Sri Devi Bagavatham-2    Chapters   

అథ అష్టాచత్వారింశోధ్యాయః.

శ్రీ నారాయణ ఉవాచ ః మత్తః పూజా విధానం చ శ్రూయతాం మునిపుంగవ | ధ్యానం చ సామవేదోక్తం ప్రోక్తం దేవీవిధానకమ్‌. 1

శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్‌ | వహ్నిశుద్ధాంశుకాధానాం వాగయజ్ఞోపవీతినీమ్‌. 2

మహాజ్ఞానయుతాం తాం చ ప్రవరజ్ఞానినాం వరామ్‌ | సిద్ధాధిష్ఠాతృ దేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాంభ##జే. 3

ఇతి ధ్యాత్వా చతాం దేవీం మూలే నైవ ప్రపూజయేత్‌ | నైవేద్యైర్వి విధై ర్దూపైః పుష్పగంధాను లేపనైః 4

మూలమంత్రై శ్చ వేదోక్తై ర్బక్తానాం వాంఛితప్రదః | మునే కల్పతరుర్నామ సుసిద్ధో ద్వాదశాక్షరః 5

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసా దేవ్యై స్వాహేతి కీర్తితః |పంచలక్షజపే నైవ మంత్ర సిద్ధిర్బవేన్నృణామ్‌.

మంత్ర సిద్ధి ర్బవేద్యస్య ససిద్ధో జగతీతలే | సుధా సమం విషం తస్య ధర్వంతరిసమోభ##వేత్‌. 7

బ్రహ్మన్‌ స్నాత్వాతు సంక్రాంత్యాం గూఢశాలాసు యత్నతః | ఆవాహ్య దేవీ మీశానాం పూజయేద్యో తిభక్తితః 8

పంచమ్యాం మనసాధ్యాయన్‌ దేవ్యై దద్యాచ్ఛ యోబలిమ్‌ | ధనవాన్పు త్రవాం శ్చైవ కీర్తి మాన్సభ##వే ద్ధ్రువమ్‌.

పూజావిధానం కథితం తదాఖ్యానం నిశామయ | కథయామి మహాభాగ యచ్చ్రుతం ధర్మవక్త్రతః 10

పురా నాగభయాక్రాంతా బభూపుర్మానవా భువి | గతాస్తే శరణం సర్వే కశ్యపం మునిపుంగవమ్‌. 11

మంత్రాం శ్చ ససృజే భీతః కశ్యపోబ్రహ్మణా న్వితః | వేదబీజాను సారేణ చోపదేశేన బ్రహ్మణః 12

నలుబది ఎనిమిదవ అధ్యాయము

మనసా ధ్యాన పూజా విధానము

శ్రీ నారాయణు డిట్లనెను ః ఓ మునివరా ! మనసాదేవి యొక్క పూజా విధానము ధ్యానము సామవేదమున చెప్పి నట్లుగ తెల్పుదును శ్రద్ధగ వినుము. ఆమె శ్వేతచంపకమువంటి కాంతి గలది; రత్నభూషణభూషిత; అగ్ని శుద్ధ వస్త్రము ధరించినది; పాము జన్నిదము దాల్చినది. జ్ఞాన సంపన్నురాలు; మహాజ్ఞానులలో శ్రేష్ఠురాలు; సిద్ధాధిష్ఠానదేవి; సిద్ధ సిద్ధిప్రదయగు మనసను ధ్యానించుచున్నాను. అని ధ్యానించి మూలమంత్రముతో పూజింపవలయును. పలువిధములైన ధూప దీప పుష్పలేపనములతో నైవేద్యములతో మనసును పూజింపవలయును. వేదోక్తవిధితో మూలమంత్రము జపించిన భక్తుల కోర్కెలు దీరును. మనసాదేవి ద్వాదశాక్షరమంత్రము కల్యాణప్రదము సిద్ధిదము. '' ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసా దేవ్యై స్వాహా'' అను మంత్రము నైదు లక్షలు జపించిన వానికి మంత్రసిద్ధి గల్గును. అట్టి మంత్రసిద్ధుడు జగములందునిక్కముగ సిద్ధపురుషుడే. అతడు ధన్వంతరి సమానుడు; అతనికి విష మమృత మగును. నారదా! నరుడు సంక్రాంతి నాడు స్నానముచేసి గదిలో నొంటిగ ఈశానదేవి నావాహనముచేసి పరమభక్తితో పూజింపవలయును. ఆ పిదప పంచమి నాడు మనస్సులో మనసాదేవిని ధ్యానించి బలి యొసంగిన వానికి నిక్కముగ ధనము-కీర్తి-పుత్రులు గల్గుదురు. ఇది మానస పూజా విధానము. ఇం కామె పుణ్యచరితము నేను ధర్ముని నోట విన్నది విన్నట్లు తెల్పుదును వినుము. పూర్వము భూలోకవాసులు నాగభయముతో పీడితులై కశ్యప మహామునిని శరణు చొచ్చిరి. అపుడు కశ్యపుడు బ్రహ్మసాయముతో నతని యుపదేశము ప్రకారముగ వేద బీజాక్షరములతో మంత్రములు సృజించెను.

మంత్రాధిష్ఠాతృదేవీం తాం మనసాససృజే తథా | తపసా మనసా తేన బభూవ మనసా చ సా. 13

కుమారీ సా చ సంభూతా జగామ శంకరాలయమ్‌ | భక్త్యా సంపూజ్యకైలాసే తుష్టావ చంద్రశేఖరమ్‌. 14

దివ్యవర్ష సహస్రం తం సిషేవే చ మునేః సుతా | ఆశుతోషో మహేశశ్చ తాం చ తుష్టో బభూవ హ. 15

మహాజ్ఞానం దదౌ తసై#్య పాఠయామాస సామ చ | కృష్ణ మంత్రం కల్పతరుం దదావష్టా క్షరం మునే. 16

లక్ష్మీ మాయాకామబీజంజేంతం కృష్ణపదం తతః | త్రైలోక్య మంగళంనామ కవచం పూజనక్రమమ్‌. 17

పురశ్చర్యా క్రమం చాపి వేదోక్తం సర్వసమ్మతమ్‌ | ప్రాప్య మృత్యుంజయాన్మం త్రం సాసతీ చ మునేః సుతా. 18

జగామ తపసే సాధ్వీ పుష్కరం శంకరాజ్ఞయా | త్రియుగం చ తపస్తప్త్వా కృష్ణస్య పరమాత్మనః 19

సిద్ధా బభూవ సాదేవీ దదర్శ పురతః ప్రభుమ్‌ | దృష్ట్వా కృశాంగీం బాలాం చ కృపయా చ కృపానిధిః 20

పూజాం చ కారయామాస చకార చ స్వయం హరిః | వరం చ ప్రదదౌ తసై#్య పూజితా త్వం భ##వేభవ. 21

వరం దత్వా చ కల్యాణ్యౖ తతశ్చాంతర్దధే హరిః | ప్రథమే పూజితా సా చ కష్ణేన పరమాత్మనా. 22

ద్వితీయై శంకరేణౖవ కశ్వపేన సురేణ చ | మునినా మనునాచైవ నాగేన మానవాదిభిః 23

బభూవ పూజితా సాచ త్రిషులోకేషు సువ్రతా | జరత్కారు మునీం ద్రాయ కశ్యపస్తాం దదౌపురా. 24

తర్వాత కశ్యపుడు సర్వ మంత్రాదిష్ఠానదేవిని తన మనస్సునుండి సృజించెను. మనస్సునుండి యావిర్భవించుట వలన నామెను మనసాదేవి అందురు. ఆ కన్నియ కైలాస మేగి శంకరుని భక్తితో బూజించి యతని యనుగ్రహమునకు పాత్రురాలయ్యెను. ఆమె వేయి దివ్య సంవత్సరముల వఱకు శివుని గొల్చెను. శంకరు డామె సేవలకు ప్రసన్నుడయ్యెను. శివు డామెకు జ్ఞానోదయము గల్గించి సామవేదము చెప్పి కల్పతరువువంటి కృష్ణమంత్ర ముపదేశించెను. ''ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ స్వాహా'' అనునది కృష్ణ మహామంత్రము. త్రైలోక్యమంగళ కవచమును పూజా క్రమమును మనసా దేవికి విస్తారముగ చెప్పెను. మఱియు వేదోక్తమైన పురశ్చరణ విధానమును తెల్పెను. ఇట్లు ముని కూతురగు మనస శివుని నుండి మంత్రము బడసెను. పిమ్మట నామె శంకరు ననుమతితో పుష్కరతీర్థము చేరెను. అచట నామె మూడు యుగముల వఱకు కృష్ణుని గూర్చి తపించెను. చివర కామె సిద్ధి బొందెను. శ్రీకృష్ణుని దర్శనభాగ్యము బొందెను. దయా నిధానుడగు శ్రీకృష్ణుడు కృశాంగియగు మునిబాలను చూచెను. కృష్ణు డామెను స్వయముగ బూజించెను. నీవు జగములందు పూజనీయ వగుదువని మొట్టమొదట శ్రీకృష్ణుడు పూజించెను. రెండవసారి మనసను శంకరుడు పూజించెను. తర్వాత కశ్యపుడు మనువు నాగులు మనుజులునుమనసను పూజించిరి తర్వాత నామెముల్లోకములందును పూజింపబడెను. ఆమెను కశ్యపుడు జరత్కారు ముని కిచ్చి పెండిలి చేసెను.

అయాచితో మునిశ్రేష్ఠో జగ్రాహ బ్రాహ్మణాజ్ఞయా| కృత్వోద్వాహం మహాయోగీ విశ్రాంత స్తపసా చిరమ్‌. 25

సుష్వాప దేవ్యాజఘనే వటమూలే చ పుష్కరే | నిద్రాం జగామ సమునిః స్మృత్వా నిద్రేశమీశ్వరమ్‌. 26

జగా మాస్తం దినకరః సాయంకాల ఉపస్థితే | సంచింత్య మనసాసాధ్వీ మనసా సా పతివ్రతా. 27

ధర్మలోపభ##యేనైవ చకారాలోచనం సతీ | అకృత్వా పశ్చిమాం సంధ్యాం నిత్యాంచైవ ద్విజన్మనామ్‌. 28

బ్రహ్మహత్యాధికం పాపం లభిష్యతి పతిర్మమ | నోపతిష్ఠతియః పూర్వాంనోపాస్తేయస్తు పశ్చిమామ్‌. 29

స సర్వత్రాశుచి ర్నిత్యం బ్రహ్మహత్యాధికం లభేత్‌ | వేదోక్తమితి సంచింత్య బోధయా మాన సుందరీ. 30

స చ బుద్ధో మునిశ్రేష్ఠ స్తాం చుకోప భృశంమునే | మునిరువాచః కథం మేసుఖినః సాధ్వి నిద్రాభంగః కృతస్త్వయా. 31

వ్యర్థం వ్రతాధికం తస్యాయా భర్తు శ్చాపకారిణీ | తపశ్చా7నశనం చైవ వ్రతందానాదికంచ చ యత్‌. 32

భర్తు రప్రియ కారిణ్యాః సర్వం భవతి నిష్పలమ్‌ | యయా ప్రియః పూజిత శ్చ శ్రీకృష్ణః పూజితస్తయా. 33

పతివ్రతా ప్రతార్థం చ పతిరూపో హరిః స్వయమ్‌ | సర్వదానం సర్వయజ్ఞః సర్వతీర్థ నిషేవణమ్‌. 34

సర్వం వ్రతం తపః సర్వముపవాసాదికం చ యత్‌ | సర్వ ధర్మ శ్చ సత్యం చ సర్వ దేవ ప్రపూజనమ్‌. 35

తత్సర్వం స్వామి సేవాయాః కళానార్హంతి షోడశీమ్‌ | పుణ్య చ భారతే వర్షే పతిసేవాం కరోతి యా. 36

తన కిష్టము లేకున్నను జరత్కారు వామెను బ్రహ్మవాక్కు చొప్పున స్వీకరించెను. ఆ మహాయోగి మనసను బొంది తన చిరకాల తపము శ్రమము మఱచెను. ఒకనాడు జరత్కారుముని పుష్కర తీర్థమందలి మఱ్ఱినీడలో జరత్కారు మనస తొడలపై తల నిడుకొని నిద్రేశుడగు నీశ్వరుని తలంచి నిదురించెను. అంతలో సాయం సమయ మయ్యెను. సూర్యుడస్తమించనుండెను. అపుడుపతివ్రత మనస తన మనస్సులో నిట్లు దలచెను. నా పతికి ధర్మలోపము జరుగనున్నది. బ్రాహ్మణులు సాయం సంధ్యావందనము చేయవలయును. నా పతి కిపుడు సంధ్యావందనము చేయు నవకాశము లేదు గనుక నతనికి బ్రహ్మహత్యాపాతకము తగులును. ఉదయ సంధ్యను సాయం సంధ్య నుపాసించనివానికి పాపము చుట్టుకొనును. అత డెల్లెడల నపవిత్రు డగును. బ్రహ్మహత్యా పాతక మతనకి తగలును. అని వేదమునగలదనుకొని యా సుందరి తనపతిని మేలుకొల్పెను. అపుడు మునివరుడులేచి కోపించి యిట్లనెను. ఓ సాధ్వీ ! నేను సుఖనిద్రలోనుండగా నీవు నాకు నిద్రాభంగము గలిగించితివి భర్త కపకారము చేయు స్త్రీ చేసిన వ్రత-దాన-ధర్మ-తపము లన్నియును వ్యర్థము లగును. భర్తకు ప్రియము గూర్పజాలని భార్య కేదియును సఫలము గాదు. ఏ స్త్రీ చేత నామె పతిపూజింపబడునో ఆమెచే శ్రీకృష్ణుడే పూజింపబడినట్లగును. పతివ్రత జరుపు వ్రతము కొనసాగుటకు హరియే స్వయముగ పతి రూపమున నుండును. సకల దానయాగములు సకల తీర్థ సంసేవనములును ఎల్ల వ్రతతపములును ఉపవాసాదులన్నియును ఎల్ల ధర్మములు సత్యము సర్వ దేవపూజనము ఇవన్ని కలిసియును పతి సేవలో పదారవవంతునకు సరిపోవు. ఈ పుణ్య భారతభూమిపై పతిసేవ చేయు పుణ్యవతి-

వైకుంఠే స్వామినా సార్ధం సాయాతి బ్రహ్మణః పదమ్‌ | విప్రియం కురుతే భర్తు ర్వి ప్రియం వదతి ప్రియమ్‌.

అసత్కులే ప్రసూతా హి తత్పలం శ్రూయతాం సతి| కుంభీ పాకం వ్రజేత్సా చ యావచ్ఛం ద్ర దివాకరౌ. 38

తతో భవతి చాండాలీ పతిపుత్ర వివర్జితా | ఇత్యుక్త్వా చ మునిశ్రేష్టో బభూవ స్పురితా ధరః 39

చ కంపే తేన సా సాధ్వీ భ##యేనోవాచతం పతిమ్‌ | సాధ్వ్యువాచః సంధ్యాలోప భ##యేనైవ నిద్రాభంగః కృత స్తవ. 40

కురు శాంతిం మహాభాగ దుష్టాయా మమ సువ్రత | శృంగారాహార నిద్రాణాం యశ్చ భంగం కరోతివై. 41

సవ్రజేత్కాల సూత్రం వైయావచ్చంద్ర దివా కరౌ| ఇత్యుక్త్వా మనసాదేవీ స్వామిన శ్చరణాంబుజే. 42

పపాత భక్త్యా భీతా చ రురోద చ పునః పునః | కుపితం చ మునిందృష్ట్యా శ్రీసూర్యః శప్తు ముద్యతమ్‌. 43

తత్రాజగామ భగవా న్సంధ్యయా సహనారద | తత్రా గత్య మునిం సమ్యగువా చ భాస్కరః స్వయమ్‌. 44

వినయేన చ భీతశ్చ తయాసహ యథోచితమ్‌|

భాస్కర ఉవాచః సూర్యాస్తమయం దృష్ట్వా సాధ్వీ ధర్మభ##యేన చ. 45

బోధయామాసత్వాం విప్ర శరణం త్వామహంగతః | క్షమస్వభగవ న్ర్బహ్మన్మాం శప్తుంనోచితం మునే. 46

బ్రాహ్మణానాం చ హృదయం నవనీతసమం సదా | తేషాంక్షణార్థం క్రోధ శ్చ యతో భస్మభ##వేజ్జగత్‌. 47

పునః స్రష్టుం ద్విజః శక్తోన తేజస్వీ ద్విజాత్పరః | బ్రాహ్మణో బ్రహ్మణో వంశః ప్రజ్వలన్ర్బహ్మతేజసా. 48

తన పతితో వైకుంఠము చేరును. బ్రహ్మ పదవి చెందును- అట్లుకాక ఎల్లవేళల తనపతికి ప్రియము గూర్పక ప్రియము పలుకకుండు మానవతి నీచ కులమున బుట్టినదై యుండును దాని ఫలితముగ నామె సూర్యచంద్రులుండునంతవఱకు కుంభీపాక నరకమున గూలును. తర్వాత పతిపుత్రులకు నోచుకొనని చండాలిగ బుట్టును. ఇట్లనుచుండగ ముని పెదవులదరెను. అపుడా సతి భయకంపముతో తన పతి కిట్లనెనుః మీకు సంధ్యా లోప మగునను భీతిచే నిదురకు భంగము గల్గించితిని. మహాత్మా! దుష్టురాల నగు నన్ను చక్క దిద్దుము. శృంగారము ఆహారము నిద్ర వీనికి భంగము గల్గించువాడు సూర్యచంద్రు లుండునందాక కాలసూత్ర నరకమున బాధలు పడుచుండును అని మనసాదేవి తన పతి పద పద్మములపై వ్రాలెను. ఆమె భయముతో తన పతిపదములుపట్టుకొని మాటిమాటి కేడ్వసాగెను అపుడు ముని కోపముతో సూర్యుని శపించుటకు పూనుకొనెను. అంత సూర్యభగవానుడు సంధ్యాదేవితో ముని చెంత కేగుదెంచను. సూర్యుడు స్వయముగ మునితో వినయభయములతో తగినట్లుగ సూర్యాస్తమయ మగుటవలన నీకు ధర్మలోపము గల్గునను భయమీ సాధ్వికి గల్గెను. అందుచే నామెనిన్ను మేల్కొల్పెను. విప్రోత్తమా!

నేను శరణాగతుడను క్షమించుము-నన్ను శపించుట తగదు. బ్రాహ్మణుల నిండు మనంబువెన్న వంటిది వారికోపము క్షణార్ధమేయుండును-లేనిచో జగము బూదిగాదా? బ్రాహ్మణుడి జగమును మరల సృజింపను గలడు. బ్రాహ్మణుని మించిన తేజోవంతుడు మఱియొకడు లేడు. బ్రాహ్మవంశ సంజాతుడగుటవలన బ్రాహ్మణుడు బ్రహ్మతేజమున తేజరిల్లును.

శ్రీకృష్ణం భావయేన్నిత్యం బ్రహ్మజ్యోతిః సనాతనమ్‌ | సూర్యస్యవచనం శ్రుత్వా ద్విజ స్తుష్టో బభూవహ. 49

సూర్యో జగామ స్వస్థానం గృహీత్వా బ్రాహ్మణాశిషమ్‌ | తత్యాజ మనసాం విప్రః ప్రతిజ్ఞాపాలనాయచ. 50

రుదతీం శోకసంయుక్తాం హృదయేన విదూయతా | సాసస్మార గురుంశంభు మిష్టదేవం విధిం హరిమ్‌. 51

కశ్యపం జన్మదాతారం విపత్తౌ భయకర్శితా | తత్రాజగామ గోపీశో భగవాన్‌ శంభురేవ చ. 52

విధి శ్చ కశ్వపశ్చైవ మనసా పరిచింతితః | దృష్ట్వా విప్రోభీష్ట దేవం నిర్గుణం ప్రకృతేః పరమ్‌. 53

తుష్టావ పరయా భక్త్యా ప్రణనామ ముహుర్ముహుః | నమశ్చకార శంభుం చ బ్రహ్మాణం కశ్యపం తథా. 54

కథ మాగమనం దేవా ఇతి ప్రశ్నం చ కార సః | బ్రహ్మా తద్వచనం శ్రుత్వా సహసాసమయోచితమ్‌. 55

ప్రత్యువాచ నమస్కృత్య హృషీ కేశపదాంబుజమ్‌ | యది త్యక్త్యా ధర్మపత్నీ ధర్మిష్ఠా మనసా సతీ. 56

కురుష్వాం స్యాం సుతోతృత్తిం స్వధర్మ పాలనాయవై| జయాయాంచ సుతోత్పత్తిం కృత్వాపశ్చా త్త్య జేన్మునే. 57

అకృత్వా తు సుతోత్చత్తిం విరా గీయస్త్యే జేత్ర్పియామ్‌ | సువ్రతే తస్యపుణ్యం చ చాలన్యాం చ యథాజలమ్‌. 58

బ్రహ్మణో వచనం శ్రుత్వా జరత్కారుర్మునీశ్వరః | చకార నాభిసంస్పర్శం యోగేన మంత్ర పూర్వకమ్‌. 59

మనసా యా మునిశ్రేష్ఠ మునిశ్రేష్ఠ ఉవాచతామ్‌ | జరత్కారురువాచ : గర్భేణానేన మనసే తవపుత్రో భవిష్యతి. 60

కనుక సనాతనుడు బ్రహ్మజ్యోతి యగు శ్రీకృష్ణుని నిత్య మనుస్మరింపుము అను సూర్యుని పలుకులు విని ముని సంతోషించెను. సూర్యుడు బ్రాహ్మణాశీస్సులు పడసి తన చోటి కరిగెను. తన ప్రతిన నెఱవేర్చుకొనుటకు ముని తన సతిని వదలిపెట్టెను. ఆమె శోక సంతాపముతో విలపించుచుండగ ముని మనస్సు బాధపడెను-అపుడామె బ్రహ్మను హరిని తన గురువు ఇష్టదేవుడు నగు శంభుని జన్మమిచ్చిన కశ్యపమునిని తనకు గల్గిన యాపదలో స్మరించెను. అచట వెంటనే శ్రీకృష్ణుడు శివుడు బ్రహ్మ కశ్యపుడును మనస చేత స్మరింపబడి యేతెంచిరి. మునియును తన యిష్టదైవము ప్రకృతికిపరుడు నిర్గుణుడగు దేవుని దర్శించెను. ముని పరమభక్తితో మాటిమాటికి శివునకు బ్రహ్మకు కశ్యపునకు నమస్కరించి దేవతలారా ! మీరేమి పనిమీద వచ్చితిరని వారినడిగెను. బ్రహ్మ శ్రీహరి పదపద్మములకు నమస్కరించి మునితో సమయోచితముగ నిట్లనెను ధర్మిష్ఠ-ధర్మపత్ని యగు మనసను వదలిపెట్టుటే నీమతమైనచో నీ స్వధర్మపాలనకు నీమెయందు పుత్రోత్పత్తి గల్గించుము ఈమెకు పుత్ర సంతానము గల్గిన మీదట నీ వీమెను వదలుము. పుత్రోత్పత్తి గల్గించక తన సతిని వదలిపెట్టు విరాగి చేసిన పుణ్యమంతయును జల్లెడలోని నీరువలె నిలువకుండును. అను బ్రహ్మ వాక్కులు విని జరత్కారు మునీశ్వరుడు వెంటనే మంత్రపూర్వకముగ మనసనాభి స్పృశించి ఆమెతో నిట్లనెను: మనసా! నీకు గర్బము నిలుచును ఈ గర్బమువలన నీకు సుపుత్రుడు దయింపగలడు.

జితేంద్రియాణాం ప్రవరో ధార్మికో బ్రాహ్మణాగ్రణీః | తేజస్వీ చ తపస్వీచ యశస్వీ చ గుణాన్వితః 61

వరో వేదవిదాం చైవ జ్ఞానినాం యోగినాం తథా | శతపుత్రో విష్ణుభక్తో ధార్మికః కులముద్ధరేత్‌. 62

నృత్యంతి పితరః సర్వే జన్మమాత్రేణవై ముదా | పతివ్రతా సుశీలా యా సా ప్రియప్రియవాదినీ. 63

ధర్మిష్ఠా పుత్రమాతా చ కులస్త్రీ కులపాలికా | హరిభక్తి ప్రదోబంధు ర్నచాభీష్ట సుఖప్రదః 64

యోబంధు శ్చేత్స చ పితాహరివర్త్మ ప్రదర్శకః | సా గర్భధారిణీ యాచ గర్బాస వియోచనీ. దయారూపా చ భగినీ యమభీతి విమోచనీ | విష్ణు మంత్ర ప్రదాతా చ స గురుర్విష్ణు భక్తిదః 66

గురు శ్చ జ్ఞానదోయో హియత్‌జ్ఞానం కృష్ణభావనమ్‌ | ఆ బ్రహ్మ స్తంబపర్యంతం యతో విశ్వం చరాచరమ్‌. 67

ఆవిర్బూతం తిరోభూతం కింవా జ్ఞానం తదన్యతః | వేదజం యజ్ఞజం యద్యత్తత్సారం హరిసేవనమ్‌. 68

తత్త్వానాం సారభూతం చ హరేరన్య ద్విడంబనమ్‌ | దత్తం జ్ఞానం మయాతుభ్యం సస్యామీ జ్ఞానదోహియః 69

జ్ఞానాత్ప్ర ముచ్యతే బంధాత్సరిపుర్యోహి బంధదః | విష్ణుభక్తి యుతం జ్ఞానం నోదదాతి హియో గురుః 70

స రిపుః శిష్యఘాతీ చ యతోబంధాన్న మోచయేత్‌ | జననీం గర్బజక్లేశాద్యమయాతనయా తథా. 71

నమోచయేద్యః సకథం గురుస్తాతో హిబాంధవః |పరమానంద రూపం చ కృష్ణ మార్గమనశ్వరమ్‌. 72

అతడు ధార్మికుడు-బ్రాహ్మణవర్యుడు-జిదేంద్రియులలో శ్రేష్ఠుడు-తేజస్వి- తపస్వి-యశస్తి- గుణవంతుడు. వేదవాడులలో జ్ఞానులలో యోగులలోశ్రేష్ఠుడు-విష్ణుభక్తుడు- నూర్గురు కొడుకులు గలాడు-వంశోద్ధారకుడు గాగలడు. ఇట్టి పుత్రుడు జన్మించగనే సంతోషముతో పితరు లెగిరి గంతులు వేతురు. ఇక ప్రియునితో ప్రియములాడు యువతి పతివ్రత సుశీల ధర్మిష్ఠ-కులపాలిక-కులస్త్రీ సుపుత్రమాత యగును. హరిభక్తి గల్గించు బంధువే బంధువుగాని కోరిన సుఖము లిచ్చువాడు బంధువుగాడు. శ్రీహరి మార్గము జూపు బంధువే నిజముగ తండ్రివంటివాడు. గర్బవాస దుఃఖము బాపు తల్లియే నిజముగ తల్లి. యమభయము బాపు దయామూర్తియే నిక్కమైన సోదరి. విష్ణుభక్తి గల్గించు విష్ణుమంత్ర ముపదేశించు గురుడే నిజముగ గురువు. కృష్ణభావనగల జ్ఞానము దెల్పు గురుడే జ్ఞాన ప్రదుడు. బ్రహ్మనుండి గడ్డిపోచవఱకు గల చరాచరజగము దేనివలన పుట్టునో గిట్టునో దాని నెఱుగుట కన్న వేరైన జ్ఞానమింకొకటి లేదు. వేదయజ్ఞముల సారముహరిసేవనమే. ఇదే తత్వముల సారాంశము. హరికాక మిగిలిన దంతయును వట్టి బూటకమే. ఇట్లు నీకు జ్ఞానమార్గము తెల్పితివి. వెల్గు దారి చూపించువాడే నిజమైన స్వామి. జ్ఞానమున బంధములు వాయును. బంధముల గల్గించువాడు శత్రుడే. గర్బక్లేశముల యమయాతనలనుండి విడిపించనివాడు అత డెట్లు గురువు గాగలడు? ఎట్లు బంధువు గాగలడు? సచచిదానంద స్వరూపము శాశ్వతమునైనది శ్రీకృష్ణ మార్గము.

నదర్శయే ద్యః సతతం కీదృశోబంధవోనృణామ్‌ | భజసాధ్వి పరం బ్రహ్మాచ్యుతం కృష్ణం చ నిర్గుణమ్‌. 73

నిర్మూలం చ భేవత్పుంసాం కర్మవైతస్య సేవయా | మయా చ్చలేనత్వం త్యక్తా క్షమసై#్వ తన్మమ ప్రియే. 74

క్షమాయుతానాంసాధ్వీనాం సత్త్వాత్క్రోధేన విద్యతే | పుష్కరే తపసేయామిగచ్చ దేవి యథా సుఖమ్‌. 75

శ్రీకృష్ణ చరణాంభోజే నిస్పృహాణాం మనోరథాః | జరత్కారుపచః శ్రుత్వా మనసాశోకకాతరా. 76

సాశ్రునేత్రా చ వినయా దువాచపాణవల్లభమ్‌ | మనసోవాచః దోషోనాస్త్యేపమే త్యక్తుం నిద్రాభంగేన తే ప్రభో. 77

యత్ర స్మరామిత్వాం నిత్యంతత్రత్య మాగమిష్యసి| బంధుబేదః క్లేశతమః పుత్రబేధస్తతః పరమ్‌. 78

ప్రాణశ##భేదః ప్రాణానాం విచ్చేదాత్సర్వతః పరః | పతిః పతివ్రతానాం తుశతపుత్రాధికం ప్రియః 79

సర్వస్మాత్తు ప్రియః స్త్రీణాం ప్రియస్తేనోచ్యతే బుధైః | పుత్రే యథైకపుత్రాణాం వైష్ణవానాం యథా హరౌ. 80

నేత్రే యథైకనే త్రాణాం తృషితానాం యథాజలే | క్షుధితానాం యథాన్నే చ కాముకానాంచమైథునే. 81

యథా సరస్వేచౌరాణాం యథాజారేకుయోషితామ్‌ | విదుషాం చ యథా శాస్త్రే వాణిజ్యేవణిజాంయథా. 82

తథాశశ్వన్మనః కాంతే సాధ్వీనాం యోషితాం ప్రభో| ఇత్యుక్త్వా మనసా దేవీ పపాత స్వామినః పదే. 83

క్షణం చకారక్రోడేతాం కృపయా చ కృపానిధిః | నేత్రోదకేన మనసాం స్నపయామాసతాంమునిః 84

దానిని చూపనివాడు నరుల కెట్లు బంధువు గాగలడు? కనుక నిర్గుణుడు-పరబ్రహ్మము- అచ్యుతుడునైన శ్రీకృష్ణ పరమాత్ముని మనసార సేవింపుము. కృష్ణసేవవలన నరుల కర్మబంధము లెల్ల తొలగును. కపటమున నేను నిన్ను విడనాడితిని. ప్రియురాలా! నన్ను క్షమింపుము. క్షమగల కులసతులలో సత్త్వగుణము వెలుగుచుండుట వలన వారిలో కోపము మచ్చునకు కూడా ఉండదు. నే నిపుడు పుష్కరితీర్థమున తపమునకేగుచున్నాను. నీ నచ్చినచోటికి నీ వేగుము. నిష్కాముల కోర్కెలన్నియును. శ్రీకృష్ణుని చరణకమలములందే తగిలియుండును. అను జరత్కారు ముని వాక్కులు విని జరత్కరారు శోకకాతరయయ్యెను. ఆమెకంటికి మంటికి నేకధారగ సవినయముగ తన ప్రాణవల్లభునితో నిట్లు పలికెను. ప్రభూ! నిద్రాభంగమువలన నన్ను వదలుటలో నీ తప్పేమియును లేదు. కాని నిన్ను నే నెపుడు స్మరింతునో యపుడు తప్పక రావలయును. బంధువలుబాయుట కష్టము. పుత్రుశల బాయు టంతకన్న కష్టము. ఇక ప్రాణపతితోడి యెడబాటు ప్రాణములుపోవుట కన్న కష్టము. పతివ్రతకు నూర్గురు కొడుకుల కన్న తన ప్రియుడే గొప్పవాడు. అందఱ కన్న స్త్రీలకు పతియే మిక్కిలి ప్రియుడగుట వలన నతనిని ప్రియుడందురు. ఒకే యొకపుత్రుడుగల తల్లి కా పుత్త్రునందును వైష్ణవులకు శ్రీహరిసేవ యందును ఒంటి కంటి వానికి తన కటింయందును దప్పిగొన్న వానికి నీటియందును ఆకటనకనకలాడు వాని కన్నముపైని కాముకున కెంతకును తనివితీరని ప్రియతోడు పొందిక యందును దొంగలకు పరధనములందును కులటపై యాటలందును పండితులకు నానా శాస్త్రార్థములందును వైశ్యులకు వ్యాపారమందును ఎట్లు మనస్సు తగుల్కొని యుండునో యట్ల పతి మనసు తన పతియందే తగుల్కొని పాయకుండును అని మనస తన పతి పదకమలములపై తలవంచి మ్రొక్కెను. అపుడు మునివరుడు తన ప్రియను జాలితో నొక్క క్షణము గుండెకు హత్తుకొని తన కన్నీట నామెకు ప్రేమాభిషేకము గల్గించెను.

పాశ్రు నేత్రా మునేః క్రోడం సిషే వే భేదకాతరా | తదాజ్ఞానేన తౌద్వౌ చ విశోకౌ సంబభూవతుః 85

స్మారం స్మారం పదాంభోజం కృష్ణస్య పరమాత్మనః |జగామ తపసే విప్రః స్వకాంతాం సంప్రబోధ్య చ. 86

జగామ మనసా శంభోః కైలాసం మందిరంగులోః | పార్వతీ బోధయామాస మనసాం శోకకర్శితామ్‌. 87

శవశ్చాతీవ జ్ఞనేన శివేన చ శివాలయః | సుప్రశ##స్తే దినే సాధ్వీ సుషువే మంగళ క్షణ. 88

నారాయణాంశం పుత్రం తం యోగింనాం జ్ఞానినాం గురుమ్‌ | గర్బస్థితో మహాజ్ఞానం శ్రుత్వా శంకరవక్త్రతః 89

సంబభూవ చ యోగీంద్రో యోగినాం జ్ఞానినాంగురుః | జాతకం కారయామాస వాచయామాస మంగళమ్‌. 90

వేదాం శ్చ పాఠయామాస శివాయచశివః శిశోః | మణిరత్న కిరీటాం శ్చ బ్రాహ్మణభ్యోదదౌ శివః 91

పార్వతీ చ గవాం లక్షం రత్నాని వివిధాని చ | శంభు శ్చ చతురో వేదా న్వేదాంగా నితరాంస్తథా. 92

బాలకం పాఠయామాస జ్ఞానం మృత్యుంజయః పరమ్‌ | భక్తి రస్త్యధికా కాంతేభీష్ట దేవే గురౌ తథా. 93

యస్యా స్తేన చ తత్పుత్రో బభూవాస్తీక ఏవ చ | జగామ తపసే విష్ణోః పుష్కరం శంకరాజ్ఞయా. 94

సంప్రాప్య చ మహామంత్రం తత శ్చ పరమాత్మనః | దివ్యం వర్షత్రిలక్షం చ తపస్తప్త్వా తపోధనః 95

అజగామ మహాయోగీ నమస్కర్తుం శవం ప్రభుమ్‌ | శంకరం చ నమస్కృత్య స్థిత్వాతత్రైవ బాలకః 96

మనసయును తన ప్రియునెడత నెడబాటు కన్నీట తడిపెను. కొంతవడికి వారిర్వురును తెలివి తెచ్చుకొని శోకము బాసిరి. ఆ తర్వాత ముని శ్రీకృష్ణ పరమాత్ముని చరణ కమలములు తన మనస్సులో తలంచి తలంచి తన ప్రియ నూరడించి తపములకేగెను. మనసయును తన గురువగు శంభుని కైలాసగిరి కరిగెను. శోకకాతరయగు మనస నచట పార్వతీదేవి యోదార్చెను. శివుడామెకు జ్ఞానోదయము గల్గించెను. శివాలయమున నున్న సాధుశీలయగు మనస యొకశుభదినమున శుభ ముహూర్తమున యోగులకును జ్ఞానులకును గురువు నారాయణాంశజుడు గర్బమందే శివజ్ఞానము బొందినావాడునగు పుత్రుని గనెను. అతడు యోగులకు జ్ఞానులకు గురువు యోగీంద్రుడు నయ్యెను. అతనికి పుణ్యాహవాచనము జాతకర్మ జరిపించిరి. శివుడు బాలుని మేలు గోరి యతనిచే వేదము చదివించెను. బ్రాహ్మణుల కన్న సంతర్పణము మణిరత్న కిరీటదానములు చేసిరి. పార్వతి లక్ష గోవులను రత్నములను విప్రులకుదానము నొసగెను. శివుడు నాల్గు వేదములును వేదాంగములును జ్ఞాన పూర్వకమైన మృత్యుంజయ మంత్రమును బాలుని కొసంగెను. అత్తఱి మనసకు తన యిష్టదైవమై గురువైనశివునం దమితముగ భక్తి విశ్వాసములు గల్గెను. తన తండ్రి అమనసకు తనపతి యందు ఇష్ట దేవతా గురులందు భక్తి కలదు (ఆస్తి) కావున నా బాలున కాస్తీకుడను పేరు పెట్టిరి. ఆస్తీకుడును శంకరు ననుమతిగొని విష్ణుని గూర్చి తపముచేయ పుష్కరమునకేగెను. అట విష్ణు మహాంత్రము నా తపోధనుడు మూడు లక్షల దివ్య వర్షములు జపించెను. పిదప నా మహాయోగి శివ సన్నిధి కేగి శివునకు ప్రణమిల్లి నిలుచుండెను.

సాచా77జగామ మనసా కశ్యపస్యా77శ్రమం పితుః | తాం సపుత్రాం దృష్ట్యాముదం ప్రాపప్రజాపతిః. 97

శతలక్షంచ రత్నానాం బ్రాహ్మణభ్యో దదౌ మునే |

బ్రాహ్మణా న్బోజయామాస సో7సంఖ్యాన్‌ శ్రేయసేశిశోః. 98

అదితి శ్చ దితిశ్చాన్యాముదం ప్రాప పరంతప | సానపుత్రా చ సుచిరం తస్థౌతాతాలయే సదా. 99

తదీయం పునరాఖ్యానం వక్షామితన్నశామయ | అథాభిమన్యుతనయే బ్రహ్మశాపః పరీక్షితే. 100

బభూవ సహసా బ్రహ్మాన్‌ దేవదోషేణ కర్మణా | సప్తాహే సమతీతేతు తక్షకస్త్వాం చ ధక్ష్యతి. 101

శశాపశృంగీ తత్త్రెవ కౌశిక్యా శ్చ జలేనవై | రాజా శ్రుత్వా తత్ప్ర వృత్తింనిర్వాత స్థానమాగత ః 102

తత్ర తస్థౌ చ సప్తాహం దేహరక్షణ తత్పరః | సప్తాహే సమతీతేతు గచ్చంతం తక్షకః పథి. 103

ధన్వం తరి ర్నృపం భోక్తుం దదర్శగాముకః పథి | తయోర్బబూవ సంవాదః సుప్రీతి శ్చ పరస్పరమ్‌. 104

ధన్వంతరిర్మణిం ప్రాప తక్షకః స్వేచ్చయా దదౌ | సమ¸° తంగృహీ త్వాతు సంతుష్టో హృష్టమానసః 105

తక్షకో భక్షయామాస నృపంతం మంచకే స్థితమ్‌ | రాజా జగామ తత్కాలే దేహం త్యక్త్వా పరత్ర చ. 106

సంస్కారం కారయామాస పితుర్వై జనమేజయః | రాజా చకారయజ్ఞం చ సర్వసత్రంతతోమునే. 107

ప్రాణాం స్తత్యాజ సర్వాణాం సమూహో బ్రహ్మతేజసా | స తక్షకోవై భీత స్తు మహేంద్రం శరణం య¸°. 108

తర్వాత మనస తన కుమారుని వెంటబెట్టుకొని తన తండ్రి యింటి కేగెను. కశ్యపుడు తన కూతును మనుమనిచూచి ప్రమెదభరితుడయ్యెను. అతడు తన మనుమని మేలుగోరి పెక్కురు బ్రాహ్మణులకు సంతుష్టిగ భోజనములు పెట్టి నూరు లక్షల రత్నములు దానము చెసెను. ఆ బాలుని చూచి దితి - అదితి సంతోష మొందిరి. ఆస్తీకడంత తన తాత యింటనే నివసింపిసాగెను. ఇపుడాస్తీకుడని చరిత్ర మహత్వము తెల్పుచున్నాను వినుము. పూర్వమభిమన్యుని కుమారుడగు పరీక్షిత్తు బ్రాహ్మణుని చేత శపింపబడెను. అది దైవదోషము వలన జరిగెను. ఒక వారము గడిచినంతనే తక్షకుడు నిన్ను కాటు వేయును. అని శృంగిముని తనతేచ జలముగొని పరీక్షిత్తును శపించెను. శాపము విని రాజు గాలి చోరనిచోట ప్రాణనులు దక్కించుకొన యత్నంచెను. అతడు వారము వఱకెటులో తన ప్రాణరక్షణచేసి కొనుచుండెను. చివరకు తక్షకుడతని కాటు వేయుటకు తరలెను. ధన్వంతరి రాజును బ్రతికించి ధనము బడయ గోరి తరలెను. త్రోవలో తక్షక ధన్వంతరులు కలిసికొని యిర్వురు నింపుమీర సంభాషించుకొనిరి. అపుడు తక్షకుడు ప్రియముతో ధన్వంతరి కొక మణి నొసంగెను. అదిగొని యతడు సంతోషించి వచ్చినదారి పట్టెను. మంచముపై పరున్న రాజును తక్షకుడు కాటువేసెను. అక్కడికక్కడనే పరీక్షిత్తు ప్రాణములు వదలెను. జనమేజయుడు తన తండ్రికి పరలోక సంస్కారములు జరిపెను. పిమ్మటనతడు సర్పయాగము చేయ సంకల్పించెను. బ్రాహ్మణుల మంత్ర ప్రభావమున సర్పములు యజ్ఞమున బడి చనిపోవసాగెను. అపుడు తక్షకుడు భయముతో నింద్రుని శరణు చొచ్చెను.

సేంద్రంచ తక్షకం హంతుం విప్రవర్గః సముద్యతః|

అథదేవా శ్చ సేంద్రా శ్చ సంజ గ్ముర్మ నసాంతికమ్‌. 109

తాంతుష్టావ మహేంద్ర శ్చ భయకాతర విహ్వలః | తత ఆస్తీక ఆగత్య యజ్ఞం చ మాతు రాజ్ఞయా. 110

మహేంద్ర తక్షక ప్రాణా న్యయాచే భూమింప పరమ్‌ | దదౌ వరం నృప శ్రేష్ఠః కృపయా బ్రాహ్మణాజ్ఞయా. 111

యజ్ఞం సమాప్య విప్రేభ్యో దక్షిణాంచ దదౌ ముదా | విప్రా శ్చ మునయోదేవా గత్వా చ మనసాంతికమ్‌. 112

మనసాం పూజయామాసు స్తుష్టువు శ్చ పృథక్‌ పృథక్‌ | శక్రః సంభృత సంభారో భక్తి యుక్తః సదాశుచిః 113

మనసాం పూజయామాస తుష్టావ పదమా దరః | నత్వాషోడశోపచారం బలించ తత్ర్పియంతదా. 114

ప్రదదౌ పరితుష్ట శ్చ బ్రహ్మ విష్ణు శివాజ్ఞయా | సంపూజ్య మనసాం దేవీం ప్రయుయుః స్వాలయంచతే. 115

ఇత్యేవం కథితం సర్వకింభూయ ః శ్రోతు మిచ్చసి|

నారద ఉవాచ : కేన స్తోత్రేణ తుష్టావ మహేంద్రో మనసాంసతీమ్‌. 116

పూజావిధి క్రమంతస్యాః శ్రోతుమిచ్చామి తత్త్వతః |

నారాయణ ఉవాచ : సుస్నాతః శుచిరాచాంతో ధృత్వాధౌతే చ వాససీ. 117

రత్న సింహాసనే దేవీం వాసయా మాస భక్తితః | స్వర్గంగాయా జలేనైవ రత్నకుంభస్థితేన చ. 118

స్నాపయా మాస మనసాం మహేంద్రో వేదమంత్రతః | వాససీ వాసయా మాస వహ్నిశుధ్దే మనోహరే. 119

సర్వాంగే చందనం కృత్యా పాదార్ఘ్యం భక్తి సంయుతః | గణశం చ దినేశ ం చ వహ్నిం విష్ణు శివం శివామ్‌. 120

బ్రాహ్మణులు సహేంద్ర తక్షకుని చంప తలచిరి. ఇంద్రాది దేవతలపుడు మనసా దేవిసన్నిధి కరిగిరి. భయవ్యాకుల చిత్తుడైన యింద్రుడు మనసను సంతుష్టురాలిని చేసెను. అపుడాస్తీకుడు తన తల్లి యనుమతితో యజ్ఞశాలకేగెను. ఇంద్ర తక్షకుల ప్రాణములుగా పాడుడని యాస్తీకుడు రాజులు కోరెను. రాజును బ్రాహ్మణుల యనుమతితో వారిని గాపాడెను. అట్లు సర్పయాగము పూర్ణము గావించి రాజు విప్రులకు భూరి దక్షిణ లొసంగెను. అపుడు మునులు దేవతలు విప్రులును మనసాదేవి సన్నిధి కగిగిరి. వారిలో ప్రతి యొక్కరును మనసను గొలిచిరి. సంతుష్టురాలిని చేసిరి. ఇంద్రుడు సైతము పూజా ద్రవ్యములు దెచ్చి నిర్మల పవిత్ర భక్తితో మనసా దేవిని పూజించెను. ప్రసన్నురాలిని చేసెను. ఆమెను షోడశోపచారములతో బూజించి యామెకు బలి యొసెగెను. ఈ పూజడాదిలన్నియు బ్రహ్మవిష్ణు మహేశుల యనుమతితో నింద్రుడు జరిపెను. ఇట్లు వారు మనసను పూజించి తమ నెలవులకేగిరి. ఇట్లంతయును నీకు దెల్పితిని - ఇంకేమి విననలతువోతెల్పుము. నారదుడిట్లనెను : ఇంద్రుడు మనసాదేవినే స్తోత్రముతో సంస్తుతించెను. మనస పాజా విధానమును విన దలుచుచున్నాను. నారాయణుడిట్లనెను. : నరుడు స్నానము చేసి పవిత్రుడై తెల్లని దువ్వలువలు దాల్చి యాచమనముచేయ వలయును. ఇంద్రుడు రతనాల గిద్దియపై మనసా దేవిని గూర్చుండ బెట్టెను. అతడు కడు భక్తితో రత్న సువర్ణ కలశములతో దేవ గంగనుగొని తెచ్చెను. ఇంద్రుడు వేదమంత్రములతో మనస నభిషేకించెను-అగ్ని పూతములైన పట్టుపుట్టము లామెకు కట్టబెట్టెను. దేవ గంగలో చందనము గలిపి పరమభక్తితో నతడు మనస కర్ఘ్య పాద్యము లొసంగెను. గణపతి సూర్యుడు అగ్ని విష్టువు శివుడు పార్వతి-

సంపూజ్యా77దౌ దేవషట్కం పూజయా మాస తాంసతీమ్‌|

ఓంహ్రీం శ్రీంమనసా దేవ్యైస్వా హేత్యేవం చ మంత్రతః 121

దశాక్షరేణమూలేన దదౌ సర్వం యథోచితమ్‌ | దత్వాషోడశోపచారా న్దుర్లభాన్దేవ నాయకః 122

పూజయా మాస భక్త్యాచ విష్ణునా ప్రేరితోముదా | వాద్యం నానా ప్రకారం చ వాదయా మాస తత్రవై. 123

బభూవ పుష్పవృష్టిశ్చ నభసో మన సోపరి | దేవప్రియాజ్ఞయా తత్ర బ్రహ్మవిష్టు శివాజ్ఞయా. 124

తుష్టావ సాశ్రునేత్రశ్చ పులకాంకిత విగ్రహః |

పురందర ఉవాచ : దేవి త్వాం స్తోతుమిచ్చామి సాధ్వీనాం ప్రవరాం వరామ్‌. 125

పరాత్పరాం చ పరమాం న హిస్తోతుం క్షమో2ధునా | స్తోత్రాణాం లక్షణంవేదే స్వభావాఖ్యాన తత్పరమ్‌. 126

న క్షమః ప్రకృతే వక్తుం గుణానాం గణనాం తవ | శుద్ధ సత్త్వ స్వరూపాత్వం కోపహిం సా వివర్జితా. 127

న చ శక్తో మునిస్తేన త్యక్తుం యాచ్ఞా కృతాయతః | త్వం మయా పూజితా సాధ్వీజననీ మే యథా7దితిః 128

దయారూపా చ భగినీ క్షమారూపా యథా ప్రసూః | త్వయామే రక్షితాః ప్రాణాః పుత్రదారాః సురేశ్వరి. 129

అహంకరోమి తత్పూజాం ప్రీతిశ్చ వర్ధతాం సదా | నిత్యా యద్యపి పూజ్యాత్వం సర్వత్ర జగదంబికే. 130

తథా7పి తవ పూజాం చ వర్ధయామి సురేశ్వరి | యే త్వా మాషాడ సంక్రాం త్యాం పూజయిష్యంతి భక్తితః 131

పంచమ్యాం మనసాఖ్యా యాంమాసాంతే నా దినే దినే | పుత్రపౌ త్రాయస్తేషాం వర్దంతే చ ధనానివై. 132

అను నార్గురు దేవతకలను మొదట నింద్రుడు పూజించి పిదప ఓం హ్రీం శ్రీం మనసాదేవ్యై స్వాహా అను ఈ దశాక్షర మూల మంత్రములో నింద్రుడు మనసను షోడశోపచారములతో పూజించెను. ఇంద్రుడిటుల విష్ణుప్రేరణచేనతి భక్తితో మనస నారాధించెను. పెక్కు రీతుల వాద్యములు మ్రోయించెను. అపుడు మనసపై దివినుండి విరిజల్లులు కురిసెను.ఇటుల బ్రహ్మ-విష్ణుశివుల దేవవిప్రుల యాజ్ఞతో మనసను పూజించి యింద్రుడు తన మేనెల్లపులకరింప కన్నుల నానంద బాష్పములు గ్రమ్మ నిట్లనియెను. దేవీ! సతులతో శ్రేష్ఠురాలవగు నిన్ను స్తుతింపదలచుచున్నాను. పరాత్పరవు - పరమవు నగు నిన్నెవడు నుతింపగలడు! వేదములందు నీ స్తోత్రముల లక్షణము-స్వభావము-చరిత్రులు పెక్కుగలవు. దేవి! నీ ప్రకృతి సహజమైన గుణగణములు లెక్కించగలవాడులేడు. నీవు శుద్ధ సత్వస్వరూపిణివి క్రోధలోభహింసలు లేని తల్లివి - మునివరుడు నిన్ను వదలి వెళ్ళలేక నీ యనుమతితో వెళ్ళిపోయెను. సాధ్వీమతల్లీ! యదితి వంటిదానవు. నా తల్లివి. నిన్ను చక్కగ పూజించితిని. నీవు దయకు - క్షమకు ప్రతిరూపవు - నా భగినివి. సురేశ్వరీ! నీ వలననే నేను నా భార్య బిడ్డలు రక్షింపబడిరి. జగదంబా! నీవు నిత్య పూజ్యవు - సర్వపూజ్యవు. ఇకమీద నీ పూజలందు నాకు ప్రీతి పెంపొందు గాక! సురేశ్వరి! నీ పూజలను ప్రచారము చేతును. పరభక్తితో ఆషాడ సంక్రాంతినాడు కాని మనసా పంచమినాడు గాని మాసము చివరగాని నిన్ను పూజించువారు పుత్రపౌత్రులు ధనధాన్యములు గల్గి వర్ధిల్లుదురు.

యశస్వినః కీర్తమంతో విద్యావంతో గుణా న్వితాః | యేత్వాంన పూజయిష్యంతి నిందంత్య జ్ఞానతో జనాః 133

లక్ష్మీహీనా భవిష్యంతి తేషాంనాగభయం సదా | త్వం స్వయ సర్వలక్ష్మీ శ్చ వైకుంఠే కమలాలయా. 134

నారాయణాంశో భగవాన్‌ జరత్కారు ర్మునీశ్వరః | తపసా తేజసా త్వాం చ మనసా ససృజే పితా. 135

అస్మాకం రక్షణాయైవ తేన త్వం మనసాభిధా | మనసా దేవి శక్త్యా త్వం స్వాత్మనా సిద్ధయోగినీ. 136

తేన త్వం మనసా దేవీ పూజితా వందితా భవ | యే భక్త్యా మనసాం దేవాః పూజయం త్య నిశంభృశమ్‌. 137

తేన త్వాం మనసా దేవీం ప్రవదంతి మనీషిణః| సత్యస్వరూపాదేవీ త్వం శశ్వత్స త్య నిషేవణాత్‌. 138

యోహి త్వాం భావయేన్నిత్యం సత్యాం ప్రాప్నోతి తత్పరః |

ఇంద్రశ్చ మనసాం స్తుత్వా గృహీత్వా భగినీవరమ్‌. 139

ప్రజగామ స్వ భవనం భూషయా సపరిచ్చదమ్‌| పుత్రేణసార్ధం సాదేవీ చిరంతస్థౌ పితుర్గృహే. 140

భాత్రృభిః పూడితా శశ్వతా శశ్వ న్మాన్యా వంద్యా చ సర్వతః|

గోలోకాత్సురభి ర్బృహ్మాన్‌ తత్రా గత్య సుపూజితామ్‌. 141

తాంస్నాపయి త్వాక్షీరేణ పూజయా మాస సాదరమ్‌ | జ్ఞానం చ కథయామాస గోప్యం సర్వం సుదుర్లభమ్‌. 142

తథాదేవైః పూజితా సా స్వర్లోకం చ పునర్య¸° | ఇంద్ర స్తోత్రం పుణ్యబీజం మనసాం పూజయే త్పఠేత్‌. 143

తస్య నాగభయం నాస్తి తస్య వంశో ద్బవస్య చ | విషం భ##వే త్సుధాతుల్య సిద్దస్తోత్రోయ దాభ##వేత్‌. 144

పంచలక్ష జపేనైవ సిద్దస్తోత్రో భ##వేన్నరః | సర్పశాయీ భ##వేత్సో2పి నిశ్చితం సర్పవాహనంః 145

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ నవమస్కంధే7ష్ట చత్వారింశోధ్యాయః.

వారి పుత్రులు కీర్తి-విద్యా-గుణవంతు లగుదురు. అజ్ఞానముతో నిన్ను నిందించి పూజింపనివారు దరిద్రులగుదురు. వారికి నాగభయము గల్గును. ఓహో దేవీ! నీవు లక్ష్మీస్వరూపిణివి. వైకుంఠ పురమందలి లక్ష్మీదేవివి నీవే. నీ పతి జరత్కారుముని కేవలము నారాయణాంశజుడే నీ తండ్రి నిన్ను తన తపముచో తేజముచే తన మనస్సునుండి సృజించెను. నీ తండ్రి మారక్షణకే నిన్నట్లు సృజించెను. కాన నీవు మనసాదేవివైతివి. నీవు సిద్దమోగినివమ్మా! మనస్సు వలననే యెల్ల కార్యములు నిర్వర్తింపజాలిన దివ్య శక్తివమ్మా! అందువలన నీవు మనసాదేవి వైతివి- పూజితవు-వందితవునైతివి. దేవతలు నిశ్చలభక్తితో నిన్ను నిత్యము పూజింతురు. అందువలన నీవు మనసాదేవి వైతివి తల్లీ! నిత్యము సత్యమే పల్కుటవలన నిన్ను మనీషులు సత్వస్వరూపిణినిగ భావింతురు. ఏవాడు నిత్తెము నిన్నే స్వరించునో భావించునో యతడు తప్పక నిన్నేచేరును. అని యింద్రుడు మనసాదేవిని సన్నుతించి యామెనుండి వరము బడసెను. తర్వాత నింద్రుడు తన కుటుంబముతో సొమ్ములతో స్వర్గసీమ కేగెను. మనసాదేవి తన కుమారునితోడ తన తండ్రి యింట చిరకాలము నివసించెను. మనసాదేవి నిత్యము వందనీయ-పూజనీయ మయ్యెను. నారదా! గోలోకమునుండి సురభి మనస చెంతకు వచ్చెను. సురభి మనసు క్షీరాభిషేకము చేసెను. గౌరసముతో పూజించెను. దుర్లభము రహస్యమునైన జ్ఞాన ముపదేశించెను. ఆ పిదప సురభి సురపూజితయై మరల స్వర్గమేగెను. ఇంద్రుడు చేసిన ఈ పుణ్య బీజమైన స్తోత్రముతో మనసను పూజించవలయమును. అట్టివానికిగాని వాని వంశమునకు గాని యేనాటికిని సర్పభయము గల్గదు. ఈ స్తోత్రము సిద్ధి చెందిన వానికి విషయమృతమగును. ఈ స్తోత్రము నైదులక్షలు జపించినచో సిద్ధిచెందును. అతడు పన్నగశయనుడు నాగవాహనుడుగాగలడు.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి నవమ స్కంధమున నలువదెనిమిదవ యుధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters