Sri Devi Bagavatham-2    Chapters   

అథ తృతీయోధ్యాయః

శ్రీ నారాయణ ఉవాచ: ''శుద్ధం స్మార్తం చాచమనం పౌరాణం వైదికం తథా | తాంతికం శ్రౌతమిత్యాహుః షడ్విధం శ్రుతిచోదితమ్‌.

విణ్మూత్రాదికశౌచం చ శుద్ధం చ పరికీర్తితమ్‌ | స్మార్తం పౌరాణికం కర్మ ఆచాంతే విధిపూర్వకమ్‌.

వైదికం శ్రౌతుమిత్యాది బ్రహ్మయజ్ఞాది పూర్వకమ్‌ | అస్త్రవిద్యాదికం కర్మ తాంత్రికో విధిరుచ్యతే.''

స్మృత్వాచోంకారం గాయత్రీం నిబధ్నీ యాచ్చిఖాం తథా |

పునరాచమ్య హృదయం బాహూ స్కంధౌ చ సంస్పృశేత్‌. 1

క్షుతనిష్ఠీవనే చైవ దంతోచ్ఛిష్టే తథానృతే | పతితానాం చ సంభాషే దక్షిణం శ్రవణం స్పృశేత్‌. 2

అగ్నిరాపశ్చ వేదాశ్చ సోమః సూర్యోనిలస్తథా | సర్వే నారద వి పస్య కర్ణే తిష్ఠంతి దక్షిణ. 3

తతస్తు గత్వా నద్యా దౌ ప్రాతఃస్నానం విశోధనమ్‌ | సమాచరే న్ముని శ్రేష్ఠ దేహ సంశుద్ధిహేతవే. 4

అత్యంత మలినో దేహీ నవద్వారైర్మలం వహన్‌ | సదాస్తే తచ్ఛోధనాయ ప్రాతః స్నానం విధీయతే. 5

అగమ్యాగమనా త్పాపం యచ్చ పాపం ప్రతిగ్రహాత్‌ | రహస్యా చరితం పాపం ముచ్యతే స్నాన కర్మణా. 6

అస్నాతస్య క్రియాః సర్వా భవంతి విఫలా యతః | తస్మాత్పాత శ్చం త్స్నానం నిత్యమేవ దినేదినే. 7

దర్బయుక్త శ్చ రేత్స్నానం తథా సంధ్యాభివందనమ్‌ | సప్తాహం ప్రాతరస్నాయీ సంధ్యాహీనస్త్రీభిర్దినైః. 8

ద్వాదశాహ మనగ్నిః స న్ద్విజః శూద్రత్వ మాప్నుయాత్‌ | అల్పత్వాద్ధోమకాలస్య బహుత్వాత్స్నాన కర్మణః. 9

ప్రాతర్నతు తథా స్నాయా ద్దోమకాలే విగ్హరితః | గాయత్ర్యాస్తు పరంనాస్తి ఇహలోకే పరత్ర చ.

10

గాయంతం త్రాయతే యస్మా ద్గాయ త్రీత్యభిధీయతే | ప్రణవేన తు సంయుక్తాం వ్యాహృతిత్రయ సంయుతామ్‌. 11

వాయంవా¸° జయేద్విప్రః ప్రాణసంయమనత్రయాత్‌ | భ్రాహ్మణః శ్రుతిసంపన్నః స్వధర్మనిరతః సదా. 12

మూడవ అధ్యాయము

ఆచార నిరూపణము-రుద్రాక్ష ప్రాశస్త్యము

శ్రీ నారయణు డిట్లనెను : ఆచమన మారు విధములని వేదములందు గలదు. అవేమనగ వ్తెదికము-శ్రౌతము-శుద్దము-పౌరాణము-తాంత్రికము ననునవి. మలమూత్రములు వదిలిన పిమ్మట చేయు నాచమనము శుద్ధము. స్మార్త కర్మలందు చేయునది స్మార్తము. పౌరాణ కర్మలందు చేయునది పౌరాణికము. బ్రహ్మయజ్ఞాదులందు చేయబడు నాచమనమును వ్తెదికము-శ్రౌతమునందురు. అస్త్ర విద్యనందిలి యాచమనము తాంత్రిక మందురు. ప్రణవమును-గాయత్రిని స్మరించి జుట్టు ముడివేసికొని యాచమించి హృదయమును-బాహువులను-భుజములను తాకవలయును. తుమ్మిన-ఉమిసిన-ఎంగిలి దగిలిన-బొంకులాడిన-పతితులతో మాటాడినను కుడి చెవిని తాకవలయును. నారదా ! బ్రాహ్మణుని కుడి చెవియందు వేదములు-అగ్ని-గంగసూర్రచంద్రులు-వాయువు నివన్నియును నిలిచి యుండును. దేవమునీ ! తర్వాత దేహ శుద్దికొఱకు నదులు మున్నగు జలాశయములకేగి వేకువనే స్నానమాచరించవలయును. ఈ శరీరము తొమ్మిది ద్వారములు గల మురికి కొంప. దాని పరిశుభ్రతకు వేకువ జాముననే స్నానమాచరించవలయును. కూడరాని వారితో పొరబాటుగకూడిన పాపము ప్రతిగ్రహపాపము రహస్యముగ చేసిన పాతకమును స్నానకర్మవలన తొలగిపోవును. స్నానమాడక చేసిన పాతకమును స్నానకర్మవలన తొలగిపోవును. స్నానమాడక చేసిన పనులన్నియును నిష్పలములే. కనుక ప్రతిదినమును యథావిధిగవేకువ జామున స్నానమొనరింపవలయును. స్నానము-సంధ్యావందనమును దర్బలు చేబూని యాచరించవలయును. ఏడు నాళ్లు వేకువను స్నానము చేయక మూడు నాళ్లు సంధ్యావందనము చేయక పండ్రెండు దినము లగ్ని వేల్చకున్నచో బ్రాహ్మణుడు శూద్రత్వమొందును. స్నానమున కెక్కువ సమయము వెచ్చించిన వేల్చుటకు సమయము తగ్గును. కనుక వేకువలో స్నానకల మెక్కువచేసి హోమకాలము తగ్గించరాదు. ఎందుకనగ నిహపరములందును శ్రీ గాయత్రీ దేవిని మించిన దెద్దియును లేదుగదా ! తన్ను గానము చేయువానిని గాపాడునది గాన గాయత్రి గాయత్రి యన ప్రసిద్దికెక్కినది. విప్పుడు ప్రణవమును మూడు వ్యాహృతులతో జపించవలయును. తర్వాత ముమ్మారు ప్రాణాయామముతో వాయువును బంధించ బలయును. వేద సంపన్నుడ్తెన బ్రాహ్మణుడు ధర్మమునందే సత్యనిష్ఠుడై యుండవలయును.

సవ్తెదికం జపేన్మంత్రం లౌకకం నకదాచన | గోశృంగే సర్షపోయా వత్తావద్యేషాంన సంస్థిరః. 13

న తారయం త్యుభౌ పక్షౌ పితృనేకోత్తరం శతమ్‌ | సగర్బో జప సంయుక్త స్త్వగర్బో ధ్యానమాత్రకః. 14

స్నానాంగతర్పణం కృత్వా దేవర్షి పితృతోషకమ్‌ | శుద్దే వస్త్రే పరీధాయ జలాద్బహి రుపాగతః. 15

విభూతి ధారణం కార్యం రుద్రాక్షాణాంచ ధారణమ్‌ | క్రమయోగేన కర్తవ్యం సర్వదా జపసాధకైః. 16

రుద్రాక్షన్కంఠ దేశే దశనపరిమితాన్మస్తకే వింశతీ ద్వేషట్‌షట్‌ కర్ణ ప్రదేశే కరయుగళ కృతే ద్వాదశద్వాదశైవః

బాహ్వోరిందోః కలాభిర్నయన యుగకృతే త్వేకమేకం శిఖాయాం |

వక్షస్యష్టాధికం యః కలయతి శతకం స స్వీయం నీలకంఠః, 17

బధ్వాస్వర్ణేన రుద్రాక్షం రజతేనా 7 థవా మునే | ఖాశియాం ధారయేన్నిత్యం కర్ణయోర్వా సమాహితః. 18

యజ్ఞోపవీతే హస్తేవాకంఠే తుందే 7 థవా నరః | శ్రీమత్పంచాక్షరేణ్తవ ప్రణవేన తథాపివా.

19

నిర్వ్యాజ భక్తామేధావీ రుద్రాక్షం ధారయేన్ముదా | రుద్రాక్ష ధారణం సాక్షాచ్చి వజ్ఞానస్య సాధనమ్‌. 20

రుద్రాక్షం యచ్చిఖాయాంతత్తారతత్త్వ మితిస్మరేత్‌ | కర్ణయో రుభయోర్ర్బహ్మన్‌ దేవం దేవీం చ భావయేత్‌.21

యజ్ఞోపవీతే వేదాం శ్చ తథా హస్తేదిశః స్మరేత్‌ | కంఠే సరస్వతీం దేవీం పావకం చాపి భావయేత్‌. 22

సర్వా శ్రమాణాం వర్ణానాం రుద్రాక్షాణాం చ దారణమ్‌ | కర్తవ్యం మంత్రతః ప్రోక్తం ద్విజానాం నాన్యవర్ణినామ్‌. 23

రుద్రాక్ష ధారణా ద్రుద్రో భవత్యేవ న సంశయః | పశ్యన్నపి నిషిద్దాంశ్చ తథా శృణ్వన్నపి స్మరన్‌. 24

విప్రుడు వ్తెదిక మంత్రమునే జపించవలయును గాని లౌకికము నెప్పుడును జపించరాదు. ఆవు కొమ్ముమీద ఆవగింజ ఉన్నంతసేప్తెన నెవని ప్రాణమనంబులు నిదోధింపబడవో అతడు తన తల్లిదండ్రులను నూట యొక్క తరముల పితరులను తరింపజేయజాలడు. జపముతో చేసిన ప్రాణాయామము సగర్బమనియును ధ్యానముతో చేయు ప్రణాయామమును ఆగర్బమనియు నందురు. స్నానము తర్వాత నీటి బ్తెటికి వచ్చి తెల్లని దుస్తులు దాల్చి-బుషి-పితృప్రీతిగ తర్పణ మాచరింపవలయును. జపసాధకుడు యథావిధిగ భస్మమును రుద్రాక్షలును ధరించవలయును. రుద్రాక్షలు కంఠమున ముప్పది రెండును తలప్తె నలవదియు చెవుల కారేసి చొప్పున ప్రతిచేతియందు పండ్రెండు చొప్పన ప్రతి భుజమందు పదారువంతున నేత్రములప్తె నొక్కొక్కటియు జుట్టునం దొకటియు ఱొమ్ముప్తె నూట యెనిమిది దాల్చువాడు కేవలము నీలకంఠుడ్తె-పరమ శివుడే యగును. రుద్రాక్షను బంగారమందుగాని వెండియందుగాని పొదిగి శిఖయందుగాని చెవులందుగాని దాల్చుటుత్తమము. జందెమందు-చేతియందు-మెడలోను-పొట్టప్తెని వీనిలో నెచటన్తెన ప్రణవముతోగాని శివ పంచాక్షరితోగాని రుద్రాక్షలు దాల్చవలయును. పండితుడ్తెనవాడు నిస్కామముగ అవ్యాజభక్తితో పరమానందముతో దాల్చవలయును. రుద్రాక్ష ధారణము శివజ్ఞానమునకు పరమ సాధనము.

శిఖయందలి రుద్రాక్షను తరింపజేయు తత్త్వముగను చెవులందున్న రుద్రాక్షలను దేవీదేవులుగను సంభావించవలయును. జందెమందున్న రుద్రాక్షలను వేదములుగను చేతులందలి రుద్రాక్షలను దిశలుగను కంఠమందలి రుద్రాక్షల నగ్ని సరస్వతులుగను భావించవలయును. అన్ని యాశ్రమముల-వర్ణములవారు సైతమును రుద్రాక్షలు ధరింపవచ్చును. బ్రాహ్మణుడు సమంత్రకముగ దాల్చవలయునే కాని పట్టిగ దాల్చరాదు. రుద్రాక్షలు తాల్చిన మానవుడు కేవలము రుద్రుడే-సందియము లేదు.

జిఘ్రన్నపి తధా చాశ్న న్ర్పలపన్నపి సంతతమ్‌ | కుర్వన్నపి సదా గచ్చ న్విసృజన్నపి మానవః. 25

రుద్రాక్షధారణాదేవ సర్వపాప్తెర్నలిప్యతే | అనేన భుక్తం దేవేన భుక్తం యత్తుతథా భ##వేత్‌. 26

పీతం రుద్రేణ తత్పీతం ఘ్రాతం ఘ్రాతం శివేన తత్‌ | రుద్రాక్షధారణ లజ్ఞా యేషామస్తిమహామునే. 27

తేషాం నాస్తి వినిర్మోక్షః సంసారాజ్ఞన్మకోటిబిః | రుద్రాక్షధారిణం దృష్ట్వా పరివాదం కరోతియః. 28

ఉత్పత్తౌ తస్య సాంకర్య మస్త్యేవేతి వినిశ్చయః | రుద్రాక్ష ధారణాదేవ రుద్రో రుద్రత్వమాప్నుయాత్‌. 29

మునయః సత్యసంకల్పా బ్రహ్మా బ్రహ్మత్వ మాగతః | రుద్రాక్షధారణా చ్ర్చేష్ఠం న కించిదపి విద్యతే. 30

రుద్రాక్షధారిణ భక్త్యా వస్త్రంధాన్యం దదాతియః | సర్వపాప వినిర్ముక్తః శివలోకం స గచ్చతి. 31

రుద్రాక్షధారిణం శ్రాద్దే భోజయేత విమోదతః | పితృలోక మవాప్నోతి నాత్ర కార్యా విచారణా. 32

రుద్రాక్షధారిణః పాదౌ ప్రక్షాళ్యాద్బిః పిబేన్నరః | సర్వపాపవినిర్ముక్తః శివలోకే మహీయతే || 33

హారం వా కటకం వాపి సువర్ణం వా ద్విజోత్తమః | రుద్రాక్షసహితం భక్త్యా ధారయన్రు ద్రతామియాత్‌. 34

రుద్రాక్షం కేవలం వాపి యత్ర కుత్ర మహామతే | సమంత్ర కంవా మంత్రేణ రహితం భావర్జితమ్‌. 35

యోవాకోవానరో భక్త్యా ధారయేల్ల జ్జయా7పివా | సర్వపాప వినిర్ముక్తః సమ్యక్‌ జ్ఞానమవాప్నుయాత్‌. 36

అహోరుద్రా క్షమాహాత్మ్యం మయావక్తుంన శక్యతే | తస్మాత్సర్వ ప్రయత్నేన కుర్యా రుద్రాక్ష ధారణమ్‌ .

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశ స్కంధే సదాచారవర్ణనే తృతీయోధ్యాయః

చూడరానివి చూచినను వినరానివి వినినను తలచరానివి తలచినను ఏదైన మూర్కొనుచు -తినుచు-వాగుచు-చేయుచు-తిరుగుచు-విడుచుచు నున్నను మానవుడు రుద్రాక్షలు తాల్చియున్నచో వాని నెట్టి పాపములు నంటజాలవు. రుద్రాక్ష దాల్చి భుజించినచో దేవతలే భుజించునట్లగును. అతడు త్రాగినది శివుడు త్రాగినట్లగును. అతడు మూర్కొనునది శివుడే మూర్కొని నట్లుగును. నారదా! అట్టి రుద్రాక్షలు దాల్చుటకు సిగ్గుపడువానికి కోటి జన్మలకైనను మృత్యుసంసారము నుండి ముక్తి గలుగదు. రుద్రాక్ష దాల్చి వానిని చూచి పరిహాసము | పిడివాదమును చేసినవాడు సంకర జన్మమువాడని నిశ్చయించుకొనవలయును. రుద్రుడును రుద్రాక్ష ధానణము వలననే రుద్రుడయ్యెను. రుద్రాక్ష ధారణము వలననే మునులు సత్యసంకల్పులైరి. బ్రహ్మ-బ్రహ్మత్వ మొందెను. కనుక రుద్రాక్షధారణముకన్న మిన్నయైన దేదియు నెన్నడును లేదు. రుద్రాక్షధారిని శ్రాద్దభోక్తగ నియమించువాడు నిశ్చయముగ పితృలోకమేగును. సంశయముతో పనిలేదు. రుద్రాక్షధారి పాదములు కడిగి పాదజలము త్రాగువాడు సకల పాపముక్తుడై రుద్రలోక మొందగలడు. రుద్రాక్షలతో గూడ బంగారముగాని హారముల గాని కంకణములు గాని ధరించు బ్రాహ్మణుడు తప్పక రుద్రత్వ మందగలడు. మహాశయా! అట్టి రుద్రాక్షలనెప్పుడేని - ఎక్కడేని -ఎవ్వడేని - తెలసికాని తెలియకకాని-సమంత్రకముగ గాని అమంత్రకముగగాని భక్తితో గాని సిగ్గుతో గాని తాల్చిన మానవుడు నిక్కముగ నెల్ల పాపములు వాసి ప్రత్యక్ష జ్ఞాన మొందగలడు. ఆహా! అట్టి రుద్రాక్షల మహిమము ప్రస్తుతించుటకు నే నెంతవాడను? కనుక ప్రతివాడు నెల్ల విధములుగ రుద్రాక్షలు తప్పక ధరించవలయును.

ఇది శ్రీ దేవి భాగవత మహాపురాణమందలి పదునొకండవ స్కంధమున మూడవ యధ్యాయము.

Sri Devi Bagavatham-2    Chapters