Sri Devi Bagavatham-2    Chapters   

అథషష్ఠోద్యాయః

ఈశ్వర ఉవాచ : మహాసేన కుశగ్రంథిపుత్రం జీవాదయఃపరే | రుద్రాక్షస్య తునైకో7పి కళా మర్హంతి షోడశీమ్‌.. 1

పురుషాణాం యథా విష్ణు ర్గ్రహాణాం చ యథా రవిః | నదీనాం తు యథా గంగా మునీనాం కశ్యపో యథా . 2

ఉచ్చైః శ్రవా యథా7శ్వానాం దేవానామీశ్వరో యథా | దేవీనాం తు యథా గౌరి తద్వచ్చ్రేష్ఠ మిదం మహాత్‌. 3

నాతః పరతరం స్తోత్రం నాతః పరతరం వ్రతమ్‌ | అక్షయ్యేషు చ దానేశు రుద్రాక్షస్తు విశిష్యతే. 4

శివభక్తాయ శాంతాయ దద్యాద్రు ద్రాక్షముత్తమమ్‌ | తస్య పుణ్యఫలస్యాంతం న చహం వక్తుముత్సహే. 5

ధృతరు ద్రాక్ష కంఠాయ యస్త్వన్నం సంప్రయచ్చతి | త్రిఃసప్తకుల ముద్ధృత్య రుద్రలోకం స గచ్చతి. 6

యస్య భాలే విభూతిర్న నాంగేరు ద్రాక్షధారణమ్‌ | న శంభోర్బవనే పూజా స విప్రః శ్వపచాధమః. 7

ఖాదన్మాం సం పిబన్మద్యం సంగచ్చ న్నంత్యజానపి | పాతకేభ్యో విముచ్యేత రుద్రాక్షే శిరసి స్థితే. 8

సర్వయజ్ఞతపోదాన వేదాభ్యాసైశ్చ యత్పలమ్‌ | తత్పలం లభ##తే సద్యో రుద్రాక్షస్య తు ధారణాత్‌. 9

వేదై శ్చతుర్బిర్య త్పుణ్యం పురాణపఠనేన చ | యత్తీర్థ సేవనేనైవ సర్వ విద్యాదిభీ స్తథా. 10

తత్పుణ్యం లభ##తే సద్యో రుద్రాక్షస్య తు ధారణాత్‌ | ప్రయాణకాలే రుద్రాక్షం బంధయిత్వా మ్రియేద్యది. 11

సరుద్రత్వ మవా ఆప్నోతి పువర్జన్మన విద్యతే | రుద్రాక్షం ధారయే త్కంఠే బాహ్వోర్వా మ్రియతేయది. 12

కులైక వింశముత్తార్య రుద్రలోకే వసేన్నరః | బ్రాహ్మణో వాపి చాండాలో నిర్గుణః సగుణో7పి చ.

ఆరవ అధ్యాయము

జపమాలా లక్షణ నిరూపణము - రుద్రాక్ష మహిమ

ఈశ్వరుడిట్లనెను; కుమారా! దర్బముడులమాల-పుత్రంజీవ (గారకాయలోనిగింజ) మాలలును రుద్రాక్షమాలలో పదారవ వంతునకు సరిపోలవు. పురుషులలో విష్ణువు గ్రహములలో రవి నదులలో గంగమునులలో కశ్యపుడు అశ్వములలో ఉచ్చైః శ్రవము దేవతలలో మహాదేవుడు దేవతలలో గౌరిదేవివలె అన్నిటిలో రుద్రాక్ష శ్రేష్ఠమైనది. రుద్రాక్ష స్తుతిని మించిన స్తోత్రము-వ్రతము లేదు. ఆక్షయదానము లన్నిటిలోను రుద్రాక్షదాన ముత్తమోత్తమమైనది. శాంతుడు-శివభక్తుడునైన వానికి శ్రేష్ఠమైన రుద్రాక్షదానము చేయవలయును. రుద్రాక్షదాతకు పుణ్యఫల మనంతము. వచి రు నలవికాదు. మెడలో రుద్రాక్ష దాల్చిన వానికంటె దానము చేసినవాడు పుణ్యాత్ముడు. అతని యిరువ దొక్క కులములవా రుద్దరింపబడుదురు. అతడును రుద్రలోకము చేరగలడు. నెన్నొసట విభూతి లేక మెడలో రుద్రాక్ష లేక శివాలయమున పూజ చేయక తిరుగు విప్రుడు చండాలురలోను నీచుడు. మద్యమాంసములు సేవించినను మాలమాదిగల గలిసినను రుద్రాక్షను తలపై దాల్చినవాడాయా పాపములనుండి ముక్తుడగును. సకల యజ్ఞ-తపో-దాన-వేదాభ్యాసముల పుణ్యరాశి యంతయు నొక్కరుద్రాక్ష ధరించుట వలననే కల్గును. నాల్గు వేదములు-పురాణములు-చదివిన పుణ్య భాగమును సకల తీర్చములు సేవించిన సుకృతమును సర్వ విద్యాలాభముల ఫలితమును అన్నియు లొక్క రుద్రాక్ష దాల్చుట వలననే కల్గును. మరణించునపుడు రుద్రాక్ష దాల్చి యున్నచో అట్టివాడు రుద్రత్వ మొందును. వానికి మరల జన్మలేదు. మెడలో గాని బాహువులకు గాని రుద్రాక్షను గాల్చి మరణించినచో అట్టివాడు తన యిరవ దొక్క కులముల వారి నుద్దరింపగలడు. తుడ కతడును రుద్రలోకమందు వసించును.

భస్మ రూద్రాక్షధారీయః సదేవత్వం శివంవ్రజేత్‌ | శుచిర్వాప్యశుచిర్వాపి తథా7భక్ష్యస్య భక్షకః. 14

వ్లుెచ్చో వాప్యథ చాండాలో యుతోవా సర్వపాతకైః | రుద్రాక్షధారణా దేవ స రుద్రోనాత్ర సంశయః. 15

శిరసా ధార్యతే కోటిః కర్ణయోర్ధశకోటయః | శతకోటి ర్గలే బద్దోమూర్ద్ని కోచిసహస్రకమ్‌. 16

అయుతం చోపవీతే తు లక్షకోటి ర్బుజే స్థితే | మణిబంధే తు రుద్రాక్షోమోక్షసాదనకఃపరః 17

రుద్రాక్షధారకో భూత్వా యత్కించిత్కర్మవైదికమ్‌ | కుర్మన్వివ్రః సదా భక్త్యా మహదా ప్నోతి తత్పలమ్‌. 18

రుద్రాక్షమాలికాం కంఠే ధారయేద్బక్తి వర్జితః | పాపకర్మా తు యో నిత్యం సముక్తః సర్వబంధనాత్‌. 19

రుద్రాక్షార్పితచేతా యో రుద్రాక్షస్తు నవై ధృతః | అసౌ మాహేశ్వరో లోకేనమస్యః సతు లింగవత్‌. 20

అవిద్యోవా స విద్యోవా రుద్రాక్షస్య తు ధారణాత్‌ | శివలోకం ప్రపద్యేత కీకటే గర్దభో యథా. 21

స్కంద ఉవాచ : రుద్రాక్షన్సందధే దేవ గర్దభః కేనహేతునా | కీకటే కేనవా దత్త స్త ద్రూహి పరమేశ్వర.

భ్రగవానువాచ : శృణు పుత్ర పురావృత్తం గర్దభో వింధ్య పర్వతే |

ధత్తే రుద్రాక్షభారం తు వాహితః పథికేనతు. 23

శ్రాంతో సమరధ స్తద్బారం వోడుం పతితవాన్బువి | ప్రాణౖస్త్యక్త స్త్రీణత్ర స్తుశూలపాణిర్మహేశ్వరః. 24

మత్ప్రసాదాన్మహాసేన మదంతికముపాగతః | యావద్వక్త్రా స్య సంఖ్యానం రుద్రాక్షాణాం సుదుర్లభమ్‌. 25

తావద్యుగ సహసాణి శివలోకే మహీయతే | స్వశిష్యేభ్య స్తు వక్తవ్యం నాశిష్యేభ్యః కదాచన. 26

బ్రహ్మణుడు-చండాలుడు-సగుణుడు-నిర్గుణుడు. ఎవడైనను యథావిథగ భస్మము-రుద్రాక్షలు దాల్చినచో శివత్వ మొందగలడు. శిచిగాని అశుచిగాని తినరానివి తినువాడుగాని వ్లుెచ్చుడుగాని చండాలుడా గాని పాపులతో గొప్ప పాపిగాని రుద్రాక్ష దాల్చినచో నతడు కేవలము రుద్రుడే. ఇందనుమాన మావంతయును లేదు. రుద్రాక్ష తలపై దాల్చిన కోటి చెవులందు పదికోట్లు మెడయందు నూఱు కోట్లుమూర్దమునవేయికోట్లు బ్రహ్మసూత్రమునఅయుతముకోట్లు భుజమందులక్షకోట్లు రెట్లుగా పుణ్యఫలితము గల్గును. మణి బంధమునందు రుద్రాక్ష దాల్చుట వలన మోక్షము గల్గును. విప్రుడు రుద్రాక్ష దాల్చి యేదేని వైదిక కర్మము నిర్మలభక్తితో నాచరించినచో నతడు మహాపుణ్యవంతుడగుడు. పాపులలో మహాపాపియైనను భక్కి లేకున్నను నిత్యము రుద్రాక్షమాలికను మెడలో దాల్చినవాడు సర్వపాపములనుండి విడివడును. రుద్రాక్ష ధరించవలయున ననెడు చిత్తము గల్గిన చాలువాడు ధరిచకున్నను శివలోకము చేరి శివునివలె నమస్కరింపబడును. చదివినవాడు గాని చదువనివాడుగాని రుద్రాక్ష దాల్చినచో కీకట దేశమున గాడిద ముక్తి జెందిన ట్లతడును తప్ప ముక్తుడగును. స్కందు డిట్లనెను : పరమేశ్వరా! గాడిద రుద్రాక్షలెట్లు ధరిచెను? దానికి కీకటదేశముననెవరిచ్చిరి. అంతయును నాకు తెలుపును. శ్రీభగవాను డిట్లనెను : కుమారా! వినుము. మున్ను వింధ్య పర్వతముపై నోక గాడిద యుండెను. బాటసారులు దానితో రుద్రాక్షలు మోయించచుండిరి. అదొకనాడు రుద్రాక్షల బరువు మోయలే కలసిసొలసి చివరకు నేలపై బడి చచ్చెను. అది ప్రాణము వదిలి మూడు నేత్రములతో త్రిశూలముతో మహేశ్వరుని రూపు దాల్చినది. అది నా యనుగ్రహమున నా సన్నిధి కేతెంచినది. అది మోసిన రుద్రాక్షల కెన్ని ముఖములు గలవో అన్నివేల యుగముల వఱకు నది శివలోకమందు సుఖము లనుభవించెను. ఈ విష యము తగిన శిష్యులకే తెలుపవలయును. కాని వినయములేని శిష్యులకు తెలుపకూడదు.

అభ##క్తేభ్యో7పి మూర్ఖేభ్యఃకదాచిన్న ప్రకాశ##యేత్‌ | అభక్తోవాస్తు భక్తో వా నీచో నీచతరో7పివా. 27

రుద్రాక్షాన్దారయే ద్యస్తు ముచ్యతే సర్వ పాతకైః | రుద్రాక్షధారణం పుణ్యం కేనవా సదృశఁ భ##వేత్‌. 28

మహావ్రతమిదం ప్రాహుర్మనయస్తత్వ దర్శినః | సహస్రంధారయేద్య స్తు రుద్రాక్షాణాం ధృతవ్రతః. 29

తం నమంతి సురాః సర్వే యథా రుద్రస్తథైవ సః | అభావే తు సహస్రస్య బాహ్వోఃషోడశషోఢ. 30

ఏకం శిఖాయాం కరయో ర్ద్వాదశద్వాదశైవ తు | ద్వాత్రింశత్కంఠ దేశేతు చత్వారింశచ్చమస్తకే. 31

ఏకైకం కర్ణయోః షట్‌ షట్‌ వక్షస్యష్టోత్తరంశతమ్‌ | యోధారయతి రుద్రాక్షా న్రుద్రవత్సతు పూజ్యతే. 32

ముక్తా ప్రవాళస్పటికరౌప్యవైడూర్య కాంచనైః | సమేతాన్దారయేద్యస్తు రుద్రాక్షా న్సశివో భ##వేత్‌. 33

కేవలానసి రుద్రాక్షా న్యద్యాలస్యాద్బిభర్తియః | తం న స్పృశంతి పాపాని తమాంసీవ విభావసుమ్‌. 34

రుద్రాక్షమాలయా మంత్రో జప్తో 7నంత ఫలప్రదః | యస్యాంగే నాస్తి రుద్రాక్ష ఏకో 7పి బహుపుణ్యదః. 35

తస్య జన్మ నిరర్థంస్యా త్త్రిపుండ్ర రహితం యథా | రుద్రాక్షం మస్తకే ధృత్వా శిరఃస్నానం కరోతియః. 36

గంగాస్నానఫలం తస్య జాయతే నాత్ర సంశయః | ఏకవక్త్రః పంచవక్త్ర ఏకాదశముఖాః పరే. 37

చతుర్దశముఖాః కేచి ద్రుద్రాక్షలోక పూజితాః | భక్త్యా సంపూజ్యతే నిత్యం రద్రాక్షః శంకరాత్మకంః. 38

దరిద్రం వాపి పురుషం రాజానం కురుతే భువి | ఆత్ర తే కథయిష్యామి పురాణం మతముత్తమమ్‌. 39

కోసలేషు ద్విజః కశ్చి ద్గిరినాథ ఇతి శ్రుతః| మహాధనీ చ ధర్మాత్మా వేదవేదాంగపారగః. 40

భక్తులు కానివారికిమూర్ఖులకు దీనిని వెల్లడింపరాదు. ఆభక్తుడు గానిపరమభక్తుడు గాని నీచుడుగాని పరమ నీచుడుగాని రుద్రాక్షలు దాల్చినచో నతడు సర్వ పాతకములునుండి విముక్తుడు గాగలడు. రుద్రాక్ష ధారణచే గల్గు పుణ్యభాగ్యమునకు సాటియైనదింకొకటి లేదు సుమా. తత్త్వదర్శనులగు మును లోక మహావ్రత మిట్లు తెల్పిరి. వేయిరుద్రాక్షలు దాల్చినవానిని దేవత లందఱును శివుని నమస్కరించునట్లు నమస్కరింతురు. వేయి దొరకనిచో రెండు భుజములకు పదారు చొప్పున దాల్చిన చాలును. శిఖయం దొకటి చేతులంతు పండ్రెండు పండ్రెండు కంఠమున ముప్పదిరెండు తలపై నలువది ఒక్కొక్క చెవియం దారు చొప్పున ఱొమ్మున నూట యెనిమిది యీ ప్రకారముగ నెవడు రుద్రాక్షలు దాల్చునో వాడు రుద్రునివలె పూజ్యు డగును. జాతి ముత్తెములు-పగడములు-వైడూర్యము-స్పటికము-బంగారము-వెండి వస్తువులతో గూడిన రుద్రాక్ష దాల్చినవాడు కేవలము శివుడే యగును. ఆలస్యముగనైనను తెలిసికొని కేవలము రుద్రాక్షలు దాల్చువానినిపాపము లంటజాలవు. ఎట్లనగా కారుచీకట్లు సూర్యుని తాకజాలవు గదా!రుద్రాక్షమాల దాల్చి మంత్రము జపించినచో. ననంతఫల మబ్బును. కనుక మిక్కిలి పుణ్యప్రదమైన రుద్రాక్ష యొక్కటేని మేన దాల్చవలయును. లేనిచో వాని జన్మత్రిపుండ్రము దాల్చని వానివలె వ్యర్థ మగును. తలపై రుద్రాక్ష నుంచుకొని శిరఃస్నానముచేయువానికి గంగాస్నాన పుణ్యఫల మబ్బును. సందేహము లేదు. ఏకముఖి పంచముఖి ఏకాదశముఖి చతుర్దశముఖి రుద్రాక్షలు ప్రపంచములో మిక్కిలి ప్రశస్తి గాంచినవి. శివప్రియుడైన వాడు నిత్యము భక్తితో రుద్రాక్షను పూజింపవలయును. అటుల పూజించినచో దరిద్రుడు సైతము మహారాజు గాగలడు. దాని గూర్చిన యొక పురాణ గాథ నీకు తెల్పుదును వినుము. మున్ను కోసలదేశమందు గిరినాధుడను పేరుమోసిన బ్రాహ్మణు డొక డుండెను. అతడు ధనవంతుడు-దర్మాత్ముడు-వేదవేదాంగ పారగుడు.

యజ్ఞకృద్దీక్షితస్తస్యతనయః సుందరాకృతిః | నామ్నా గుణనిధిః ఖ్యతస్తరుణః కామ సుందరః 41

గురోః సుధిషణస్యాథ పత్నీం ముక్తావళీమథ | మోహయామాస రూపేణ¸°వనేన మదేన చ. 42

సంగతస్తు తయాసార్దం కంచిత్కాలం తతోభియా | విషం దదౌ చ గురవే యేభే పశ్చాత్తు నిర్బయః. 43

యదా మాతా పితా కర్మ కించి జ్ఞానాతి యత్షణ | మాతరం పితరం చాపి మారయామాస తద్విషాత్‌. 44

నానావిలాసభోగైశ్చ జాతే ద్రవ్యవ్యయే తతః | బ్రాహ్మణానాం గృహేచౌర్యం చకార స తదాఖలః. 45

సురాపానమదోన్మత్త స్తదా జ్ఞాతి బహిష్కృతః | గ్రామాన్నిష్కాసితః సర్వైస్తదాసో7భూద్వదేచరః. 46

ముక్తా వళ్యా తయాసార్దం జగామ గహనం వనమ్‌ | మార్గేస్థితో ద్రవ్యలోభా జ్జఘాన బ్రాహ్మణాన్బహూన్‌. 47

ఏవం బహుగతే కాలే మమార సతదా ధమః | నేతుం తం యమ దూతాశ్చ సమాజగ్ముః సహస్రశః. 48

శివలోకాచ్చివగణా స్తథైవ చ సమాగతాః | తయోః పరస్పరం వాదో బభూవ గిరిజాసుత. 49

యమదూతాస్తదా ప్రోచుఃపుణ్యమస్య కిమస్తిహి | బ్రువంతు సేవకాః శంభోర్య ద్యేనంనేతు మిచ్చథ. 50

శివదూతా స్తదా ప్రోచురయం యస్మిన్థ్పలేమృతః | దశహస్తాదధోభూమే రుద్రాక్ష స్తత్రచాస్తిహి. 51

తత్ప్రభావేన హేదూతా నేష్యామః శివసన్నిధిమ్‌ | తతోవిమాన మారుహ్య దివ్యరూపధరో ద్విజః. 52

గతో గుణనిధిర్దూతైః సహితః శంకరాలయమ్‌ | ఇత రుద్రాక్ష మహాత్మ్యం కథితం తవ సువ్రత 53

ఏవం రుద్రాక్ష మహిమా సమాసాత్కథితో మయా | సర్వపాప క్షయకరో మహాపుణ్యఫల ప్రదః. 54

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ఏకాదశస్కంధే షష్ఠో7ధ్యాయః.

సోమయాజీ దీక్షితుడు అగునతని కొడుకు గుణనిధి అందగాడు యువకుడు-మదన సుందరుడు. అతడు తన గురువగు సుధిషణుని భార్యను ముక్తావళిని తన రూప-¸°వన-విలాస-విభ్రమములతో బంధములతో మోహింపజేసెను. తుదకు గురున కింత విషమిచ్చి చంపి ఆమెను స్వేచ్చగ ననుభవించెను. తన చెడు నడవడి తన తల్లిదండ్రులకును తెలియగ నతడు వారికిని విషము పెట్టి చంపించెను. ఆమెతోడి కామ విలాసములవలన తన కున్న దంతయును వ్యయము గాక నాదుష్టుడు తుదకు బ్రాహ్మణుల యిండ్లలో దొంగతనము చేయుటకు తలపడెను. సురాపానమున నతడు మదోన్మత్తుడగుట వలన నతనిని జ్ఞాతుల వెలివేసిరి. గ్రామస్థులు నూర వెలవేసిరి అత డడవులు పెట్టెను. అతడు ముక్తావళిని వెంట బెట్టకొని దట్టమైన యడవుల కేగెను. త్రోవలో ద్రవ్యలోభమున నతడు పెక్కురు బాపలను చంపెను. ఇట్లు పక్కెండ్లు గడచిన తర్వాత నా యధముడు చనిపోయెను. అతనిని గొనిపోవుటకు వేలకొలది యమదూల లేతెంచిరి. అదే సమయమున శివలోకమునుండి శివగణమును వచ్చెను. కుమార ! అపు డా యిరువాగుల వారికి వివాదము చెలరేగెను. శివదూతలారా! మీ రితనిని గొనిపోదలచినచో నితడు చేసిన పుణ్య విశేష మేమో తెలుపడని యమదూత లనిరి. శివదూత లపుడిట్లనికి : "ఇతడు చనిపోయినచోట పదిహస్తముల క్రిందుగనొగరుద్రాక్షగలదు. దాని ప్రభావము వలన మే మతనిని శివలోకమునకు గొని పోవుచున్నాము" అంత ద్విజుడు దివ్యరూపము దాల్చి విమానమెక్కెను. అతడు శివదూతలతో శివలోక మేగెను. సువ్రతా! నే నిటుల రుద్రాక్ష మహిమను గూర్చి తెల్పితిని. నీ కింత వఱకును రుద్రాక్ష మహిమ గూర్చి కొద్దిగనే తెల్పితిని. రుద్రాక్ష-సర్వపాపహరము. మహాపుణ్యఫలప్రదము.

ఇది శ్రీదేవి భాగవత మహాపురాణమందలి యేకాదశ స్కంధమున నారవ యధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters