Sri Devi Bagavatham-2    Chapters   

అథ త్రయశ్చత్వారింశోధ్యాయః.

నారద ఉవాచ: నారాయణ మహాభాగ నారాయణ మమప్రభో | రూపేణౖన గుణనైవ యశసా తేజసా త్విషా. 1

త్వమేవ జ్ఞానినాం శ్రేష్ఠః సిద్దానాం యోగినాం మునే | తపస్వినాం మునీనాం చ వరో వేదవిదాం వరః. 2

మహా లక్ష్మ్యా ఉపాఖ్యానం విజ్ఞాతం మహదద్బుతమ్‌ | అన్యత్కించి దుపాఖ్యానం నిగూడం వదసాంప్రతమ్‌. 3

అతీవ గోపనీయం య దుపయుక్తం చ సర్వతః | అప్రకాశ్యం పురాణషు వేదోక్తం ధర్మ సంయుతమ్‌. 4

నారాయణ ఉవాచ : నానా ప్రకార మాఖ్యాన మప్రకాశ్యం పురాణతః |

శ్రుతం కతివిధం గూఢ మాస్తే బ్రహ్మన్సు దుర్లభమ్‌. 5

తేషుయత్సార భూతం చ శ్రోతుంకిం వాత్వ మిచ్చసి | తన్మే బ్రూహి మహాభాగ వశ్చా ద్వక్ష్యామి తత్పునః. 6

నారద ఉవాచ : స్వాహాదేవీ హవిర్దానే ప్రశస్తా సర్వ కర్మసు | పితృదానే స్వధాశస్తా దక్షిణా సర్వతో వరా. 7

న తాసాం చరితం జన్మఫలం ప్రాధాన్యమేవచ | శ్రోతు మిచ్ఛామిత్వ ద్వ క్త్రా ద్వద వేదవిదాం వర. 8

సూత ఉవాచ : నారదస్యవచః శ్రుత్వా ప్రహస్య మునిసత్తమః |

కథాం కథితు మారేభే పురాణోక్తాం పురాతనీమ్‌. 9

నారాయణ ఉవాచ : సృష్టేః ప్రథమతో దేవాః స్వాహారార్ధం యయుః పూరా |

బ్రహ్మలోకం బ్రహ్మసభా మాజగ్ముః సుమనోహరామ్‌. 10

గత్వా నివేదనం చక్రు రాహార హేతుకం మునే | బ్రహ్మా శుత్వా ప్రతిజ్ఞాయ నిషేవే శ్రీహరిం పరమ్‌. 11

నారద ఉవాచ : యజ్ఞరూపో హిభగన్కలయా చ బభూవహ |

యజ్ఞే యద్య ద్దవిర్ధానం దత్తం తేభ్య శ్చ బ్రాహ్మణౖః. 12

నారాయణ ఉవాచ: హ విర్దదతి విప్రాశ్చ భక్త్యా చ క్షత్రియాదయః |

సురానైవ ప్రాప్వువంతి తద్దానం ముని పుంగవ. 13

నలువదిమూడవ అధ్యాయము.

స్వాహాదేవీ చరితము.

నారద డిట్లనెను : ప్రభూ! నారాయణ! మహానుభావా! రూప - గుణ - కీర్తి - తేజః - శోభలం దెల్ల నీవు గొప్పవాడవు. సాటిలేనివాడవు. నీవు జ్ఞానులలో - సిద్ధయోగులలో - తపస్వులలో - మునులలో - వేదవేత్తలలో శ్రేష్ఠుడవు. నీ వలన శ్రీ మహాలక్ష్మీ పావన చరిత్ర మద్బుతమగుదానిని వింటిని. ఇపు డింకేదైన రహస్యమైన యుపాఖ్యానము వినిపింపుము. పూరా ణములలో తెల్పబడనిది వేద - ధర్మ సమ్మతమైనది అగుచు ఎల్లరికి ప్రియమైన దానిని నాకు తెల్పుము. నారాయణు డిట్లనెను. ఓ విప్రసత్తమా! పురాణములందు పలు విధములైన యాఖ్యానములు చెప్పబడెను. దుర్లభములైన దేవి గాథ లెన్నో విధములుగ చెప్పబడినవి. వానన్నిటిలో నీవు దేని వినదలతువో ముందుగ తెలుపుము. తర్వాత నేను దాని నీకు పలుకుదును. నారదు డిట్లనెను: హవిస్సు నొసంగుటలో సర్వకర్మలందును స్వహాదేవి ప్రశంసనీయురాలు. కన్యాప్రదాన మందు స్వధాదేవి ప్రముఖురాలు. ధక్షిణాదేవి యెల్ల కర్మలందును. ప్రశంసింపబడదగినది. వేదవిదుడా! వీరి పుట్టు పుర్వోత్తరములు మహిమలు ప్రాధాన్యమును నీ నోట వినదలతును. సూతుడిట్లనెను : అను నారదుని మాటలు విని నవ్వి నారాయణుడు పురాణ ప్రసిద్దము - పురాతనమునైన కథ మఱియొకటి చెప్పసాగెను. నారాయణు డిట్లనెను : మొదటి సృష్టిలో దేవత లెల్లరును తమ తమ యాహారము నిమిత్తము బ్రహ్మాలోకమందలి సుమనోహారమైన బ్రహ్మకొలువు కూటమున కరిగిరి. వారచట తమ యాహార సిద్ధి గూర్చి బ్రహ్మకు విన్నవించిరి. అది విని బ్రహ్మ వారికి ప్రతిజ్ఞచేసి శ్రీహరిని సంస్తుతించె. నారదు డిట్లనెను : పరమాత్మ యజ్ఞస్వరూపుడు. యజ్ఞ మతని కళ-యజ్ఞమున బ్రాహ్మణు లొసంగు హవిర్దాన ములను దేవతలు గ్రహింతురు గదా. నారయాణు డిట్లనెను : ఓ మునిపుంగవా! బ్రాహ్మణులు క్షత్రియులును పరభక్తితో హవిర్దానము చేయుదురు. కాని యా దానమును దేవతలు స్వీకరింపరు.

దేవా విషణ్ణా స్తే సర్వేతత్సభాం చయయుః పునః | గత్వా నివదేనం చక్రురాహారా భావహేతుకమ్‌.. 14

బ్రహ్మా శ్రుత్వాతు ధ్యానేన శ్రీకృష్ణం శరణం య¸° | పూజాం చ కార ప్రకృతేర్ధ్యానే నైవతదాజ్ఞయా. 15

ప్రకృతేః కళయా చైవ సర్వశక్తి స్వరూపిణీ | అతీవ సుందరీ శ్యామా రమణీయా మనోహరా. 16

ఈషద్దాస్య ప్రసన్నాస్యా భక్కాను గ్రహకాతరా | ఉవాచేతి విధే రగ్రే పద్మయోనే వరం వృణు. 17

విధిస్త ద్వ చనం శ్రుత్వా సంభ్రమాత్సమువాచతామ్‌ |

ప్రజాపతిరువాచ : త్వమగ్వేర్దాహికా శక్తి ర్బవ యాతీవ సుందరీ. 18

దగ్దుం నశక్తః ప్రకృతీర్హుతాశ శ్చ త్వయావినా | త్వన్వామో చ్చార్యమంత్రాంతే యోదాస్యతి హవిర్నరః. 19

సురేభ్య స్తత్ర్పా ప్నువంతి సురః సానంద పూర్వకమ్‌ |

అగ్వేః సంపత్స్వరూపా చ శ్రీ రూపాసా గృహేశ్వరీ. 20

దేవానాం పూజితాశశ్వ న్నరాదీనాం భవాంబికే | బ్రహ్మణ శ్చ వచః శ్రుత్వాసా విషణ్ణా బభూవహ. 21

తమువా చ తతో దేవీ స్వాభిప్రాయం స్వయంభువమ్‌ |

స్వాహోవాచ: ఆహం కృష్ణం భజిష్యామి తపసా సుచిరేణ చ. 22

బ్రహ్మం స్త దన్యం యత్కించిత్స్వ ప్న వద్ర్బమ మేవచ |

విధాతా జగతస్త్వం చ శంభుర్మృత్యుంజయోవిభుః. 23

బిభర్తిశేషో విశ్వం చ ధర్మః సాక్షీ చ ధర్మిణామ్‌ | సర్వా ద్య పూజ్యో దేవానాంగణషు చ గణశ్వరం. 24

ప్రకృతి సర్వసంపూజ్యా యత్ప్ర సా దాత్పు రాభవత్‌ |

ఋషయో మునయశ్చైవ పూజితా యన్ని షేవయా. 25

తత్పాద పద్మం నియతం భావనే చింతయా మ్యహమ్‌ | పద్మాస్యా పాద్మ మిత్యుక్త్వా పద్మనాభాను సారతః. 26

అందుచే దేవత లెల్లరును. వెలవెలవారిన మోములతో బ్రహ్మసభకు వెళ్ళి తమ యాహారములేమి నతనికి తెల్పిరి. బ్రహ్మ యపుడు ధ్యానములో సర్వ మెఱింగి శ్రీకృష్ణ పరమాత్ముని శరణు సొచ్చెను. అతని యాజ్ఞచే నతడు మూలప్రకృతి నారాధించెను. అపుడు మూలప్రకృతి కళ సర్వశక్తి స్వరూపిణి - రమణీయ - సుమనోసహరాంగి - అందాల కందమైన శ్యామాంగి యుగు స్వాహాదేవి చిర్నగవులు చిందించుచు భక్తనుగ్రహ తత్పరతతో బ్రహ్మ ముందు ప్రత్యక్షమై 'ఓ బ్రహ్మా! వరమడుగు' మని పలికెను. దేవి వాక్కు విని బ్రహ్మ సంభ్రమముతో నామె కిట్లనెను. ఓ పరమసుందరీ! నీ వగ్నిలోని దహనశక్తివి. నీ శక్తి లేనిచో భౌతికాగ్ని దహింపజాలదు. మంత్రము చివర నీ నామ ముచ్చరించి మరుడు హవిర్దానము చేయవలయును. అపుడు దేవత లానందములతో ప్రసన్నులగుదరు. అగ్నికి సంపద లిచ్చుదానవు - శ్రీరూపిణిని - గృహేశ్వరిని నీవే. అమ్మా! నీవు దేవ - మానవులకు పూజవీయురాలవు గమ్మా! అను బ్రహ్మ వాక్కులు విని యామె యాలోచించెను. అంత వెంటనే దేవి తన యభ్రిపాయమును బ్రహ్మ కిట్లనెను. నేను చాలకాలమువఱకు శ్రీకృష్ణుని గూర్చి తపము చేయుదును. కృష్ణుడు దక్క మిగిలిన దంతయును కల వంటిది. భ్రమ మాత్రమే కదా. నీవు జగములకు సృష్టి కర్తవు. శంభుడు - మృత్యువు- సంహారకుడు - శేషుడు విశ్వమును మోయును. ఎల్ల ధర్మములకు ధర్మ దేవత సాక్షి. గణములం దెల్లగణపతి మొదట పూజింపదగినవాడు. వీరివలెవే ప్రకృతియును శ్రీకృష్ణుని దయవలన సర్వ పూజనీయురా లయ్యెను. కృష్ణసేవ వలననే మునులు ఋషులు పూజనీయులైరి. నేనును వారివలెనే కృష్ణుని పదపద్మముల నిరంతరము నెమ్మది భావింతును. అని పద్మాననయగు స్వాహదేవి పద్మజునితో పలికి పద్మనాభుని గూర్చి తపింప తలచెను.

జగామ తపసే దేవీ ధ్యాత్వా కృష్ణం నిరామయమ్‌ | తపస్తేపే వర్షలక్ష మేకపాదేన పద్మజా. 27

తదా దదర్శ శ్రీ కృష్ణం నిర్గుణం ప్రకృతేః పరమ్‌ | అతీవ కమనీయం చ రూపం దృష్ట్వా చరూపిణీ. 28

మూర్చాం సంప్రాప కాలేన కామేశస్య చ కాముకీ | విజ్ఞాయ తదభి ప్రాయం సర్వజ్ఞ స్తామువా చ హ. 29

సము త్ధాప్య చ తాం క్రోడే క్షీణాంగీం తపసాచిరమ్‌ |

శ్రీభాగవాను వాచ : వారా హే వైత్వ మంవేన ననపత్నీ భవిష్యసి. 30

నామ్నా నాగ్న జీతీ కన్యా కాంతే నగ్నజీతస్య చ | ఆధునాగ్నే ర్దాహికా త్వం భవపత్నీ చ భామినీ. 31

మంత్రాంగరూపా పూజ్యా చ మత్ర్ప సా దాద్బ విష్యసి |

వహ్వి స్త్వాం భక్తి భావేన సంపూజ్య చ గృహేశ్వరీమ్‌;. 32

రమిష్యతి త్వయాసార్ధం రమయారమణీయయా | ఇత్యుక్త్వాంతర్దధే దేవో దేవీం సంభాష్యనారద. 33

తత్రా೭೭జగామ సంత్రస్తో వహ్ని ర్ర్బహ్మ నిదేశతః | సామవేదోక్త ధ్యానేన ధ్యాత్వాతాం జగదంబికామ్‌. 34

సంపూజ్య పరితుష్టావ పాణిం జగ్రాహమంత్రతః | తదా దివ్యం వర్షశతం స రేమే రమయా సహ. 35

అతీవ నిర్జనే దేశే సంభోగ సుఖదే సదా | బభూవ గర్బ స్తస్యాం చ హూతాశ్చస్య చ తేజసా. 36

తం దధార చ సాదేవీ దివ్యం ద్వాదశ వత్సరం | తతః సుషావ పుత్రాం శ్చ రమణీ యాన్మనోహరన్‌. 37

దక్షిణాగ్ని గార్హ పత్యాహ వనీయా న్క్రమేణ చ | ఋశయో మునయశ్చైవ బ్రాహ్మణాః క్షత్రియాదయః. 38

స్వాహాంతం మంత్రము చ్చార్య హ విర్దానం చ చక్రిరే |

స్వాహా యుక్తం చ మంత్రంచ యోగృహ్ణాతి ప్రశస్తకమ్‌. 39

సర్వ సిద్ధి ర్బవేత్తస్య మంత్ర గ్రహణ మాత్త్రతః | విషహీనో యథా సర్పో వేదహీనో యథాద్విజః. 40

దేవి నిరామయుడగు కృష్ణుని ధ్యానించి తపము సాగించెను. ఆమె యొంటి పాదముపైనిలిచి లక్షయేండ్లు తపించెను. అంత నామె ప్రకృతిపరుడు నిర్గుణుడు కమనీయ సుందరుడు నగు శ్రీ కృష్ణుని దివ్యమంగళ స్వరూపము కన్ను లార గాంచెను. స్వాహాదేవి కామముతో కామేశుడగు కృష్ణుని రూప సౌందర్యమునకు ముగ్ధురాలయ్యెను. అపుడు సర్వజుడామె యెడదలోని కోర్కితెలిసికొని చిరకాల తపముచే కృషించిన యంగములుగల యామెము లేవదీసి తన తొడలపై నిడుకొని ఆమెతోనిట్లు పలికెను. నీవు వరాహ కల్పమున నా భార్యవు గాగలవు. దేవీ! ప్రేయసీ! నీవు నగ్నజితచుని కూతురుగ బుట్టి నగ్నాజితి యను పేర నొప్పుదువు. ఇపుడు మాత్రము నీ వగ్నికి పత్నివి గమ్ము. నా దయవలన నీవు మంత్రాంగరూపవు పూజనీయ వగుదువు. అగ్వి నిన్ను భక్తిభావముతో గృహలక్ష్మిగ గ్రహించును. అగ్ని రమణీయనగు నీతో రమింతి సుఖించును. అని స్వాహాదేవితో కృష్ణ భగవానుడు పలికి వెంటనే యంతర్ధాన మొందెను. అంత బ్రహ్మ యాదేశానుసార మగ్వి సామవేదోక్త ప్రకారమున స్వాహాదేవిని ధ్యానించి పూజించెను. అటుల పూజించి సమంత్రకముగ నగ్వి హోత్రుడు స్వాహాదేవిని చేపట్టి యామెతో వంద దివ్యసంవత్సరములు సుఖముగ గడపెను. అగ్నితేజము వలన నామె గర్బము దాల్చెను. పండ్రెండు దివ్యసంవత్సరములు గర్బము దాల్చి తర్వాత అందమైన. పుత్రులను ముగ్గురిని కనెను. వారిని వరుసగా దక్షిణాగ్వి గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని యందురు. నాటినుండి ఋషులు మునులు బ్రహ్మాణులు క్షత్రియులు మొదలగువారును మంత్రములకు చివర స్వాహాపదము చేర్చి వేల్చిరి. ప్రశస్తమైన స్వాహాంతమైన మంత్రముతో వేల్చినచో అట్టి మంత్రములు సిద్ధు లన్నియు గల్గించును. విషములేని సర్పము వేదము రాని ద్విజుడు.

పతి సేవావిహీనా స్త్రీ విద్యా హీనోయథా పూమాన్‌ | ఫలశాఖా విహీన శ్చ యథా వృక్షోహి నిందితః. 41

స్వాహా హీన స్తథా మంత్రో నహుతః ఫలదాయకః | పరితుష్టా ద్విజాః సర్వే దేవాః సంప్రాపురాహుతీః. 42

స్వాహాం తే నైవ మంత్రేణ సఫలం సర్వమేవ చ | ఇత్యేవం కథితం సర్వం స్వాహోపాఖ్యానముత్తమమ్‌. 43

సుఖదం మోక్షదం సారం కింభూయఃశ్రోతు మిచ్ఛసి |

నారద ఉవాచ : స్వాహా పూజా విధానం చ ధ్యానం చ ధ్యానంస్తోత్రమ మునీశ్వర.44

సంపూజ్య వహ్ని స్తుష్టావ యేన తద్వద మేప్రభో | శ్రీనారయణ ఉవాచః ధ్యానం చ సామవేదోక్తం స్తోత్ర పూజా విధానకమ్‌. 45

వదామి శ్రూయతాం బ్రహ్మ న్సావధానో మునీశ్వర | సర్వయజ్ఞారంభ కాలే శాలగ్రా మేఘటేథవా. 46

స్వాహాం సంపూజ్య యత్నేన యజ్ఞం కుర్యాత్పలాప్తయే |

స్వాహాం మంత్రాంగయుక్తాం చ మంత్ర సిద్ధి స్వరూపిణీమ్‌. 47

సిద్దాం చ సిద్ధిదాం నౄణం కర్ణణాం ఫలదాం శుభామ్‌ | ఇతిధ్యాత్వా చ మూలేన దత్వాపాద్యా దికం నరః. 48

సర్వి సిద్ధిం లబేత్త్సు త్వా మూల మంత్రం మునే శృణు |

ఓంహ్రీం శ్రీం వహ్నిజా యాయై దేవ్యై స్వాహేత్యనేన చ. 49

యః పూజయే చ్చతాం భక్త్యా సర్వేష్టం సంభ##వేద్ద్రువమ్‌ |

వహ్నిరువాచ : స్వాహా వహ్ని ప్రియా వహ్నిజాయా సంతోషకారిణీ. 50

శక్తిఃక్రియా కాలదాత్రీ పరిపాకకరీ ధ్రవా | గతిః సదానరాణాం చ దాహికా దహనక్షమా. 51

సంసారసారరూపా చఘోర సంసారతారిణీ | దేవజీవనరూపా చ దేవపోషణ కారిణీ. 52

షోడశైతాని నామానియః పఠేద్బక్తి సంయుతః | సర్వ సిద్ధి ర్బ వేత్తస్య ఇహలోకే పరత్ర చ. 53

నాంగహీనే భ##వేత్త స్య సర్వ కర్మసు శోభనమ్‌ | అపుత్రో పభ##తే పుత్రం భార్యాహీనోలభే త్ర్పి యామ్‌. 54

రంభోపమాం స్వకాంతాం చ సంప్రాప సుకమావ్నుయాత్‌. 55

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారదనారాయణ సంవాదే స్వాహో

పాఖ్యానే త్రిచత్వారింశోధ్యాయః.

పతి సేవ లేని స్త్రీ చదువు రాని పురుషుడు కొమ్మలు పండ్లులేని చెట్లు ''స్వాహా'' చివరలేని మంత్రము సిద్ధించదు. ''స్వాహా'' చివర లేక వేల్చరాదు. దీనివలన బ్రాహ్మణులు సంతుష్టులైరి. దేవతలు హవిస్సులు గ్రహించిరి. మంత్రమునకు ''స్వాహా'' తప్పక చేర్చవలయును. స్వాహాంత మంత్రములే యంతట ఫలించును. ఇట్లు నీకు స్వాహోపాఖ్యానము గొప్పదనము చెప్పితిని., ఇది సుకము మోక్షము గల్గించు వానిలోసారభూతము ఇంకేమి వినదలుతువో తెలుపుము. నారదు డిట్లనెను: ఓ మునీశ్వరా! స్వాహాదేవి పూజా విధానము ధ్యానము - స్తోత్రము తెల్పుము. ప్రభూ! అగ్నియే విధితో నామెను పూజించెనో నాకు దానిని తెలుపుము. శ్రీనారాయణు డిట్టు లనియెను: సామవేదమందలి ధ్యానము స్తోత్రము పూజా విధానము తెల్పుదును. మునీశా! సావధానముగ వినుము. ఓ యజ్ఞమైన ప్రారభించునపుడు సాలగ్రామమున గాని కలశమున గాని స్వాహాదేవి నావాహనముచేసి యత్నముతో పూజించి ఫలప్రాప్తి కొఱకు యజ్ఞము చేయవలయును. మంత్ర సిద్ది స్వరూపిణి - మంత్రాగయుక్త - స్వాహాదేవి - నరులకు సిద్ధిదాయిని - సిద్ధ - కర్మఫలదాయిని - శుభాంగియగు స్వాహాదేవిని మూల మంత్రముతో ధ్యానించి పాద్యము మున్నగున వర్పింపవలయును. మునీ! ఈ విధముగ మూలమంత్రముతో పూజించినచో సకల సిద్ధుల చేకూరును. ''ఓం హ్రీం శ్రీం వహ్వి జాయాయై దేవ్యై స్వాహా'' అనునది మూలమంత్రము. ఎవడు స్వాహాదేవిని నిర్మలభక్తితో ధ్యానించు నతని కోర్కు లన్నియు తప్పకత తీరును. అగ్ని యిట్లనెను : వహ్వి ప్రియ - వహ్నిజాయ - సంతోషకారిణి - స్వాహాదేవి - శక్తి - క్రియ - కాలదాత్రి - పరిపాకకరి - ధ్రువ - దహనశక్తి - మానవులకు గతి - దాహిక - సంసారసారరూప -ఘోర సంసారతారిణి - దేవజీవనరూప - దేవపోషణకారిణి. అను పదారు నామములతో పరమభక్తితో స్వాహా స్తోత్రము పఠించువానికి ఇహపరంబులు స్వరసిద్ధులు సమకూరును. ఇట్లు స్తుతించువా డంగహీనుడు గాడు. అతడు చేయు పనులన్నియును శుభములే యగును. అపుత్రకుడు పుత్రవంతు డగును. భార్యాహీనుడు భార్యను ఊడయును. అతడు రంభవంటి భార్యను బడసి సుఖము లనుభవించును.

ఇది దేవి భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నారద నారాయణ సంవాదమున స్వాహోపాఖ్యానమను నలువదిమూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters