Sri Devi Bagavatham-2    Chapters   

అథ ద్వితీయోధ్యాయః.

శ్రీనారాయణ ఉవాచ : ఆచార మీనం నపునంతివేదాయద్యప్యధీతాస్సహ షడ్బిరంగైః |

ఛందాంస్యేన మృతుకాలే త్యజంతి నీడం శకుంతా ఇవ జాతపక్షాః. 1

బ్రాహ్మే ముహుర్తే చోత్థాయ తత్సర్వం సమ్యగా చరేత్‌ | రాత్రే రంతిమయామే తు వేదాభ్యాసం చరే ద్బుధః 2

కించిత్కాలం తతః కుర్వా దిష్టదేవాను చింతనమ్‌ | యోగీతు పూర్వమార్గేణ బ్రహ్మధ్యానం సమాచరేత్‌. 3

జీవ బ్రహ్మైక్యతా యేన జాయతే తు నిరంతరమ్‌ | జీవన్ముక్త శ్చ భవతి తత్షణాదేవ నారద. 4

పంచ పంచ ఉషఃకాలః సప్త పంచారుణో దయః | అష్టపంచాశద్బవే త్ర్పాతః శేషః సూర్యోదయఃస్మృతః. 5

ప్రాతరుత్థాయ యఃకుర్యా ద్విణ్మూత్రం ద్విజసత్తమః | నైరృత్యామిషు విక్షేప మతీత్యా భ్యదికం భువః. 6

విణ్మూత్రేపి చ కర్ణస్థ ఆశ్రమే ప్రథమే ద్విజః | నివీతం పృష్ఠతః కుర్యా ద్వానప్రస్థగృహస్థయోః. 7

కృత్వా యజ్ఞోపవీతం తు పృష్ఠతః కంఠలంబితమ్‌ | విణ్మూత్రం తు గృహీ కుర్యా త్కర్ణస్థం ప్రథమాశ్రమీ. 8

అంతర్ధాయ తృణౖ ర్బూమిం శిరః ప్రావృత్య వాససా | వాచం నియమ్య యత్నేన ష్ఠీవనశ్వా సవర్జితః. 9

నషాలకృష్ణే నజలే న చితాయాం న పర్వతే | జీర్ణదేవాలయే కుర్యాన్న వల్నీకే నశాద్వలే. 10

న స సత్త్వేషు గర్తేషు న గచ్ఛన్న పథి స్థితః | సంధ్యయోరుభయోర్జప్యే భోజనే దంతధావనే. 11

పితృ కార్యే చ దైవే చ తథా మూత్ర పురీషయోః | ఉత్సారే మైథునే వాపి తథావా గురుసన్నిధౌ. 12

యోగే దానేబ్రహ్మయజ్ఞే ద్విజోమౌనం సమాచరేత్‌ | దేవతా ఋషయః సర్వే పిశాచోరగరాక్షసాః. 13

ఇతో గచ్ఛంతు భూతాని బహిర్బూమిం కరోమ్యహమ్‌ | ఇతి సంప్రార్థ్య పశ్చాత్తు కుర్యాచ్ఛౌదం యథావిధి. 14

రెండివ అధ్యాయము

ఆచార నిరూపణము

శ్రీనారాయణు డిట్లనెను : వేదములు షడంగములతో చదివినను ఆచారము లేనివానిని పవిత్రుని చేయవు. ఱక్కలు వచ్చిన పక్షులు గూటిని వదలిపెట్టునట్లే అవి వానిని వదలిపెట్టును. పండితుడైనవాడు బ్రహ్మ ముహుర్తమందే లేచి తన నిత్యకృత్యములు నెఱవేర్చుకొనవలయును. రేతిరి చివరిజాములో వేదాభ్యాస మొనర్పవలయును. కొంతసేపుతన యిష్ట దైవమును గూర్చి యాత్మచింతన మొనర్పవలయును. యోగియైనవాడు మొదట చెప్పినట్లు బ్రహ్మధ్యాన మొనర్పవలయును. నారదా! జీవబ్రహ్మల యైక్యమే క్షణమున జరుగునో యదే క్షణమున నతడు జీవన్ముక్తుడు గాగలడు. రాత్రి యేబదియైదు గడియల కుషఃకాలము; ఏబదియేడు గడియల కరుణోదయము; ఏబది యెనిమిది గడియలకు ప్రభాతము. తర్వాత సూర్యోదయము నగును. ద్విజోత్తమా! ప్రాతఃకాలముననే లేచి మానవుడు బాణము పోవునంత దూరముగాని యంత కెక్కువ దూరముగాని నైరృత దిశగ నేగి మలమూత్రముల విసర్జించవలయును. బ్రహ్మచారియైన వాడు జందెము చెవికి తగిలించుకొని విసర్జింపవలయును. గృహస్థుడును - వానప్రస్థుడును జందెము ముందునకు లాగి వీపునకు వేసికొనవలయును. గృహస్థుడు జందెమును వెనుకకు వేసికొని చెవికి తగిలించుకొని విసర్జింపవలయును. బ్రహ్మచారి చెవికి మాత్రము తగిలించుకొని విసర్జింప వలయును. మల విసర్జనము చేయు చోట మొదట గడ్డి పఱచవలయును. తర్వాత తన తలకు గుడ్డ చుట్టుకొని మాటాడక ఉమ్మివేయక ఉండవలయును. దున్నిన నేల నీరు శ్మశానము పర్వతము జీర్ణ దేవాలయము పుట్ట పచ్చని పైరు మీదను గుంట లందును దారులలోను నడచుచుగాని నిలబడిగాని రెండు సంజల యందును భోజనము చేయుచును పండ్లు తొముకొనుచును దేవపితృ కార్యములు చేయుచును స్త్రీ పురుషుల పొందికయందును గురు సన్నిధిలోను మలమూత్రములు విసర్జింపరాదు. దేవ-ఋషి-పిశాచోరగ-రాక్షసులారా! మీ రీ చోటు వదలివెళ్ళుడు. నేను మనమూత్ర విసర్జనము చేయుచున్నాను. అని వారిని ప్రార్థించి తర్వాత యథావిధిగ విసర్జింపవలయును.

వాయ్వగ్నీ విప్రమాదిత్య మాపః పశ్యం స్తథైవగాః | న కదాచన కుర్వీత విణ్మూత్రస్య విసర్జనమ్‌. 15

ఉదఙ్మఖో దివాకుర్యా ద్రాత్రౌ చేద్దక్షిణాముఖః | తత ఆచ్చాద్య విణ్మూత్రం లోష్టవర్ణతృణాదిభిః. 16

గృహీతలింగ ఉత్థాయ సగచ్ఛే ద్వారి సన్నిధౌ | పాత్రే జలం గృహీత్వాతు గచ్ఛే ధన్యత్ర చైవహి. 17

గృహీత్వా మృత్తికాం కూలా చ్చ్వేతాం బ్రాహ్మణసత్తమః | రక్తాం పీతాంతథాకృష్ణాం గృహ్ణీయు శ్చాన్య వర్ణకాః.

అథవా యత్ర దేశే యా సైవగ్రాహ్యా ద్విజోత్తమైః | అంతర్జలాద్దేవ గృహా ద్వల్మీకా న్మూషకోత్కరాత్‌. 19

కృత శౌచా వశిషా చ్చన గ్రాహ్యాః సప్త మృత్తికాః | మూత్రాత్తు ద్విగుణం శౌచే మైథునే త్రిగుణం స్మృతమ్‌.

ఏకా లింగే కరే తిస్ర ఉభయో ర్మృద్ద్వయం స్మృతమ్‌ | మూత్రాశౌచం సమాఖ్యాతం శౌచే తద్ద్విగుణం స్మృతమ్‌.

విట్‌శౌచే లింగదేశేతు ప్రదద్యా న్మృత్తి కాద్వయమ్‌ | పంచా పానే దశైకస్మి న్నుభయోః సప్తమృత్తికాః. 22

వామపాదం పురస్కృత్య పశ్చాద్దక్షిణ మేవచ | ప్రత్యేకం చ చతుర్వాగం మృత్తికాం లాపయే త్సుధీః. 23

ఏవం శౌచంగృహస్థస్య ద్విగుణం బ్రహ్మచారిణః | త్రిగుణం వానప్రస్థస్య యతీనాం చ చతుర్గుణః. 24

ఆర్ధ్రామలకమానాతు మృత్తికా శౌచ కర్మణి | ప్రత్యేకం తు సదా గ్రాహ్యా నాతో న్యూనా కదాచన. 25

ఏతద్దివా స్యా ద్విట్‌ శౌచం తదర్దం నిశికీర్తితమ్‌ | ఆతురస్య తదర్దం తు మార్గస్థస్య తదర్దకమ్‌. 26

స్త్రీశూద్రాణా మశక్తానాం బాలానాం శౌచ కర్మణి | యథా గంధక్షయః స్యాత్తు తథా కుర్యాదసంఖ్యకమ్‌. 27

గంధలేపక్షయో యావ త్తావచ్ఛౌచం విధీయతే | సర్వేషాం మేవ పర్ణానా మిత్యాహ భగవాన్మనుః. 28

బ్రాహ్మణుని - అగ్నిని - వాయువును - నీటిని - సూర్యుని చూచుచు నెప్పుడును మలమూత్రముల విసర్జింపరాదు. పగలుత్తర ముఖముగ రేయి దక్షిణ ముఖముగ విసర్జింపవలయును. దానిపై సూర్యకిరణములు పడకుండుటకై యాకులలములు గప్పవలయును. మట్టి చల్లవలయును. నీటి దగ్గఱ బహిర్బూమికి వెళ్ళినచో లింగము చేత బట్టుకొని నీటిచెంత కేగవలయును. లేక మొదలే పాత్రలో నీరు తీసుకొని పోవలయును. బ్రాహ్మణుడు - క్షత్రియుడు - వైశ్యుడు - శూద్రుడు వరుసగ తెల్లని - యెఱ్ఱని - పచ్చని - నల్లని మట్టి తీసికొనవలయును. అది దొరుకనిచో నా ప్రదేశమందున్న మట్టితో శుభ్రము చేసికొనవలయును. దేవాలయము - ఇల్లు ఎలుకల కన్నముల మట్టిని శౌచము చేయగ మిగిలిన మట్టిని శౌచక్రియకు వాడరాదు. మూత్రమందుకన్న శౌచమున రెండింతలుగ మైథునమున మూడింతలుగ శుద్ధి చేసికొనవలయును. మూత్రించినపుడు లింగము నొకసారి చేతిని మూడుసార్లు రెండుచేతులను రెండుసార్లు శుద్ధి చేసికొనవలయును. శౌచమున దానికి రెండింతలుగ శుద్ధిచేసికొనవలయును. మలవిసర్జనమున లింగమును మట్టితో రెండుసార్లు గుదస్థానము నైదుసార్లు చేతిని పదిసార్లు రెండు చేతుల నేడుసార్లు శుద్ధిచేసికొనవలెను. తెలిసినవాడు మొదట నెడమ పాదమును పిదప కుడి పాదమును ప్రతిది నాల్గుసార్లు చొప్పున మట్టితో శుద్ధి చేసికొనవలయను. ఇంతవఱకును గృహస్థుని శౌచ విధానము తెల్పబడెను. దీనికి రెండింతలు బ్రహ్మచారి మూడింతలు వానప్రస్థుడు నాలు గింతలు సన్యాసియును శుద్ధిచేసికొని పవిత్రుడు గావలయును. శౌచక్రియ కుపయోగించుమట్టి పచ్చి యుసరిక కాయంత యుండవలయును. అంతకెప్పుడును తగ్గరాదు. ఇంతవఱకును పగలు చేయవలసిన శౌచక్రియ తెలుపబడెను. రేతిరి దీనిలో సగము చేసిన చాలును. రోగముతో నున్నవాడు దానిలో సగమును పయనించువాడు దానిలో సగము చేసిన చాలును స్త్రీలు బాలురు శూద్రులు వృద్ధులు వీరు చెడువాసన పోవునంతవఱకు శౌచక్రియ నిర్వర్తించినచాలును. వీరికి సంఖ్యానియమము లేదు. అన్ని వర్ణముల వారికిని మురికి - చెడువాసన తొలగినపుడే శుద్ధియగునని మను భగవానుడు ప్రకటించెను.

వామహస్తేన శౌచంతు కుర్యాద్వై దక్షిణన న | నాభేరధో వామహస్తో నాభేరూర్ధ్వంతు దక్షిణః. 29

శౌచకర్మణి విజ్ఞే¸° నాన్యథా ద్విజపుంగవైః | జలపాత్రం న గృహ్ణీయా ద్విణ్మూత్రోత్సర్జనే బుధః. 30

గృహ్ణీయాద్యద్రి మోహేన ప్రాయశ్చిత్తం చ రేత్తతః |

యది మోహా ద థవా೭೭లస్యాన్న కుర్యాచ్ఛౌ చ మాత్మనః. 31

జలాహార స్త్రీరాత్రఃస్యాత్తతో జ ప్యాత్తు శుధ్యతి | దేశకాలద్రవ్య శక్తి స్వోపపత్తీ శ్చ సర్వశః. 32

జ్ఞాత్వా శౌచం పకర్తవ్య మాలస్యం నాత్రధారయేత్‌ | పురీషోత్సర్జనే కుర్యాద్గంఢూషాన్ద్వా దశైవతు. 33

చతురో మూత్రవిక్షేపే నాతోన్యూనాన్క దాచన | అధో ముఖం నరః కృత్వా త్యజేత్తం వామతః శ##నైః. 34

ఆచమ్య చ తతః కుర్యా ద్దంతధావన మాదరాత్‌ | కంటకి క్షీరవృక్షోత్థం ద్వాదశాంగుళమవ్రణమ్‌. 35

కనిష్ఠి కాగ్రవత్థ్సూలం పూర్వార్థే కృతకూర్చకమ్‌ | కరంజో దుంబరౌ చూతః కదంబో లోధ్ర చంపకౌ |

బదరీతిద్రుమాశ్చైతే ప్రోక్తా దంతప్రధావనే. 36

అన్నాద్యాయ వ్యూహధ్వంసే సోమోరాజాయమా గమత్‌ | సమే ముఖం ప్రక్షాళ్యతే యశసా చ భ##గేన చ. 37

ఆయుర్బలం యశో వర్చః ప్రజాః పశువసూని చ | బ్రహ్మ ప్రజ్ఞాం చ మేధాం చ త్వన్నో దేహి వనస్పతే. 38

అభావే దంతకాష్ఠస్య ప్రతిషిద్ధ దినేషు చ | ఆసాం ద్వాదశగండూషై ర్విదధ్యా ద్దంతధావనమ్‌. 39

సవితా భక్షితస్తేన స్వకులం తేన షు తితమ్‌. 40

ప్రతిపద్దర్శషష్ఠీషు నవమ్యేకాదశీ రవౌ | దంతానాం కాష్ఠ సంయోగా ద్దహత్యా సప్తమంకులమ్‌. 41

కృత్వాలం పాదశౌచం హ్యమలమథ జలం త్రిః పిబేద్ద్వి ర్విమృజ్య

తర్జన్యాం గుష్ఠ వత్యాసజలమభిమృశే న్నాసికారంధ్ర యుగ్మమ్‌ |

అంగుష్ఠానామికాభ్యాం నయన యుగ యుతం కర్ణయుగ్మం కనిష్ఠాం

గుష్ఠాభ్యాం నాభిదేశే హృదయ మథ తలే నాంగుళీభిః శిరాంసి. 42

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే ద్వితీయోధ్యాయః.

ఈ శౌచక్రియ అంతయు నెడమచేతనే చేయవలయును గాని కుడిచేతి నుపయోగించరాదు. బొడ్డునకు క్రింద నెడమచేతితోను పైని కుడిచేతితోను శౌచక్రియచేయవలయును. ఇట్లు ద్విజులు చేతులను శౌచక్రియ యందుపయోగంచవలయును. ఇతరముల గాదు. తెలిసినవాడు మలమూత్ర విసర్జన సమయమున పాత్ర పట్టుకొనరాదు. ఎవడైన మోహముతో నటుల పట్టుకొనినచో వాడు ప్రాయశ్చిత్తము చేసికొనవలయును. ఎవడైన మోహముతోగాని సోమరితనమునగాని శౌచక్రియ చేసికొన నిచో అతడు మూడురాత్రులు నీరు మాత్రము త్రాగుచు గాయత్రిని జపించినచో శుద్ధడగును. కనుక దేశ - కాల - పాత్రము లెఱిగి శౌచక్రియ నిర్వర్తింపవలయును. అలసత్వముచూపరాదు. మల విసర్జనము తర్వాత పండ్రెండు మార్లు పుక్కిలించి యుమియవలయును. మూత్రించిన పిదప నాల్గుసార్లు పుక్కిలించవలయును. అంత కెప్పుడును తగ్గరాదు. మొగమువంచి యెడమ వైపుగ పుక్కిలించవలయును. ఆ పిదప నాచమించి శుభ్రముగ పండ్లు తోముకొనవలయును. పండ్లుతోము పుడక పండ్రెం డంగుళములుగ నుండవలయును. పాలుగారుచెట్టు ముండ్లచెట్టు పుడకకు మంచిది. అది చిటికెనవ్రేలంత లావుండవలయును. మామిడి - మేడి - కడిమి - రేగు - లొద్దుగు - సంపంగి పుల్లలు తోముకొనుట కుపయోగించవలయును. అన్నము తినుటకును - శత్రులను చంపుటకు నీ వృక్షమందు సోమరాజు ప్రత్యక్ష మగుగాక! అది నా ముఖమునకు సిరి - యశము నిచ్చి శుద్ధి చేయుగాక! వన స్పతీ! నీవు నా కాయువు - బలము - కీర్తి - వర్చస్సు - సంతతి - పశువులు - సిరిసంపదలు - విజ్ఞానము - మేధాశక్తినిమ్ము. అను మంత్రము నుచ్చరింపవలయును. పండ్లు తోముటకు నిషిద్ధ దినములందు పండ్రెండు మార్లు నీరు పుక్కిలించిన దంత ధావనమయినట్లగును. నిషిద్ధదినములందు తోముకొనిన సూర్యుని కొట్టినంత దోషము. అది కులనాశ##హేతు వగును. పాడ్యమి - షష్ఠి - నవమి - ఏకాదశి - అమావాస్య తిథులును - ఆదివారమును నిషిద్ధ దినములు. ఈ నాళ్లలోపుడకతో పండ్లు తోముకొనరాదు. తొముకనిననేడు కులములను హతమొనర్చిన వాడగును. ముఖము కడిగిన తర్వాత ముమ్మా రాచమనము చేసి ముఖము తుడుచుకోవలయును. తర్వాత నీటితో బొటనవ్రేలితో చూపుడు వ్రేలితోను ముక్కు పుటములను బొటనవ్రేలితో కన్నులు చెవులను బొటనవ్రేలితో చిటికెన వ్రేలితో బొడ్డును అరచేతిలో హృదయమును అన్ని వ్రేళ్లలో తలను తాకవలయును.

ఇది శ్రీదేవీభాగవత మహాపురాణ మందలి యేకాదశ స్కంధమున రెండవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters