Sri Devi Bagavatham-2    Chapters   

అథ తృతీయో7ధ్యాయః.

సూత ఉవాచః ఏవం సముపదిశ్యాయం దేవర్షిః పరమః స్వరాట్‌ | జగామ బ్రహ్మణో లోకం సై#్వరచారీ మహామునిః. 1

గతే మునివరే వింధ్య శ్చింతాం లే7 భే నపాయినీమ్‌ | నైవ శాంతిం స లేభే చ స దాంతః కృతశోచనః. 2

కథం కిం త్వత్ర మే కార్యం కథం మేరుం జయామ్యహమ్‌ |

నైవ శాంతిం లభే7నా పి స్వాస్థ్యం మే మానసే7భవత్‌. 3

ధిగ్బలం మే పౌరుషం ధిక్‌ స్మృతం పూర్వై ర్మహాత్మభిః | ఏవం చింతయమానస్య వింధ్యస్య మనసి స్పుటమ్‌. 4

ప్రాదుర్బాతా మతిః కార్యే కర్తవా%్‌య దోషకారిణీ | మేరు ప్రదక్షిణాం కుర్వన్నినత్య మేవ దివాకరః. 5

సగ్రహర్ష గణోపేతః సదా దృప్యత్యయం నగః | తస్య మార్గస్య సంరోధం కరిస్యామి నిజైః కరైః. 6

తదా నారుద్దో ద్యుమణిః పరిక్రామేత్కథంనగమ్‌ | ఏవం మార్గే నిరుద్ధేతు మయా దినకరస్య చ. 7

భగ్నదర్పో దివ్యనగో భవిష్యతి వినిశ్చితమ్‌ | ఏవం నిశ్చిత్య వింధ్యాద్రిః ఖంస్పృశ న్వవృధే భుజైః. 8

మహోన్నతైః శృంగవరైః సర్వం వ్యాప్య వ్యవస్థితః |

కదోదేష్యతి భాస్వాం స్తం రోధయిష్యా మ్యహం కదా. 9

ఏవం సంచింత యానస్య సా వ్యతీయాయ శర్వరీ | ప్రభాతం వివలం జజ్ఞే దిశో వితిమిరాః కరైః. 10

కుర్వన్స నిర్గతో భాను రుదయాయోదయే గిరౌ | ప్రకాశ##తే స్మ విమలం నభో భానుకరైః శుభః. 11

వికాసం నళినీం భేజే మబీలనం చ కుముద్వతీ | స్వాని కార్యణి సర్వే చలోకాః సముపతస్థిరే. 12

హవ్యం కవ్యం భూతబలిం దేవానాం చ ప్రవర్దయన్‌ | ప్రాహ్ణోపరాహ్ణ మధ్యాహ్న విభాగేన త్విషాంపతిః. 13

మూడవ అధ్యాయము

శ్రీదేవి చరితము

సూతు డిట్లనెను : ఈ ప్రకారముగ దేవముని నారదుడు వింధ్యగిరి కుపదేశించి స్వేచ్ఛగ బ్రహ్మలోకమేగెను. ముని వెళ్లిన పిదప వింధ్యగిరి తీరని విచారములో మునిగెను. తన యెదలో దుఃఖము చెలరేగుటచే వింధ్యగిరికి శాంతి లేకుండెను. ఇప్పుడ నా కర్తవ్య మేమి? మేరువును గెల్చు టెట్లు? నా మనస్సునకు శాంతిసౌఖ్యము లెట్లు గల్గును? పూర్వము మహాత్ములచే నెంతయో పొగడబడితిని. ఇపుడు నా యుత్సాహము-మానము- కులము బలము- పౌరుషము నన్నియును పనికిమాలినవే అని వింధ్యము తలపోసెను. దాని మనస్సులో నొకచెడు తలంపు రేకెతైను. ఏమనగ ప్రతిదినము సూర్యుడు మేరు ప్రదక్షిణము చేయును. సూర్యుడు గ్రహనక్షత్రములతో నుదయించును. అందులకే మేరువున కంత గర్వము. నేనిపుడు నా శిఖరములతో పెరిగి సూర్యగమనమున కడ్డుగ నిలుతును. అపుడు సూర్యుడు ముందునకు సాగలేడు. మేరువును ప్రదక్షిణింపజాలడు. ఇట్లు నేన సూర్యుని త్రోవ నడ్డగింతును. అపుడు మేరువు గర్వమంతయు దిగిపోవును. అని నిశ్చయించుకొని వింధ్యగిరి తన శిఖరములతో నింగిని తాకుచు పెరిగెను. ఎత్తైన శిఖరములతో నట్లు పెరిగి పెరిగి సూర్యడెప్పుడుదయించును? నే నెప్పు డతని నడ్డగింతును. అని తలపోయుచుండగనే రేయి గడచెను. రవి కిరణములచేత పెంజీకట్లు విడిపోయెను. దెసలు నిర్మలములై తెల్లవారెను. భాస్కరుడు తూరుపు కొండపై నుదయించుచుండెను. ఆకాశ మంతయు రవి కిరణములచే స్వచ్ఛమై వెలుగులు విరజిమ్ముచుండెను. కమలములు వికసించెను. కలువలు మొగిడెను. లోకాలు తమ తమ పనులలో ప్రవృత్తములయ్యెను. ప్రాహ్ణమున దేవతలకు హోమమును అపరాహ్ణమున పితరులకు కవ్యమును మధ్యాహ్నమున భూతబలులు నెల్లెడల జరుగుచుండెను.

ఏవం ప్రాచీం తథాగ్నే యీం సమాశ్వా స్య వియోగినీమ్‌ | జ్వలంతీం చిరకాలీన విరహా దివ కామినీమ్‌. 14

భాస్కరోథ కృశానో శ్చ దిశంనూనం విహాయ చ | యామ్యాం గంతుం తతస్తూర్ణం ప్రత్సస్థే కమలాకరః. 15

నశేకు శ్చా గ్రతో గంతుం తతోసూరుర్వ్య జిజ్ఞపత్‌ | అనురురువాచః భానోమానోన్నతో వింధ్యో నిరుధ్య గగనం స్థితః. 16

స్పర్ధతే మేరుణా ప్రేప్సు స్త్వ ద్ధత్తాం చ ప్రదక్షిణామ్‌ | సూత ఉవాచ ః అనూరువాక్య మాకర్ణ్య సవితాహ్యసావచింతయత్‌. 17

అహో గగనమార్గోపి రుధ్యతే చాతి విస్మయః | ప్రాయః శూరో న కిం కుర్వా దుత్పథే వర్త్మని స్థితః 18

నిరుద్ధో నో వాజిమార్గో దైవం హి బలవత్తరమ్‌ | రాహుబాహు గ్రహవ్య గ్రో యః క్షణం నావతిష్ఠతే. 19

స చిరం రుద్ధమార్గోపి కిం కరోతి విధిర్బలీ | ఏవం చ మార్గే సంరుద్ధే లోకాః సర్వే చ సేశ్వరాః. 20

నాన్వవిందంత శరణం కర్తవ్యం నా స్వపద్యత | చిత్ర గుప్తాదయః సర్వే కాలం జానంతి సూర్యతః 21

స రుద్ధో వింధ్యగిరిణా అహోదైవ విపర్యయః | యదా నిరుద్ధః సవితా గిరిణా స్పర్ధయా తదా. 22

నష్టః స్వాహా స్వధాకారో నష్ట ప్రాయమభూజ్జగత్‌ | ఏవం చ పశ్చిమా లోకా దాక్షిణాత్యా స్తథైవ చ. 23

నిద్రా మీలిత చక్షుష్కా నిశామేవ ప్రపేదిరే | ప్రాం చస్త థౌత్తరాహాశ్చ తీక్‌ష్ణతాపప్రతాపితాః 24

మృతా నష్టా శ్చ భగ్నా శ్చవినాశమభజన్పృజాః |

హాహాభూతం జగత్సర్వం స్వధాకార్య వివర్జితమ్‌ | దేవాః సేంద్రాః సముద్విగ్నాః కింకుర్మ ఇతి వాదినః 25

ఇతి శ్రీ దేవీ భాగవతే మహాపురాణ్‌ దశమస్కంధే దేవీ మహాత్మ్యే తృతీయోధ్యాయః

ఎంతోకాల మెడబాటుచే తపించిన కామినులను కాంతు డూరడించును. అటులే రవి తూర్ప- ఆగ్నేయ దిశల నూరడించెను. పిదప సూర్యు డాగ్నేయ దిశను విడిచి దక్షిణ దిక్కున కేగెను. అపుడు ముందునకు సాగలేక అనూరుడిట్లు పలికెను. గర్వముతో వింధ్యగిరి పైపైకి పెరుగుచున్నది. అది నీవు ప్రదక్షిణించు మేరువుతో పోటీ పడుచున్నది. సూతుడిట్లనియెను. ః అనూరుని మాటలు విని సూర్యుడు చింతాక్రాంతు డయ్యెను. ఆహా ! ఎంత వింత !గగన మార్గము సైత మడ్డగింపబడుచున్నదే ! ఉన్నత మార్గమున పయనించు శూరునకు సాధ్యముకాని దేముండును. ! నా గుఱ్ఱములు త్రోవలోనే యాగిపోయినవి. దైవబలము బలవత్తరమైనది. సూర్యుడు రాహుబాహువులకు జిక్కి వ్యాకులడై క్షణము సేపు కూడ సహింపలేనివాడు. తనకు చిరకాల మాటంకముగ త్రోవలో నున్న గిరి నెట్లు సహింపగలడు. విధి బలశాలి. ఏమి చేయునో కదా ! ఇట్లు సూర్యుని మార్గమున కడ్డంకి యేర్పడినచో ప్రజలు ఈశ్వరుడు సైతము తమ కర్తవ్యమును శరణుమును మఱచిపోదురు. చిత్రగుప్తుడు మొదలగు వారును సూర్యుని వలననే కాల మెఱుగుదురు గదా! అంతటి సూర్యుడే నేడొక వింధ్యగిరిచేత నడ్డగింపబడెనే ! ఆహా! ఏమి దైవ వైపరీత్యము ! మేరువుతోపోటీ పడిన వింధ్యము రవి నడ్డగించెను. గదా! దీనివలన స్వాహా స్వధాకారములును నష్టములయ్యెను. జగము నష్టప్రాయమైనది. పాశ్చాత్యులు దాక్షిణాత్యులును నిదురచే కన్నులు మూసికొని రాతిరికి వశులైరి. తూరుపున నుత్తరమునందున్న ప్రజలు తీవ్రమైన తాపమునకు మ్రగ్గిపోవుచున్నారు. ప్రాణిగణము భగ్నమై నష్టమై వినాశ మొందుచున్నది. ఇంద్రాది దేవతలు నేమి చేయుటకును దిక్కు దోచక విచారమున మునిగిరి.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి పదవ స్కంధమున మూడవ యధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters