Sri Devi Bagavatham-2
Chapters
అథ సప్తచత్వారింశో೭೭ధ్యాయః. శ్రీ నారాయణ ఉవాచ ః కథితం షష్ఠ్యుపాఖ్యానం బ్రహ్మపుత్ర యథాగమమ్|
దేవీ మంగళ చండీ చ తదాఖ్యానం నిశామయ. 1 తస్యాః పూజాదికం సర్వం ధర్మవక్త్రేణ యచ్చ్రుతమ్ | శ్రుతిసమ్మత మేవేష్టం సర్వేషాం విదుషామపి. 2 దక్షా యా వర్తతే చండీ కల్యేణషు చ మంగళా | మంగళేషు చ యా దక్షా సా చ మంగళ చండికా. 3 పూజ్యా యా వర్తతే చండీ మంగళో೭పిమహీసుతః | మంగళాభీష్ట దేవీయా సావామంగళచండికా. 4 మంగళో మనువంశ్య శ్చ సప్తద్వీ పధరాపతిః | తస్య పూజ్యా೭భీష్ట దేవీ తేన మంగళచండికా. 5 మూర్తిభేదేన సా దుర్గా మూలప్రకృతి రీశ్వరీ | కృపారూపా೭తి ప్రత్యక్షా యోషితామిష్ట దేవతా. 6 ప్రథమే పూజితా సా చ శంకరేణ పరాత్పరా | త్రిపురస్య వధేఘోరే విష్ణునా ప్రేరి తేన చ.7 బ్రహ్మ న్బ్రహ్మో పదేశేన దుర్గతేన చ సంకటే | ఆకాశా త్పతితే యానే దైత్యేన పాతితేరుషా. 8 బ్రహ్మ విష్ణూపదిష్ట శ్చ దుర్గాంతుష్టావ శంకరః | సా చ మంగళ చండీ యా బభూవ రూపభేదతః 9 ఉవాచ పురతః శంభోర్బయం నాస్తీతితం ప్రభో | భగవాన్వృషరూప శ్చ సర్వేశ##స్తే భవిష్యతి. 10 యుద్ధశక్తి స్వరూపా೭హం భవిష్యామి న సంశయః | మాయాత్మనా చ హరిణా సహాయేన వృషధ్వజ. 11 జహి దైత్యం స్వశత్రుం చ సురాణాం పదఘాతుకమ్ | ఇత్యుక్త్వా೭ంతర్హితా దేవీశంభోః శక్తిర్బభూవసా. 12 విష్ణు దత్తేన శ##స్త్రేణ జఘ న న తము మాపతిః | మునీంద్రపతితే దైత్యే సర్వే దేవామహర్షయః 13 తుష్ణువుః శంకరం దేవం భక్తిన మ్రాత్మకంధరాః | సద్యః శిరసి శంభో శ్చ పుష్ప వృష్టిర్బభూవ హ. 14 బ్రహ్మా విష్ణు శ్చ సంతుష్టో దదౌ తసై#్మ శుభాశిషమ్ | బ్రహ్మా విష్ణూపదిష్టశ్చ సుస్నాతః శంకర స్తథా. 15 నలువది ఏడవ అధ్యాయము మంగళ చండీదేవి చరితము శ్రీ నారాయణు డిట్లనెను ః బ్రహ్మపుత్రా ! నారదా ! ఆగమ ప్రకారముగ షష్ఠీ దేవీ చరిత్ర చెప్పితిని ఇపుడు మంగళ చండీదేవి మహాఖ్యానము చక్కగ నాలకింపుము. ఆమె పూజాదులన్నియును ధర్ముని నోట వింటిని. అది వేద సమ్మతమైనది పండితులకు ప్రియమైనది. మంగళమున శుభము చండిక యన ప్రతాపమూర్తి. ఆమె శుభకార్యములందు మంగళము గూర్చుటవలన మంగళ చండిక యయ్యెను. మంగళ చండిక పూజ్యురాలు. మంగళములైన కోర్కెలు తీర్చునది. మంగళుడను రాజుచేత పూజింపబడినది. కాన మంగళ చండిక యన పేరు గాంచినది. మనువంశమున మంగళుడను రాజు గలడు. అతడేడు దీవుల కధిపతి. అతడు పూజించుటవలన నామెను మంగళచండిక యని యందురు. మంగళ చండిక మూలప్రకృతియగు దుర్గాదేవి మాఱు రూపమే. స్త్రీలపాలిటి కల్పతరువు. ప్రత్యక్షదేవి. దయామూర్తి. పరాత్పర యగు నామెను మొట్టమొదట శివుడు త్రిపురములు సంహరించు సమయమున విష్ణు ప్రేరణచేత పూజించెను. శివుని విమానమును త్రిపురా సురుడు దివినుంచి క్రిందికి కోపముతో పడవేసెను. అట్టి ఘోర సంకటమున బ్రహ్మ శివునకు మంగళ చండిని గూర్చి తెల్పెను. అపుడు శివుడు బ్రహ్మ-విష్ణుల యాదేశము ప్రకారము దుర్గను నుతించెను. ఆమెయే మాఱు రూపమున మంగళ చండి యయ్యెను. ఆమె శంభునితో నీకు భయము లేదని ప్రత్యక్షముగ చెప్పెను. విష్ణువు సర్వేశుడు. అతడు నీకు వృషభ వాహనము గాగలడు. నేను తప్పక యుద్ధ శక్తి స్వరూపిణినైనీ కండగ నిల్తును. శివా ! అపుడు నీవు నా సాయమున హరి సాయమున జయింపగలవు. సురల పదచ్యుతులను చేసిన దానవుని సంహరింపుము. అని శివునితో బలికి దేవి అంతర్హిత యయ్యెను. శివుడపుడు విష్ణు వొసంగిన యస్త్రముతో దానవుని చంపెను. దానవుడంత మొందగనెల్ల దేవతలు- మహర్షులును భక్తితో తలలు వంచి శంకర భగవాను నుతించిరి. వెంటనే శివుని తలపై పూలవాన కురిసెను. బ్రహ్మవిష్ణులును సంతోషించి శివునకు శుభాశీస్సులొసగిరి. బ్రహ్మ విష్ణుల యాదేశముతో శివుడు స్నానమొనర్చెను. పూజయామాసతాం భక్త్యా దేవీంమంగళ చండికామ్ | పాద్యా ర్ఘ్యా చమనీ యై శ్చ వసై#్త్రశ్చ వివిధైరపి. 16 పుష్పచందననైవేద్యై ర్బక్త్యా నానావిధైర్మునే | ఛాగైర్మేషైశ్చ మహిషై ర్గవయైః పక్షిభి స్తథా. 17 వస్త్రాలం కారమాల్యై శ్చ పాయసైః షిష్టకైరపి | మధుభిశ్చ సుధాభి శ్చ ఫలైర్నానా విధైరపి. 18 సంగీతై ర్నర్తకై ర్వాద్యై రుత్సవైర్నామ కీర్తనైః | ధ్యాత్వా మాధ్యందినో క్తేన ధ్యానేన భక్తిపూర్వకమ్. 19 దదౌ ద్రవ్యాణి మూలేన మంత్రేణౖవ చ నారద | ఐం హీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవిమంగళ చండికే. 20 హుం హుం ఫట్స్వాహా ప్యేకవింశాక్షరో మంత్రః | పూజ్యః కల్పతరుశ్చైవ భక్తానాం సర్వకామదః 21 దశలక్ష జపేనైవ మంత్రసిద్ధిర్బవే ద్ధ్రువమ్ | ధ్యానంచ శ్రూయతాం బ్రహ్మన్వేదోక్తం సర్వసమ్మతమ్. 22 దేవీంషోడశ వర్షీయాం శశ్వత్సు స్థిర¸°వనామ్| బింబోష్ఠీం సుదతీం శుద్ధాం శరత్ప ద్మనిభాననామ్. 23 శ్వేతచంపకవర్ణాభాం సునీలోత్పలలోచనామ్ | జగద్ధాత్రీం చ దాత్రీం చ సర్వేభ్యః సర్వసంపదామ్ 24 సంసారసాగరేఘోరే జ్యోతీరూపాం సదాభ##జే | దేవ్యా శ్చ ధ్యాన మిత్యేవం స్తవనం శ్రూయతాంమునే. 25 మహాదేవ ఉవాచః రక్ష రక్ష జగన్మాత ర్దేవి మంగళచండికే | హారికే విపదాంరాశేర్హర్ష మంగళకారికే. 26 హర్షమంగళదక్షే చ హర్షమంగళదాయికే | శుభే మంగళదక్షే చ శుభే మంగళచండికే. 27 మంగళే మంగళార్హే చ సర్వమంగళమంగళే | సతాం మంగళ##దే దేవి సర్వేషాం మంగళాలయే. 28 పూజ్యే మంగళవారే చ మంగళాభీష్టదేవతే | పూజ్యే మంగళభూపస్య మనువంశస్య సంతతమ్. 29 మంగళాధిష్ఠాతృ దేవి మంగళానం చ మంగళే | సంసార మంగళాధారేమోక్షమంగళదాయిని. శివుడంత భక్తితో మంగళ చండికను సంపూజించెను. పాద్యము-అర్ఘ్యము-ఆచమనీయము- పలువిధములైన వస్త్రములును శివుడు దేవి కొసంగెను. పుష్ప చందనములతోపలువిధములైన నైవేద్యములతో మేకలు-గొఱ్ఱలు-ఎనుబోతులు-పల్లావులు-పక్షులు మున్నగువాని బలులతో వస్త్రాలంకారమలతో పూలదండలతో పాయసముతో పిండి వంటలతో తేనెతో పలువిధములైన పండ్లతో సంగీత నర్తనములతో వాద్యములతో నామసంకీర్తన మహోత్సవములతో మాధ్యందినమున తెలుపబడిన ధ్యానము ప్రకారముగ శివుడు భక్తితో మంగళ చండికను ధ్యానించెను. నారదా ! శివుడు మూల మంత్రముతో ద్రవ్యములు దేవి కర్పించెను. '' ఓం హ్రీం శ్రీం క్లీం సర్వ పూజ్యే దేవి మంగళ చండికే. హు హుం ఫట్ స్వాహా '' అనునదిరువదొక యక్షరముల మంత్రము. ఇది భక్తులకు కల్పతరువు. సర్వకామము లొసగునది. పూజ్యమైనది. దీనిని పది లక్షలు జపించిన ధ్రువముగ మంత్రసిద్ధి గల్గును. నారదా ! వేదోక్త ప్రకారము సర్వ సమ్మతమునగు ధ్యానము వినుము. పదారు వత్సరముల దేవి - నిండైన జవ్వనము గలది - బింబాధర-సుదతి-శుద్ధ- శారద కమలమువంటి ముఖము గలది. శ్వేతచంపకమువంటి కాంతి గలది. నల్ల కలువలవంటి కన్నులు గలది. ఎల్లరికీ సకల సంపద లొసంగునది-జగముల తల్లి-సకలదాయిని-సంసార సాగరమందు జ్యోతిః స్వరూపిణి యగు దేవిని కొల్తును. నారదా ! ఇది ధ్యానము. ఇక స్తోత్రము వినుము. మహాదేవుడిట్లనెను ః జగన్మాతా ! మంగళదాయినీ ! ఆనందకారిణీ ఆపదలుపాపు తల్లీ ! దేవి మంగళ చండికా ! నన్ను బ్రోవుము బ్రోవుము- ఆనంద మంగళదాయినీ ! ఆనంద మంగళ ప్రవీణా ! శుభమంగళ పరాయణా ! శుభా! మంగళచండికా ! తల్లీ మంగళాదేవీ ! మంగళయోగ్యా ! సర్వమంగళమంగళా సాధుజనులకు శుభములొసగు జననీ! శుభ మంగళనిలయా ! మంగళవార పూజ్య! మంగళాభీష్ట దేవీ ! మనువంశమున జన్మించిన మంగళ రాజుచేత పూజలందుకొనిన తల్లీ! ఓహో మంగళాధిష్ఠాన దేవీ ! మంగళ మంగళా ! సంసార మంగళాధారిణి! ముక్తి మంగళదాయినీ! సారే చ మంగళాధారే పారే చ సర్వ కర్మణామ్ | ప్రతి మంగళ వారే చ పూజ్యే మంగళ సుఖప్రదే. 31 స్తోత్రేణానేన శంభు శ్చ స్తుత్వా మంగళ చండికామ్ | ప్రతి మంగళవారే చ పూజాం దత్త్వా గతః శివః 32 ప్రథమే పూజితా దేవీ శివేన సర్వ మంగళా | ద్వితీయే పూజితా సా చ మంగళేన గ్రహేణ చ. 33 తృతీయే పూజితా భద్రా మంగళేన నృపేణ చ | చతుర్థే మంగళవారే సుందరీభిః ప్రపూజితా. 34 పంచమే మంగళాకాంక్షి నరైర్మంగళ చండికా | పూజితా ప్రతివిశ్వేషు విశ్వేశపూజితా సదా. 35 తతః సర్వత్ర సంపూజ్యా బభూవ పరమేశ్వరీ ! దేవైశ్చ మునిభిశ్చైవ మానవైర్మనుభిర్మునే. 36 దేవశ్చ మంగళస్తోత్రం యః శృణోతి సమాహితః తన్మంగళం భ##వేత్తస్య న భేవేత్తదమంగళమ్ | వర్ధతే పుత్రపౌత్రైశ్చ మంగళం చ దినేదినే. 37 నారాయణ ఉవాచ ః ఉక్త్వం ద్వయోరుపాఖ్యానం బ్రహ్మపుత్ర యథాగమమ్ | శ్రూయతాం మన సాఖ్యానాం యచ్చ్రుతం ధర్మవక్తృతః 38 సా చ కన్యా భగవతీ కశ్యపస్య చ మానసీ | తేనైవ మనసా దేవీ మానసా యా చ దీవ్యతి. 39 మనసా జాయతే యా చ పరమాత్మాన మీశ్వరమ్ | తేన సా జాయతే యా చ పరమాత్మాన మీశ్వరమ్. 40 ఆత్మారామా చ సా దేవీ వైష్ణవీ సిద్ధయోగినీ | త్రియుగం చ తపస్తప్త్వాకృష్ణస్య పరమాత్మానః 41 జరత్కారు శరీరం చ దృష్ట్యా యత్షీణ మీశ్వరః | గోపీపతిర్నామ చక్రే జరత్కారు రితిప్రభుః 42 వాంఛితం చ దదౌ తసై#్య కృపయా చ కృపానిధిః |పూజాం చ కారయామాస చకార చ స్వయం ప్రభుః 43 స్వర్గే చ నాగలోకే చపృథివ్యాం బ్రహ్మలోకతః | భృశం జగత్సుగౌరీ సాసుందరీ చ మనోహరా. 44 మంగళకారిణీ ! మంగళాధారా ! సకల కర్మలకు పరాకాష్ఠా ! ప్రతి మంగళవారమున పూజనీయా ! మంగళసుఖప్రదా ! నీకు నమస్కారము నన్ను బ్రోవుము. అను స్తోత్రముతో శివుడు మంగళ చండికను స్తుతించి ప్రతి మంగళవారమును మంగళ చండికను శివుడు పూజించెను. మొట్టమొదట సర్వమంగళయగు చండికాదేవిని శివుడు పూజించెను. తర్వాత మంగళగ్రహము (కుజుడు) మండళచండికను పూజించెను. ఆ తర్వాత మంగళుడను రాజు భద్ర మంగళ##దేవి నర్చించెను. ఆ పిదప ప్రతి మంగళవారమున సుందర స్త్రీలు మంగళ నారాధించిరి. ఐదవసారి శుభముగోరు నరులచేత మంగళచండిక పూజింపబడెను. తర్వాత ప్రతి విశ్వమునందు శివపూజితయగు మంగళ పూజింపబడెను. మునీ ! అటు పిమ్మట మంగళ పరమేశ్వరి యెల్లెడల దేవ-ముని-మను-నరులచేత పూజింపబడెను. ఈ మంగళ##దేవిస్తోత్రము నిశ్చల మనస్సుతో వినువాడు శుభములు పడయును. అతని కమంగళము గలుగదు. నారాయణు డిట్టు లనెను ః నారదా ! ఇట్టు లాగమమందు చెప్ప బడిన ప్రకారముగ నీ కిర్వురు దేవతల చరిత్ర తెల్పితిని. నేను ధర్ముని వలన మునుపు వినిన మానసదేవి చరిత మాలింపుము. ఆమె కశ్యపమహర్షి యొక్క మానసపుత్రిక ! ఆమె తన మనస్సువలననే క్రీడించగల దగుటవలన మానసా దేవియన వన్నె కెక్కెను. ఆమె తన మనస్సుతోడనే పరమేశ్వరుని ధ్యానించును. పరమయోగములో మునుంగును. కనుక నామె మనసాదేవి యయ్యెను. ఆమె ఆత్మారామ వైష్ణవి సిద్ధయోగిని కృష్ణపరమాత్ముని గూర్చి మూడు యుగములు తపించెను. తపమువలన నామె శరీరము-వస్త్రము జీర్ణించుట చూచి కృష్ణ పరమాత్మ యామెకు జరత్కారువను పేరు పెట్టెను. గోపవిభు డామె కోర్కెను దయతో తీర్చి యామెను పూజించి యామెకు కీర్తి గల్గించెను. ఆమెను బ్రహ్మలోక-నాగలోక- స్వర్గలోక- భూలోక వాసు లెల్లరును పూజించిరి. ఆమె లావణ్యవతి సుమనోహర జగములకు గౌరి. జగద్గౌరీతి విఖ్యాతా తేన సా పూజితా సతీ | శివశిష్యా చ సా దేవీ తేనశైవీ ప్రకీర్తితా. 45 విష్ణు భక్తా తీవ శశ్వద్వైష్ణవీ తేన కీర్తితా | నాగానాం ప్రాణరక్షిత్రీ యజ్ఞే పారీక్షితస్య చ 46 నాగేశ్వరీతి విఖ్యాతా సానాగ భగినీతి చ | విషం సంహార్తు మీశాయా తేన విషహారీ స్మృతా. 47 సిద్ధయోగహరాత్ప్రాప తేన సా సిద్ధ యోగినీ | మహాజ్ఞానం చ యోగం చ మృత సంజీవనీం వరామ్. 48 మహాజ్ఞాన యుతాం తాం చ ప్రవదంతి మనీషిణః | ఆస్తీకస్య మునీం ద్రస్య మాతా సాపి తపస్వినీ. 49 ఆస్తీకమాతా విజ్ఞాతా జగత్యాం సుప్రతిష్ఠితా | ప్రియా మునే ర్జరత్కారో ర్మునీంద్రస్య మహాత్మనః 50 యోగినో విశ్వ పూజ్యస్య జరత్కారు ప్రియా తతః | జరత్కా రుర్జగ ద్గౌరీ మనసా సిద్ధ యోగినీ. 51 వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా | జరత్కారు ప్రియా స్తీకమాతా విషహారేతి చ. 52 మహాజ్ఞాన యుతాచైవసా దేవీ విశ్వపూజితా | ద్వాదశైతాని నామాని పూజాకాలేతుయః పఠేత్. 53 తస్యనాగభయంనాస్తి తస్య వంశోద్బవస్య చ | నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే. 54 నాగశోభే మహాదుర్గే నాగవేష్టిత విగ్రహే | ఇదం స్తోత్రం పఠిత్వాతు ముచ్యతేనా త్ర సంశయః 55 నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా నాగవర్గః పలాయతే | దశలక్షజపేనైవ స్తోత్ర సిద్ధిర్బవే న్నృణామ్. 56 స్తోత్ర సిద్ధిర్బ వేద్యస్య స విషం భోక్తు మీశ్వరః | నాగైశ్చ భూషణం కృత్వా సభ##వేన్నాగ వాహనః 57 నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భ##వేన్నరః | అంతే చ విష్ణునా సార్ధం క్రీడత్యేవ దివా నిశమ్. 58 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే నారద నారాయణ సంవాదే సప్తచత్వారింశో೭ధ్యాయః. జగములకు పూజిత యగుటవలన నామెను జగద్గౌరి యందురు. శివుని శుష్యురా లగుటవలన నామెను శైవియందురు. ఆమె విష్ణుభక్తురాలగుట వైష్ణవి యన వాసికెక్కెను. ఆమె జనమేజయుని సర్పయాగమున నాగులను గాపాడినది కనుకనామె నాగేశ్వరి-నాగభగిని యన విలసిల్లెను. విషము హరించుటలో నేర్పరి గాన ఆమెను విషహరి యందురు. ఆమె శివునినుండి సిద్ధయోగముపొందుటవలన సిద్ధయోగినిగపేర్వడసెను. జ్ఞాన యోగములొసంగునట్టి మృతసంజీవనీ విద్య నెఱిగినది. అందువలన నామెను పండితులు మహాజ్ఞానయుత యందురు. ఆమె తపస్విని ఆస్తీక మునీంద్రుని తల్లి. అందుచే నామె జగములందు '' ఆస్తీకమాత'' యనగ ప్రతిష్ఠ గాంచినది. మహాత్ముడగు జరత్కారు మహాముని కామె ప్రియురాలు. విశ్వపూజ్యుడు పరమయోగి యైన జరత్కారుని ప్రియురాలు జరత్కారు-జగద్గౌరి-మనస-సిద్ధయోగిని వైష్ణవి-నాగభగిని- శైవి-నాగేశ్వరి- జరత్కారు ప్రియ- ఆస్తీకమాత- విషహార- మహాజ్ఞానయుత- విశ్వపూజిత దేవి అను పండ్రెండు పేర్లుపూజా సమయమున చదువవలయును. అట్లుచదివిన వానికి నాగభయము గల్గదు. అతని వంశము తామరతంపరగ వర్ధిల్లును. శయనించునపుడు గాని పాముచన్న యింటిగాని వీనిని చదివినచో సర్పభయము గలుగదు. పాములు నివసించుచోటను పాములుండు నడవు లందును పాములు చుట్లుకొనిన విగ్రహములందును వీనిని చదివినంతనే పాముల భయము గల్గదు. వీనిని నిత్యము చదువు వానిని చూచి పాములు వాని నుండి పారిపోవును దీనినిపదిలక్షలు జపించినచో నరులకు స్తోత్ర సిద్ధి గల్గును. స్తోత్రసిద్ధి బొందినవాడు విషము త్రాగ సమర్థుడగును. అతడు నాగభూషణుడై నాగవాహనుడు నగును. అతడు నాగాసనుడు నాగతల్పుడు మహాసిద్ధుడు గాగలడు. తుదకతడు రాత్రింబగళ్ళు మహా విష్ణువుతో నానందమొందుచుండును. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి తొమ్మిదవ స్కంధము నారద నారాయణ సంవాదము నలువదేడవ యధ్యాయము.