Sri Devi Bagavatham-2    Chapters   

అథ చతురశ్చ త్వారింశోధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : నారద శృణువక్ష్యామి స్వధోపాఖ్యాన ముత్తమమ్‌ | పితౄణాం చ తృప్తికరం శ్రాద్ధాన్న ఫలవర్ధనమ్‌. 1

సృష్టేరాదౌ పితృగణా న్ససర్జ జగాతాం విధిః | చతుర శ్చ మూర్తి మతస్త్రీం శ్చ తేజః స్వరూపిణః. 2

దృష్ట్వా సప్త పితృగణాన్‌ సుఖ రూపాన్మ నోహరాన్‌ | ఆహారం ససృజే తేషాం శ్రాద్ధం తర్పణ పూర్వకమ్‌. 3

స్నానం తర్పణ పర్యంతం శ్రాద్ధంతు దేవపూజనమ్‌ | అహ్నికం చ త్రిసంధ్యాంతం విప్రాణాం చ శ్రుతౌశ్రుతమ్‌. 4

నిత్యం న కుర్యా ద్యో విప్ర స్త్రి సంధ్యం శ్రాద్ధ తర్పణమ్‌ | బలిం వేదధ్వనిం సోపి విషహీనో యథోరగః. 5

దేవీసేవా విహీన శ్చ శ్రీహరే రనివేద్య భుక్‌ | భస్మాంతం సూతకం తస్య న కర్మార్హ శ్చ నారద. 6

బ్రహ్మా శ్రాద్ధోదకం సృష్ట్వా జగామ పితృహేతవే | న ప్రాప్నువంతి పితరో దదతి బ్రాహ్మణాదయః. 7

సర్వే చ జగ్ముః క్షుధితాః భిన్నాస్తు బ్రహ్మణః సభామ్‌ | సర్వం నివేదనం చక్రు స్తమేవ జగతాం విధిమ్‌. 8

బ్రహ్మా చ మానసీం కన్యాం ససృజే చ మనోహరామ్‌ | రూప¸°వన సంపన్నాం సతచంద్రని భాననామ్‌. 9

విద్యావతీం గుణవతీ మతిరూపవతీం సతీమ్‌ | శ్వేత చంపక వర్ణాభాం రత్న భూషణ భూషితామ్‌. 10

విశుద్ధాం ప్రకృతే రంశాం సస్మితాం వరదాం శుభామ్‌ | స్వధాభిదాం చ సుదతీం లక్ష్మీ లక్షణ సంయుతామ్‌. 11

శత పద్మప దన్యస్త పాదపద్మం చ బిభ్రతీమ్‌ |

పత్నీం పితౄ ణాం పద్మాస్యాం పద్మజాం పద్మలోచనామ్‌.12

నలువదినాలుగవ అధ్యాయము

స్వధాదేవీ చరితము

శ్రీనారాయణుడు డిట్లనెను: నారదా! ఉత్తమమైన స్వధోపాఖ్యానము చెప్పగలను వినుము. అది పితృదేవతలకు తృప్తి గల్గించునది. శ్రాద్దాన్న ఫలమును పెంపొందించునది. సృష్టికి మొట్టమొదట జగన్నిర్మాతయగు బ్రహ్మ యేడు పితృగణములను సృజించెను. అందు మూడు గణములు తేజః స్వరూపములు నాల్గు గణములు మూర్తిమంతములు. ఈ యేడు విధములైన గణములు మనోహర పితృ గణములుగ శ్రాద్ద స్వరూపములుగ నుండుట గాంచి బ్రహ్మ వారికి శ్రాద్ధ తర్పణములతోడి శ్రాద్ధ మాహారముగ నియమించెను. స్నానము త్రికాల సంధ్యావందనము ఆహ్నిక కృత్యములు తర్పణము శ్రాద్ధము దేవతార్చనము ఇవి విప్రుల కృత్యములని వేదములందు వినబడును. నిత్యముసంధ్యావందనము శ్రాద్ధ తర్పణము భూతబలి వేదాధ్యయనము చేయని విప్రుడు విషము లేని పామువంటివాడు. శ్రీదేవీ పూజ చేయనివానికి శ్రీహరికి నివేదింపక భుజించువానికిని వాడు కాలి బూది యగువఱకును సూతక ముండును. అట్టివాడు అపవిత్రుడు. శుభకార్యములకు తగడు. పితృ దేవతల కొఱకు బ్రహ్మదేవుడు శ్రాద్ధాదు లేర్పఱతెను. కాని పితరులు బ్రహ్మణు లొసగు నన్నదానములు గ్రహించుటలేదు. అపుడు పితరుల పేరాకలి మంటతో వ్యాకులతతో బ్రహ్మసభ##కేగి యతనితో నంతయు నివేదించిరి. అంత బ్రహ్మ మానస యను సుందరాంగిని సృజించెను. ఆమె రూప¸°వన సంపన్నురాలు - నూఱు చంద్రుల కాంతులు విరజిమ్ము ముఖము గలది. ఆ దేవి విద్యావతి; గుణవతి; రూపవతి; సతి; శ్వేత చంపకమువంటి కాంతి గలది - రత్నభూషలు దాల్చినది. విశుద్ధ - ప్రకృత్యంశ - సస్మిత - వరదాయిని - శుభాంగి - స్వధ యనబరగునది - సుదతి - లక్ష్మీ లక్షణములు గలది. ఆ పద్మాననయొక్క పదపద్మములందు శతపద్మ చిహ్నములు గలవు. ఆమె పద్మజ - పద్మాక్షి - పితృపత్ని.

పితృభ్య శ్చ దదౌ బ్రహ్మా తుష్టేభ్య స్తుష్టిరూపిణీం | బ్రహ్మణానాం చోప దేశం చ కార గోపనీయకమ్‌. 13

స్వధాంతం మంత్ర ముచ్చార్య పితృభ్యోదేయమిత్యపి | క్రమేణ తేన విప్రా శ్చ పిత్రే దానం దదుః పూరా. 14

స్వాహా శస్తా దేవదానే పితృదానే స్వధాస్మృతా | సర్వత్ర దక్షిణా శస్తా హతం యజ్ఞ మదఙక్షిణమ్‌. 15

పితరో దేవతా విప్రా మునయో మనవ స్తథా | పూజాం చక్రుః స్వధాం శాంతాం తుష్టువుః పరమాదరాత్‌. 16

దేవాదయ శ్చ సంతుష్టాః పరిపూర్ణ మనోరథాః | విప్రాదయ శ్చ పితరః స్వధా దేవీ వరేణ చ. 17

ఇత్యేవం కథితం సర్వం స్వ ధోపాఖ్యానమేవ చ | సర్వేషాం చ తుష్టికరం కిం భుయః శ్రోతు మిచ్చసి. 18

నారద ఉవాచ : స్వధా పూజా విధానం చ ధ్యానం స్తోత్రం మహామునే |

శ్రోతు మిచ్ఛామి యచ్నేన వద వేదవిదాం వర. 19

నారాయణ ఉవాచ : ధ్యానం చ స్త వనం బ్రహ్మ న్వేదోక్తం సర్వమంగళమ్‌ |

సర్వం జానాసి చ కథం జ్ఞాతుమిచ్చసి వృద్ధయే. 20

శరత్కృష్ణత్రయో దశ్యాం మఘాయాం శ్రాద్దవాసరే | స్వధాం సంపూజ్య యత్నేన తతః శ్రాద్ధాం సమాచరేత్‌. 21

స్వధాం నాభ్య ర్చ్యయో విప్రః శ్రాద్ధం కుర్యా దహంమతిః | న భ##వేత్పలభా క్సత్యం శ్రాద్ధాస్య తర్పణ స్య చ. 22

బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వత్సు స్థిర¸°వనామ్‌ | పూజ్యాం వైపితృదేవానాం శ్రాద్ధానాం ఫలదాంభ##జే. 23

ఇతి ధ్యాత్వా శిలయాం వా హ్యథవా నంగళేఘటే | దద్యాత్పా ద్యాదికం తసై#్య మూలేనేతి శ్రుతౌ శ్రుతమ్‌. 24

ఓం హీం శ్రీం క్లీం స్వధా దేవ్యై స్వాహేతి చ మహామునే |

సముచ్చార్య చ సంపూజ్య స్తుత్వాతాం ప్రణనేద్ద్విజః. 25

తుష్టిరూపిణీ-యుగు స్వధాదేవిని బ్రహ్మ పితరుల కిచ్చెను. బ్రహ్మాణులకు బ్రహ్మ యొక రహస్యమైన యుపదేశము చేసెను. మీరు స్వధాంతముగ మంత్రములు చదివి పితరుల కన్న దానము చేయడు. అదే ప్రకారముగ పితరులకు విప్రులు దానము లొసంగిరి. దేవతలకు దానము లిచ్చుట స్వాహాదేవియును పితరులకు దాన విచ్చునపుడు స్వధాదేవియును ప్రశంసింపదగినవారు. దక్షిణాదేవి దేవపితృ కార్యములం దన్నిటను ప్రశంసింపదగినది. దక్షిణలేని యజ్ఞము వ్యర్ధము. ఎల్ల పితరులు దేవతలు విప్రులు మునులు మనువులును మిక్కిలి గౌరవముతో పరమశాంతయగు స్వధాదేవియని పూజించి నుతించిరి. స్వధాదేవి వరప్రసాదమున విప్రులు దేవతలును - పితృ దేవతలును పరిపూర్ణమనోరథు లైరి. ఈ ప్రకారముగ స్వధోపాఖ్యానము తెలుపబడినది. ఇదెల్లరికి సంతోషకరమైనది. ఇంకేమివినదలతువు? నారదుడిట్లనియెను : ఓమహామునీ! స్వధాదేవి పూజా విధానము - ధ్యానము - స్తోత్రము నాకు తెల్పుము. ఓ వేదవిద్వర! స్వధా పూజాదులు వినవలయునని కుతూహలముగ నున్నది. నారాయణడిట్లనెను : ఓ నారదా! వేదోక్తము సర్వమంగళకరమైన స్వధాదేవి ధ్యానము - స్తోత్రము సర్వము వినదలచితివి. కాన వినుము. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి మఘా నక్షత్రమునాడు గాని శ్రాద్ధదినమునందు గాని ప్రయత్నించి స్వధాదేవిని సంపూజించి పిదప శ్రాద్ధ మాచరింపవలయును. స్వధాదేవి నర్చింపక గర్వముతో శ్రాద్ధ మాచరించు బ్రహ్మాణుడు శ్రాద్ధ తర్పణములు ఫలములు పొందజాలడు. బ్రహ్మదేవుని మానసకన్యను - సుస్థిర ¸°వనముగల దేవిని - పితృ దేవతలకు పూజ్యురాలిని - శ్రాద్ధపలము లొసంగు దేవిని భజించుచున్నాను. అను ధ్యాన శ్లోకముతో స్వధాదేవిని శిలపై గాని మంగళకలశమందుగాని యావాహనముచేసి ధ్యానించవలయును. తర్వాత మూలమంత్రముతో నామెకు పాద్యము మొదలగునవి ఈయవలయును. మహామునీ ! ''ఓం హ్రీం క్లీం స్వధాదేవ్యై స్వాహా'' అను మూలమంత్ర ముచ్చరించి స్వధాదేవిని పూజించి స్తుతించి బ్రాహ్మణుడు నమస్కరింపవలయును.

స్తోత్రం శృణుముని శ్రేష్ఠ బ్రహ్మపుత్ర విశారద | సర్వవాం ఛా పద్రం నౄణాం బ్రహ్మణా యత్కృతంపురా. 27

నారాయణ ఉవాచ : స్వధో చ్చారణ మాత్రేణ తీర్థస్నాయీ భ##వేన్నరః |

ముచ్యతే సర్వపాపేభ్యో వాజపేయపలం లభేత్‌. 27

స్వధా స్వధా స్వధే త్యేవం యదివారత్రయం స్మరేత్‌ | శ్రాద్ధ స్య ఫలమా ప్నోతి బలేశ్చ తర్పణ స్య చ. 28

శ్రాద్దకాలే స్వధా స్తోత్రం యఃశృణోతి సమాహితిః | స లభే చ్ర్చా ద్ధ సంభూతం ఫలమేవ న సంశయః. 29

స్వదా స్వధా స్వధే త్యేవం త్రిసంధ్యంయః పఠేన్నర. |

ప్రియాం వినీతాం సలభే త్సాద్వీం పుత్రగుణా న్వితామ్‌. 30

పితౄణాం ప్రాణతుల్యా త్వం ద్విజజీవన రూపిణీ | శ్రాద్దాధిష్ఠాతృ దేవీ చ శ్రాద్ధాదీనాం ఫలప్రదా. 31

నిత్యాత్వం సత్యరూ పాసి పుణ్యరూపాసి సువ్రతే | ఆ విర్బావతిరోభవౌ సృష్టౌ చ ప్రళ##యే తవ. 32

ఓం స్వస్తి శ్చ నమః స్వాహా స్వధాత్వం దక్షిణాతథా | నిరూపితా శ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః. 33

కర్మ పూర్త్యర్థ మేవైతా ఈశ్వరేణ వినిర్మతాః | ఇత్యేవ ముక్వా సబ్రహ్మా బ్రహ్లోకే స్వసంసది. 34

తస్ధౌ చ సహసా సద్యః స్వధా సా೭೭విర్బభూవహ | తదా పితృభ్యః ప్రదదౌ తామేన కమలాననామ్‌. 35

తాం సంప్రాప్య యయుస్తే చ పితర శ్చ ప్రహర్షితాః | స్వధాస్తోత్ర మిదం పుణ్యం యః శృణోతి సమాహితః. 36

సస్నాతః సర్వతీర్ధే షు వాంఛితం ఫలమాప్నుయాత్‌ |

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ నవమస్కంధే నారద నారాయణ సంపాదే స్వధోపాఖ్యానే చతుశ్చ త్వారింశోధ్యాయః.

బ్రహ్మపుత్రా! మునివరా! ఇక స్వధా స్తోత్రము వినుము. అది తొలుత బ్రహ్మ నోట వెల్వడెను. అది నరుల కోర్కెలు దీర్చగలది. నారయణుడిట్లనెను : స్వధ యని యన్నంతనే నరుడు తీర్థస్నాతుడగును. అతనికి వాజపేయ ఫల మబ్బును. ఓం స్వధా - స్వధా - స్వధా యని ముమ్మారు పలుకువానికి శ్రాద్దఫలము - బలి - తర్పణముల ఫలములు గల్గును. శ్రాద్ధ కాలమున నియమముతో స్వధాస్తోత్రము వినువానికి శ్రాద్ధ ఫలితము తప్పక గల్గి తీరును. ఓం స్వధా - స్వధా - స్వధాయని మూడు సంధ్యలందు ముమ్నారు పల్కువానికి వినయము గల్గినది - సాధుశీల - ప్రజాపతి యగు చక్కని భార్య లభించగలదు. పితరులకు ప్రాణసమాన విప్రులకు జీవన స్వరూపిణి శ్రాద్ధముల ఫలములొసగుదేవి - శ్రాద్ధముల కధిష్ఠానదేవి నిత్య - సత్యరూప - పూణ్యరూప - సువ్రత సృష్టియం దావిర్బావము - ప్రళయమందు తిరోభావముగల దేవి అన్నియు నీవే తల్లీ! ఓం స్వస్తి! నీవు స్వాహా-స్వధా-దక్షిణా దేవివి. నీకు నమస్కారములు. నాల్గు వేదములందలి కర్మకాండలలో నీవే నిరూపింపబడితివి. అట్టి కర్మకాండ పూర్తి కొఱకీశ్వరుడు స్వధాదేవిని సృజించెను. అని బ్రహ్మయంతయును తన సభలోనెల్లరికి చాటి చెప్పెను. అంతలోనే స్వధాదేవి యావిర్బవించెను. బ్రహ్మ దేవుడా కమాలాననను పితరుల కొసంగెను. పితరులు స్వధనుబడసి సంతు ష్యాంతరంగులై యరిగిరి. ఈ స్వధాస్తోత్రమును నిశ్చలమతితో వినువాడు సకల తీర్దములందు స్నానమాడినవాడగును. వాని కోరిన కోర్కి తీరును.

ఇది శ్రీదేవి భాగవత మహాపూరాణ మందలి తొమ్నిదవ స్కంధమున నారదనారాయణ సంవాదమున స్వధోపాఖ్యానమను నలువది నాల్గవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters