Sri Devi Bagavatham-2    Chapters   

అత పంచచత్వారింశోధ్యాయః

శ్రీ నారాయణ ఉవాచ : ఉక్తం స్వాహా స్వధాఖ్యానం ప్రశస్తం మదురం పరమ్‌ | వక్ష్యామి దక్షిణాఖ్యానం సావధానో నిశామయ. 1

గోపీ సుశీలా గోలోకే పురా೭೭సీ త్ర్పేయసీహరేః | రాధా ప్రదానా సధ్రీచీ ధన్యా మాన్యా మనోహరా. 2

అతీవ సుందరీ రామా సుభగా సుదతీ సతీ | విద్యావతీ గుణవతీ చాతిరూపవతీ సతీ. 3

కళావతీ కోమలాంగీ కాంతా కమలోచనా | సుశ్రోణీ సుస్తనీ శ్యామా న్య గ్రోధ పరిమండితా. 4

ఈష ద్ధా స్య ప్రసన్నా స్యా రత్వాలంకారభూషితా | శ్వేతచం పకవర్ణాభా బింబోష్ఠీ మగలోచనా. 5

కామశఆస్త్రేషునిపుణా కామినీ హంసగా మినీ | భవానురక్తా భావజ్ఞా కృష్ణస్య ప్రియ భామినీ. 6

రసజ్ఞా రసికా రాసే రాసేశస్య రసోత్సుకా | ఉవాహదక్షిణ క్రోడే రాధయాః పురతః పురా. 7

సంబభూ వానమ్రముఖో భ##యేన మదుసూదనః | దృష్ట్వా రాధాం చ పురతో గోపీనాం ప్రవరోత్తమామ్‌. 8

కామినీం రక్తవదనాం రక్తపంకజలోచనామ్‌ | కోపేన కంపీతాంగీం చ కోపేన స్పురితాధరామ్‌. 9

వేగేన తాంతు గచ్ఛంతీం విజ్ఞాయ తదనంతరమ్‌ | విరోధభీతో భగవానంతర్ధానం చకారసః. 10

పలాయంతం చ కాంత చ శాంతంసత్త్వం సువిగ్రహమ్‌ | విలోక్య కంపితా గోప్యః సుశీలాద్యాస్తతోభియా. 11

విలోక్య లంపటం తత్ర గోపీనాం లక్షకోటయః | పుటాంజలియుతా భీతా భక్తినమ్రాత్మకంధరా. 12

రక్ష రక్షేత్యుక్తవ్యతో దేవీ మితి పునః పునః | యయు ర్బయేనశరణం తస్యా శ్చ రణపంకజే. 13

త్రిలక్షకోటయో గోపాః సుదామాదయ ఏవచ | యయు ర్బయేన శరణం తత్పాదాబ్జే చ నారద. 14

నలువదియైదవ అధ్యాయము

దక్షిణాదేవి చరితము

శ్రీ నారాయణు డిట్లనెనుః స్వాహా-స్వధాదేవుల ప్రశస్తముమధురమునైన చరిత్రము చెప్పితిని. ఇపుడు దక్షిణాఖ్యానము తెలుపుచున్నాను. సావధానముగ నాలింపుము. పూర్వము గోలోకమందు సుశీల యనెడు గోపిక గలదు. ఆమె హరి కత్యంతము ప్రియురాలు-రాధనెచ్చలి-ధన్య-మాన్య నోహర. ఆమె మిక్కిలి యందకత్తె-సౌభాగ్యవతిసుదతి రూపవిద్యా గుణవతి-సతీమణి. ఆమె కళావతి-కుసుమకోమలి-కాంత-కమలనయన-శ్యామాంగి-సన్నని నడుము-వట్రువగుబ్బలు గలది-మఱ్ఱిచెట్టువలె నిడైన రూపముకలిగి చిర్నగవుతో ప్రసన్నురాలు-రాగబింబాధర-హరిణలోచని-రత్వాలంకార భూషిత-- తెల్లని చంపకకాంతి గలది. కామిని-రాయంచ నడలది-కామశాస్త్రమున నేర్పరి-భావముల ననుసరించి రాగము చిందించునది. కృష్ణుని ప్రియభామిని. రసికురాలు-రసజ్ఞ రాసేశునకు రసోత్సుకత గల్గించునది- ఆ సుశీల యొకప్పుడు రాధ చూచుచుండగ శ్రీ కృష్ణుని యెడమ భాగమున నిలుచుండెను. అపుడు గోపికలలో నన్నిట నందె వేసినచేయియగు రాధ తన కన్నుల యెదట నుండుటగని భయముతో కృష్ణుడు తలవంచుకొనెను. రాధ రక్తవదన-రక్తకమల లోచన-కంపితాంగి- తడబడు పెదవులు గలదియై అతయు నెఱిగి యచ్చోటు వదలి వెళ్ళిపోయెను. అది చూచి కృష్ణుడు నంతర్ధాన మొందెను. సత్యమూర్తి-పరమశాంతుడు-కాంతుడైనన కృష్ణుడటుల మాయ చూచి యచట నున్న సుశీల మొదలగు గోపికలును గడగడలాడిరి. అపుడు లక్షల కోట్ల గోపిక లెల్లరును కృష్ణునికి భయభక్తులతో చేతు లెత్తి మ్రొక్కిరి. వారెల్లరును. రక్షింపు-రక్షింపుమని శ్రీదేవికి శరణాగతులైరి. వారు భయకంపితులై రాజరాజేశ్వరిని శరణు చొచ్చిరి. అపుడు మూడు లక్షల కోట్ల గోపికలును సుదామాదులును భీతులై శ్రీదేవి చరణకమలములు శరణుచొచ్చిరి.

పలాయంతం చ కాంతం చ విజ్ఞాయ పరమేశ్వరీ | పలాయతీం సహచరీం సుశీలాం చ శశాప సా. 15

అద్య ప్రభృతి గోలోకం సాచేదాయాతి గోపికా | సద్యోగమన మాత్రేణ భస్మసాచ్చ భవిష్యతి. 16

ఇత్యేవ ముక్త్వా తత్రైవ దేవదేవేశ్వరీ రుషా | రాసేశ్వరీ రాసమధ్యే రాసేశ మాజుహావహ. 17

నాలోక్య పురతః కృష్ణం రాధా విరహకాతరా | యుగకోటి సమం మేనే క్షణభేదేన సువ్రతా. 18

హేకృష్ణ ప్రాణనాథేశా೭೭గచ్చ ప్రాణాధికప్రియ | ప్రాణాదిష్ఠాతృ దేవేశ ఫ్రాణా యాంతి త్వయా వినా. 19

స్త్రీ గర్వః పతిసౌబాగ్యా ద్వర్ధతే చ దినే దినే | సుఖం చ విపులం యస్మాత్తం సేవేద్ధర్మతఃసదా. 20

పతి ర్బంధుః కులస్త్రీణా మధిదేవ ః సదాగతిః | వపసంపత్స్వరూప శ్చ మూర్తిమా న్బోగదః సదా. 21

ధర్మదః సుఖదః శశ్వ త్ర్వీతిదః శాంతిదః సదా | సమ్మానైర్దీ ప్యమాన శ్చ మానదో మానఖండనః. 22

సారాత్సారతరః స్వామీ బంధూనాం బంధువర్ధనః | న చ భర్తుః సమో బంధు ర్బంధోర్బంధుషు దృశ్యతే. 23

భరణా జేవ భర్తా చ పాలనాత్పతి రుచ్యతే | శరీరేశా చ్చ స స్వామీ కామదః కాంత ఉచ్యతే. 24

బంధు శ్చ సుఖవృద్ధ్యాచ ప్రీతిదాన త్ర్పియః స్మృతః | ఐశ్వర్యదానాదీశశ్చ ప్రాణశా త్ర్పాణనాయకః 25

రతిదానా చ్చ రమణః ప్రియో నాస్తి ప్రియాత్పరః | పుత్రస్తు స్వామినః శుక్రా జ్జాయతే తేన సప్రియః 26

శత పుత్రా త్పరః స్వామీ కులజానాం ప్రియః సదా | అసత్యకుల ప్రసూతా కాంతం విజ్ఞాతు మక్షమా. 27

స్నానం చ సర్వ తీర్ధేషు సర్వయజ్ఞేషు దక్షిణా | ప్రాదక్షిణ్యం పృథివ్యా శ్చ సర్వణి చ తపాంసి చ. 28

శ్రీకృష్ణుడు కనిపించకుండుట- సుశీల పరుగెత్తిపోవుట తెలిసికొని రాధ గోపిక నిట్లు శపించెను. ఈనాటినుండి నీవు గోలోకమున కాలు పెట్టినచో భస్మమై పోదువుగాక. అని సుశీలను శపించి దేవదేవేశ్వరి- రాసేశ్వరి- యగు రాధ రస మధ్యమునకు రాసేశుని రమ్మని పిలిచెను. కానీ శ్రీకృష్ణుడు రాధముందు కనిపించలేదు. అపుడామె యొక్క క్షణమును కోట్ల యుగములుగ తలచి కలత చెందెను. అపుడామె. నెమ్మది నీ రీతి పలుగతుల తలచెను. కృష్ణ!ప్రాణనాయకా! ప్రాణాధికప్రియ! నా ప్రాణాదిష్ఠాన దేవ! వేవేగ రారమ్ము. నిన్ము చూడక నా ప్రాణములు నిముసమైన నిలువజాలవు. తన పతి సౌభాగ్యముననే స్త్రీ యభిమానము దినదినము పెరుగుచుండును. సకల సౌఖ్యములు గల్గును. కనుక స్త్రీ తాను ధర్మపూర్వకము పతి సేవ జరుపవలయును. కుల యువతులకు కలకాలము పతియే బంధువు- అధిదేవుడు- సదాగతి- పరమసంవత్స్వరూపుడు- ప్రేమకు మూర్తిమంతుడు- భోగములు గల్పించువాడు. పతియే సతులకు ధర్మము సుఖము ప్రీతి శాంతి మానము లొసగువాడు గర్వమడచువాడు గౌరవ ప్రదీపకుడు. పతియే సతులకు సారతముడు- బంధువుల భాంధవ్యము పెంచువాడు- తల బందుగు లందఱిలో స్త్రీకి తలపతి బంధువుతో సమానమైన బంధువు లేడు. తల స్త్రీని భరించుట వలన భర్తగ పాలించుటవలన పతిగ శరీరేశ్వరుడై స్వామిగ కామప్రదుడై కాంతుడుగ ప్రియ పతి పిలువబడును. భర్త భార్యకు సుఖము గల్గించుటవలన బంధువు ప్రీతి గూర్చుటవలన ప్రియుడు ఐశ్వర్యమిచ్చుట వలన నీశుడు ప్రాణశుడగుట వలన ప్రాణనాయకుడు నగును. రతి సల్పుటవలన పతిని రమణుడందరు. పతి వీర్యమున పుత్రుడు గల్గుటవలన ప్రియుడందరు. అట్టి ప్రియునికన్న ప్రియమైనవాడు భార్య కింకొకడు లేడు. కుల కాంతకు నూర్గురు కొడుకులకన్న పతియే మిన్న. ఉత్తమ కుల సంజాతకాని యాడుది తలపతి మహిమ నెఱుగ జాలదు. ఎల్ల తీర్థములందు గ్రుంకుట- యజ్ఞములందు దక్షిణలిచ్చుట- భూప్రదక్షిణము చేయుట- ఎల్ల తపములాచరించుట-

సర్వాణ్యవ ప్రతాదీనీ మహాదనాని యానిచ | ఉపోషణాని పుణ్యాని యానియాని శ్రుతాని చ. 29

గురుసేవా విప్రసేవా వేదసేవాదికం చ యత్‌ | స్వామినః పాదసేవాయాః కళాంనార్హంతి షొడశీమ్‌. 30

గురు విప్రేంద్ర దేవేషు సర్వేభ్య శ్చ పతిర్గురుః | విద్యాదాతా యథా పుంసాం కులజానాం తథా ప్రియః 31

గోపీనాం లక్షకోటీనాం గాపానాం చ తథైవచ | బ్రహ్మాండానా మసంఖ్యానాం తత్రస్ధానాం తథైవచ. 32

విశ్వాదిగోలకాంతానా మీశ్వరీ యత్ర్పసాదతః | అహం నజానే తం కాంతం స్త్రీ స్వభావో దురత్యయః 33

ఇత్యుక్త్వా రాధికా కృష్ణం తత్ర దధ్యౌ స్వ భక్తితః | రురోద ప్రేవ్ణూ సా రాధా నా థనా థేతి చా బ్రవీత్‌. 34

దర్శనం దేహి రమణ దీనా విరహ దుఃఖితా | అథ సా దక్షిణా దేవీ ధ్వస్తా గోలోకతో మునే. 35

సుచిరం చ తపస్తప్త్వా వివేశ కమలాతమౌ | అధ దేవాదయః సర్వేయజ్ఞం కృథ్వా సుదుష్కరమ్‌. 36

నాలభంస్తే ఫలం తేషాం విషణ్ణాః ప్రయయుద్విధిమ్‌ | విధి ర్ని వేదనం శ్రుత్వా దేవాదీనాం జగత్పతిమ్‌. 37

దధ్యౌ చ సుచిరం భక్త్యా ప్రత్యాదేశ మవాప సః | నారాయణ శ్చ భగవా న్మహాలక్ష్మ్యా శ్చ దేహతః 38

వినిష్కృష్య మర్త్య లక్ష్మీం బ్రహ్మణ దక్షిణాం దదౌ | బ్రహ్మా దదౌ తాం యజ్ఞాయ పూరణార్ధం చ కర్మణా. 39

యజ్ఞః సంపూజ్య విధిపత్తాం తుష్టావ తదా ముదా | తప్తకాంచన వర్ణాభాం చంద్రకోటీ సమప్రభామ్‌. 40

అతీవ కమనీయాం చ సుందరీం సుమనోహరామ్‌ | తమలాస్యాం కోమలాంగీం కమలాయతలోచనామ్‌. 41

కమలాసన పూజ్యాం చ కమలాంగసముద్బవామ్‌ | వహ్ని శుద్ధాంశుకాధానాం బింబోష్ఠీం సుదతీం సతీమ్‌. 42

ఎల్ల వ్రతములు చేయుట మహాదానములు చేయుట పరసిద్ధి చెందిన యుపవాసములు పుణ్యకార్యములొనరించుట గురు- విప్ర- వేద సేవలు చేయుట ఇవన్నియును. స్త్రీకి తన పతిసేవలోని పదారవవంతుకు సాటి కాజాలవు. విద్యా దానము చేయు గురుడు విప్రేంద దేవతలందఱలో గొప్పవాడు. అటులే కులసతులకు తమ ప్రియుడు-గురు-విప్రేంద్ర-దేవతలలో గొప్పవాడు. లక్షకొటుల గోపీగోపకుల అనంత బ్రహ్మండములకు- అందలి ప్రాణుల కెల్లరికిని సకల బ్రహ్మాండ గోళములకు నీశ్వరినయ్యు నేను నాకాంతుని గూర్చి యించుకంతయు నెఱుగనైతిని. స్త్రీ స్వభావము అతిక్రమింపరానిది. అని రాధికాదేవి భక్తిమీర శ్రీకృష్ణుని తన మదిలో ధ్యానించినది. నాధా! ప్రాణప్రియా అని యామె పల్మారు మధురప్రేమతో లిట్టు పలవరించెను. మనోరమణా! నీ యెడబాటుబరువు సైపజాలక దుఃఖించుచున్నాను. దర్శన యీయగ వేగరమ్ము. అని రాధ పలుకుచున్నంతలో దక్షిణాదేవి గోలోక మందుండి పదచ్యుతురాలయ్యెను. ఆమె పెక్కేండ్లు మహోగ్రతప మాచరించి పిదప లక్ష్మి శరీరమును జొచ్చెను. అటుపిమ్మచ దేవత లెల్లరును దుష్కరమైన యజ్ఞము లొనరించిరి. కాని వారు వాని ఫలము లనుభవింపలేకుండిరియ. అపుడు వవారు వ్యాకులచిత్తులై బ్రహ్మ సన్నిధి కేగిరి. బ్రహ్మవారి విన్నపమాలకించెను. బ్రహ్మ కొంతకాలము తన మదిలో శ్రీహరిని భక్తి ధ్యానించి సమాధానము బడసెను. దాని ఫలితముగ నారాయణుడు మహాలక్ష్మీ శరీరమునుండి దక్షిణాదేవిని ఆవిష్కరింపజేసి యామెను బ్రహ్మ కొసంగెను. బ్రహ్మయు నామెను యజ్ఞ కర్మ పూర్తి యజ్ఞమూర్తి కొసంగెను. యజ్ఞ భగవానుడు దక్షిణను పూజిచి ప్రసన్నురాలి నొనర్చెను. దక్షిణాదేవి తప్త కాంచనవర్ణము గలది. చంద్రకోటితో సమమైన శోభ గలది. ఆమె యందాలరాశి కమనీయ మనోహర కమలాసన కుసుమ కోమలి కమలాయతలోచన. బ్రహ్మపూజ్య- లక్ష్మి శరీరసంజాత- అగ్విశుద్ధవసన- బింభాధర- సతీమణి- సుదతి.

బిభ్రతీం కబరీ భారం మాలతీ మాల్య సంయుతమ్‌ | ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం రత్నభూషణ భూషితామ్‌. 43

సువేషాఢ్యాం చ సుస్నాతాం ముని మానస మేహినీమ్‌ | కస్తూరీబిందుభిః సార్ధం సుగంధి చందనేందుభిః 44

సిందూరబిందు నాల్పే నాప్యలకాధః స్థలోజ్జ్వలామ్‌ | సుప్రశస్త నితం బాధ్యాం బృహచ్ర్చోణీపయోధరామ్‌. 45

కామదేవాధారరూపాం కామబాణ ప్రపీడితామ్‌ | తాం దృష్ట్వా రమణీయాం చ యజ్ఞో మూర్చా మవాప హ. 46

పత్నీం తామేవ జగ్రాహ విధిబోధిత పూర్వకమ్‌ | దివ్యం వర్షశతం చైవ తాం గృత్వాతు నిర్జనే. 47

యజ్ఞో రేమే ముదా యుక్తో రామేశో రమయా సహ | గర్భం దధార సా దేవీ దివ్యం ద్వాదశ వర్షకమ్‌. 48

తతః సుషావ పుత్రం చ ఫలవై సర్వ కర్మణామ్‌ | పరిపూర్ణే కర్ణని చ తత్పుత్రః ఫలదాయకః 49

యజ్ఞో ధక్షిణయా సార్ధం పుత్రేణ చ ఫలేన | కర్మిణాం ఫలదాతాచే త్యేవం వేదవిదో విదుః 50

యజ్ఞ శ్చ దక్షిణాం ప్రాప్య పుత్రం చ ఫలదాయకమ్‌ | ఫలం దదౌ చ సర్వేభ్యః కర్మణాంచైవ నారద 51

తదా దేవాదయ స్తుష్టాః పరిపూర్ణ మనోరథాః | స్వస్థానే తే యయుః సర్వే ధర్మ వక్త్రాదిదం శ్రుతమ్‌. 52

కృత్వా కర్మ చ కర్తా చ తూర్ణం దదాచ్చ దక్షిణామ్‌ | తత్షణం ఫలమాప్నోతి వేదైరుక్త మిదం మునే. 53

కర్మీ కర్మణి పూర్ణే చ తక్షణ యది దక్షిణామ్‌ | న దద్యా బ్రహ్మణభ్య శ్చ దైవేనా జ్ఞానతోథవా. 54

ముహూర్తే సమతీతే తు ద్విగుణా సా భ##వే ద్ద్రువమ్‌ | ఏకరాత్రే వ్యతీతేతు సాత్రికొటిగుణా చ సా. 55

త్రిరాత్రే తచ్చతగుణా సప్తాహే ద్విగుణా తతః | మాసే లక్షగుణా ప్రోక్తా బ్రహ్మాణాం చ వర్ధతే. 56

మాలతీదండలు గూబాళించు జడకొప్పు గలది. లేనగవులుచిందు ప్రసన్న వదనముగలది. రత్న భుషణభుషిత సుస్నాత- సువేశ- మునిమానసహారిణి- నెన్నోసట చెన్నొందు చందన కస్తూరి తిలకముతో రిజిల్లునది. పాపట సిందూర బిందులలందినది- అందమైన పిఱుదులు బిగి వట్రున గుబ్బలు గల్గి శోభిల్లునది. కామదేవతకు విలాసభూతమైనది- కామబాణ ప్రపీడిత-యుగు దక్షీణాదేవిని చూచి యజ్ఞ భగవానుడు మూర్చిల్లెను. బ్రహ్మ తన కంతకుమునుపే చెప్పినట్లుగ నతడు దక్షిణను తన సతిగ స్వీకరించెను. అతడామెతో నూఱు దివ్యవర్షములు లొంటరిగ సుఖించెను. యజ్ఞుడామె వెచ్చని వలపు కౌగిళ్లలో సుఖించెను. దాని ఫలితముగ నామె పండ్రెండు వత్సరములు గర్బము దాల్చెను. పిమ్మట సకల పుణ్యకర్మల ఫలముగ నామె సుపుత్రుని గనెను. అతని పేరు ఫలము. తడు కర్మలు పూరియైన వారికి ఫలము లొసంగును. యజ్ఞుడు దక్షిణాపత్నితో పుత్రఫలముతో కర్మిష్ఠులకు ఫలములు గురియును. అని వేదవిదులు వాక్కాణింతురు. నారదా! ఈ ప్రకారముగ యజ్ఞుడు దక్షిణను ఆర్యగ బడసి నరులకు తమ కర్మల ఫలములొసగు చుండెను. అపుడు దేవతల్లెరును సంతోషించి తమతమ నెలవుల కరిగిరి. అను విషయమంతయును నేను మునుపు ధర్మునివలన వింటిని. కర్త యగువాడు తన కర్మ పూర్తియైన వెంటనే బ్రహ్మణులకు దక్షిణలీయవలయును. అప్పటికప్పుడే కర్తకు కర్మఫలము సిద్ధించును. తన పని పూర్తియైన వెంటనే కర్త బ్రహ్మాణులకు దైవికముగగాని తెలియకకాని ధక్షిణ నీయనిచో ఒక ముహూర్త మాలస్యమైనచో ఫలము రెండింతలు వ్యర్థమగును. ఒక రాత్రి గడచిన నూఱింతలుగను వారము గడచిన దానికి రెండింతలుగ వ్యర్థ ఫలత గల్గును. ఒక నెల యాలస్యమైన లక్షరెట్లు ఫలము వ్యర్థము.

సంవత్సరే వ్యతీతే తు సా త్రికోటిగుణా భ##వేత్‌ | కర్మ తద్యజమానానాం సర్వంవై నిష్పలం భ##వేత్‌. 57

సచ బ్రహ్మస్వహారీ చ న కర్మార్హోశు చిర్న రః | దరిద్రో వాధియక్త శ్చ తేన పాపేన పాతకీ. 58

తద్గృహా ద్యాతి లక్ష్మీ శ్చ శాఫం దత్వా సుదారుణమ్‌ | పితరో నైవ గృహ్ణంతి తద్దత్తం శ్రాద్ధతర్పణమ్‌. 59

ఏవం సురాశ్చ తత్పూజాం తద్దత్తా మగ్వి రాహుతిమ్‌ | దత్తం న దీయతే దానం గ్రహీతా నైవయాచతే. 60

ఉభౌ చౌ నరకే యాతిశ్చి న్నరజ్జౌ యథా ఘటః | నార్పయే ద్యజమానశ్చే ద్యానితశ్చాపి దక్షిణామ్‌. 61

భ##వే ద్ర్బహ్మస్వా పహరీ కుంభీ పాకం వ్రజే ద్ధ్రువమ్‌ | వర్షలక్షం వసేత్తత్ర యమదూతేన తాడితః 62

తతో భ##వేత్స చాండాలో వ్యాధియుక్తో దరిద్రకః | పాతయే త్పురుషాన్సప్త పూర్వాంశ్చ సప్త జన్మతః 63

ఇత్యేవం కథితం విప్ర కిం భూయః శ్రోతు మిచ్చసి|

నారద ఉవాచః యత్కర్మ దక్షినా హీనం కోభుం క్తే తత్పలం మునే. 64

పూజా విధిం దక్షిణాయాః పూరా యజ్ఞకృతం వద | నారయణ ఉవాచః కర్మణో7ధక్షిణసై#్యవ కుతఏవ ఫలం మునే. 65

సదక్షి ణ కర్మణి చ ఫలమేవ ప్రవర్తతే | అదక్షీణం చ యత్కర్మ తద్భుంక్తే చ బలి ర్మునే. 66

బలయే తత్ర్ప దత్తం చ వామనేన పురా మునే | అశ్రోత్రియః శ్రాద్ధ ద్రవ్య మశ్రద్ధాదాన మేవచ. 67

వృషలీ పతి చిప్రాణాం పూజా ద్రవ్యాదికం చయత్‌ | అసద్ధ్విజైః కృతం యజ్ఞ మశుచేః పూజనం చ యత్‌. 68

గురా వభక్తస్య కర్మ బలిర్‌ భుంక్తే న సంశయః | దక్షీణాయా శ్చ యద్ద్యానం స్తోత్రం పూజా విధిక్రమమ్‌. 69

తత్సర్వం కణ్వ శాఖోక్తం ప్రవక్ష్యామి నిశామయ | పురా సంప్రాప్య తాం యజ్ఞః కర్మ దక్షాం చ దక్షినామ్‌. 70

ఒక యేడాదివఱకు దక్షిణ యీయనిచో మూడు కోట్ల రెట్లుగ ఫలము వ్యర్థమగును. దక్షిణ యెప్పటికిని చెల్లింపనిచో కర్త చేసిన పుణ్యకర్మ మంతయుము బూదిలోపోసిన పన్నీరగును. అటువంటి కర్త బ్రహ్మణని సొమ్ము హరించిన వారితో సమానుడగును. అతడు కర్మకు తగడు-పాపి-నిరుపేద- రోగియగును. అటినావికి లక్ష్మి దారుణముగ శాపమిచ్చి వాని యిల్లు వదలి పోవును. అతడిచ్చు శ్రాద్ధ తర్పణములను పితరుల దై కొనరు. అతని పూజలు దేవతలు గ్రహింపరు. అగ్నియతని హవిస్సులు స్వీకరింపడు. దానమిచ్చెదనని యీయని కర్తయు ఇచ్చినది పుచ్చుకొనని బాపడు వీరిర్వురును త్రాడుదెగిన కుండవలె నరకూపమున గూలుదురు. బ్రహ్మణు డెన్విసారు రాడిగినను దక్షిణ యీయనివాడు బ్రాహ్మణుని సొమ్ముహిరించినవానితో సమానుడు. అతడు కుంభిపాక నరకమున గూలును అతడందు యమయాతన లనభవించుచు పెక్కు సంవత్సరములుండును. అతడు తర్వాత రోగి- చండాలుడు- దరిద్రుడునై పుట్టును. అతడు తన ముందు వెనుకల నేడుతరాల వారిని నరకమున గూల్చును. నారదా! ఇదంతయు నీవు వింటివి. ఇంకేమి వినదలతువో తెల్పుము. నారదుడిట్లులయెనుః నారాయణ! దక్షిణ లేని కర్మపలితమెవ్వడనుభవించును. యజ్ఞుడు మునుపు దక్షిణనెట్లు పూజించెనో నాకు తెలుపుము. నారయణుడిట్లనెనుః మునీ! దక్షిణ లేని కర్మమునకు ఫలమెట్లు గల్గును. దక్షిణ యిచ్చి చేసిన కర్మమే ఫలము నొసంగ గలదు. దక్షిణ లేని కర్మలఫలమును బలి భుజించును. నారదా! మున్ను వామనుడు బలికొకవరమిచ్చెను. అదేమనగా శ్రోతియుడుగాని వాని శ్రాద్ధ ద్రవ్యము శ్రద్ధ లేనివాని శ్రాద్ధదానము వృషలీపతి విప్రుల పూజా ద్రవ్యములు అపవిత్రులు-భౌతికులునైన బ్రాహ్మణుల పూజలు యజ్ఞములును గురువు నెడల భక్తిలేక చేసిన కర్మలు వీని ఫలమంతయును తప్పక బలి గ్రహించును. ఇక దక్షిణాదేవి ధ్యానమ-స్తోత్రము-పూజా విధానముకణ్వశాఖలో చెప్పబడిన రీతిగ తెల్పుదును. వినుము. పూర్వము యజ్ఞ పురుషుడు కర్మదక్షయగు దక్షిణను బొందెను.

ముమోహాస్యా ః స్వరూపేణ తుష్టావ కామకాతరః | యజ్ఞ ఉవాచః పురా గోలోకగోపీత్వం గోపీనాం ప్రవరా వరా. 71

రాధాసమా తత్సఖీ చ శ్రీకృష్ణ శ్రీపేయసీ ప్రియా | కార్తికీ పూర్ణమాయాంతు రాసేరాధా మహోత్సవే. 72

ఆవిర్బూతా దక్షిణాం సాల్లక్ష్మ్యా శ్చ తేన దక్షినా | పురా త్వం చ సుశీలాఖ్యా ఖ్యాతా శీలేన శోభ##నే. 73

లక్ష్మీ దక్షాంసభాగాత్త్వం రాధాశాపా చ్చ దక్షిణా | గోలోకాత్త్వం పరిభ్రష్టా మమ భాగ్యాదుపస్థితా 74

కృపాం కురు మహాబాగే మామేవ స్వామినం కురు | కర్మిణాం కర్ణమాం దేవీ త్వమేవ ఫలదా సథా. 75

త్వయా వినాచ సర్వేషాం సర్వం కర్మ నిష్పలమ్‌ | త్వయా వినా తథా కర్మ కర్మిణాం నచ శోభ##తే. 76

బ్రహ్మ విష్ణు మహేశా శ్చ దిక్పాలాదయ ఏవచ | కర్మణ శ్చ ఫలం దాతుం న శక్తా శ్చ త్వయా వినా. 77

కర్మరూపీ స్వయం బ్రహ్మ ఫలరూపీ మహేశ్వరః | యజ్ఞరూపీ విష్ణు రహం త్వమేషాం సారరూపిణీ. 78

ఫలధాతృ వరం బ్రహ్మ నిర్గుణా ప్రకృతిః పరా | స్వయం కృష్ణశ్చ భగావా న్సచ శక్తి స్త్వయా సహ. 79

త్వమేవ శక్తిః కాంతే మే శశ్వ జ్జన్మని జన్మని | సర్వ కర్మణి శక్తోహం త్వయా సహ వరాననే. 80

ఇత్యుక్త్వా చ పురస్తస్థా యజ్ఞాధిష్ఠాతృ దేవతా | తుష్ఠా బభూవ సా దేవీ భేజే తం కమాలాకళా. 81

ఇదం చ దక్షిణాస్తోత్రం యజ్ఞ కాలే చ యః పఠేత్‌ | వరం చ సర్వ యజ్ఞానాం ప్రాప్నోతి నాత్ర సంశయః 82

రాజసూయే వాజపేయే గేమేధే నరమేధకే | అశ్వమేధే లాంగలే చ విష్ణుయజ్ఞే యశస్కరే. 83

ధనదే భూమదే పూర్తే ఫలదే గజమేధకే | లోహయజ్ఞే స్వర్ణయజ్ఞే రత్న యజ్ఞే థ తామ్రకే. 84

అతడు కామపీడుతై యామె సురూప¸° వనమునకు మోహపరవశుడై యా దేవినిట్లు సంస్తుతించెను పూర్వము నీవు గోలోకమందున్న గోపికలలో విన్నవు. శ్రీకృష్ణుని ప్రియురాలవు- అతని నెచ్చెలివి- రాధా సమానవు. కార్తిక పున్నమినాటి రాసమండలమున రాధాకృష్ణుల మహోత్సవమున లక్ష్మి దక్షిణ భాగమునుంచి వెల్పడుట చేత దక్షిణయును పేరు ప్రసిద్ధమయ్యెను. శోభనాంగీ! గోలోకమందున్న సుశీల యనబరుగు గోపికవు నీవే సుమా! నీవు రాధాశాపమువలన నా యదృష్టము పండి లక్ష్మి దక్షిణభాగమునుండి యుద్బవించితివి. మహనీయురాలా! నన్ను నీ పతిగ వరింపుము. కర్మనిష్ఠు లొనరించెడు కర్మల ఫలితము నీవే కదా!నీవు లేక కర్మలన్నియును నిష్పలములు నీవు లేకకర్మ నిష్టుల కర్మలన్వియు వ్యర్థములే. నీవు లేనిదే బ్రహ్మ-విష్ణు-శివులును దిక్పతులును నరులకు కర్మఫలము లీయజాలరు. కర్మస్వరూపుడగ బ్రహ్మయును ఫలస్వరూపుడగు శివుడును యజ్ఞ స్వరూపుడైన విష్ణవును నేనే. నీవు కర్మల సారరూపిణీవి. ఫలదాయకుడగు పరబ్రహ్మ- నిర్గుణుడు-ప్రకృతిపరుడు-శ్రీకృష్ణ భగవానుడు సైతము నిన్ను గూడిననే శక్తిమంతుడగును. ఓ ప్రియకాంతా! నా జన్మ జన్మలకు నీవే నా శక్తివి. వరాననా! నీ వలననే నేను సర్వ శక్తిమంతుడను గాగలను. అని సంస్తుతించగనే లక్ష్మి ఖళనుండి పుట్టిన దక్షిణా మాదేవి యజ్ఞాధిష్ఠానదేవియై యజ్ఞ భాగవానుని సేవింప నతని సన్నిధి నుండెను. ఈ దక్షణా స్తోత్రమును యజ్ఞము సమయమున చదివినవాడు సకల యజ్ఞము ఫలము తప్పకపడయుగలడు. రాజసూయము-వాజపేయము-గోమేధము.అశ్వమేధము-లాంగలము-విష్ణుయజ్ఞము మున్నగునవి కీర్తికరములైన జన్నములు, ధనదానములు భూ దానములు పూర్తకర్మలు (రెరువులు నూతులుత్రవ్వుట) ఫలదానము గజమేధము లోహ- స్వర్ణ- రత్న-తామ్ర దానములును-

శివయజ్ఞే రుద్రయజ్ఞే శక్రయజ్ఞే చ బంధుకే | వృష్టౌ వరుణయాగే చ కండకే వైరిమర్ధనే. 85

శుచియజ్ఞే ధర్మయజ్ఞేధ్వరే చ పాపమోచనే | బ్రహ్మాణీ కర్మయోగే చ యోనియాగే చ భద్రకే. 86

ఏతేషాం చ సమారంభే ఇదం స్తోత్రం చ యః పఠేత్‌ | నిర్వుఘ్నేనచ తత్కర్మ సర్వం భవతి నిశ్చితమ్‌. 87

ఇదం స్తోత్రం చ కధితం ధ్యానం పూజావిధిం శృణు | శాలగ్రామే ఘటేవాపి దక్షిణాం పూజాయే త్సుధీః 88

లక్ష్మీదక్షాంససంభూతాం దక్షిణాం కమలాకలామ్‌ | సర్వకర్మను దక్షాం చ ఫలదాం సర్వకర్మణామ్‌. 89

విష్ణోః శక్తి స్వరూపాం చ పూజీతాం వందితాం శుభామ్‌ | శుద్ధిదాం శుద్ధిరూపాం చ సుశీలాం శుభదాం భ##జే. 90

ధ్యాత్వానేనైవ వరదాం మూలేన పూజయేత్సుదీః | దత్త్వా పాద్యాదికం దేవైని వేదోక్తే నైవ నారద. 91

ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వా హేతిచ విచక్షణః | పూజయే ద్విధివ ద్బక్త్యా దక్షిణాం సర్వపూజీతామ్‌. 92

ఇత్యేవం కధితం బ్రహ్మన్దక్షిణాఖ్యాన మేవచ | సుఖదం ప్రీతిదం చైవ ఫలదం సర్వ కర్మణామ్‌. 93

ఇదం చ దక్షిణాఖ్యానం యః శృణోతి సమాహితః | అంగహీనం చ తత్కర్మన భ##వే ద్బారతే భువి. 94

అపుత్రో లభ##తే పుత్రం నిశ్చితం చ గుణాన్వితమ్‌ | భార్యహానో లభే ద్బార్యాం సుశీలాం సుందరీం పరామ్‌. 95

వరారోహాం పుత్రవతీం వినీతాం ప్రియవాదినీమ్‌ | పతివ్రతాంచ శుద్ధాం చ కులజాం చ వధూం వరామ్‌. 96

విద్యాహీనో లభే ద్విద్యాం ధనహీనో లభేద్దనమ్‌ | భూమిహీనో లభే ద్బూమిం ప్రజాహీనో లభేత్ర్పజామ్‌. 97

సంకటే బంధువిచ్చేదే విపత్తౌ బంధనే తథా | మాసమేక మిదం శ్రుత్వా ముచ్చతే నాత్ర సంశయః 98

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారదనారాయణ సంవాదే దక్షిణోపాఖ్యానే పంచచత్వారింశోధ్యాయః

శివయజ్ఞము రుద్రయాగము ఇంద్రయజ్ఞము బంధుకయజ్ఞము వరుణయాగము కండకయజ్ఞము శత్రునాశయజ్ఞము శుచియజ్ఞము ధర్మయజ్ఞము పాపయోచనయజ్ఞము బ్రాహ్మకర్మయజ్ఞము అంబాయజ్ఞము భధ్రకయాగము ఈయన్ని యజ్ఞములందును యజ్ఞ పురుషుడుచేసిన స్తోత్రము పఠించినచో యజ్ఞ కర్మ నిర్విఘ్నముగ ఫలవంతమగును. దక్షిణా స్తోత్రము చెప్పబడెను. ఇపుడు దక్షిణాధ్యానము పూజా విధానము వినుము. దక్షిణను సాలగ్రామమందు గాని కలశమందు గాని యావాహన చేసి పూజించవలయును. లక్ష్మి దక్షిణభాగమునందావిర్భవించిన లక్ష్మీకళ-సర్వకర్మ దక్ష- సర్వకర్మ ఫలదాయిని విష్ణు శక్తి స్వరూపిణి- పూజిత-వందిత- శుభ- శుద్ధిద- శుద్ధిస్వరూప- శుభదాయిని- సుశీలను భజించుచున్నాను. ఇట్లు ధ్యానించి పరదాయినిని మూలమంత్రముతో పూజింపవలయును. నారదా! వేదోక్త ప్రకారముగ పాద్యాదు లీయవలయును. '' ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహా'' యను మూలమంత్రముతోపండితులు యథావిధిగ సర్వపూజితయగు దక్షిణను భక్తిమీర పూజింపవలయుము. నారదా! ఇట్లు దక్షిణాధ్యానము తెల్పితిని. ఇది సుఖదము- ప్రీతిదము. సర్వకర్మ ఫలప్రదము. ఈ దక్షిణోపాఖ్యానము శ్రద్దగ వినువాడు చేసిన కర్మము భారత భూమిపై నంగహీనముగాదు. వ్యర్థముగాదు. దీనివలన పూత్రులు లేనివానికి గుణవంతుడైన పుత్రుడు గల్గును. భార్య లేనివాడు సుశీల- అందగతైయుగు భార్యను బడయును. వరారోహ- పుత్రవతి- వినీత- ప్రియవాదిని- పతివ్రత- శుద్ద- కులకాంతయగు కోడలు లభించును. దీనిని చదువుటవలన విద్యలేని వానికి విద్యయు ధనములేనివానికి ధనమును- భూమిలేని వానికి భూమియు సంతెలేని వానికి సంతును గల్గును. బంధుగుల యెడబాటున సంకటములందు ఆపదలందు బంధనములందు దీని నొకనెల చదివినచో నతడుతప్పక ముక్తుడై సుఖము లొందును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధమున నారద నారాయణ సంవాదమున దక్షిణోపాఖ్యానమనునలువదైదవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters