Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వాదశో2ధ్యాయః

మునిరువాచ: మహిషీగర్బసంభూతో మహాబలపరా క్రమః | దేవాన్సర్వాన్పరాజిత్య మహిషో7భూజ్జగత్ప్రభుః. 1

సర్వేషాంలోకపాలానా మధికారాన్మహాసురః | బలాన్నిర్జిత్య బుభుజేత్త్రెలోక్యైశ్వర్యమద్బుతమ్‌. 2

తతః పరాజితాః సర్వే దేవాః స్వర్గపరిచ్యుతాః | బ్రహ్మణం చ పురస్కృత్య తే జగ్ముర్లోక ముత్తమమ్‌. 3

యత్రోత్తమౌ దేవదేవౌ సంస్థితౌ శంకరాచ్యుతౌ | వృత్తాంతం కథయామాసుర్మహిషస్య దురాత్మనః. 4

దేవానాంచైవ సర్వేషాం స్థానాని తరసా7సురః | వినిర్జిత్య స్వయం భుంక్తే బలవీర్య మదోద్దతః 5

మహిషాసురనామా7సౌ దిష్టదైత్యా మరేశ్వరౌ | వధోపాయ శ్చ తస్యా77శు చింత్యతా మసురర్ధనౌ. 6

ఏవం శ్రుత్వా స భగవా న్దేవానా మార్తియుగ్వచః | చకార కోపణ సుబహుం తథా శంకర పద్మజౌ. 7

ఏవం కోపయుతస్యా స్య హరేరాస్యాన్మహీపతే | తేజః ప్రాదురభూద్దివ్యం సహస్రార్కసమ ద్యుతి. 8

అథాను క్రమత స్తేజః సర్వేషాం త్రిదివౌకసామ్‌ | శరీరాదుద్బవం ప్రాప హర్షయ ద్విబుధాధిపాన్‌. 9

యదభూచ్చంభుజం తేజో ముఖమస్యోదపద్యత | కేశా బభూపూర్యామ్యేన వైష్ణవేన చ బాహవః. 10

సౌమ్యేన చ స్తనౌ జతౌ మహేంద్రేణ చ మధ్యమః | వరుణన తతో భూపం జం ఘోరూ సంబభూవతుః. 11

నితంబౌ తేజసా భూమేః పాదౌ బ్రాహ్మేణ తేజసా | పదాంగుల్యో భా నవేన వాసవేన కరాంగుళీః. 12

కౌబేరేణ తథా నాసా దంతాః సంజజ్ఞిరే తదా | ప్రాజాపత్యే నోత్తమేన తేజసా వసుధాధిప. 13

పావకేన చ సంజాతం లోచనత్రితయం శుభమ్‌ | సాధ్యేన తేజసా జాతే భృకుట్యౌ తేజసాం నిధీ. 14

కర్ణౌ వాయవ్యతో జాతౌ తేజసో మనుజాధిప | సర్వేషాం తేజసా దేవీ జాతా మహిష మర్దినీ. 15

శూలం కదదౌ శివో విష్ణు శ్చక్రం శంఖం చ పాశభృత్‌ | హుతాశనో దదౌ శక్తిం మారుత శ్చాపసాయకౌ. 16

వజ్రం మహేంద్రః ప్రదదౌ ఘంటాంచైరావతా ద్గజాత్‌ | కాలదండం యమో బ్రహ్మ చాక్షమాలా కమండలూ. 17

దివాకరో రశ్మిమాలాం రోమకూపేషు సందదౌ | కాలః కడ్గం తదా చర్మ నిర్మలం వసుధాధిప. 18

సముద్రో నిర్మలంహార మజరే చాంభ##రే నృప | చూడామణిం కుండలే చ కటకాని తథాంగదే. 19

అర్ద చంద్రం నిర్మలం చ నూపురాణి తథా దదౌ | గ్రైవేయకం భూషణం చ తసై#్య దేవ్యై ముదాన్వితః. 20

విశ్వకర్మా చోర్మికా శ్చ దదౌ తసై#్య ధరావతే | హిమవాన్వాహనం సింహం రత్నాని వివిధాని చ. 21

పానపాత్రం సురాపూర్ణం దదౌతసై#్యధనాధిపః | శేషశ్చ భగవాన్దేవో నాగహారం దదౌ విభుః 22

అన్యైరశేషవిబుధై ర్మానితా సా జగన్మయీ | తాంతుష్టువుర్మహా దేవీం దేవామహిషపీడితాః 23

నానాస్తోత్త్రెర్మహేశానీం జగదుద్బవకారిణీమ్‌ | తేషాం నిశమ్య దేవేశీ స్తోత్రంవిబుధపూడితా. 24

మహిషస్య వధార్థాయ మహానాదం చకార హ | తేన నాదేన మహిష శ్చకితో 7భూద్దరాపతే. 25

ఆససాద జగద్దాత్రీం సర్వసైన్య సమావృతః | తతః సయుయుధే దేవ్యా మహిషాఖ్యో మహాసురః. 26

శస్త్రాసై#్రర్బహుధాక్షిపైః పూరయన్నంబరాంతరమ్‌ | చిక్షురో గ్రామణీః సేనా పతిర్దుర్దర దుర్మఖౌ. 27

బాష్కలస్తామ్రకశ్చైవ బిడాలవదనో7పరః | ఏత్తెశ్చాన్యైరసంఖ్యాత్తెః సంగ్రామాంతక సన్నిఖైః 28

పండ్రైండవ అధ్యాయము

శ్రీ దేవీ చరితము - మహిషాసురమర్ధనమ

ముని యిట్లనెను : మహిషి కడుపున బుట్టి మహాబలపరాక్రమములతో నెల్ల వేల్పులను జయించి మహిషాసురుడు జగములకు పతి యయ్యెను. ఆ మహాసురుడు తన యధికార బలగర్వముతో లోకపాలకులను జయించి త్రిలోక సంపద లనుభవించెను. అపుడు దేవత లోడిపోయి స్వర్గము వదిలి బ్రహ్మను పురస్కరి యకొని యుత్తమ లొకముల కరిగిరి. వారు శివకేశవులున్న తావుల కరిగి వారితో మహిషాసురుని చెడు నడువడి గూర్చి యంతమును నిట్లు దెల్పిరి. అతడు బలవీర్య మదోద్దతుడై యెల్ల దేవతల స్దానముల వశము చోసికొని సంపదలు స్వయముగ మముభవింపసాగెను. అతని పేరు మహిషాసురుడు. దుష్టదానవుడు. రాక్షసాంతకులారా! మీ రతనిని చంపు నుపాయము త్వరితగతి నోలోచింపుడు. అను దేవతల దీనార్తిని తెలుపు మాటలు వినగనే హరిహరులకు దానమునిపై తీవ్రకోపము గలిగెను. రాజ! అటుల కోపించిన హరి ముఖమునుండి వేయి సూర్యులకాంతి వంటి దివ్యతేజ మావిర్బవించెను. అదే విధముగ మిగిలు యెల్ల దేవతల శరీరముల నుండియును వరుసగ దివ్యతేజము లుద్భవించగల సురలకు ప్రమోదము గలిగెను. రాజా! శివుని తేజమువలన ముఖము యముని తేజమున కేశపాశములు విష్ణుని తేజమున భుజములు చంద్రకాంతిచే కుచములు ఇంద్రతేజమున నడుము వరుణ తేజమున తొడలు మెకాళ్ళు భూదేవి తేజమున పిఱుదులు బ్రహ్మ తేజమున పాదములు సూర్యకాంతిచే కాలివ్రేళ్ళు ఇంద్రతేజమున చేతివ్రేళ్ళు కుబేరిని తేజమున ముక్కులు ప్రజాపతి తేజమున దంతములును అగ్వి తేజమున త్రినేత్రములు సంధ్యాశోభవలన కనుబొమలునువాయు తేజమున చెవులు నిట్లెల్ల దేవతల తేజములనుండి మహిషాసురమర్దిని దేవి యవతరించెను. అపుడు శివుడు-శూలమును విష్ణువు-చక్రమును వరుణుడు-పాశమును అగ్ని-శక్తిని వాయువు-విల్లంబులను మహేంద్రుడు- వజ్రమును ఐరావతమునుండి గంటను యముడు కాలదండమును బ్రహ్మ జపమాల-కమండలువును భాస్కరుడు-కాతిమాలను కాలుడు కత్తిడాలును సాగరుడు మైలైన హారమున వస్త్రములను చూడామణిని కటక కుండలములను చేతి కంకణములను కడియములను చంహ్రారము నూపురములు మెడలోని హారములు సొమ్ములును సంతోషములతో శ్రీదేవి కొసంగిరి. రాజ! విశ్వకర్మదేవికుంగరము లొసంగెను. హిమవంతుడు దేవికి సింహవాహనమును వివిధ రత్నములు నొసంగెను. కుబేరుడు దేవికి సుర నింపిన మధుపాత్ర నొసంగెను. శేష భగవానుడు దేవికి నాగహార మొసంగెను. ఇట్లు మిగిలిన దేవతలు తమ తమ వస్తువు లొసంగి జగన్మాతను గౌరవించిరి. మహిష పీడితులగు దేవత లందఱును శ్రీమహాదేవిని సంస్తుతి యొనర్చిరి. వారు జగదుద్బవకారిణి యగు మహేశీనిని పలు విధములైన స్తోత్రములతో నుతించిరి. దేవతలు చేసిన పూజకు స్తోత్రములకు దేవేశి ప్రసన్నురాలయ్యెను. అంత శ్రీదేవి మహిషుని చంపుటకు లోకభీకరముగ మహానాద మొనర్చెను. రాజ! అనాదము విన్నంతనే మహిషాసురుని గుండె గడగడ లాడెను. అపుడు మహిషమహాసురుడు గొప్పసేన గూర్చుకొని దేవి చెంతకు యామెతో పారాటమునకు తలపడెను. అతడు శస్త్రాస్త్రములతో నింగి గప్పివేసెను. చిక్షురుడు గ్రామణి దుర్ధరుడు దుర్ముఖుడు బాష్కలుడు తామ్రుడు బిడావలదనుడు మొదలగు పెక్కు రణశూరులు వానికి తోడైరి.

యాధైఃపరవృతో వీరో మహిషో దానవోత్తమః | తతః సా కోపతామ్రాక్షీ దేవీలోకవిమోహినీ. 29

జఘాన యోధాన్సమరే దేవీ మహిషమాశ్రితాన్‌ | తతస్తేషు హతేష్వేవ సత్తెత్యోరోషయోర్చితః. 30

అససాదతదా దేవీం తూర్ణం మాయా విశారదః | రూపాంతరాణి సంభేజే మాయయాదానవేశ్వరః. 31

తానితాన్యస్య రూపాణి నాశయామాస సా తదా | తతో7ంతే మహిషం రూపం బిబ్రాణ మమ రార్దనమ్‌. 32

పాశేన బద్ద్వాసుదృఢం చిత్త్వాఖడ్గేన తచ్చిరః | పాతమాయాస మహిషం దేవీదేవగణాంతకమ్‌. 33

హాహా కృతం తతఃశేష సైన్యం భగ్నం దిశోదశ | తుష్టువుర్దేవ దేవేశీం సర్వేదేవాః ప్రమోదితా. 34

ఏవం లక్ష్మీః సముత్పన్నా మహిషాసురు మర్దినీ | రాజన్‌శృణు సరస్వత్యాః ప్రాదుర్బావోయథా భవత్‌. 35

ఏకదాశుంభనామా77సీ ద్దైత్యో మదబలోత్కటః | నిశుంభశ్చాపి తద్బ్రాతా మహాబలపరాక్రమః 36

తేన సంపీడితా దేవాః సర్వేభ్రష్టశ్రియోనృప | హిమవంత మథాసాద్య దేవీం తుష్టువురాదరాత్‌ 37

దేవా ఊచుః: జయ దేవేశి భక్తానా నార్తినాశన కోవిదే | దానవాంతకరూపేత్వ మజరామరణ నఘే. 38

దేవేశి భక్తి సులభే మహాబలపరాక్రమే | విష్టుశంకర బ్రహ్మాది స్వరూపే నంత విక్రమే. 39

సృష్టిస్థితికరే నాశకారికేకాంతిదాయిని | మహాతాండవ సుప్రీతే మోదదాయిని మాధవి. 40

ప్రసీదదేవదేవేశి ప్రసీద కరుణానిధే | నిశుంభ శుంభసంభూత భయాపారాంబువారిధేః. 41

ఇట్టి యోధులు తోడుగ మహిషుడు పోరునకు వచ్చెను. ఐనను కోపతామ్రాక్షి విశ్వమోహిని యగు దేవి మహిషుని పక్షమున వచ్చిన యోధుల నెల్లరిని రణమున నేలగూల్చెను. వారెల్లరును. చావగనే మహిషునకు పిచ్చికోపము వచ్చెను. అతడు మాయాచతురతతో దేవిని సమీపించెను. ఆదానవుడు దేవిముందు పెక్కుమాయ నాటకము లాడెను. మహామాయ వా డాడిన నాటకములన్నిటిని మట్టుపెట్టెను. తుదకు దైనవుడు తన మహిషరూపము దాల్చెను. అపుడు మహా దేవి దానవ పశువును యమపాశముతో బంధించి వాడి ఖడ్గముతో వాని తలనొకే వ్రేటున నఱికివేసెను. అట్లు దేవాంతకుడగు మహిషాసురు డంతమొందెను. రాక్షస సేనలో హాహాకారములు చెలరేగెను. మిగిలినసేవలు చెల్లాచెదరయ్యెను. దేవతలెల్లరును ప్రమోదభరితులై శ్రీదేవిని సంస్తుతించిరి. ఈ ప్రకారముగ మహిషాసురుమర్దిని శ్రీమహాలక్ష్మి యవతరించెను. రాజ! ఇంకశ్రీమహాసర్వస్వత్యవతారము వినుము. తొల్లిశుంభుడను మదగర్వితుడైన దైతు డుండెను. అతని సోదరుడు నిశుంభుడు మహాబలపరాక్రముడు. అతనిచేత దేవతలు పీడితులై రాజశ్రీ గోల్పోయి హిమగిరి కేగి శ్రీదేవి నిట్లు భక్తితో ప్రార్థించిరి. దేవేశీ! భక్త సంరక్షణ పరాయణి! దానవాంతకరూపిణీ! అజరామరమూర్తీ! పవిత్రమూర్తీ! నీకు జయమంగళ మగుత. దేవేశీ! పరమభక్తి సులభా! మహాబలవిక్రమ రూపీణీ! అనంత విక్రమమున తేజరిల్లు వీరమాత! హరిహర బ్రహ్మస్వరూపిణీ! శాంతజీవనజ్యోతీ! సృష్టిస్థిత్యంతకారిణీ! మహాతాండవప్రియా! బ్రహ్మానంతప్రదాయినీ! నారాయణి! కారుణ్యనిథీ! అమ్మా! దేవదేవేశ్వరీ! మా యెడల సుప్రన్నవు గమ్ము! శుంభనిశుంభుల వలని భయము బాపును.

ఉద్దరా స్మాన్ప్ర పన్వార్తి నాశికే శరణాగతాన్‌ | ఏవం సంస్తువతాంతేషాం త్రిదశానాం ధరావతే. 42

ప్రసన్నా గిరిజా ప్రాహ బ్రూత స్తవనకారణమ్‌ | ఎతస్మిన్నంతరే తస్మాః కోశరూపాత్సముత్దితా. 43

కౌశికౌ సా జగత్పూజ్యా దేవా న్ప్రీత్యేదమ బ్రవీత్‌ | ప్రసన్నాహం సురశ్రేష్ఠా స్తవేనోత్తమ రూపిణీ. 44

వ్రియతాం వరఇత్యుక్తే దేవాః సంవవ్రిరే వరమ్‌ | శుంభనామా7వరో భ్రాతా నిశుంభస్తస్య విశ్రుతః. 45

త్రైలోక్య మోజసాక్రాంతం దైత్యేన బలశాలినా | తద్వధశ్చింత్యతాందేవి దురాత్మాదానవేశ్వరః 46

బాధతే సతతం దేవి తిరస్కృత్య నిజౌజసా | శ్రీ దేవ్యువాచ: దేవశత్రుం పాతయుష్యే నిశుంభంశుమేవచ. 47

స్వస్థాస్తిష్ఠత భద్రం వః కంటకంనాశయామివః | ఇత్యుక్త్వా దేవదేవేశి దేవాన్సేంద్రాన్దయామయీ. 48

జగమా7దర్శనం సద్యోమిషతాం త్రిదివౌకసామ్‌ | దేవః సమాగతా హృష్టాఃసువర్ణా ద్రిగుహాం శుభామ్‌. 49

చండముండౌ పశ్యతః స్మ భృత్యౌ శుంభనిశుంభయోః | దృస్ట్వా తాం చారు సర్వాంగీం దేవీం లోకవిమెహినీమ్‌. 50

కథ యామాసతూ రాజ్ఞే భృత్యౌతౌ చండముండకౌ | దేవ సర్వసుర శ్రేష్ఠరత్న భోగార్హ మానద. 51

అపూర్వా కామినీ దృష్టా చావాభ్యాం రిపు మర్దన | తస్యాః సంభోగయోగ్యత్వ మసై#్యవ తవ సాంప్రతమ్‌. 52

తాం సమానయ చార్వం గీం భుంక్ష్వ సౌఖ్య సమన్వితః | తాదృశీ నాసురీ నారీ న గంధర్వీ న దానవీ. 54

అమ్మా! నీ పదకమలములే శరణంటిమి! భక్తార్తిభంజనీ! మమ్ముల నుద్ధరింపగదవే అని దేవతలు శ్రీదేవిని సంస్తుతించిరి. ఉమాదేవి ప్రసన్నమై వారి స్తోత్ర కారణ మడిగెను. అంతలోనే శ్రీదేవి శరీరకోశమునుండి విశ్వవంద్యయగు కౌశికి యావిర్బవించెను. ఆమె సురలతో నిట్లనెను. దేవతలారా! నేను మీ దివ్య స్తోత్రమునకు ప్రసన్నత జెందితిని. మీరు వరము కోరుకొనుడు. అనగనే దేవత లిట్లు కోరుకొనిరు. శుంభనిశుంభులు దానవ సోదరులు. పెద్దవాడు - శంభుడు. అతడు బలశాలి. ముల్లోకములను దురాక్రమణ చేసిన దుష్టుడు - దేవీ! ఆ దుష్టదానవు నంతమొందించు నుపాయమాలోంచింపుము. వాడు తన దురంత విక్రమముతో నెవరిని లెక్క చెయుటలేదు శ్రీదేవి యిట్లనును: శుంభనిశుంభులు సురవైరులే. వారిని పరిమార్చగలను. మీరు స్వస్థులు గండు. మీ సంకటము లన్నిటిని తొలగింపగలను. మీకు భద్ర మగు గాక! అని కరుణాపరయగు దేవి యింద్రాది దేవతలతో ననెను. సురలు చూచుచుండగనే దేవి యదృశ్య యయ్యెను. దేవతలు పరమ హర్షముతో మేరు గుహలు పట్టిరి. ఆ సమయమున శుంభనిశుంభుల సేవకులు చండముండులు దివ్య లావణ్యవతి - జగదేకమోహిని అగు దేవిని చూచిరి. వారు తమ రాజున కిట్లు విన్నవించిరి. రాజా! సర్వదానవనాధా! మానదా! రత్నభోగము లనుభవించువాడా! రిపుమర్దనా! మే మొక యపూర్వ రమణిని గాంచితిమి ఆమెను చేరుటకు నీవే తగినవాడవు. ఆ సుందరిని రప్పింపుము. ఆమెతో దానవ సుఖము లనుభవింపుము. అటువంటి సుందరి - యెల్ల దానవాసుర గంధర్వులందును. నరదేవత లందును లేదు. అను సేవకుల మాటలు శత్రుమర్దనుడగు శుంభుడు వినెను.

దూతం సంప్రేషయామాస సుగ్రీవం నామ దానవమ్‌ | సదూత స్త్వరితంగత్వా దేవ్యాః సవిధ మాదరాత్‌. 55

వృత్తాం తం కథయామాస దేవ్యై శుంభస్యయద్వ చం | దేవి శుంభాసురోనామత్రైలోక్య విజయీ ప్రభుః. 56

సర్వేషాం రత్నవస్తూనాం భోక్తా మాన్యో దివౌ కసామ్‌ | తదుక్తం శృణుమే దేవి రత్న భోక్తాహ మవ్యయః. 57

త్వం చాపిరత్న భూతాసి భజమాంచారులోచనే | సర్వేషు యానిరత్నాని దేవా సురనరేషు చ. 58

చాని మయ్యేవ సుభ##గే భజమాంకామజై రసైః | దేవ్యువాచః

సత్యం వదసి హే దూత దైత్యరాజ ప్రియం కరమ్‌. 59

ప్రతిజ్ఞా యా మయా పూర్వం కృతా సాప్యనృతా కధమ్‌ | భ##వేత్తాం శృణుమేదూత యాప్రతిజ్ఞా మయాకృతా. 60

యోమేదర్పం విధునుతే యోమే బలమపోహతి | యోమేప్రతిబలో భూయా త్సేవ మమభోగభాక్‌. 61

తత ఏనాం ప్రతిజ్ఞాంమే సత్యాం కృత్వాసురేశ్వరః | గృహ్ణాతు పాణిం తరసాతస్యాశక్యం కిమత్రహి. 62

తస్మాద్గ చ్చ మహాదూత స్వామినంబ్రూహి చాదృతః | ప్రతిజ్ఞాం చాపిమే సత్యాం విధాస్యతి బలాధికః. 63

ఏవం వాక్యం మహాదేవ్యాః సమాకర్ణ్య స దానవః | కధయామాస శుంభాయ దేవ్యావృత్తాంత మాదితః. 64

తదా ప్రియం దూతవాక్యం శుంభః శ్రుత్వామహాబలః | కోపమాహారయా మాస మహాంతం దనుజాధిపః. 65

తతో ధూమ్రాశనంనామ దైత్యం దైత్యపతిః ప్రభు | ఆదిదేశ శృణువచో ధూమ్రాక్ష మమ చాదృతః. 66

తాం దుష్టాం కేశపాశేషు దృత్వా೭೭ప్యానీయతాం మమ | సమీపమనిలంబే సశీఘ్రంగ చ్ఛ స్వ మేపురః. 67

అతడు సుగ్రీవుడను దానవుని పంపెను. వాడు వెంటనే సగౌరవముగ దేవి తెంచ కేగెను. అతడు శుంభుడు తనతో నన్న మాటలు దేవికిట్లు తెలిపెను. దేవీ! శుంభాసురుడు త్రైలోక్య విజయుడు ప్రభువు అతడు మూల్లోకములు సంపద లను భవించువాడు. సుకవంద్యుడు అతడు నీతో పలికన పలుకులు వినుము. నేను రత్న భోగిని శాశ్వతుడను. నీవు రత్నమయివి. ఎల్ల దేవాసురుల యొద్దగల నవరత్నరాసు లన్నియును నాయొద్దనే కలవు. సౌభాగ్యవతీ! నీవు కామరసుమతో నన్ను సేవింపుము. దేవి యిట్ల పలికెను : దూతా! నీవు నీ దానవరాజు పలికిన ప్రియమైన నిజమైన మాటలే పల్కితివి. కాని నేను మున్నొక ప్రతిన బూనితి. దాని నెటుల మీరగలను? దూతా! నా ప్రతిన వినుము. నా బలదర్పము లడనువాడు - నన్ను మించిన వీరవరు డెవడో యతడే నాకు భోగార్హు డగును. దానవా! నా యీ ప్రతిన నిజము చేయగలవాడు నన్ను చేపట్టవచ్చును. వాని కిక చేతకాని దేముండును! కనుక దూతా! నీవు మరియాదగ వెళ్ళి నీ సామికి నా మాట లన్నియు తెలుపుము. ఆ బలాధికుడు నా ప్రతిజ్ఞ నిజము చేసినచో శుంభుడు తన దూతవలన సప్రియులు విని దూత వెళ్ళి దేవి పల్కిన వాక్కులు శుంభునితో తెల్పెను ఆబలశాలియగు శుంభుడు తన దూతవలన సప్రియములు విని కోపోద్రిక్తుడయ్యెను. అపుడు శుంభడు ధూమ్రాక్షుడను దానవుని పిలిచి యతనికి ట్లాదేశించెను. ధూమ్రాక్షా! నా మాటలు చెవి యొగ్గి వినుము. ఆ దుష్టరక్షసిని జుట్టు పట్టుకొని వెంటనే కొని రమ్ము. ఇపుడే వెళ్ళుము. నా చెంతకు తెమ్ము.

ఇత్యాదేశం సమాసాద్య దైత్యేశోధూమ్రలోచనః | షష్ట్యా సురాణాం సహితః సహస్రాణాం మహాబలః. 68

తుహినాచలమాసాద్య దేవ్యాః సవిధ మేవ సః | ఉచ్చైర్దేవీం జగాదాశు భజ ద్యైపతిం శుభే. 69

శుంభం నామ మహావీర్యం సర్వభాగానవాప్నుహి | నోచేత్కేశాన్గృహీ త్వాత్వాం నేష్యేదైత్యపతిం ప్రతి. 70

ఇత్యుక్తాసా తతో దేవీ దైత్యేన త్రిదశారిణా | ఉవాచ దైత్యయద్ర్బూషే తత్సక్యం తే మహాబల. 71

రాజా శుంఢాసుర స్త్వంచ కిం కరిష్యతి తద్వద | ఇత్యుక్తో దైత్యపో7ధావ త్తూర్ణంళస్త్ర సమన్వితః. 72

భస్మసాత్తం చ కారాశు హుంకారణ మహేశ్వరి | తతః సైన్యం వహనేన దేవ్యాభగ్నం మహీపతే. 73

దిశోదశా భజచ్ఛీఘ్రం హాహాభూతమచేతనమ్‌ | తద్వృత్తాంతం స మాశ్రుత్య స శుంభోదైత్యరాడ్విభుః. 74

చుకోప చ మహాకోపా ద్ర్బుకుటీ కుచిలాననః | తతః కోప పరీతాత్మా దైత్యరాజః ప్రతాపవాన్‌. 75

చండముండం రక్తబీజం క్రమతః పై#్రషయ ద్విభుః | తే చ గత్వాత్ర యో దైత్వా విక్రాంతా

బహువికమాః. 76

దేవీం గ్రహీతుమారబ్ద యత్నాస్తే హ్యభవన్బలాత్‌ | తానాపతత ఏవసౌ జగద్ధత్రీ మదోత్కటా. 77

శూలం గృహాత్వావేగేన పాతయామాస భుతలే | ససైన్యాన్ని హతాన్‌ శ్రుత్వా దైత్యాం స్త్రీ న్దానవేశ్వరౌ. 78

శుంభ##శ్చైవ నిశుం భశ్చ సమాజగ్మతు రోజసా | నిశుంభ##శ్చైవ శుంభ శ్చ కృత్వా యుద్ధం మహోత్కటమ్‌. 79

దేవ్యా శ్చ వశగౌ జాతౌ నిహతౌ చతయా సురౌ | ఇతి దైత్య వరం శుంభ ఘాతయిత్వా జగన్మయీ. 80

ధూమ్రాక్షు డా మాటలు విని యిరువది వేల సేన గూర్చుకొనెను. అతడు మంచుకొండ కేగి దేవ సన్నిధిలో పెద్ద గొంతుకతో నిట్లనెను : శుభాంగీ! మా దానపతిని భజింపుము. మా శుంభుడు మహావీరుడు. వానితో నెల్ల భోగము లనుభవింపుము. కానిచో నీ జుట్ట పట్టుకొని నిన్నతని చెంతకు గొనిపోదును. అను దైత్యుని మాటలు విని దేవి యిట్లనెను. దానవా! వాడన్నదంతయు నిజమే! నీవును నీ రాజు శుంభాసురుడును. చేయగల్గిన దేమో చేయుడు. ఆ మాటలు విని యతడు శస్త్రము పట్టి క్రిందికి దూకెను. అపుడు మహేశ్వరి వాని నొక్క హుంకార మాత్రముననే భస్మము చేసివేసెను. దేవి వాహనమైన మృగరాజు వాని సేనలను నష్టపఱచెను. సేన హాహాకారములు చేయుచు చేష్ట లుడిగి దిక్కుల కెగబ్రాకెను. దైత్యరాజు శుంభు డా వృత్తాంతమంతయు విని చెలరేగిన తీవ్ర కోపముతో కను బొములు ముడిచెను. అతడు చండముండు లను రక్తబీజుని పంపెను. ఆ మువ్వురు దానవులు బాహుబల విక్రములు. వారు బలిమితో దేవిని బట్టుకొనుటకు బూనుకొనిరి. కాని మదోత్కటయగు జగదంబ వేగేమే వారిపై నాక్రమించి తన త్రిశూలముతో ముగ్గురిని నేలగూల్చెను. వారు చచ్చుట వలన సేన యంతయును చిందరవందర యయ్యెను. అది విని శుంభనిశుంభులు తామే సమరమునకు తరలి దేవితో ఘోర యుద్ధ మొనరించి తుదకు దేవికి వశులై సమసిరి. ఈ రితిగ దేవి శుంభనిశుంభుల నంతమొందించెను.

విబుదైః సంస్తుతా త ద్వత్సాక్షద్వాగీశ్వరీ పరా | ఏవంతే వర్ణతో రజ న్ర్పదుర్బవోతి రమ్యకః. 81

కాళ్యాశ్చైవ మహాలక్ష్యాః సరస్వత్యాః క్రమేణ చ | పరపరేశ్వరీ దేవీ జగత్సర్వం కరోతి చ. 82

పాసనంచైవ సంహారం స్థితిం సైవ దధాతిహి | తాంసమాశ్రయ దేవేశీం జగన్మో హనివారిణీమ్‌. 83

మహామాయాం పూజ్యతమాం సా కార్యంతే విధాస్యతి |

శ్రీనారాయణ ఉవాత: ఇతిరాజావచః శ్రుత్వా మునేః పరమ శోభనమ్‌. 84

దేవీం జగామ శరణం సర్వకామఫల ప్రదామ్‌ | నిరాహారో యతాత్మా చ తన్మనా శ్చ సమాహితః. 85

దేవీమూర్తిం మృణ్మయీం చ పూజయా మాస భక్తితః | పూజనాంతే బలింతసై#్య నిజగాత్రా సృజం దదత్‌. 86

తదాప్రసన్నా దేవేశీ జగద్యోనిః కృపావతీ | ప్రాదుర్బభూవ పురతో వరం బ్రూహీతి భాషిణీ. 87

సరాజా నిడమెహస్య నాశనం జ్ఞానముత్తమమ్‌ | రాజ్యం నిష్కంటకం చైవ యాచతిస్మ మహేశ్వరీమ్‌. 88

శ్రీదేవ్యువాచ : రాజన్నిష్కంకం రాజ్యం జ్ఞానంవై మోహనాశనమ్‌ |

భవిష్యతి మయాదత్త మస్మి న్నేవ భ##వేతవ. 89

అన్యచ్చ శృణు భూపాల జన్మాంతర విచేష్ఠితమ్‌ | భానోర్జన్మ సమాసాద్యసావర్ణిర్బివితాభవాన్‌. 90

తత్ర మన్వంతరస్యాపి పతిత్వం బహు విక్రమమ్‌ | సంతతిం బహులాం చాపి ప్రాప్యతేయద్వరాద్బవాన్‌. 91

ఏవం దత్త్వావరం దేవీ జగామా దర్శనం తదా | సౌపి దేవ్యాః ప్రసాదేనజాతో మన్వంతరాధిపః. 92

ఎవం తే వర్ణితం సోధో సావర్ణేర్జన్మ కర్మ చ | ఏత్తపఠం స్తథా శృణ్వు న్దేవ్యనుగ్రహమాప్నుయాత్‌. 93

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ దశమస్కంధే దేవీమాహాత్మ్యే ద్వాదశోధ్యాయః.

అంత దేవి సాక్షాత్తుగ వాగీశ్వరి యని విబుధులచే సన్నుతింపబడెను. రాజా! నీ కిటుం సరస్వతీదేవి ప్రాదుర్బావము రమ్యముగ వర్ణించితిని. శ్రీమహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతుల యావిర్బావములు - చర్తిలుప - వరుసగ విరించితిని. శ్రీపరా పరమేశ్వరి - దేవి యెల్ల జగముల పుట్టించును - పెంచును - తుదముట్టించును. కనుక నీవును జగన్మోహ నివారిణి యగు దేవిని శరణు వేడుము. శ్రీమహామాయ - పూజ్యతమ - ఆ దేవీ యొక్కతెయే నీ పని సాధింపగలదు. శ్రీనారాయణు డిట్లనెను: అను సుమేధసుని వాక్కులు సురథుడు వినెను. సురథుడు కోర్కెలు పండించు దేవిని శరణు వేడెను. అతడు నిరశనుడై నియమనిష్ఠలతో వ్రతములతో దేవీ మనస్కు డయ్యెను. అతడు దేవిమూర్తి చేసి పరభక్తితో పూజించెను. పూజాంతమున దేవికి తనరక్తము బలిగ నొసంగెను. దయామయి - విశ్వమూలాధార దేవేసి ప్రసన్నయై ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని రాజుతో ననెను. రాజు తన మోహము నశింపజేయు విమల జ్ఞానమును తన కెదురులేని రాజ్యసంపదలు నిమ్మని కోరెను. శ్రీదేవి రాజా! ఈ జన్మలో నీకు మోహనాశకమైన జ్ఞానము ఎదురులేని రాజ్యమును గల్గును. నీ యితర జన్మల వృత్తాంతము వినుము. నీవు సూర్యుని వలన జన్మ మొంది సావర్ణి వగుదువు. అపుడు నా వరప్రసాదమున నీవు మన్వంతరపతివి గాగలవు. గొప్ప సంతానసౌక్యము లనుభవింపగలవు. అని వరము లిచ్చి యంతర్ధాన మందెను. అతడును దేవి దయచే మన్వంతరపతి యయ్యెను. సాధూ! ఈ విధముగ నీకు సావర్ణి మనువు జన్మకర్మలు తెలిపితిని. దీనిని వినిన చదివినవాడు శ్రీదేవి దయకు పాత్రుడగును.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి దశమ స్కంధమున పండ్రెండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters