతిస్తే త్ర వనాచ్చైవా೭೭గమిష్యతి. 39

వృక్షే తవా೭೭శ్రమాభ్యాశే భక్ష్యం కించి న్నిరంతరమ్‌ | బంధయిత్వా గమిష్యామి సత్యమేత ద్ర్బవీమ్యహమ్‌. 40

ఇత్యుక్తా సా తదా తేన రాజ్ఞా కౌశికకామినీ | విబంధం తనయం కృత్వా జగామా೭೭శ్రమ మండలమ్‌. 41

సోభవ ద్గాలవోనామ గలబంధా న్మహాతపాః | సాతు స్వస్యా೭೭శ్రమేగత్వా ముమోద బాలకైర్వృతా. 42

సత్యవ్రత స్తు భక్త్యాచ కృపయా చ పురిప్లుతం | విశ్వామిత్ర స్య చ మునేః కలత్రం తద్బభార హ. 43

వనే స్థితా న్మృగా న్హత్వా వరాహాన్మహిషాం స్తథా | విశ్వామిత్ర వనాభ్యాశే మాంసం వృక్షేబబంధహ. 44

ఋషిపత్నీ గృహీత్వా తన్మాంసం పుత్రా న దాత్తతః | నిర్వృతం పరమాం ప్రాప ప్రాప్య భక్ష్యమనుత్తమమ్‌. 45

అయోధ్యాం చైవ రాజ్యం చ తథైవాంతః పురం మునిః | గతే తప్తుం నృపే తస్మి స్వసిష్ఠః పర్యరక్షత. 46

సత్యవ్రతోపి ధర్మాత్మా హ్యతిష్ఠన్నగరా ద్బహిః | పితురాజ్ఞాం సమాస్థాయ పశుఘ్నవ్రత వాన్వనే. 47

సత్యత్రో హ్యకస్మా చ్చ కస్యచిత్రారణా న్నృపః | వసిష్ఠే చా ధికం మన్యుం ధారయామాస నిత్యదా. 48

ఋషిపత్ని యిట్లనెను : ఓ రాకుమారా! నేను విశ్వామిత్రుని భార్యను. ఇతడు నా కొడుకు. ఈ నా కన్న బిడ్డ నీ పట్టణమున నమ్ముట కేగుచున్నాను. రాజా! నా పతి మమ్ము విడనాడి తపమున కేగెను. మేము తిండిలేక మలమల మాడు చున్నాము. తక్కినవారిని పోషించుట కితని నమ్ముచున్నాను అనెను. రాజిట్లనెను., ఓ పతివ్రతా! ఈ పుత్రుని కాపాడుము. నీకు భరణ మిత్తును. అంతలో నీ పతియును వనమునుండి తిరిగి రాగలడు. నీ యాశ్రమముచెంత నున్న చెట్టునకు ప్రతిదిన మన్నముమూట కట్టి వెళ్ళగలను. ఇది నా సత్యవ్రతము సుమ్ము. అట్లు రాజు పలుకగ మునిపత్ని తన కొడుకు మెడ బంధము తొలగించి తన యాశ్రమము చేరెను. గలమున (మెడలో) బంధ ముండుటవలన నతడు గాలవ మహాముని యయ్యెను. ఆమె తన యాశ్రమమేగి బాలకులతో సంతోషముగ కాలము గడుపుచుండెను. సత్యవ్రతుడును దయాభక్తులతో నిండి విశ్వామిత్ర మునిపత్నిని పోషించుచుండెను. రాజు వనమందలి జింకలను దున్నలను పందులను చంపివాని మాంసమును విశ్వామిత్రు నాశ్రమముచెంత చెట్టునకు కట్టుచుండెను. అట్లు మునిపత్ని ప్రతిదినము మాంసముబడసి తాను దీని పుత్రులకు తినిపించి సుఖముగ నుండెను. అరుణు డడవులకు తపమున కేగుటవలన నయోధ్యారాజ్యము నంతఃపురమును వసిష్ఠుడు పరి రక్షించుచుండెను. సత్యవ్రతుడును ధర్మాత్ముడై తండ్రి యాజ్ఞ ననుసరించి నగరు బయట వసించి వన్యజంతువులను వేటాడు చుండెను. ఏదో నెపమున సత్యవ్రతు డకస్మాత్తుగ వసిష్ఠునిపై కోపముతో నుండెను.

త్యాజ్యమానం వనే పిత్రా ధర్మిష్ఠంచ ప్రియం సుతమ్‌ | న వారయామాస ముని ర్వసిష్ఠః కారణన హ. 49

పాణిగ్రహణమంత్రాణాం నిష్ఠా స్యాస్తప్తమే పదే | జానన్నపి స ధర్మాత్మా విప్రదారపరిగ్రహే. 50

కస్మిం శ్చి ద్దివసేరణ్య మృగాభావే మహీపతిః | వసిష్ఠస్య చ గాం దో గ్దృమపశ్యద్వనమధ్యగామ్‌. 51

తాం జఘాన క్షుధార్తస్తు క్రోధాన్మోహాచ్చ దస్యువత్‌ | వృక్షే బబంధ తన్మాంసం నీత్వా స్వయ మభక్షయత్‌.

ఋషిపత్నీ సుతా న్సర్వా న్బోజయామాస తత్తదా | శంకమానా మృగస్యే తి న గోరితి చ సువ్రతా. 53

వసిష్ఠ స్తు హతాం దోగ్ద్రీం జ్ఞాత్వా క్రుద్దస్తమ బ్రవీత్‌ | దురాత్మ న్కిం కృతం పాపం ధేను ఖాతాత్పిశాచవత్‌.

ఏవం తే శంకవః క్రూరాః పతంతు త్వరితా స్త్రయః | గోవధాహారకరణా త్పితుః క్రోధాత్తథా భృశమ్‌. 55

త్రిశంకు రితి నామ్నావై భువి ఖ్యాతో భవిష్యసి | పిశాచ పూర మాత్మానం దర్శయ న్సర్వ దేహినామ్‌. 56

వ్యాసః : ఏవం శప్తో వసిష్ఠేన తదా సత్యవ్రతో నృపః | చచార చ తపస్తీవ్రం తస్మిన్నేవా೭೭శ##మే స్థితః. 57

కస్మా చ్చి న్మునిపుత్రాత్తు ప్రాప్యమంత్ర మనుత్తమమ్‌ | ధ్యాయ న్బగవతీం దేవీం ప్రకృతిం పరమాం శివామ్‌.

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ సప్తమస్కంధే దశమోధ్యాయః.

తన తండ్రి ధర్మిష్ఠుడు ప్రియసుతుడగు తన్ను నడవుల కంపునపుడు వసిష్ఠుడతని వారింపలేదని సత్యవ్రతునకు కోపము గల్గెను. వివాహము పూర్తియగుటకు భార్యాభర్త లేడడుగులు కలిసి నడువవలయును. అది జరుగక మునుపే విప్ర భార్యను నేను గ్రహించితిని. ఆ ధర్మాత్మున కది తెలియదా అని అతడనుకొనెను. ఒక నా డడవిలో రాజునకు మృగములు కని పించలేదు. అంతలో నట్టడివిలో వసిష్ఠుని గోవతని కంటబడెను. అతడు నీచునివలె నాకలిమంటచే కోపముతో దానిని చంపి దాని మాంసము తిని మిగిలినది చెట్టునకు కట్టెను. సువ్రతయగు మునిపత్ని యది గోమాంసమని తెలియక మృగమాంసమని తలచి తన కొడుకుల కది తినిపించెను. వసిష్ఠుడు తన గోవు చంపబడు టెఱింగి కోపముతో నిట్లనెను. ఓరి దుర్మార్గుడా! పిశాచునివలె గోవును చంపి పాపము మూటకట్టుకొంటివి. కనుక స్త్రీ హరణము తండ్రి కోపము గోవధ యీ మూడు చెడు మచ్చలు నీకు గల్గుగాత. ఈ మూడు శంకలవలన నీవు త్రిశంకువుగ పేరు గాంతువు. నీ వెల్లరకు నీ పిశాచరూపము చూపించుచు తిరుగుచుందువు. సత్యవ్రతు డట్లు వసిష్ఠునిచే శపింపబడి తన యాశ్రమమందుండి తీవ్ర తప మాచరించెను. అత డొకానొక మునిపుత్రుని దయవలన పరా ప్రకృతి-శివాభగవతియగు శ్రీదేవియొక్క మంత్రము గ్రహించి జపింపసాగెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి సప్తమ స్కంధమున దశమాధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters